అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన అమ్మగారిని గుర్తు చేసుకుంది. బోనీ కపూర్ తన భార్యతో కలిసి తీసుకున్న పాత ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అక్కడ 'హ్యాపీ బర్త్‌డే' అని తెలుపుతూ హార్ట్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చారు. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా పలు పాత ఫోటోలను షేర్ చేసి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. పలు లవ్ ఎమోజీలతో పాటు 'హ్యాపీ బర్త్‌డే మామా' అని రాసింది.
(ఇదీ చదవండి: భార్య వల్లే ఆ హీరో కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో)
తాజాగ విడుదలైన 'బవాల్' చిత్రంలో కనిపించిన జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో తన తండ్రి సందేశాన్ని మళ్లీ పోస్ట్ చేసింది. కొద్దిసేపటి క్రితమే తన కొత్త సినిమా ప్రమోషన్ సందర్భంగా జాన్వీ కపూర్ శ్రీదేవి గురించి మాట్లాడింది. తన తల్లి మరణం తనకు చాలా కఠినమైన సమస్య అని, శ్రీదేవిని రోల్ మోడల్‌గా చూస్తున్నానని చెప్పింది. ఆమె మరణం తర్వాత తన కెరీర్‌ను కూడా శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటున్నానని జాన్వీ తెలిపింది.
40 ఏళ్లపాటు శ్రీదేవి ట్రెండ్
1963 ఆగస్టు 13న తమిళనాడులో శ్రీదేవి జన్మించారు. శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్ అనేది శ్రీదేవి అసలు పేరు. సినిమాల కోసం శ్రీదేవిగా పేరు మార్చుకుని 40 ఏళ్లపాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం,మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సుమారు 250 సినిమాల్లో నటించారు. తెలుగులో 'పదహారేళ్ల వయసు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ చేసిన శ్రీదేవి.. అతిలోక సుందరిగా తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 54 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment