1/11
2/11
మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో 2006లో వచ్చిన పోకిరి రూ.10కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40కోట్ల షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
3/11
ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో 2003లో వచ్చిన 'సింహాద్రి' సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
4/11
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఇంద్ర' 2003లో విడుదలై అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్. తన కెరీర్‌లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమా 35 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్.
5/11
'సమర సింహారెడ్డి' చిత్రం 13 జనవరి 1999న మిలినియం చివరి యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ రికార్డ్స్‌ను నెలకొల్పింది. ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా బాలయ్య ఈ సినిమాతో గుర్తింపు పొందాడు. ఈ సినిమా 31 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
6/11
1996లో విడుదలైన పెళ్లి సందడి కేవలం రూ.85లక్షల బడ్జెట్‌తో రూ.15కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ బ్రేక్ చేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 27 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
7/11
విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన నువ్వేకావాలి చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తో పాటు… యూత్ లో ఆ సినిమాకు బాగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా 25 సెంటర్స్ లో 175 రోజులు ఆడింది.
8/11
దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ కాంబోలో 1981లో ప్రేమాభిషేకం విడుదలైంది. ఈ సినిమా చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే అపూర్వ విజయాన్ని అందుకుంది. తొలి తెలుగు ప్లాటినమ్ జూబ్లీచిత్రంగా చరిత్రను సృష్టించింది. ఈ సినిమా 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
9/11
‘నరసింహనాయుడు సినిమాలో ‘కత్తులతో కాదురా...కంటి చూపుతో చంపేస్తా..’ ఈ ఒక్క డైలాగ్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించారు బాలకృష్ణ. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11 2001న విడుదలై పలు రికార్డులను కొల్లగొట్టింది.ఈ సినిమా 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
10/11
విక్టరీ వెంకటేష్ బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డు తెచ్చిన 'కలిసుందాం రా' మూవీ 2000 సంక్రాంతికి వచ్చి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో పలు పాత రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా 14 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
11/11
తెలుగులో మొదటి పూర్తి రంగుల చిత్రం ‘లవకుశ’. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 1963లో విడుదలైంది. సినిమా కలెక్షన్స్‌ను పత్రికల్లో ప్రకటించిన తొలి తెలుగు చిత్రం ఇదే.ఈ సినిమా 13 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.