
పొలంలో పడిఉన్న ఒమ్మి సోములు, నారాయణమ్మ మృత దేహాలు
సాక్షి, విజయనగరం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదం కారణంగా భార్యభర్తలిద్దరిని గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన మక్కువ మండలం చెముడు పంచాయతీ పాలకవలసలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలికవలస గ్రామానికి చెందిన దంపతులు ఒమ్మి సోములు, నారాయణమ్మలను అదే గ్రామానికి చెందిన సింహాద్రి అనే వ్యక్తి గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. పొలంలో పడివున్న మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. భూ వివాదం కారణంగానే సింహాద్రి ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచానా వేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment