
హిందీలో ఇప్పుడంటే సరైన సినిమాలు రావట్లేదు. ఒకప్పుడు మాత్రం మంచి కంటెంట్ ఉన్న మూవీస్ అడపాదడపా రిలీజ్ అవుతుండేవి. అలా 2018ల రిలీజై సూపర్ హిట్ అయిన సినిమా రైడ్. అజయ్ దేవగణ్ హీరో.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)
ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రెడీ చేశారు. రైడ్ 2 పేరుతో మే 1న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. తొలి పార్ట్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈసారి హీరో పాత్రధారి 74వ రైడ్ కి వెళ్తాడు. ఏకంగా రూ.4200 కోట్ల నల్లధనం పట్టుకుంటాడు. ఇంతకీ ఎవరింట్లో ఈసారి రైడ్ చేశారో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
(ఇదీ చదవండి: గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?)