ఎస్‌ఎస్ సైదులు హీరోగా, భ్రమరాంబిక అర్పిత హీరోయిన్‌గా నటించిన ద్విభాషా చిత్రం (తెలుగు, బంజారా) ‘1980లో రాధేకృష్ణ’. ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఊడుగు సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌కి నిర్మాతలు రామ్ తాళ్లూరి, బెక్కం వేణుగోపాల్, నటులు సోహైల్, ఆటో రామ్‌ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. ‘‘కృష్ణలంక... ఇక్కడ పుట్టే కులాన్ని బట్టి రాతలు రాయబడే ప్రాంతం. బతుకు బాగు కోసం ఎన్నో విప్లవ గేయాలు పాడిన గొంతులు మూగబోయిన ప్రాంతం, ఇది రాధాకృష్ణుల ప్రేమకావ్యాన్ని నెత్తురుతో లిఖించబడ్డ ప్రాంతం’’ అనే డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి.
ఎస్‌ఎస్ సైదులు మాట్లాడుతూ– ‘‘మంచి కథతో తీసిన మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘తనికెళ్లభరణిగారి వాయిస్‌తో మా సినిమాకు ఒక కొత్త ఫీల్ వచ్చింది’’ అన్నారు ఇస్మాయిల్. ‘‘1980 కి తగ్గట్లుగా ఈ సినిమాను ఇస్మాయిల్‌గారు తీశారు’’ అని పేర్కొన్నారు ఊడుగు సుధాకర్.
Comments
Please login to add a commentAdd a comment