
‘‘రాబిన్‌హుడ్’ (Robinhood Movie ) క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ. మేం థియేటర్స్‌కి వెళ్లి చూశాం. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి, సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత యలమంచిలి రవిశంకర్.
(చదవండి: రాబిన్‌హుడ్ మూవీ రివ్యూ)
నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇతర ΄ాత్రలు పోషించారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.
(చదవండి: 'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!)
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’లో మంచి కథతో పాటు వినోదం, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో పాటు యువత వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అన్నారు. ‘‘మేము రెండు థియేటర్స్‌ని విజిట్ చేశాం. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుండటం సంతోషంగా అనిపించింది. ఈ ఉగాదికి మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుంది’’ అన్నారు వెంకీ కుడుముల.