భూ పంపిణీలో అవకతవకలపై అనంతపురం జిల్లా తలుపుల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.
తలుపుల (అనంతపురం) : భూ పంపిణీలో అవకతవకలపై అనంతపురం జిల్లా తలుపుల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. తలుపుల మండలం కుర్లి గ్రామంలో 2008-09 సంవత్సరంలో ప్రభుత్వం కొందరికి భూ పంపిణీ చేసింది.
అయితే భూమి అనర్హులకు పంచిపెట్టారంటూ నెల క్రితం కొందరు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన ఏసీబీ హిందూపురం డీఎస్పీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు తలుపుల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత దస్త్రాలను పరిశీలిస్తున్నారు.