![Clash between brothers and their sons in a land dispute - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/06/8/axe.jpg.webp?itok=2IHAKG3E)
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది.
అరకతో అచ్చుతోలుతుండగా..
వీరయ్య తన కుమారుడు ప్రభాస్‌తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్‌తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్‌పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment