సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటేనే వింతగా చూసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయనకు అప్పటికే పెళ్లయి కొడుకు కూతురు ఉన్నారు. ఆ కుర్రాడే అర్జున్ కపూర్. హిందీలో హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తండ్రి రెండో పెళ్లి, తల్లితో బాండింగ్ గురించి బయటపెట్టాడు.
'నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్నఅమ్మ విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకునేప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావుడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయటవాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్‌మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది'
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)
'ఓ వయసొచ్చాక తొలి సినిమా చేశా. కానీ అది రిలీజ్ కావడానికి ముందే అమ్మ చనిపోయింది. జీవితంలో ఇలా ఎదురుదెబ్బలు తగిలేసరికి నన్ను నేను చాలా మార్చుకున్నా. బాగా ఆలోచించడం నేర్చుకున్నా. దీంతో రానురాను నాన్నతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన సంతోషంగా ఉన్నంత కాలం నేను దాన్ని తప్పు అనుకోను' అని అర్జున్ కపూర్ చెప్పాడు.
1983లో బోనీకపూర్ - మోనా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు (అర్జున్, అన్షుల) పిల్లలు. 1996లో ఈ జంట విడిపోయింది. అదే ఏడాది బోనీకపూర్.. నటి శ్రీదేవిని వివాహమాడాడు. ఆ సమయంలో ఇది బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక)
Comments
Please login to add a commentAdd a comment