pokiri
-
పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక
'పుష్ప 2'తో మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన హీరోయిన్ రష్మిక.. సారీ చెప్పింది. తాను చేసిన పొరపాటు విషయంలో ఇలా చేసింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మూవీస్ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రచ్చంతా జరిగింది. ఇంతకీ అసలేమైంది? రష్మిక సారీ ఎందుకు చెప్పింది?ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. మిస్ మాలిని అనే యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూలో ఇచ్చింది. మీరు చూసిన తొలి సినిమా ఏది? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమిళ హీరో దళపతి విజయ్ 'గిల్లీ' అని చెప్పింది. అందుకే విజయ్ దళపతి అంటే తనకు ఇష్టమని చెప్పింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'నేను చూసిన ఫస్ట్ సినిమా గిల్లి. ఈ మూవీ పోకిరి చిత్రానికి రీమేక్ అని నాకు ఈ మధ్యే తెలిసింది. నాకు దాని గురించి తెలీదు. అయితే ఇందులో అప్పిడి పోడే పోడే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్ మొత్తంలో ఆ పాటకు ఎన్ని సార్లు డ్యాన్స్ చేశానో కూడా తెలీదు' అని రష్మిక చెప్పింది.రష్మిక చెప్పిన సినిమాలు వేర్వేరు. ఎందుకంటే మహేశ్ బాబు 'ఒక్కడు' సినిమాకు రీమేక్‌గా తమిళంలో 'గిల్లీ' తీశారు. 'పోకిరి' సినిమాని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ అనంతరం తను పొరబడ్డానని తెలుసుకున్న రష్మిక.. 'అవును. ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది' అని సారీ చెప్పింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)Avunu .. telusu sorry.. okka booboo aipoindi.. 🐒 interview ayipointarvata annukunna reyyyy ghilli is okkadu ra .. pokkiri is pokiri ani.. 🤦🏻♀️ social media lo ippudu estuntaaru ani.. sorry sorry my bad.. but I love all of their movies so it’s ok. 🐒— Rashmika Mandanna (@iamRashmika) December 21, 2024 -
బ్యూటీ గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే?
ఇండస్ట్రీలో కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. మెరుపుతీగలా మెరిసి మాయమైపోతుంటారు. ఇక్కడ చెప్పుకునే పోకిరి బ్యూటీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పోకిరిలో విలన్ ప్రకాశ్ రాజ్ గ్యాంగ్‌లో ఓ రౌడీ అమ్మాయి కూడా ఉంటుంది. ఆవిడే శివ రాణా. పబ్ సీన్లో ప్రకాశ్ రాజ్ పక్కనే కూర్చుని బోల్డ్ అమ్మాయిగా కనిపిస్తుంది.గిల్లితే గిల్లించుకోవాలి..పబ్‌లో జరిగే సన్నివేశంలో ప్రకాశ్ రాజ్.. శివ రాణాను గిల్లుతాడు. ఆమె అరవడంతో.. 'గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు' అనే డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్ చాలా పాపులర్ అయింది. కానీ ఆమెకు మాత్రం పెద్ద అవకాశాలు రాలేదు. పోకిరి తర్వాత ధగడ్ సాంబ, దేవుడు చేసిన మనుషులు, మెహబూబా.. చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది. కానీ మంచి ఆఫర్స్ రాలేదు.యోగా టీచర్‌గా..ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో సినిమాల మీద ఆశ పెంచుకోకుండా అప్పుడప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌లో నటిస్తూ అభిమానులను అలరించింది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించే ఈ బ్యూటీ ప్రస్తుతం యోగా టీచర్‌గా పని చేస్తోంది. యోగా టీచర్ కావడంతో తన బాడీని ఇప్పటికీ ఫిట్‌గా మెయింటెన్ చేస్తోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోందీ బ్యూటీ. View this post on Instagram A post shared by शीवा (ज्योति) राणा (@sheeva_rana) View this post on Instagram A post shared by शीवा (ज्योति) राणा (@sheeva_rana) -
‘పోకిరి’ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసేశారు..
గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ.. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. కుడికాలు, కుడిచెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశామన్నారు. -
రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. గతంలో ‘రీళ్లు’లో థియేటర్లకు వచ్చి సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4 k టెక్నాలజీతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈతరం సినీ ప్రియులను అలా నాటి తరంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఈ ట్రెండ్‌ను సెట్ చేసింది టాలీవుడ్ మాత్రమేనని చెప్పవచ్చు. భారీగా ఆదాయం ఒక సినిమాను రీరిలీజ్ చేయడం మంచి లాభదాయకంగా ఉంటుందని సూపర్ స్టార్ కృష్ణ సోదరడు ఆదిశేషగిరిరావు ఒకప్పడు అన్నారు. ఒక సినిమా రిజల్యూషన్‌ను 4కేలో మార్చడానికి దాదాపు రూ.10లక్షల ఖర్చు అవుతుందని పలువురు సినీ ట్రేడర్స్ పేర్కొన్నారు. ఒరిజినల్ ప్రింట్‌ను తక్కువ ధరకే పొందగలిగితే. రీరిలీజ్ పక్కాగా మంచి లభాదయకమైన బిజినెస్ అని వారు తెలిపారు. 'పోకిరి'తో నాంది టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్‌కు 'పోకిరి' సినిమానే నాంది పలికందని చెప్పాలి. 2006లో మహేశ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా 'పోకిరి' నిలిచింది. ఈ చిత్రాన్ని మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా 2022లో ఆగస్టు 9న అమెరికాలో మళ్లీ విడుదల చేశారు. ఒక్క రోజులో 320 ‘షో’ల్లో ప్రదర్శితమైన ‘పోకిరి’ సుమారు రూ.1.75 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఇండియాలో కూడా విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బును ఆయన అభిమానులు ఛారిటీలకు ఇచ్చారు. గుండెకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు జరిపించేలా ప్లాన్ చేశారు. ఒకే నెలలోనే ప్రభాస్ సినిమాలు రీరిలీజ్ అయిన సినిమాల్లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యాయి. ఆయన నటించిన రెబెల్, బిల్లా, వర్షం రీ రిలీజ్లో భారీగా సందడి చేశాయి. రెబల్ మొదటిసారిగా విడుదలైనప్పుడు ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. కానీ రీ రిలీజ్ సమయంలో మంచి వసూళ్లు సాధించింది. అలాగే బిల్లా, వర్షం సినిమాలకు కూడా భారీగానే కలెక్షన్లు వచ్చాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అందువల్ల ఆయన సినిమాలకు డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉంది. ఎవరైనా రీ రిలీజ్ చేయవచ్చా ఈ విధానంలో కాపీ రైట్ సమస్య ఉంటుంది. కాబట్టి ఏదైనా సినిమాను రీ రిలీజ్ చేయాలంటే ఆ సినిమాకు చెందిన నిర్మాతల అంగీకారంతో కూడిన పత్రాన్ని ల్యాబ్స్‌కు అందిస్తే.. ఆయా సినిమాలను రీ మాస్టరింగ్ చేస్తాయి. ఈ మార్కెట్‌పై అవగాహనతో పాటు ఆసక్తి ఉంటే ఎవరైనా ఒక సినిమాను రీ రిలీజ్ చేయవచ్చు. ఇప్పటికే మా హీరోది ఫలానా సినిమా రీ రిలీజ్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభిమానులు అభ్యర్థిస్తున్నారు. గతంలో బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్న ఇంకా ఏయే సినిమాలు భవిష్యత్తులో సందడి చేస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సింహాద్రితో మరో ట్రెండ్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి సింహాద్రి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ ఆయన ఫ్యాన్స్ కొత్త ట్రెండ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు సింహాద్రి రీ-రిలీజ్ సినిమాకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్‌గా జరిపారు. అలా ఏ మాత్రం కొత్త సినిమాలకు తగ్గకుండా తమ అభిమాన హీరో పాత చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో నష్టమే చిత్ర పరిశ్రమలో ప్రతి శుక్రవారం సినిమా జాతకాలు మారిపోతుంటాయి. వారం వారం ఎన్నో చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే చిన్న సినిమాలు విడుదలైన సమయంలో రీ రిలీజ్ చిత్రాలను విడుదల చేస్తే వారు భారీగా నష్టపోతున్నారు. అప్పుడు కొత్త సినిమాలకు టికెట్లు తెగడం లేదు. ఒక్క సినిమాకు ఎంత సమయం? గతంలో సినిమాలను 'రీళ్ల' ద్వారా మాత్రమే చిత్రీకరించేవారు. వాటిని ప్రస్తుత టెక్నాలజీ ఉన్న థియేటర్లలో ప్రదర్శించటం వీలు కాదు. కాబట్టి ఆ రీళ్లను ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టు మార్చాలి. ప్రతి ఫ్రేమ్‌ను స్కాన్ చేసి 4k విజువల్స్‌లోకి తీసుకొస్తేనే రీ రిలీజ్‌కు అవకాశం ఉంటుంది. ఇది కొంత మేరకు సమయం పడొచ్చు. అందుకు గాను సుమారుగా 3 నెలల వరకు ఉంటుంది. ఇందులో స్కానింగ్, గ్రేడింగ్, రీస్టోరేషన్ అనే మూడు పద్ధతులను అనుసరించి 4k విజువల్స్‌లోకి మారుస్తారు. ఆశ్చర్యపోయిన హీరో సూర్య 15 ఏళ్ల క్రితం విడుదలైన సినిమాను రీ రిలీజ్ చేస్తే అసలు కలెక్షన్స్ వస్తాయా అనుకున్నారు. అందులో సూర్య తమిళ హీరో కాబట్టి పెద్దగా అంచనాలు లేకుండా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 350 థియేటర్లలో విడుదల చేశారు. ఈ సనిమాకు గాను సుమారు రూ 3.5 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లలో వస్తున్న విశేష స్పందన చూసి హీరో సూర్య సైతం సంతోషంతో సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
అత్యధిక కేంద్రాల్లో 175 రోజులు రన్ అయిన టాప్ 10 సినిమాలు ఇవే
-
'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పోకిరి. 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. తాజాగా ఆగస్ట్9న మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా మరోసారి థియేరట్స్‌లో పోకిరి చిత్రం సందడి చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల కోలాహాలం మధ్య ఈ సినిమాకి మరోసారి భారీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నైజాంలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 4లక్షలు ఇలా మొత్తంగా రూ. 1.5కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.స్పెషల్ షోస్‌కు ఈ రేంజ్లో వసూళ్లు రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. -
4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా..
Pokiri Releasing With 4K Remastered Version On Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్‌గా, మోస్ట్ గ్లామరస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంగా సినీ ఇండస్ట్రీకి పరిచమైన మహేశ్ బాబు తనదైన నటన, అభినయంతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయన పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. మహేశ్ సినిమాలంటే ఎంతగా ఆదరిస్తారో, అంతకుమించి ఆయన బర్త్‌డే కోసం ఎదురుచూస్తారు. ఎందరో అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం రానే వస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు. ఈ వేడుక సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ట్రీట్‌ను ఏర్పాటు చేశారు. 'రాజ కుమారుడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా 'పోకిరి'. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2006లో విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న 'పోకిరి' సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. వరల్డ్ వైడ్‌గా రిలీజవతున్న ఈ పోకిరి సినిమాను '4కె అల్ట్రా హెచ్డీ' ప్రింట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టాక్. అంతేకాకుండా 'పోకిరి' స్పెషల్ షోకు వచ్చిన డబ్బుతో చిన్న పిల్లల గుండె ఆపరేషన్, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వనున్నారు. ఎమ్బీ ఫౌండేషన్ ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ నోట్‌ను విడుదల చేశారు. ఈ ఆగస్టు 9 సూపర్ స్పెషల్ కానుందని అందులో తెలిపారు. -
ట్రెండ్ సెట్టర్ 'పోకిరి'ని మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే!
'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఆడే పండుగాడు..' ఈ డైలాగ్ వినగానే బుర్రలో పోకిరి సినిమా గిర్రున తిరుగుతుంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పలు కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా నడిచి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా వచ్చి నేటికి 16 ఏళ్లు నిండాయి. 2006 ఏప్రిల్ 28న విడుదలైంది పోకిరి. మహేశ్ యాక్టింగ్‌కు, ఇలియానా అందాలకు, పూరీ డైరెక్షన్ మార్క్‌కు థియేటర్లలో విజిల్స్ మార్మోగిపోయాయి. అయితే ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఛాన్స్ మొదటగా ఇలియానాకు రాలేదు. పూరీ జగన్నాథ్ పోకిరి కోసం మొదటగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను సంప్రదించాడు. కానీ అప్పటికే ఆమె హిందీలో 'గ్యాంగ్‌స్టర్: ఎ లవ్ స్టోరీ' సినిమాకు సంతకం చేయడంతో పోకిరి చేయలేనని చెప్పేసింది. అలా ఆమె చేతిలో నుంచి సువర్ణ అవకాశం చేజారిపోయింది. విశేషమేంటంటే పోకిరి, గ్యాంగ్‌స్టర్ రెండూ ఒకేసారి రిలీజయ్యాయి. పోకిరి ఇక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే గ్యాంగ్‌స్టర్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. చదవండి: దీపికాకు అరుదైన గౌరవం, జ్యూరీ మెంబర్‌గా మన హీరోయిన్! కంగనా తర్వాత పోకిరి ఛాన్స్ ఆయేషా టకియా, పార్వతి మెల్టన్, దీపికా పదుకొణెలకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ వీళ్లెవరూ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పి చేజేతులా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అలా ఈ బంపరాఫర్ గోవా బ్యూటీ ఇలియానా చేజిక్కించుకుంది. ఇక పోకిరి సినిమాలో ఆమె అందం, యాక్టింగ్‌తో ఎలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 16 Years since the Pandu gadu Mania took us away 💥🔥 A Remarkable TRENDSETTER in South Indian Cinema🤘 SuperStar's SWAG & VIBE will be Recreated with #SarkaruVaariPaata 😎💪#Pokiri #16YearsForSouthIHPokiri@UrstrulyMahesh #PuriJagannadh #Ileana #ManiSharma pic.twitter.com/a18kwTgsao — Viswa CM (@ViswaCM1) April 28, 2022 చదవండి: ఆడిషన్స్‌కు వెళ్తే రిజెక్ట్ చేశారు, అదే నా లక్ష్యం -
Pokiri@15 Years: ఫస్ట్ అనుకున్న హీరో మహేశ్ కాదు, టైటిల్ ఇదే
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు.. నేనే’, ‘అన్నయా.. ఈ తొక్కలో మీటింగులేంటో నాకర్థం కావట్లేదు. పదిమంది ఉన్నారు.. అందర్ని లేపేస్తే ఇంటికెళ్లిపోవచ్చు’, ఎప్పుడు వచ్చావని కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా?, ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ ఈ డైలాగ్స్‌కి ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్‌కి కలెక్షన్ల టేస్ట్ చూపించిన సినిమా ‘పోకిరి’. ఈ సూపర్ హిట్ మూవీ విడుదలై నేటికి (ఏప్రిల్ 28) 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘పోకిరి’గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని అనుకోలేదట పూరి. మాస్ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్దం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను చేయలేకపోయాడట. అలాగే ఈ సినిమాకు ‘పోకిరి’అనే టైటిల్ కూడా చివర్లో పెట్టారట. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య’అని టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడట పూరి. కానీ రవితేజ తప్పుకోవడంతో.. టైటిల్‌తో పాటు కథలో మార్పులు కూడా చేశారట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు హీరోయిన్గా ఇలియానాను కూడా చివరి నిమిషంలో తీసుకున్నారు. తొలుత ఈ చిత్రానికి హీరోయిన్గా అయేషా టాకియాను సంప్రదించారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు. ఆ తర్వాత కంగనా రనౌత్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. షూటింగ్‌కి రెడీ అవుతున్న సమయంలో కంగనా కూడా హ్యాండించింది. తనకు బాలీవుడ్లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదించి ఒప్పించారు. ఈ సినిమాతో ఇలియానా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక పోకిరి కంటే ముందు మహేశ్ అన్ని సినిమాల్లోనూ ఒకేలా కనిపించేవాడు. క్లీన్ షేవ్‌తో క్లాస్‌గా కనిపించేవాడు. కానీ తొలిసారి ఈ సినిమాలో ఊరమాస్ గెటప్ దర్శనం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. క్లాస్‌గా కనిపించే మహేశ్‌లోని ఊరమాస్ యాంగిల్‌ని ప్రేక్షలకు చూపించాడు పూరి. కథ చెప్పినప్పుడే జుత్తు బాగా పెంచాలని చెప్పాడట. పూరి చెప్పినట్లుగానే ‘అతడు’ తర్వాత మహేశ్ నాలుగు నెలల విరామ తీసుకొని మరీ గెటప్‌ని చేంచ్ చేసుకున్నాడు. సరికొత్త లుక్‌లో కనిపించడానికి చాలానే కష్టపడ్డాడు. ఈ కష్టమంతా తెరపై కనిపించింది. ఈ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది. -
వార్నర్ నోట ‘పోకిరి’ డైలాగ్
హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ వరుస టిక్‌టాక్‌లతో దుమ్మలేపుతున్నాడు. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఫన్నీ వీడియోలను రూపొందిస్తున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరుపున ప్రాతినథ్యం వహిస్తున్న వార్నర్ టాలీవుడ్‌తో మంచి అటాచ్మెంట్ ఉంది. దీంతో ఇప్పటికే పలు దక్షిణాది పాటలకు టిక్‌టాక్ వీడియోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొన్న బుట్టబొమ్మ.. నిన్న సన్నజాజి.. నేడు పోకిరి డైలాగ్ ‘అల.. వైకుంఠపురుములో’చిత్రంలోని సూపర్‌డూపర్ సాంగ్ బుట్టబొమ్మకు వార్నర్ తన సతీమణి క్యాండీస్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఆ వీడియో నెట్టింట ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత తమిళ సాంగ్ సన్నజాజికి డ్యాన్స్ చేశాడు. తన భార్య తో కలిసి సన్నజాజికి టిక్‌టాక్ చేశాడు. ముందు వరుసలో కూతురు ఉండగా, వెనకాల వార్నర్-క్యాండీస్లు జంటగా కాలు కదిపారు. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సంచలన చిత్రం ‘పోకిరి’ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్‌కు వార్నర్ టిక్‌టాక్ చేశాడు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ వార్నర్ చేసిన టిక్‌టాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చదవండి: మే 9 వెరీ స్పెషల్ డే ఎందుకంటే? వార్నర్ కుమ్మేస్తున్నాడుగా..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిన్ననే చూడండి
సరిగ్గా నిన్నటి తేదీ (అంటే ఏప్రిల్ 28). నలభై రెండేళ్ల క్రితం, పన్నెండేళ్ల క్రితం, ఏడాది క్రితం.. సినిమా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అలాంటి ఇలాంటి పండుగ కాదది. థియేటర్ల ముందు జనాలను బారులు తీరేలా చేసి, టిక్కెట్టు చింపి లోపలికెళ్లి కూర్చుంటే ఎంత ప్రయత్నించినా ఈలలు వేయకుండా ఉండలేని, అరిచి గోల చేయకుండా కూర్చోలేని పరిస్థితిని తెచ్చిపెట్టిన పండుగ. ‘ఇండస్ట్రీ హిట్ సినిమా’ ఆ పండుగ పేరు. ఇండస్ట్రీ హిట్ అంటే అప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేయడం. బాక్సాఫీస్ దుమ్ము దులపడం, రోజులకు రోజులు థియేటర్లలోనే సినిమా మకాం వేసేయడం.. అవన్నీ చేస్తేనే అది ఇండస్ట్రీ హిట్. ఏప్రిల్ 28వ తేదీకి, తెలుగు సినిమాకు ఓ మంచి కనెక్షన్ ఉంది. ఈరోజునే అడవి రాముడు (1977), పోకిరి (2006), బాహుబలి 2 (2017) రిలీజ్ అయ్యాయి. ఈ మూడూ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్స్. ‘నేడే చూడండి’ అంటూ అదరగొట్టిన ఆ నిన్నటి సినిమాలను ఇవ్వాళ తలుచుకుంటూ నిన్ననే చూసొద్దాం... ఫార్ములా కథకు పుట్టుక ఒక పక్కా మాస్ సినిమా ఎలా ఉండాలి? ఏమేం ఉంటే అది మాస్ సినిమా అవుతుంది? సరిగ్గా కొలతలు వేస్కొని, హీరో ఇమేజ్‌కు తగ్గట్టు సన్నివేశాలు రాస్కొని ఒక కథ అల్లుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడైతే ఇలా ఉన్న సినిమాను ఫార్ములా కమర్షియల్ ఎంటర్టైనర్ అంటున్నాం. అలాంటి ఫార్ములాను పుట్టించిన సినిమా ‘అడవి రాముడు’. 1977 ఏప్రిల్ 28న విడుదలైందీ సినిమా. ‘అడవి రాముడు’కి ముందు కె. రాఘవేంద్రరావుకు దర్శకుడిగా పెద్ద పేరు కూడా లేదు. నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలు ఒక కంప్లీట్ మాస్ సినిమా తీయాలనుకున్నారు. అదీ ఎన్టీఆర్‌తో. జయప్రద హీరోయిన్. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టు, ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తూ ఒక కథ వండుకున్నారు. అందుకే కథ క్రెడిట్ కూడా ‘సత్య చిత్రా యూనిట్’ అని బ్యానర్ పేరు ఉంటుంది. హీరో అడవిలో జరిగే అన్యాయాలు, అక్రమాలను గుర్తిస్తాడు. స్మగ్లింగ్ ముఠాను అడ్డుకొని వారి ఆగడాలను అరికడుతుంటాడు. అడవిలో జనాలందరిలోనూ ధైర్యాన్ని నింపి స్మగ్లింగ్‌పై వాళ్లే పోరాడేలా చేస్తాడు. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోయే ఈ కథలో సెకండాఫ్‌కి వచ్చాక ఒక ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటంటే హీరోనే ఫారెస్ట్ ఆఫీసర్. నాలుగు భారీ ఫైట్లు, అదిరిపోయే డైలాగులు, చిన్న రొమాన్స్ ట్రాక్, అక్కడక్కడా కామెడీ బిట్లు, ఒక ఆరు పాటలు.. ఇలా లెక్కలేస్కొని మరీ ఈ ఈ అంశాలను జతచేరుస్తూ కథ పూర్తిచేశారు. ‘అడవి రాముడు’ కథ రెడీ అయిపోయింది. ఎన్టీఆర్, జయప్రద హీరో, హీరోయిన్లు. రాము అనే ఆ హీరో పాత్రతో ఆద్యంతం సినిమాను తన భుజాల మీద మోసేశాడు ఎన్టీఆర్. ఏప్రిల్ 28న సమ్మర్ హాలీడేస్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అప్పటికి తెలుగు సినిమా ఊహకు కూడా అందని రీతిలో 4 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. 32 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఎన్టీఆర్ చరిష్మా, రాఘవేంద్రరావు మేకింగ్, మాస్ అంశాలు మెండుగా ఉండటంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అనే స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ఏనుగుపైకెక్కి కూర్చోవడం ఒక ట్రెండ్‌సెట్టింగ్ సీన్. డైలాగులు చాలాకాలం పాటు జనాల నోళ్లలో నానాయి. కె.వి.మహదేవన్ అందించిన పాటలైతే ఇక చెప్పక్కర్లేదు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ అనే పాట ఈరోజుకీ పాపులరే! ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..’ అనే పాటలో ఎన్టీఆర్‌ను అభిమానులు చూడాలనుకున్న అన్ని చారిత్రక పాత్రల్లో చూపించాడు రాఘవేంద్రరావు. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో ‘సర్దార్ పాపారాయుడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ లాంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాతే తెలుగులో కమర్షియల్ సినిమా ఫార్ములా అనేది ఒకటి తయారైంది. ఆ ఫార్ములా ఈరోజుకీ బ్లాక్‌బస్టర్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకోవాలి. టూ హండ్రెడ్ సెంటర్స్.. హండ్రెడ్ డేస్ 2006 ఏప్రిల్ 28న విడుదలైన ‘పోకిరి’, 75 సంవత్సరాల (అప్పటికి) తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాలో ఒక పోలీసాఫీసర్ కామెడీగా చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది. ‘ఇండియాలో గాంధీ సినిమా వంద రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్! టూ హండ్రెడ్ సెంటర్స్.. హండ్రెడ్ డేస్’ అని. రెండు వందల కేంద్రాల్లో ఒక సినిమా వంద రోజులు ఆడడం అనేది ఎవ్వరూ అందుకోలేని ఒక గొప్ప అచీవ్మెంట్ అన్న ఉద్దేశంలో ఆ డైలాగ్ పెట్టి ఉండొచ్చు. అయితే ‘పోకిరి’ కూడా ఎవ్వరి ఊహకీ అందని హిట్. ఆ డైలాగ్‌లో చెప్పినట్టే సరిగ్గా టూ హండ్రెడ్ సెంటర్స్‌లో పోకిరి హండ్రెడ్ డేస్ ఆడింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ మహేశ్ బాబుతో చేసిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్, ఈ జానర్లో ఎవర్గ్రీన్ బ్లాక్‌బస్టర్. ఆలీభాయ్ అనే ఓ మాఫియా లీడర్ దుబాయ్‌లో ఉంటూనే ఓ పెద్ద మాఫియాను నడిపిస్తుంటాడు. ల్యాండ్ మాఫియా అది. సిటీలో కొత్తగా ఎవరు ఏ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినా మాఫియాకు డబ్బులు అందాలి. హీరో పండు ఆ మాఫియా గ్యాంగ్‌లో చేరతాడు. డబ్బులిస్తే ఎవర్ని కొట్టమన్నా కొడుతూంటాడు పండు. పక్కా పోకిరీ. మాఫియా వరుసగా వేసే ఒక్కో ప్లాన్‌లో భాగమై వాళ్లతోనే ఉంటాడు. ప్రీ క్లైమాక్స్ దగ్గర పడేవరకూ అతన్నొక పోకిరీగానే చూపిస్తూ కథ నడుస్తుంది. అప్పుడొచ్చే ఒక ట్విస్టే సినిమాకు హైలైట్. ఆ ట్విస్టే తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే కమర్షియల్ సినిమా పుట్టుకకు మూలం. ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ మనోహర్ ఓ క్రిమినల్లా నటిస్తూ పండు అనే పోకిరీగా మాఫియాలో చేరడమే ఆ ట్విస్ట్. మాఫియాను మట్టుపెట్టేందుకు కృష్ణ మనోహర్ పండుగా నటించాడన్న ట్విస్ట్ బయటపడగానే పోకిరీ కథంతా ఓ కొత్త మలుపు తీసుకుంటుంది. దాని ఫలితమే ఈరోజు మనల్ని ఈ సినిమాను గుర్తు చేసుకునేలా చేసింది. పది పన్నెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నలభై కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా బాక్సాఫీస్ పొటెన్షియల్‌ను ఇండియన్ సినిమాకు పరిచయం చేసింది. పూరీ జగన్నాథ్‌ను టాప్ డైరెక్టర్‌ను చేసింది. ప్రిన్స్ మహేశ్ బాబును సూపర్‌స్టార్ స్థాయికి తీసుకెళ్లింది. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’, ‘నేనెంత ఎదవనో నాకే తెలీదు,’ లాంటి పంచ్ డైలాగులు ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమాల్లో ఏదో ఒకరకంగా వినిపించాయి. మణిశర్మ అందించిన పాటలన్నీ సూపర్‌హిట్. పోకిరీ తయారు చేసిన.. హీరో ఒక క్రిమినల్‌గా నటించడం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో కామన్‌గా మారిపోయింది. పోకిరీ తమిళంలోకి వెళ్లింది. హిందీలోకీ వెళ్లింది. హిందీలో ‘వాంటెడ్’ పేరుతో వచ్చిన ‘పోకిరీ’, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ప్రాణం పోసి నిలబెట్టింది. ఈతరం కమర్షియల్ సినిమాలకు పోకిరీ ఒక బ్రాండ్ నేమ్. తెలుగు సినిమా చరిత్రలో ఒక బ్లాక్‌బస్టర్ పేజీ. ఇండియన్ సినిమా ఐడెంటిటీ ఇండియాలో ఎన్ని సినీ పరిశ్రమలున్నా, ప్రపంచ దేశాలకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్. బాలీవుడ్ తప్ప ఇక్కడ ఇంకే సినిమా లేదన్నట్టుగా ప్రపంచదేశాలు భావిస్తాయి. ఈ ఆలోచనను పక్కకు తోసి ‘తెలుగు సినిమా’ అన్నది ఒకటి ఉందని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. రెండో భాగం ‘బాహుబలి – ది కంక్లూజన్’ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ‘అడవి రాముడు’, ‘పోకిరి’ ఎలాగైతే ఏప్రిల్ 28న వచ్చి ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్నాయో, ‘బాహుబలి 2’ కూడా అదే తేదీన వచ్చి ఇండస్ట్రీ హిట్‌కి మించిన పేరేదైనా ఉంటే ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు సినిమాకే కాదు, ‘బాహుబలి’ ఇండియన్ సినిమాకే ఒక ఐడెంటిటీ. 2015లో విడుదలైన బాహుబలి మొదటి భాగం.. కట్టప్ప బాహుబలిని చంపాడన్న ట్విస్ట్‌తో ముగుస్తుంది. రాజవంశానికి అత్యంత నమ్మకస్తుడైన, ఆ కుటుంబాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కట్టప్ప తనకెంతో ఇష్టమైన బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న ఇండియన్ సినిమా అభిమానులందర్నీ 2017లో బాహుబలి రెండో భాగం వచ్చేవరకూ వెంటాడింది. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాతో ఇండియన్ సినిమాకు ఒక ఐకాన్‌లా మారిపోయాడు. విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయన్న పేరు ఒక ప్రత్యేక గుర్తింపు. బాహుబలి పాత్రలో అద్భుతంగా నటించిన ప్రభాస్, నేషనల్ లెవెల్ స్టార్‌గా మారిపోయాడు. బాక్సాఫీస్ వసూళ్లు చూసుకుంటే ఇండియన్ సినిమా స్టామినా ఇంత ఉందా అనేలా కలెక్షన్స్ వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీల్లోనూ విడుదలైన ‘బాహుబలి2’ 1700 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బాహుబలి చర్చకు వచ్చింది. నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ డొమెస్టిక్ మార్కెట్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది. అవి ఎలాంటి రికార్డులంటే కొత్తగా ఏ సినిమా విడుదలైనా ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను ‘నాన్ బాహుబలి రికార్డు’ అని సరిపెట్టుకునేంత. చరిత్రలో పేజీలంత కథగా మాత్రమే మిగిలిపోలేదు బాహుబలి. దాని గురించి రాయడమే ఒక చరిత్ర. యాదృచ్చికమో, విచిత్రమో, మరింకోటో కానీ నలభై రెండేళ్ల కిందట, పన్నెండేళ్ల కిందట, ఏడాది కిందట.. ఒకేరోజున (ఏప్రిల్ 28న) తెలుగు సినిమా రూపు రేఖల్ని మార్చిన సినిమాలు రావడం విశేషమే! ఆ డేట్లో ఏదో మ్యాజిక్ ఉండే ఉండాలి మరి!! అడవి రాముడు స్టార్స్ ఎన్టీఆర్ అప్పట్లో ఎక్కడికెళ్లినా హారతులిచ్చి ఆరాధించేవారట. ఆయన స్టార్‌డమ్‌ను దగ్గరుండి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పట్నుంచే గమనించిన రాఘవేంద్ర అందుకు తగ్గట్టు అడవి రాముడులో ఎన్టీఆర్ పాత్రను రాసుకున్నాడట. ఎన్టీఆర్ ఏనుగుపైకెక్కి తిరగడమన్నది అలాగే పుట్టిందని చెబుతాడాయన. అడవి రాముడు రిలీజై హిట్టయ్యాక రాఘవేంద్రరావు తన మొదటి కారు (అంబాసిడర్) కొన్నాడు. అడవి రాముడు రిలీజైన ఐదేళ్లకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యాడు. సీఎం అయ్యాక కూడా ఆయన అడవి రాముడు సిల్వర్ జూబ్లీ షీల్డ్‌ను తన ఆఫీసులో పెట్టుకున్నాడట. అందులో ఆ ఒక్క సినిమా షీల్డే ఉండటాన్ని రాఘవేంద్రరావు ఎప్పటికీ మరచిపోలేదు. రాఘవేంద్రరావుతో పాటు రైటర్ జంధ్యాల, హీరోయిన్ జయప్రద, సింగర్ బాలసుబ్రమణ్యం తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నారు. పోకిరి విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2006 దర్శకుడు : పూరీ జగన్నాథ్ నటీనటులు : మహేశ్ బాబు, ఇలియానా నిర్మాతలు : పూరీ జగన్నాథ్, మంజుల ఘట్టమనేని సంగీతం : మణిశర్మ ‘బాహుబలి’ బడ్జెట్.. ప్రభాస్, రానా ఇద్దరినీ నేషనల్ లెవెల్ స్టార్లను చేసింది బాహుబలి. వీళ్లిద్దరూ మూడు నాలుగేళ్లు కేవలం బాహుబలి కోసమే తమ సమయాన్ని కేటాయిం చారు. ఈ మూడేళ్లూ కఠోరమైన డైట్, వర్కవుట్లను ఫాలో అయ్యారు. ‘జురాసిక్ వరల్డ్’ లాంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన 30 దేశాలకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు ‘బాహుబలి 2’ కోసం పనిచేశాయి. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా ‘బాహుబలి 2’ (దాదాపు 250 కోట్ల రూపాయలు) నిలిచింది.బాహుబలి పేరుమీద త్వరలోనే కామిక్స్, టీవీ సిరీస్ రానున్నాయి. బాహుబలి 2 విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2018 దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి నటీనటులు : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి – వి. మల్లికార్జున్ -
మహేష్ బాబు ఎవరో కూడా తెలీదు..!
బాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా.. తన తాజా చిత్రం బాద్ షాహో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం దక్కటంతో ఇలియానా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సందర్భంగా తన సినీ రంగం ప్రవేశంపై మీడియాతో మాట్లాడిన ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఇలియానా సౌత్ సినీ రంగం గురించి మాట్లాడింది. చిన్నతనంలో ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆలోచనతో ఎయిర్ హెస్టస్ కావాలనుకున్నానని తెలిపిన ఇలియానా.. తరువాత ష్యాషన్ డిజైనింగ్ వైపు మనసు మళ్లిందని తెలిపారు. అయితే దేవుడు మాత్రం తనను సినీ రంగంవైపు నడిపించాడన్నారు. 16 ఏళ్లకే సినీ రంగంలోకి అడుగుపెట్టడంతో అప్పట్లో ఏం తెలిసేది కాదన్న ఇల్లిబేబీ.. పోకిరి సినిమాకు ముందు మహేష్ ఎవరో కూడా తెలియని చెప్పారు. తరువాత ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నానన్న ఇలియానా ప్రస్తుతం తన వృత్తిపై తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. -
డై..లాగి కొడితే....
సినిమా : పోకిరి దర్శక-రచయిత: పూరి జగన్నాథ్ అలీ భాయ్ (ప్రకాశ్‌రాజ్) పెద్ద మాఫియా డాన్. తన అనుచరులను పెట్టుకుని హైదరాబాద్‌లో చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. సిటీ పోలీస్ కమిషనర్ సయ్యద్ మొహమ్మద్ పాషా (షాయాజీ షిండే) అలీ భాయ్‌ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. పోలీస్ అయిన కృష్ణ మనోహర్ (మహేశ్‌బాబు) అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా పండు అనే పోకిరీగా తిరుగుతుంటాడు. ఓ సందర్భంలో అలీభాయ్ అనుచరుడు నాయర్‌ను (సుబ్బరాజు) పండు కొడతాడు. దాంతో రౌడీ గ్యాంగ్ పండు కోసం వస్తుంది. ఆ గ్యాంగ్‌లో ఒకడు ‘రేయ్.. ఇక్కడ పండు అంటే ఎవడ్రా? నువ్వా పండు. చెప్పు బే.. కౌన్ పండు’ అంటూ రచ్చ చేస్తాడు. అప్పుడు ‘అన్నయ్యా.. పండుగాడు కావాలా? అంటూ గూబ గుయ్‌మనేలా వాణ్ణి కొట్టి, ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’.నేనే ఏంటి? అంటాడు పండు. మైండ్ బ్లోయింగ్ డైలాగ్ కదూ. -
గలగల పారుతున్న గోదారిలా...!
అందమైన అమ్మా యిని చూడగానే ఏ అబ్బాయి మనసైనా గాల్లో తేలినట్టు.. గుండె పేలినట్టు అయిపోవాలి. అచ్చంగా ‘జల్సా’లో ఇలియానాను చూసి, ‘గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే..’ అని పవన్ కల్యాణ్ పాడినట్టన్న మాట. యస్.. ఇలియానాను చూస్తే.. ఏ అబ్బాయి అయినా అలానే అయిపోతాడు. జర జర పాకే విషంలా ఫాస్ట్‌గా ఇలియానాపై ప్రేమ మొదలైపోతుంది. అందానికి చిరునామా అనలేం కానీ, సమ్‌థింగ్ వెరైటీ ఫిజిక్‌తో ఆకట్టుకుంటారు ఇలియానా. ‘దేవదాసు’ ద్వారా ఇలియానా పరిచయమైనప్పుడు ‘మరీ సన్నగా ఉంది’ అనే కామెంట్స్ వినిపించాయి. తర్వాత తర్వాత ‘అలా ఉన్నా బాగానే ఉంది’ అనిపించుకో గలిగారు ఇలియానా. మొదటి సినిమాయే సూపర్ హిట్ కావడం, ఆ వెంటనే మహేశ్‌బాబు వంటి స్టార్ హీరోతో ‘పోకిరి’ చేసే అవకాశం రావడం, ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇలియానాకు తిరుగులేకుండా పోయింది. ఇలియానా అంటే గ్లామర్‌కి కేరాఫ్ అడ్రస్.. అలాంటి పాత్రలే చేయగలుగుతారని ఫిక్స్ అవుతున్న తరుణంలో ‘రాఖీ’తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్నారు ఈ గోవా బ్యూటీ. వెనక్కి తిరిగి చూసుకునేంత తీరిక లేకుండా దాదాపు ఏడేళ్లు ఫుల్ బిజీగా సినిమాలు చేశారామె. సడన్‌గా డౌన్‌ఫాల్ మొదలైంది. తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న ఇలియానాకు విచిత్రంగా ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. కానీ, ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆ మలుపే బాలీవుడ్. ‘బర్ఫి’ చిత్రం ద్వారా ఇలియానా హిందీ తెరకు పరిచయం అయ్యారు. తెలుగులో చేసిన మొదటి సినిమా ‘దేవదాసు’ ఎంతటి గుర్తింపు తెచ్చిందో.. హిందీలో చేసిన మొదటి సినిమా ‘బర్ఫి’ కూడా అంతే గుర్తింపు తెచ్చింది. దాంతో బాలీవుడ్ దర్శక- నిర్మాతల దృష్టి ఇలియానాపై పడింది. ‘ఫటా పోస్టర్... నిఖ్లా హీరో’, ‘మై తేరా హీరో’, ‘హ్యాపీ ఎండింగ్’... ఇలా వరుసగా హిందీ చిత్రాలు చేశారు. సో.. తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ హిందీలో ఇలియానా అవకాశాలు దక్కించుకో గలిగారు. అయితే ఈ మధ్య హిందీలో కూడా గ్యాప్ వచ్చింది. దానికి కారణం ఇలియానానే. ఏ పాత్ర పడితే అది చేయకూడదని ఫిక్స్ అయిపోయా రట. అందుకే కొంత విరామం తీసుకున్నారు. ఇటీవలే ‘రుస్తుమ్’ అనే చిత్రం అంగీకరించారు. ఇందులో ఈ బక్కపలచని భామది బరువైన పాత్ర అట. అందుకే గ్రీన్ సిగ్న్ ఇచ్చేశారు. ఇలియానా కథా నాయిక అయ్యి పదేళ్లయ్యింది. స్టిల్ నాట్ అవుట్. ‘పోకిరి’ సినిమాలో ‘గల గల పారు తున్న గోదారిలా..’ ఇలియానా కెరీర్ కొనసాగుతోంది. -
కేపీహెచ్బీలో పోకిరీ హల్చల్
-
మహేశ్ హల్చల్ గెటప్
అందమైన అమ్మాయి కంట పడితే కత్తి లాంటి అమ్మాయి అంటారు. మరి మహేశ్ లాంటి అందగాళ్లు కనిపిస్తే... డెఫినట్లీ కత్తి లాంటి అబ్బాయి అని అనకుండా ఉండరు. మరి ఈ అందగాడు లుంగీ కడితే...! కేకలా ఉంటుంది కదూ! ‘చూడద్దొం టున్నా... చూస్తూనే ఉంటా’ అని ‘పోకిరి’ సినిమాలోని పాటలో లుంగీ కట్టి కాసేపు అలరించారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. తాజాగా ఆయన ‘శ్రీమంతుడు’ సినిమా కోసం లుంగీ కట్టారు. పల్లెటూరినే కాకుండా అక్కడి వేషభాషలను దత్తత తీసుకునే ‘శ్రీమంతుడు’ హర్ష పాత్రలో మహేశ్‌బాబు అలరించనున్నారని ఈ స్టిల్ ద్వారా తెలుస్తూనే ఉంది. పక్కా పల్లెటూరి లుక్‌లో మహేశ్ సూపర్బ్‌గా ఉన్నారని ఆయన అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ప్రశంసల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అయితే ఈ సన్నివేశానికి రీ-రికార్డింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. అసలెందుకు మహేశ్ లుంగీ కట్టాడో తెలియాలంటే ‘శ్రీమంతుడు’ సినిమా చూడాల్సిందే. మది ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ- ‘‘మహేశ్‌బాబు లుంగీ కట్టి, అలా నడుస్తూంటే సెట్లో అందరం నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమాకు సంబంధించి మర్చిపోలేని అనుభూతులివి. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. మహేశ్ అభిమానులకు ఈ సినిమా ఓ పండగే’’ అని చెప్పారు. -
పోకిరీ వేషం... కుదిరింది రోగం!
హైదరాబాద్: పోకిరీ వేషం వేసిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని జయనగర్ కాలనీలో చోటుచేసుకుంది. యువతి స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ లో చిత్రీకరించిన యువకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఓ అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్థులో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు కరీంనగర్ జిల్లా జగిత్యాల వాసిగా గుర్తించారు. ఉన్నత విద్యావంతుడైన అతడు ఈ విధంగా పోకిరీ వేషాలు వేయడం పొరుగువారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేం పనయ్యా అంటూ అతడికి పలువురు గడ్డి పెట్టారు. -
ఎల్బీనగర్లో ఆకతాయికి దేహశుద్ధి