Simhadri
-
రామోజీరావు తప్పుడు వార్తలు మానుకోవాలి: ఎమ్మెల్యే
-
రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. గతంలో ‘రీళ్లు’లో థియేటర్లకు వచ్చి సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4 k టెక్నాలజీతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈతరం సినీ ప్రియులను అలా నాటి తరంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఈ ట్రెండ్‌ను సెట్ చేసింది టాలీవుడ్ మాత్రమేనని చెప్పవచ్చు. భారీగా ఆదాయం ఒక సినిమాను రీరిలీజ్ చేయడం మంచి లాభదాయకంగా ఉంటుందని సూపర్ స్టార్ కృష్ణ సోదరడు ఆదిశేషగిరిరావు ఒకప్పడు అన్నారు. ఒక సినిమా రిజల్యూషన్‌ను 4కేలో మార్చడానికి దాదాపు రూ.10లక్షల ఖర్చు అవుతుందని పలువురు సినీ ట్రేడర్స్ పేర్కొన్నారు. ఒరిజినల్ ప్రింట్‌ను తక్కువ ధరకే పొందగలిగితే. రీరిలీజ్ పక్కాగా మంచి లభాదయకమైన బిజినెస్ అని వారు తెలిపారు. 'పోకిరి'తో నాంది టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్‌కు 'పోకిరి' సినిమానే నాంది పలికందని చెప్పాలి. 2006లో మహేశ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా 'పోకిరి' నిలిచింది. ఈ చిత్రాన్ని మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా 2022లో ఆగస్టు 9న అమెరికాలో మళ్లీ విడుదల చేశారు. ఒక్క రోజులో 320 ‘షో’ల్లో ప్రదర్శితమైన ‘పోకిరి’ సుమారు రూ.1.75 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఇండియాలో కూడా విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బును ఆయన అభిమానులు ఛారిటీలకు ఇచ్చారు. గుండెకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు జరిపించేలా ప్లాన్ చేశారు. ఒకే నెలలోనే ప్రభాస్ సినిమాలు రీరిలీజ్ అయిన సినిమాల్లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యాయి. ఆయన నటించిన రెబెల్, బిల్లా, వర్షం రీ రిలీజ్లో భారీగా సందడి చేశాయి. రెబల్ మొదటిసారిగా విడుదలైనప్పుడు ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. కానీ రీ రిలీజ్ సమయంలో మంచి వసూళ్లు సాధించింది. అలాగే బిల్లా, వర్షం సినిమాలకు కూడా భారీగానే కలెక్షన్లు వచ్చాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అందువల్ల ఆయన సినిమాలకు డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉంది. ఎవరైనా రీ రిలీజ్ చేయవచ్చా ఈ విధానంలో కాపీ రైట్ సమస్య ఉంటుంది. కాబట్టి ఏదైనా సినిమాను రీ రిలీజ్ చేయాలంటే ఆ సినిమాకు చెందిన నిర్మాతల అంగీకారంతో కూడిన పత్రాన్ని ల్యాబ్స్‌కు అందిస్తే.. ఆయా సినిమాలను రీ మాస్టరింగ్ చేస్తాయి. ఈ మార్కెట్‌పై అవగాహనతో పాటు ఆసక్తి ఉంటే ఎవరైనా ఒక సినిమాను రీ రిలీజ్ చేయవచ్చు. ఇప్పటికే మా హీరోది ఫలానా సినిమా రీ రిలీజ్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభిమానులు అభ్యర్థిస్తున్నారు. గతంలో బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్న ఇంకా ఏయే సినిమాలు భవిష్యత్తులో సందడి చేస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సింహాద్రితో మరో ట్రెండ్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి సింహాద్రి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ ఆయన ఫ్యాన్స్ కొత్త ట్రెండ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు సింహాద్రి రీ-రిలీజ్ సినిమాకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్‌గా జరిపారు. అలా ఏ మాత్రం కొత్త సినిమాలకు తగ్గకుండా తమ అభిమాన హీరో పాత చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో నష్టమే చిత్ర పరిశ్రమలో ప్రతి శుక్రవారం సినిమా జాతకాలు మారిపోతుంటాయి. వారం వారం ఎన్నో చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే చిన్న సినిమాలు విడుదలైన సమయంలో రీ రిలీజ్ చిత్రాలను విడుదల చేస్తే వారు భారీగా నష్టపోతున్నారు. అప్పుడు కొత్త సినిమాలకు టికెట్లు తెగడం లేదు. ఒక్క సినిమాకు ఎంత సమయం? గతంలో సినిమాలను 'రీళ్ల' ద్వారా మాత్రమే చిత్రీకరించేవారు. వాటిని ప్రస్తుత టెక్నాలజీ ఉన్న థియేటర్లలో ప్రదర్శించటం వీలు కాదు. కాబట్టి ఆ రీళ్లను ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టు మార్చాలి. ప్రతి ఫ్రేమ్‌ను స్కాన్ చేసి 4k విజువల్స్‌లోకి తీసుకొస్తేనే రీ రిలీజ్‌కు అవకాశం ఉంటుంది. ఇది కొంత మేరకు సమయం పడొచ్చు. అందుకు గాను సుమారుగా 3 నెలల వరకు ఉంటుంది. ఇందులో స్కానింగ్, గ్రేడింగ్, రీస్టోరేషన్ అనే మూడు పద్ధతులను అనుసరించి 4k విజువల్స్‌లోకి మారుస్తారు. ఆశ్చర్యపోయిన హీరో సూర్య 15 ఏళ్ల క్రితం విడుదలైన సినిమాను రీ రిలీజ్ చేస్తే అసలు కలెక్షన్స్ వస్తాయా అనుకున్నారు. అందులో సూర్య తమిళ హీరో కాబట్టి పెద్దగా అంచనాలు లేకుండా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 350 థియేటర్లలో విడుదల చేశారు. ఈ సనిమాకు గాను సుమారు రూ 3.5 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లలో వస్తున్న విశేష స్పందన చూసి హీరో సూర్య సైతం సంతోషంతో సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
అత్యధిక కేంద్రాల్లో 175 రోజులు రన్ అయిన టాప్ 10 సినిమాలు ఇవే
-
నవదీప్‌తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2003లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఈ చిత్రంలో భూమిక ప్రధాన పాత్రలో కనిపించగా.. మరో హీరోయిన్గా అంకిత నటించింది. సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అంకిత.. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టేసింది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ధనలక్ష్మీ.. ఐ లవ్ యూ, ప్రేమలో పావని కల్యాణ్ చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా నవదీప్ సరసన మనసు మాట వినదు, గోపీచంద్‌తో రారాజు, రవితేజతో ఖతర్నాక్ సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత వచ్చిన విజయేంద్రవర్మ మూవీ ఆమెకు కలిసి రాలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత తాను సినిమాలకు ఎందుకు దూరమయ్యానో చెప్పుకొచ్చింది. అంకిత 2009 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. (ఇది చదవండి: సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకుంది: అల్లు అరవింద్ ) అంకిత మాట్లాడుతూ.. 'విజయేంద్రవర్మ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ నేను ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ చిత్రం సక్సెస్ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని.' అని అన్నారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే కెరీర్ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నవదీప్‌తో వివాదం! అయితే టాలీవుడ్ హీరో నవదీప్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని అంకిత స్పష్టం చేశారు. నవదీప్ మూవీతో పాటు.. తమిళంలో మరో సినిమా ఓకేసారి చేయడంతో కాస్త ఒత్తిడిగా ఫీలయ్యానని.. ఆ క్రమంలో అసహనానికి గురయ్యాను తప్ప.. ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఆర్తీ అగర్వాల్, ఉదయ్ కిరణ్ తనకు మంచి స్నేహితులని తెలిపారు. వారిద్దరు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వ్యాపారవేత్తతో పెళ్లి అంతే కాకుండా గతేడాది హీరో అల్లు అర్జున్ను కలిశానని.. ఎన్టీఆర్‌తో సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నానని తెలిపారు. మంచి అవకాశం వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా.. ముంబయికి చెందిన అంకితకు విశాల్ జగపతి అనే బిజినెస్‌మెన్‌ను 2016లో పెళ్లి చేసుకుని యూఎస్‌లోని న్యూజెర్సీలో అంకిత స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా! ) -
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి?
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా మీకు గుర్తుందా?. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించారు. కేరళలో నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా లిస్ట్‌లో చేరింది. అయితే కొన్ని చిత్రంలో తన అందమైన కళ్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ అంకిత. 'చీమ చీమ చీమ చీమ' అంటూ సాగే సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌తో అదరగొట్టింది. (ఇది చదవండి: 'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న భామ.. ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. విజయేంద్రవర్మ, లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు లాంటి చిత్రాల్లోనూ కనిపించింది. అయితే కొద్ది సినిమాలకే పరిమితమైన అంకిత 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించిన అంకిత ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన అంకిత ప్రస్తుతం అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మించుకున్న అందమైన ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. అంకిత భర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) -
సింహాద్రి రీ రిలీజ్.. ఏకంగా థియేటర్ తగలబెట్టేశారుగా!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమా రిలీజైతే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి రీ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) అయితే ఈ సినిమా రిలీజ్ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా రిలీజైన థియేటర్ల ముందు పాలాభిషేకాలు, కేక్‌లు చేసి సందడి చేశారు. అయితే విజయవాడలోని గాంధీనగర్ అప్సర థియేటర్లో అభిమానులు ఏకంగా టపాసులు పేల్చారు. దీంతో సీట్లకు మంటలు అంటుకుని థియేటర్ మొత్తం వ్యాపించాయి. అయితే అక్కడే ఉన్న పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ ఘటనతో సాయంత్రం ప్రదర్శించాల్సిన షోలను నిర్వాహకులు రద్దు చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) -
సింహాద్రి రీరిలీజ్ రికార్డులు ఎన్ని..?
-
రీరిలీజ్ కానున్న సింహాద్రి, కలెక్షన్స్ ఏం చేస్తారంటే?
రీరిలీజ్ విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేశాడు. 20 ఏళ్ల క్రితం వచ్చిన సింహాద్రి సినిమాకు వెయ్యి షోస్ ఉండటం, దానికి గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగడమంటే మామూలు విషయం కాదు. తారక్ బర్త్‌డే సందర్భంగా తన ఆల్‌టైం బ్లాక్‌బస్టర్ మూవీ సింహాద్రి మే 20న రీరిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 4కే, డాల్బీ అట్మాస్ వర్షన్లో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్సీస్లోనే 150కి పైగా థియేటర్స్‌లో సింహాద్రి సినిమాను ప్రదర్శించనున్నారు. వరల్డ్‌లోనే అతి పెద్ద స్క్రీన్ అయిన మెల్బోర్న్ ఐమాక్స్ థియేటర్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయట. సింహాద్రి రీరిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్‌లోని లాభాలను ఓ మంచి పని కోసం ఉపయోగించాలని మేకర్స్ భావిస్తున్నారట. పేదరికంతో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు ఈ కలెక్షన్స్ పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ సూచించిన అభిమానులకు సాయాన్ని అందించనున్నట్లు టాక్ వస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. కాగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లోనే 30 కోట్లు వసూళు చేసి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 2003లో టాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రీరిలీజ్‌లోనూ సింహాద్రి మూవీ రికార్టు క్రియేట్ చేయడం మరో విశేషం. చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో దొంగతనం -
సింహాద్రి రీ రిలీజ్ పై ఎన్టీఆర్ పోస్ట్..గందరగోళంలో ఫ్యాన్స్
-
తిరిగొస్తున్న ఆది సింహాద్రి..
-
ఎన్టీఆర్ బర్త్‌డే.. గందరగోళంలో అభిమానులు!
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల బర్త్‌డే సందర్భంగానో.. లేదా 10, 20 ఇయర్స్ పూర్తి చేసుకున్నారనో..ఇలా మొత్తంగా ఏదో ఒక కారణంతో హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి కూడా రీరిలీజ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఈ మధ్య స్టార్ హీరోల పుట్టిన రోజు నాడు ఏదో ఒక సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు, పవన్ కల్యాన్, చిరంజీవి లాంటి హీరోల సినిమాలు రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నారు. మే 20న 'సింహాద్రి' సినిమాని భారీస్థాయిలో రీరిలీజ్ చేయాలని అభిమానులు నిర్ణయించారు. దీంతో పాటు ‘ఆది’, ‘నిన్ను చూడాలని’ చిత్రాలను కూడా విడుదల చేయబోతున్నారు. ఆది చిత్రాన్ని అయితే మే 20 నుంచి 28 వరకు ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'నిన్ను చూడాలని' చిత్రాన్ని మే 19న ప్రదర్శిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. గందరగోళంలో ఫ్యాన్స్ సాధారణంగా స్టార్ హీరోల బర్త్‌డే రోజు ఏదో ఒక్క సినిమా మాత్రమే..అది కూడా ఒక్క రోజే రీరిలీజ్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌డే (ఏప్రిల్ 8) సందర్భంగా ‘దేశముదురు’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఒక్క సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఆ చిత్రాన్ని వీక్షించారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. ఒకేసారి పలు సినిమాలను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తుండటంతో ఏ సినిమా చూడాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. అయితే మెజారీటీ ఫ్యాన్స్ మాత్రం ‘సింహాద్రి’కే మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది అయితే ‘ఆది’, ‘సింహాద్రి’ రెండూ చూస్తామని కామెంట్ చేస్తున్నారు. Ninnu Chudalani release ani evadu cheppadu ra Kapu lanja kodaka 💦💦💦💦 Ila direct ga edche kante … ma Mo cheekachu kadha ra @NagaBabuOffl @KChiruTweets https://t.co/0gzMJCear4 — #MassAmmaMoguduNTR (@CHARanhassan4) April 11, 2023 -
జూనియర్ ఎన్టీఆర్ భారీ హిట్స్.. అయితే, ఇక్కడో సెంటిమెట్
చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అంటూ అల్లాడిపోతాం. కానీ హీరోలు ఏకంగా కత్తిపోటుకు గురైనా అదరరు, బెదరరు. యాక్షన్ సీన్లలో దెబ్బలు తాకినా, రక్తాలు కారుతున్నా ముందుగా సీన్ కంప్లీట్ చేయడానికే శ్రద్ధ చూపుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెట్స్‌లో ఇలా గాయాల బారిన పడటం పరిపాటి. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాల షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడు. అయితే ఆయన తాతగారు నందమూరి తారక రామారావు ఆశీస్సుల వల్లో, లేక అభిమానుల ప్రేమాభిమానాల వల్లో కానీ ఎటువంటి ప్రాణహాని లేకుండా స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. మరి తారక్ ఏయే సినిమాల షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడో చూసేద్దాం... స్టూడెంట్ నెంబర్ 1: రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే ఎన్టీఆర్ వెండితెరపై హీరోగా పరిచయమవ్వాల్సి ఉంది. కానీ ఓ షెడ్యూల్లో తారక్ గాయపడటంతో చిత్రీకరణ కొంత ఆలస్యం అయింది. అయినప్పటికీ ఎన్టీఆర్‌కు ఫస్ట్ బాక్సాఫీస్ హిట్‌ను అందించింది ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రమే. ‘ఆది’ సినిమా టైంలోనూ తారక్ దెబ్బలు తగిలించుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అందులోని ఓ ముఖ్యమైన ఫైట్ సీన్లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే చేతికి కట్టు ఉండగానే ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ అనే సాంగ్ షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. ఈ పాటతో పాటు సినిమా కూడా ఓ రేంజ్లో హిట్టైన విషయం తెలిసిందే. సింహాద్రి.. సినిమాతో మరింత పాపులర్ అయిన ఎన్టీఆర్‌కు ఈ మూవీ షూటింగ్‌లోనూ ఇంజూర్ అయింది. అయినప్పటికీ తన గాయాలను లెక్క చేయకుండా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆయన కష్టానికి ఫలితంగా సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తర్వాత ‘యమదొంగ’, ‘బృందావనం’ చిత్రీకరణ సమయంలోనూ తారక్‌కు దెబ్బలు తాకాయి, కానీ ఈ రెండూ మంచి విజయం సాధించాయి. ‘శక్తి’ సినిమాలో కొన్ని అనవసరపు యాక్షన్ సీన్లు చిత్రీకరించిన సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఇక్కడ విడ్డూరమేంటంటే అంత కష్టపడి చేసిన సీన్లను ఎడిటింగ్‌లో లేపేయడమేకాక, ఇది అతడి కెరీర్లోనే డిజాస్టర్‌గా నిలిచింది. ‘సాంబ, ఊసరవెల్లి’.. సినిమాల షూటింగ్ సమయంలోనూ తారక్ గాయపడగా, ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ‘అదుర్స్’ సినిమా షూటింగ్ ముగించుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనూ ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అయింది. గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు తారక్. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైంలోనూ తారక్ గాయపడ్డ విషయం తెలిసిందే! -
ఆచార్య వైసీ సింహాద్రి కన్నుమూత
సాక్షి, కాకినాడ/ముమ్మిడివరం: ప్రముఖ విద్యావేత్త, ఆచార్య యెడ్ల సింహాద్రి కన్నుమూశారు. కరోనా సోకడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సింహాద్రి.. ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్, బీహార్ వంటి విశ్వ విద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కుగ్రామం నుంచి విశ్వవిద్యాలయ వీసీగా... కోనసీమ సరస్వతిపుత్రుడాయన. ఈ ప్రాంతం నుంచి స్వయంకృషితో విశ్వవిద్యాలయాల ఉపకులపతి స్థాయికి ఎదిగారు. పేదరికంలో పుట్టినా పట్టుదలతో అమెరికాలో డాక్టరేట్ చేయగలిగారు. ఆయనే ఎడ్ల చిన సింహాద్రి (80).వీసీ సింహాద్రిగానే సుపరిచితులు. సింహాద్రి స్వగ్రామం ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ శివారు గురజాపులంక. ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు ఆయన. ధర్మరాజు, వెంకాయమ్మల ఏడుగురు సంతానంలో సింహాద్రి చివరి వారు. 1941 సింహాద్రి జూన్ 15న జన్మించారు. పడవెక్కి.. దిగి.. కాలినడకన స్కూలుకు.. సింహాద్రి బాల్యం పేదరికంలోనే గడిచింది. గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలోని ముమ్మిడివరంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. చిన్నప్పటి నుంచీ చదువుపై ఎంతో ఆసక్తి. గురజాపులంక నుంచి నాటు పడవపై గోదావరి పాయ దాటి కాలి నడకన పాఠశాలకు చేరుకునే వారు. కాట్రేనికోన మండలం కందికుప్పలో బంధువుల ఇంట ఉంటూ ఎస్సెస్సెల్సీ చదివారు. అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో పీయూసీ చదివారు. ఆంధ్ర యూనివర్సిటీలో సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యారంగాన ప్రతిభ కనబర్చడంతో అమెరికా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. జపాన్, ఇటలీ యూనివర్సిటీల్లో కూడా డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్‌గా కెరీర్ ఆంధ్రా యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా ఆయన కెరీర్ ప్రారంభించారు. ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు కోనసీమకు చెందిన ఎందరో విద్యార్థులను ప్రోత్సహించారు. వారి ఉన్నత చదువులకు ప్రేరణ కలిగించారు. గుంటూరులోని నాగార్జున, సుప్రసిద్ధ బెనారస్ హిందూ, పాటా్న, ఆంధ్రా యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్‌గా పని చేశారు. సంస్కరణలకు బాట వేశారు. ప్రస్తుతం ఇండియన్ వైస్ చాన్స్‌లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన జపాన్‌కు చెందిన యువతి నవాకోను వివాహమాడారు. నిరాడంబరంగా జీవించడానికి ఇష్టపడేవారు. సింహాద్రి భౌతికకాయానికి స్వగ్రామం గురజాపు లంకలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయ న మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జేసీలు, డీఆర్ఓ, ఇతర అధికారులు సంతాపం తెలిపారు. చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్ -
ఆ మూడూ హత్యలు చేసింది సింహాద్రినే!
ఇంతవరకు ఆ ముగ్గురు సాధారణంగానే మృతి చెందారని భావించారు. అయితే వారిలో ఒకరిది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరూ ఊహించన విధంగా ఆ ముగ్గురు హత్యకు గురయ్యారన్న విషయం తెలియగానే రాజమహేంద్రవరంలో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ముగ్గురిని హత్య చేసింది ఒక్కడే. వారిలో బంధువులైన ఇద్దరు మహిళలను.. ఆశ్రమం స్వామీజీని నిందితుడు హత్య చేశాడు. దీంతో బంధువులు బోరున విలపిస్తుంటే.. ఆశ్రమం పరిసర గ్రామాల వారు అవాక్కయారు. సంచలనం సృష్టించిన ఈ హత్యల ఉదంతం ఇలా ఉంది. సాక్షి, రాజమహేంద్రవరం: ఎవరికీ అనుమానం రాకుండా బంగారు వస్తువులు, నగదు చోరీకి పాల్పడుతూ నగరంలో మూడు హత్యలు చేసిన ఏలూరు మండలం వెంకటాపురానికి చెందిన వెల్లంకి సింహాద్రి పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు చిక్కాడు. జిల్లాలో ఈ ముగ్గురిని హత్య చేసిన అతడు ఏమీ ఎరుగనట్టు వారి కుటుంబ సభ్యులతోనే తిరుగుతూ ఆ తర్వాత తప్పించుకోపోయాడు. చివరకు ఒక హత్య కేసులో దొరకడంతో డొంక కదిలింది. తాను చేసిన పది హత్యల్లో జిల్లాలో ముగ్గురుగు ఉన్నట్టు నిందితుడు అంగీకరించాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలోని రామకృష్ణానంద స్వామీజీ ఆశ్రమం నిర్వాహకుడు రామకృష్ణానంద స్వామి, రాజమహేంద్రవరం పేపరు మిల్లు ప్రాంతానికి చెందిన కొత్తపల్లి నాగమణి, బొమ్మూరు గ్రామానికి చెందిన శామంతకుర్తి నాగమణిలను నిందితుడు హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రియల్ ఎస్టేటు లాభసాటిగా లేదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంత లాభసాటిగా లేదని, సులభంగా డబ్బు సంపాదించాలని సింహాద్రి ఆలోచనలో పడ్డాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగురాళ్లు ఇంట్లో ఉంటే కోటీశ్వరులు కావచ్చని, గుప్త నిధులు చూపిస్తానని, బంగారాన్ని రెట్టింపు చేస్తానని నమ్మించడం మొదలెట్టాడు. సైనేడ్ కలిపిన ప్రసాదం, ఆయుర్వేదం మందు ఇచ్చి.. 20 నెలల్లో పది మందిని హతమార్చాడు. ఏలూరుకు చెందిన పీఈటి కాటి నాగరాజు మృతితో భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏలూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంతో జిల్లాకు చెందిన మూడు హత్యలు బయటపడ్డాయి. 2018 ఏప్రిల్ 28న.. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో రామకృష్ణా పరమానంద స్వామీజీ ఆశ్రమంలోని రామకృష్ణానంద స్వామీజీ వద్దకు నిందితుడు భక్తుడిగా స్వామీజీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. నిత్యాన్నదానం, పండగలకు హోమాలు స్వామీజీ చేస్తుంటే.. ఆయనతో ఉంటూ పరిసర ప్రాంతాల వారికి సుపరిచితుడయ్యాడు. స్వామీజీ వద్ద భారీగా సొమ్ము ఉంటుందని భావించి 2018 ఏప్రిల్ 28న ఆయుర్వేద మందులో సైనేడ్ కలిపి ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన స్వామీజీ బస్టాండ్ వద్ద ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే స్వామీజీ మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందారనుకుని అందరూ భావించారు. ఆశ్రమంలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. స్వామిజీ వద్ద నగదు లేకపోవడంతో అతడు వెనుదిరిగాడు. సింహాద్రి పోలీసులకు చిక్కడంతో స్వామీజీ గుండెపోటుతో మరణించలేదని, హత్యకు గురయ్యాడని తెలియడంతో పురుషోత్తపట్నం తదితర ప్రాంతాల వారు ఆశ్చర్యపోతున్నారు. స్వామిజీని ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయం వరకు ఉన్న సింహాద్రి ఆ తరువాత కనిపించ లేదని స్థానికులు చెబుతున్నారు. స్వామీజీని హత్య చేశారన్న విషయాన్ని జీరి్ణంచుకోలేకపోతున్నామని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. 2018 డిసెంబర్ 23న.. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు క్వార్టర్స్‌లో ఉండే కొత్తపల్లి నాగమణికి సింహాద్రి సమీప బంధువు. చుట్టపు చూపుగా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. 2018 డిసెంబర్ 23న డయోబెటిక్ మందు అంటూ ఆమెతో సైనేడ్ ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. వెంటనే ఆమె మెడలోని బంగారు మంగళ సూత్రం తాడు తీసుకుని పరారయ్యాడు. ఆమెది అందరూ సహజ మరణంగా భావించారు. ఆమె దిన కార్యక్రమాల్లో ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే అతడు తిరిగాడు. ఈ ఏడాది జనవరి 12న.. కొత్తపల్లి నాగమణిని హత్య చేసిన కొద్దిరోజులకే ఆమె కోడలు, వరుసకు వదిన అయిన బొమ్మూరు గ్రామానికి చెందిన దెందులూరులో హెచ్వీగా పనిచేస్తున్న శామంతకుర్తి నాగమణి (50)ను డబ్బు రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఈ ఏడాది జనవరి 12న ఆమె ఆలమూరు వెళ్లి యేసురాజు అనే వ్యక్తిని చేబోదులుగా రూ.5 లక్షలు అడిగింది. మధ్యాహ్నం బ్యాంకులో బంగారం పెట్టి ఇస్తానని చెప్పి తీసుకువచ్చింది. మధ్యాహ్నం బొమ్మూరులోని ఇంటి వద్ద సింహాద్రి ప్రసాదం పేరుతో ఆమెకు సైనేడ్ తినిపించి, రూ.5 లక్షలు, బంగారు వస్తువులతో పరారయ్యాడు. బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను అప్పుట్లో బొమ్మూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మర్నాడు సింహాద్రి పోస్టుమార్టం వద్దకు వచ్చి రూ.5 లక్షలు ఇచ్చిన యేసురాజుపై కేసు పెట్టేంచేలా ప్రయత్నాలు చేశాడు. కుటుంబ సభ్యులు సైతం అతనికి మద్దతుగా నిలిచారు. తల్లి నాగమణిని, భార్యను అతడు హత్య చేశాడని తెలుసుకున్న భర్త మాణిక్యాలరావు అవాక్కయ్యాడు. కుటుంబ సభ్యుడే ఇలా హత్యలకు పాల్పడడాన్ని వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. బాధలో ఉన్న తమను ఇంక వదిలేయాలని ప్రాధేయపడ్డారు. -
భూవివాదం: భార్యభర్తల దారుణ హత్య
సాక్షి, విజయనగరం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదం కారణంగా భార్యభర్తలిద్దరిని గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన మక్కువ మండలం చెముడు పంచాయతీ పాలకవలసలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలికవలస గ్రామానికి చెందిన దంపతులు ఒమ్మి సోములు, నారాయణమ్మలను అదే గ్రామానికి చెందిన సింహాద్రి అనే వ్యక్తి గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. పొలంలో పడివున్న మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. భూ వివాదం కారణంగానే సింహాద్రి ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచానా వేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
నమ్మితే ఉన్నాడు
కష్టం వచ్చినప్పుడు నమ్మితే? ... కోరిక కలిగినప్పుడు నమ్మితే? ఎవర్నయినా కాపాడాలి అని నమ్మితే? ... నలుగురు బాగుండాలి అని నమ్మితే? ఉన్నప్పుడు ఇవ్వాలి అని నమ్మితే?... లేనప్పుడు ఉన్నాడని నమ్మితే? నమ్మితే... దేవుడున్నాడు... అంటున్నారు నటి సీత. హావభావాలు శక్తిమంతంగా ప్రదర్శించే నటి సీత. ‘చిన్నారి స్నేహం’, ‘పోలీసు భార్య’, ‘ఆడదే ఆధారం’, ‘ముత్యమంత ముద్దు’ వంటి పెద్ద హిట్స్ ఆమె జాబితాలో ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘సింహాద్రి’, ‘బన్ని’, ‘కరెంటు తీగ’ వంటి సినిమాలలో నటించారు. ‘నేను–నా దైవం’ గురించి ఆమె సాక్షితో కొన్ని ఆలోచనలు పంచుకున్నారు. జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నట్టున్నారు? అవును. జీవితం అంటే అదే. సాఫీగా ఉండేది జీవితం కాదు. మనం ఊహించినట్టుగా ఉండేది కూడా జీవితం కాదు. జీవితం సముద్రంలాంటిది. దాని వీపు మీద మనం ప్రయాణం చేస్తుంటాం కాని అది ఏ క్షణం ఎలా మారుతుందో ఊహించలేము. పురుషుల కంటే స్త్రీలకు ఈ విషయంలో ఎక్కువ దైవ ఆలంబన అవసరమా? దైవ ఆలంబన విషయంలో స్త్రీలకు, పురుషులకు తేడా ఉండదు. కాని గమనించి చూస్తే స్త్రీలు కాసేపు దేవుని దగ్గర తమ మనసులో ఉన్నదంతా గుమ్మరించుకుని తేలిక పడతారు. కాని మగవాళ్లు దేవుణ్ణి పట్టుకుంటే అలాగే పట్టుకునే ఉండాలి. స్త్రీలకు కుటుంబం ఉంటుంది. ఇంటిని చక్కదిద్దుకోవడమే వాళ్లకు అసలైన పుణ్యకార్యం. అందుకే పురాణాల్లో సతీ అనసూయ వంటి పతివ్రతలు ఎక్కువ కనిపిస్తారు. పురుషులలో భక్త సిరియాళ, భక్త మార్కండేయ, భక్త ప్రహ్లాద వంటి వీర భక్తులు ఎక్కువ కనిపిస్తారు. మీ మీద భక్తి ప్రభావం ఎలా ఉండేది? చాలా ఎక్కువ ఉండేది. మా ఇంట్లో ప్రతి శుక్రవారం అమ్మ ప్రత్యేక పూజలు చేసేది. పూజకు ఉపయోగించే సామగ్రిని శుభ్రం చేసే పని నేనే చేసేదాన్ని. ఆరేళ్ల వయసు నుంచి అనుకుంటా నేనే దేవుడి సామాన్లన్నీ తళతళ మెరిసేలా శుభ్రం చేసి పెట్టేదాన్ని. బిడ్డకు జలుబు చేస్తుంది అని తాత వారించినా ఒప్పుకునేదాన్ని కాను. దేవుళ్ల బొమ్మలు, పటాలు కూడా శుభ్రం చేసి పూజకు సిద్ధం చేసేదాన్ని. కొంచెం పెద్ద అయ్యాక కేసరి, పొంగల్, వడ ప్రసాదాలను రుచిగా వండేదాన్ని. ప్రతి ఉదయం పూజ, ప్రసాదాల అలవాటు నా జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచేది. ఈ దేవుళ్లు హిందువుల దేవుళ్లు వీళ్లనే పూజించాలి అని అనుకునేవారా? అలా ఏం లేదు. ఏ ఇంట్లో అయినా మన సంప్రదాయాన్నే మన పెద్దవాళ్లు నేర్పిస్తారు. దాంతో పాటు పొరుగు సంప్రదాయాన్ని కూడా గౌరవించే సహనం, ప్రేమ మన సంస్కృతిలో ఉన్నాయి. మన బాల్యమంతా అలాంటి సంస్కృతిలోనే గడిచిందని మనమంతా గుర్తు చేసుకుంటే ఈ సమాజం ఎంతో బాగుండనిపిస్తుంది. చిన్నప్పుడు కాన్వెంట్ స్కూల్లో చదువుకునేటప్పుడు చర్చికి తరచూ వెళ్లేదాన్ని. క్రీస్తు ప్రార్థనలు భక్తిగా చేసేదాన్ని. చెన్నై మౌంట్‌రోడ్డులోని దర్గాకు ఇప్పుడూ తరచూ వెళుతుంటాను. పుదుప్పేటలో మా ఇంటికీ సమీపంలోని దర్గాలో తెల్లవారుజాము 5 గంటలకు ప్రార్థ్దనలు జరిపేవారు. అలారంతో పని లేకుండా ఆ టైమ్‌కి నిద్రలేచి పూజలు చేసుకునేదాన్ని. అలా ఆ దర్గా నాలో ఒక సమయపాలనను నేర్పింది. ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లోవాళ్లు దర్గాకు తీసుకువెళ్లి మంత్రం వేయించేవారు, తాయెత్తులు కట్టించేవారు. జబ్బు నయం అయ్యేది. ఏ దేవుడంటే ఇష్టం ఉండేది? మా ఇష్ట దైవం వేంకటేశ్వర స్వామి. ఇంట్లో ఆయనకే ఎక్కువగా పూజలు జరిపేవారు. నా చిన్నతనంలో తరచూ తిరుమల వెళ్లేవాళ్లం. అలా వెళ్లేముందు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లి ‘గోవిందా’ అంటూ ముడుపులు, విరాళాలు సేకరించి అలా సేకరించిన సొమ్మును తిరుమలలో స్వామివారి సన్నిధిలోని హుండీలో వేసేవాళ్లం. ఇందుకోసమని నేను, అన్నయ్య, తమ్ముడు కలిసి ఇంటింటికి తిరిగేవాళ్లం. వాళ్లు కాస్త సిగ్గుపడుతుంటే ‘గోవిందా....గో....విందా’ అని నేను మాత్రమే బిగ్గరగా అరిచేదాన్ని (చిన్న నవ్వు). అసలు దైవానికి ఎలా కనెక్ట్ అవ్వాలి? నేనైతే ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు ముగించుకొని పూజ చేసుకుంటాను. తరువాత 20 నిమిషాలైనా ధ్యానం చేస్తాను. శరీరం మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు మనసు కూడా శుభ్రంగా ఉంటేనే అక్కడ దేవుడు ఉంటాడు. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడు దేవుడు ఉన్నాడనే భావన కలుగుతుంది. దేవుడంటే ఎక్కడో కాదని, మనలోనే ఉన్నాడని, దేహమే దేవాలయం అనే భావన ఉండాలి. అప్పుడే కనెక్ట్ అవుతాం. ఇది దైవ మహిమా అని ఎప్పుడైనా అనిపించిందా? ఒకసారి ఫుడ్ అలర్జీ వచ్చి ముఖమంతా ర్యాష్ వచ్చింది. డాక్టర్ వద్దకు వెళితే మందులిచ్చి పది రోజులపాటు మేకప్ వేసుకోవద్దని చెప్పారు. నాకేమో రోజూ షూటింగ్ ఉంది. నేను వెళ్లకుండా సహ నటుల కాంబినేషన్ మిస్సయితే నిర్మాతకు నష్టం వస్తుంది. దేవుడిని ప్రార్థిస్తూనే షూటింగ్ స్పాట్‌కు వెళ్లాను. చిత్ర దర్శకులు నా వద్దకు వచ్చి ఈ క్యారెక్టర్‌కు బొత్తిగా మేకప్ అవసరం లేదని చెప్పారు. నాకైతే అప్పుడు నోటమాటరాలేదు. అద్భుతం అనిపించింది. అలాగే మరొకటి. నాకు షిరిడీ సాయిబాబా అన్నా చాలా భక్తి. షిరిడీకి వెళ్లిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌తో వచ్చేటప్పుడు నా కోసం బాబా విగ్రహం తీసుకురావాలని చెప్పాను. అయితే వాళ్లు మర్చిపోయి వచ్చారు. అదే రోజున ఒక షాప్ ఓపెనింగ్‌కు వెళుతూ బాబా విగ్రహం రాలేదే అని తలచుకుంటూ వెళ్లాను. నన్ను ముఖ్యఅతిధిగా పిలిచిన నిర్వాహకులు నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అలాంటి షిరిడీ బాబా విగ్రహాన్ని బహూకరించారు. ఆరోజు నా సంతోషానికి అవధులు లేవు. దేవుడిపై ఎపుడైనా కోపం వచ్చిందా? తట్టుకోలేని చేదు అనుభవం ఎదురైనపుడు క్షణంపాటు కోపం కలుగుతుంది. అయితే అంతలోనే ఆ కోపం మాయం అవుతుంది. ఏదో కారణం ఉంటేనే కానీ ఈ సంఘటన చోటు చేసుకోదు. దీని వెనుక దేవుడి మర్మం ఏదో ఉంది. అంతా మన మంచి కోసమేనని గట్టిగా అనుకుంటాను. కష్టాలు వచ్చినపుడు దేవుడా నాకెందుకీ ఆవేదనలు అంటారు. అదే కోటి రూపాయలు కలిసొస్తే దేవుడా నాకే ఎందుకిచ్చావు అని ఆలోచించరు. దైవం విషయంలో మనిషికి అలాంటి పరిణతి వస్తే ఎంతో బాగుంటుంది. దైవానికి నైవేద్యం పెట్టడం ఏంటని మీకెప్పుడైనా సందేహం కలిగిందా? దేవునికి నైవేద్యం పెట్టడం మంచిదే కాని అంతకంటే మనిషి ఆకలి తీర్చడం అవసరం. మీకు ఒక కథ చెబుతాను. కరువు పీడిస్తుండగా ఒక రైతు దేవుడికి పరీక్ష పెట్టాడు. నీవు నిజంగా ఉంటే నా అరటితోట విరగగాయాలి అన్నాట్ట. తోటకు చుక్కనీరు పోయకున్నా చక్కని పంట చేతికి రావడంతో దేవుడున్నాడని నమ్మాడు. వెంటనే గుడికి గంపలు గంపలు అరటి పళ్లను నైవేద్యానికి పంపాడు. అదే రోజు రాత్రి దేవుడు కలలోకి రాగా నేను పంపిన పండ్లు తిన్నావా అని అడిగాడు రైతు. ఒక్కటే తిన్నాను అని బదులిచ్చాడు దేవుడు. దాంతో రైతు తన పనివాళ్లు పండ్లు మొత్తం కాజేశారని తలచి వాళ్లను పిలిచి అసలేం జరిగిందని ప్రశ్నించాడు. అందరూ అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా పెట్టాం అని చెప్పారు. కాని ఒక్క పనివాడు మాత్రం వాటిని తీసుకెళ్లే దారిలో ఒక యాచకుడు ఆకలితో అలమటిస్తుంటే ఒక అరటిపండు ఇచ్చినట్టు చెప్పాడు. రైతుకు జ్ఞానోదయం అయింది– ఆకలితో ఉన్న వాడికి ఇచ్చిన ఆ ఒక్కపండే దేవుడికి చేరిందని. ఇప్పుడు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నారు? నేను జీవించినంతకాలం అమ్మ నాతో ఉండాలి అని మొదటగా వేడుకుంటుంటాను. మనిషికి అషై్టశ్వర్యాలు ఉన్నా ఆరోగ్యం అనేది లేకుంటే అంతా వృథా. అందుకే నా ఫ్యామిలీనే కాదు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి అని ప్రార్థిస్తుంటాను. అలాగే, ప్రకృతి వైపరీత్యాలకు ప్రజలు గురికాకుండా కాపాడు స్వామి అని నమస్కరిస్తా. 2015 డిసెంబర్లో చెన్నైని వరదనీరు ముంచెత్తినపుడు ప్రజలు పడిన బాధలు చూసి ఎంతో చలించిపోయాను. అలాగే నటిగా వృత్తిపరంగా బాగా బిజీగా ఉండాలి అని కోరుకుంటాను. దైవంపై నమ్మకం అంటే ఎలా ఉండాలి ? ఈ విషయంపై ఒక చిన్న కథ చెబుతాను. ఒక పేదవాడికి దేవుడు కలలో కనపడి ఫలానా చోట తవ్వితే నీకు నిధి దొరుకుతుంది, దరిద్రం తీరుతుందని చెప్పాడు. దానిని నమ్మి అతడు భూమి తవ్వుతుండగా సైనికులు వచ్చి ఇది రాజు గారి భూమి అని చెప్పి ఆ నేరానికి రాజు ముందు నిలబెట్టగా చెట్టుకు కట్టి కొరడా దెబ్బలు కొట్టమని రాజు శిక్ష వేశాడు. శిక్షను అమలుచేస్తున్న సైనికుడికి పేదవానిపై జాలి వేసి ‘అసలు గుంట ఎందుకు తవ్వుతున్నావు?’ అని ఆడిగారు. పేదవాడు విషయం చెప్పాడు. అది విని నవ్వుకున్న సైనికుడు నాకు కూడా నిన్న రాత్రి దేవుడు కలలో కనపడి నిన్ను కట్టేసిన చెట్టులో అపార నిధి ఉంది తీసుకో అన్నాడు, అలాగని చెట్టును తొలిచానా అని వెళ్లిపోయాడు. ఆ దేవుడు సైనికుని రూపంలో మరోసారి నాకు అవకాశం ఇచ్చాడని విశ్వసించిన పేదవాడు చెట్టులోని తొర్రను వెతగ్గా నిధి దొరికింది. దరిద్రం తీరింది. దేవుడిపై నమ్మకం అంటే సైనికుడిలా ఉండ కూడదు, పేదవాడిలా ఉండాలి. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
రెండేళ్లు సహజీవనం చేసి..
విశాఖపట్నం: కడదాక తోడుంటానని మాటిచ్చి.. పెళ్లికి ముందే కాపురం పెట్టించిన యువకుడు చివరకు ఆ యువతిని మోసం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి సమీపంలోని ఉక్కుపేటకు చెందిన దర్జి వెంకట లక్ష్మీ(22) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు మూడేళ్ల క్రితం స్థానికంగా నివసించే సింహాద్రితో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. రెండేళ్ల నుంచి ఇద్దరు ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఈ దసరాకు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చిన సింహాద్రి మాటమార్చడంతో లక్ష్మీ అతనిని నిలదీసింది. దీంతో తనంటే ఇష్టం లేదని సింహాద్రి చెప్పాడు. తాను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని యువతితో అన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సింహాద్రి విద్యుత్ పునరుద్ధరణ
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్లో నిలిచిపోయిన విద్యుదుత్పత్తిని మరమ్మతుల అనంతరం బుధవారం పునరుద్ధరించారు. సోమవారం రాత్రి సాంకేతిక కారణాల వల్ల మొదటి యూనిట్లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. బాయిలర్‌లో ఏర్పడిన సమస్యల వల్ల అంతరాయం ఏర్పడింది. ఎన్టీపీసీ అధికారులు మంగళవారమంతా శ్రమించి మరమ్మతు పనులు పూర్తి చేసి బుధవారం ఉదయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని ఎన్టీపీసీ అధికార వర్గాలు తెలిపాయి. -
విద్యుదాఘాతంతో తండ్రికొడుకు దుర్మరణం
శ్రీకాకుళం జిల్లా హిర మండలం పాతకొమనాపల్లి గ్రామంలో శనివారం అర్థరాత్రి విద్యుత్ తీగలు తగిలి తండ్రీకొడుకులు బండి సింహాద్రి(50), బండి రమేష్(20) మృతిచెందారు. ఈదురుగాలిగి విద్యుత్ తీగలు తెగిపడి ఇంటి ముంగిట నిద్రిస్తున్న తండ్రికొడుకులపై పడింది. ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. బంధువులు ఆదివారం వేకువజామున శవాలను దహనం చేశారు. -
రస్నాబేబీ పెళ్లి కుదిరింది
'లాహిరి లాహిరి లాహిరి', 'సింహాద్రి', 'ధనలక్ష్మీ ఐ లవ్ యూ' లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అంకిత. సినిమాల్లో కనిపించటానికి ముందే 'ఐ లవ్ యూ రస్నా' అంటూ అందరి మనసు దోచుకున్న రస్నాబేబి తరువాత హీరోయిన్ గా కూడా తన మార్క్ చూపించింది. అయితే నటిగా కొద్ది రోజులు మాత్రమే మెరిసి మాయమైపోయింది. సినిమాలకు దూరమైన తరువాత యుఎస్ లో సెటిల్ అయిన అంకిత, సినిమాల మీద ప్రేమతో హాలీవుడ్ స్టూడియోలో ఫిలిం టెక్నాలజీ కోర్స్ చేసింది. అంతేకాదు కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్ దగ్గర దర్శకత్వ శాఖలోనూ పనిచేసింది. అయితే ఇంత కాలం మీడియాకు సైతం దూరంగా ఉన్న ఈ భామ మరోసారి వార్తల్లో కనిపించింది. సోమవారం ఉదయం ముంబైలోని జెవి మారియట్ హోటల్ లో అంకిత నిశ్చితార్థం జరిగింది. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ విశాల్ జగ్తాప్ ను త్వరలోనే వివాహమాడనుంది అంకిత. -
పంటలెండిపోతున్నా స్పందించరేం?
ఉపసభాపతి బుద్ధప్రసాద్‌ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి అవనిగడ్డ : దివిసీమలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్న పంటను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, అయినా స్థానిక ప్రజాప్రతినిధి మండలి బుద్ధప్రసాద్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో మంత్రిగా ఉన్న బుద్ధప్రసాద్ కొద్దిరోజులు సాగునీరు అందకపోతేఆందోళన చేశారని, ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారని, ఈ నీరు ఎంత వస్తుంది, ఎన్ని రోజులు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీరు అందించలేని దుస్థితిలో ఉంటే స్థానిక ప్రజాప్రతినిధిగా మౌనం వహించడం వెనుక మర్మమేమిటని అన్నారు. ఇప్పటికైనా ఉపసభాపతి బుద్ధప్రసాద్ స్పందించి దివిసీమలో సాగునీరందక చనిపోతున్న పంటను బతికించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సింహాద్రి సూచించారు. -
మోసానికి ఇదో సరికొత్త దారి..!
పంజగుట్ట: నకిలీ ఐడీప్రూఫ్‌లతో పలు ఎలక్ట్రానిక్ సంస్థల నుంచి ఖరీదైన టీవీలు వాయిదా పద్ధతిలో తీసుకుని మోసాలకు పాల్పడుతున్న నలుగురిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 65 లక్షలు విలువచేసే 9 ఎల్ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం ... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సింహాద్రి సాయికిరణ్ అలియాస్ వెంకట సాయి కిరణ్ (24) కొన్నేళ్లుగా వనస్థలిపురంలోని హైకోర్టు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి కర్మన్‌ఘాట్‌కు చెందిన ఆర్టీఏ ఏజెంట్ వి.యాదగిరి (32), కంచన్‌బాగ్ హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన ప్లంబర్ మహ్మద్ అబ్దుల్ వాసి (46), ఉప్పల్ శంకర్ నగర్‌కు చెందిన కాదరి నాగభూషణం (36) స్నేహితులు. విలాసాలకు పాల్పడిన వీరంతా డబ్బు తేలిగ్గా సంపాదించేందుకు మోసాలను వృత్తిగా ఎంచుకున్నారు. వీరు నకిలీ ఐడీప్రూఫ్‌లు తయారు చేసి నగరంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలలో వాయిదాల్లో ఖరీదైన ఎల్ఈడీ టీవీలు తీసుకునేవారు. వీరికి సదరు షోరూంలలో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లు పూర్తిగా సహకరించేవారు. అంతేకాకుండా, ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆపరేటర్‌గా పనిచేసే నరేష్‌తో పరిచయం చేసుకుని వివిధ ఐడీ ప్రూఫ్‌లు సంపాదించారు. సంపాదించిన ఐడీప్రూఫ్‌లు, నకిలీ అడ్రస్‌లతో ఖరీదైన ఎల్ఈడీలు తీసుకుంటారు. రిలయన్స్ డిజిటల్లో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు మహేష్, రాహుల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో మేనేజర్లుగా పనిచేసే వెంకటనారాయణ, హేమంత్ కుమార్, డెలివరీ చేసే ఆటోట్రాలీ డ్రై వర్లు అశోక్, ఆరోగ్యంలు వీరికి పూర్తి సహకారం అందిస్తారు. వీరు టీవీలు తీసుకోగానే బజాజ్ ఎలక్ట్రానిక్లో మేనేజర్లుగా పనిచేసే వెంకటనారాయణ, హేమంత్ కుమార్‌లు 60 శాతం పేమెంట్ ఇచ్చి తిరిగి వారే టీవీలు తీసుకుని ఇతరులకు అమ్ముకుంటున్నారు. బుధవారం ఖైరతాబాద్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాయి కిరణ్, యాదగిరి, అబ్దుల్ వాసి, నాగభూషణంలను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని విచారించగా దొంగతనాల చిట్టావిప్పారు. దీంతో వారిని అరెస్టుచేసి వారి వద్ద నుంచి వివిధ కంపెనీలకు చెందిన 9 ఎల్ఈడీ టీవీలను స్వాధీనం చేసుకుని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. వీరికి సహకరించిన సేల్స్‌మెన్, మేనేజర్లు, ఆటోట్రాలీ డ్రైై వర్లు, నకిలీ ఐడీ ఫ్రూఫ్‌లు ఇచ్చిన నరేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పూర్వ విద్యార్థే కాలయముడు
వీడిన వృద్ధదంపతుల హత్య కేసు మిస్టరీ ఒకరి అరెస్టు : ఆటో, నగలు స్వాధీనం మరో ఇద్దరి పాత్రపై అనుమానం రాజేంద్రనగర్: సాయిహర్షనగర్ కాలనీలో గురువారం రాత్రి జరిగిన వృద్ధదంపతులు సులోచన, సింహాద్రి హత్యల కేసు మిస్టరీని నార్సింగి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సులోచన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వ్యక్తే కాలయముడై ప్రాణం తీసినట్టు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆటో, నాలుగు బంగారు గాజులు, ఉంగరం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలతో మరో ఇద్దరికి సంబంధం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి ఠాణాలో శుక్రవారం సాయంత్రం సైబరాబాద్ జాయింట్ కమిషనర్ శశిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మొయినాబాద్‌కు చెందిన మహమూద్ ఫహీముద్దీన్(40) ఆటో డ్రైవర్. ఇతనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, హతురాలు సులోచన గతంలో మొయినాబాద్ ప్రాంతంలో టీచర్‌గా పని చేసింది. ఆ సమయంలో ఆమె వద్ద ఫహీముద్దీన్ చదువుకున్నాడు. తన పూర్వ విద్యార్థి కావడంతో సులోచన ఎక్కడికి వెళ్లాలన్నా ఫహీముద్దీన్‌ను పిలిపించుకొని అతని ఆటోలోనే వెళ్లేది. అతనిపై నమ్మకంతో ఇంట్లోకి రానిచ్చేది. చిన్న చిన్న పనులు కూడా సింహాద్రి దంపతులు ఫహీముద్దీన్తో చేయించుకొనేవారు. సులోచన ఇటీవల పదవీ విరమణ చేశారు. వీరింట్లో నగలుతో పాటు రిటైర్మెంట్కు సంబంధించిన డబ్బు పెద్ద మొత్తంలో ఉండవచ్చని భావించిన ఫహీముద్దీన్ వాటిని దోచుకోవాలని పథకం వేశాడు. మొదట భర్త.. ఆపై భార్య హత్య... గురువారం సాయంత్రం 5.30కి ఇంట్లోకి వచ్చిన ఫహీముద్దీని మొదట బెడ్రూమ్లో ఉన్న సింహాద్రిని గొంతు నులిమి చంపేశాడు. హతుడి చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని షర్ట్ జేబులో వేసుకున్నాడు. సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి ప్యాంట్ జేబులో వేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి జారుకొనే ప్రయత్నంలో ఉండగా... సులోచన ఇంట్లోకి వచ్చింది. అప్పటికే తలుపు పక్కకు నక్కిన ఫహీముద్దీన్ వెనుకనుంచి ఆమె గొంతు నొక్కి..బెడ్రూమ్లోకి తీసుకెళ్లి చంపేశాడు. చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు, మంగళసూత్రాన్ని తీసుకున్నాడు. ఆమె సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి జేబులో వేసుకున్నాడు. అక్కడి నుంచి తన ఆటోలో నేరుగా లంగర్‌హౌస్ ప్రతాప్ థియేటర్ పక్కన ఆటోస్టాండ్‌కు వచ్చి ఆటోను పార్క్ చేశాడు. పుస్తెలతాడు, గాజులు, రెండు సెల్ఫోన్లను ఆటో డిక్కీలో వేసి తాళం వేశాడు. సింహాద్రి ఉంగరాన్ని మాత్రం తన షర్ట్ జేబులోనే ఉంచుకున్నాడు. ఆటో స్టాండ్ నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడు. సెల్‌ఫోన్ ఆధారంగా ... సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. బెడ్‌పై ఓ సెల్‌ఫోన్ దొరికింది. హత్య చేస్తున్న సందర్భంలో జరిగిన పెనుగులాటలో ఇది బెడ్‌పై పడింది. దాని ఆధారంగా ఫహీముద్దీన్‌ను పోలీసులు నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. అతని సెల్‌ఫోన్ ఔట్‌గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్‌పై కూడా దృష్టి పెట్టారు. నిందితుడు కొందరితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. వారి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.ఇతనికి మరెవెరైనా సహకరించారా అనే కోణంతో పాటు బంధువుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫహీముద్దీన్‌ను మాత్రమే అరెస్టు చేశామని, మరో ఇద్దరికి సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నామని సైబరాబాద్ జాయింట్ పోలీస్‌కమిషనర్ శశిధర్‌రెడ్డి వెల్లడించారు. నిందితుడిపై మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ఠాణాలో సెక్షన్ 324 కింద కేసు నమోదై ఉందని పోలీసులు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీపీ ముత్యంరెడ్డి, నార్సింగి సీఐ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించినందుకు సిబ్బందిని జాయింట్ కమిషనర్ అభినందించారు.