భూ వివాదం నేపథ్యంలో ఆదివారం నారాయణగూడ ఠాణా పరిధిలో రోడ్డుపై రచ్చ చేసిన ముగ్గురు రియల్టర్లను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ సింకిరెడ్డి భీమ్‌రెడ్డి తెలిపారు.
రచ్చ చేసిన రియల్టర్ల రిమాండ్
Published Mon, Oct 3 2016 10:11 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
హిమాయత్‌నగర్: భూ వివాదం నేపథ్యంలో ఆదివారం నారాయణగూడ ఠాణా పరిధిలో రోడ్డుపై రచ్చ చేసిన ముగ్గురు రియల్టర్లను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ సింకిరెడ్డి భీమ్‌రెడ్డి తెలిపారు. కోదాడకు చెందిన వెన్నెపల్లి దీపక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గౌలిపురాకు చెందిన కోట ఆనందరావుపై ఐపీసీ సెక్షన్లు 341, 506, 384, రెడ్‌విత్ 511 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.
అలాగే కోట ఆనందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెన్నెపల్లి దీపక్‌రావుపై ఐపీసీ 506, 30 సెక్షన్లతో పాటు లైసెన్స్ రివాల్వర్‌ను ల్యాండ్ సెటిల్‌మెంట్ కోసం బహిరంగ ప్రదేశంలోకి తెచ్చినందుకు ఆయుధ చట్టం కిందా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఇదే వ్యవహారంలో మరో వ్యక్తి కేవీఎన్ మూర్తి పైనా ఐపీసీ సెక్షన్ 506 కింద అరెస్ట్ చేశామన్నారు. వీరి ముగ్గురినీ సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి ఆనందరావు వెంట ఉన్న అతడి అన్నదమ్ములు అశోక్, భజరంగ్, స్నేహితుడు శేఖర్‌లనూ నిందితులుగా చేర్చి, వారి కోసం గాలిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement