raid
-
కేంద్ర మంత్రి ఆప్తుడి ఇంట ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: హస్తినలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎల్జేపీ(రామ్ విలాస్ వర్గం) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన హులాస్ పాండేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసుకుంది. పాట్నా, బెంగళూరు, ఢిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాలతోపాటు బంధవుల ఇళ్లలోనూ తన బృందాలతో తనిఖీలు జరిపింది.ఆర్థిక లావాదేవీల అవకతవకలకు సంబంధించి.. హులాస్ పాండే(Hulas Pandey) మీద గతంలో చాలా ఆరోపణ వచ్చాయి. అయితే ఈడీ మాత్రం దాడులకు సంబంధించిన ప్రత్యేకమైన కారణాలను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. హులాస్ పాండే ఎల్జేపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. పాండే గతంలో బీహార్ ఎమ్మెల్సీగా పని చేశారు. తొలినాళ్లలో నితీశ్ కుమార్(Nitish Kumar) జేడీయూలో పని చేసిన ఈయన.. తర్వాత ఎల్జేపీ(LJP)లో చేరారు. అప్పటికే పాండే.. చిరాగ్‌ల మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. ఇక ఎల్జేపీలో చేరాక.. ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నింటిని ఇతనే చూసుకునేవారు. ఇదిలా ఉంటే.. 2012 నాటి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పాండే పేరును చేర్చారు. దీంతో.. అనివార్య పరిస్థితుల మధ్య కిందటి ఏడాది డిసెంబర్లో ఎల్జేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పాండే రాజీనామా చేయాల్సి వచ్చింది. వివాదాస్పద ప్రకటనతో అప్పుడప్పుడు వార్తల్లోనూ నిలుస్తుంటారీయన.ఏమీటా కేసు..2012 జూన్ 1వ తేదీన రణ్వీర్ సేన అధినేత బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా భోజ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ జరిపిన సీబీఐ పాండే మీద సంచలన ఆభియోగాలు నమోదు చేసింది. ముఖియాకు పేరు వస్తుండడంతో తన రాజకీయ పలుకుబడి మసకబారిపోతుందనే భయంతోనే పాండే ఈ హత్య చేయించాడని పేర్కొంది. అయితే..పాండే మాత్రం ఆ ఆరోపణలను రాజకీయ కుట్రగా ఖండిస్తూ వస్తున్నారు. ఈలోపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ ఛార్జ్‌షీట్‌ను తప్పుబట్టింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే.. ఈ ఉదయం నుంచి ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ(ED) బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా.. స్థానిక పోలీసుల సపోర్ట్ తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇదీ చదవండి: అయోధ్య గ్రేటర్ దేన్ ఆగ్రా! -
వ్యభిచార గృహంపై దాడి
తిరుపతి క్రైం: నగరంలోని భవానీనగర్‌లో ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈస్ట్ పోలీసులు మెరుపు దాడులు చేసి అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈస్ట్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు... భవానీనగర్‌లోని ఓ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం వచ్చి దాడులు చేశారు. బుజ్జమ్మ, శారద, సుబ్రహ్మణ్యం ముగ్గురూ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తూ కోస్తా నుంచి అమ్మాయిలను పిలిపించేవారు. వీరిని యువకులకు ఎరవేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఈ మేరకు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1000 రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామన్నారు. ఓ మహిళను గుర్తించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు. అమ్మానాన్నకు అబద్ధం చెప్పానంటూ.. -
బంజారాహిల్స్ లోని పలు పబ్బులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
-
అంతా.. ఆ ఏడుకొండల వాడి దయ!
‘ఇంకెన్ని గల్లీలు తిప్పుతారు?’ పక్కనే ఉన్న సహోద్యోగిని అడిగింది ఆమె. ‘అదే కదా.. ఎక్కడ బండి ఆగినా, ఆ స్ట్రీట్‌లోనే రెయిడేమో అనుకుంటున్నా’ అన్నాడు సహోద్యోగి. ఆ జీప్ మరో రెండు మలుపులు తిరిగి, ఆగింది. ‘వార్నీ.. తిరిగి తిరిగి బయలుదేరిన చోటుకే వచ్చాం!’ అంది ఆమె. ఆ మాటకు ఆ జీప్‌లో వెనకాలకూర్చున్న మిగతా ముగ్గురూ చిన్నగా నవ్వుకోసాగారు. అంతలోకే ఆ టీమ్‌ని లీడ్ చేస్తున్న ఆఫీసర్ జీప్ దిగి, ఆ పరిసరాలను మార్చి మార్చి చూడసాగాడు. అది గమనించిన నలుగురు ఉద్యోగులూ జీప్ దిగారు. టార్గెట్ వైపు నడకసాగించాడు ఆఫీసర్. ఆ నలుగురూ అతన్ని అనుసరించారు.వంద అడుగులు నడిచి, ఒక చిన్న పెంకుటిల్లు చేరుకున్నారు. ఒకసారి వాచ్ చూసుకున్నాడు ఆఫీసర్. సరిగ్గా రెండు నిమిషాలకు ‘పదండి’ అన్నట్టుగా ఆ ఇంటి ప్రహరీ గేటు తీశాడు. ఇంట్లోకి నడిచే దారి మా్రతమే ఫ్లోరింగ్‌తో, మిగతా ముంగిటంతా పూలు, పళ్ల చెట్లు, కూరగాయల పాదులతో ఉంది. గేటు పక్కనున్న మామిడి చెట్టుకు కాస్త ఆవల పూల చెట్లకు వేసిన ఫెన్సింగ్‌కి కట్టేసున్న కుక్క అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు ఇంట్లోంచి ఒకతను బయటకు వచ్చాడు. సర్వెంట్లా కనపడ్డాడతను వాళ్లకు.‘ఎవరు మీరు?’ కుక్క అరుపులను లెక్క చేయకుండా ముందుకు వస్తున్న వాళ్లనడిగాడతను. బదులు చెప్పకుండానే ఆ ఇంట్లోకి వెళ్లారు వాళ్లు. ఆ అలికిడికి, హాల్లో.. రాకింగ్ చెయిర్లో కూర్చుని నిద్రపోతున్న ఒక పెద్దాయన కళ్లు తెరిచి, లేవబోయి మళ్లీ కుర్చీలోనే కూలబడ్డాడు. డైనింగ్ టేబుల్ మీద ఏదో సర్దుతున్న ఒకావిడ, ‘అమ్మగారూ, ఎవరో వచ్చారండీ’ అంటూ లోపలికి కేకేసింది. ఆ మాటకు లోపలి నుంచి ఒక పెద్దావిడ వచ్చింది, బొడ్లో దోపుకున్న నాప్కిన్కి చేయి తుడుచుకుంటూ! ఆమెతో ఆ ఆఫీసర్ ‘వి ఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్’ అంటూ తన ఐడీ చూపించి, ‘సెర్చ్ వారంట్ ఉంది’ అని చెప్పి తన టీమ్‌కి ఆ ఇంటికున్న నాలుగు గదులను చూపిస్తూ ‘సెర్చ్’ అన్నట్టుగా సైగ చేశాడు.‘షో మీ?’ అడిగాడు రాకింగ్ చెయిర్ పెద్దాయన. అర్థంకానట్టుగా ఆయన్ని చూశాడు ఆఫీసర్. ‘సెర్చ్ వారంట్’ రెట్టించాడాయన! చూపించాడు ఆఫీసర్. వెంటనే ఆ పెద్దాయన తన పక్కనే చిన్న స్టూల్ మీదున్న ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్ తీసుకున్నాడు. లాక్కున్నాడు ఆఫీసర్ ఆ చర్యను ముందే గ్రహించినట్టుగా! నిశ్చేష్టుడయ్యాడు పెద్దాయన. ఇదంతా చూసి విస్తుపోతున్న ఆ పెద్దావిడను మహిళా ఉద్యోగి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చోబెట్టి.. చేష్టలుడిగిన పనమ్మాయితో ‘మంచి నీళ్లు’ అన్నట్టుగా సైగ చేసింది.పరిస్థితిని పసిగట్టిన మేల్ సర్వెంట్ బయటకు పరుగెత్తబోయాడు. గేట్ దగ్గరున్న జీప్ డ్రైవర్ అడ్డుపడ్డాడు. చేసేదిలేక మళ్లీ లోపలకి వచ్చేశాడు మేల్ సర్వెంట్. మహిళా ఉద్యోగి ఆ ఇంటి పెద్దావిడను ఏవో ప్రశ్నలడుగుతుండగా, మిగిలిన వాళ్లు ఆ ఇంటిని చుట్టబెట్టసాగారు.ఓ గంట గడిచింది.. ఆ టీమ్ అంతా ‘ప్చ్..’ అంటూ తల అడ్డంగా ఆడిస్తూ హాల్లోకి వచ్చారు. ఆ ఆఫీసర్ నిరాశతో బయటకు వచ్చి, చూరు కిందున్న వరండాలో నిలబడ్డాడు. రెండు చేతులతో జుట్టును సరిచేసుకుంటూ చూరు వైపు చూశాడు. తన తలపైన చూర్లో ఏదో అబ్నార్మల్ థింగ్‌లా కనిపించింది దూలాల రంగులో కలసిపోయి! పరీక్షగా చూస్తే తప్ప తెలియడం లేదది. తన స్టాఫ్‌లోని ఒక వ్యక్తిని పిలిచి, చూరు చూపించాడు. అది ఒక స్లయిడ్లా కనిపించింది. వెంటనే మేల్ సర్వెంట్‌ని పిలిచి పెద్ద స్టూల్ అడిగారు. ‘లేదండీ’ చెప్పాడతను. ‘నిచ్చెన?’ అడిగాడు ఉద్యోగి. ఉందన్నట్టుగా తలూపుతూ వెళ్లి నిచ్చెన తీసుకొచ్చాడు.పైకెక్కి స్లయిడ్‌ని పక్కకు జరిపాడు ఉద్యోగి. అందులో వెడల్పుగా, పలకలా కనపడిన ఓ ఇనప్పెట్టెను కిందకు దించాడు. ఈలోపు వెనుక పెరట్లోనూ గాలించి, ఏమీ లేదంటూ మిగిలిన ఉద్యోగులూ వరండాలోకి వస్తూ ఆ బాక్స్ చూసి ఆశ్చర్యపోయారు. ‘ఎక్కడ దొరికింది?’ అడిగాడు ఒక కొలీగ్. చూరు చూపించాడు ఆ బాక్స్ తీసినతను. బాక్స్‌లో డాక్యుమెంట్స్, డైమండ్స్ కనిపించాయి. దాన్ని లోపలికి తీసుకెళ్లి, ఆ ఇంటి ల్యాండ్ లైన్‌తో ఎవరికో ఫోన్ చేశాడు ఐటీ ఆఫీసర్. విషయం చెప్పి, ‘అవునా.. సరే’ అంటూ ఫోన్ పెట్టేశాడు. ‘వీళ్లబ్బాయింట్లో ఏమీ దొరకలేదట. అంటే అంతా ఇక్కడే దాచుంటాడు. ఇంకా సెర్చ్ చేయాలి’ అంటూ ఇంట్లోంచి మళ్లీ బయటకు వచ్చాడు ఆ ఆఫీసర్.ఇంటి ముందున్న గార్డెన్ ఏరియా అంతా కలియతిరిగాడు. అతన్ని చూస్తూ ఆ కుక్క మొరుగుతూనే ఉంది. ‘ఇది ఎందుకింతలా అరుస్తోంది’ అనుకుంటూ మామిడి చెట్టు వైపు వచ్చాడు. దాని కింద పొదలా పెరిగిన గడ్డీగాదం మధ్యలో ఓ సిమెంట్ గచ్చు కనిపించిందతనికి. అనుమానంతో ముందుకు కదిలాడు. ఆగకుండా కుక్క అరుస్తూనే ఉంది. ఆ అరుపుకి మిగిలిన స్టాఫ్ కూడా బయటకు వచ్చి ఆఫీసర్ని చేరుకున్నారు. ఆ గచ్చును చూపించాడతను. మేల్ సర్వెంట్‌ని పిలిచి ఆ కుక్కను అరవకుండా చూడమని పురమాయించి, గచ్చు దగ్గరికి వెళ్లి.. గడ్డి, పిచ్చి మొక్కలను పీకేశారు స్టాఫ్. ఆ గచ్చుకు మ్యాన్‌హోల్‌కి ఉండే ఐరన్ లిడ్ లాంటిది ఉంది. ‘అది పాత సంప్’ అన్నాడు సర్వెంట్ కంగారుగా. పట్టించుకోలేదు వాళ్లు్ల. మూత తీశారు. అదొక నేలమాళిగ. అందులో డబ్బులు, బంగారం, వెండి దొరికాయి.దాదాపు పాతికేళ్లనాటి ఆ రెయిడ్ అప్పటి సంచలనం. ఆ ఇంటి యజమాని గల్ఫ్ ఏజెంట్, ‘హుండీ’ వ్యాపారి. చిన్న పెంకుటింట్లో సాధారణ జీవితం గడిపే తన తల్లిదండ్రుల దగ్గర తన సంపాదనను దాస్తే ఏ భయమూ ఉండదని అక్కడ దాచాడు. ఆ రెయిడ్ జరిగిన ఏడు ఆ యజమాని తిరుపతి హుండీలో భారీ విరాళం వేయడంతో ఆ వార్త పేపర్కెక్కి.. ఐటీ దృష్టిలో పడి రెయిడ్కి దారితీసింది! అందుకే రెయిడ్ అయిపోయి తిరిగివెళ్లిపోతూ ‘ఆ ఏడుకొండలవాడి దయ’ అంటూ నవ్వుకున్నారు స్టాఫ్!ఇవి చదవండి: 'బేరం'.. బెండకాయలెంత కిలో..? -
సీబీఐ దాడులు.. పోస్టాఫీస్ ఉద్యోగి ఆత్మహత్య
సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో.. మనస్తాపం చెందిన ఓ పోస్టల్ అధికారి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోట్లాది రూపాయల అవకతవకలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పోస్టాఫీసుపై దాడి చేశారు.ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ప్రధాన పోస్టాఫీసుపై మంగళవారం అర్థరాత్రి సీబీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మందికి పైగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ బుధవారం ఉదయం అలీగఢ్‌లోని తన ఇంట్లో లైసెన్స్డ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సీబీఐ దాడులతో త్రిభువన్ ఒత్తిడికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నారు. సింగ్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.అయితే దాడులతో ఒత్తిడికి గురయ్యాడనే ఆరోపణలను మృతుడి కుటుంబ సభ్యులు ఖండించారు. తనను ఒక మహిళ, కొందరు అధికారులు తమ వద్ద పని చేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రతాప్ సింగ్ సోదరుడు బాధితుడు రాసిన ఆత్మహత్య లేఖను వాట్సాప్‌లో షేర్ చేశాడు. తన అధికారిక లెటర్‌హెడ్‌తో కూడిన కాగితంపై హిందీలో రాసిన నోట్లో.. చాలా మంది సహోద్యోగులు తమ ఆదేశాల ప్రకారం పనిచేయమని తనను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
కోడి పందేల స్థావరంపై దాడి.. 14 మందిని అరెస్ట్
వాజేడు: లక్షీపురం, గెర్రగూడెం గ్రామాల శివారులోని ఊర చెరువు వద్ద కోడి పందేల స్థావరంపై వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు.పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది కోడి పందేలు ఆడుతూ పోలీసులను చూసి పారిపోయారు. పారి పోతున్న వారిని వెంబడించి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.ఈ దాడిలో 14 మందిని అదుపులోకి తీసుకోగా.. వారి నుంచి 5 కోడి పుంజులు, 4 కోడి కత్తులు, రూ.28,900 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరీశ్ తెలిపారు. -
తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
-
కాంగ్రెస్ నేత ఇంటిపై ఈడీ దాడులు
భివానీ: హర్యానాలోని భివానీ జిల్లాలో మైనింగ్ కాంట్రాక్టర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి దాడులు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మైనింగ్ కాంట్రాక్టర్ వేద్‌పాల్ తన్వర్, అతని సహచరుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇప్పుడు మరోమారు భివానీ, తోషమ్‌లోని మైనింగ్ కాంట్రాక్టర్ల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు.భివానీలోని సెక్టార్-13లో ఉంటున్న మైనింగ్ కాంట్రాక్టర్, కాంగ్రెస్ నేత సత్బీర్ రాటేరా నివాసంపై ఈడీ బృందం దాడులు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈడీ బృందం సత్బీర్ రాటేరా ఇంటిపై దాడులు చేసింది. సత్బీర్ రాటేరా తన భార్య పేరిట తోషమ్‌లోని ఖానాక్, దాడం ప్రాంతంలో మైనింగ్ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నారు. ఆయన బవానీఖేడా అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం. -
ప్రతీ కుక్కకీ ఒక రోజుంటది.. లక్ అంటే నీదేరా!
-
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడి
-
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్‌గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్‌గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. -
వరంగల్ జిల్లాలో కలకలం రేపిన సబ్ రిజిస్ట్రార్ తస్లిమా వ్యవహారం
-
ఏసీబీకి చిక్కిన సబ్-రిజిస్ట్రార్
-
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల/మార్టూరు: నోవా అగ్రిటెక్ మాటున అక్రమాలకు పాల్పడిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరింత రెచ్చిపోతున్నారు. మంగళవారం మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్ విజిలెన్స్ అధికారులపై తన అనుచరులతో పాటు ఏకంగా దాడికి పాల్పడ్డారు. గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలు చేయనిచ్చేది లేదంటూ తొలుత అధికారులను అడ్డగించారు. తనిఖీకి వచ్చిన మైనింగ్ ఏడీతోపాటు మిగిలిన అధికారులనూ దుర్భాషలాడారు. మైనింగ్ అధికారులతో వచ్చిన డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. గౌరవప్రదమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి పరిశ్రమలను తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులపై బరితెగించి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారు. విచారణ జరిగితే అక్రమాలు వెలుగుచూస్తాయన్నా భయంతోనే ఏలూరి దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే మార్టూరు గ్రానైట్ పరిశ్రమల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో నెల్లూరు మైనింగ్ విజిలెన్స్ ఏడీ బాలాజీనాయక్, మచిలీపట్నం మైనింగ్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం తనిఖీల నిమిత్తం మార్టూరుకు వచ్చారు. బాలాజీనాయక్ బృందం బల్లికురవ మండలం వేమవర వద్ద ఉన్న ఎమ్మెల్యే ఏలూరి అనుచరుడు కోటపాటి సురేష్‌కు చెందిన రెండు ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించగా మచిలీపట్నం ఏడీ ప్రతాప్‌రెడ్డి మార్టూరులోని ఏలూరి మరో అనుచరుడు కామినేని జనార్దన్‌కు చెందిన ఫ్యాక్టరీలో తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని మార్టూరులోనే ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు తెలియజేయడంతో అనుచరులతో సహా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏడీ ప్రతాప్‌రెడ్డిని ఎలా తనిఖీలు చేస్తారంటూ నిలదీశారు. తనిఖీలు చేస్తామంటే చూస్తూ ఉరుకునేది లేదంటూ గొడవకు దిగాడు. అనుచరులతో కలిసి అధికారులను దుర్భాషలాడారు. వారిపై జులుం ప్రదర్శించారు. ఏడీ ప్రతాప్‌రెడ్డిపై జరుగుతున్న దౌర్జన్యం చూసి అడ్డుకోబోయిన డ్రైవర్ శ్రీనివాసరావుపై ఏలూరి అనుచరులు దాడికి దిగారు. అతనిని ఇష్టానుసారం కొట్టారు. ఫ్యాక్టరీ ఆవరణలోని ఓ గదిలో బంధించారు. ఎమ్మెల్యే, అనుచరులపై కేసులు నమోదు ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి సీఐ నరసింహారావు మంగళవారం రాత్రి తెలిపారు. ఏలూరి సాంబశివరావు, ప్రత్తిపాటి సురేష్, చల్లగుండ్ల కృష్ణ, దివ్య ప్రసాద్, షేక్ అబ్దుల్ రజాక్, మిన్నెకంటి రవి, అడుసుమల్లి శ్రీనివాసరావు, నడింపల్లి హనుమాన్ ప్రసాద్, మరికొందరిపై మైనింగ్ ఏడీ ఆర్ ప్రతాప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. వీరిపై ఐపీసీ 341, 353, 323, 324, 427, 386, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. -
జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం?
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం (జనవరి 29) ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లింది. అయితే అక్కడ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో, ఈడీ స్క్వాడ్ 13 గంటలకు పైగా అక్కడే మకాంవేసి, సీఎం నివాసంలో సోదాలు జరిపింది. దర్యాప్తు సంస్థ జార్ఖండ్ సీఎం నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారు (హర్యానా నంబర్‌తో నమోదైంది)ను స్వాధీనం చేసుకుంది. అలాగే కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఈడీ చర్యను హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు చేసిన ప్రణాళికాబద్ధమైన కుట్రగా అభివర్ణించింది. మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ ఆరోపించింది. సోమవారం నాడు ఢిల్లీ పోలీసులతో కలిసి ఈడీ బృందం దక్షిణ ఢిల్లీలోని ఆయన నివాసమైన శాంతి నికేతన్ భవన్‌కు ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకుంది. రాత్రి 10:30 గంటల వరకు ఈడీ బృందం అక్కడే ఉంది. సోరెన్ నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారును, కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం సోరెన్ జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఆయన పార్టీ జేఎంఎం తెలిపింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యకు భయపడి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత 18 గంటలుగా పరారీలో ఉన్నారని బీజేపీ జార్ఖండ్ యూనిట్ పేర్కొంది. భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్‌ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ సమన్లు జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఏజెన్సీకి లేఖ పంపారని, అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆదివారం (జనవరి 28) ఈడీకి పంపిన ఈ మెయిల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోరెన్ ఆరోపించారు. -
స్పా సెంటర్లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్
హైదరాబాద్: మసాజ్ పేరుతో అక్రమంగా కొనసాగిస్తున్న స్పా కేంద్రాలపై గుడిమల్కాపూర్ పోలీసులు, సౌత్‌వెస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ షేక్ ముజీబ్ ఉర్ రెహా్మన్ తెలిపిన వివరాల ప్రకారం.. నానల్‌నగర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జన్నత్, గోల్డెన్ అనే రెండు స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు స్పా కేంద్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. స్పా, స్నూకర్, రిక్రియేషన్క్లబ్లకు ఇళ్లను అద్దెకిచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ఇళ్ల నిర్వహకులకు ఇన్స్పెక్టర్ సూచించారు. -
వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని
హోసూరు: యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సిఫ్‌కాట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బృందావన్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రుజువైయ్యింది. నామక్కల్ జిల్లా తిరుచ్చంగోడు ప్రాంతానికి చెందిన వెంకటాచలం (56), భార్య మధుబాల (48)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో.. గుట్కా, కారు సీజ్ హోసూరు: కర్ణాటక నుంచి కరూర్‌కు అక్రమంగా తరలిస్తున్న గుట్కాను సిప్కాట్ పోలీసులు స్వాధీనపరుచుకొని డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. సిఫ్‌కాట్ పోలీసు హోసూరు– బెంగళూరు హైవేపై జూజువాడి చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి తనిఖీలు చేశారు. ఓ కారులో సోదాలు చేయగా రూ. 1.86 లక్షల విలువ చేసే గుట్కా పట్టుబడింది. ప్రవీణ్ (28) అనే డ్రైవర్‌ను అరెస్టు చేసి గుట్కాను, కారును స్వాధీనం చేసుకున్నారు. చదవండి హైదరాబాద్: మీర్‌పేటలో దారుణం.. బీరు బాటిళ్ల కోసం గొడవ.. కత్తితో పొడిచి.. -
వీడియోలతో లక్షల సంపాదన.. ఐటీ అధికారుల ఎంట్రీతో షాకైన యూట్యూబర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఉన్న యూట్యూబర్ తస్లీమ్ ఇంటిపై జరిపిన దాడిలో రూ. 24 లక్షలను అధికారులు గుర్తించారు. అతను దాదాపు రూ. 1 కోటి వరకు సంపాదించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా తస్లీమ్ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు ఐటీ శాఖ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అతని కుటుంబం తోసిపుచ్చింది. తస్లీమ్, షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలతో సంపాదిస్తున్నాడు. తనకు వచ్చే ఆదాయం బట్టి అతను ఇన్‌కం ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు అతని సోదరుడు పేర్కొన్నాడు. 'ట్రేడింగ్ హబ్ 3.0' అనే యూట్యూబ్ అకౌంట్‌ను తన సోదరుడు నిర్వహిస్తున్నాడని ఫిరోజ్ తెలిపారు. అతని యూట్యూబ్ ఆదాయం రూ.1.2 కోట్లపైన ఉండగా అందుకు సంబంధించి ఇప్పటికే రూ. 4 లక్షల పన్నులు చెల్లించారని ఆయన పేర్కొన్నారు. "మేము ఎటువంటి తప్పుడు పని చేయడం లేదు. యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతూ.. దాని నుంచి చట్ట ప్రకారమే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం, ఇది నిజం. ఒక కుట్ర ప్రకారమే ఐటీ దాడులు జరిగినట్టు అనిపిస్తోందని’ ఫిరోజ్ చెప్పాడు. తస్లీమ్ తల్లి తన కొడుకును తప్పుగా ఇరికించారని ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్! -
ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా రవితేజ.. ఆ హిట్ సినిమానే టార్గెట్
హీరో రవితేజ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా చార్జ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. అజయ్‌దేవగన్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ‘రైడ్’ (2018) సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. నిజాయితీ గల ఓ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ అమీ పట్నాయక్ (అజయ్ దేవగన్) తనకు ఎదురైన సవాళ్లను ఏ విధంగా సాల్వ్ చేశాడన్నదే ‘రైడ్’ కథాంశం. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుందంటూ వార్తలు వచ్చాయి. కొందరు హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా మరోసారి ‘రైడ్’ రీమేక్ ప్రస్తావన టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ రీమేక్‌లో రవితేజ హీరోగా నటిస్తారని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుందని టాక్. మరి.. ‘రైడ్’ రీమేక్‌లో రవితేజ నటిస్తారా? లేదా? తెలియాలంటే వేచి చూడాలి. -
స్పా ముసుగులో వ్యభిచారం..సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
-
సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్..
ఢిల్లీ: ఢిల్లీలో లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓ దుకాణాదారుడి వద్ద రూ.50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. దేశ రాజధానిలోని మొగలిపురా ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #WATCH | CCTV footage of CBI raid under Mangolpuri Police Station area in Delhi on 10th July where one of the accused Head Constable Bheem Singh was seen attempting to flee, but he was caught. CBI has registered FIR against two head constables in a bribery case. (Source: CCTV… pic.twitter.com/qeoka3n40t — ANI (@ANI) July 12, 2023 మొగలిపురా ప్రాంతంలో బీమ్ సింగ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. స్థానికంగా ఓ దుకాణాదారుని షాప్ ముందు పార్కింగ్ అంశంలో డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.50,000 ఇవ్వాలని ఆ షాప్‌కీపర్‌పై ఒత్తిడి పెంచాడు. విసిగిపోయిన దుకాణాదారుడు సీబీఐ అధికారులకు సమాచారం అందించాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. వ్యూహం ప్రకారం రంగంలోకి దిగారు. పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని నమ్మించి ఆ షాప్ కీపర్ పోలీస్ కానిస్టేబుల్‌ను దుకాణం ముందుకు రప్పించాడు. అక్కడా కాపుగాసిన అధికారులను గమనించిన కానిస్టేబుల్ దుకాణదారుని నుంచి లంచం తీసుకోబోయాడు. వెంటనే అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా బీమ్ సింగ్‌ను పట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య -
హైదరాబాద్: మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు శుక్రవారం మూడోరోజూ కొనసాగుతున్నాయి. వైష్ణవి గ్రూప్ స్థిరాస్తి సంస్థ, హోటల్ అట్ హోమ్ సంస్థలు వాటి అనుబంధ సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఆయా సంస్థల కార్యాలయాల్లో మేనేజింగ్ డైరెక్టర్లు , సీఈఓల ఇళ్లలో అధికారులు తనీఖీలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి ,శేఖర్ రెడ్డి ఇళ్లల్లో సైతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలల్లో 70 మంది ఐటీ అధికారుల బృందాలు పాల్గొన్నాయి. పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్ ఎస్టేట్, మైనింగ్ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్ సిండికేట్ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది. చదవండి: ఢిల్లీలో కేసీఆర్, ఖర్గే చేతులు కలిపారు.. రేవంత్ పరిస్థితి ఏంటో! -
వైరల్ వీడియో : రిషికేష్‌లో ఎద్దుపై యువకుడి స్వారీ.. ప్రభుత్వం సీరియస్
-
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పట్టుబడ్డ డిప్యూటీ మేయర్
సాక్షి, మేడ్చల్: మేడిపల్లిలోని పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలు, డిప్యూటీ మేయర్ అడ్డంగా దొరికిపోయారు. బీఆర్ఎస్ నేతలంతా పీర్జాదిగూడ డ్యిప్యూటీ మేయర్ శివకుమార్ ఆఫీస్‌లో ఆడుతూ పట్టుబడినట్లు సమాచారం. దీంతో పోలీసులు డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తోపాటు ఏడుగురు కార్పోరేటర్లను, ఆరుగురు బిల్డర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నారు. -
సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భవానిపుర్‌లో ఓ ముఠా సినీ ఫక్కీలో చోరీకి పాల్పడింది. సీబీఐ అధికారులమని చెప్పి ఓ వ్యాపారవేత్త ఇంటిపై రైడ్ చేసింది. ఇల్లంతా సోదాలు చేసి రూ.30 లక్షల నగదు, ఆభరణాలు దోచుకెళ్లింది. 7-8 మంది పురుషులు కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నకిలీ సీబీఐ అధికారుల చేతిలో మోసపోయి ఈ వ్యాపారవేత్త పేరు సురేష్ వాధ్వా(60). ఏడెనిమిది మంది మూడు కార్లలో సోమవారం ఉదయం 8గం.లకు తన ఇంటికి వచ్చారని చెప్పాడు. వాళ్ల వాహనాలపై పోలీస్ స్టిక్కర్లు ఉన్నాయని పేర్కొన్నాడు. సీబీఐ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చారని, ఐడీ కార్డు అడిగినా చూపించలేదని వివరించాడు. ఈ గ్యాంగ్ ఇల్లంతా సోదాలు చేసి రూ.30లక్షల నగదు, కొన్ని లక్షల విలువైన బంగారాన్ని గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారని సురేష్ తెలిపాడు. ఏమేం సీజ్ చేశారనే లిస్ట్‌తో పాటు, విచారణకు హాజరు కావాలని సమన్లు కూడా తర్వాత పంపిస్తామని చెప్పి ఆ ముఠా వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. తాను మోసపోయానని తెలిసి వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ దోపిడీలో సురేశ్ సన్నిహితులు లేదా అతనికి బాగా తెలిసిన వాళ్ల ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీలను పరిశీలించి ఆ మూడు కార్ల వివరాలు తెసుసుకుని నిందితుల కోసం గాలిస్తామన్నారు. చదవండి: షాకింగ్.. ఆస్పత్రి నుంచి అంబులెన్స్ దొంగిలించిన బాలుడు -
ఎన్నారై ఆస్పత్రిలో 27 గంటలపాటు ఈడీ సోదాలు
-
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు
-
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
-
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు
-
అర్పితా ముఖర్జీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
-
శ్రీలంకలో అర్ధరాత్రి అలజడి.. నిరసనకారులపై విరుచుకుపడిన బలగాలు!
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోనే ప్రధాన క్యాంప్‌పై గురువారం అర్ధరాత్రి వందల మంది ఆ దేశ భద్రతా బలగాలు, పోలీసులు దాడులు చేపట్టారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు. అధ్యక్షుడి సెక్రెటేరియట్ భవనం ముందు నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే పనులు చేపట్టాయి భద్రతా బలగాలు. అయితే.. తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు నిరసనకారులు. ఏప్రిల్ 9 నుంచి అధ్యక్షుడి కార్యాలయం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన వారు.. కొత్త అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. ‘ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే మాకు విజయం సాధ్యమవుతుంది.’ అని నిరసన బృందాల ప్రతినిధి లాహిరు వీరసేకర పేర్కొన్నారు. సముద్రతీర కార్యాలయాన్ని సైనికులు చుట్టుముట్టారు. ఏప్రిల్ నుంచి వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు అవసరమైన సామగ్రిని అందించడానికి ఏర్పాటు చేసిన అనేక తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు. అధ్యక్ష భవనం సమీపంలో తమకు నిరసనలు చేపట్టేందుకు చోటు చూపించాలని డిమాండ్ చేశారు. ‘రణీల్ విక్రమసింఘే మమల్ని చెదరగొట్టాలనుకుంటున్నారు. వారు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. కానీ మేము వదిలిపెట్టం. నీచ రాజకీయాల నుంచి దేశాన్ని విడిపించటమే మా లక్ష్యం.’ అని స్పష్టం చేశారు. #WATCH | Sri Lanka: Tents of protestors being dismantled by the armed security personnel amid a late-night clampdown outside the premises of the Sri Lankan Presidential Secretariat in Colombo pic.twitter.com/yuhRWU0lRj — ANI (@ANI) July 21, 2022 ఇదీ చదవండి: డ్రాగన్ చైనా వల్లే లంకేయులకు ఈ గతి.. ప్రపంచ దేశాలకు ఇదే హెచ్చరిక! -
జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
-
పైకి కాఫీ బార్ షాపు.. లోపలే ఉంది అసలు మ్యాటర్!
యలహంక(బెంగళూరు): కాఫీ బార్ పేరుతో అక్రమంగా హుక్కా బార్ నడిపిస్తున్న ముగ్గురిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. దేవనహళ్లి తాలూకా కన్నమంగళ గేటు సమీపంలో కాఫీబార్ పేరుతో హుక్కా బార్ నడిపిస్తూ యువతీ, యువకులను ఆకర్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. టెంపోను ఢీకొన్న కారు తుమకూరు: వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపై వస్తున్న టెంపో ట్రావెలర్‌ను ఢీకొన్న ఘటనలో కారులోని ముగ్గురు మరణించారు. జిల్లాలోని కుణిగల్ దగ్గర బేగూడరు వద్ద 75వ హైవేపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతులు బెంగళూరు సంజత్ నగరకు చెందిన రఘు (38), హెబ్బాల బీఎల్ సర్కిల్‌కు చెందిన విజయ్ (36), సంతోష్ (28)లు. కారు డ్రైవర్ లోకేష్‌తో పాటు తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని బెంగళూరుకు తరలించారు. టెంపోలో ఉన్న వసంత అనే మహిళకు కూడా గాయాలు తగిలాయి. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి పంపించని భర్త.. దీంతో భార్య.. -
పక్క రాష్ట్రం నుంచి యువతులను రప్పించి వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు
సాక్షి,హస్తినాపురం(హైదరాబాద్): ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు మరో ఇద్దరిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం..విజయవాడకు చెందిన సి.శృతి అలియాస్ పద్మ(34) వనస్థలిపురం ఠాణా పరిధిలోని సామనగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని అందులో పక్క రాష్ట్రం నుంచి యువతులను రప్పించి వారితో వ్యభిచారం నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సదరు ఇంటిపై దాడి చేసి నిర్వాహకురాలు పద్మతో పాటు పట్లావత్ పద్మ అలియాస్ జ్యోతి, ఎన్.రామ్‌ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9 వేల నగదు, 2 సెల్ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: 'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'! -
విజయవాడలోని పలు మెడికల్ షాపులపై దాడులు
-
గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే, షాక్‌లో అధికారులు.. ఫోటోలు వైరల్!
లక్నో: పన్ను ఎగవేత ఆరోపణలపై సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు చేస్తుండగా సంచుల కొద్ది నోట్ల కట్టలు గుట్లల్లా కనిపించడంతో అధికారులు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ బృందం గురువారం ఉదయం పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు ఏకకాలంలో.. కాన్పూర్, కన్నౌజ్, గుజరాత్, ముంబైలో ఉన్న సంస్థలలో జరిగాయి. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే బ్యాంక్ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వరకు లెక్కించగా.. నగదు, పత్రాలతో కలిపి 150 కోట్ల రూపాయల పన్ను ఎగవేతలకు సంబంధించి ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీయూష్ జైన్ ఎస్పీ నేతకు సన్నిహితుడు కూడా. కొన్ని రోజుల క్రితమే సమాజ్ వాదీ పేరుతో పెర్ఫ్యూమ్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కన్నౌజ్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి పెర్ఫ్యూమ్ ముంబైకి వెళ్తుందని అక్కడి నుంచి పెర్ఫ్యూమ్ దేశ విదేశాల్లో కూడా అమ్ముడవుతోందని తెలిపారు. సౌదీ అరేబియాలో రెండు, దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో రెండు సహా పీయూష్ జైన్‌కు దాదాపు 40 కంపెనీలు ఉన్నాయని తెలిపారు. समाजवादियों का नारा है जनता का पैसा हमारा है! समाजवादी पार्टी के कार्यालय में समाजवादी इत्र लॉन्च करने वाले पीयूष जैन के यहाँ GST के छापे में बरामद 100+ करोड़ कौन से समाजवाद की काली कमाई है? pic.twitter.com/EEp7H5IHmt— Sambit Patra (@sambitswaraj) December 24, 2021 చదవండి: Aaditya Thackeray: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు.. -
టాలీవుడ్ క్లబ్‌పై దాడులు.. అర్ధనగ్న నృత్యాలు, వికృత చేష్టలు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టాలీవుడ్ క్లబ్ పబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లో శుక్రవారం అర్థరాత్రి వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ క్లబ్ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడవడమే కాక.. సమయం దాటిన తరువాత కూడా యువతి యువకులు పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అర్ధనగ్న నృత్యాలు, డీజే స్టెప్పులతో రచ్చ చేశారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి, నోటీసులు జారీ చేశారు. అయినప్పటికి పబ్ యాజమాన్యం తన తీరు మార్చుకోవడం లేదు. చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ బేగంపేటలోని పబ్‌పై కేసు, అదుపులోకి 28 మంది -
Nalgonda: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు
నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్‌చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని పోలీసులు తెలిపారు. ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరో మహిళను సఖి కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్న ఓ మహిళ విటురాలుగా ఉందని అన్నారు. కాగా రమేష్‌చారి తిప్పర్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నాడు. -
ఈ నాలుగు రోజులు అతిథులతో బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఓకే
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలు, ఇతర స్థల్లాల్లో ఐటీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. నటుడికి సంబంధించిన అన్నిచోట్లా ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఆయనకు చెందిన సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారు. దాడుల అనంతరం సోనూ.. రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టలేదని తేల్చినట్లు అధికారులు చెప్పారు. ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్ 20న) సోషల్ మీడియాలో సోనూసూద్ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేషన్‌లో ప్రతి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్ చేశాను. ఈ నాలుగు రోజులు అతిథులతో (ఐటీ అధికారులు) బిజీగా ఉండడం వల్ల మీ సేవకు దూరమయ్యా. ఇప్పుడు నేను తిరిగి వచ్చా. మీ సేవకై నా ప్రయాణం కొనసాగుతుంది’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారు “सख्त राहों में भी आसान सफर लगता है, हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY — sonu sood (@SonuSood) September 20, 2021 -
తూర్పు గోదావరి జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం
-
తెలంగాణలోని 5 జిల్లాలో ఎన్ ఐ ఏ సోదాలు
-
పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు: సమారు రూ.200 కోట్లు
సాక్షి, ఆదిలాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ ఇంటితో పాటు ఆయన పరిశ్రమల్లో ఇన్‌కం టాక్స్ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. జిల్లాలోని నాలుగు చోట్లతో పాటు హైదరాబాద్‌లోని పలు వ్యాపార స్థావరాలపై ఏకకాలంలో ఐటీ అధికారుల దాడులకు చేశారు. రఘునాథ్ మిత్తల్ వ్యాపార లావాదేవీలు, ఆస్తులుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న ఇన్‌కం టాక్స్ సోదాలకు సంబంధించిన విషయం సాయంత్రం వరకూ బయటకు తెలియలేదు. ఐటీ అధికారులు ఈ సోదాల్లో రఘునాథ్ మిత్తల్‌కు సంబంధించిన సుమారు రూ. 200 కోట్లు లెక్కల్లో తేలని ఆస్తులను గుర్తించినట్లు తెలస్తోంది. కాని అధికారికంగా మాత్రం సంబంధిత అధికారులు దీనిపై స్పందించలేదు. ఆదిలాబాద్‌కు చెందిన రఘునాథ్ మత్తల్‌కు సంబంధించి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నప్పటికీ.. ఆయా చోట్ల ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. -
గుట్కా తయారీ గుట్టు రట్టు
సాక్షి, విశాఖపట్నం : శివారులో ఒంటరిగా ఉన్న ఇళ్లను ఎంచుకున్నారు... చిన్న చిన్న పనులు చేసుకుంటున్నామంటూ ఆ ఇళ్లను అద్దెకు తీసుకున్నారు.. ఒక నెల సైలెంట్‌గా ఉంటూ.. ఆ త ర్వాత నుంచి అసలు పనులు ప్రారంభించారు. నివాస స్థలాన్ని గుట్కా ఫ్యాక్టరీలుగా మార్చేశారు.. ఇంటిలోకి వెళ్తే తప్ప.. వాసనను పసిగట్టలేనంతగా పక్కా ఏర్పాట్లు చేశారు... మార్కె ట్లో లభించే ప్రధాన గుట్కా బ్రాండ్ల పేరుతో ప్యాకెట్లను తయారు చేసి.. వివిధ జిల్లాలకు సరఫరా చేశారు. చుట్టు పక్కల కాలేజీ కుర్రాళ్లను మత్తులో ముంచేలా గంజాయినీ సరఫరా చేసే వారు.. మూడేళ్లుగా గుట్టుగా సాగుతున్న భారీ గుట్కా వ్యాపారాన్ని నగర పోలీసులు రట్టు చే శారు. రూ.50లక్షలకు పైగా విలువచేసే గుట్కా, ముడి సరకుని స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇళ్లని అద్దెకు తీసుకొని గుట్కా తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలపై టాస్క్ఫోర్సు, పీఎం పాలెం పోలీసులు శనివారం దాడి చేశారు. పది మంది నిందితులను అరెస్టు చేశారు. రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో భారీగా తయారు చేసిన గుట్కా ప్యాకెట్లు, తయారీకి వినియోగించే ముడి సరుకు, గుట్కా తయారీ యంత్రాలను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రుషికొండలోని గుట్కా తయారీ యూనిట్ వద్ద నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.... ఇంట్లోనే తయారీ యూనిట్.. ఒడిశాలోని బరంపురం ప్రాంతానికి చెందిన బాదం సంపత్‌కుమార్, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన పెదబాబు కొన్నేళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వీరిద్దరూ కలిసి 2016లో రుషికొండ మూడో లైన్లో ప్లాట్ నం.450ని అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమానులు దగ్గర్లో లేకపోవడంతో సమీప బంధువులు వరుసగా రెండు నెలలు అద్దె తీసుకోవడానికి వచ్చి ఇంటిని పరిశీలించారు. ఇంటిని శుభ్రంగా ఉంచుతుండటంతో వారిపై ఎలాంటి అనుమానం రాలేదు. ఇక అప్పటి నుంచి ఇంటిలోనే గుట్కా తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేసేశారు. నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు, విశాఖ ఏజెన్సీ పాడేరు, అరకు నుంచి గంజాయిని కొనుగోలు చేసి రహస్యంగా దాచి పెట్టారు. ఒడిశా, బిహార్, తెలంగాణతోపాటు రాష్ట్రానికి చెందిన కొంతమంది గుట్కా తయారీ నిపుణులను పనిలో పెట్టుకున్నారు. రాత్రి పూట గుట్కాను గుట్టుగా తయారు చేసేవారు. ఉదయం పూట మార్కెటింగ్ కోసం వివిధ వ్యాపారులతో సంప్రదింపులు జరిపి వారికి కావాల్సిన బ్రాండ్లను అడిగి.. ఆ బ్రాండ్లకు సంబంధించిన కవర్లలో ప్యాకింగ్ చేసేవారు. వాటిని జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు గుట్టు చప్పుడు కాకుండా ఎగుమతి చేసేవారు. విభేదాల కారణంగా మరో యూనిట్.. తయారీదారులైన సంపత్, పెదబాబు మధ్య కొద్ది నెలల క్రితం వ్యాపార లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తాయి. వ్యాపారం నుంచి విడిపోయిన సంపత్.. అక్కడికి కొద్ది దూరంలోనే రుషికొండలోని సిల్వర్ ఓక్స్ పాఠశాల సమీపంలో డోర్ నం.7–14 వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సొంతంగా రెండు నెలల క్రితం మరో యూనిట్ ప్రారంభించాడు. ఈ వ్యాపారాలకు సంబంధించిన విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ బృందం పీఎం పాలెం పోలీసుల సహకారంతో రెండు యూని ట్లపైనా శనివారం దాడులు చేశారు. రెండు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్లాంట్ నిర్వాహకులైన సంపత్, పెదబాబు ఇద్దరూ తప్పించుకున్నారు. అక్కడ పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా ఖమ్మపల్లెకు చెందిన బొడ్డు రమేష్, రాజమండ్రి చర్చిపేటకు చెందిన నీలమ్చంద్ సాహు, బీహార్ రాష్ట్రం మార గ్రామానికి చెందిన మనోజ్ మర్మాడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చంద్రనగర్‌కు చెందిన దీపక్‌కుమార్ సవిత, బిహార్ రాష్ట్రం అకకులార్కు చెం దిన జతిన్‌దాస్, విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం కొత్తూరుకి చెందిన గోతురెడ్డి శ్రీనివాస్, బిహార్‌కు చెందిన సునీల్ దాస్, బినోద్ దాస్, చోటాలాల్మున్మూన్, ఒడిశాకు చెందిన అజయ్‌కుమార్ పాణిగ్రాహి పట్టుబడ్డారు. భారీగా గుట్కా, ముడి సరకు స్వాధీనం.. దాడి చేసిన రెండు యూనిట్లలోనూ 50 లక్షల రూపాయిల విలువచేసే తయారు చేసిన గుట్కా ప్యాకెట్లతో పాటు తయారీ కోసం నిల్వ ఉంచిన ముడిసరకు, రెండు బస్తాల్లో నిల్వ ఉంచిన 81 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీ టితోపాటు బరువు తూనిక యంత్రాలు, ప్యా కింగ్ మెషీన్లు, గుట్కా తయారు చేసే యంత్రాలు, ఎంసీ, సఫారీ–2000, గోకుల్‌తోపాటు వివి ధ బ్రాండ్ పేర్లు ముద్రించిన కవర్లు, యాలకులు, మసాలా దినుసులు, పొగాకు బస్తాలు, వి విధ రసాయనాలతోపాటు మూడు ద్విచక్ర వా హనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హానికర రసాయనాల వినియోగం.. గుట్కా తయారీలో హానికరమైన రసాయనాలు వినియోగిస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. 40 కిలోల టొబాకో కినామ్ పెర్ఫ్యూమ్, 10 కిలోల వీజెడ్ స్పెషల్ ఆయిల్, 2 కిలోల సఫారీ పెర్ఫ్యూమ్ క్యాన్లు, 20 లీటర్ల డీలక్స్ ఆయిల్స్, లూజ్ ఆయిల్స్‌లను గుట్కాలో ఉపయోగించేందుకు నిల్వ చేశారని వెల్లడించారు. గంజాయిని చుట్టు పక్కల ఉన్న కాలేజీల్లో యువతకు అమ్ముతున్నట్లు తెలిసిందని తెలిపారు. నిందితులపై గతంలో కూడా గుట్కా తయారు చేస్తూ పట్టుబడిన కేసు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో నమోదైందని వెల్లడించారు. నగరంలో ఈ తరహా యూనిట్లు గుట్టుగా నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందనీ.. వాటిపైనా త్వరలో దాడులు నిర్వహిస్తామని సీపీ మీనా స్పష్టం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి తయారీలు నిర్వహిస్తుంటే ప్రజలు సమాచారం ఇ వ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల్లో డీసీపీ – 1 ఎస్.రంగారెడ్డి, నార్త్ ఏసీపీ ఎస్పీరెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినాథ్, పీఎం పాలెం సీఐ ఆర్వీఆర్కే చౌదరి, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ వాసునాయుడు పాల్గొన్నారు. -
మల్టీప్లెక్సుల్లో ఆగని దోపిడీ
-
ముఖ్యమంత్రి వియ్యంకుడి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి వియ్యంకుడు సుబ్రమణ్యం నివాసంలో మంగళవారం ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇప్పటివరకు చెన్నైలో జరిగిన ఐటీ సోదాల్లో కాంట్రాక్టర్ సెయ్యాదురై, ఆయన బంధువుల నివాసంలో 160 కోట్లు నగదు, 100 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సెయ్యాదురై ట్వీట్ ఒకటి సంచలం సృష్టిస్తోంది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెయ్యాదురై శుభాకాంక్షలు తెలపడం విశేషం. -
దుమ్మురేపిన టాప్-5 సినిమాలు ఇవే!
సాక్షి, సినిమా : పద్మావత్ సినిమాతో బాలీవుడ్లో ఈ ఏడాది శుభారంభం మొదలైంది. దీపావళికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాపడుతూ జనవరిలో విడుదలైంది. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. మొదటి వారాంతంలోనే 114 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది బాలీవుడ్లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నంటిలో పద్మావత్ సినిమానే వీకెండ్ కలెక్షన్స్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఆ తరువాతి స్థానంలో భాగీ-2 నిల్చింది. తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ నటించారు. ఈ యాక్షన్, సస్పెన్స్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో దాదాపు 70 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించిన ‘రెయిడ్’ 41కోట్ల రూపాయలతో మూడోస్థానంలో, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్మాన్’ 40 కోట్ల రూపాయలతో నాలుగోస్థానంలో, కరీనా కపూర్, సోనమ్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ 36 కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో ఉంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - రైడ్
-
ఓపెనింగ్ వసూళ్లలో చరిత్ర సృష్టించిన రెయిడ్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ తాజా సినిమా ‘రెయిడ్’ చరిత్ర సృష్టించింది. మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తూ.. మొదటి మూడు రోజుల్లోనే రూ.41 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 2018లో పద్మావత్ సినిమా తర్వాత అతి పెద్ద వీకెండ్ కలెక్షన్ల సినిమాగా చరిత్రకెక్కింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న ‘రెయిడ్’... ఈ ఏడాది వీకెండ్ కలెక్షన్ల పరంగా రెండో అతిపెద్ద హిట్‌గా నిలిచిందని ఫిలీం ట్రెడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది విడుదలయిన సినిమాల్లో రూ.114 కోట్ల వీకెండ్ కలెక్షన్లతో పద్మావత్ మొదటి స్థానంలో ఉండగా, రూ. 41.01 కోట్లతో రెయిడ్ రెండో స్థానంలో ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. మొదటిరోజు కాస్త తడబడి రూ. 10.04 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిన ఈ సినిమా రెండోరోజు శనివారం రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. ఆదివారం ఒక్క రోజే రూ.17.11 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మూడు రోజుల్లో కలిపి రూ. 41.01కోట్లను రాబట్టింది. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌కు జోడీగా ఇలియానా నటించారు.1980ల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద ఆదాయ పన్ను దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న రెయిడ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ తాజా సినిమా ‘రెయిడ్’.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. అంచనాలనుమించి వసూళ్లు రాబడుతోంది. మొదటిరోజే రూ. 10.04 కోట్ల భారీ ఓపెనింగ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు శనివారం.. రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. రెండు రోజుల్లో రెయిడ్ సినిమా రూ. 23.90 కోట్లు వసూలుచేసిందని ట్రెడ్ అనాలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా 38.04శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 1981లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఐటీ దాడుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ సరసన ఇలియానా నటించింది. డిప్యూటీ కమీషనర్ అమై పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగణ్ చూపిన నటన విమర్శకుల ప్రసంశలు అందుకుంటుంది. -
రావాలని ఉంది...
రావాలని ఉంది అంటున్నారు ఇలియానా. తెలుగు సినిమా ‘దేవదాసు’తో కథానాయిక అయ్యి, దాదాపు ఆరేళ్లు ఇక్కడ హవా సాగించారీ బ్యూటీ. సడెన్‌గా హిందీకి వెళ్లిపోయి, మళ్లీ వెనక్కి రాలేదు. నాలుగేళ్లుగా హిందీలో ఏడాదికో సినిమా చేస్తూ వస్తున్నారు. ఆమె నటించిన ‘రైడ్’ శుక్రవారం విడుదలైంది. వాట్ నెక్ట్ప్? మళ్లీ హిందీ సినిమాయేనా? తెలుగులో చేసే ఉద్దేశం ఉందా? అనే ప్రశ్న ఇలియానా ముందుంచితే – ‘తెలుగుకి రావాలని ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. తెలుగులో నేను పెద్ద పెద్ద స్టార్స్ పక్కన పెద్ద సినిమాలు చేశాను. పెద్ద డైరెక్టర్స్‌తో సినిమాలు చేశా. మళ్లీ తెలుగులో చేస్తే అలాంటి బిగ్ ప్రాజెక్ట్సే చేయాలి. త్వరలో అలాంటి అవకాశం వస్తుందనుకుంటున్నా’ అన్నారు. ఇంతకీ సౌత్ ఇండస్ట్రీ మీకేం నేర్పించింది అంటే – ‘నన్ను మంచి నటిని చేసింది. స్ట్రాంగ్ ఉమన్‌ని చేసింది. నటిగా ఎదుగుతూనే వ్యక్తిగా కూడా ఎదిగాను. నా ఆలోచనా పరిధిని పెంచింది. జీవితం అంటే ఏంటో నేర్పించింది. ఇక్కడ వచ్చిన పాపులార్టీ వల్లే హిందీ నుంచి పిలుపొచ్చింది. ఇంత చేసిన సౌత్ ఇండస్ట్రీకి దూరమవ్వాలని నేను అనుకోవడంలేదు. మళ్లీ సౌత్‌కి రావాలనుంది’ అని పేర్కొన్నారు ఇలియానా. మరి.. ‘రామ్మా’ అని ఇక్కణ్ణుంచి ఇలియానాను ఏదైనా అవకాశం పిలుస్తుందా? వేచి చూడాలి. సినిమాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా లవ్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకున్నారని వార్త వస్తున్నా ఇలియానా మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. -
ఇలియానాకు పెళ్లయ్యిందా?
సౌత్ లో స్టార్ ఇమేజ్ ను వదులుకొని బాలీవుడ్ బాట పట్టిన బ్యూటీ ఇలియానా. అడపాదడపా బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ భామకు ప్రస్తుతం దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా లేదు. ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ సంచలన ప్రకటన చేసి మరోసారి సౌత్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ పర్సనల్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. గత డిసెంబర్లో తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక ఫొటో, కొన్ని వ్యాఖ్యలను ట్వీట్ చేసింది ఇలియానా. అందులో ‘ఇది చాలా సంతోషకరమైన తరుణం. క్రిస్మస్ ఆనందం, సెలవులు, ఇల్లు, కుటుంబం, ప్రేమ’ అంటూ పోస్ట్ చేసింది. ఆ ఫొటోపై భర్త ఆండ్రూ నీబోర్ అని పేర్కొంది. దీంతో ఇలియానా పెళ్లి చేసుకుందనే ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇలియానా నటించిన రైడ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న ఈ బ్యూటీని పెళ్లి విషయం గురించి మీడియా ప్రతినిథి ప్రశ్నించగా ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడడం నాకిష్టం లేదు’ అంటూ సమాధానం దాటవేసింది. ఇంతకీ ఇలియానాకు పెళ్లి అయినట్టా? లేనట్టా?ఈ ప్రశ్నకు ఆమె నుంచి సూటిగా బదులు ఆశించడం ఇంకా సబబు కాదనుకుంటా! -
నేను మిస్ఫిట్!
ఇలియనా.. ఈ బ్యూటీ టాలీవుడ్లో కనిపించి చాలాకాలం అయింది. ఆమె నటించిన లాస్ట్ సినిమా పూరీ జగన్నా«థ్ డైరెక్షన్లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’. ‘బర్ఫీ’తో బాలీవుడ్‌కి వెళ్లి, అక్కడ కూడా పెద్దగా సినిమాలు చేయడంలేదు. ఏడాదికి ఒక సినిమా చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఇటు తెలుగుకి దూరమై అటు హిందీ సినిమాలు చేస్తున్నారు కాబట్టి బాలీవుడ్ బాగా నచ్చిందన్నది కొందరి ఊహ. ‘‘నచ్చింది కానీ నేను బాలీవుడ్‌కు ‘మిస్ ఫిట్’’ అని ఓ సందర్భంలో ఇలియానా పేర్కొన్నారు. ఎందుకలా అన్నారనే సీక్రెట్‌ని ఆమె బయట పెట్టలేదు. నంబర్ గేమ్స్ గురించి మాట్లాడుతూ – ‘‘నాకీ నంబర్ గేమ్స్ అంటే చిరాకు. ఈ రేసులో నేనెప్పుడూ పరిగెత్తలేదు. నంబర్ వన్ కావాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలియదు. అయినా ‘నంబర్ వన్’ అని ఎలా డిసైడ్ చేస్తారు?. ఒక్కో సినిమాకి నేను గ్యాప్ తీసుకుంటున్నాను. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాను. అవి సక్సెస్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అన్నారు ఇలియానా. ప్రస్తుతం అజయ్ దేవగన్ ‘రెయిడ్’ సినిమాలో నటిసున్నారామె. -
ఐటీలో అవినీతి తిమిగలం
న్యూఢిల్లీ: సీబీఐ అధికారుల దాడిలో ఆదాయ పన్ను శాఖలో అవినీతి తిమిగలం చిక్కింది. కోల్‌కతాలోని ఆయన గృహంపై దాడి చేసిన సీబీఐ అధికారులు.. నాలుగు కేజీల బంగారం, రూ.3.5 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ మేరకు సీబీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తపస్ కుమార్ దత్తా కొన్నాళ్లుగా కోల్‌కతాలో ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్‌కతా, జార్ఖండ్‌లలోని 23 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు రూ.3.5 కోట్ల నగదు, నాలుగు కేజీలకు పైగా బంగారం పట్టుబడింది. దత్తాతో పాటు మరో ముగ్గురు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఓ వ్యాపారవేత్తతో కలిసి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని సీబీఐ వెల్లడించింది. -
మాజీ సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు
- బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు - తనిఖీల్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూకుంభ కోణం లో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన మేడ్చల్ మాజీ సబ్ రిజిస్ట్రార్ తుమ్మలపల్లి వెంకట రమేశ్ చంద్రారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. రమేశ్ చంద్రారెడ్డి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉదయం 12 బృందా లుగా విడిపోయిన ఏసీబీ అధికారులు.. సిటీ రేంజ్ డీఎస్పీ సునీతారెడ్డి, అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నాగోలు కో–ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో రమేశ్ చంద్రారెడ్డి ఉంటున్న శ్రీజా అపార్ట్మెంట్లో సోదాలు చేశారు. రమేశ్ చంద్రారెడ్డి తండ్రి జనార్దన్‌రెడ్డి, భార్య సునీ తలను కూడా విచారించారు. కోకాపేట రెవెన్యూ పరిధిలోని రాజపుష్ప అపార్ట్మెంట్లో ఉంటున్న రమేశ్ చంద్రారెడ్డి మరదలు అనిత నివాసంలోనూ సోదాలు చేశారు. రూ.10 కోట్ల ఆస్తుల గుర్తింపు.. ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో రమేశ్ చంద్రా రెడ్డికి చెందిన రూ.10 కోట్ల విలువైన స్థిరచరాస్తులు గుర్తించారు. కొత్తపేటలో రూ.6.6 లక్షలు, నాగో ల్లో రూ.60 లక్షల విలువైన ఫ్లాట్లు, భువ నగిరి సమీపంలోని రాయ్‌గిరిలో రూ.24.25 లక్షల విలువైన రెండెకరాల భూమి, కేశారంలో రూ.14.5 లక్షల విలువైన 2 ఎకరాల 36 గుంటల భూమి, రూ.15.5 లక్షల విలువైన 5 ఎకరాల 4 గుంటల మరో భూమి, కర్మన్‌ఘాట్‌లో రూ.46 లక్షల విలువైన ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చంద్రారెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లు, ఇంట్లో రూ.65 లక్షల విలువైన మూడున్నర కేజీల బంగారం గుర్తించారు. వీటికితోడు రూ.1.07 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్, రూ.30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.3.5 లక్షల విలువైన గృహోప కరణాలు, రూ.1.2 లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రైటర్ నివాసంలోనూ తనిఖీలు ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. చంపాపేట సమీపంలోని వైశా లినగర్లో నివసిస్తున్న డి.నర్సింహారావు నివాసం లోనూ గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రమేశ్ చంద్రారెడ్డి బినామీగా భావిస్తున్న ఉప్పల్‌కు చెందిన డాక్యుమెంట్ రైటర్ మేకల వెంక ట్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేసి.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
పొలిటీషియన్ హోటల్లో ఆరు జంటల అరెస్టు
ఘజియాబాద్: బీఎస్పీ నాయకుడికి చెందిన హోటల్లో అభ్యంతరకర పొజిషన్లలో ఉన్న ఆరు యువ జంటలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువ జంటలకు గంటల చొప్పున గడపడానికి రూంలను హోటల్ రాయల్‌ప్యాలెస్ ఇస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. దీంతో మహిళా పోలీసులు, యాంటీ రోమియో స్క్వాడ్లు సంయుక్తంగా హోటల్‌పై రైడింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. రైడింగ్‌లో ఆరు యువ జంటలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. హోటల్ బీఎస్పీ లీడర్ కమల్ జాదవ్‌కు చెందినదిగా వివరించారు. జంటలను విచారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వెల్లడించారు. -
ఏసీబీ వలలో అవినీతి చీడ
-
అవినీతి చీడ
తాడేపల్లిగూడెం : గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.1.85 లక్షలు లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ గునుపూడి రాజు శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన వ్యవహారం కలకలం రేపింది. రిజిస్ట్రేషన్ల ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న అవినీతి వ్యవహారాన్ని ఈ ఘటన మరోసారి బట్టబయలు చేసింది. పట్టణ శివారు తాళ్లముదునూరుపాడుకు చెందిన వెలగల పట్టాభి రామిరెడ్డికి అతని వదిన 2013లో ఇచ్చిన గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రాజు రూ.1.85 లక్షలు డిమాండ్ చేయగా, పట్టాభిరావిురెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ రాజుకు ఆ మొత్తం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రిజిస్ట్రార్ నుంచి రూ.1.85 లక్షలు, బడే సాహెబ్ అనే కమీషన్ ఏజెంట్ నుంచి నుంచి రూ.90 వేలు కలిపి రూ.2.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వేణుగోపాలరెడ్డి వెల్లడించారు. అవినీతికి చిరునామాగా.. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాల యం అవినీతికి చిరునామాగా మారింది. పైరవీలు చేసినా ప్రోత్సహిం చేవారు, దోపిడీలో భాగస్వాములయ్యే వారికి ఇక్కడ కొదవ లేదు. తేడాలొస్తే సామాజిక వర్గం కార్డును ప్రయోగిస్తుంటారు. బినామీ రిజిస్ట్రేషన్లకు ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారింది. చివరకు చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను దస్తావేజులపై వేయించి రిజిస్ట్రేషన్లు చేయించే స్థాయికి ఇక్కడ అవినీతి ఎదిగిపోయింది. ఏసీబీ అయితే మాకేంటి, తేడాలొస్తే ఎవరిపైనైనా మేమే ఏసీబీ దాడి చేయించగలమంటూS ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు అవినీతి దందా నడిపిన ఘటనలు ఉన్నాయి. పై అధికారులకు సంతృప్తికర సేవలు అందించటం, వారి ఆశీస్సులతో అవినీతి వ్యవహారాలను చక్కబెట్టడం ఇక్కడ పనిచేసే వారి ప్రత్యేకత అనే అపప్రద ఉంది. అందువల్ల అవినీతి వ్యవహారాలు వెలుగుచూసినా, తదనంతర ఫలితాలు ఇక్కడ వారికి అనుకూలంగా ఉంటాయనే ప్రచారం ఉంది. మూడేళ్లలో రెండు దాడులు 2014 సెప్టెంబర్ 29న రాత్రి ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వ్యక్తిని, ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ సెలవు పెట్టిమరీ కార్యాలయంలో ఉన్న అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. భీమడోలు ప్రాంతంలోని 30 ఎకరాల భూముల రిజిస్ట్రేష¯ŒSకు సంబంధించి పెద్ద మొత్తంలో చేతులు సొమ్ములు మారాయని ఏసీబీకి అందిన పక్కా సమాచారం మేరకు ఆ రోజు ఏసీబీ అధికారులు దాడి చేశారు. రికార్డుల్లో నమోదు చేయని రూ.52 వేలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇక్కడకు వచ్చిన సబ్‌రిజిస్ట్రార్ గునుపూడి రాజు పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒక పొలం వ్యవహారానికి సంబంధించి తాడేపల్లిగూడెం మండలానికి చెందిన వ్యక్తి సబ్‌రిజిస్ట్రార్ అవినీతి వ్యవహారంపై న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో ఇక్కడ కార్యాలయంపై ఏసీబీ దాడి తప్పదనే ప్రచారం జరిగినా ఆ తర్వాత కార్యకలాపాలు సజావుగా సాగుతున్నట్టు అనిపించింది. శుక్రవారం గునుపూడి రాజు రూ.1.85 లక్షలను లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఇదే కార్యాలయంలో దళారిగా వ్యవహరిస్తున్న బడే సాహెబ్ అనే వ్యక్తి నుంచి రూ.90 వేలు స్వాధీనం చేసుకున్నారు. అతడే చీడ రెండక్షరాల పేరు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులపై ఆజమాయిషీ. అతడు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నతాధికారి అనుకునేరు. అతనికి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అధికారికం గా ఎలాంటి సంబంధం లేదు. రికార్డు రూమ్ పర్యవేక్షణ నుంచి అవినీతి దందాల వరకు అతడే సేనాధిపతిగా వ్యవహరిస్తుంటాడు. ఎప్పుడు ఏసీబీ దాడి జరిగినా ఆ వ్యక్తి మాత్రం లాఘవంగా తప్పించుకుంటాడు. ఇందులో కిటుకేమిటో ఎవరికీ తెలియదు. శుక్రవారం కూడా అదే జరిగింది. ఆడిట్ అధికారులు వచ్చిన రెండు రోజుల్లోనే.. రెండు రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీలలో ఏం గుర్తించారనే విషయాలు తెలియలేదు గానీ.. రెండు రోజుల తర్వాత ఏసీబీ దాడి జరిగింది. 15 రోజుల పక్కా స్కెచ్‌తో సబ్ రిజిస్ట్రార్ బుక్ అయినట్టు ప్రచారం ఉంది. -
మాటు వేసి మెరుపు దాడి
ఏలూరు అర్బన్ : ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ అధికారి ఇళ్లపై దాడులు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో సబ్‌ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన గెడ్డం విజయ గణేష్‌బాబు ఇంటితో పాటు ఏకకాలంలో ఐదు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో సబ్ ట్రెజరీ అధికారిగా పనిచేస్తూ ఏలూరు అమీనాపేటలో నివాసం ఉంటున్న గెడ్డం విజయ గణేష్‌బాబు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని నెలరోజుల కిందట ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దాంతో కొంతకాలంగా మాటు వేసిన అధికారులు గణేష్ బాబు ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించే పని ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడికి నగరంలోని అమీనాపేటలో నివాసం ఉంటున్న చిన్న ఇంటితో పాటు శనివారపుపేటలో మూడంతస్తుల భవంతి, తంగెళ్లమూడిలో నిర్మాణంలో ఉన్న మరో మూడు అంతస్తుల భవనం, శనివారపుపేటలో ఇంకో భవంతి కలిగి ఉన్నారని నిర్ధారించుకున్నారు. దీంతో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ, యూజే విల్సన్‌లు సిబ్బందితో కలిసి శనివారం విజయగణేష్ నివాసం ఉంటున్న ఇంటితో పాటు శ్రీరామ్‌నగర్‌లో నిందితునికి చెందిన మూడంతస్తుల భవనం, జంగారెడ్డిగూడెంలో ఎస్టీవోగా పనిచేస్తూ టూటౌన్, సుబ్బమ్మాదేవి హైస్కూల్ వద్ద నివాసం ఉంటున్న నిందితుని స్నేహితుడు బసవరాజు ఇంటిపై, తాడేపల్లిగూడెంలో నిందితుని అత్త వారింటిపై ఏకకాలంలో దాడులు చేశారు. రూ.10 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు ఐదు చోట్ల జరిపిన దాడుల్లో అధికారులు రూ.10 కోట్లు విలువ చేసే పలు స్థిరాస్తులు, కీలక డాక్యుమెంట్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులతో పాటు విలువైన పలు విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ నిందితుడిపై చాలాకాలంగా నిఘా పెట్టి అతని ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించిన అనంతరం పక్కా ప్రణాళికతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో స్థిరాస్థులతో పాటు నిందితుని ఇంటిలో, గన్నవరంలోని ఆయన కార్యాలయంలో పలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వా«ధీనం చేసుకున్నామన్నారు. అదే క్రమంలో ఖాళీ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ పత్రాలను నిందితుడు వడ్డీ వ్యాపారం చేస్తూ రుణదాతల నుంచి హామీగా స్టాంపు పేపర్లు, ఖాళీ బ్యాంక్ చెక్‌లు తీసుకుని ఉంటారని భావిస్తున్నామన్నారు. వీటి ఆధారంగా నిందితుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఏలూరులో నిందితుని పంజాబ్ నేషనల్ బ్యాంకు లాకర్లో దాచిన కేజీ వెండి వస్తువులు, సుమారు 400 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. -
చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి
జీలుగుమిల్లి : రాష్ట్ర సరిహద్దు తాటియాకులగూడెంలోని రవాణా శాఖ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సమయంలో చెక్ పోస్టులో ఇద్దరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, సిబ్బంది ఉన్నారు. ఓ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్రాంతిలో ఉండగా.. మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. చెక్ పోస్టు సిబ్బంది బయటకు వెళ్లకుండా చుట్టూ ఏసీబీ సిబ్బంది కాపాలాకాశారు. చెక్ పోస్టు సిబ్బంది వద్ద ఉన్న నగదు, క్యాష్ కౌంటర్లోని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కౌంటర్ కంప్యూటర్లోని పనున్న చెల్లింపు వివరాలు ప్రింట్ అవుట్లు తీసుకున్నారు. లెక్కల్లో లేని రూ.4,500ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ వి.జె.విల్సన్ తదితరులు ఉన్నారు. తరచూ ఆరోపణలు : 2014లో ప్రారం భించిన ఈ రవాణా శాఖ చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు జరగడం ఇది మూడోసారి. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి
- రూ.22,170 నగదు స్వాధీనం - వరుస దాడులు చేస్తున్నా మారని సిబ్బంది తీరు పొందుగల (దాచేపల్లి) : మండలంలోని పొందుగల గ్రామ సమీపంలోని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. చెక్‌పోస్ట్‌లో అనధికారికంగా ఉన్న రూ.22,170 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ చంద్రవంశ దేవనాంద్ శాంతో, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ - ఆంధ్ర మధ్య రాకపోకలు సాగిస్తున్న లారీల నుంచి చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు లంచాలు వసూలు చేస్తున్నారని ఏసీబీ దృష్టికి వచ్చింది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ దందా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన ఏసీబీ అధికారులు చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏసీటీవోలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ప్రశ్నించారు. కొన్ని గంటల పాటు చెక్‌పోస్ట్‌లో ఉండి లారీ డ్రైవర్ల నుంచి నగదును తీసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ చెక్‌పోస్ట్ వద్ద ఆగి ముద్ర వేయించుకున్నందుకు లారీ డ్రైవర్ల నుంచి రూ.100 చొప్పున లంచాలు వసూలు చేస్తున్నారని, దీనిపై విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అక్రమంగా లంచాలు తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు లంచాల కోసం డిమాండ్ చేస్తే 94913 05638 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. వరుస దాడులు చేస్తున్నా... పొందుగల చెక్‌పోస్ట్‌లో అక్రమ వసూళ్లు తారస్థాయికి చేరటంతో ఏసీబీ దృష్టికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రత్యేక దృష్టిసారించిన ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. అయినా వసూళ్లు ఆగకపోవడం గమనార్హం. ఈ చెక్‌పోస్ట్ మీదుగా గ్రానైట్, సిమెంట్, ఇనుము, స్టీల్, మిర్చి, ఫర్నిచర్, శనగలతో పాటు పలు రకాల వస్తువులను లారీల ద్వారా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తుంటారు. రాష్ట్రం దాటి వచ్చేటప్పుడు తప్పనిసరిగా చెక్‌పోస్ట్‌లో ఆగి ముద్ర వేయించుకోవాలి. ఈ క్రమంలో లారీ డ్రైవర్ల నుంచి విధులు నిర్వహించే అధికారులు ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తున్నారు. గతంలో చేసిన దాడుల వివరాలివీ... - 2015 నవంబర్ 27న దాడిచేసి అనధికారికంగా ఉన్న రూ.68 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కేవలం రూ.7200 అని గుర్తించి విస్తుపోయారు. - 2016 జనవరిలో చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే సీనియర్ అసిస్టెంట్ మందడపు మల్లిఖార్జునరావు, జూనియర్ అసిస్టెంట్ పగడాల శ్రీనివాసరావు గుంటూరులో ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. - 2016 మార్చి 15న చెక్‌పోస్ట్‌పై మరోసారి దాడిచేసి అక్రమంగా ఉంచిన రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఆ బ్యాంకులో భారీగా బ్లాక్‌మనీ డిపాజిట్!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో జరుగుతున్న డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఢిల్లీలోని జైన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులోని లావాదేవీలపై ఆ రాష్ట్ర ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఐదు రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున నల్లధనం డిపాజిట్ అయిందని అధికారులు గుర్తించారు. జైన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో 120 కోట్లకు పైగా డబ్బు నోట్ల రద్దు నేపథ్యంలో డిపాజిట్ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దీనిలో చాలా వరకు నల్లధనంగా అనుమానాలున్నాయని వారు తెలిపారు. దీంతో ఇక్కడి భారీ ఎత్తున డిపాజిట్ చేసిన వారిపై విచారణ కొనసాగుతుందని.. ఇందులో భాగంగానే ఐదోరోజు సైతం సోదాలు నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. నల్లధనాన్ని మార్చడంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
వీఆర్‌లో ఉన్న ఎస్సైపై విచారణ
ఏలూరు (సెంట్రల్): ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఎస్సై సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి కేసు నమోదు చేయకపోవడంపై జిల్లా ఎస్సీ విచారణకు ఆదేశించారు. విధుల్లో అలసత్వంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల జరిగిన సమీక్షలో పెదపాడు ఎస్సైను ఎస్పీ భాస్కర్‌భూషణ్ వీఆర్‌లో పెట్టారు. నాలుగు రోజు క్రితం జిల్లా సరిహద్దులోని అప్పనవీడులోని ఓ ఇంట్లో కొందరు నేతలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆ ఇంటినే పేకాట స్థావరంగా మార్చేశారు. విషయం తెలుసుకున్న పెదపాడు ఎస్సై నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుతో కలిసి దాడి చేసినట్టు సమాచారం. అయితే పేకాటలో పట్టుబడిన వారిని పోలీస్‌స్టేçÙ¯ŒSలో అప్పగించకుం డా స్వాధీనం చేసుకున్న సుమారు రూ.2 లక్షల నగదు తీసుకుని వెళ్లినట్టు ఎస్పీకి తెలియడంతో ఎస్బీ అధికారులతో విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తెలితే పెదపాడు ఎస్సైను సస్పెండ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. -
చుక్కలు చూపించాడు..
• బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో చిల్లి గవ్వ కూడా దొరకలేదు • అప్పులకు సంబంధించిన పత్రాలు మాత్రం కుప్పలుతెప్పలు • రెండు రోజుల పాటు లక్ష్మణ్‌రావు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్: తన వద్ద రూ.10 వేల కోట్ల నల్లధనం ఉందంటూ ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్)లో ప్రకటించిన బాణాపురం లక్ష్మణ్‌రావు.. చివరికి ఆదాయ పన్ను శాఖ అధికారులకు చుక్కలు చూపించారు. లక్ష్మణ్‌రావు ఇంట్లో సోదాల సందర్భంగా చిల్లిగవ్వ దొరకకపోగా.. అప్పులకు సంబంధించిన పత్రాలు మాత్రం కుప్పలు తెప్పలుగా వెలుగు చూసినట్లు తెలిసింది. రెండు రోజులుగా జూబ్లీహిల్స్ సమీపంలోని ఫిలింనగర్ సైట్–2 రోడ్ నం.2లో ఉన్న లక్ష్మణ్‌రావు నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికారులు ఎన్నిమార్లు ప్రశ్నించినా తనకు నల్లడబ్బు ముంబై నుంచి రావాల్సి ఉందని చెప్పడమే తప్పితే.. డబ్బు ఎక్కడ ఉందన్న విషయం మాత్రం చెప్పలేదు. ఓ బాబాను గుడ్డిగా నమ్మి మోసపోయినట్లు చెప్పి అతను చేతులు దులుపుకోవడంతో.. ఐటీ అధికారులు షాక్ తిన్నారు. చిల్లిగవ్వ కూడా దొరకలేదు.. ఐడీఎస్‌లో వెల్లడించిన ఆదాయానికి తొలి విడత పన్నుగా రూ.1,125 కోట్లను గత నెల 30న చెల్లించాల్సి ఉంది. అధికారులు లక్ష్మణ్‌రావును ఈ నెల 1న పిలిపించి అడగగా పన్ను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో రాముపై ఒత్తిడి పెంచగా మూడు కంటైనర్లలో ముంబై నుంచి నగదు బయల్దేరిందని మాయ చేశాడు. గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో మంగళవారం ఐటీ అధికారులు లక్ష్మణ్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్లో చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో అవాక్కయ్యారు. లక్ష్మణ్ రావును ఎంత ప్రశ్నించినా ఇప్పటికీ డబ్బు వస్తుందని సమాధానం చెప్పాడని తెలిసింది. ఆ డబ్బు వస్తుందన్న ఆశతో కోట్లలో అప్పులు చేసినట్లు అప్పు పత్రాలు చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. తాను స్థాపించిన బోగస్ సంస్థల పత్రాలు పెట్టి బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల అప్పు తీసుకున్నట్లు కూడా వెల్లడైంది. లక్ష్మణ్‌రావు ఇంటి వద్ద హైడ్రామా.. కాగా, లక్ష్మణ్‌రావు ఇంట్లో బాలకార్మికులు పని చేస్తున్నారన్న సమాచారం మేరకు కార్మిక శాఖ అధికారులు, చైల్డ్‌లైన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గురువారం ఆయన నివాసానికి వచ్చారు. లోనికి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా లక్ష్మణ్‌రావు ఎంతకూ డోర్ తీయలేదు. దీంతో నాలుగు గంటల పాటు హైడ్రామా నడిచింది. లక్ష్మణ్‌రావు గేటు తీయకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉన్న పొలాలూ పాయే.. లక్ష్మణ్‌రావు ఫిలింనగర్లో కిరాయికి ఉంటూనే అదే ఇంటిని ఇటీవల కొనుగోలు చేశారు. రూ.5 కోట్లతో ప్లాట్ కొని రూ.10 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వీరంతా ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని డైరెక్టర్లుగా చెలామణి అవుతున్నారు. అయితే క్షుద్ర, గుప్త నిధుల కోసం పూజలు చేస్తూ రెండేళ్ల నుంచి అత్యాశతో డబ్బుల కోసం వెంపర్లాడే వాడని తేలింది. లక్ష్మణ్‌రావుకు ఏడాది క్రితం రైస్‌పుల్లింగ్ బాబా కూడా తగిలాడు. ఇంట్లోనే పూజలు నిర్వహించి రెండింతల డబ్బు అవుతుందంటే రూ. 30 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. సోదాల సందర్భంగా ఐటీ అధికారులకు రైస్‌పుల్లింగ్ కాయిన్ లభించిందని తెలిసింది. ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రి కనిపించినట్లు సమాచారం. ఓ బాబాను గుడ్డిగా నమ్మి ఈసీఐఎల్‌లో డీజీఎం స్థాయిలో పదవీ విరమణ చేసిన లక్ష్మణ్‌రావుకు మూడేళ్ల క్రితం రాము అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బార్కాస్‌లో ఓ బాబా తెలుసని అతని వద్ద అద్భుత యంత్రం ఉందని దానికి నగదును రెట్టింపు చేసే శక్తి ఉందని నమ్మించాడు. ఇందుకోసం లక్ష్మణ్‌రావు తన ఆస్తులు అమ్ముకుని సుమారు రూ.60 లక్షలు ఖర్చు పెట్టాడు. బాబా ఎవరో చూడకుండా రాము ద్వారా లక్షలు కుమ్మరించి డబ్బు యంత్రాన్ని కొన్నాడు. ముంబైలో విక్రయిస్తే దానికి రూ.10 వేల కోట్లు వస్తాయని రాము లక్ష్మణ్‌రావుకు ఆశ పెట్టాడు. ఈలోగా కేంద్రం ఐడీఎస్ను ప్రకటించింది. ముంబై నుంచి వచ్చే డబ్బును చట్టబద్ధం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో తన వద్ద రూ.10 వేల కోట్ల నల్లధనం ఉందని లక్ష్మణ్‌రావు స్వచ్ఛందంగా వెల్లడించారు. -
దేవరపల్లిలో 40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
దేవరపల్లి : కామవరపుకోట మండలం జలపావారిగూడెం నుంచి దేవరపల్లి రైస్ మిల్లుకు రవాణా అవుతున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకుని పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించారు. ఉదయం 8 గంటలకు ట్రక్ ఆటోలో బియ్యం రవాణా అవుతున్నట్టు తెలుసుకున్న దేవరపల్లి ఎస్ఐ సి.హెచ్. ఆంజనేయులు ఆ ఆటోను అడ్డుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భీమవరం ఏజీపీవో శేషగిరి, జీపీఐ ప్రసాద్, దేవరపల్లి సీఎస్ డీటీ ఎస్.పోతురాజు ఆటోలోని బియ్యం బస్తాలను పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించారు. బియ్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేష¯ŒSకు తరలించారు. ఈ బియ్యాన్ని దేవరపల్లిలోని వరలక్ష్మి రైస్ మిల్లు యజమాని జలపావారిగూడెంలో కొని ఇక్కడికి తీసుకువస్తున్నట్టు గుర్తించారు. ఆ తరువాత వరలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ధాన్యం ఆడి బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉండగా, మిల్లు యజమాని ధాన్యం ఆడకుండా రేష¯ŒS బియ్యాన్ని కొని రీ సైక్లింగ్ చేస్తున్నట్టు కనుగొన్నారు. మిల్లు రికార్డుల నిర్వహణలో తేడాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రైస్‌మిల్లుపై 6 ఏ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
భీమడోలులో విజిలెన్స్ దాడులు
భీమడోలు : భీమడోలులోని ఓ జనరల్ స్టోర్స్‌లో ని బంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన బియ్యం, నిత్యావసర సరుకులు 93.50 క్వింటాళ్ల నిల్వలు ఉండటాన్ని గుర్తించిన వి జిలెన్స్ అధికారులు శని వారం కేసు నమోదు చేశా రు. విజిలెన్స్ తహసీల్దార్ శైలజ ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వరరావు భీమడోలు గణపతి సెంటర్లోని జనరల్ స్టోర్స్, గోడౌన్‌ను తనిఖీలు చేశారు. స్టోర్స్ యాజమాని ముత్తా వెంకటేశ్వరరావు ఎటువంటి లైసెన్సు లేకుండా అక్రమంగా సరుకులను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. రూ.2,02,500 విలువ గల సరుకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 72 క్వింటాళ్ల బియ్యం, 20 క్వింటాళ్ల పంచదార, 50 కిలోల మినపప్పు, 50 కిలోల కందిపప్పు, 50 కిలోల పచ్చిశనగపప్పును సీజ్ చేశారు. సరుకులను భీమడోలు సీఎస్‌డీటీ జయశ్రీకి అప్పగించారు. జీడిపప్పు పరిశ్రమపై దాడి దేవరపల్లి: దేవరపల్లిలో జీడిపప్పు పరిశ్రమపై శనివారం సాయంత్రం విజిలెన్స్ అండ్ ఎన్పోర్సుమెంట్ అధికారులు దాడులు చేశారు. దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని సుతాపల్లి నాగరాజుకు చెందిన వీరవెంకట లక్ష్మీకాంతం ట్రేడర్స్ జీడిపప్పు ఫ్యాక్టరీలో అనుమతులు లేకుండా పప్పు ల మిల్లు పెట్టి మినపప్పు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పప్పుల మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 13 బస్తాల మినపప్పు, 27 బస్తాల మినుములను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.26 లక్షలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలి పారు. కేసు నమోదు చేసి సరుకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
204 కంపెనీలపై పోలీసుల దాడులు
అంకారా: దేశంలో సైనిక తిరుగుబాటుకు సహకరించిన వారిపై టర్కీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జులై 15న సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఆ తిరుగుబాటుదారులకు సహాయం అందించిన వారిని గుర్తించి ప్రభుత్వం కఠినశిక్షలు విధిస్తోంది. తాజాగా టర్కీలోని 18 నగరాల్లో ఉన్న 204 కంపెనీలపై గురువారం పోలీసులు దాడులు జరిపారు. ఈ కంపెనీలు తిరుగుబాటుదారులకు ఆర్థిక సహాయం అందించాయన్న కారణంతో వాటిపై దాడులు నిర్వహించినట్లు వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ కంపెనీలకు సంబంధించిన 187 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రఖ్యాతిగాంచిన కంపెనీల ప్రతినిధులు సైతం పలువురు ఉన్నట్లు సమాచారం. తిరుగుబాటుకు ప్రయత్నించిన నాటి నుంచి ఇప్పటివరకు 40 వేల మందికి పైగా ప్రజలను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. తిరుగుబాటు సందర్భంగా 237 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుగుబాటుదారులపై ప్రభుత్వ చర్యలు మానవహక్కులను కాలరాసేలా ఉన్నాయని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా నగర్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్: ఓ ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వ్యక్తులను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నడుపుతున్న మహిళతో పాటు మరో నలుగురు యువతులను, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీ పేస్ 2లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్వాహకురాలు జానిరాణి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మారుతి కార్యాలయంపై దాడులు
టోక్యో: మైలేజ్ పరీక్ష కుంభకోణంలో మారుతి సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామంటూ మారుతి తప్పు ఒప్పుకున్న నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. వ్యక్తిగత భాగాల్లో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామన్న సుజుకి వాదనల నిర్ధారణ కోసం ఈ దాడులు నిర్వహించినట్టు రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అక్రమ ఇంధన మైలేజీ ఆరోపణలపై విచారణలో భాగంగా మినీ కార్ మేకర్ సుజుకి ఆఫీసుపై దాడి చేసినట్టు చెప్పారు. కాగా మైలేజీ గణంకాలు తప్పుగా పేర్కొన్నామని, తాము కూడా తప్పు చేశామంటూ బహిరంగంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ పై రవాణా మంత్రిత్వశాఖ దాడి తర్వాత ఇది రెండవది. అక్రమ మైలేజీ గణంకాలతో 4 బ్రాండెడ్ మోడల్స్, 12 ఇతర బ్రాండ్లను సుజుకి విక్రయాలు జరిపింది -
బీఎస్ఆర్ నివాసంలో ఐటీ సోదాలు
కాకినాడ : బీఎస్ఆర్ సంస్థల అధినేత బలుసు శ్రీనివాసరావు నివాసంలో బుధవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిదలోని బీఎస్ఆర్ స్వగృహంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ఆరుగురు ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. బీఎస్ఆర్ సంస్థల పేరిట కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల టర్నోవరుతో కాంట్రాక్టు పనులు, పలు వ్యాపారాలను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. టీడీపీలో బీఎస్ఆర్ క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. ఇటీవల రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయలు విలువైన సుమారు 12.5 ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇదే జిల్లాలోని ఆలమూరు మండలం మోదుకూరులోని శ్రీనివాసరావు మామగారైన గుణ్ణం వీర్రాజు నివాసంలోనూ మరో ఐటీ బృందం తనఖీలు నిర్వహిస్తోంది. -
స్వీట్ షాపుల్లో తనిఖీలు
తెనాలి (గుంటూరు) : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని స్వీట్ షాపుల్లో ఆహార నియంత్రణ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. రీజినల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచందర్రావు నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం సోదాలు చేపట్టింది. పలు దుకాణాల్లో మిఠాయిల శాంపిల్స్ సేకరించింది. దుకాణాల్లో నాణ్యమైన పదార్థాలతో తయారుచేసిన వంటకాలను విక్రయిస్తున్నారా లేక కాలం చెల్లిన పదార్థాలతో తయారుచేసినవి విక్రయానికి ఉంచుతున్నారా అనేవి పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. -
నెయ్యి దుకాణాలపై దాడులు
తెనాలి రూరల్ (గుంటూరు) : గుంటూరు జిల్లా తెనాలి ఉప్పుబజారులోని నెయ్యి దుకాణాలపై అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నాలుగు నెయ్యి దుకాణాల్లో శాంపిళ్లు తీయగా, రెండు దుకాణాల్లో 15 కిలోల చొప్పున, ఒక దుకాణంలో 10 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపుతామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
కృత్రిమ ఇసుక తయారీ స్థావరాలపై దాడులు
శామీర్‌పేట్ (రంగారెడ్డి) : శామీర్‌పేట్ మండలంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా కృత్రిమ ఇసుక తయారుచేస్తున్నారన్న పక్కా సమాచారంతో సోమవారం కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పలు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. శామీర్‌పేట్ సీఐ సత్తయ్య మాట్లాడుతూ...మండలంలోని శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో కృత్రిమ ఇసుక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల్లో కృత్రిమ ఇసుక తయారుచేస్తున్న స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు వినియోగిస్తున్న పరికరాలను, నాలుగు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసినట్లు తెలిపారు. కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నవారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
వంటనూనె వ్యాపారులపై 25 కేసులు
రంగారెడ్డి : తూనికలు,కొలతల శాఖ అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వంట నూనె ట్రేడర్స్ పై రెండురోజుల పాటు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 25 కేసులు నమోదు చేయడమే కాకుండా సుమారు రూ.15.27 లక్షల విలువగల నూనెను సీజ్ చేశారు. వంట నూనెలో కల్తీ జరుగుతున్నట్లు ప్రచారం గుప్పుమనడంతో రాష్ట్ర తూనికల, కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లోని వంట నూనె ట్రేడర్స్ పై గురు, శుక్ర వారాల్లో ఆకస్మికంగా దాడులు జరిపారు. నూనె ప్యాకింగ్‌లో తక్కువ తూకం, ప్యాకింగ్‌పై స్టిక్కర్, ఉత్పత్తి సంస్థ, తేదీ తదితర వివరాలు లేకపోవడం వంటి లోపాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో 10, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదు చేశారు. -
కర్నూలులో ఏసీబీ వలకు అవినీతి చేప
-
హైదరాబాద్ కాటేదాన్‌లో SOT పోలీసుల దాడి
-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఆకస్మిక సోదాలకు దిగారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలతో కూడిన బృందం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు. దస్తావేజులు రాసేవారితో లంచాలు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు దాడులకు దిగినట్టు సమాచారం. -
ఆయిల్ మిల్లులో తనిఖీలు
వేములవాడ రూరల్ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలోని ఓ ఆయిల్ మిల్లులో మార్కెట్ కమిటీ కార్యదర్శి పృథ్వీరాజ్ సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఆయిల్ మిల్లు అనుమతి లేకుండా నడస్తుండడంతో తక్షణమే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కిరాణా దుకాణాలపై ఎస్వోటీ దాడులు
ఉప్పల్ (హైదరాబాద్) : నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న కిరాణా దుకాణాలపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శ్రీ సుమధుర అనే కిరాణ దుకాణం లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 240 లీటర్ల కిరోసిన్, 50 కిలోల కందిపప్పు, 110 కిలోల గోదుమలను గుర్తించారు. దీంతో ఆ దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు. -
తూనికలు కొలతల అధికారుల తనిఖీలు
సత్తెనపల్లి (గుంటూరు) : గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్లో తూనికలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తూనికలు కొలతలు శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి నేతృత్వంలోని బృందం గొడౌన్లో తనిఖీలు నిర్వహిస్తోంది.