పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక | Rashmika Apologises For Remarks On Pokiri And Gilli Movie | Sakshi
Sakshi News home page

Rashmika: రష్మిక కామెంట్స్.. 'పోకిరి'ని మించిన ట్విస్ట్

Dec 21 2024 8:06 AM | Updated on Dec 21 2024 10:25 AM

Rashmika Apologises For Remarks On Pokiri And Gilli Movie

'పుష్ప 2'తో మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హీరోయిన్ రష్మిక.. సారీ చెప్పింది. తాను చేసిన పొరపాటు విషయంలో ఇలా చేసింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మూవీస్ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రచ్చంతా జరిగింది. ఇంతకీ అసలేమైంది? రష్మిక సారీ ఎందుకు చెప్పింది?

ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. మిస్ మాలిని అనే యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూలో ఇచ్చింది. మీరు చూసిన తొలి సినిమా ఏది? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమిళ హీరో దళపతి విజయ్ 'గిల్లీ' అని చెప్పింది. అందుకే విజయ్ దళపతి అంటే తనకు ఇష్టమని చెప్పింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)

'నేను చూసిన ఫస్ట్ సినిమా గిల్లి. ఈ మూవీ పోకిరి చిత్రానికి రీమేక్ అని నాకు ఈ మధ్యే తెలిసింది. నాకు దాని గురించి తెలీదు. అయితే ఇందులో అప్పిడి పోడే పోడే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్ మొత్తంలో ఆ పాటకు ఎన్ని సార్లు డ్యాన్స్ చేశానో కూడా తెలీదు' అని రష్మిక చెప్పింది.

రష్మిక చెప్పిన సినిమాలు వేర్వేరు. ఎందుకంటే మహేశ్ బాబు 'ఒక్కడు' సినిమాకు రీమేక్‌గా తమిళంలో 'గిల్లీ' తీశారు. 'పోకిరి' సినిమాని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ అనంతరం తను పొరబడ్డానని తెలుసుకున్న రష్మిక.. 'అవును. ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది' అని సారీ చెప్పింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement