టైటిల్: ‘1980లో రాధేకృష్ణ’
నటీనటులు : ఎస్‌ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి తదితరులు
నిర్మాణ సంస్థ: ఎస్ వి క్రియేషన్స్
నిర్మాత: వూడుగు సుధాకర్
దర్శకుడు : ఇస్మాయిల్ షేక్
సంగీతం: ఎంఎల్ రాజా
సినిమాటోగ్రఫీ: ఇలియాజ్ పాషా
కథేంటేంటే..
కృష్ణ(ఎస్‌ఎస్ సైదులు), వంశీ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరిది వేరు వేరు కులాలు అయినా వాళ్ల మధ్య ఆ భావన లేకుండా కాలేజీలో మంచి మిత్రులుగా ఉంటారు. వంశీ పెద్దనాన్న రాఘవయ్య ఆ ఊరికి సర్పంచ్. ఆయనకు కులపిచ్చి బాగా ఎక్కువ. ఆయన కుమార్తె రాధ(భ్రమరాంబిక) వంశీ చదివే కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ కృష్ణతో రాధ ప్రేమలో పడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. రాధ-కృష్ణ ప్రేమ ఫలించిందా? లేదా ఆ ఊళ్లో కుల వివక్ష వాళ్ల ప్రేమను బలితీసుకుందా? ప్రేమ కథ మధ్యలో మావోయిస్టులు ఏం చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కుల పిచ్చి కారణంగా ఓ ప్రేమ జంట ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు షేక్ ఇస్మాయిల్. అందమైన ప్రేమకథను తెలియజేస్తూనే.. అంతర్లీనంగా కుల వివక్ష నిర్మూలన గురించి, పరువు హత్యల నిర్ములన గురించి మంచి సందేశం ఇస్తుంది. మానవతాన్ని మించిన కులం ఏముంటుంది? అనే డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమకథతో సాఫీగా సాగిపోతుంది. ఇక సెకెండాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు అడవిలో అన్నలు.. మరోవైపు వాళ్లను వెంటాడే పోలీసులు. వీరిద్దరి మధ్యలో స్వచ్ఛమైన ప్రేమను కాపాడుకోవడం కోసం ప్రేమికుల పోరాటం. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పొచ్చు.
కృష్ణలంక అనే గ్రామంలో డిగ్రీలు చదివిన యువకులే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలను ఎదుర్కొనేందుకు మావోయిస్టులుగా మారడాన్ని చూపించారు. వాళ్ల ఉద్దేశం మంచిదే కానీ వాళ్లు ఎంచుకున్న మార్గం సరైనది కాదనేలా చెబుతూ దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆలోచింపజేస్తాడు. హీరో కృష్ణ తన నాన్న భావాలను ఆదర్శంగా తీసుకుని కులాల నిర్మూలనకు ఏ విధంగా పాటు పడ్డాడు అనేది చాలా చక్కగా చూపించారు. మగింపులో ఇచ్చిన సందేశం బాగుంది.
ఎవరెలా చేశారంటే..
హీరోగా నటించిన ఎస్ఎస్ సైదులు తన చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. అమాయకుడిగా, ప్రేమికుడిగా, పోరాట యోధుడిగా అన్ని వేరియషన్స్ పలికించాడు. హీరో ఫ్రెండ్‌గా వంశీ పాత్ర పోషించిన అతను కూడా ది బెస్ట్ పర్ఫ్మార్మెన్స్ ఇచ్చాడు. ఇక హీరోయిన్లు భ్రమరాంబిక, అర్పిత లోహి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. భ్రమరాంబిక పాత్ర నిడివి ఎక్కువ ఉండడంతో ఆమెకు తన నటనను ప్రదర్శించే ఆస్కారం ఎక్కువ ఉంది. తన నటన, అందంతో భ్రమరాంబిక ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. ఎం. రాజేష్, చరణ్, ఖమ్మం బాబు, జ్ఞానేశ్వర్, వై ఉపేందర్ అనే కుర్రాళ్లు రాసిన డైలాగ్స్ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఎంఎల్ రాజా ఇచ్చిన సంగీతం కూడా కథకు చాలా హెల్ప్ అయింది. పాటలు అన్నీ చాలా బాగున్నాయి. తనే లిరిక్స్ రాసి ట్యూన్ కట్టడం వల్ల పాటలు అన్నీ చక్కగా కుదిరాయి. తూరుపు రవికిరణం సాంగ్ ఎమోషనల్‌గా ఉంది. నిర్మాత ఊడుగు సుధాకర్ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను చక్కగా నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment