ఏకకాలంలో 9చోట్ల తనిఖీలు
తిరుపతిలో అక్రమాస్తుల చిట్టా విప్పిన ఏసీబీ అధికారులు
రేణిగుంట తహసీల్దార్‌గా పనిచేసిన కాలంలో అక్రమాలు
కడప ఇంట్లో రూ. 36 లక్షలు స్వాదీనం
అవి ఎన్నికల కోసం ప్రభుత్వం విడుదల చేసిందని చెబుతున్న తహసీల్దార్
సాక్షి, తిరుపతి/కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప మండల తహసీల్దార్ సిద్దల శివప్రసాద్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో 9చోట్ల సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు తిరుపతి, పీలేరు, రేణిగుంట, కడపతో పాటు మొత్తం తొమ్మిది చోట్ల దాడులు చేశారు.కడపలోని ఆయన ఇంట్లో రూ.36 లక్షలను స్వా«దీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల ఖర్చుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌ఓ) కడప ఆర్డీఓ మధుసూదన్ నిధులను విడుదల చేసినట్లు తహసీల్దార్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం.
ఈ విషయంపై ఏసీబీ అధికారులు ఆర్డీఓను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆయన కుటుంబం నివాసముంటున్న తిరుపతి వైకుంఠపురంలోని ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. తిరుపతి వైకుంఠపురంలో 266.66స్క్వయర్ యార్డుల విస్తీర్ణం కలిగిన జీప్లస్1 భవంతి, మాతృత్వ ఆస్పత్రి ప్రాంగణం, పీలేరులో 158.89స్క్వయర్ యార్డుల విస్తీర్ణంలో నిర్మాణ దశలో ఉన్న జీప్లస్2 భవనం, తిరుపతి, రేణిగుంటలో 5 ఇంటిస్థలాలు, తిరుపతి దామినేడు పరిధిలో 33 సెంట్ల స్థలం, తిరుపతి చెర్లోపల్లిలో 1,685 అడుగుల స్థలం, తిరుపతి వైకుంఠపురంలోని అలంకృతి మాల్ తదితర స్థిరాస్తులను గుర్తించారు.
అలాగే టొయోటా ఇన్నోవా, మహింద్రా థార్ కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2.31లక్షలు, 390 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. వారి అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. సోదాలు కొనసాగుతున్నాయని, ఇంకా పెద్ద సంఖ్యలో అక్రమాస్తులు, లాకర్లలో దాచిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను కూడా గుర్తించినట్లు వివరించారు. రేణిగుంట మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములను రియల్టర్లకు ధారాదత్తం చేసి పెద్దమొత్తంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment