పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్ | Bigg Boss 8 Telugu Sonia Akula Wedding | Sakshi
Sakshi News home page

Soniya Akula Wedding: సోనియా పెళ్లి.. బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ మిస్!

Dec 21 2024 7:09 AM | Updated on Dec 21 2024 10:49 AM

Bigg Boss 8 Telugu Sonia Akula Wedding

ఈసారి బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల. అయితే హౌస్‌లో ఎక్కువ వారాలు ఉండకుండానే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. గతనెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈమె.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. యష్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు బిగ్‌బాస్ 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

శుక్రవారం రాత్రి రిసెప్షన్ జరగ్గా.. శనివారం వేకువజామున 3 గంటలకు అలా పెళ్లి జరిగింది. బిగ్‌బాస్ ఫ్రెండ్స్ పలువురు రిసెప్షన్ ఫొటోలు పోస్ట్ చేశారు. పెళ్లి ఫొటోలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.

తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్‌బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.

బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. వివాహానికి హాజరైన వాళ్లలో జెస్సీ, అమర్ దీప్-తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిరాక్ సీత తదితరులు ఉన్నాయి. బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్ మాత్రం మిస్ అయ్యాడు. మరి కావాలనే రాలేదా? లేకపోతే వేరే కారణాల వల్ల మిస్సయ్యాడో!

(ఇదీ చదవండి: ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement