land dispute
-
జనసేన ఎమ్మెల్యే నాయకర్ రౌడీయిజం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పేట్రేగి పోతున్నారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజానికి దిగారు. భీమవరంలో కోర్టు వివాదంలో ఉన్న ఓ ప్రైవేట్ స్థలంలో దాదా గిరి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో యజమానులను బెదిరించారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజంతో భయాందోళనకు గురైన బాధితుల్ని పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అనుచరులే కాదు.. గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు. -
సైబరాబాద్ అధికారి‘అదనపు’ విధులు!
సాక్షి, సిటీబ్యూరో: పోలీసులు.. సాధారణంగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్నీ నిర్లక్ష్యం చేస్తారనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. న్యాయస్థానాలతో పాటు ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపైనే పలువురిపై చర్యలు తీసుకుంటూ ఉంటాయి. కొందరు ఖాకీలకు ఇదంతా డ్యూటీల దగ్గర మాత్రమే... ‘వాటా’ల వద్దకు వచ్చేసరికి మాత్రం తమవి కాని విధుల్నీ నిర్వర్తించేస్తుంటారు. భూ కబ్జాదారులతో కుమ్మక్కై ఇతర శాఖల అధికారులతో కలిసి ‘ప్లాన్’ చేస్తూ భూ యజమానుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఓ వ్యవహారమే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతోంది. హైటెక్ జోన్ కేంద్రంగా ఓ ఉన్నతాధికారి నిర్వర్తిస్తున్న ‘అదనపు’ విధులకు బల్దియా అధికారి సైతం సహకరిస్తుండటం గమనార్హం. భూ విలువలు పెరగడంతో కుట్రలు.. నగర వ్యాప్తంగా భూములు విలువలు గణనీయంగా పెరిగిపోవడం కొత్త వివాదాలకు కారణం అవుతోంది. ఖాళీ జాగాలకు కొత్త యజమానులు పుట్టుకువస్తున్నారు. మదీనాగూడ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం కూడా అలాంటిదే. నగరానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతంలోని రెండు సర్వే నంబర్లలో ఉన్న స్థలం ఖరీదు చేశారు. మొత్తం వెయ్యి చదరపు గజాలకు పైగా ఉన్న ఈ స్థలంలో చాలా భాగం విక్రయించారు. మిగిలిన 300 గజాల్లో నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిపై కన్నేసిన పాత యజమాని సంబం«దీకులు కొందరు వివాదం చేయడం మొదలెట్టారు. రేటు ఆకాశాన్ని అంటడంతో ఏమాత్రం అవకాశం చిక్కినా చట్టపరంగా ఆ భూమిని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. ఈ స్థలంపై యాజమాన్యం హక్కు కోసం, ఆపై టెనెంట్ కేసుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానికోసం కొన్ని నోటరీ పత్రాలను సమరి్పంచారు. ఖాళీ స్థలాలకు కేవలం ప్లాట్ నంబర్లు మాత్రమే ఉంటాయి. వివాదం చేయాలని భావించిన వాళ్లు ఏకంగా డోర్ నంబర్ వేసుకుని మరీ పత్రాలు రూపొందించారు. దీంతో న్యాయస్థానం వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ భూమి ఎవరి పేరుతో ఉందో ఆ మహిళకే కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ సైతం ఇచి్చంది. దీని ఆధారంగా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్న భూ యజమాని నిర్మాణం కోసం అనుమతి కూడా తెచ్చుకున్నారు. ఈమెను ఇబ్బంది పెట్టడం ద్వారా లబి్ధ పొందాలని ప్రయతి్నంచిన కబ్జారాయుళ్లు దీనికోసం కొత్త పథకం వేశారు. ఒత్తిడికి యత్నించి.. సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోని ఓ కీలక జోన్లో పని చేస్తున్న ఉన్నతాధికారిని సంప్రదించాడు. ఇద్దరి మధ్యా జరిగిన ‘ఒప్పందం’తో రంగంలోకి దిగిన అధికారి తొలుత పోలీసులను వాడి భూ యజమానికిపై ఒత్తిడికి ప్రయతి్నంచారు. ఇది ఫలితం ఇవ్వకపోవడంతో కథ మార్చారు. బల్దియాకు చెందని మరో ఉన్నతాధికారితో కలిసి ‘ప్లాన్’ చేశాడు. వీలైనంత త్వరగా ఆ పోలీసు, బల్దియా అధికారులకు కలిసి సెటిల్ చేసుకుంటే ఉత్తమం అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో విసిగిపోయిన ఆ యజమాని న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. -
సాక్షి కథనంపై కూటమి కుట్రలు పోలీసులే కిడ్నాపర్లు!
-
పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎవరైనా కిడ్నాప్ చేస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. మరి పోలీసులే కిడ్నాప్ చేస్తే. ఎవరిని ఆశ్రయించాలి. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ తీరును, ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేసే ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. భూవివాదాన్ని కోర్టులతో పనిలేకుండా సెటిల్ చేసుకోవాలంటూ ఓ ఉపాధ్యాయుడిని కర్నూలు పోలీసులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి వరకూ బెదిరించి మరీ అతడిని ఇంటికి పంపారు. కిడ్నాపైన ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, అతని భార్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునీర్ అహ్మద్ కర్నూలు వాసి. వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మునీర్ శనివారం స్కూల్లో పాఠాలు చెబుతుండగా.. ఇద్దరు పోలీసులు మఫ్టీలో వచ్చి సీఐ రమ్మంటున్నారని చెప్పారు. హెడ్మాస్టర్కు చెప్పి వస్తానన్నా వినకుండా సెల్‌ఫోన్ లాగేసుకుని అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే.. వెల్దుర్తి స్టేషన్ అని ఒకసారి, డీఐజీ ఆఫీసుకు అని ఇంకోసారి చెప్పి చివరకు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ‘ఏంటి గన్‌తో కాల్చి చంపేస్తారా’ అని గట్టిగా కేకలు వేయగా పోలీసులు అతడి నోరుమూసేశారు. అక్కడ ఓ గదిలో అప్పటికే కొంతమంది వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అప్పటికే అతని సోదరుడు మక్బూల్‌ను కూడా అక్కడికి తీసుకొచ్చారు. అక్కడే మునీర్‌ను ఉంచారు. పక్కన ఉన్న వారిని కొడుతున్న దెబ్బలకు మునీర్ బెదిరిపోయాడు. రాత్రి 11 గంటల తర్వాత సీఐ శేషయ్య వచ్చి భూవివాదం గురించి మాట్లాడి పంపించేశారు. కిడ్నాప్ నేపథ్యంలో మునీర్‌ను ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడి తీసుకెళ్లారో అర్థంకాక అతడి సతీమణి రెహానాబేగం, పాఠశాల హెడ్మాస్టర్ మల్లయ్య వెల్దుర్తి, కర్నూలు త్రీటౌన్ పోలీసుల చుట్టూ తిరిగారు. ఎవరూ స్పందించలేదు. తన భర్త కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు తీసుకోలేదు.అసలు కారణం ఇదీమునీర్ అహ్మద్ కుటుంబానికి కర్నూలు కేంద్రీయ విద్యాలయం సమీపంలో భూమి ఉంది. అన్నదమ్ములు భాగపరిష్కారాలు చేసుకున్న తర్వాత సర్వే నంబర్ 649/2ఏలో 1.17 ఎకరాలు మునీర్ అధీనంలో ఉంది. 1910 నుంచి రికార్డులు ఆ కుటుంబం పేరిటే ఉన్నాయి. 2016లో ధనుంజయ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోనే 6 ఎకరాలు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన సర్వే నంబర్లలోనే మునీర్ అహ్మద్ 1.17 ఎకరాలు కూడా ఉన్నాయని ధనుంజయ్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మునీర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో ధనుంజయ్ అప్పీల్ చేశాడు. ఈ క్రమంలో కోడుమూరు టీడీపీ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మనీశ్ అనే వ్యక్తి కలిసి వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ మునీర్‌ను బెదిరించారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మునీర్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. సెప్టెంబర్‌లో ధనుంజయ్, అతడి తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డిని పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పారు. ఆపై సీఐ మురళీధర్‌రెడ్డి అక్టోబర్ 30న పిలిపించి డీఐజీ, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సెటిల్ చేసుకోవాలని మునీర్‌కు, అతని సోదరుడు మక్బూల్‌కు చెప్పారు. ఆ తర్వాత సీఐ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో మునీర్, మక్బూల్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. ‘భూ వివాదం తెంచుకోవాలి. ఇక్కడ లా ముఖ్యం కాదు. ఇప్పటికే 9 ఏళ్లయింది. మరో పదేళ్లయినా కోర్టులో తెగదు. ఆలోచించుకోండి. ఒక రేటు మాట్లాడుకుని వదిలేయండి. మా సీఐ మీ వాళ్లతో మాట్లాడతారు’ అని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగి వచ్చేశారు. శనివారం పోలీసులు వెళ్లి మునీర్‌ను కిడ్నాప్ చేసి, అర్ధరాత్రి తిరిగి పంపించారు.నన్ను చంపేస్తారునన్ను తీసుకెళ్లిన పోలీసులు గన్‌తో కాల్చి చంపేస్తారని భయపడ్డా. భూ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకూ ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్ రేటు కంటే 30 శాతం తక్కువ ఇచ్చినా వదిలేస్తా. కానీ.. వారు ఇచ్చిందే తీసుకోవాలనేలా మాట్లాడుతున్నారు. మా భూమి మేమెందుకు వదిలేయాలి. నాకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. పోలీసుల తీరు, ధనుంజయ్ తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డి బెదిరింపులు చూస్తే కచ్చితంగా నా కుటుంబాన్ని చంపేస్తారనే భయం కలుగుతోంది. నన్ను చంపినా ఫర్వాలేదు. నా భార్య, బిడ్డలైనా బతికితే చాలు. నేను ముస్లిం కాబట్టే బెదిరిస్తున్నారా అనిపిస్తోంది. – మునీర్ అహ్మద్ -
ఏలూరు జిల్లా గన్నవరంలో తల్లి, కొడుకు దారుణ హత్య
-
కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు..!
నేను ఇటీవలే హైదరాబాద్ శివార్లలో కొంతకాలం కొన్నాను. కొనేముందు అమ్మకందార్లు మాకు హద్దురాళ్ళు కూడా చూపించారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళకి మా హద్దుల ప్రకారం ఫెన్సింగ్ వేసుకుందాము అని వెళ్ళగా, మాకు భూమి అమ్మినవారు – మాకు దక్షిణాన ఉన్నవారు కూడా మా భూమి హద్దులు అవి కాదు అని, దాదాపు 10 గుంటల భూమి నష్టపోయేలా హద్దులు చూపిస్తున్నారు. అది మాత్రం కాదు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం. కోర్టుకు వెళ్తే కేసులు పరిష్కారం అయ్యేసరికి చాలాకాలం పడుతుంది. అంతవరకూ మా భూమిలో మేము ఏమీ చేసుకోలేము అంటున్నారు. దయచేసి మా సమస్యకు ఒక పరిష్కారం చూపగలరు.– జి. రామ్మోహన్, కందుకూరుభూమిని కొనేటప్పుడు హద్దులు సరిగా చూసుకుని, వీలైతే హద్దురాళ్ళు పాతుకుని, పక్కన ఉన్న భూమి యజమానులను కూడా సంప్రదించి కొంటే, ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఏదేమైనా, మీరు ప్రభుత్వానికి సరైన స్టాంప్ డ్యూటీ కట్టి, చట్టప్రకారం రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఏదైనా ‘మీ సేవా’ కేంద్రానికి వెళ్లి, ‘ఎఫ్–లైన్’ అప్లికేషన్/దరఖాస్తు చెయ్యండి. ప్రభుత్వ నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు అయితే 45 రోజుల లోగా రెవిన్యూ అధికారులు మీ భూమిని సర్వేచేసి, హద్దులు చూపిస్తారు. అలా చేయని పక్షంలో, పైఅధికార్లకు, ఆర్.డీ.ఓ కి ఫిర్యాదు/దరఖాస్తు పత్రం ఇవ్వండి. అప్పటికీ చేయకపోతే మీరు సర్వే కోసం హై కోర్టును ఆశ్రయించవచ్చు. సర్వే అనంతరం కూడా ఏమైనా సమస్య వుంటే, సివిల్ కోర్టులో వ్యాజ్యం ద్వారా మీ భూమిలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఆర్డరు పొందవచ్చు.సివిల్ కోర్టులో కేసులు ఆలస్యం అవుతాయి అనేమాట కొంతవరకూ నిజమే. కానీ త్వరితగతిన మీ కేసు పరిష్కరించటానికి చట్టపరమైన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కేసు నడిచినంతవరకు మీ భూమిలో మీరు ఏమీ చేసుకోలేరు అన్నది అవాస్తవం. హద్దుల సమస్య ఉన్నంత భూమి వరకు మీ పక్కవారు రానివ్వరు. మిగతా భూమిలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. పూర్తిగా కేసు పరిష్కారం అయ్యేలోపు మధ్యంతర ఉత్తర్వులు పొంది, మీ హక్కుని మీరు కాపాడుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది అని కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు కాబట్టి జాగ్రత్త! చట్టపరమైన చర్యలలో మాత్రమే పరిష్కారాలు పొందాలి. అప్పుడే శాశ్వత పరిష్కారాలు అందుతాయి. అలా కాదని అనుకుంటే ముందు ముందు సమస్యలు మరింత జటిలం కావచ్చు!– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిన్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!) -
దాడికి భూ వివాదమే మూలం
లక్డీకాపూల్ (హైదరాబాద్): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి దాడి ఘటనకు భూ వివాదమే కారణమని తాము భావిస్తున్నట్లు మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చెంచుల పునరావాసం కోసం కేటాయించిన భూములపై కన్నేసిన కొందరు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారన్నారు. బుధవారం మంత్రి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను పరమర్శించారు. బాధితు రాలితో మాట్లాడి దాడి ఘటన వివరాలు తెలుసుకు న్నారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్న మంత్రి.. నిందితులకు కఠి న శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో భూములు అమ్ముకున్న భూ యాజమానులకు ధరణి తర్వాత తిరిగి పాస్ పుస్తకాలు రావడంతో చెంచులపై దాడులు చేస్తున్నారన్నారు. ఆ భూముల విలువ పెరగడంతో.. వాటిని లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పోలీసులు కఠినంగా వ్యవహ రించాలన్నారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అధికారులు బాధి తురాలికి అండగా నిలిచారన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బాధితు రాలి మామయ్య నాగయ్య మృతిపై అనుమా నాలు న్నందున ఆ కేసును పునఃవిచారణ చేయాల న్నారు. చెంచులకు అండగా ఉంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి తాత్కాలికంగా రూ.25 వేలు అందజే శామన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, నాగ ర్ కర్నూల్ ఐటీడీఓ రోహిత్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మంత్రి సీతక్కతో పాటు ఈశ్వరమ్మను పరామర్శించిన వారిలోప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య తదితరులున్నారు. -
పొలం కోసం కొట్టి.. చంపేశారు!
రెండెకరాల పొలం కోసం రక్తసంబంధీకుడిపైనే కర్ర లతో విరుచుకుపడ్డారు. కన్నవాళ్లు కాళ్లా.. వేళ్లా పడ్డా కనికరించలేదు.. కన్నూ.. మిన్నూ కానక.. ఎక్కడపడితే అక్కడ పది మందికిపైగా మూకుమ్మడిగా విచక్షణారహితంగా దాడి చేయడంతో చెవులు, నోట్లో నుంచి రక్తం కారి.. నిస్సహాయ స్థితిలో స్పృహ కోల్పోవడంతో వదిలేశారు. చివరికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయువు కోల్పోయాడు.మక్తల్/ ఊట్కూర్/నారాయణపేట: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రెండెకరాల భూమి కోసం.. ఒక్కడిని చేసి దాయాదులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నపొర్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు భార్యలు బాలమ్మ, తిప్పమ్మ. వీరు గతంలోనే మృతి చెందారు. మొదటి భార్య బాలమ్మకు ఒక కొడుకు గువ్వల ఎర్రగండ్ల సంజప్ప కాగా.. రెండో భార్య తిప్పమ్మకు ఇద్దరు కుమారులు పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప.లక్ష్మణ్‌కు 9 ఎకరాల భూమి ఉండగా.. మూడు భాగాలుగా విభజించి ముగ్గురు కుమారులపై మూడు ఎకరాల చొప్పున పట్టా చేయించారు. దీనిపై కొంత కాలంగా మొదటి భార్య కుమారుడు ఎర్రగండ్ల సంజప్ప.. తొమ్మిది ఎకరాలను ఇద్దరి భార్యల పిల్లలకు రెండు భాగాలుగా విభజించి.. నాలుగున్నర ఎకరాల చొప్పున భాగ పరిష్కారం చేయాలని వాదిస్తూ వస్తున్నాడు. ఆ లెక్కన తనకు నాలుగున్నర ఎకరాలు, రెండో భార్య ఇద్దరు కుమారులకు కలిపి నాలుగున్నర ఎకరాలు దక్కాలని వాదిస్తూ వచ్చిన ఎర్రగండ్ల సంజప్ప ఆమధ్యన మృతిచెందాడు. అప్పటి నుంచి సమస్య పరిష్కారం కాకుండా పోయింది. విత్తనాలు చల్లేందుకు రాగా.. ఈ క్రమంలోనే భూ సమస్య ఉందని 20 రోజుల క్రితం ఇరు వర్గాల వారు ఊట్కూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. రెండు రోజు ల క్రితం విత్తనాలు వేసుకుంటామని పెద్ద సవార ప్ప, చిన్న సవారప్ప మక్తల్ సీఐ, ఊట్కూర్ ఎస్ఐలను అడగగా.. ఎవరి పేరు మీద పట్టా ఉంటే వారు వేసుకోండని సూచించారు. దీంతో గురువారం సాయంత్రం పొలంలో విత్తనాలు వేసేందుకు పెద్ద సవారప్ప, ఆయన కుమారుడు సంజీవ్(28), చిన్న సవారప్ప కలిసి ట్రాక్టర్ తీసుకువెళ్లారు.ఈ విషయం తెలు సుకున్న ఎర్రగండ్ల సంజప్ప కుమారులు గుట్టప్ప, ఆటో సంజప్ప, కుటుంబసభ్యులు గువ్వల శేఖర్, పెద్ద సంజప్ప, చిన్న సంజప్ప, ఆశప్ప, మారుతి, పెద్ద సవారప్ప, కిష్టప్ప, శ్రీను, రేణుక, సుజాత, బుజ్జమ్మ, అర్చన, అంజమ్మ, మౌనిక, వెంకటమ్మ, లక్ష్మి పొలం దగ్గరికి వచ్చారు. విత్తనాలు ఎందుకు వేస్తున్నావని సంజీవ్‌ను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే సంజీవ్‌పై అవతలి వర్గం వారు కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న గువ్వల ఎర్రగండ్ల సంజప్ప చిన్నమ్మ కవిత మనుమడిని కొట్టొద్దని కాళ్లపై పడినా పట్టించుకోలేదు. వెంటనే తమకు పరిచయం ఉన్న పెద్దజట్రం గ్రామ ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌కు సమాచారం అందించగా.. ఆయన ఊట్కూర్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచి్చనట్లు తెలుస్తోంది. ‘100’కి డయల్ చేసినా స్పందించలే.. చిన్నపొర్లలో పొలం దగ్గర ఘర్షణ జరుగుతుందని సమీపంలోని వారు డయల్ 100కు సమాచారం ఇచి్చనా, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా సంజీవ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ఆలస్యంగా వచ్చింది. అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సంజీవ్‌కు భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో ఉద్రిక్తత హత్య ఘటన దరిమిలా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మక్తల్, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ పోలీసులు అక్కడికి చేరుకొని పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై బంధువు కవిత పోలీసులకు ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఊట్కూర్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం సంజీవ్ మృతదేహం గ్రామానికి తీసుకురాగా, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సంజీవ్ మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తూ ఎస్ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ జి.సుధీర్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై ఫిర్యాదు అందినా తక్షణ మే స్పందించకుండా తీవ్ర నిర్లక్ష్యం, దురుసుగా ప్రవర్తించినట్లు ఐజీపీ దృష్టికి వచి్చనట్టు ఉత్తుర్వుల్లో పేర్కొన్నట్టు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. నలుగురి అరెస్టు.. ముగ్గురు పరారీలో ఊట్కూరు ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు కాగా శుక్రవారం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ4 చిన్న సంజప్ప, ఏ5 గుడి ఆశప్ప, ఏ6 గువ్వల శ్రీను, ఏ7 గువ్వల కిష్టప్పను అరెస్టు చేసినట్లు ఐజీపీ సు«దీర్‌బాబు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. -
ఘోరం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ఆ నలుగురు!
యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే! హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య-భర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరుకు.. ప్రాణ స్నేహితులను కూడా విడగొడ్తాను అందట. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా జరిగిన ఘటన అది నిజమేనని నిరూపించింది. అయినవాళ్లే వేధిస్తుండడంతో తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. అతనికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆ అయినవాళ్లే అడ్డుకోవడంతో మూడు రోజులుగా ఆ మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి(48) హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ... అక్కడే అద్దె ఇంట్లో ఉండేవారు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్‌మాస్టర్‌గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి... మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.ఈలోపు తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తమ్ముడు కరుణాకర్‌రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పక్కింట్లో ఉన్న వారు చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగు చూసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు... ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు. ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు భీష్మించారు. ఆది, సోమ వారాల్లో అతడి సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు వారు ఒప్పుకొన్నా.. సోమవారం కోర్టు సమయం మించిపోవడంతో వీలు కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్
హైదరాబాద్, సాక్షి: సుచిత్రం భూవివాదంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు, తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి వాదిస్తుండగా, మరోవైపు ఆ భూమి తమ 15 మందిదేనని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్ అడ్లూరి లక్ష్మణ్ వాదిస్తున్నారు.సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కోసం వివాదం కొనసాగుతోంది. తమ అనుచరులతో మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఆ స్థలంలో పాతిన ఫెన్సింగ్, బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఇంకోవైపు అక్కడికి చేరుకున్న 15 మంది ఆ స్థలం తమదేనని వాదించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పబోయిన పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ పీఎస్‌కు తరలించారు. పోలీసుల జోక్యంతో.. రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో సర్వే చేపట్టారు. తాజాగా వివాదాస్పద భూమిపై సర్వే పూర్తైంది. యితే పోలీసులకు సర్వే రిపోర్ట్ ఇస్తారని భావించగా.. బదులుగా కలెక్టర్‌కు రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించబోతున్నారని తెలుస్తోంది. దీంతో స్థల వివాదానికి ఎలాంటి ముగింపు దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. -
BJP MLA: ‘కాల్చినందుకు పశ్చాత్తాపం లేదు’
ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన చెందిన నేతపై బీజేపీ చెందిన ఎమ్మెల్యేపై జరిపిన కాల్పులు శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. భూవివాదం నేపథ్యంలో షిండే వర్గం శివసేన ముంబై చీఫ్ మహేష్ గైక్వాడ్, మరోనేత రాహుల్ పాటిల్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ కాల్పలు జరిపారు. ఈ ఘటన హిల్ పోలీసు స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వార్లీ గ్రామంలోని భూవివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గణపతి గైక్వాడ్ కొడుకు వైభవ్ గైక్వాడ్ పోలీసు స్టేషణ్‌కు తన అనుచరులను తీసుకొని వచ్చారు. అదే సమయంలో మహేష్ గైక్వాడ్ సైతం తన కార్యకర్తలను తీసుకొని పోలీసు స్టేషన్‌కు వచ్చారు. కొంత సమయానికి గణపతి కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ జగ్తాప్.. ఇద్దరు నేతలను కూర్చోబెట్టి మాట్లాడుతున్న క్రమంలో స్టేషన్ వెలుపల ఇరు వర్గాల అనుచరులు ఆందోళకు దిగారు. దీంతో వారిని కంట్రోల్ చేయడానికి ఇన్స్పెక్టర్ అనిల్ జగ్తాప్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో గణపతి గైక్వాడ్ .. మహేష్ గైక్వాడ్, మరో నేత రాహుల్ పాటిల్‌పై తుపాకితో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో మహేష్ గైక్వాడ్, రాహుల్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపే క్రమంలో గణపతి గైక్వాడ్ చేతికి గాయం అయింది. గాయపడిన మహేష్ గైక్వాడ్, రాహుల్‌ను థానేలోని ఆస్పత్రికి తరలించారు. మహేష్ గైక్వాడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైవ్వాడ్తో పాటు మరో ఇద్దని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహేష్ గైక్వాడ్.. కళ్యాణ్ లోక్‌సభ ఎంపీ, ఏక్ నాథ్ షిండే కుమారు డా. శ్రీకాంత్ షిండే సన్నిహితుడు కాగా.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన గణపతి గైక్వాడ్ చాలా సన్నిహితుడు గమనార్హం. సంకీర్ణ ప్రభుత్వంలోని ఇరుపార్టీల నేతల మధ్య జరిగిన కాల్పుల ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు పశ్చాత్తాపం లేదు: గణపతి గైక్వాడ్ ఆత్మరక్షణ కోసమే షిండే వర్గం శివసేన నేతపై కాల్పులు జరిపానని తెలిపారు. తన కొడుకుపై పోలీసు స్టేషన్లో మహేష్ గైక్వాడ్, అతని అనుచరులు దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అందుకే వారి నుంచి తన కొడుకును కాపాడే క్రమంలో కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల ఘటనపై తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. నిన్న (శుక్రవారం) రోజు పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గణపతి గైక్వాడ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై ఆయనను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే -
ఆస్తిలో వాటా ఇవ్వలేదని వెంటాడి మరీ యువకుడి ప్రాణం తీసిన బాబాయ్
ఇచ్చోడ: భూవివాదంలో సొంత బాబాయ్ తన కుమారుడితో కలిసి యువకుడిని హత్య చేసిన సంఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. మూడెళ్లుగా అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న భూ వివాదమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని సాథ్‌నంబర్ గ్రామానికి చెందిన వానోలే కేదోబ, పాండురంగ్‌లు అన్నదమ్ములు. కేదోబ ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా పనిచేసి నాలుగేళ్ల కిందట పదవీ విరమణ పొందాడు. పాండురంగ్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ రెండు నెలల కిందట గుండెపోటు రావడంతో ఫిట్నెస్ లేక డ్యూటీకి వెళ్లడం లేదు. ఇద్దరు అన్నదమ్ములకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి సాథ్‌నంబర్‌లోని జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఈ భూమి తల్లి పేరు మీద పట్టా ఉంది. కానీ గత సంవత్సరం కిందట పాండురంగ్‌కు తెలియకుండానే కేదోబ కుమారుడు ఈశ్వర్ (29) తన తండ్రి కేదోబ పేరిట ఎకరం, కేదోబ చెల్లెలు పేరిట మరో ఎకరం, తన పేరిటా ఎకరం ఇలా నాలుగు ఎకరాల భూమిని విరాసత్ ద్వారా పట్టాలు చేసుకున్నాడు. వారసత్వంగా వచ్చే భూమిలో వాటా ఇవ్వకుండా పట్టా చేసుకోవడంపై ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ప్రారంభమైంది. ప్రస్తుతం భూ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ విషయంపై చాలసార్లు కుల పెద్దల మధ్య పంచాయితీ కూడా నిర్వహించారు. నెలరోజుల క్రితం ఈశ్వర్ తన తండ్రి కేదోబ పేర్ల మీద ఉన్న భూమిని కోటి రూపాయలకు విక్రయించినట్లు ప్రచారంలో ఉంది. తన వాటా దక్కకుండా భూ వివాదం కోర్టులో ఉండగా విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పాండురంగ్ ఈశ్వర్‌పై పగా పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో పాండురంగ్ తన కుమారుడు సూర్యకాంత్‌ను తీసుకొని సాథ్‌నంబర్ నుంచి ఇచ్చోడలోని సిరిచెల్మ చౌరస్తాలో ఈశ్వర్ కోసం కాపు కాశాడు. టీచర్స్‌కాలనీలో నివాసముండే ఈశ్వర్ ఉదయం 9గంటల ప్రాంతంలో ఇంటి నుంచి నడుచుకుంటూ సిరిచెల్మ చౌరస్తాలో పాన్‌టేలకు వెళ్లాడు. అక్కడ సమీపంలోని పాండురంగ్, సూర్యకాంత్‌లు ఈశ్వర్‌పై దాడికి ప్రయత్నించారు. దీంతో ఈశ్వర్ తప్పించుకునే క్రమంలో సిరిచెల్మ రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. పాండురంగ్, సూర్యకాంత్ వెంబడించి సాయిసామత్ ప్రైవేట్ కళాశాల ఎదుట ఈశ్వర్‌ను పట్టుకొని గొడ్డలితో నరికి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్సై నరేష్ తెలిపారు. -
భూమి కోసం కర్రలతో పరస్పర దాడులు.. వీడియో వైరల్!
జడ్చర్ల: మండలంలోని బూరెడ్డిపల్లి శివారులో బుధవారం భూ వివాదం చేసుకొని ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. 44వ నంబర్ జాతీయ రహదారికి దగ్గరగా దాదాపు 6 గుంటల భూమికి సంబంధించి వివాదం నెలకొంది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకవర్గం.. బూరెడ్డిపల్లికి చెందిన మరోవర్గం కొంతకాలంగా ఈ భూమి తమదంటే తమదంటూ ఘర్షణ పడుతున్నారు. ఇటీవల ఇక్కడ ఓ వర్గానికి చెందిన బైక్ కూడా దగ్ధమైంది. బుధవారం ఇదే భూమి హద్దురాళ్ల విషయమై ఘర్షణ తలెత్తి ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. బూరెడ్డిపల్లికి చెందిన చందు, సత్తయ్య తదితరులు గాయపడ్డారు. అయితే దాడికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. -
షాహీ ఈద్గా మసీదు సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
లక్నో: కృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ ఈద్గా మసీదు సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు -
భూవివాదంలో ఘోరానికి పాల్పడ్డ అన్న
క్రైమ్: అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఘోరానికి దారి తీసింది. వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని.. కోపంలో కసి తీరా ట్రాక్టర్‌తో తొక్కి చంపాడు ఓ వ్యక్తి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ ఘోరం జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. బహదూర్ సింగ్, అతర్ సింగ్ అన్నదమ్ములు. చాలా కాలంగా భరత్‌పూర్‌లోని ఉన్న కాస్త భూమి కోసం కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం బహదూర్ కుటుంబం వివాదాస్పద స్థలంలోకి ట్రాక్టర్‌తో వచ్చింది. ఆ విషయం తెలిసి కాసేపటికే అతర్ సింగ్ కుటుంబం అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో రెండు కుటుంబాలు కర్రలతో పరస్పర దాడులకు దిగాయి. ఈ క్రమంలో అతార్ సింగ్ కొడుకు నిర్పత్ కిందపడిపోగా.. అది గమనించిన బహదూర్ కొడుకు దామోదర్ ట్రాక్టర్‌ను నిర్పత్ మీదుగా పోనిచ్చాడు. నిర్పత్ వరుసకు దామోదర్‌కు తమ్ముడు అవుతాడు. తమ్ముడిని ఏం చేయొద్దని అక్కడున్న కుటుంబ సభ్యులు బతిమాలుతున్నా.. దామోదర్ వెనక్కి తగ్గలేదు. నిర్పత్ మీద నుంచి ముందుకు వెనక్కి ట్రాక్టర్‌ను ఎక్కించి తొక్కించాడు. చనిపోయాడని నిర్ధారించుకునేదాకా దామోదర్ ఆ ఘోరాన్ని ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. వీడియో కోసం క్లిక్ చేయండి ఈ ఘర్షణలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల క్రితమే ఈ రెండు కుటుంబాలు గొడవ పడ్డాయని.. ఆ ఘర్షణలో బహదూర్ సింగ్, ఆయన కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనకు సంబంధించి అతర్ సింగ్ తో పాటు నిర్పత్‌పైనా కేసు నమోదు అయ్యింది. తుపాకీ మోత వినిపించిందని స్థానికులు చెబుతున్నప్పటికీ.. పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు. మరోవైపు ఈ ఘటన రాజకీయ విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రియాంక గాంధీని ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి భూకబ్జా?.. కోకాపేట భూమి నా సొంతం
అలంపూర్: హైదరాబాద్‌లోని కోకాపేట భూ వివాదంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్పందించారు. కోకాపేటలో ఉన్న భూమి భూమి తన సొంతం అని తెలిపారు. మంగళవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక టూరిజం హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి భూకబ్జా చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయన్నారు. కోకాపేటలోని సర్వే నం.85లో 2.30 ఎకరాల భూమి 2013 సంవత్సరంలో కొనుగోలు చేశామన్నారు. తమ కుటుంబంలోని ముగ్గురు పేరిట ఉన్న ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. తాము కొనుగోలు చేసిన తర్వాతే గోల్డ్ ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో భూమి అభివృద్ధి చేయడానికి అగ్రిమెంట్ సంతకం చేసినట్లు వివరించారు. అయితే సదరు సంస్థ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతోపాటు అందుకు సంబంధించి కనీసం జీహెచ్ఎంసీని ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతోనే అగ్రిమెంట్ రద్దు చేయాలని 2020లో కోర్టుకు వెళ్లామన్నారు. తమ స్థలంలో ఉన్న కూలీలను వెళ్లగొట్టినట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని, ఈ స్థలానికి పక్క సైట్లో పనులు జరుగుతుండటంతో కూలీలు అక్కడ ఉన్నారన్నారు. పక్క సైట్లో పనులు జరుగుతుండటంతో హద్దులు చూసుకోవాలని తన తమ్ముడిని పంపించానని చెప్పారు. భూమికి ఫెన్సింగ్ వేస్తుంటే గోల్డ్ ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు. గోల్డ్‌ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేపై గత 15 ఏళ్లలో 12 క్రిమినల్, 9 సివిల్ కేసులు నమోదయ్యాయని, 2021 ఫిబ్రవరి 25న పీడీ యాక్టు సైతం నమోదవగా.. అదే సంవత్సరంలో తెలంగాణ పోలీసులు అతన్ని కేరళలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న సర్వే నం.85కు పక్కనే ఈ సంస్థ డెవలప్ చేస్తున్న స్థలంలో రెండు ఇళ్లు కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులు చెల్లించి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపించారు. దీనిపై కూడా కోర్టుకు వెళ్లామని చెప్పారు. హీరో ప్రభాస్ బంధువు సత్యనారాయణరాజు ఒక ఇల్లు, సంజయ్ కమతం అనే వ్యక్తి రెండు ఇళ్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లారన్నారు. 2017లో తన తమ్ముడు వాళ్ల నాన్న కలిసి రెండు విల్లాలకు అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ తెచ్చుకున్నారన్నారు. ఎంతో మంది దగ్గర భూములు డెవలప్మెంట్ చేస్తామని తీసుకొని తర్వాత చీటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. నేను కోర్టుకు వెళ్లడంతో హైదరబాద్‌కు చెందిన ఒక ఎమ్మెల్యేతో కలిసి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వద్దకు మధ్యవర్తిత్వం కోసం వెళ్లారన్నారు. కానీ, హర్షవర్ధన్‌రెడ్డి అదే చంద్రశేఖర్ వేగేకు 2016లో ఇల్లు కొనడానికి డబ్బులు ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఇల్లు, డబ్బులు ఇవ్వలేదని, కాబట్టి మధ్యవర్తిగా రాలేనని ఆయన చెప్పారన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కాబట్టి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై కొన్ని మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భూ వివాదంలో ఇద్దరి దారుణ హత్య.. 13 మంది నిందితుల అరెస్టు
రెబ్బెన(ఆసిఫాబాద్): భూవివాదంలో ఇద్దరిని హత్య చేసిన 13 మందిని పట్టుకున్నట్లు సీఐ అల్లం నరేందర్, ఎస్సై భూమేష్ వెల్లడించాడు. వారి వివరాల ప్రకారం... గత సోమవారం జక్కులపెల్లి శివారులోని వ్యవసాయ భూమి విషయంలో మండల బక్కయ్య కుటుంబీలకు, మండల మెంగయ్య కుటుంబీలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత ఆదివారం బక్కయ్య కుటుంబ సభ్యులు అదే భూమిలో పత్తి విత్తనాలు వేశారు. విషయం తెలుసుకున్న మెంగయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం కత్తులు, గొడ్డళ్లు, రాళ్లు, కారంపొడితో భూమి వద్దకు వెళ్లారు. వారి రాకకు గమనించి బక్కయ్య అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వారు వెంట తెచ్చుకున్న కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయగా బక్కయ్య కుమారుడు మండల నర్సయ్యతో పాటు అతడి సోదరి గిరుగుల బక్కక్క అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. మండల ఇందిరా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టి పరారీలోని 13మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన మూడు గొడ్డళ్లు, రెండు కత్తులు, నాలుగు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. మండల మల్లేష్, మండల గణేష్, మండల వెంకటేష్, గిరుగుల భీంరావు, గిరుగుల రాకేష్, మండల రంగక్క, గిరుగుల రజిత, మండల రజిత, మండల రుక్మ, రాటే భూమక్క, రాటే భూడయ్య, గిరుగుల దుర్గక్క, గిరుగుల సౌమ్యలను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి..
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. అరకతో అచ్చుతోలుతుండగా.. వీరయ్య తన కుమారుడు ప్రభాస్‌తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్‌తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్‌పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: భూ వివాదంలో ఓ రిసార్టు యాజమాన్యం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం పొందినా స్పందించని అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇక సామాన్య ప్రజలు ఎక్కడికి పోతారు? ఎలా న్యాయం పొందుతారు? అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులన్నా ఇంత లెక్కలేనితనమా? ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం పొందినా అధికారులకు జాలి, దయ లాంటి ఏవీ ఉండవా? తదుపరి విచారణ నాటికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, గండిపేట తహసీల్దారు సదరు భూమికి సంబంధించిన పాస్ పుస్తకంతో కోర్టుకు హాజరుకావాలి. ఆ పాస్ పుస్తకాన్ని పిటిషనర్‌కు కోర్టే నేరుగా అందిస్తుంది. బుక్‌తో రాకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’అని హైకోర్టు హెచ్చరించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం ఖానాపూర్‌లో ప్రతాప్ జంగిల్ రిసార్టుకు 20 ఎకరాల భూమి ఉంది. భూములను ధరణిలో అప్లోడ్ చేయడం, కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే సయమంలో ఈ భూమి ప్రభుత్వానిదంటూ రెవెన్యూ అధికారులు వివాదానికి తెరతీశారు. దీనిపై రిసార్టు యాజమాన్యం 2019లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి... ఆ భూమి రిసార్టుదేనని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై అదే సంవత్సరం ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేసినా ఎదురుదెబ్బే తగిలింది. అనంతరం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా 2021లో రిసార్టు యాజమాన్యానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. అయినా అధికారులు పాస్ పుస్తకం ఇవ్వకపోవడంతో రిసార్టు యాజమాన్యం 2022లో హైకోర్టులో ధిక్కరణ కేసు దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం లేదని, ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణకు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ అంతా పాసు పుస్తకంతో హాజరుకావాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
కలెక్టరేట్‌పై దంపతుల ఆత్మహత్యాయత్నం
జనగామ: తమ తాతనుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు రెవెన్యూ అధికారులు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. అన్యాయం చేశారని ఆరోపిస్తూ సోమవారం జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌పైకి ఎక్కి ఓ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలా వీరు ఈ సమస్యపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది మూడోసారని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగారావు, రేవతి దంపతులు బతుకు దెరువు కోసం ఐదేళ్ల క్రితం ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఏలుబాకకు వెళ్లారు. అక్కడ నర్సింగారావు కారు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా, గ్రామంలో తమ తాత నుంచి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని అప్పటి తహసీల్దార్ రమేశ్, వీఆర్ఓ క్రాంతి అదే గ్రామానికి చెందిన కొందరి పేరిట రిజస్ట్రేషన్ చేశారని నర్సింగారావు ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని తెలిపారు. కలెక్టర్‌ను కలిసి..: నర్సింగారావు దంపతులు ఉదయం 11 గంటల తర్వాత గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యను కలసి వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లనుంచి తమ సమస్య పరిష్కారంకోసం తిరుగుతున్నామని, త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. ‘మీకు న్యాయం జరిగేలా చూస్తున్నా.. కొంత ఆలస్యం జరుగుతుంది, కొద్దిగా ఓపిక పట్టండి’అని సమాధానం చెప్పారు. అయితే ఓపిక నశించిన ఆ దంపతులు కలెక్టరేట్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నర్సింగారావు దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకుని చేతిలో అగ్గిపెట్టె పట్టుకుని.. తాము చచ్చిపోతున్నామని, ఇక్కడ న్యాయం జరగదని అరవడంతో అక్కడికి వచ్చిన అధికారులు, పోలీసులు, జనం గంటసేపు వారిని బతిమిలాడారు. చివరికి పై నుంచి ఆ దంపతులపై నీళ్లు పోయగా, అక్కడే ఉన్న పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకుని కిందకు తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తహసీల్దార్ రవీందర్ వారితో మాట్లాడారు. పట్టా రద్దు వ్యవహారం కోర్టు ద్వారా రావాల్సి ఉందని.. తమ చేతుల్లో లేదని, కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని దంపతులకు చెప్పి పంపించారు. -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
Bihar: బిహార్‌లో రాజుకున్న భూవివాదం.. ఐదుగురి మహిళలపై కాల్పులు
బిహార్‌లో ఒక్కసారిగా కాల్పుల కలకలం చోటు చేసుకుంది. భూమి పట్టా పొందిన ఐదుగురు మహిళపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జీఎంసీహెచ్ ఆస్పత్రి తరలించారు. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బిహార్‌లో బెట్టియాలోని జగదీష్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భూ యజమానులు, భూమిని పొందిన పట్టాదారులు మధ్య చెలరేగిన వివాదంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భూ వివాదం 1985 నాటిది. ఈ ఐదుగురు మహిళలు ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం భూ పట్టాలు పొందారు. ఐతే పూర్వపు భూ యజమానులు భూమిపై తమ హక్కును తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి నిందితులు మహిళలను భూమిపై హక్కును కోల్పోయేలా పలుమార్లు ఒత్తిడి చేశారు. కానీ మహిళలు అందుకు ససేమిరా అంటూ నిరసన తెలిపారు. దీంతో దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ మేరకు బెట్టియా ఎస్పీ ఉపేంద్రనాథ్ వర్మ మాట్లాడుతూ...ఇది పాత వివాదం అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన ఏడుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి భూమి గరిష్ట విస్తీర్ణ పరిమితి కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లయితే దానిని ప్రభుత్వ లాక్కుంటుంది. (చదవండి: డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు) -
అది రెండు కుటుంబాల గొడవ
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని హరిపురంలో రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి స్థల వివాదం ముదిరి.. సోమవారం (ఈ నెల 7వ తేదీన) ఇద్దరు మహిళలపై గులకరాళ్లతో కూడిన మట్టి పోసే వరకు వెళ్లిన వ్యవహారంలో టీడీపీ రాజకీయ చలి మంటకు సిద్ధమైంది. ఆ గ్రామంలోని రామారావు, ప్రకాశరావు, ఆనందరావులు ట్రాక్టర్లతో వివాద స్థలంలో కంకర మట్టి వేస్తుండగా.. వారి సమీప బంధువులు కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలు వెనక వైపునకు వెళ్లి అడ్డుకున్నారు. అదే సమయంలో వీరిద్దరిపై అమాంతం మట్టిని కుమ్మరించేశారు. నడుంలోతు వరకు వారు కూరుకు పోవడంతో పెద్దగా రోదించారు. చుట్టు పక్కల వారు వచ్చి బయటకు లాగారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, టీడీపీ హయాంలో 2017, 2019లో బాధిత మహిళలు నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఇలా లింకు పెట్టొచ్చా.. మహిళలపై మట్టిపోసిన ఘటనలో ప్రధాన నిందితుడు కొట్ర రామారావుకు.. టీడీపీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుతో మంచి సంబంధాలున్నాయి. అలాగని వీరంతా ఇతనికి అండగా నిలిచారని చెప్పలేం. అలా అనడం తప్పు కూడా. అయితే ఇది రెండు కుటుంబాల మధ్య వివాదం అనే కనీస అవగాహన లేకుండా చంద్రబాబు, ఆయన పుత్ర రత్నం లోకేశ్‌లు ఈ ఘటనపై వరుస ట్వీట్లతో వైఎస్సార్సీపీపై బురద చల్లి, నీచ రాజకీయం చేశారు. పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ, లేదని దుష్ప్రచారం చేశారు. -
యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్
కాలిఫోర్నియా: ఎనిమిది నెలల చిన్నారితో సహా భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌కి గురయ్యింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సోమవారం 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ వారి ఎనిమిదేళ్ల పాప అరూహి ధేరి తోపాటు 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ కిడ్నాప్ అయినట్లు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్స్ కార్యాలయ(పోలీస్ కార్యాలయం) పేర్కొంది. అలాగే నిందితుడు ఆయుధాలు కలిగి ఉన్నాడని చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పారు. అంతేగాదు పోలీసులు ప్రజలను అనుమానితుడు లేదా బాధితులు గానీ కనిపిస్తే వారి వద్దకు వెళ్లవద్దని తమకు సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలానే 2019లో యూఎస్‌లోని కాలిఫోర్నియాలో భారత సంతతి టెక్కీ, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని తుషార్ అత్రే తన ఇంటి నుంచి కిడ్నాప్ అయినా కొద్ది నిమిషాల్లోనే తన గర్లఫ్రెండ్ కార్లో శవమై కనిపించాడు. (చదవండి: ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్) -
ఆస్తి కోసం అన్న ఘాతుకం.. సొంత తమ్ముడిని కారుతో ఢీకొట్టి...
త్రిపురాంతకం: స్థల వివాదంతో తోడబుట్టిన తమ్ముడిని అన్న కారుతో ఢీకొట్టి ప్రాణం తీశాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లికి చెందిన కంచర్ల ఏడుకొండలు(30), అతని అన్న వెంకటేశ్వర్లుకు మధ్య ఐదు సెంట్ల స్థలం విషయంలో వివాదం నెలకొంది. తరచూ దాని గురించి తగాదాలు పడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా స్థలం విషయమై ఘర్షణ పడ్డారు. గొడవ జరిగాక ఏడుకొండలు నేషనల్ హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెంకటేశ్వర్లు కారుతో ఢీకొట్టాడు. దీంతో ఏడుకొండలు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి మూడేళ్ల కుమార్తె ఉండగా.. గర్భిణి అయిన భార్య యల్లమ్మ కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. తల్లి రమణమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. -
తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’
లేపాక్షి (సత్యసాయి జిల్లా): ఆస్తి పంపకాలు పూర్తయ్యాకే తాత శవాన్నెత్తాలంటూ ఓ మనవడు రగడకు దిగాడు. రెండో భార్య కుమార్తెకు రాసిచ్చిన ఎకరాను కూడా తనకే ఇవ్వాలంటూ నానా హంగామా చేశాడు. ఈ ఘటన మండలంలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. కొత్తపల్లికి చెందిన కార్పెంటర్ చిన్నహనుమయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఒక కుమారుడు, చిన్న భార్యకు ఒక కుమార్తె సంతానం. పెద్దభార్య, కుమారుడు, చిన్న భార్య గతంలోనే మృతి చెందారు. దీంతో కుమార్తె వద్ద కొన్ని రోజులుగా ఉంటున్న చిన్నహనుమయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు. (చదవండి: గుండెకోతను భరించి...) ఈ క్రమంలోనే శనివారం మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన మనవడు (పెద్దభార్య కుమారుడి కొడుకు) నాగభూషణ ఆస్తి పంపకాలు పూర్తయ్యేదాకా శవాన్ని ఎత్తనిచ్చేది లేదని భీష్మించాడు. మూడున్నర ఎకరాల్లో ఓ ఎకరాను కుమార్తెకు లిఖిత పూర్వకంగా తాత రాసిచ్చాడని, అది కూడా తనకే చెందాలని రగడకు దిగాడు. బంధువులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. చేసేది లేక వారంతా వెనుదిరిగారు. అంతిమ సంస్కారాల తర్వాత ఏమైనా ఉంటే చూసుకోండని, గ్రామస్తులు చెప్పినా లెక్కచేయకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మనవడికి నచ్చజెప్పారు. బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే తలా చెయ్యి వేసి చిన్న భార్య కుమార్తె, అల్లుడితో కలిసి దహనసంస్కారాలు పూర్తి చేశారు. (చదవండి: బ్యాగులో లక్షల రూపాయలు.. మర్చిపోయి రైలెక్కి సొంతూరుకు.. మళ్లీ తిరిగొచ్చి..!) -
భూవివాదం కేసు.. కోర్టుకు హీరో రానా గైర్హాజరు
భూవివాదం కేసులో మంగళవారం హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టుకు హాజరుకావాల్సిన హీరో రానా.. అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయాడు. నేడు కోర్టుకు హాజరు కాలేనని కోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు.. ఆగస్ట్ 10న కచ్చితంగా హాజరకావాలని ఆదేశించింది. లేని పక్షం లో అడ్వకేట్ కమిషన్ రానా దగ్గరికి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫిలింనగర్ లో అలనాటి నటి మాధవి లతకు చెందిన 2200 చదరపు గజాల స్ధలాన్ని హీరో దగ్గుబాటి వెంకటేష్ అతని సోదరుడు నిర్మాత దగ్గుబాటి సురేష్ అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ భూమిని నగరానిక చెందిన ఓ వ్యాపారవేత్త 2014లో అగ్రిమెంట్ పద్ధతిలో లీజుకు తీసుకున్నాడు. లీజు అగ్రిమెంట్ 2016, 2018లో కూడా రెన్యువల్ చేశారు. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత అగ్రిమెంట్ గడువు పూర్తి కాకముందే సురేశ్ బాబులో భూమిలోని 1000 గజాలను రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. రిజిష్ట్రేషన్ అయిన అనంతరం రానా అందులోని లీజు దారుడిని స్ధలం ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో అతడు కోర్టు ఆశ్రయించాడు. ఇంకా లీజు అగ్రిమెంట్ గడుపు పూర్తి కాకుండానే స్ధలం ఖాళీ చేయమడంతో సదరు వ్యాపారవేత్త సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో న్యాయస్దానం రానాకు నోటీసులు జారీ చేశారు. దీనిపై నేడు విచారణ ఉండగా రానా కోర్టుకు గైర్హాజరు అయ్యారు. -
అదంతా కుదరదు.. అఖిలప్రియకు షాకిచ్చిన భూమా జగత్ విఖ్యాత్
దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబ భూముల వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల దగ్గర తన తల్లిపేరుపై ఉన్న స్థలంలో వాటా ఇప్పించాలని కోరుతూ నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాగా, తన పిటిషన్లో ప్రతివాదులుగా భూమా అఖిలప్రియ, మౌనికలతో పాటుగా భూమిని కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తుల పేర్లను చేర్చారు. వివరాల ప్రకారం.. 2016లో భూమా నాగిరెడ్డి.. తన భార్య శోభ చనిపోకముందు రాజేంద్రనగర్‌లో కొంత స్థలాన్ని విక్రయించారు. అయితే, ఆ స్థలాన్ని తాను మైనర్‌గా ఉన్నప్పుడు తన తండ్రి విక్రయించారని జగత్ విఖ్యాత్ తన పిటిషన్ పేర్కొన్నారు. తన తల్లి చనిపోయాక భూమిని విక్రయించారని.. ఈ క్రమంలో ఆ భూమి అమ్మకం చెల్లదంటూ పిటిషన్లో కోర్టుకు విన్నవించారు. భూమి అమ్మకం జరిగిన కొద్దిరోజుల తర్వాత నాగిరెడ్డి కూడా మరణించారు. ఇక, ఈ భూ వివాదంపై కింది కోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో జగత్ విఖ్యాత్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వాటా ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, భూమి అమ్మిన సమయంలో మేజర్లు అయిన తన ఇద్దరు కుమార్తెలతో పాటు నాగిరెడ్డి సంతకం చేశారు. అప్పటికి జగత్ విఖ్యాత్ మైనర్ కావడంతో తనతో వేలి ముద్ర వేయించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: విజయవాడ ఆర్టీసీ బస్సులో మహిళ ఓవరాక్షన్ -
సినీ పెద్దలకు ఆ భూమిపై హక్కుల్లేవు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 4, 5, 8, 9, 10, 12లోని 26.16 ఎకరాల భూమి వ్యవహారంలో పలువురు సినీ పెద్దలకు ఎలాంటి హక్కులు లేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఖానామెట్‌లో చట్ట ప్రకారం హక్కులు లేని భూమిని నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గోవిందరెడ్డి, ఇతరులు 26.16 ఎకరాలు కొనుగోలు చేశారని నివేదించింది. చదవండి: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా? సదరు భూ హక్కుల వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్. నంద ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు అప్పటి తహసీల్దార్ సంతకాలకు పొంతన లేదన్నారు. ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించినట్లు పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే.. వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారన్నారు. సైన్యంలో జవాన్లకు 5 ఎకరాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిబంధనని, కమాండర్ ఇన్ చీఫ్ నరసింహనాయక్‌కు ఇది వర్తించదని చెప్పారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఫోరెన్సిక్ శాఖ నిర్ధారించడంతో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్ జడ్జి తీర్పును కొట్టేయాలని కోరారు. రామానాయుడు, రాఘవేంద్రరావు ఇతరుల వాదనల నిమిత్తం విచారణను హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. -
సిటీ సివిల్ కోర్టుకు సినీ నటుడు రానా
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): కోర్టు ధిక్కరణ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి మంగళవారం సివిల్ కోర్టుకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో ప్లాట్ నెం. 2 సినీ నటి మాధవి (మాతృదేవోభవ హీరోయిన్)కు సొసైటీ కేటాయించింది. అయితే ఆమె 2200 గజాల ప్లాట్‌ను సినీ నిర్మాత సురేష్ దగ్గుబాటి, వెంకటేశ్‌కు విక్రయించి వెళ్లిపోయింది. సదరు స్థలంలో వెయ్యి గజాలు నిర్మాత సురేష్ దగ్గుబాటి పేరు మీద, 1200 గజాలు హీరో వెంకటేష్ పేరున ఉన్నాయి. 2014లో ఈ స్థలంలోని రెండు ప్లాట్లను ఎమ్మెల్యే కాలనీకి చెందిన నందకుమార్ అనే వ్యాపారికి లీజు అగ్రిమెంట్ చేశారు. నెలకు రూ. 2 లక్షలు చెల్లించే విధంగా ఈ రెండు ప్లాట్లను లీజు అగ్రిమెంట్‌చేయగా 2014లో ఒకసారి, 2016లో మరోసారి లీజు రెన్యూవల్ జరిగింది. 2017లో ఈ ప్లాట్‌ను విక్రయించేందుకు సిద్ధమై లీజు అగ్రిమెంట్లో ఉన్న నందకుమార్‌ను సంప్రదించారు. గజం రూ.1.80 లక్షలు చొప్పున నందకుమార్ ఈ ప్లాట్ మొత్తానికి రూ. 6 కోట్లు చెల్లించి అగ్రిమెంట్ ఆఫ్‌సేల్ చేసుకున్నాడు. అయితే ఈ ప్లాట్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వేరే వ్యాపారి వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పడంతో నందకుమార్ అగ్రిమెంట్‌ను పక్కన పెట్టి మరో వ్యక్తికి సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేశారు. 2017లో ఈ ఒప్పందం ఉల్లంఘించగా నందకుమార్ కోర్టును ఆశ్రయించాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి దగ్గుపాటి సురేష్ ఈ సేల్ అగ్రిమెంట్‌చేసినట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉండగానే దగ్గుపాటి సురేష్ ఈ ప్లాట్లోని వెయ్యి గజాలను తన కుమారుడు రానా దగ్గుబాటి పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో రానా దగ్గుబాటికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేయగా మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఇంకోవైపు ఏ సొసైటీలోనైనా ఒక వ్యక్తికి ఒకే ప్లాట్ ఉండాలని బైలాస్ నిర్ధేశిస్తున్నాయి. ఫిలింనగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో నిర్మాత సురేష్ దగ్గుబాటికి ఇప్పటికే ఓ ప్లాట్ ఉండటంతో ప్రస్తుతం వివాదంలో ఉన్న ప్లాట్ నెంబర్ 2లో కూడా ఆయనకు మరో ప్లాట్ ఉంది. దీంతో బైలాస్కు విరుద్ధంగా ఉంటుందన్న ఉద్దేశంతో అడ్డదారుల్లో తన కుమారుడు రానా పేరు మీద వెయ్యి గజాల ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేశాడని బాధితుడు నందకుమార్ ఆరోపించారు. -
ఇక మథుర వంతు.. ఆ భూములపై యాజమాన్య హక్కులు ఎవరివి?
మొన్న అయోధ్య, నిన్న కాశీ, ఇవాళ మథుర దేశంలో మందిరం, మసీదు వివాదాలు రాజుకుంటున్నాయి. అయోధ్యలో వివాదం సమసిపోయి శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే, కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానవాపి మసీదు రగడ ఇంకా చల్లారకుండానే హఠాత్తుగా మథుర వివాదం తెరపైకి వచ్చింది. మథుర ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివన్న చర్చ ఉత్కంఠని రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న మసీదుపై భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పిటిషన్ విచారించడానికి మథుర జిల్లా న్యాయస్థానం అంగీకరించడంతో ఆ స్థలంపై ఎందుకు వివాదం నెలకొందో సర్వత్రా ఆసక్తిగా మారింది. మథురలో శ్రీకృష్ణుడు జన్మించినట్టుగా భావిస్తున్న స్థలానికి ఆనుకొని షాహీ ఈద్గా మసీదుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు నిర్మించారు. కృష్ణుడి ఆలయాన్ని కొంత భాగం పడగొట్టి ఆ మసీదు కట్టారని, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించినట్టుగానే ఈ మసీదులో కూడా వీడియోగ్రఫీ సర్వే చేస్తే హిందూ దేవాలయ ఆనవాళ్లు కనిపిస్తాయని హిందూమత పరిరక్షకులు బలంగా విశ్వసిస్తున్నారు. కోర్టులో ఉన్న కేసులు ఎన్ని ? ఈ వివాదంపై కోర్టులో ఇప్పటివరకు డజనుకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్ల సారాంశం ఒక్కటే. షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. మరికొన్ని పిటిషన్లు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే మాదిరిగా ఈ మసీదులో కూడా సర్వే చేపట్టాలని, అంతే కాకుండా ఆ ప్రాంగణంలో పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరాయి. మసీదు భూములపై హక్కులు ఎవరివి ? 1670 సంవత్సరంలో నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదుని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని నాజల్ ల్యాండ్‌గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమిగా చెప్పాలి. అప్పట్లో మరాఠాల అధీనంలో ఉన్న ఈ భూమి ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. 1815 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వేసిన వేలంలో కృష్ణజన్మభూమిగా భావిస్తున్న కేత్రా కేశవ్దేవ్ ఆలయానికి సమీపంలో ఉన్న 13.77 ఎకరాల భూమిని బెనారస్‌కు చెందిన రాజాపాట్నిమాల్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన వారసులు ఆ స్థలాన్ని జుగల్ కిశోర్ బిర్లాకి విక్రయించారు. పండిట్ మదన మోహన్ మాలవీయ, గోస్వామి గణేశ్ దత్, భికెన్ లాల్జీ ఆటెరీ పేర్లపై ఆ భూములు నమోదయ్యాయి. వీరంతా కలిసి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌గా ఏర్పడి కేత్రా కేశవ్దేవ్ ఆలయం ప్రాంగణంపై యాజమాన్య హక్కులు సాధించారు. మసీదు కింద తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలు బందీలుగా ఉన్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం మసీదు కింద ఉందని, కోర్టుకెక్కిన కొంతమంది పిటిషన్‌దారులు విశ్వసిస్తున్నారు. మసీదు కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే చెరసాల బయటకు వస్తుందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రామజన్మభూమి మీద ఒక పుస్తకం రాసిన లక్నోకు చెందిన అడ్వొకేట్ రంజన అగ్నిహోత్రి శ్రీకృష్ణ జన్మభూమి మీద దృష్టి సారించారు. మరో ఆరుగురితో కలిసి షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని , ఆ భూ యాజమాన్య హక్కులన్నీ తమకి అప్పగించాలంటూ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరఫున 2020లోనే దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో న్యాయమూర్తి ఛాయా శర్మ అప్పటికే ఆలయానికి ఒక ట్రస్టు ఉందని ఆ స్థలంపై ఆలయానికి, మసీదుకి మధ్య 1968లోనే అవగాహన కుదిరిందంటూ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రంజన్ అగ్నిహోత్రి జిల్లా కోర్టుకెక్కడంతో ఇరువైపుల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి రాజీవ్ భారతి విచారణకు అంగీకరించారు. ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది ? రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం మనకి స్వాతంత్య్రం సిద్ధించిన 1947, ఆగస్టు 15 నాటికి మతపరమైన కట్టడాలు ఎవరి అధీనంలో ఉంటే, భూ హక్కులు వారికే సంక్రమిస్తాయని, మరెవరికీ ఆ కట్టడాలని కదిల్చే హక్కులు లేవని ఆ చట్టం చెబుతోంది. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన, వారసత్వ కట్టడాలకి మాత్రం మినహాయింపు ఉంది. అందుకే రామజన్మభూమి వివాదంలో తీర్పు ఆలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. మథుర ఆలయానికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉండడంతో పురావస్తు కట్టడం కింద మినహాయింపు వచ్చి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని పిటిషన్‌దారులు ఆశతో ఉన్నారు. 1968లో రాజీ కుదిరిందా ? కోర్టు రికార్డుల ప్రకారం 1968 సంవత్సరంలో ఆలయ నిర్వహణ కమిటీ అయిన శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్,షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. కోర్డు డిక్రీ ద్వారా ఇరు వర్గాలు ఒక రాజీ ఫార్ములాకు వచ్చాయి. అప్పటికింకా 13.77 ఎకరాల భూమిలో పూర్తి స్థాయి నిర్మాణాలు లేవు. ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ముస్లింలు జీవనం సాగిస్తూ ఉండేవారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం వారిని ఖాళీ చేయించి మందిరానికి, మసీదుకి సరిహద్దులు ఏర్పాటు చేశారు. ఆలయానికి అభిముఖంగా మసీదుకి ఎలాంటి తలుపులు, కిటికీలు ఉండకూడదు. రెండు ప్రార్థనాలయాలకి మధ్య గోడ కట్టాలని తీర్మానించారు. ఈ ఒప్పందానికి ఉన్న చెల్లుబాటుపై కూడా కోర్టు విచారణ చేయనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐటీ ఉద్యోగి దారుణహత్య
తిరువళ్లూరు: భూతగాదాల కారణంగా సొంత అన్న కూతురిని బాబాయి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కూవం నది పరివాహక ప్రాంతానికి చెందిన లోకనాయగి.. భర్త ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో కూతురు శివరంజనితో కలిసి నివాసం ఉంటున్నారు. బీసీఏ పూర్తి చేసిన శివరంజిని చెన్నైలోని ఐటీ కంపెనీలో పని చేస్తోంది. శివరంజిని తల్లిదండ్రులకు చిన్నాన్న బాలచంద్రన్‌కు మధ్య భూతగాదా ఉన్నట్లు తెలుస్తుంది. సోమవారం ఇరు కుటుంబాలు స్వల్పంగా ఘర్షణకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన లోకనాయగి తన మరిది బాలచంద్రన్‌పై ఫిర్యాదు చేయడానికి తిరువళ్లూరు టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. దీంతో బాలచంద్రన్ ఆగ్రహంతో ఇంట్లోకి చొరబడి శివరంజినిని విచక్షణా రహితంగా నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. లోకనాయగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వృద్ధులను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంధించారు. బాధితుల కేకలు విన్న స్థానికులు అమీన్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధులను రక్షించి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు.. అనంతరం ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మెరాజ్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల పేరు మీద అమీర్‌పేటలోని లీలానగర్‌లో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదమే కిడ్నాప్‌నకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ భూవివాదంపై కోర్టు పరిధిలో విచారణ సాగుతోందని పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రేమ పెళ్లి.. అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో..) మరోవైపు కిడ్నాపర్లు తమ నుంచి కీలకమైన భూమి పత్రాలతో పాటు కొంత బంగారాన్ని లాక్కున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేసి తమ ఆస్తిని కాపాడాలని వేడుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులు బీదర్‌లో వున్నట్లు గుర్తించారు. చదవండి: హృదయ విదారక ఘటన.. నాలుగేళ్ల బాలికను.. -
సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భూవివాదం విషయంలో సెల్ఫీ వీడియో తీసుకున్న కుటుంబం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కుటుంబ సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్ బాషాకు సంబంధించిన పొలం వివాదం ఉంది. తనకు న్యాయం చేయాలని అక్బర్ కుటుంబంతో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ అతడి సమస్యపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో సమస్యను 48 గంటల్లోనే పరిష్కారమైంది. ఆ పొలం వివాదం సమసిపోయింది. ఈ విషయాన్ని బాధితుడు అక్బర్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపాడు. తమకు సీఎం జగన్ న్యాయం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి సమష్టి కృషితో సమస్య పరిష్కారమైందని వివరించాడు. తమ పొలం సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని ప్రకటించాడు. చదవండి: బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్చల్ -
పొలం విక్రయంపై రభస.. తట్టుకోలేక యువకుడు
బిజినేపల్లి: భూమి విక్రయానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మిట్యాతండాకు చెందిన రమావత్ చంద్రు (26) వృత్తిరీత్యా డ్రైవర్. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఆటో నడుపుతుండేవాడు. ఈయనకు భార్య లక్ష్మితో పాటు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి తమకున్న రెండెకరాలను అమ్మి తీర్చాలనుకున్నాడు. అయితే వారు అంగీకరించక పోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. సోమవారం ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకటేశ్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు) చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి -
మా పొలంలో గేదెలను ఎందుకు వదిలావ్ అంటూ కోపంతో..
సాక్షి, దోమ( వికారాబాద్): భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాయాదులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామానికి చెందిన ఎండీ అస్లాం శనివారం ఎప్పటిలాగే పొలానికి వెళ్తుండగా తమ పొలంలో గెదేలను ఎందుకు వదిలావని అతని దాయదులైన కలీం, ఆఫ్రీద్, జాహంగీర్బీ స్పింగర్లతో అతనిపై దాడికి పాల్పడ్డారు. పాత కక్షలతోనే వారు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు అస్లాం ఆదివారం దోమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన ముగ్గిరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై రమేష్ తెలిపారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక.. ఉరేసుకుని ఆత్మహత్య మర్పల్లి: జీవితపై విరక్తి చెందిన ఓ మహిళ ఉరేసుకోని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ కూతురు నవనీత (22)ను మూడు సంవత్సరాల క్రితం కోట్‌పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన గోవర్ధన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. నా లుగు నెలల క్రితం భర్త గోవర్ధన్ కరోనా బా రిన పడి మృతి చెందాడు. అప్పటినుంచి నవనీత పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉండేది. ఈ నేపథ్యంలో భర్త మరణాన్ని జీర్ణించుకోలేని నవనీత జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. అన్న న వీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశ్రీను తెలిపాడు. -
రూ.10 కోట్ల భూకుంభకోణం.. జనసేన నాయకుడి అరెస్ట్
గుంటూరు: పెదకాకాని మండలం అగంతవరప్పాడులో 10 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం కేసులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టివాసు సహా ఏడుగురిని మంగళవారం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో రూ.కోట్ల విలువైన భూములు కొట్టేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో సహా మరో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం మంగళవారం వారిని అరెస్ట్ చేశారు. అగతవరప్పాడుకు చెందిన కె. నారాయణమ్మ తన 1.42 ఎకరాల భూమిని తన మరణానంతరం మేనల్లుడు ఒడ్డెంగుంట శివసాగర్, అతని భార్య పద్మజకు దక్కేలా వీలునామా రాశారు. 2012లో నారాయణమ్మ చనిపోగా, శివసాగర్ కూడా కొద్దికాలానికి మరణించాడు. ఇదే అదునుగా భూమిని కాజేసేందుకు యేమినేడి అమ్మయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాధికారెడ్డి, రామనుజం కలిసి ఓ మీడియా ప్రతినిధి ద్వారా రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకు గుత్తా సుమన్‌కు అమ్మేందుకు కుంచనపల్లి మాజీ సర్పంచి బడుగు శ్రీనివాసరావు పేరిట నకిలీ వీలునామా చేయించారు. లింక్ డాక్యుమెంట్ల కోసం మరో ఇద్దరి పేరిట మార్చారు. జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బొబ్బా వెంకటేశ్వరరావు, కోమలి, రాఘవ పాత్ర ఉన్నట్టు తెలడంతో వారిని అరెస్ట్ చేశారు. -
ప్రతీకార హత్యలు: ఉదయం తమ్ముడిని.. అర్ధరాత్రి అన్నను
సాక్షి, నల్లగొండ క్రైం: ఇద్దరూ అన్నదమ్ములు.. కొన్నేళ్లుగా పొలం సరిహద్దుల విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది.. ఇదే క్రమంలో ఉదయం అన్న కుమారులు ఇద్దరు కలిసి తమ్ముడి (బాబాయి)ని దారుణంగా చంపేయగా.. తమ్ముడి సమీప బంధువులు అదేరోజు రాత్రి అన్నను మట్టుబెట్టి ప్రతీకార హత్యకు పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి శివార్లలో ఉన్న అక్కలాయిగూడెంలో ఆదివారం జరిగిన ఈ హత్యలు కలకలం రేపాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అక్కలాయిగూడేనికి చెందిన ఆవుల పాపయ్య, లక్ష్మమ్మ దంపతులకు సోములు, కాశయ్య (63), రామస్వామి (57), సైదులు కుమారులు. తల్లిదండ్రులు గతంలోనే నలుగురు కుమారులకు 4.5 ఎకరాల చొప్పున పంచారు. వారు వేర్వేరుగా సాగు చేసుకుంటున్నారు. ఇందులో కాశయ్య, రామస్వామి కుటుంబాల మధ్య ఏడేళ్లుగా గెట్టు పంచాయితీ నడుస్తోంది. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నా పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో రామస్వామి బోరు మోటార్ వేసేందుకు ఆదివారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లాడు. అప్పటికే బావి వద్ద ఉన్న కాశయ్య కుమారులు మల్లేశ్, మహేశ్‌లు రామస్వామితో గొడవకు దిగారు. తీవ్రంగా ఆవేశానికి లోనై గెట్టు మధ్యలో ఉన్న హద్దురాయిని తీసి తలపై మోదడంతో రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మాటేసి ప్రతీకారం.. రామస్వామి హత్యపై ఆగ్రహించిన సమీప బంధువులు.. ప్రతీకారంగా కాశయ్యను చంపాలని నిర్ణయించుకుని, నిఘా వేశారు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఒంటరిగా గ్రామంలోకి వస్తున్న కాశయ్యను గమనించారు. శివార్లలోనే అడ్డుకుని, కర్రలతో తలపై బలంగా మోదారు. దాంతో కాశయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు సోమవారం ఉదయం కాశయ్య మృతదేహాన్ని గుర్తించారు. హత్య, ప్రతీకార హత్యలతో అక్కలాయిగూడెం వణికిపోయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. రామస్వామి కుమారుడు కిరణ్ అదుపులోకి తీసుకొని విచారించారు. కుటుంబాల మధ్య భూ వివాదం కొనసాగుతున్నా.. ఉద్యోగరీత్యా తాము దూరం గా ఉన్నామని కిరణ్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే అతడు చెప్పిన వివరాల మేరకు కొంద రు సమీప బంధువులే ప్రతీకార హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. పోలీసు పహారా మధ్య సోమవారం ఉదయం రామస్వామికి, సాయంత్రం కాశయ్య అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రూ.10 కోట్ల భూ కుంభకోణంలో జనసేన నాయకుడు
పెదకాకాని(పొన్నూరు): రూ.10 కోట్ల విలువైన భూ కుంభకోణంలో పెదకాకాని పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాత్ర ఉందనే అనుమానంతో అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అగతవరప్పాడుకు చెందిన కె. నారాయణమ్మ తన 1.42 ఎకరాల భూమిని తన మరణానంతరం మేనల్లుడు ఒడ్డెంగుంట శివసాగర్, అతని భార్య పద్మజకు దక్కేలా వీలునామా రాశారు. నారాయణమ్మకు ఆ పొలాన్ని అమ్మిన పాండురంగారావు ఆ భూమిని మళ్లీ గుంటూరుకు చెందిన మరొక వ్యక్తికి అమ్మాడు. దీంతో ఇరువర్గాలూ కోర్టును ఆశ్రయించాయి. 2012లో నారాయణమ్మ చనిపోగా, శివసాగర్ కూడా కొద్దికాలానికి మరణించాడు. ఇదే అదునుగా భూమిని కాజేసేందుకు యేమినేడి అమ్మయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాధికారెడ్డి, రామనుజం కలిసి ఓ మీడియా ప్రతినిధి ద్వారా రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకు గుత్తా సుమన్‌కు అమ్మేందుకు కుంచనపల్లి మాజీ సర్పంచి బడుగు శ్రీనివాసరావు పేరిట నకిలీ వీలునామా చేయించారు. లింక్ డాక్యుమెంట్ల కోసం మరో ఇద్దరి పేరిట మార్చారు. జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బొబ్బా వెంకటేశ్వరరావు, కోమలి, రాఘవ పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై 2017లో శివసాగర్ భార్య పద్మజ ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం నిందితుల అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధంచేసినట్టు సమాచారం. -
పొలం వివాదంలో ‘సమాజ సేవకుడు’ దారుణహత్య
రంగంపేట: తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరి శ్రీనివాస్(37) ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరి వెంకట్రావు కుమారులకు, సాధనాల ధర్మరాజుకు గ్రామంలోని పొలం సరిహద్దు వద్ద తాటి కట్టవ కారణంగా ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొలం సరిహద్దు గురించి ఏలూరి వెంకట్రావు కుమారుడు ఏలూరి శ్రీనివాస్‌కి సాధనాల ధర్మరాజుకి గొడవ జరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఏలూరి శ్రీనివాస్ ఇంటి వద్ద నుంచి వీరభద్రుని గుడి వైపు నడుచుకుంటూ వస్తుండగా సాధనాల ధర్మరాజు, అతని కుమారుడు సాధనాల వీరభద్రరావు అతనిపై దాడి చేశారు. కర్రతో దాడి చేసిన అనంతరం చాకుతో పొడిచాడు. దీంతో శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు 108కి ఫోన్ చేయగా వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్ పరీక్షించి చనిపోయినట్టుగా నిర్ధారించారు. మృతుడు చిన్నాన్న ఏలూరి గోపాలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట ఇన్చార్జి ఎస్సై ఎ.ఫణికుమార్ కేసు నమోదు చేయగా, పెద్దాపురం సీఐ కేఎన్వీ జయకుమార్ ఘటనా స్ధలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నో సమాజ సేవలు దారుణ హత్యకు గురైన ఏలూరి శ్రీనివాస్ మంచి సమాజ సేవకుడిగా గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌లోని ప్రయివేటు సిరామిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అమ్మ ఫౌండేషన్ స్థాపించి సుభద్రంపేటలోని పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవీ విగ్రహం ఏర్పాటు చేసి ఏటా వసంత పంచమినాడు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించి విద్యార్థులకు విద్యా సామగ్రితో పాటు యూనిఫాంలను కూడా అందించేవాడు. హైదరాబాద్‌లోని బొల్లారంలో నాలుగు రోజుల కిందట జరిగిన బోనాల ఉత్సవాల్లో శ్రీనివాస్‌ను సత్కరించారు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులను చూడటానికి శుక్రవారం రాత్రే గ్రామానికి వచ్చాడు. హైదరాబాద్‌లోనే ఉండిపోయినా ప్రాణాలతో మిగిలేవాడని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. శ్రీనివాస్ భార్య విజయలక్ష్మీ, కుమారుడు అక్షయ్ హైదరాబాద్‌లోనే ఉన్నారని ఈ విషయం వారిద్దరికీ ఎలా చెప్పాలని కన్నీరుమున్నీరవుతున్నారు. -
న్యాయం కోసం 50 ఏళ్లకు పైగా పోరాటం.. చివరకు 108వ ఏట మృతి
న్యూఢిల్లీ: వంద మంది దోషులను విడిచిపెట్టినా పర్లేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా అన్యాయం జరగకూడదనేది భారత న్యాయవ్యవస్థ నమ్మే సిద్ధాంతం. దీని వల్ల మేలు ఎంతో కీడు కూడా అంతే జరగుతుంది. ఒక్కసారి కేసు కోర్టుకు వెళ్తే విచారణ పూర్తయి తీర్పు వచ్చే వరకు ఆ కేసుకు సంబంధించిన వారు ఎందరు ఉంటారో.. ఎందరు కన్నుముస్తారో చెప్పడం కష్టం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ భూవివాద కేసు విచారణ ఏకంగా 53 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. చివరకు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణకు అంగీకరించే సమయానికి.. పిటీషన్‌దారు అయిన సదరు వృద్ధుడు తన 108వ ఏట కొన్ని రోజుల క్రితం మరణించాడు. కేసేంటంటే.. ఆ వివరాలు.. మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతానికి చెందిన సోపాన్ నర్సింగ్ గైక్వాడ్ అనే వ్యక్తి 1968లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత సోపాన్‌కు తాను కొనుగోలు చేసిన భూమిని దాని అసలు యజమాని అప్పటికే బ్యాంక్‌లో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాక అసలు యజమాని లోన్ చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆ భూమిని జప్తు చేస్తామని సోపాన్‌కు నోటీసులు జారీ చేశారు. దాంతో సోపాన్ దీని మీద ట్రయల్ కోర్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో సోపాన్ ఆ భూమికి బోనాఫైడ్ కొనుగాలుదారుగా ఉంటాడని.. బ్యాంక్ అసలు యజమానికి చెందిన ఇతర ఆస్తులను అమ్మడం ద్వారా లోన్ని రికవరీ చేసుకోవచ్చని తెలిపింది. ట్రయల్ కోర్టు సోపాన్ వాదనను అంగీకరించడమే కాక సెప్టెంబర్ 10, 1982లో అతడికి అనుకూలంగా ఉత్తర్వును జారీ చేసింది. దాంతో అసలు యజమాని మొదటి అప్పీల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో 1987లో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును తారుమారు చేశారు. ఆ తర్వాత సోపాన్ సెకండ్ అప్పీల్లో భాగంగా 1988లో హైకోర్టుకు వెళ్లాడు. 2015లో బాంబే హైకోర్టు దీన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో ఆలస్యం.. ఈ క్రమంలో సోపాన్ తరఫు కదీమ్ న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘ఇరు వర్గాల న్యాయవాదులు ఆగస్టు 22, 2015న హైకోర్టులో హాజరయ్యారు.. సూచనలను కోరేందుకు వాయిదా వేశారు. దాంతో రెండో అప్పీల్ సెప్పెంబర్ 3, 2015కి వాయిదా పడింది. చివరకు అక్టోబర్ 23, 2015న బాంబే హైకోర్టు దీన్ని కొట్టేసింది’’ అని తెలిపారు. సెకండ్ అప్పీల్‌ను పునరుద్దరించమని కోరడంలో ఆలస్యం అయిందని.. ఇందుకు క్షమించాల్సిందిగా కోరుతూ ఓ దరఖాస్తు కూడా దాఖలు చేశామని కదీమ్ తెలిపాడు. అయితే దీన్ని కూడా ఫిబ్రవరి 13, 2019లో కొట్టివేశారని వెల్లడించాడు. పిటీషన్‌దారు మారుమూల ప్రాంతానికి చెందినవాడు కావడం, హైకోర్టు తీర్పు వెల్లడించడంలో జరిగిన జాప్యం వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో ఆలస్యం అయ్యిందని కదీమ్ తెలిపాడు. దాంతో ఈ ఏడాది జూలై 12న అప్పీల్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కానీ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సుప్రీంకోర్టు విచారణలో కూడా జాప్యం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది విరాజ్ కదమ్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, "దురదృష్టవశాత్తు, తన కేసును ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీసుకొచ్చిన వ్యక్తి, తన అప్పీల్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించే నాటికి సజీవంగా లేరు. అతను ఇప్పుడు చట్టపరమైన వారసుల ద్వారా విచారణ కొనసాగుతుంది’’ అని తెలిపాడు. -
ప్రగతి భవన్ వద్ద కలకలం: ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
పంజగుట్ట (హైదరాబాద్): మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ప్రగతి భవన్ ముందు ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేపింది. మెదక్ జిల్లా, చిన్నశంకరం పేటకు చెందిన మొయినుద్దీన్ (38) బుధవారం సాయంత్రం తన ఆటోలో ప్రగతి భవన్ వద్దకు వచ్చి, బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి పైన పోసుకున్నాడు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువులు ఊర్లోఉన్న 100 గజాల ఇంటిని, స్థలాన్ని ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరేందుకే అక్కడికి వచ్చానని వెల్లడించాడు. -
ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు; నలుగురు మృతి
అమృత్సర్: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో సుఖ్వీందర్సింగ్ సోనీ మంగల్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మంగల్‌సింగ్‌తో పాటు ఒక కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో కుమారుడు సహా మనుమడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. కాగా ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పలు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయితే ఇరు కుటుంబాల మధ్య భూతగాదాల నేపథ్యంలో సుఖ్వీందర్సింగ్ పగ పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గురుదాస్‌పూర్ డీఎస్పీ హర్కిషన్ తెలిపారు. -
అధికారిపై పెట్రోల్ పోసి.. తానూ పోసుకున్న మహిళ
మన్ననూర్ (అచ్చంపేట): నాగర్‌కర్నూల్ జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ అధికారిపై చెంచు మహిళ పెట్రోల్ పోసి, తానూ పోసుకుని నిప్పంటించేందుకు యత్నించగా అక్కడున్నవారు అడ్డుకున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారానికి చెందిన 20 మంది చెంచులు 30 ఏళ్లుగా సమీపంలోని 60 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. నెల క్రితం ఆ భూములు సాగు చేయొద్దని చెంచులకు అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా తిరస్కరించారు. తాజాగా శుక్రవారం ప్లాంటేషన్ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు ఆ భూముల్లో మార్కింగ్ వేయడానికి వచ్చారు. దీంతో చెంచు మహిళా రైతులు వాగ్వాదానికి దిగారు. భూముల కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని తెగేసి చెప్పారు. అంతలోనే ఓ మహిళ అటవీశాఖ అధికారిపై పెట్రోల్ చల్లి తానూ పోసుకుని అగ్గిపుల్ల గీసేందుకు యత్నించింది. వెంటనే కొందరు లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇది తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడి వెళ్లి మాట్లాడారు. పోడు భూముల విషయాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, చెంచులను ఇబ్బంది పెట్టవద్దని 15 రోజుల క్రితమే అధికారులకు చెప్పామని పేర్కొన్నారు. -
చిచ్చు రేపిన ఇంటి స్థలం.. తల్లి, తమ్ముడి హత్య
ఆత్మకూర్ (ఎస్): ఇంటి స్థల వివాదం ఓ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆగ్రహావేశంతో ఊగిపోయిన ఓ వ్యక్తి తల్లిని, సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కందగట్ల గ్రామం బుడిగె జంగాల కాలనీకి చెందిన తూర్పటి ఎర్ర కిష్టయ్య, మరియమ్మ (70) దంపతులకు ఐదుగురు సంతానం. ఆస్తుల పంపకాలన్నీ పూర్తయ్యాయి. చిన్న కుమారుడు శ్రీనుకు భార్య లేకపోవడంతో తల్లి వద్దనే ఉంటున్నాడు. సోదరులు లక్ష్మయ్య, శ్రీను (27)ల మధ్య తండ్రి ఇచ్చిన స్థలం విషయంలో కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఈ విషయమై సోమవారం రాత్రి చోటుచేసుకున్న చిన్నపాటి గొడవ.. ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన లక్ష్మయ్య.. తమ్ముడు శ్రీనుపై దాడి చేసేందుకు పందులను వేటాడే బల్లెంతో వెళ్లాడు. తల్లి మరియమ్మ అడ్డుపడేందుకు యత్నించగా.. ఆ బల్లెం తగిలి విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది. వెంటనే శ్రీనును కూడా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి -
స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి
సాక్షి, కల్వకుర్తి: ఇంటి స్థలవివాదంలో కొందరు ఓ మహిళపై దాడికి పాల్పడి వివస్త్రను చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జేపీనగర్ తండాలోని ఓ ప్లాట్‌లో ఇటీవల ఓ మహిళ ఇంటి నిర్మాణం చేపట్టింది. వివాదాస్పదస్థలంలో నిర్మాణం వద్దంటూ తండావాసులు అభ్యంతరం చెప్పగా ఆమె మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. వారి అనుమతితో తిరిగి ఇంటి నిర్మాణం కొనసాగించింది. ఈ నెల 9న మళ్లీ తండావాసులు వచ్చి అడ్డుకోబోగా ఓ వ్యక్తితో ఆమె వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే 10వ తేదీ మధ్యాహ్నం పలువురు మహిళలు ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని విడిపించేందుకు విఫలయత్నం చేశారు. బాధితురాలిని బైక్‌పై వేరేచోటుకు తరలిస్తుండగా పలువురు తండావాసులు వెంబడించి వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులు ఆమెను రక్షించి ఇంటికి పంపారు. ప్రస్తుతం తండాలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ మహేందర్ తెలిపారు. చదవండి: క్షుద్ర పూజల పేరిట నిలువు దోపిడీ మొబైల్ దొంగతనం.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది -
Bethi Subhas Reddy: భూవివాదంతో నాకు సంబంధం లేదు
హబ్సిగూడ: కాప్రా డివిజన్ పరిధిలోని సర్వే నంబరు 152, 153 లోని 23 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ స్థలం వివాదంలో తాను తలదూర్చి నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుండటంతో కాప్రా తహసీల్దార్ గౌతంకుమార్ సూచనల మేరకు ఆక్రమణలకు గురికాకుండా చూశాం తప్పితే, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై గతంలో తహ సీల్దార్ ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. సదరు కేసులున్న వ్యక్తులు కోర్టులో పిటిషన్లు వేసి, మాపై కేసులు పెట్టించడం దారుణ మన్నారు. ఎవరు భూములు ఆక్రమించారో, ఎవరు తప్పులు చేశారో త్వరలో ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందని పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాపాడడమే తమ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భూ వివాదం: ఉప్పల్ ఎమ్మెల్యేపై కేసు -
భూ వివాదం: ఉప్పల్ ఎమ్మెల్యేపై కేసు
కాప్రా/జవహర్‌నగర్: కాప్రా పరిధిలోని ఓ భూవివాదంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డిపై కేసు నమోదైంది. సీఐ మధుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా మండల పరిధిలోని 152,153 సర్వే నంబర్లలో గల స్ధలంలో జూలకంటి నాగరాజు అనే వ్యక్తి ఈ ఏడాది మార్చి 16న ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి అనుచరులతోపాటు కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది రెండు జేసీబీలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నవారిని అడ్డుకుని జేసీబీల సహాయంతో వాటిని పూర్తిగా కూల్చివేశారు. అంతేకాకుండా నాగరాజును భయభ్రాంతులకు గురిచేసి ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఉప్పల్ ఎమ్మెల్యే, కాప్రా తహీసీల్దార్‌లపై కేసు నమోదు చేయాలని బాధితుడి తరఫు న్యాయవాది మేకల శ్రీనివాస్‌యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. æకోర్టు ఆదేశాల మేరకు జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: ఎమ్మెల్యే కాప్రాలోని భూవ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఈ విషయంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయి స్తానని ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి తెలిపారు. ‘ప్రభుత్వ భూమిని కాపాడాలని మేం చెప్పాం. అందులో తప్పేముంది. మేం ఎలాంటి తప్పు చేయలేదు. వారు ఎవరో కూడా నాకు తెలియదు. ప్రభుత్వభూమిని కాపాడాలని అధికారులు ఆ స్థలం వద్దకు వెళ్తే, వారిపై కొందరు దాడి చేసే అవకాశం ఉందని తెలపడంతో రక్షణ కల్పించాలని డీసీపీని కోరాం. 20 ఏళ్ల నుంచి ప్రజాజీవితంలో ఉన్నా. నేను ఏంటో ప్రజలందరికీ తెలుసు. నాపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలే’అని ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి అన్నారు. ఆవి ప్రభుత్వ అధీనంలోనివి.. ‘సర్వే నంబర్లు 152, 153లలో గల 23 ఎకరాల 13 గుంటల భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. మార్చి 16న ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తుండగా అడ్డుకుని కంచెలను తొలగించాం. ఇంతలో అడ్వొకేట్ మేకల శ్రీనివాస్‌యాదవ్, శరత్‌చంద్రారెడ్డి అనే వ్యక్తి తమ అనుచరులతో అక్కడికి చేరు కుని రెవెన్యూ సిబ్బంది విధులను అడ్డుకున్నారు. తహసీల్దార్‌తోపాటు సిబ్బందినీ తీవ్రంగా దూషించారు. బెదిరింపులకు పా ల్పడ్డారు. ఈ మేరకు తాము జవహర్‌నగర్ పోలీసులకు మార్చి 18న ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది. దీనికి ప్రతిగా.. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, తహసీల్దార్ గౌత మ్‌కుమార్ తమను బెదిరిస్తున్నారని ఆవ్యక్తు లు హైకోర్టును ఆశ్రయించారు ’అని కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్ తెలిపారు. చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా.. ప్రమాదమా? -
‘సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, సిరిసిల్ల: అండగా నిలవాల్సిన సొంత పార్టీ నాయకులే తన వ్యవసాయ భూమి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ లింగం రాణి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి తక్కళ్ల సుందర్ తాడూరు గ్రామ శివారు సర్వే నంబర్ 1147లో ఎకరం 22 గుంటలు వ్యవసాయ భూమిని 1985లో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారని అన్నారు. అప్పటినుంచి కాస్తులో తామే ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నారు. దీనిని సాకుగా చూపుతూ ఆ భూమి తమదేనని టీఆర్ఎస్ నాయకుడు కుర్మ రాజయ్య తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తనకు రూ.70 వేలు ఇస్తేనే భూమిని వదిలేస్తానని డిమాండ్ చేయడంతో గతేడాది రూ.30వేలు చెల్లించానని తెలిపారు. ప్రస్తుత సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ అన్న అనంతరెడ్డి ఆ భూమిని తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. వీరికి తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అండగా ఉన్నాడని ఆరోపించారు. సొంత పార్టీ వాళ్లే ఇలా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా వారికే వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుంటానని ఆమె హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులపై సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడంపై మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయం మండల టీఆర్ఎస్లో చిచ్చు రేపుతుందో? లేదా టీ కప్పులో తుపానులా సద్దుమణుగుతుందోనని టీఆర్ఎస్ కార్యకర్తలు గుసగసులు పెడుతున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌న్యూస్ కన్నీరు పెడుతున్న లింగం రాణి -
అరెకరం భూమి కోసం అన్న ప్రాణం తీసిన తమ్ముడు
సాక్షి, దామరగిద్ద (నారాయణ పేట): తనకు రావాల్సిన అరెకరం భూమి రికార్డు చేసివ్వడం లేదని, రైతుబంధు డబ్బులు తనే తీసుకుంటున్నాడనే అక్కసుతో ఓ తమ్ముడు సొంత అన్నను కడతేర్చాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని క్యాతన్‌పల్లిలో బ్యాగరి హన్మంతు (52), బుగ్గప్ప, భీమప్ప అన్నదమ్ములకు ఆరెకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అన్న హన్మంతుకు మూడెకరాలుండగా మిగిలిన ఇద్దరికీ ఎకరాన్నర చొప్పున నమోదై ఉంది. అన్న పేరుతో ఉన్న అదనపు భూమిలో మిగిలిన ఇద్దరికి చెరో అరెకరం భూమిని రికార్డు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటలకు హన్మంతు శివారులోని వరి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అదేరాత్రి 11 గంటలకు అక్కడికి తమ్ముడు బుగ్గప్ప వెళ్లి అన్నతో గొడవకు దిగగా పక్కపొలంలో ఉన్న రైతు బ్యాగరి బాలన్న వారిని విడిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే బు గ్గప్ప కత్తితో చేసిన దాడి లో అన్న హన్మంతు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
హఫీజ్‌పేట భూవివాదం: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 80లోని భూమి విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు మధ్య గత కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి హైకోర్టు ముగి ంపు పలికింది. ఈ సర్వే నంబర్లోని 50 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులదేనని తేల్చిచెప్పింది. ఈ భూమిని వక్ఫ్‌బోర్డుకు చెందినదిగా పేర్కొంటూ చేసిన తీర్మానాన్ని కొట్టేసింది. అలాగే రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఎంట్రీలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్.రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. తమ భూములను వక్ఫ్‌బోర్డు భూములుగా పేర్కొంటూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కటికనేని ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ ఆధారంగా పిటిషనర్ల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో చేర్చండి. అలాగే పిటిషనర్ల భూమి పొజిషన్ విషయంలో ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు జోక్యం చేసుకోరాదు. పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు జరిమానాగా చెల్లించాలి’అని తీర్పులో పేర్కొంది. ఈ భూమి కోసమే కిడ్నాప్ యత్నం హఫీజ్‌పేటలోని ఈ భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ మరికొందరితో కలసి కె.ప్రవీణ్‌కుమార్, ఆయన సోదరులను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్లు పరారయ్యారు. తర్వాత అఖిలప్రియతో పాటు కిడ్నాప్ కుట్రలో పాల్గొన్న మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలప్రియ తదితరులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. భార్గవ్‌రామ్ తదితరులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. -
హీరో యశ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
యశవంతపుర: కేజీఎఫ్ ఫేమ్.. హీరో యశ్‌పై రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యశ్ తల్లిదండ్రులు ఇటీవల దుద్ధ హోబళి తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో అక్రమంగా ప్రహరీ నిర్మించి రైతులకు ఇబ్బందులకు గురి చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గూండాలను రప్పించి గ్రామస్తులను యశ్ భయపెడుతున్నట్లు ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవలే యశ్ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగింది. యశ్ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందినవారు. హాసన్‌లో సొంత ఇల్లు ఉంది. హాసన్ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని యశ్ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: భూ వివాదంలో హీరో యశ్ కుటుంబం -
హీరో యశ్ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ
సాక్షి, బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగింది. యశ్ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందినవారు. హాసన్‌లో సొంత ఇల్లు ఉంది. హాసన్ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని యశ్ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు వెళ్లడం కష్టమని, గ్రామ పటంలో ఉన్నట్లు దారి వదలాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తాతల కాలం నుండి సాగు చేసుకొంటున్న భూముల్లోకి దారిని మూసివేయడం తగదని పట్టుబట్టారు. ఈ విషయమై చర్చించడానికి నటుడు యశ్ మంగళవారం తిమ్మాపురకు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కి పిలిపించి పంచాయతీ చేశారు. యశ్ వస్తున్నట్లు తెలిసి వందలాది అభిమానులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. -
గుడ్‌న్యూస్.. గుర్రంబోడు భూములకు మోక్షం!
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: రాజకీయ రణరంగానికి వేదికైన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు భూములకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఏళ్లుగా రావణకాష్టంలా మారిన ఈ భూముల వివాదానికి కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో చేయించిన సర్వేతో తెర పడినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజనులు సాగు చేసుకుంటున్న సర్వేనంబర్ 540లో 120.16 ఎకరాల భూమి తమదని గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ వాదిస్తూ వస్తోంది. అయితే క్షేత్రస్థాయి సర్వేలో ఇవి గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు తేలడంతో సదరు సంస్థకు అప్ప ట్లో మఠంపల్లి తహసీల్దార్ చేసిన మ్యుటేషన్ రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే ఈ భూమి సాగు చేసుకుంటున్న 129 మంది గిరిజన రైతులకు అసైన్ చేసేలా ప్రతిపాదనలు పంపాలని సదరు తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. రెండేళ్లుగా గుర్రంబోడు గిరిజన రైతుల ఆర్తనాదాలను ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సీఎం అసెంబ్లీలో ప్రస్తావించడంతో.. మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 540లో 6,239.07 ఎకరాల భూమి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ప్రభుత్వ, అటవీశాఖ పరిధిలో కొంత ఉండగా, పలు కంపెనీలు లీజు తీసుకోవడంతోపాటు కొన్ని కంపెనీలు కొనుగోలు చేశాయి. మరికొంత భూమిని గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ సర్వే నంబర్‌లోనే నాగార్జునసాగర్ నిర్వాసితులు 328 మంది రైతులకు 1,876.01 ఎకరాలు డీఫాం పట్టాలు ఇచ్చారు. ఈ భూములను సదరు రైతులు అమ్ముకోవచ్చు. కొంతమంది ఈ భూములను అమ్మడంతో కాలక్రమేణా చేతులు మారాయి. 6 వేలకు పైగా ఎకరాల భూమి ఈ సర్వే నంబర్లో ఉంటే సుమారు 12 వేల ఎకరాలకు పైగా పట్టాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ ఈ భూముల విషయమై అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ తర్వాత ఓ కంపెనీ, గిరిజనుల మధ్య ఇటీవల భూ వివాదం తారస్థాయికి చేరింది. ఈ భూముల విషయమై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. సర్వేతో తేలిన వాస్తవాలు గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ కొనుగోలు చేసినట్టు చూపుతున్న 400 ఎకరాలకు పై చిలుకు భూమిలో గిరిజనులు 120.16 ఎకరాలు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. సర్వే ప్రారంభంలోనే ఈ భూముల విషయంలో కలెక్టర్ అప్పట్లో అక్కడ విధులు నిర్వహించిన ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్ చేశారు. సదరు సంస్థకు అక్రమంగా మ్యుటేషన్ చేసినందుకు గాను కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 10 నుంచి ప్రారంభమైన సర్వే ఇటీవల ముగిసింది. 540 సర్వేనంబర్‌లోని భూమి ఎవరి అధీనంలో ఎంత ఉందో తేల్చారు. గ్లేడ్ సంస్థ తమదని చెబుతున్న 120.16 ఎకరాలను ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు సర్వేలో గుర్తించారు. 9.18 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ గుండెబోయినగూడెం రెవెన్యూ పరిధి సర్వేనంబర్ 11లో 5.20 ఎకరాలు, మఠంపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 68లో 3.38 ఎకరాలు.. మొత్తం 9.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు సర్వేలో తేలింది. ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని మఠంపల్లి తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. ఎన్వీఆర్ బయోటెక్ సంస్థ నుంచి 233.10 ఎకరాలు గ్లేడ్ సంస్థకు మార్పు చేసింది. ఇందులో 92.15 ఎకరాలకు సంబంధించి భూమి అమ్మిన ఎన్వీఆర్ బయోటెక్ సంస్థ పేరు కాకుండా ఇతరుల పేరున ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల పరిశీలనలో తేలింది. దీంతో 92.15 ఎకరాలపై మళ్లీ తాజా విచారణ చేసి సమగ్ర నివేదికను పంపాలని తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. -
ప్రాణం తీసిన భూతగాదా..
దహెగాం: భూవివాదంలో ఒకరు దారుణ హత్యకు గురైన సంఘటన దహెగాం మండలం ఖర్జీ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒడెల హన్మంతు, ఒడెల మల్లేశ్ అన్నదమ్ములు. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఐదెకరాలు కొన్నారు. భూమిని పంచుకున్నా.. పట్టామాత్రం హన్మంతు పేరునే ఉంది. మల్లేష్ కొన్నేళ్లక్రితమే చనిపోగా.. అతడి కుమారులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిని తమకు పట్టాచేసి ఇవ్వాలని హన్మంతును కోరుతున్నారు. అయితే భూమి కొన్న సమయంలో డబ్బులు ఖర్చయ్యాయని, చెల్లిస్తే పట్టా చేసి ఇస్తానని హన్మంతు అంటున్నాడు. దీనిపై పలుమార్లు పంచాయితీ కూడా పెట్టారు. బుధవారం పత్తికట్టె తొలగించడానికి ట్రాక్టర్ తీసుకోని హన్మంతు కుమారుడు శంకర్ తన మేనత్త మధునక్కతో కలిసి చేనుకువెళ్లాడు. మధునక్క ఆమె సొంత చేనుకు వెళ్లగా శంకర్ ట్రాక్టర్ సహాయంతో కట్టెను తొలగిస్తున్నాడు. అదే సమయంలో మల్లేష్ కుమారులు సాయి, సంతోష్, సతీష్ వచ్చి అడ్డుకున్నారు. ట్రాక్టర్‌ను అడ్డుకోవడంతో డ్రైవర్ ట్రాక్టర్‌తోపాటు వెళ్లిపోయాడు. అయితే మాటమాట పెరగడంతో సాయి, సంతోష్, సతీశ్ కలిసి శంకర్‌పై కర్రలతో దాడికి దిగారు. మధునక్క పరుగెత్తుకుంటూ వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెకూ గాయాలయ్యాయి. కొద్దిదూరం పరుగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. బంధువులు వచ్చిసరికే శంకర్ రక్తపుమడుగులో మృతిచెంది కనిపించాడు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ వైవీఎస్.సుధీంద్ర, కాగజ్‌నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై రఘుపతి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రఘుపతి తెలిపారు. అయితే నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. చదవండి: పట్టపగలే బాలికపై లైంగిక దాడికి యత్నం! -
చార్మినార్‌నూ రిజిస్టర్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్భవన్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? అని వక్ఫ్‌బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్‌బోర్డుకు 65 ఏళ్ల కిందట ఇచ్చిన భూమిని 2014 వరకు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదని నిలదీసింది. హఫీజ్‌పేటలోని సర్వే నెంబర్ 80లోని భూములను వక్ఫ్‌బోర్డు భూములుగా పేర్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌చేస్తూ కె.ప్రవీణ్‌కుమార్, సాయిపవన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ భూములు మునీరున్నీసా బేగంకు చెందినవని, 1966లో వాటిని విక్రయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. 2006లో ఈ భూములపై తుది డిక్రీ వచ్చిందని, సుప్రీంకోర్టులో సైతం రాష్ట్రానికి చుక్కెదురైందని తెలిపారు. 1955లో మునీరున్నీసా వక్ఫ్‌నామాగా ప్రభుత్వం పేరొంటున్నా అందులో ఆమె సంతకంలేదని, అయితే 1966లో ఆమె ఆ భూమిని విక్రయించినప్పుడు సంతకాలు చేసిందని తెలిపారు. 2014 నవంబర్‌లో ఈ భూమిని వక్ఫ్‌బోర్డు భూమిగా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. హఫీజ్‌పేట భూములు ప్రభుత్వానికి చెందినవని, 1963లో నిజాం వారసులుగా పేర్కొంటూ కొందరు ఈ ఆస్తులను పంచుకున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు నివేదించారు. మునీరున్నీసా చనిపోయిన తర్వాత తప్పుడు పత్రాలతో ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని ముతవల్లీ తరఫు న్యాయవాది అనుమానం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు తరఫు న్యాయవాది వాదనలకోసం ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదావేసింది. చదవండి: కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని.. -
ప్రాణం తీసిన భూవివాదం: బడి ఎదుటే హత్య
బటాలా (పంజాబ్): దాయాదుల మధ్య ఏర్పడిన వివాదం ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రెండు ఇళ్ల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో ఏర్పడిన గొడవ ఆ విద్యార్థి ప్రాణం మీదకు వచ్చింది. దాయాదులు ఆయుధాలతో వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బటాలాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుమాన్ గ్రామానికి చెందిన 12వ తరగతి చదువుతున్న సిమ్రాన్‌దీప్ సింగ్ (18) తన సోదరుడు హర్మన్దీప్ సింగ్‌తో కలిసి పాఠశాలకు వెళ్లాడు. తరగతుల అనంతరం పాఠశాల నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరిపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆయుధాలతో వారిపై దాడికి పాల్పడ్డారు. తల, మెడ, ఛాతీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సిమ్రాన్‌దీప్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ఈ దాడి నుంచి హర్మన్దీప్ సింగ్ ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ వారి చేతికి చిక్కడంతో సిమ్రాన్ దీప్ ప్రాణాలు కోల్పోయాడు. పక్కింటి వారితో నెలకొన్న భూ వివాదమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పక్కింటివారిపై మృతుడి తండ్రి హర్దేవ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఐపీసీ 302, ఇతర సెక్షన్ల కింద మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి సురేందర్ సింగ్ తెలిపారు. -
‘అక్కడికి డీసీపీని పంపింది సీఎం కేసీఆరే’
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడలో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ దేవాదాయ భూమిని కాపాడాలని బీజేపీ ఆందోళన చేస్తుంటే తమ కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ధ్వజమెత్తారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కబ్జాదారులకు పోలీసులు అండగా ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు. మహిళలు అని కూడా చూడకుండా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఉప్పుగూడ ఘటనకు డీసీపీ పూర్తి బాద్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. డీసీపీని పంపింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆరోపించారు. కేసీఆర్ బయటకొచ్చి మట్లాడాలని సవాల్ విసిరారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహారించి, కబ్జాదారుకలు కొమ్ముకాస్తున్న డీసీపీపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అరెస్ట్ చేసిన కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన తనను కూడా అడ్డుకున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్లిస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే డీసీపీకి ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నారని, అందుకనే ఇష్టారీతిన వ్యవహరించారని చెప్పుకొచ్చారు. అరెస్టులకు కోర్టు ఆర్డర్ ఉంటే చూపించాలని చాలెంజ్ చేశారు. కాగా, పాతబస్తీలోని ఉప్పుగూడ కాళికామాత దేవాలయంకు సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదయశాఖకు చెందిన స్థలాన్ని.. ఓ వ్యక్తి ఆ స్థలం నాదంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్డర్లు తీసుకోవడం, ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి బుధవారం అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. -
పాతబస్తీ: 70 కోట్లు చేసే భూమిపై ఘర్షణ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడ కాళికామాత దేవాలయంకు సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదయశాఖకు చెందిన స్థలాన్ని.. ఓ వ్యక్తి ఆ స్థలం నాదంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్డర్లు తీసుకోవడం, ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, 1951లో ఈ స్థలాన్ని దేవాదయశాఖ అధీనంలోకి తీసుకొని ఇప్పటివరకు 11 సార్లు వేలం పాట వేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. ఒకసారి వేలం పాట కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో వేలం పాటలో ధర తక్కువగా వచ్చిందని సీపీఐ నాయకులు దేవాదయ శాఖ ముందు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించడంతో వేలం పాట రద్దు చేశారు. అప్పటి నుంచి రాని వ్యక్తి తాజాగా ఆ స్థలం ఆలయ ట్రస్టీ తనకు అమ్మిందని ఆలయ భూముల్లో చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మిస్తుండగా బీజేపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. నా భూముల్లో నేను నిర్మాణాలు చేసుకుంటుంటే స్థానికులు అడ్డు పడుతున్నారంటూ ఆ వ్యక్తి సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అర్డర్లు తీసుకొచ్చారు. దీంతో బుధవారం పోలీసులు పెద్ద ఎత్తున ఆలయస్థలం వద్దకు చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి అక్కడకు చేరుకొని అడ్డుకోవడంతో ఘర్షణకు దారితీసింది. చదవండి: (నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లకు ఏమైంది!) -
తుపాకీతో వృద్ధుడి వీరంగం
సాక్షి, చెన్నై : స్థల వివాదంలో 70 ఏళ్ల వృద్ధుడు వీరంగం సృష్టించాడు. తన తుపాకీతో కాల్చ డంతో ఇద్దరు గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ సంఘటన దిండుగల్ జిల్లా పళనిలో చోటు చేసుకుంది. వివరాలు..అక్కరై పట్టికి చెందిన ఇళంగోవన్(58)కు పళని టౌన్లో రూ.1.5 కోట్ల విలువ చేసే 12 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలం తనదేనంటూ పళని థియేటర్ యజమాని నటరాజన్(70) ఆక్షేపించాడు. సోమవారం ఉదయం తన మామ పళని స్వామి, వియ్యంకుడు సుబ్రమణితో కలసి ఆ స్థలం వద్దకు ఇళంగోవన్ వచ్చాడు. అదే సమయంలో నటరాజన్ వారిని అడ్డుకోవడంతో వాగ్వాదానికి దారితీసింది. దీంతో నటరాజన్ తుపాకీతో కాల్చాడు. ఓ తూటా పళని స్వామి కడుపులోకి, మరో తూటా సుబ్రమణి తొడలో దిగడంతో కుప్పకూలారు. ఇది గమనించిన ఓ వ్యక్తి నటరాజన్‌ను అడ్డుకునేందుకు యత్నించడంతో అతడి మీద సైతం కాల్పులకు తెగబడ్డాడు. మరో వ్యక్తి నటరాజన్‌పై రాళ్ల దాడి చేయడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఎస్పీ ప్రియ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డ వారిని దిండుగల్ ఆస్పత్రికి తరలించారు. నటరాజన్‌ను అదుపులోకి తీసుకుని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్పుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ పంచాయితీ
సాక్షి, నెన్నెల: రెవెన్యూ, అటవీ శాఖల భూములకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడం.. ఇరుశాఖల మధ్య సమన్వయలోపంతో పేద రైతులు నష్టపోతున్నారు. ఇరు శాఖల సంయుక్త సర్వేతో సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా సరైన కార్యాచరణ లేక ఏళ్ల తరబడి భూముల సమస్య ఎడతెగడం లేదు. జిల్లాలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన భూములు పలుచోట్ల వివాదాల్లో చిక్కుకున్నాయి. రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిని సాగు చేసుకునేందుకు వెళ్లిన లబ్ధిదారులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఆ భూమి రిజర్వు ఫారెస్ట్‌కు చెందినదని, ఎవరూ సాగు చేయవద్దని అభ్యంతరాలు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్‌ను ఆనుకొని ఉన్న మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. కా ని రెండు శాఖల అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల భూములు వివాదంలో చిక్కుకున్నాయి. ఫలితంగా 10 వేల మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. కొరవడిన సమన్వయం రెవెన్యూ శాఖ జిల్లాలోని మిగులు భూములను గుర్తించి.. పేదలకు పట్టాలు ఇచ్చి.. సాగు చేసుకోవచ్చని రైతులకు భ రోసా ఇచ్చింది. అయితే ఆ భూములన్నీ రిజర్వు ఫారెస్ట్‌వని, అందులో పంటలు ఎలా వేస్తారని అటవీ శాఖ అధికారులు కేసులు పెడుతున్నారు. దీంతో పట్టాలు పొందిన నిరుపేదల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో సరైన రికార్డులు లేకపోవడమే ఈ వివాదాలకు కారణమవుతోంది. వివాదం ఎందుకు..? రైతులకు పంపిణీ చేసిన భూములు వివాదాస్పదం కావడానికి పలు కారణాలు ఉన్నాయి. రిజర్వు ఫారెస్ట్ భూములకు హద్దులు లేకపోవడం ఒక కారణమైతే.. రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న రెవెన్యూ అధికారులు వారికి పొజిషన్ చూపించకపోవడం మరో కారణం. ఈ సమస్యతో ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇరు శాఖల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. తమ సమస్య పరిష్కరించాలంటూ బాధితులు తహసీల్దార్లు మొదలు కలెక్టర్ వరకు, ఎంపీపీ మొదలు ఎమ్మెల్యే వరకు మొరపెట్టుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. వివాదంలో 25 వేల ఎకరాలు జిల్లాలోని 18 మండలాల్లో దాదాపు 25 వేల ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో చిక్కుకుని ఉన్నాయి. అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్న నెన్నెల మండలంలో 7,600 ఎకరాలు, నెన్నెల, బొప్పారం గ్రామాల మధ్య ఉన్న సర్వే నంబర్ 671, 672, 674లో 1200 ఎకరాలు, నెన్నెల మండలం సింగాపూర్‌లో సర్వే నంబర్ 34, 36లో 950 ఎకరాలు, కొంపెల్లి, పొట్యాల, కొత్తూర్ శివారు సర్వే నంబర్ 4/2,4/3లో 600 ఎకరాలు, కోనంపేట సమీపంలోని చీమరేగళ్ల వద్ద సర్వే నంబర్ 660లో 700 ఎకరాలు, పుప్పాలవానిపేటలో సర్వే నంబర్ 165/82, 125/82లో 600 ఎకరాలు, కుశ్నపల్లిలో సర్వే నంబర్ 67లో 400 ఎకరాలు, సీతానగర్లోని సర్వే నంబర్ 1లో 1425 ఎకరాలు, జంగల్‌పేటలోని సర్వే నంబర్ 22, 24, 27, 55లో 600 ఎకరాలు, జైపూర్ మండలం గుత్తేదారిపల్లి శివారులోని సర్వే నంబర్ 368, 369/12లో 200 ఎకరాలు, వేమనపల్లి మండలం గోదుంపేటలోని సర్వే నంబర్ 3లో 350 ఎకరాలు, శ్రావణ్‌పల్లి శివారులోని సర్వే నంబర్ 61లో వంద ఎకరాలు, సూరారంలో మరో 200 ఎకరాలు, చెన్నూర్ మండలం కన్నెపల్లి, బుద్దారం, కంకారం గ్రామాలకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 354లో 800 ఎకరాలు, మందమర్రి మండలం సారంగపల్లిలో సర్వే నంబర్ 33లో 220 ఎకరాలు, కన్నెపల్లి మండలం రెబ్బెనలో సర్వే నంబర్ 247లో 250 ఎకరాలు, ఆనందాపూర్‌లోని సర్వే నంబర్ 101లో 120 ఎకరాలు, మెట్‌పల్లిలోని సర్వే నంబర్ 20, 22లో 150 ఎకరాలు, జజ్జరవెల్లి సర్వే నంబర్ 88, 89లో 400 ఎకరాల భూమి వివాదంలో ఉంది. కోటపల్లి మండలం కొండంపేట, పారిపల్లిలో దాదాపు 800 ఎకరాలు, సిర్పూర్లో 6800 ఎకరాలు, ఉట్నూర్‌లో 4300 ఎకరాలు, కౌటాలలో 3600, రెబ్బెనలో 2900, దహెగాంలో 580 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. తాండూర్, బెజ్జూర్, సిర్పూర్(టీ), ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కడెం, ఖానాపూర్, ఇంద్రవెల్లి మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. భూమి తమదంటే తమదని ఇరు శాఖల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో వేల ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. జాయింట్ సర్వేపై జాప్యం ఆర్భాటంగా పట్టాలు అందజేసిన అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆ తర్వాత పేదల సమస్యలను ప ట్టించుకోవడం లేదు. కేటాయించిన భూములు ఏ శాఖకు చెందుతాయో నిర్ధారించాల్సిన జాయింట్ స ర్వేలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూమి మోకా (పొజిషియన్) ఎక్కడుందనేది చూపకపోవడంతో ఆ నంబర్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దున్నడం ప్రారంభించారు. రైతులు సర్వే నంబర్ ఆ«ధారంగా ప్రభుత్వ భూమిలోనే సాగు చేసుకుంటున్నారు. కొన్నాళ్లు సాగు చేసుకున్నాక ఆ భూ ములు రిజర్వు ఫారెస్ట్‌కు చెందినవని అటవీ శాఖ అడ్డుకుంటోంది. రికార్డులో మాత్రం పీపీ ల్యాండ్‌కు పట్టాలు ఇస్తున్నామని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. పట్టాల పేరిట అటవీ భూములను కబ్జా చే స్తున్నారని ఫారెస్ట్ అధికారులు ఆరోపిస్తున్నారు. అట వీ భూములు నిర్ధారించేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దీంతో రిజర్వు ఫారెస్ట్ సరిహద్దులేవో తెలియడం లేదు. ప్రభుత్వం జిల్లాలో రక్షిత అటవీ ప్రాంతాన్ని గుర్తించినప్పుడు అందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయలేదు. దీంతో మిగులు భూములపై వివాదం కొనసాగుతోంది. ముల్కల్లలో భూముల పరిశీలన మంచిర్యాలరూరల్(హాజీపూర్): అటవీ, రెవె న్యూ శాఖల మధ్య నలుగుతున్న హాజీపూర్ మండలం ముల్కల్లలోని భూములను అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. 1991లో ఏసీసీ పరిధిలోని 11 ఎకరాలను అటవీశాఖకు కేటాయించారు. తమ శాఖ భూములను అటవీ శాఖ ఆక్రమించుకుంద ని రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, అటవీశాఖల వద్ద ఉన్న రికార్డుల ను ఆమె పరిశీలించారు. 205 సర్వే నంబర్లోని 23.10 ఎకరాలు అటవీశాఖ కబ్జాలో ఉండగా.. అటవీ శాఖకు 11, మిగిలిన 12 ఎకరాలు రెవెన్యూ శాఖకు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. సమగ్ర సర్వే జరిపి రెండురోజుల్లో ఇరు శా ఖల భూ హద్దులు నిర్ణయించాలని అధికారులకు జారీ చేశారు. ఆమె వెంట తహసీల్దార్ మహ్మద్ జమీర్, ఎంపీడీఓ అబ్దుల్‌హై, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి నాగావత్ స్వామి, గిర్దావర్ రాజ్‌మహ్మద్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ముల్కల్ల బీట్ అధికారి తిరుపతి ఉన్నారు. -
మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన దుండగులు!
లక్నో: భూవివాదం నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మాజీ ఎమ్మెల్యేను ప్రత్యర్థులు కొట్టి చంపారు. లకీంపూర్ ఖేరీలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మిశ్రా తన కుమారుడితో కలిసి వెళ్తున్న సమయంలో త్రికోలియా బస్టాప్ వద్ద కాపుగాసిన దుండగులు వారిపై కర్రలతో దాడికి దిగారు. గాయాలపాలైన నిర్వేంద్ర కుమార్‌ని, ఆయన కుమారుడు సంజీవ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. నిర్వేంద్ర కుమార్ ప్రాణాలు విడిచారు. మాజీ ఎమ్మెల్యే మృతితో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపూరన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. కాగా, దుండగులు తోసేయడంతోనే మాజీ ఎమ్మెల్యే గాయాలపాలై మరణించారని జిల్లా ఎస్పీ చెప్పారు. నిజానిజాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుస్తాయని అన్నారు. భూవివాదం కారణాలతో ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిర్వేంద్ర కుమార్ మిశ్రా పలియా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలాఉండగా.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్‌కుమార్ లల్లూ విమర్శించారు. (చదవండి: తుదిశ్వాస విడిచిన కేశవానంద భారతి) -
గ్రామ కంఠం భూమి కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
చినికి చినికి గాలి వానలా మారిన భూ వివాదం
సాక్షి, మహబూబ్‌నగర్ / నాగర్‌కర్నూల్: గ్రామ కంఠం భూమికి సంబంధించిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో మూడున్నర ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. దానిలో ప్రకృతి వనం నిర్మించాలని గ్రామ పంచాయతీ తీర్మానించింది. అయితే ఆ భూమి గతంలో రాజులకు చెందినదిగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూమి గ్రామ కంఠంలో ఉంది. అయితే కొంతమంది తాము రాజుల వారసులమని ప్రచారం చేసుకుంటూ ఆ భూమి తమకే చెందుతుందంటున్నారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన మరికొందరు ఆ భూమిలో గుడిసెలు వేసుకునేందుకు వచ్చారు. దీన్ని పెద్ద వివాదంగా చేయాలనే ఉద్దేశంతోనే కొంత మంది గ్రామస్తులను ఉసిగొల్పుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో గ్రామ కంఠం భూమి అన్యాక్రాంతం కావడానికి వీలు లేదని చెప్పి మరో వర్గం అక్కడికి చేరుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. -
పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు
సాక్షి, మేడ్చల్: కొత్త పాసు పుస్తకాల కోసం అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు ఆశ్రయించగా, ఆర్ఐ కిరణ్ ఇళ్లు నిర్మించుకుంటున్నాడని రూ.35 లక్షలు అప్పు ఆయనకు ఇప్పించి, ఇప్పటి వరకు ఇవ్వలేదని కీసర దాయారకు చెందిన రైతు కుంటోళ్ల దశరథ తెలిపారు. మా రాంపల్లి దాయార గ్రామానికి సంబంధించిన భూముల వ్యవహారంలో పాసు పుస్తకాల జారీ విషయంపై రియల్టర్ బ్రోకర్ల నుంచి రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ... ఏసీబీకి చిక్కటంతో ఆయన లంచావతారం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గతంలోనే డబ్బులివ్వాలని తహసీల్దార్ నాగరాజుకు వద్దకు వెళ్లితే... తనపై అక్రమంగా 353 ఐపీసీ కింద కేసు నమోదు చేయించి తీవ్రంగా వేధించారని దశరథ తెలిపారు. కీసర దాయార గ్రామంలో 173, 174, 175, 176, 179, 213 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన కొత్త పాసు పుస్తకాల కోసం నాగరాజును తరచు కలిసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వకపోగా ఆర్ఐ కిరణ్‌కు ఇప్పించిన రూ. 35 లక్షలు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ సకాలంలో స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. కొత్త పాసు పుస్తకాలు కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏసీబీకి పట్టుబడ్డ వెంకటేశ్వరరెడ్డి: రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కోనసాగుతున్నాయి. సర్వేయర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డిపై అధికారలు తనిఖీలు నిర్వహించారు. రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకటేశ్వరరెడ్డి రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన సర్వే రిపోర్టు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. -
భూ వివాదంలో ఘర్షణ: పోలీసులపై సస్పెన్షన్ వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం ఉదయం రెండు వర్గాల మధ్య నెలకొన్న భూ వివాదం పరిష్కరించడానికి గ్రామ పంచాయతి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. దీంతో రెండు వర్గాలకు చెందినవారు ఘర్షణకి దిగి పరస్పరం దాడికి పాల్పడ్డారు. (సైకో యువకుడు: మనిషి పుర్రెను..) ఒక వర్గానికి చెందిన తండ్రి దయాశంకర్ మిశ్రా ఆయన కుమారుడు ఆనంద్ మిశ్రా తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ హింసకు సంబంధించి మరో వర్గానికి చెందిన రాజేష్ కుమార్ మిశ్రా అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణ నివారించలేకపోయిన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (మద్యం అక్రమ రవాణా: బీజేపీ నేత అరెస్ట్) -
ఎమ్మెల్యే దానంపై పోలీసులకు ఫిర్యాదు
-
వైరల్: ‘బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే దానం’
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌కు చెందిన ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంక్ అధికారులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్‌లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ బ్యాంక్ అధికారుల విధులకు అడ్డుతగిలారు. ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ) -
రోడ్డుపై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
లక్నో: పోలీసుల నిర్లక్ష్యం తల్లీకూతుళ్లను ఆత్మహత్యకు ప్రేరేపించింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు బాధ్యులైన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే వీరిద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వివరాలు.. అమేథి జామో ప్రాంతానికి చెందిన గుడియాకు పొరుగువారితో మురికి కాల్వకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గత నెల 9న ఇద్దరికి గొడవ జరిగింది. దాంతో ఇరు పక్షాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా పొరుగువారు తమను బెదిరిస్తున్నారంటూ గుడియా పోలీసులకు తెలిపింది. కానీ వారు పట్టించుకోలేదు. దాంతో పోలీసులు పొరుగువారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని.. తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని గుడియా ఆవేదనకు గురయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం కుమార్తెను తీసుకుని రాష్ట్ర అసెంబ్లీ సమీపంలోని లోక్ భవన్ దగ్గరకు వెళ్లింది. అక్కడే రోడ్డు మీద తల్లీకూతుళ్లిద్దరు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయలైన గుడియాను, ఆమె కుమార్తెను లక్నో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఇందుకు కారణమయిన జామో ఇంచార్జ్ పోలీసు అధికారితో పాటు మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
తండ్రిని చంపిన కొడుకు
అక్కన్నపేట (హుస్నాబాద్): భూ వివాదం వల్ల కన్న తండ్రిని కొడుకే హత్య చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లునావత్ సోమ్లానాయక్ (70), అతని కుమారుడు సమ్మయ్యకు మధ్య ఎనిమిదేళ్లుగా భూ తగాదాలు నడుస్తున్నాయి. సోమ్లాకు ముగ్గురు కుమారులు ఉండగా ఒక కుమారుడు కొంతకాలం కిందట మృతి చెందాడు. ఆస్తి పంపకంలో తన వాటా ఇంకా రావాల్సి ఉందని పెద్ద కొడుకు సమ్మయ్య.. తండ్రితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట పొలం వద్ద తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఉన్న సమ్మయ్య ఆదివారం పొలం నుంచి ఇంటికి వస్తున్న తండ్రిని మార్గమధ్యలో కర్రతో తలపై బలంగా కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రస్తుతం కొడుకు సమ్మయ్య, కోడలు లక్ష్మి పరారీలో ఉన్నారని ఎస్సై రవి తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. -
షేక్‌పేట భూ వివాదంలో సరికొత్త వ్యూహం
-
ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది
సాక్షి, సిటీబ్యూరో : ‘కుదిరితే కాసులు..లేకుంటే కోర్టు కేసులుగా..’ తయారైంది ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణ పరిస్థితి. హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ శాఖ అంటేనే ప్రభుత్వ భూములు...వాటి పరిరక్షణే ప్రధాన బాధ్యత. ఇక అత్యంత విలువ గల స్థలాలు కావడంతో అటూ అక్రమార్కులకు... ఇటు అధికారులకు కాసుల పంట పండుతోంది. తాజాగా వెలుగు చూసిన బంజారాహిల్స్ భూ వివాదంలో ఇరువర్గాల సరికొత్త వ్యూహం బెడిసికొట్టినట్లయింది. ఒకవైపు మధ్యంతర ఉత్తర్యులు అడ్డం పెట్టుకొని స్థలం సర్వే, ఆన్లైన్లో అప్డేట్కోసం ప్రయత్నించడం..మరోవైపు ఒక స్థలంపై ఫిర్యాదు చేసి అసలు వివాదాస్పద స్థలంపై బేరసారాలు నడిపి కాసులుదండుకుంటూ ఏసీబీ చేతిలో చిక్కక తప్పలేదు. ఏకంగా రూ.30 లక్షల డీల్ కుదుర్చుకొని రూ.15 లక్షలు తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం సంచలనం సృష్టించగా, తహసీల్దార్ సుజాత ఇంట్లో రూ.30 లక్షల నగదు, అరకిలో బంగారు నగలు ఏసీబీ అధికారులకు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఏసీబీ విచారణలో మరి కొందరి చేతివాటం కూడా వెలుగు చూడటం రెవెన్యూ యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, తహాసీల్దార్ సుజాతను కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. అమీర్‌పేట తహసీల్దార్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. (షేక్‌పేట భూవివాదం కేసు : రూ.30 లక్షలు ఎక్కడివి?) ఇదీ కథ.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సర్వేనెంబర్ 129/59లో అత్యంత విలువగల 4,865 చదరపు గజాల భూమిపై గత రెండు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. హైదరాబాద్ పాతబస్తీ మీరాలం మండికి చెందిన సయ్యద్ అబ్దుల్ ఖలీద్ అనే వ్యక్తి తన తండ్రి అబ్దుల్ రషీద్ 1969లో ఈ భూమిని కొనుగోలు చేశాడని పేర్కొంటుండగా.. అది ప్రభుత్వ స్థలమంటూ సివిల్ కోర్టు 1998లో తీర్పుచెప్పింది. దీనిపై అబ్దుల్ ఖలీద్ హైకోర్టును ఆశ్రయించి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు పొందారు. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికి మధ్యంతర ఉత్తర్వులు ఆధారంగా తన భూమిని సర్వే చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని షేక్‌పేట్ రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆ భూమి వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. మరో స్థలంపై ఫిర్యాదు. వివాదాస్పద భూమి అయినా..కాసులు దండుకునేందుకు రెవెన్యూ అధికారులు అతితెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అసలు వివాదాస్పద స్థలాన్ని వదిలి..దాని పక్కన గల స్థలంపై ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఆశా హాస్పిటల్ దగ్గర వివాదాస్పద స్థలానికి సమీపంలోని సర్వే నెంబర్ 403/పీలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు అబ్దుల్ ఖలీద్ ప్రయత్నం చేశారని షేక్‌పేట తహసీల్దార్ ఏప్రిల్ 30న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సూచిక బోర్డునుసైతం తొలగించడంతో పాటు తమ సిబ్బంది అడ్డుకున్నప్పటికి పదేపదే తన సొంత భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. (ఎమ్మార్వో ఇంట్లో మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లు) కేసు తర్వాతనే అసలు కథ.. బంజారాహిల్స్‌లోని సర్వే నెంబర్ 403/పీలోని స్థలంపై ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది. ఒకవైపు పోలీసుల వత్తిడి పెరగడంతో అసలు వివాదాస్పద భూమి వ్యవహారంపై బేరసారాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇందులో పోలీసుల ఉచిత సలహాల కూడా ఉన్నట్లు సమాచారం. . దీంతో వివాదాస్పద స్థలానికి అన్ని విధాలుగా సహకరించేందుకు స్థలం విలువలో పది శాతం డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అధికారుల అత్యాశ ఫలితంగా పూర్తి స్థాయిలో వ్యవహరం చక్కబడకముందే బహిర్గతమైంది. ఇక ప్రభుత్వ భూములను పర్యవేక్షించాల్సిన వారే భక్షించడంపట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షేక్‌పేట తహసీల్దార్ అరెస్టు రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో అరెస్ట్ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయారని సమాచారం. మరోవైపు సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరికొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. -
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
-
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూవివాదం కేసులో ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎమ్మార్వో సుజాతను అరెస్ట్ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో ఎమ్మార్వో సుజాతను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయరని సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే బంజారాహిల్స్ ఎస్సై రవి నాయక్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్ : షేక్‌పేట భూవివాదం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు తొమ్మిది గంటల విచారణ తర్వాత ఎమ్మార్వో సుజాతను ఇంటికి పంపించారు. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిని పిలిచి అధికారులు వివరాలు సేకరించారు. (చదవండి : అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్) మరోవైపు ఆర్ఐ నాగార్జున రెడ్డి విచారణ కొనసాగుతోంది. మరికాసేపట్లో నాగార్జునరెడ్డిని రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎస్సై రవీంద్రనాయక్‌ను రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని 4865 గజాల భూ వివాదంలో షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్లను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
గ్యాంగ్‌వార్‌లో వారి ప్రమేయం లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని ఏడు సెంట్ల స్థల వివాదం పటమటలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్‌కు దారి తీసిందని విజయవాడ నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు13 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌కు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఏం జరిగిందంటే.. ►యనమలకుదురుకు చెందిన ప్రదీప్‌రెడ్డి, కానూరుకు చెందిన ధనేకుల శ్రీధర్ ఇద్దరు కలిసి యనమలకుదురులోని 7 సెంట్ల స్థలంలో రూ.1.50 కోట్ల అంచనాతో 14 ఫ్లాట్ల గ్రూప్ హౌస్ నిర్మాణం 2018లో చేపట్టారు. ►ఇందుకుగానూ ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్ మొదట రూ.40 లక్షల చొప్పున రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. తర్వాత ప్రదీప్‌రెడ్డి నుంచి డబ్బు ఇవ్వకపోవడంతో శ్రీధర్ మిగతా రూ.70 లక్షలు వెచ్చించి 2019లో నిర్మాణాన్ని పూర్తిచేశారు. అయితే ఇద్దరి వాటా కింద రావాల్సిన ఫ్లాట్లన్నింటినీ శ్రీధరే తన పేరిట ఉంచుకోవడంతో వివాదం మొదలైంది. ►దీంతో బట్టు నాగబాబు అలియాస్ చిన్న నాగబాబును ప్రదీప్‌రెడ్డి ఆశ్రయించి తన వాటా తనకు ఇప్పించాలని కోరాడు. మే 29న ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌లను నాగబాబు పంచాయితీకి పిలిచాడు. ►ఈ పంచాయితీకి తోట సందీప్, కోడూరి మణికంఠ అలియాస్ పండులను కూడా నాగబాబు పిలిచాడు. ►ఆ తర్వాత తాను మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్లిన చోటుకి నువ్వెందుకొచ్చావు అని పండును సందీప్ ఫోన్లో నిలదీశాడు. తీవ్రస్థాయిలో బెదిరించడంతో ఇరువురు ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చదవండి: పండు.. మామూలోడు కాదు! ఇంటికెళ్లి గొడవ.. ►అదేరోజు అర్ధరాత్రి ఇదే విషయంపై పండును స్వయంగా అడగడానికి తోట సందీప్, అతని సోదరుడు జగదీష్‌తోపాటు మరికొంత మంది అనుచరులతో పండు ఇంటికెళ్లి అతని తల్లితో గొడవ పడి వెళ్లిపోయారు. ►సందీప్ ఇంటికొచ్చి తన తల్లితో గొడవపడిన విషయం తెలిసి పండు 30వ తేదీన ఉదయం పటమటలో సందీప్ నిర్వహిస్తున్న శివబాలాజీ స్టీల్స్ దుకాణం వద్దకు వెళ్లి.. ఆ సందీప్ లేకపోవడంతో షాపులో ఉన్న సాగర్, రాజేష్‌ను కొట్టి గాయపరిచాడు. ►ఈ విషయం తెలుసుకున్న సందీప్ పండుకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో చివరకు ఇరువురు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ►ఆపై సాయంత్ర 4.30 గంటల సమయంలో పటమట తోటావారి వీధిలోని గ్రేస్ చర్చ్ వద్ద గల ఖాళీ ప్రదేశంలో సందీప్, పండులకు రెండు గ్రూపులు సమావేశమయ్యారు. ►ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన కారం కళ్లలో చల్లి.. కత్తులు, రాడ్లు, బ్లేడ్లు విచక్షణరహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ►ఈ గ్యాంగ్‌వార్‌లో తోట సందీప్, కోడూరి మణికంఠలు తీవ్రంగా గాయపడగా వారి అనుచరులు వారిని ఆస్పత్రులకు తరలించారు. ►తోట సందీప్ పటమటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 31వ తేదీ సాయంత్రం 5.50 గంటల సమయంలో మృతి చెందాడు. పండు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ►ప్రత్యక్ష సాక్ష్యులు, సీసీ టీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించాం. ►ఈ కేసులో కొట్లాటకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశాం. ఈ కేసులో ఉన్నవారందరిపై రౌడీషీట్స్ తెరిచామని సీపీ స్పష్టం చేశారు. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే! రౌడీ కార్యకలాపాలపై నిఘా.. ►గ్యాంగ్‌వార్‌కు సంబంధించి వరుసగా రెండు రోజులపాటు ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదంపై పోలీసులకు సమాచారం లేదు. కోవిడ్ విధుల్లో ఉన్న కారణంగా రౌడీషీటర్లపై నిఘా పెట్టలేదు. కౌన్సెలింగ్ కూడా ఇవ్వలేదు. ఇకపై విజయవాడలోని రౌడీషీటర్లపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తాం. అయితే ఈ గ్యాంగ్‌వార్‌కు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. అయితే కొంత మంది రాజకీయ నాయకులు వీళ్లను వాడుకున్నట్లు తెలుస్తోంది. కులం, వర్గం, పారీ్టలు అని చూడకుండా తప్పుచేస్తే ఎవరినైనా శిక్షిస్తాం. రౌడీ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. నిందితుల వివరాలు.. రేపల్లె శ్రీనివాస్(సనత్‌నగర్), ఆకుల రవితేజ(యనమలకుదురు), పందా ప్రేమకుమార్, పందా ప్రభుకుమార్ (పటమట), బాణావత్ శ్రీను నాయక్(రామలింగేశ్వర నగర్), ఎల్ వెంకటేశ్(పటమట), బూరి భాస్కరరావు(సనత్‌నగర్), పి.సాయిప్రవీణ్ కుమార్(తోటావారి వీధి), పొన్నాడ సాయి, సిర్రా సంతో‹Ù, యర్రా తిరుపతిరావు (పటమట), ఓరుగంటి దుర్గాప్రసాద్, ఓరుగంటి అజయ్(యనమలకుదురు). స్వాధీనం చేసుకున్న ఆయుధాలు.. కొబ్బరి బొండాల కత్తి, పొడవాటి కత్తి, స్నాప్ కట్టర్, కోడి పందేలకు వినియోగించే కత్తి, ఓ రాడ్డు, ఫోల్డింగ్ బ్లేడ్లు, నాలుడు బ్లేడ్లు, మూడు బైక్‌లు. -
సందీప్‌ని పక్కా పథకంతోనే హత్య చేశారు
సాక్షి, విజయవాడ : పటమటలో ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌లో రౌడీషీటర్ సందీప్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సందీప్ భార్య తేజస్విని, తల్లి పద్మావతి సాక్షి టీవీతో ముచ్చటించారు. సందీప్ భార్య తేజస్విని మాట్లాడుతూ.. ' సందీప్‌ను పక్కా పథకంతోనే హత్య చేశారు. లాండ్ సెటిల్మెంట్ గొడవకు సందీప్ కి సంబంధం లేదు. సందీప్ హత్య వెనుక ఉన్న కుట్రను పోలీసులు చేధిస్తారన్న నమ్మకం మాకు ఉంది. కాగా గొడవకు ముందు రోజే సందీప్‌ను ఫోన్లో బెదిరించారు. తర్వాత ఫోన్ లిప్ట్ చేయకపోవడంతోనే సందీప్ కోసం ఐరన్ షాపు దగ్గరకు పండు బ్యాచ్ వచ్చారు. ఆ సమయంలో సందీప్ లేకపోవడంతో షాపులో ఉన్న గుమస్తాపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. గొడవ పెంచటం ఇష్టం లేక పోలీసులకు పిర్యాదు చేయలేదు. నీ కుటుంబాన్ని అంతంచేస్తానని సందీప్‌కు ఫోన్ చేసి బెదిరించారు. సందీప్‌ను మాట్లాడుకుందాంరా అంటూ పడమటకు పిలిచి దారుణంగా హత్య చేశారు. సందీప్ మంచితనం, సేవాగుణం చూసి ప్రేమ వివాహం చేసుకున్నా.. సందీప్ హత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి..సందీప్ మృతికి కారణమైన వారందరినీ శిక్షపడే వరకు పోరాడుతా ' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (గ్యాంగ్ వార్ : వెలుగులోకి కీలక అంశాలు) సందీప్ తల్లి పద్మావతి మాట్లాడుతూ.. ' సందీప్ మరణానికి కారణమైన పండును కఠినమైన శిక్ష పడాలి. సందీప్ కాలేజి రోజులనుంచే యూత్ లీడర్ గా పని చేశాడు. అందువల్లనే మా అబ్బాయికి యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. సందీప్ వివాదాలకు వెళ్లే వాడు కాదు.. నా కొడుకు మృతికి కారణం అయిన ప్రతి ఒక్కరినీ పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా' అంటూ తెలిపారు. (బెజవాడ గ్యాంగ్‌వార్ కేసులో పురోగతి) -
పండు.. మామూలోడు కాదు!
సాక్షి, అమరావతి: ‘కత్తితో గొంతు కోస్తున్నప్పుడు స్.. స్.. స్.. స్.. అనే ఓ సౌండ్ వస్తది సామి. అది వినడానికి సమ్మగా ఉంటుంది సామీ..’ ఇది ఓ సినిమా డైలాగ్. ఇదే డైలాగ్‌ను తన హావభావాలతో అనుకరిస్తూ మణికంఠ అలియాస్ కేటీఎం పండు ఇటీవల టిక్‌టాక్ వీడియో చేసిన తీరు అతనిలోని క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలాగే మరో వీడియోలో ‘విజయవాడ మొత్తానికి మొగుడిలా బతకడానికి పెద్దగా ఆలోచించాలి’ అంటూ పేర్కొనడం కూడా అతనిలోని గ్యాంగ్‌లీడర్ మనస్థత్వాన్ని వెల్లడిస్తోంది. ఇలాంటి ఆలోచనలు, డైలాగులు మణికంఠపై తీవ్ర ప్రభావమే చూపాయని చెప్పొచ్చు. తల్లి అండదండలతో.. సనత్‌నగర్‌లోని రామాలయం వీధిలో పండు తల్లి పద్మ, ఆమె బంధువులు కలిసి ఐదు కుటుంబాలు వరకు నివసిస్తున్నాయి. గత 40 ఏళ్లుగా వాళ్లు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం.. మొదటి నుంచి స్థానికంగా గొడవలు పడటం.. కేసులు పెట్టడం.. పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగడం వీరికి అలవాటు. నగరంలో కాల్‌మనీ వ్యాపారం బాగా పెద్ద ఎత్తున జరుగుతున్న రోజుల్లో పండు తల్లి రూ. 15ల వడ్డీతో అప్పులు ఇచ్చి వసూళ్లు చేసేదని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే దాడులు చేసి మరీ వసూలు చేసేదని కూడా తెలుస్తోంది. అలాగే తన కొడుకు ఎక్కడైనా గొడవ పడినా తల్లి వెనకేసుకొచ్చేదని సమాచారం. 2012లో పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలో కొట్లాట కేసులో పండుపై కేసు నమోదైంది. అలాగే 2017లో పటమట పోలీసుస్టేషన్ పరిధిలో మరో కొట్లాట కేసు నమోదైంది. కృష్ణలంకలోనూ ఇదే తరహా కేసు పండుపై 2019లో నమోదైంది. ఈ మూడు కేసుల సందర్భంలోనూ పండు తల్లి పద్మనే అన్ని దగ్గరుండి చూసుకున్నదని పండు స్నేహితులు పేర్కొంటున్నారు. చదవండి: సందీప్‌కు టీడీపీ నేతల అండదండలు.. చుట్టూ స్నేహితులు.. నిత్యం హంగామా తల్లి పద్మ అండదండలతో పండులో విచ్చలవిడితనం పెరిగిపోయింది. నిత్యం తన చుట్టూ పది మంది స్నేహితులు, బ్లేడ్‌బ్యాచ్ సభ్యులతో హంగామా సృష్టించేవాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో పండు అతని స్నేహితులు ఆ వీధిలోకి వస్తే ఎవరూ బయటకొచ్చేవారు కాదని, అలాగే పండు కుటుంబసభ్యులు ఉంటోన్న ఇళ్లవైపునకు వెళ్లే ధైర్యం కూడా చేసేవారు కాదని సమాచారం. పండు చుట్టూ ఉండే స్నేహితులు, బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు గంజాయి, మద్యం మత్తులోనే ఉండేవారని తెలుస్తోంది. పోలీసుల అదుపులో 21 మంది.. డొంకరోడ్డులో జరిగిన గ్యాంగ్‌వార్‌పై పోలీసు కమిషనర్ తీవ్రంగా పరిగణించడంతో నిందితుల వేటలో పోలీసులు నిమగ్నమయ్యారు. సందీప్ మృతితో నిందితులు అందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. 6 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అలాగే డొంకరోడ్డులో పండు గ్యాంగ్ సాగించిన కార్యకలాపాలపైనా కూపీ లాగుతున్నారు. ఇప్పటికే 21 మందిని అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. పోలీసుల హైఅలర్ట్ -
బెజవాడ గ్యాంగ్ వార్ : వెలుగులోకి కీలక అంశాలు
-
గ్యాంగ్ వార్ : వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, విజయవాడ : నగరంలో జరిగిన గ్యాంగ్ వార్‌కు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణలో పాల్గొన్న తోట సందీప్, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతోపాటుగా, వ్యక్తిగత పోరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. తొలుత సందీప్, పండులు సన్నిహితులైనప్పటికీ.. విబేధాలు తలెత్తటంతో రెండు గ్యాంగ్‌లుగా విడిపోయారు. వీరిద్దరు కూడా టీడీపీకి చెందిన ఓ నాయకుడికి ముఖ్య అనుచరులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. (చదవండి : బెజవాడలో అలజడి) మరోవైపు గుంటూరు జిల్లాలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో సందీప్, పండు వర్గాల జోక్యం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. బెజవాడలో ల్యాండ్ సెటిల్మెంట్లకు గుంటూరు నుంచి యువకులను, గుంటూరులో ల్యాండ్ సెటిల్మెంట్లకు బెజవాడ యువకులను తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇలా చేయడం ద్వారా బయటి వ్యక్తులను గుర్తుపట్టే అవకాశం ఉండదని వారు భావించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ వార్‌లో రెండు జిల్లాలకు చెందిన వారు పాల్గొన్నట్టుగా ఆధారాలు సేకరించారు. అలాగే సందీప్, పండులకు ఉన్న టిక్‌టాక్, ఫేస్బుక్ అకౌంట్ల ఫాలోవర్స్‌ను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా, శనివారం పటమటలో జరిగిన గ్యాంగ్ వార్‌లో సందీప్ మృతిచెందగా, పండుతో పాటుగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పండు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. (చదవండి : బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. పోలీసుల హైఅలర్ట్)