
కర్రలతో దాడులు చేసుకుంటున్న ఇరువర్గాలు
జడ్చర్ల: మండలంలోని బూరెడ్డిపల్లి శివారులో బుధవారం భూ వివాదం చేసుకొని ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. 44వ నంబర్ జాతీయ రహదారికి దగ్గరగా దాదాపు 6 గుంటల భూమికి సంబంధించి వివాదం నెలకొంది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకవర్గం.. బూరెడ్డిపల్లికి చెందిన మరోవర్గం కొంతకాలంగా ఈ భూమి తమదంటే తమదంటూ ఘర్షణ పడుతున్నారు.
ఇటీవల ఇక్కడ ఓ వర్గానికి చెందిన బైక్ కూడా దగ్ధమైంది. బుధవారం ఇదే భూమి హద్దురాళ్ల విషయమై ఘర్షణ తలెత్తి ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. బూరెడ్డిపల్లికి చెందిన చందు, సత్తయ్య తదితరులు గాయపడ్డారు. అయితే దాడికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment