saidulu
-
‘1980లో రాధేకృష్ణ’ మూవీ రివ్యూ
టైటిల్: ‘1980లో రాధేకృష్ణ’నటీనటులు : ఎస్ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ వి క్రియేషన్స్నిర్మాత: వూడుగు సుధాకర్దర్శకుడు : ఇస్మాయిల్ షేక్సంగీతం: ఎంఎల్ రాజాసినిమాటోగ్రఫీ: ఇలియాజ్ పాషాకథేంటేంటే..కృష్ణ(ఎస్ఎస్ సైదులు), వంశీ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరిది వేరు వేరు కులాలు అయినా వాళ్ల మధ్య ఆ భావన లేకుండా కాలేజీలో మంచి మిత్రులుగా ఉంటారు. వంశీ పెద్దనాన్న రాఘవయ్య ఆ ఊరికి సర్పంచ్. ఆయనకు కులపిచ్చి బాగా ఎక్కువ. ఆయన కుమార్తె రాధ(భ్రమరాంబిక) వంశీ చదివే కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ కృష్ణతో రాధ ప్రేమలో పడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. రాధ-కృష్ణ ప్రేమ ఫలించిందా? లేదా ఆ ఊళ్లో కుల వివక్ష వాళ్ల ప్రేమను బలితీసుకుందా? ప్రేమ కథ మధ్యలో మావోయిస్టులు ఏం చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కుల పిచ్చి కారణంగా ఓ ప్రేమ జంట ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు షేక్ ఇస్మాయిల్. అందమైన ప్రేమకథను తెలియజేస్తూనే.. అంతర్లీనంగా కుల వివక్ష నిర్మూలన గురించి, పరువు హత్యల నిర్ములన గురించి మంచి సందేశం ఇస్తుంది. మానవతాన్ని మించిన కులం ఏముంటుంది? అనే డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమకథతో సాఫీగా సాగిపోతుంది. ఇక సెకెండాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు అడవిలో అన్నలు.. మరోవైపు వాళ్లను వెంటాడే పోలీసులు. వీరిద్దరి మధ్యలో స్వచ్ఛమైన ప్రేమను కాపాడుకోవడం కోసం ప్రేమికుల పోరాటం. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పొచ్చు.కృష్ణలంక అనే గ్రామంలో డిగ్రీలు చదివిన యువకులే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలను ఎదుర్కొనేందుకు మావోయిస్టులుగా మారడాన్ని చూపించారు. వాళ్ల ఉద్దేశం మంచిదే కానీ వాళ్లు ఎంచుకున్న మార్గం సరైనది కాదనేలా చెబుతూ దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆలోచింపజేస్తాడు. హీరో కృష్ణ తన నాన్న భావాలను ఆదర్శంగా తీసుకుని కులాల నిర్మూలనకు ఏ విధంగా పాటు పడ్డాడు అనేది చాలా చక్కగా చూపించారు. మగింపులో ఇచ్చిన సందేశం బాగుంది.ఎవరెలా చేశారంటే..హీరోగా నటించిన ఎస్ఎస్ సైదులు తన చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. అమాయకుడిగా, ప్రేమికుడిగా, పోరాట యోధుడిగా అన్ని వేరియషన్స్ పలికించాడు. హీరో ఫ్రెండ్‌గా వంశీ పాత్ర పోషించిన అతను కూడా ది బెస్ట్ పర్ఫ్మార్మెన్స్ ఇచ్చాడు. ఇక హీరోయిన్లు భ్రమరాంబిక, అర్పిత లోహి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. భ్రమరాంబిక పాత్ర నిడివి ఎక్కువ ఉండడంతో ఆమెకు తన నటనను ప్రదర్శించే ఆస్కారం ఎక్కువ ఉంది. తన నటన, అందంతో భ్రమరాంబిక ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. ఎం. రాజేష్, చరణ్, ఖమ్మం బాబు, జ్ఞానేశ్వర్, వై ఉపేందర్ అనే కుర్రాళ్లు రాసిన డైలాగ్స్ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఎంఎల్ రాజా ఇచ్చిన సంగీతం కూడా కథకు చాలా హెల్ప్ అయింది. పాటలు అన్నీ చాలా బాగున్నాయి. తనే లిరిక్స్ రాసి ట్యూన్ కట్టడం వల్ల పాటలు అన్నీ చక్కగా కుదిరాయి. తూరుపు రవికిరణం సాంగ్ ఎమోషనల్‌గా ఉంది. నిర్మాత ఊడుగు సుధాకర్ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను చక్కగా నిర్మించారు. -
ఏసీబీ వలలో మీర్‌పేట ఎస్ఐ
హైదరాబాద్: నోటరీ ప్లాటు విక్రయ సెటిల్మెంట్ వ్యవహారంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు అడ్డంగా దొరికిపోయాడు. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాదర్గుల్కు చెందిన షేక్ నజీముద్దీన్ గత డిసెంబరులో సర్వే నంబర్ 197లోని తన 200 గజాల నోటరీ ప్లాటును గుర్రంగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదాని సుభాష్‌కు రూ.4.80 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సుభాష్ రూ.2.10 లక్షలు బయానా చెల్లించి ప్లాటుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ ప్లాటు కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉండడం, తాజాగా కోర్టు కేసు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో నజీముద్దీన్ తన ప్లాటును తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తేగా సుభాష్ అంగీకరించలేదు. దీంతో నజీముద్దీన్ ఈ నెల 23న మీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ బొడ్డుపల్లి సైదులుకు ఫిర్యాదు చేశాడు. సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసు అధికారి సుభా‹Ùను స్టేషన్‌కు పిలిపించి ప్లాటు పత్రాలు వెనక్కి ఇవ్వకపోతే, అవి పోయినట్లు దొంగతనం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన సుభాష్ ప్లాట్ కాగితాలు నజీముద్దీన్కు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసి ఎస్ఐ సుభాష్‌కు రూ.1.40 లక్షలు ఇప్పించాడు. ఇందులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.5వేలు ఇస్తానని ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత ఓసారి మధ్యవర్తి ముత్యంరెడ్డితో కలిసి స్టేషన్‌కు వచ్చాడు. రూ.10 వేలు ఇస్తామని చెప్పడంతో ఎస్ఐ ఓకే చెప్పాడు. ఈ వ్యవహారాన్నంతా బాధితుడు ముందుగానే సెల్ఫోన్లో రికార్డు చేసి ఏసీబీ అధికారులకు పంపాడు. శనివారం పీఎస్‌కు వచ్చిన సుభాష్ నుంచి ఎస్ఐ రూ.10 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్ఐ సైదులును మేజి్రస్టేట్ ఎదుట హాజరు పర్చడంతో పాటు తన ఇంట్లోని ఫైళ్లను తనిఖీ చేశామని తెలిపారు. 2021లో సరూర్‌నగర్ పీఎస్‌లో విధులు నిర్వర్తించిన సమయంలోనూ ఇలాంటి కేసులోనే ఎస్ఐ సైదులు సస్పెండ్ అయ్యాడని స్పష్టంచేశారు. లంచం కోసం ఇబ్బంది పెడితే 1064 ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
భార్యా పిల్లల్ని ఇంటికి రమ్మని కోరగా.. నిరాకరించడంతో..
నల్గొండ: మద్యం మత్తులో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మద్దిరాల మండలంలోని చిన్ననెమిలా గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్ననెమిలా గ్రామానికి చెందిన బొల్లికొండ సైదులు, రేణుక భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు డిగ్రీ, చిన్న కుమారుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. సైదులు మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకోకపోవడంతో భార్య రేణుక తన పిల్లలతో కలిసి ఖమ్మం వెళ్లి అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం సైదులు ఖమ్మంలో ఉంటున్న భార్యాపిల్లల వద్దకు వెళ్లి వారిని ఇంటి రమ్మని కోరాడు. మద్యం మానేస్తేనే వస్తానని భార్య చెప్పడంతో మంగళవారం ఇంటికి వచ్చిన సైదులు మనస్తాపం చెంది మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. -
‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి..
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. అరకతో అచ్చుతోలుతుండగా.. వీరయ్య తన కుమారుడు ప్రభాస్‌తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్‌తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్‌పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు
మిర్యాలగూడ టౌన్: మద్యం మత్తులో ఇద్దరు కామాంధులు అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అడ్డుకున్న డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించాడు. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఇటీవల మిర్యాలగూడకు వచ్చింది. పట్టణంలో ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించిన అనంతరం అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు అర్ధరాత్రి 12:30 గంటలకు మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కింది. అదే బస్సులో మరో ఇద్దరు ప్రయాణికులతో పాటు మిర్యాలగూడకు చెందిన కిరణ్, మంగళ్‌సింగ్ కూడా ఎక్కా రు. బస్సు మిర్యాలగూడ నుంచి బయల్దేరిన తర్వాత ఇద్దరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో బాగా మద్యం తాగి ఉన్న కిరణ్, మంగళ్‌సింగ్ .. ఈవెంట్ ఆర్గనైజర్ సీటుపై కాళ్లు వేయడంతో పాటు వెకిలిచేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్ వారి వేధింపులు తాళలేక బస్సు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి కూర్చుంది. దీంతో వారు కూడా డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి ఆ ప్రయాణికురాలిని వేధించారు. దీంతో బస్సు డ్రైవర్ సైదులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును నేరుగా నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. అనంతరం కిరణ్, మంగళ్‌సింగ్‌ను పోలీసులకు అప్పగించాడు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా, కామాంధుల నుంచి తనను కాపాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైదులుతో పాటు సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఆదివారం ఆర్టీసీ మిర్యాలగూడ డీఎం బొల్లెద్దు పాల్‌కు లేఖ అందించింది. -
‘సైదులు’ ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్
రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సైదులు’. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై మరబత్తుల బ్రహ్మానందం నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబా పి.ఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకిది తొలి చిత్రం. 1980లో తెలంగాణ నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించామని మేకర్స్ వెల్లడించారు. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. సీనియర్ నటుడు బెనర్జీ ఓ కీలక పాత్రలో నటించడం సినిమాకు కలిసొచ్చిందని తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూనిట్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉన్నారు.మరోవైపు ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఫిలిం సెలబ్రిటీలు హాజరవుతారని చిత్ర యూనిట్ పేర్కొంది. (చదవండి: ‘ఆదిపురుష్’నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) -
రిజర్వాయర్‌లోకి ధైర్యంగా దూకిన ఎస్సై.. శభాష్ సైదులు
సాక్షి, యాదాద్రి : అధికారిగా ఆదేశాలిచ్చేకంటే తానే పనిలోకి దిగితే ఆదర్శవంతమైన ఫలితం ఉంటుందన్న అతని నమ్మకం సత్ఫలితాలనిచ్చింది.బాలుర మృతదేహాలను బయటకు తీయడానికి తానే ధైర్యంగా రిజర్వాయర్‌లోకి దిగిన భువనగిరి రూరల్ ఎస్ఐ సైదులుపై అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.కరోనా కాలంలోనూ అభాగ్యుల ఆకలితీర్చాడు. ప్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు సేవలందిస్తున్న భువనగిరి రూరల్ ఎస్ఐ కె.సైదులుపై ప్రత్యేక కథనం రిజర్వాయర్‌లోకి ధైర్యంగా దూకి భువనగిరి కిసాన్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(14), హనుమాన్‌వాడకు చెందిన హేమంత్(15)సోమవారం సాయంత్రం భువనగిరి మండలం బస్వాపురం శివారులోని నృసింహ రిజ ర్వాయర్‌ను చూడటానికి వెళ్లి నీటిలో మునిగి పోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సైదులు అక్కడకు చేరుకున్నాడు. పిల్లల చెప్పులను చూసి రిజర్వాయర్‌లో మునిగిపోయారని ధ్రువీకరించుకున్నాడు.ఎన్డీఆర్ఎఫ్, గజ ఈత గాళ్ల కోసం సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి ఆలస్యమవుతుందని భావించి తానే రంగంలోకి దిగాడు. 15 ఫీట్ల లోతున్న నీటిలోకి దిగి మూడు గంటలు గాలించి బాలుర మృతదేహా లను బయటకు తీశారు.ఎస్ఐని బ స్వాపు రానికి చెందిన నాయకులు సత్కరించారు. మతిస్థిమితం లేని కోటీశ్వరుడి గుర్తింపు హైదరాబాద్‌లోని బల్కంపేటకు చెందిన శ్రీ కాంత్ కోటీశ్వరుడు. 15 రోజుల క్రితం రాయగిరికి వచ్చాడు. రోడ్ల పక్కన తిరుగుతుండటంతో ఎస్ఐ గమనించి చేరదీశాడు. వివరాలు తెలుసుకోగా అతడు కోటీశ్వరుడని తేలింది. అతన్ని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాడు. లాక్డౌన్లో.. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లోనూ ఎస్ఐ సైదులు అనేక సేవలందించాడు. వందలాది మంది అభాగ్యులకు సొంత ఖర్చుతో భోజనం అందిజేసి ఆకలి తీర్చాడు. నేనే ముందుంటా.. అధికారిగా తాను ముందుండి పనిచేయ డం ద్వారా మిగతావా రు కలిసి వస్తారు. బ స్వాపూర్ రిజర్వాయర్‌లో అదే చేశాను.గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చాను కాబట్టి నా కు ఈత వచ్చు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లకోసం ప్రయత్నించాం. కానీ,ఆలస్యం అవుతుందని భావించి నేనే రిజర్వాయర్‌లోకి ది గాను.ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశాను. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో వందలాది మంది ఆకలి తీర్చాను. –కె.సైదులు, ఎస్ఐ, భువనగిరి రూరల్ -
హైదరాబాద్‌లో సీసీఎస్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : సీసీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సైదులు గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అతని భార్య నిర్మల పిల్లల్ని స్కూల్లో దించడానికి వెళ్లిన సమయంలో సైదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే సైదులు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియలేదు. కాగా, ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెప్పపాటు క్షణంలో ఘోర ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఐడీఏ బొల్లారం మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. టాటా ఏస్ ప్యాసింజర్ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. వివరాల్లోకి వెళితే...సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన కనక మహాలక్ష్మీ బొల్లారంలో ఓ కార్యాలయంలో లేబర్‌గా పని చేస్తోంది. ఆమె ఇవాళ మధ్యాహ్నం విధులకు వెళ్లేందుకు తన మరిది సైదులు రెడ్డి ద్విచక్ర వాహనంపై బయల్దేరింది. వీరు వెళుతుండగా రోడ్డుపై ఆగివున్న టాటా ఏస్ డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తీయడంతో ... వదినా, మరిది ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో పక్కనే వెళుతున్న టిప్పర్ కింద పడిపోవడం...వారిపై నుంచి టైర్లు వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నయీమ్ కంపెనీలో ఖాకీలు!
గ్యాంగ్‌స్టర్‌తో పోలీసు అధికారులు కలసి ఉన్న ఫొటోలు బహిర్గతం - దొరికిపోయిన ఐదుగురు అధికారులు.. పోలీసు శాఖలో కలవరం - వారిని తప్పించే ప్రయత్నం చేసిన ఓ మీడియా అధిపతి, పక్క రాష్ట్ర పెద్దలు - ఇంతకుముందే ఆధారాల్లేవంటూ కేసును మూసేసే ప్రయత్నం - చర్యలపై తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాల్లేవన్న ఓ సీనియర్ ఐపీఎస్ ఈ ఫొటోలో ఉన్నది అదనపు ఎస్పీ చంద్రశేఖర్. 1989 బ్యాచ్ ఎస్సైగా ఎంపికైన ఆయన... ప్రస్తుతం కీలకమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో ఇన్చార్జి ఎస్పీగా ఉన్నారు. గతంలో మావోయిస్టు వ్యవహారాలను పర్యవేక్షించే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా కాలం పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి నయీమ్ ఎన్కౌంటర్ వరకు కూడా సన్నిహిత సంబంధాలు నెరిపారని.. నయీమ్‌తో కలసి సెటిల్మెంట్లు చేశారని ఆరోపణలున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. చంద్రశేఖర్‌కు ఎడమవైపు కూర్చున్న అధికారి సైదులు. ప్రస్తుతం ఆయన సీఐ హోదాలో ఉన్నారు. నయీమ్ ఇచ్చిన దావత్‌కు చంద్రశేఖర్‌తో కలసి వెళ్లినట్టు తెలిసింది. ఇటీవలి వరకు నిజామాబాద్‌లో సీఐగా పనిచేసిన సైదులు.. ఇటీవలే సీఐడీకి బదిలీ అయ్యారు. ఎస్సైగా పనిచేసిన సమయంలో నయీమ్‌తో సంబంధాలు ఏర్పర్చుకున్నట్లు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సన్నిహిత సంబంధాలున్న పలువురు పోలీసుల బండారం బయటపడింది. నయీమ్‌తో ఏకంగా నాన్ కేడర్ అదనపు ఎస్పీ స్థాయి పోలీసు అధికారులు కూడా కలసి ఉన్న ఫొటోలు బయటపడడం సంచలనం రేపుతోంది. దాదాపు పదిహేనేళ్ల పాటు పోలీస్ శాఖలో పెత్తనం చెలాయించిన నయీమ్, అతడికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారుల ఫొటోలు గురువారం సోషల్ మీడియాలో వెల్లువెత్తడం పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వ వర్గాలను అతలాకుతలం చేసింది. ఇంతకీ ఆ అధికారులెవరు? నయీమ్‌తో ఎక్కడ ఫోటోలు దిగారు? నయీమ్‌తో వారి సాన్నిహిత్యం ఏమిటి, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసు విచారణ పరిస్థితేమిటి? నయీమ్ ఎన్కౌంటర్ జరిగి ఆరు నెలలు గడిచింది. పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీపీఐ నేత నారాయణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా.. ఇప్పటివరకు నయీమ్‌తో పోలీసులెవరికీ సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదంటూ హోంశాఖ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇక నయీమ్ కేసులో విచారణ చాలించాలని, నయీమ్‌కు సహకారం అందించిన చిన్నా చితకా కానిస్టేబుళ్లు, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసు శాఖకు సూచించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు సిట్ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో నయీమ్‌తో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కలసి ఉన్న ఫొటోలు బయటకు రావడం చర్చనీయాంశమైంది. అసలు ఈ కేసు మూసివేతకు ప్రయత్నిస్తున్న సందర్భంలో కీలక ఆధారాలు బయటకు రావడం పోలీసు అధికారులను ఊపిరిపీల్చుకోకుండా చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫొటోలో నయీమ్ తో ఉన్న వ్యక్తి సీఐ వెంకట్ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ లోని మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తను నయీమ్ డిగ్రీ క్లాస్మేట్ అని సిట్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆ సాన్నిహిత్యంతోనే నయీమ్‌ను కలవాల్సి వచ్చిందని, అంతకు మించి తనకు ఎలాంటి సంబంధాలూ లేవని చెప్పినట్లు తెలిసింది. అసలు గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎంత క్లాస్మేట్ అయినా పోలీసు అధికారిగా ఉన్నప్పుడు మర్యాద పూర్వక భేటీలు ఎందుకన్న దానికి మాత్రం సమాధానమివ్వలేదని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. మిగతా వాళ్ల సంగతేంటి? తాము మాత్రమే నయీమ్‌తో అంటకాగలేదని.. మరో నలుగురు కూడా నయీమ్‌తో కలసి భారీ స్థాయిలో సెటిల్మెంట్లు చేసి, కోట్లు దండుకున్నారని ఫోటోల్లో ఉన్న ఓ అధికారి స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి, హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు డీఎస్పీలు నయీమ్‌తో అంటకాగారని ఆయన ఆరోపించారు. తమకు త్వరలో పదోన్నతి ఉందని తెలిసి, అడ్డుకునేందుకే ఈ ఫోటోలను బయటకు లీక్ చేశారన్నారు. తమను సిట్ విచారిస్తే కీలకమైన అధికారుల పేర్లు బయట పెడతామని, వారి సంగతి కూడా తేల్చాల్సిందేనని వ్యాఖ్యానించారు. తాము విచారణ ఎదుర్కొంటామన్నారు. ఓ మీడియా ఎండీ లాబీయింగ్? నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమపై చర్యలు తీసుకోకుండా భారీగా లాబీయింగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఓ మీడియా ఎండీ నేరుగా కల్పించుకున్నారని, తమ సంబంధీకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారని విచారణ ఎదుర్కొంటున్న ఓ డీఎస్పీ వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో.. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా పేర్కొన్నట్లు సమాచారం. ఇక నయీమ్ ఇంట్లో దొరికిన ఆధారాల్లో చాలా వరకు చింపేసి, దొరక్కుండా చేశారని.. ప్రస్తుతం ఫోటోల్లో ఉన్న ఓ అదనపు ఎస్పీ ఏకంగా తన టీమ్‌తోనే అల్కాపురికాలనీ ఇంట్లో సోదాలు చేయించి ఆధారాలను తగలబెట్టారని ఆ డీఎస్పీ వెల్లడించినట్లు తెలిసింది. సస్పెన్షన్‌పై మాకెలాంటి ఆదేశాల్లేవు: సీనియర్ ఐపీఎస్ నయీమ్ కేసుకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవని సీనియర్ ఐపీఎస్ ఒకరు వెల్లడించారు. నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని, దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు. నయీమ్‌తో పోలీసు అధికారులున్న ఫొటోలు బయటపడిన నేపథ్యంలో దీనిపై విచారణ జరుపుతారా, లేదా అన్నది సిట్ పరిధిలోని అంశమని తెలిపారు. నయీమ్ ‘సన్నిహితుల’పై సిట్ దృష్టి నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక అంశాలపై దృష్టి పెట్టింది. గ్యాంగ్‌స్టర్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారుల్లో... పోలీసు శాఖ కోసం పనిచేసిందెవరు? వ్యక్తిగత ప్రయోజనాల కోసం దోస్తీ చేసిందెవరనేది తేల్చేపనిలో పడింది. ఎన్కౌంటర్ తర్వాత నయీమ్ డెన్లలో లభించిన డైరీలు, ఫొటోలను.. అరెస్టు చేసిన, విచారించిన వారి వాంగ్మూలాలతో సరిచూస్తోంది. ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులపై స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. నయీమ్ నేరాలతో సంబంధమున్న, అతడితో అంటకాగిన అధికారులపై వచ్చే వారంలో చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నయీమ్‌తో ఉన్న పోలీసు అధికారి మద్దిపాటి శ్రీనివాసరావు. 1989 బ్యాచ్ ఎస్సై అయిన ఈయన ప్రస్తుతం సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. భువనగిరి సబ్ డివిజన్లో ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్ వరకు పనిచేశారు. ఎస్ఐబీలోనూ కొద్ది రోజులు విధులు నిర్వర్తించారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ ఏసీపీగా, మాదాపూర్ అదనపు డీసీపీగా కూడా పనిచేశారు. ఈ ఫొటోలో నయీమ్ పక్కన నిల్చున్న పోలీసు అధికారి పేరు తిరుపత న్న. ఆయన కూడా 1989 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. ప్రస్తుతం సంగారెడ్డి టౌన్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన భువనగిరి సబ్ డివిజన్లో ఎస్సైగా, సీఐగా పనిచేశారు. భువనగిరిలో సీఐగా పనిచేస్తున్న సమయంలో నయీమ్‌తో కలసి వినాయక విగ్రహానికి పూజలు చేసినట్టు సిట్ అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
డెంగీ బారిన పడి ఇద్దరి మృతి
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగీ బారిన పడి ఇద్దరు మృతిచెందారు. మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన బానోతు మంగ(48), గుగులోతు సైదులు(28) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఇద్దరికి డెంగీ సోకడంతో.. వైద్యులు చికిత్స అందిస్తుండగా.. కొద్దిసేపటి క్రితం ఇద్దరు మృతిచెందారు. గ్రామంలో డెంగీ ప్రభలిన పట్టించుకునే నాధుడు లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గోడకూలి వృద్ధుడు మృత్యువాత
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బొమ్మనబోయిన సైదులు యాదవ్(65) ఆదివారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా గోడ కూలి ఆయనపై పడింది. తీవ్రంగా గాయపడిన సైదులు యాదవ్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
అన్నపూర్ణ సత్రంలో దంపతుల ఆత్మహత్య
శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన దంపుతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆలయ సమీపంలోని అన్నపూర్ణ సత్రంలో దంపుతులు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన సైదులు కుటుంబంగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
నిట్‌లో ‘చెప్పుల దండ’ కలకలం
ఇన్చార్జి డెరైక్టర్ లక్ష్యంగా దుశ్చర్య నిట్ ఇన్చార్జి డైరక్టర్ పదవికి సైదులు రాజీనామా కాజీపేట రూరల్ : కాజీపేట నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఇన్చార్జి నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.సైదులుకు కేటారుుంచిన 506 నంబర్ గదికి గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం చెప్పుల దండ వేయడం కలకలం సృష్టించింది. నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు ఏపీ నిట్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో వరంగల్ నిట్ ఇన్చార్జి డైరక్టర్‌గా ఫ్యాకల్టీ వెల్ఫేర్ డీన్ ఎం.సైదులుకు బాధ్యతలను అప్పగించారు. ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఏపీ నిట్‌కు వెళ్లిన రోజుల్లో ప్రొఫెసర్ సైదులు ఇన్చార్జిగా డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ విభాగంలో ఆయనకు కేటాయించిన గదికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేసిన ఘటన నిట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ప్రొఫెసర్ సైదులు తన ఇన్చార్జీ డైరక్టర్ పదవికి రాజీనామా చేశారు. నిట్ అధ్యాపకుల్లో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఆనందిస్తున్నారని, ఫలితంగా నిట్ ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. నిట్‌లో జరిగిన ఘటనపై నిట్ డైరక్టర్ టి.శ్రీనివాస్‌రావును వివరణ కోరేందుకు సెల్ఫోన్లో ప్రయత్నించగా స్పందించలేదు. ఉద్దేశపూర్వకంగానే చేశారు : ప్రొఫెసర్ సైదులు నిట్‌లో నాకు కేటాయించిన గదికి ఎవరో ఉద్దేశపూర్వకంగానే చెప్పుల దండ వేశారు. నిట్ డైరక్టర్ శ్రీనివాసరావు ఏపీ ఎన్ఐటీకికి విధులపై వెళ్తున్నప్పుడు నన్ను ఇక్కడ ఇన్చార్జి డైరక్టర్‌గా నియమించారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నా గదికి చెప్పుల దండ వేసిన విషయం ఒకరు వచ్చి చెప్పారు. నిట్‌లో నా గదికి చెప్పుల దండ వేయడంపై మనస్తాపం ఇన్చార్జి డైరక్టర్ పదవికి రాజీనామా చేశా. -
మృత్యుంజయుడు
♦ పూడిక తీస్తుండగా కూలిన బావి ♦ జేసీబీ సాయంతో సమాంతరంగా బావి తవ్వకం ♦ సురక్షితంగా బయటపడిన వైనం చింతకాని: ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పూడిక తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ఏడుగంటలపాటు బావిలో కూరుకుపోయి మృత్యువు అంచులదాకా వెళ్లి సజీవంగా బయటపడ్డాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడుకు చెందిన టేకుమట్ల సైదులు శనివారం పూడిక తీయడం కోసమని తన ఇంట్లో ఉన్న బావిలో ఇద్దరు కూలీలతో పాటు దిగాడు. పూడిక తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా బావి చుట్టూ ఉన్న భూమి కూలి మట్టి సైదులుపై పడింది. ఇదే సమయంలో కూలీలిద్దరూ తప్పుకున్నారు. మట్టిపైన రాయిపడి ఆపైన మళ్లీ మట్టి పడింది. వెంటనే స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూటీం వచ్చి.. సైదులుకు ఆక్సిజన్ అందుతున్నట్లు గుర్తించింది. వెంటనే జేసీబీతో బావికి సమాంతరంగా మరో బావి తవ్వారు. సుమారు ఏడు గంటల తర్వాత సైదులను బావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చిట్టీల పేరుతో కుచ్చు టోపీ..
నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన సైదులు అనే చిట్టీల వ్యాపారి రూ.6 కోట్లకు టోపీ వేసి కుటుంబంతో ఉడాయించాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి ఉన్న విషయం గమనించిన దాదాపు 800 మంది బాధితులు న్యాయం చేయాలని నల్గొండలోని ఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం ధర్నా చేశారు. ఎస్పీ లేకపోవడంతో డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. చిట్టీల పేరుతో మోసగించి ఉడాయించిన సైదులుపై నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 20 సంవత్సరాలుగా నార్కెట్‌పల్లిలో నమ్మకంగా ఉంటూ చీటీల వ్యాపారం చేసేవాడు. 50 వేల నుంచి 2లక్షల రూపాయల వరకూ చీటీలు వేసేవాడు. దాదాపు 6 కోట్ల రూపాయల వరకూ దండుకుని రాత్రికి రాత్రి కుటుంబంతో సహా ఉడాయించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నార్కెట్‌పల్లి పోలీసులు చెప్పారు. -
ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: వనస్థలిపురం ఎస్ఐ సైదులు శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. అవినీత ఆరోపణలపై సైదులును శుక్రవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
డ్రైవర్ మృతితో బంధువుల ఆందోళన
వేములపల్లి: ఓ రైస్ మిల్లు డ్రైవర్ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వేములపల్లి మండలం కనకమహాలక్ష్మి రైస్‌మిల్లులో దూదిమెట్ల సైదులు(28) రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు గుండెపోటుతో మృతిచెందాడని చెప్పారు. దీంతో అతని బంధువులు మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. -
కంటెయినర్, డీసీఎం వ్యాన్ ఢీ: ఇద్దరి మృతి
తూప్రాన్ (మెదక్): తూప్రాన్ మండల కేంద్రానికి సమీపంలోని బైపాస్ మార్గం వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ను స్నేహ చికెన్ సెంటర్‌కు చెందిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. గురువారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో సైదులు (30), ఎల్లయ్య (28) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. డీసీఎం, కంటెయినర్‌ను ఢీకొట్టడంతో భయపడ్డ కంటెయినర్ డ్రైవర్ తన కంటెయినర్‌తో అక్కడి నుంచి వెళ్లి పోయేందుకు ప్రయత్నించాడు. అలా రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కంటెయినర్‌కు డీసీఎం అతుక్కుపోయిన విషయం తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.