పోలీస్‌స్టేషన్ వద్ద కారు దిగుతున్న యశ్
సాక్షి, బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగింది. యశ్ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందినవారు. హాసన్‌లో సొంత ఇల్లు ఉంది. హాసన్ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని యశ్ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు వెళ్లడం కష్టమని, గ్రామ పటంలో ఉన్నట్లు దారి వదలాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తాతల కాలం నుండి సాగు చేసుకొంటున్న భూముల్లోకి దారిని మూసివేయడం తగదని పట్టుబట్టారు. ఈ విషయమై చర్చించడానికి నటుడు యశ్ మంగళవారం తిమ్మాపురకు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కి పిలిపించి పంచాయతీ చేశారు. యశ్ వస్తున్నట్లు తెలిసి వందలాది అభిమానులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment