shiva prasad
-
కడప తహసీల్దార్ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి/కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప మండల తహసీల్దార్ సిద్దల శివప్రసాద్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో 9చోట్ల సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు తిరుపతి, పీలేరు, రేణిగుంట, కడపతో పాటు మొత్తం తొమ్మిది చోట్ల దాడులు చేశారు.కడపలోని ఆయన ఇంట్లో రూ.36 లక్షలను స్వా«దీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల ఖర్చుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్ఓ) కడప ఆర్డీఓ మధుసూదన్ నిధులను విడుదల చేసినట్లు తహసీల్దార్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీబీ అధికారులు ఆర్డీఓను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆయన కుటుంబం నివాసముంటున్న తిరుపతి వైకుంఠపురంలోని ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. తిరుపతి వైకుంఠపురంలో 266.66స్క్వయర్ యార్డుల విస్తీర్ణం కలిగిన జీప్లస్1 భవంతి, మాతృత్వ ఆస్పత్రి ప్రాంగణం, పీలేరులో 158.89స్క్వయర్ యార్డుల విస్తీర్ణంలో నిర్మాణ దశలో ఉన్న జీప్లస్2 భవనం, తిరుపతి, రేణిగుంటలో 5 ఇంటిస్థలాలు, తిరుపతి దామినేడు పరిధిలో 33 సెంట్ల స్థలం, తిరుపతి చెర్లోపల్లిలో 1,685 అడుగుల స్థలం, తిరుపతి వైకుంఠపురంలోని అలంకృతి మాల్ తదితర స్థిరాస్తులను గుర్తించారు. అలాగే టొయోటా ఇన్నోవా, మహింద్రా థార్ కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2.31లక్షలు, 390 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. వారి అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. సోదాలు కొనసాగుతున్నాయని, ఇంకా పెద్ద సంఖ్యలో అక్రమాస్తులు, లాకర్లలో దాచిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను కూడా గుర్తించినట్లు వివరించారు. రేణిగుంట మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములను రియల్టర్లకు ధారాదత్తం చేసి పెద్దమొత్తంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్‌కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్ మహర్షి
‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్ ఉంది’’ అన్నారు. -
ఒకరితో సహజజీవనం..మరోకరితో ప్రేమాయణం..చివరికీ..
హైదరాబాద్: యువతిని గాఢంగా ప్రేమించాడు.. ఆమె ఫొటోను ఛాతిమీద పచ్చబొట్టుగా వేయించుకున్నాడు... పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు...ఆమెతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ప్రియురాలు నో చెప్పడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కర్నూలుకు చెందిన శివ ప్రసాద్(23) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో గది అద్దెకు తీసుకొని కవిత అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఒక వైపు సహజీవనం చేస్తూనే మరో వైపు అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సుతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆమె ఫొటోను..పేరును కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. తనతో సహజీవనం చేస్తూ మరో యువతితో ప్రేమ పేరుతో తిరుగుతున్న శివ ప్రసాద్‌ను సహజీవనం చేస్తున్న యువతి కవిత మూడు రోజుల క్రితం నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను మోసం చేశాడని భావించిన కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది జరుగుతుండగానే శుక్రవారం సాయంత్రం ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుందామని శివ ప్రసాద్ అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. సహజీవనం చేస్తున్న యువతి నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చేరడం, ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించకపోవడంతో శివప్రసాద్ శనివారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోలుకున్న యువతి కవితను పోలీసులు ఆస్పత్రి నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడి అరాచకాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది
సాక్షి, అమరావతి: అసోం రాష్ట్రంలో ఆంధ్రుడి సత్తాకు అరుదైన గుర్తింపు లభించింది. ఒక టీ ఎస్టేట్ డాక్టర్ మూకహత్య కేసులో అసోంలోని జోర్హట్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ నెల 20న ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనం కలిగించింది. ఈ కేసులో ఒకరికి ఉరిశిక్ష, 24 మందికి జీవితఖైదు విధించారు. దేశ న్యాయ చరిత్రలోనే అరుదైన రికార్డు అని పలువురు పేర్కొంటున్న ఈ కేసు దర్యాప్తును ప్రత్యేకంగా పర్యవేక్షించిన ఐపీఎస్ అధికారి డీఐజీ డాక్టర్ జీవీ శివప్రసాద్. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురానికి చెందినవారు. పీహెచ్డీ చేస్తూ ఐపీఎస్‌కు.. డాక్టర్ శివప్రసాద్ తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపురం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. తల్లి సరోజిని గృహిణి. అగ్రికల్చరల్ ఎమ్మెస్సీ చదివిన శివప్రసాద్ న్యూఢిల్లీలో పీహెచ్డీ చేస్తూ సివిల్స్ రాశారు. ఐపీఎస్‌కు ఎంపికై అసోం–మేఘాలయ కేడర్‌లో నియమితులయ్యారు. అసోంలోని బార్ పెట్, దరాంగ్, నార్త్ కచార్, కర్బి అంగ్ లాంగ్ వంటి జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. అస్సాంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి వినూత్న పద్ధతులు అవలంబించిన శివప్రసాద్.. నిర్భీతిగా, నిజాయితీతో పనిచేస్తారని పేరొందారు.(చదవండి: మర్మమెరుగని కర్మయోగి.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి గిరిజన సేవకు) మూకహత్య కేసులో తనదైన ముద్ర.. అసోంలోని త్యోక్ టీ ఎస్టేట్‌లో డాక్టర్ దేబెన్ దత్తా (73) మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది ఆగస్ట్ 31న ఒక వర్కర్‌కు చికిత్స అందించడంలో జాప్యం జరిగిందంటూ ఎస్టేట్‌లోని తేయాకు కార్మికులు ఆగ్రహించారు. మూకుమ్మడిగా మారణాయుధాలతో డాక్టర్ దేబెన్ దత్తాపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన దేబెన్ దత్తాను వైద్యానికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. నలభై ఏళ్లుగా అదే టీ ఎస్టేట్‌లో వైద్యసేవలందిస్తున్న దత్తాను మూకహత్య చేయడంపై అసోంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చెలరేగాయి. శాంతిభద్రతల సమస్యగా మారింది. దీంతో జోర్హట్ డీఐజీగా ఉన్న శివప్రసాద్ స్వయంగా కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. తొలి మూడురోజుల దర్యాప్తులోనే 22 మంది ఎస్ఐలు భాగస్తులయ్యారు. 60 మంది ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాలను వీడియో రికార్డింగ్ చేశారు. సాక్ష్యాలను మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయించారు. సీసీ కెమెరాల ఫుటేజి సేకరించారు. హత్యజరిగిన పదిరోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి 21 రోజుల్లోనే 602 పేజీల చార్జిషీట్ దాఖలుచేశారు. 32 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఒకరు మృతిచెందగా మిగిలిన 31 మందిపై విచారణ కొనసాగింది. ఏడాదిలో విచారణ పూర్తిచేసిన కోర్టు ఈనెల 20న తీర్పు ఇచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, 24 మందికి యావజ్జీవశిక్ష విధించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో డాక్టర్ శివప్రసాద్ పేరు మరోసారి మారుమోగింది. కత్తిమీద సామే.. అయినా గర్వంగా ఉంది.. అసోంలోని టీ ఎస్టేట్లలో జరిగే అరాచకాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇక్కడ పోలీసు ఉద్యోగం కత్తిమీద సామే. అయినా అనేక కేసుల్లో దోషులకు శిక్షలు పడేలాచేసి శాంతిభద్రతలు కాపాడే పోలీస్ ఉద్యోగం చేయడం గర్వంగా ఉంది. అసోం రాష్ట్రంలోని జనాభాలో 25 శాతం మంది టీ ఎస్టేట్లలోనే ఉంటారు. టీ ఎస్టేట్లలో ఎటువంటి ఘటన జరిగినా.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా మారుతుంది. అందుకే చాలా సమస్యలను సున్నితంగా డీల్ చేయడంతోపాటు అరాచకశక్తుల ఆటకట్టించడంలో కఠినంగా ఉంటాం. ఎన్నో కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చేసిన నాకు.. డాక్టర్ మూకహత్య కేసులో న్యాయస్థానం తీర్పు మరిచిపోలేనిది. – డీఐజీ శివప్రసాద్ -
ది టార్గెట్
సూర్య, శివప్రసాద్, మధులగ్న, భవానీ చౌదరి, శ్రీధర్ రాజు, విడదాల శివ, బాతినేని శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దక్షయజ్ఞం’. ‘ది టార్గెట్’ అన్నది ఉపశీర్షిక. కృష్ణ తోట దర్శకుడు. మెట్రో స్టూడియోస్ ఈవీఎన్ చారి సారథ్యంలో కస్తూరి ఫిలిమ్స్, హంస క్రియేషన్స్‌పై వి. చిన్న శ్రీశైలం యాదవ్, బొర్ర జ్ఞానేశ్వర ముదిరాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వి. చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ– ‘‘మా మిత్రుడు ఈవీఎన్చారిగారితో ఈ చిత్రం నిర్మించటం హ్యాపీ. ఈ ఏడాది విజయవంతమైన చిత్రాల్లో ‘దక్షయజ్ఞం’ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘యువత ఆశించే థ్రిల్లింగ్ అంశాలు మా చిత్రంలో ఉంటాయి’’ అన్నారు బొర్రా జ్ఞానేశ్వర ముదిరాజ్. ‘‘ఇప్పటి వరకూ 8 చిత్రాలు నిర్మించా.. ఈ కొత్త సంవత్సరంలో 9వ చిత్రం నిర్మిస్తున్నాను’’ అన్నారు ఈవీఎన్ చారి. ‘‘హత్య నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది’’ అన్నారు కృష్ణ తోట. ఈ చిత్రానికి సమర్పణ: మహతి సాయి జశ్వంత్, సంగీతం: ఘనశ్యాం, సహనిర్మాత: పి. శ్యామ్ రావు. -
తవ్వేకొద్దీ శివప్రసాద్ అవినీతి బాగోతం
సాక్షి, కర్నూలు : ఏసీబీ అధికారుల ముందు అవినీతి దొంగ వ్యవహారం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణలతో కర్నూలు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ.శివ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. కర్నూలు, హైదరాబాద్, బెంగుళూరుతోపాటు మొత్తం అయిదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ. 8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతేగాక ఇతని పేర దాదాపు రూ. 20 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఏసీబీ సోదాలు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశం ఉంది. శివప్రసాద్ అక్రమ ఆస్తులు చిట్టా.. ► బెంగళూరులోని కార్తీక్ నగర్లో మూడు కోట్ల విలువైన జీప్లస్ సెవెన్ అపార్ట్ మెంట్, ఉదాల్ హల్లిలో రెండు కోట్ల విలువ చేసే ఇంటి స్థలం. ► హైదరాబాద్‌లోని జయభేరి ఆరెంజ్ ఆర్కేట్ లో కోటిన్నర విలువచేసే అపార్ట్మెంట్, గాజుల మల్లాపురంలో కోటి రూపాయల ఇంటి స్థలం. ► ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో రూ.1.45 లక్షల నగదు, కిలో బంగారం లభించింది. ► మనీ ట్రాన్స్ఫర్ కోసం భార్య పేరు మీద ఆక్సీ ట్రీ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ , సిన్బిడ్స్ అనే రెండు సూట్ కేసు కంపెనీల స్ధాపన. ► యుగాండా దేశంలోని బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయి. -
థ్రిల్లర్‌కి సై
‘పీఎస్వీ గరుడవేగతో హిట్ ట్రాక్ ఎక్కిన రాజశేఖర్ ప్రస్తుతం ఓ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మించనున్నారు. ఉత్తమ విమర్శకుడిగా, ఉత్తమ పుస్తక రచయితగా రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ధనుంజయన్ సమంత నటించిన ‘యుటర్న్’ సినిమాతో పాటు విజయ్ ఆంటోని ‘కొలైకారన్’ వంటి చిత్రాలను తమిళంలో విడుదల చేశారు. ఇంకా ‘మిస్టర్ చంద్రమౌళి’, జ్యోతిక, లక్ష్మీ మంచుల ‘కాట్రిన్ మొళి’ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనితో రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు ధనుంజయన్. తెలుగు హిట్ ‘క్షణం’ను ‘సత్య’గా తమిళంలో రీమేక్ చేయడంతో పాటు ‘బేతాళుడు’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేసిన రాజశేఖర్‌కు కృతజ్ఞతలు’’ అని ధనుంజయన్ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యస్.పి. శివప్రసాద్, సంగీతం: సైమన్.కె. కింగ్. -
రక్తికట్టించిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే హైడ్రామా
సాక్షి, చిత్తూరు, తిరుపతి/తిరుమల: తిరుమల స్థానికులు కొన్నేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు, సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తిరుమలలోని గొల్లకిష్టయ్య సందు, వరాహస్వామి ఆలయం వద్ద, దక్షిణ మాడవీధుల్లో నివాసాలు, దుకాణాలను తొలగించారు. ఆ సమయంలో వారందరికీ పరిహారంతో పాటు పునరావాసం కల్పిస్తామని టీటీడీ, తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చాయి. హాకర్స్ లైసెన్సులను రెన్యూవల్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో మొత్తం 14,370 మంది కాంట్రాక్టు కార్మికులు వేతనాల పెంపు కోసం ఆందోళనలు చేస్తున్నారు. వారంతా పలుమార్లు టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. ఫలితం లేకపోవడంతో తిరుపతిలోని పరిపాలనా భవనం ఎదుట కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నారు. మంగళవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో న్యాయం జరుగుతుంద ని ఆశించారు. పాలకమండలి సమావేశం అజెండాలో ఈ అంశాలు లేవని తెలుసుకున్న బాధితులు సోమవారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మను కలిసేందుకు ప్రయత్నించారు. రాత్రంతా అక్కడే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుగుణమ్మ తుడా చైర్మన్ నరసింహయాదవ్‌ను పిలిపించి చర్చలు జరిపారు. పాలకమండలి సమావేశంలోని అజెండాల్లో అంశాలన్నీ చేర్చాలను పట్టుబట్టారు. దీక్ష ఎందుకు విరమింపజేశారు? సమస్యల పరిష్కారం కోసం తిరుమల స్థానికులు తిరుపతి పరిపాలనా భవనం ఎదుట దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ దీక్షల వద్దకు ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని వెళ్లి వారితో చర్చలు జరిపి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. సమస్యలను పాలకమండలిలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో వాటి ప్రస్తావనే లేకపోవడంతో పరువు పోతుందని గ్రహించిన ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ శివప్రసాద్ హడావుడిగా తిరుమల చేరుకుని నిరసన డ్రామా వేశారు. డ్రామా రక్తికట్టిం చకపోగా రివర్స్ కావడంతో చిన్నగా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, బోర్డు సభ్యులను బాధితులు అడ్డుకున్నారు. తిరుపతి పరిపాలనా భవనం ముందు కాంట్రాక్టు కార్మికులు ఆందో ళనలు చేపట్టారు. తిరుమల, తిరుపతిలో బాధితుల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. తిరుమలలో చైర్మన్ వాహనం ముందు కు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. తిరుపతిలో పరిపాలనా భవనంలోకి అధికారులు వెళ్లకుండా కాంట్రాక్టు కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశంచేసి వారిని ఈడ్చి జీవులో పడేశారు. స్టేషన్‌కు తరలించారు. తమకెటువంటి సంబంధమూ లేనట్టుగా టీటీడీ ఈఓ, జేఈఓ వ్యవహరించడం గమనార్హం. -
టీడీపీ ఎంపీ కొత్త పల్లవి
సాక్షి, చిత్తూరు: తమ పార్టీ నాయకుడైన సీఎం చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్ శివప్రసాద్ ఆరోపించారు. శనివారం చిత్తూరు గాంధీ సర్కిలో ప్రత్యేక హోదాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలక కొట్టి శబ్దం చేస్తు కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకుడైన చంద్రబాబు రాష్ట్రం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అణిగిమనిగి ఉన్నారని చెప్పారు. తమ నాయకుడితో పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి చివరకు మిగిలేది బోడి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబుకు సంవత్సరం పాటు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని, తమ నాయకుడిని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. -
అమ్మాయి కోసం ఫేస్బుక్లో వార్నింగ్...
ఫేస్బుక్లో వార్నింగ్.. గ్రౌండ్లో డిష్యుం డిష్యుం బెంగళూరు : ఓ అమ్మాయి కోసం ఇద్దరి మధ్య ఫేస్బుక్లో జగడం మొదలైంది. ఇది చినికిచినికి గాలివానగా మారి దాడులకు దారితీసింది. ఈ ఘటన మంగళవారం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన అజిత్ తనతో పాటు కళాశాలలో చదువుతున్న అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు. ఆ అమ్మాయిని.. ఆమె ఇంటి పక్కన ఉండే శివప్రసాద్ కూడా ఇష్టపడేవాడు. కొన్ని రోజుల క్రితం సదరు అమ్మాయితో అజిత్ కలిసి తిరుగుతున్న విషయాన్ని శివప్రసాద్ గమనించాడు. ఈ నేపథ్యంలో అతను ఫేస్బుక్లో అజిత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయిని తాను ప్రేమిస్తున్నానని, మర్యాదగా అడ్డుతప్పుకోవాలని హెచ్చరించాడు. అజిత్ కూడా వెనక్కి తగ్గలేదు. అమ్మాయితో స్నేహంగా ఉండటం, ప్రేమించడం తన సొంత విషయమని, బెదిరింపులకు లొంగేది లేదని ఫేస్బుక్లో సమాధానం ఇస్తూ ఫోన్‌నంబర్‌ను కూడా పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో శివప్రసాద్ సోమవారం రాత్రి అజిత్‌కు ఫోన్‌చేసి ధైర్యముంటే స్థానిక శంకర్‌మఠం వద్ద ఉన్న మైదానం వద్దకు రావాలని చెప్పాడు. అజిత్ తన నలుగురు స్నేహితులతో అక్కడికి చేరుకున్నారు. శివప్రసాద్ కూడా తన గ్యాంగుతో అక్కడికి చేరుకున్నారు. వాగ్వాదంతో మొదలై.. భౌతిక దాడుల వరకు వెళ్లారు. కత్తులు, రాడ్లతో గాయపరచుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాజాజీనగర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అజిత్, శివప్రసాద్‌తో పాటు వారి స్నేహితులను అరెస్టు చేశారు. -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రేమ పెళ్లి
తూర్పుగోదావరి(చింతూరు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రేమ పెళ్లి జరిగింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో సోమవారం చోటుచేసుకుంది. చింతూరు మండలం మామిళ్లగూడెంకు చెందిన ప్రమీళ, మారేడిమిల్లి మండలానికి చెందిన శివప్రసాద్ లు హైదరాబాద్‌లో ఓ ఫ్యాక్టరీ పనిచేశారు. ఆ సమయంలో వీరు ఒకరునొకరు ప్రేమించుకున్నారు. అయితే శివ ప్రసాద్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రమీళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జంటకు కౌన్సెలింగ్ నిర్వహించగా ఇరువురు అంగీకరించారు. అయితే వీరి తల్లిదండ్రులకు వైఎస్సార్ సీపీ నేతలు నచ్చజెప్పి పార్టీ ఆధ్వర్యంలో పెళ్లి జరిపించారు. -
వంద శాతం ఈక్విటీ ఫండ్స్ ఉంటాయా?
వంద శాతం ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) కంటే ఇవి అధిక రాబడులను ఇస్తాయా? - హాసిని, తిరుపతి చాలా ఈక్విటీ ఫండ్స్ తమ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా దాదాపు వంద శాతం ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌కు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కు తేడా ఒక్కటే. ఈఎల్ఎస్ఎస్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. అందుకని ఈ ఫండ్ మేనేజర్ ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని ఈక్విటీల్లోనే మూడేళ్లపాటు ఉంచుతారు. ఈక్విటీ ఫండ్స్‌కు ఆ లాకిన్ పీరియడ్ ఉండదు. ఇక రాబడుల విషయానికొస్తే, దీర్ఘకాలం క్రమం తప్పకుండా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. నేను క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉన్నా యా? నేను డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - శివప్రసాద్, గుంటూరు డెట్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనాలే. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ) దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్లలాగానే ఉంటాయి. తేడా ఒక్కటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి గడువుకు ముందుగానే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఎఫ్‌ఎంపీలో అలా వీలు లేదు. కాకుంటే ఎఫ్ఎంపీలు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులనిస్తాయి. ఇక సేవింగ్స్ డిపాజిట్స్ కంటే లిక్విడ్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం. నా వయస్సు 28 సంవత్సరాలు. పన్ను ఆదా చేసే ఉద్దేశంతో రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీనికి అదనంగా మరో 50 వేల వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఈక్విటీల్లో మదుపు చేయమంటారా? లేక నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? వివరించండి. - ఆనంద్, హైదరాబాద్ 28 సంవత్సరాలున్న మీరు 30 ఏళ్లపాటు (మీరు రిటైరయ్యేంత వరకూ) మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందగలరు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఈక్విటీ కేటాయింపులు గరిష్టంగా 50 శాతం మాత్రమే ఉంటాయి. అదే ఈక్విటీ ఫండ్స్‌లో అయితే ఈక్విటీ కేటాయింపులు వంద శాతంగా ఉంటాయి. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అదే ఎన్పీఎస్ వల్ల పన్ను ప్రయోజనాలున్నాయి. మీరు కనుక ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం పన్ను బాధ్యత కొంత వరకూ తగ్గుతుంది. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. నేను హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్‌లో గత కొంత కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడులు అం తంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? - పవన్, వరంగల్ హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గత 2,3 ఏళ్లుగా ఈ ఫండ్ పనితీరు బాగా లేకపోయినప్పటికీ, మరీ నిరాశౠజనకంగా లేదని చెప్పొచ్చు. మీరు ఓపిక పడితే మంచి రాబడులే పొందొచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. నా వయస్సు 45 సంవత్సరాలు. నేను నెలకు రూ. 1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? మీ అభిప్రాయం చెప్పండి ? - రామాంజనేయులు, విశాఖపట్టణం మీ వయస్సు 45 ఏళ్లు. కాబట్టి మీరు ఎన్పీఎస్ను ఎంచుకుంటే 13 ఏళ్ల పాటు ఆ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయెచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 40 శాతాన్ని యొన్యూటీగా కన్వర్ట్ చేస్తారు. మీరు తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు పన్ను లాంటి బాదరబందీలేమీ ఉండవు. ఈ స్కీమ్ లో ఈక్విటీలకు కేటాయించేది గరిష్టంగా 50% మాత్రమే. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో 8-10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయండి. ఒక విధంగా మీకు ఇది పెన్షన్ ప్లాన్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇక మీరు రిటైరయ్యే 2-3 ఏళ్ల ముందు ఈ ఫండ్‌లో జమ అయిన మొత్తాన్ని ఏదైనా ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లోకి మార్చుకోండి. -
కలకలం
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజా ప్రతినిధుల సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కెవీ రమణపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ దృష్టికి మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి అసెంబ్లీలో శుక్రవారం తీసుకెళ్లడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఆహ్వానించి, ఆపై పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రజాప్రతినిధులను అవమాన పరచడంపై కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 168 నిబంధనల ద్వారా విచారణకు స్వీకరించి చర్యలు చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ఆ మేరకు స్పీకర్ నోటీసు స్వీకరించారు. ఫిబ్రవరి 27న గండికోట ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కలెక్టర్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. పైగా అందరూ ఆహ్వానితులేనని ఆహ్వాన పత్రంలో ముద్రించారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల చెంతకు చేరుతున్నారని తెలిసి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్షంగా ఏర్పడి పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకూ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వాస్తవ విషయాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రికి వివరించి నిధులు కోరాలని భావించారు. అలాంటి పరిస్థితిలో జమ్మలమడుగు నియోజకవర్గం గుర్రప్పకోన వద్ద పోలీసుల ద్వారా ఎమ్మెల్యేలను, అఖిలపక్షం సభ్యుల్ని అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులుగా తమ హక్కులకు భంగం కల్గించడం ఏమాత్రం సరైంది కాదని వివరించారు. ప్రజల కోసం, మెట్టప్రాంతం ఉన్నతి కోసం వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రికి విన్నవించాలనే ఉద్దేశంతో ఉన్నామని ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని కలెక్టర్‌కు అక్కడి నుంచే ఫోను ద్వారా విన్నవించినా ఫలితం లేకపోయింది. కలెక్టర్‌పై తొలిసారి.. వైఎస్సార్ జిల్లా చరిత్రలో కలెక్టర్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేయడం తొలిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు. కలెక్టర్‌గా పనిచేస్తున్న జయేష్‌రంజన్ బదిలీ నేపథ్యంలో.. ఆయన బదిలీ అపాలంటూ ఉద్యమం చేసిన చరిత్ర జిల్లాలో ఉంది. ప్రస్తుత కలెక్టర్ తీరుతో విసిగి పోయి.. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు రౌండు టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ‘ఈకలెక్టర్ మాకొద్దు’ అని మూడు రోజుల క్రితం తీర్మానం చేశాయి. అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడు కడప జిల్లా అంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, భూములు ఇస్తామన్నా ముందుకు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం లేపింది. ఇక్కడ పెట్టుబడులకు భద్రత ఉండదనే భయంతో ఉన్నారని, ఇక్కడి ప్రజలు ఆవేశపరులు అంటూ మాట్లాడటం జిల్లా వాసులను ఆవేదనకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఈ కలెక్టర్‌ను ప్రభుత్వం వెనక్కు పిలిపించుకుని మరో సమర్థుడైన కలెక్టర్‌ను నియమించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. తొలి నుంచి వివాదస్పదమే.. జిల్లా కలెక్టర్‌గా కెవీ రమణ జూలైలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో రాజంపేట హైస్కూల్లో ఆర్థర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. విచారణకు వెళ్లిన కలెక్టర్ గురువులు ‘గిచ్చడం’ విద్యాభివృద్ధి కోసమే అని మాట్లాడి వివాదాస్పదమయ్యారు. ప్రాంతీయ స్పోర్ట్సు స్కూల్ విద్యార్థులు అప్పటి స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి వైఖరికి నిర సనగా ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. డిప్యూటి డిఈఓ, పరిశ్రమల జిఎంలను ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్‌ను కలెక్టర్ పక్కలో కూర్చోబెట్టుకొని ఆరోపణలు తప్ప ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇవ్వడం అప్పట్లో దుమారం లేపింది. అంతేకాకుండా విద్యార్థుల ఆందోళనకు యోగ, తెలుగు టీచర్లు డాక్టర్ రంగనాథ్, బాస్కర్రెడ్డిలు కారకులంటూ సస్పెన్షన్ చేశారు. బద్వేల్లో ప్రభుత్వ ఆస్పత్రిని మార్చొద్దని ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రజల పక్షాన ఏకంగా ఎమ్మెల్యే జయరాములు నిరహార దీక్ష చేపట్టారు. ఇప్పుడున్న ఆస్పత్రి 10 ఎకరాల్లో ఉందని, ఆ స్థలం అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందని, రూ.2కోట్లు నిధులు మంజూరయ్యాయని మొత్తుకున్నా విన్పించుకోలేదని బద్వేలు వాసులు వాపోతున్నారు. అయితే తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు అన్నట్లుగా కలెక్టర్ సీమాంక్ ఆస్పత్రిలోకి ఆస్పత్రిని మార్చారు. ప్రస్తుతం చర్చి నుంచి 60 అడుగుల రహదారి (ఆస్పత్రికి వెళ్లడానికి) ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని క్రిష్టియన్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ తీరుపై అన్ని వర్గాల వారి నుంచి నిరసన వ్యక్తమవుతుండగా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంపై జోరుగా చర్చ సాగుతోంది. -
పట్టు రైతులందరికీ డ్రిప్
మడకశిర : పట్టురైతులందరికీ దరఖాస్తు చేసుకున్న వెంటనే డ్రిప్ సౌకర్యం కల్పించాలని తమ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ వి.ఉషారాణి తెలిపారు. అది కూడా ఏపీఎంఐపీ నియమనిబంధనల ప్రకారం కాకుండా పట్టుపరిశ్రమ శాఖ నియమనిబంధనల ప్రకారం మంజూ రు చేస్తామని తెలిపారు. గురువారం మడకశిరలోని శ్రీయాదవ కల్యాణమంటపంలో కేంద్ర పట్టుమండలి, రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టురైతు సమ్మేళనాన్ని కేంద్ర పట్టుమండలి డెరైక్టర్ శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్‌తోపాటు హిందూపురం ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు. కమిషనర్ ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు అవుతోందన్నారు. ఇంత వరకు అందులో 10వేల ఎకరాలకు మాత్రమే డ్రిప్ సౌకర్యం ఉందన్నారు. మిగిలిన 20వేల ఎకరాలకు రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకాస్ట్ రేషం షెడ్ల నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం తమ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిపారు. పట్టు రైతులకు అనుకూలంగా ఉంటే లోకాస్ట్ షెడ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో పట్టు రైతుల అభివృద్ధికి ప్రస్తుతం రూ.2కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో పట్టు రైతుల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు. డ్రిప్ సౌకర్యానికి వందశాతం సబ్సిడీ ఇస్తే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు. ఏ పథకమైనా రైతుల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతుందని తెలిపారు. పట్టు రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తే ధర కూడా ఆశించిన స్థాయిలో లభిస్తుందన్నారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో తక్కువ నీటితో మల్బరీ సాగు చేస్తే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందన్నారు. చదువుకున్న రైతులు వ్యవసాయం వైపు దృష్టిపెడితే నష్టాలు తగ్గడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర పట్టుమండలి డెరైక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ పట్టు రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని పట్టుగూళ్ల ఉత్పత్తిలో అధిక దిగుబడి సాధించాలని కోరారు. హిందూపురం ఎమ్పీ నిమ్మల క్రిష్టప్ప మాట్లాడుతూ ప్రోత్సహిస్తే మన దేశంలో చైనా, జపాన్ల కన్నా పట్టుపరిశ్రమ మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి పెరిగినా పట్టుగూళ్ల నాణ్యత మెరుగుపడాలన్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ మన దేశంలో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం విధానం తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన జపాన్ దేశస్తులు కూడా వస్తుండటం మనకు గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే ఈరన్న మాట్లాడుతూ పట్టు రైతులకు ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీని మరింత పెంచాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్రపట్టుమండలి జాయింట్ డెరైక్టర్ సత్యనారాయణరాజు, పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డెరైక్టర్ అరుణకుమారి, స్థానిక అసిస్టెంట్ డెరైక్టర్ శషాంక్రెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ శాస్త్రవేత్తలు, కేంద్ర పట్టుమండలి, పట్టుపరిశ్రమశాఖ అధికారులు, జపాన్ బృందం, నియోజకవర్గంలోని పట్టు రైతులు పాల్గొన్నారు. -
భ్రూణ హత్యలు పెరగడం ఆందోళనకరం
గుంటూరు ఈస్ట్ : మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంటే, భ్రూణ హత్యలు పెరిగిపోవడం ఆందోళనకరమని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. బృందావన్ గార్డెన్స్, కుందులరోడ్డులోని కమ్మజనసేవాసమితిలో 12వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన కోడెల ప్రసంగిస్తూ అభివృద్ధి చెందిన ఈ సమాజంలో ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. బాలికలు చదువుతోపాటు క్రమశిక్షణ అలవరచుకున్నప్పుడు జీవితంలో విజయంవైపు నడవ గలరన్నారు. వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సమితి నిర్వాహకులు వ్యాపారం నిర్వహించుకుంటూనే సమితి అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నానన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అవినీతి రహితంగా పనిచేసి కులానికి మంచిపేరు వచ్చేలా పనిచేస్తామన్నారు. అనంతరం నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్యను సమితి తరపున ఘనంగా సత్కరించారు. కోటి రూపాయల విరాళం చల్లా రాజేంద్రప్రసాద్ సమితి అభివృద్ధికి కోటి రూపాయాలు విరాళాన్ని అందించారు. మల్లి డ్యాన్స్ అకాడమీ పర్యవేక్షణలో విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహ పరిచాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీఎస్ ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నవ సుబ్బారావు, దాతలు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
గొడవ చేస్తే రుణాలు రద్దు కావు
ముఖ్యమంత్రి సభలో బుద్దిగా కూర్చోండి డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరిక యలమంచిలి, నాతవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్పేది వినండి.. సభలో గొడవ చేశారో? మీ గ్రూపులకు డ్వాక్రా రుణాల రద్దు వర్తించదు. డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరికలివి. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా జిల్లాలో చంద్రబాబు పర్యటన సభ నిర్వహణకు అధికారులు పోటీ పడుతున్నారు. సభ విజయానికి కొన్ని రోజులుగా రేయింబవళ్లూ శ్రమిస్తున్న అధికారులు సభలో మహిళలు మౌనంగా ఉండాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. నక్కపల్లి సభకు దాదాపు 30 వేల మంది మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామని అధికారం చేపట్టిన చంద్రబాబు గ్రూపుకు రూ.లక్ష మాఫీ హామీ మహిళలను ఏమాత్రం సంతృప్తిపరచడం లేదు. మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు వద్ద తమ గోడును వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభలో మహిళలు ఆందోళనకు దిగితే చంద్రబాబు ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఎంత వారించినా మహిళలు మాత్రం డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్న డిమాండ్‌తోనే సభలకు హాజరవుతున్నారని తెలిసింది. తాళం వేసే వారినే తరలించండి ముఖ్యమంత్రి సభల్లో మహిళల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురవకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన పర్యటనకు అధికంగా రైతులు, డ్వాక్రా మహిళలను అధిక సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అన్ని మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. నాతవరం మండలానికి ప్రత్యేకాధికారిగా నియమితులైన డీఆర్డీఏ ఏపీఎం కనక దుర్గ గురువారం ఐకేపీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య డ్వాక్రా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న మహిళలను మాత్రమే తరలించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీసే వారిని సమావేశాలకు తీసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండలం నుంచి ఈనెల 9న నక్కపల్లి ప్రాంతంలో జరిగే ముఖ్యమంత్రి సభకు 25 బస్సుల్లో సుమారుగా వెయ్యి మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఐకేపీ ఏపీఎం శివ ప్రసాద్‌ను అదేశించారు. -
పాణమున్నా.. బొమ్మే!
విధి వెక్కిరించింది. ఆ కుటుంబం వెన్ను విరిచింది. రెక్కలొచ్చిన కొడుకు.. తన రెక్కల కష్టంతో తన పేద కుటుంబాన్ని కొంతైనా ఆదుకోవాలని భావిస్తే.. అతన్ని రెక్కలు విరిచి జీవచ్ఛవాన్ని చేసింది. మంచానికి కట్టి పడేసింది. లారీ రూపంలో విధి జరిపిన దాడిలో చెట్టంత కొడుకు మృత్యుముఖంలోకి వెళ్లాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు దాతల కరుణతో కొడుకు ప్రాణాలు నిలపగలిగారు గానీ.. అతన్ని మంచం నుంచి దించలేకపోయారు. లక్షల రూపాయలు పెట్టి చికిత్స చేయించడం తమ తలకు మించిన పని అని రోదిస్తున్నారు. పాలకొండ రూరల్: 2014, జనవరి 12.. ఓ కుర్రాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఒక లారీ భూతంలా దూసుకొచ్చి అతని పైనుంచి వెళ్లిపోయింది. అంతే పనికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆ కుర్రాడు ఆస్పత్రిపాలయ్యాడు. దాంతో ఆ కుటుంబం కష్టాలు ప్రారంభమయ్యాయి. పాలకొండ పట్టణం గురువుగారి వీధికి చెందిన సోమరిపేట దుర్గారావుది నిరుపేద కుటుంబం. కులవృత్తిపైనే ఆధారపడిన ఆయన రెక్కల కష్టంతో కొడుకు శివప్రసాద్‌ను ఉన్నత చదువులు చెప్పించాలన్న లక్ష్యంతో డిగ్రీ వరకు చదివించాడు. ఇంతకాలం తన చదువు కోసం అష్టకష్టాలు పడిన తండ్రికి కొంతైన చేదోడువాదోడుగా ఉందామన్న ఉద్దేశంతో శివప్రసాద్ మరింత ఉన్నత చదువులకు ప్రయత్నిస్తూనే స్థానిక బట్టల షాపులో పనిలో చేరాడు. తానొకటి తలస్తే.. దైవం మరొకటి తలచినట్లు.. జనవరి 12న పని చేస్తున్న దుకాణానికి వెళుతున్న అతన్ని వెనుక నుంచి వచ్చిన లారీ పైనుంచి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో పడిన కొడుకును రక్షించికోవడానికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడ్డారు. దాతల సాయంతో లక్ష రూపాయలకుపైగా వైద్య చికిత్సలకు ఖర్చు చేసి ప్రాణాలు నిలబెట్టగలిగారు. మంచం మీదే అన్నీ.. ప్రాణమైతే దక్కింది గానీ.. లేచి నిలబడ లేక, నడవలేక శివ జీవచ్ఛావంలా మారాడు. మంచానికే పరిమితమయ్యాడు. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు కొన్ని నెలలుగా మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం వెన్ను విరిగినట్టయింది. చికిత్సకు ఇప్పటికే దాతల సాయంతోపాటు చేతిలో ఉన్న డబ్బంతా కరిగిపోయింది. కదలలేని స్థితిలో ఉన్న కొడుక్కి సపర్యలతో పాటు అన్ని అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. శివను తిరిగి ఆరోగ్యవంతుడిగా నిలబెట్టడానికి అవసరమైన చికిత్స కోసం వైద్యులను ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, దానికి రూ.6 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వారు చెబ్బడంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. కులవృత్తి, కూలి పనులు చేస్తే తప్ప కడుపు నిండని స్థితిలో అంత సొమ్ము ఎక్కడి నుంచి తేగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని కొడుకు దుస్థితి చూడలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మనస్సున్న మారాజులు స్పందించి ఆర్థికంగా చేయూతనిస్తే కొడుకు జీవితంతోపాటు.. తమ కుటుంబాన్ని నిలబెట్టినవారవుతారని ఆశగా ప్రార్థిస్తున్నారు. -
లక్కు.. కిక్కు!
అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వాహకులను శనివారం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో డీఆర్వో హేమసాగర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ జీవన్‌సింగ్, అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్, సూపరింటెండెంట్ ప్రణవి నేతృత్వంలో ఈ ప్రక్రియ చేపట్టారు. మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయించారు. మధ్యాహ్నం నాలుగు గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత గుంతకల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుకాణాలకు లాటరీ తీశారు. జిల్లాలో మొత్తం 236 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. 203 దుకాణాలకు 2,610 దరఖాస్తులు వచ్చాయి. 33 షాపులకు ఒక్కటీ రాలేదు. అనంతపురంలో 45 దుకాణాలకు గాను 853 దరఖాస్తులు, గుంతకల్లులో 14 దుకాణాలకు 148, తాడిపత్రిలో 21 దుకాణాలకు 82, రాయదుర్గంలో 16కు గాను 59, గుత్తిలో 20కు గాను 156, ఉరవకొండలో 7 దుకాణాలకు 103, శింగనమలలో 10కి గాను 229, కణేకల్లులో 8 దుకాణాలకు 36, ధర్మవరంలో 17కు గాను 213, హిందూపురంలో 19కు గాను 177, కదిరిలో 10 దుకాణాలకు 105, కళ్యాణదుర్గంలో 9 దుకాణాలకు 123, కంబదూరులో 3 దుకాణాలకు 39, చెన్నేకొత్తపల్లిలో 4 దుకాణాలకు 27, పెనుకొండలో 13కు గాను 75, పుట్టపర్తిలో 5 దుకాణాలకు 54, మడకశిరలో 10కి గాను 64, తనకల్లులో 5 దుకాణాలకు 67 దరఖాస్తులు వచ్చాయి. లాటరీలో పాల్గొన్న వారికి రూ.25 వేల చొప్పున ఫీజు నిర్ణయించారు. తద్వారా ప్రభుత్వానికి రూ.6.52 కోట్ల మేర ఆదాయం సమకూరింది. లాటరీ నిర్వహణ ఇలా... తొలుత దరఖాస్తుదారులకు ఆయా స్టేషన్ల పరిధిలో వారి ఫొటోతో కూడిన గుర్తింపు పత్రం జారీ చేశారు. గుర్తింపు పత్రం చూపిన వారిని మాత్రమే లాటరీకి అనుమతించారు. ఒక్కో షాపునకు వచ్చిన దరఖాస్తులను వేరుచేసి లాటరీ తీశారు. ఉదాహరణకు ఒకటో నంబర్ షాపునకు 10 దరఖాస్తులు వచ్చాయనుకుంటే 1 నుంచి 10 వరకు బిళ్లలను డబ్బాలో వేసి అందులో నుంచి ఒక బిళ్లను తీశారు. దరఖాస్తు చేసినా లాటరీ ప్రక్రియకుహాజరుకాని వారిని పరిగణనలోకి తీసుకోలేదు. లాటరీ తగిలిన వారి పేరు నమోదు చేసుకున్నారు. కాగా.. మహిళలు సైతం పెద్దసంఖ్యలో లాటరీ ప్రక్రియకు హాజరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఇద్దరు, ముగ్గురితో దరఖాస్తులు వేయించారు. దీంతో మహిళలు కూడా లాటరీలోపాల్గొనేందుకు వచ్చారు. పటిష్ట బందోబస్తు మద్యం దుకాణాలకు పెద్దసంఖ్యలో దరఖాస్తులు రావడంతో లాటరీ ప్రక్రియ మధ్యాహ్నం నాలుగు నుంచి అర్ధరాత్రి దాకా కొనసాగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా అర్ధరాత్రి దాకా వేచివున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 33 షాపుల వివరాలు వెల్లడించని అధికారులు జిల్లాలో 33 మద్యం షాపులకు దరఖాస్తులు రాలేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఏయే దుకాణాలకు దరఖాస్తులు రాలేదనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కరెంట్ కోతతో పడరాని పాట్లు రాత్రి 8.30 నుంచి గంట పాటు విద్యుత్ కోత ఉండటంతో మద్యం లాటరీకి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాటరీ నిర్వహించిన రెవెన్యూ భవన్ వద్ద ఒకట్రెండు చోట్ల మాత్రమే బల్బులు ఏర్పాటు చేశారు. మిగిలిన చాలా చోట్ల చీకట్లోనే గడిపారు. పార్కుల్లో, గోడలపై పడుకుని కొంత మంది, కబుర్లు చెప్పుకుంటూ మరికొంతమంది కాలక్షేపం చేశారు. ఇక పోలీస్, ఎక్సైజ్ అధికారులు వాహనాల లైట్ల వెలుగులో డీఏ భత్యం పంచుకోవడం కనిపించింది. కలలో కూడా ఊహించలేదు మేము నాలుగు బర్రెలు పెట్టుకుని పాలు అమ్ముకుంటూ బతుకుతున్నాం. దాంతో పాటు కూలి పనులకు వెళుతుంటాం. అందరిలాగే ఓ ప్రయత్నం చేద్దామని దరఖాస్తు చేశా. 126వ మద్యం షాపు దక్కింది. ఇలా దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు. - ఎన్.రమాదేవి, ఏడావులపర్తి, బీకేఎస్ మండలం, మళ్లీ అదృష్టం వరించింది మేము ఇది వరకే షాపు నిర్వహిస్తున్నాం. మరోసారి ప్రయత్నించాం. నాతో పాటు ఐదుగురు దరఖాస్తు చేశారు. షాపు నంబర్ 130 మాకే వచ్చింది. తిరిగి మాకే రావడం అదృష్టంగా భావిస్తున్నాం. - సర స్వతి, వడియంపేట, అనంతపురం -
సైకిల్‌కు ఒకటి ఫ్యాన్‌కు రెండు
రాజంపేట, తిరుపతిలో వైఎస్సార్ సీపీ.. చిత్తూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థుల విజయం సాక్షి, తిరుపతి : జిల్లా పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక చోట టీడీపీ గెలుపొందింది. తిరుపతి, రాజంపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వీ.వరప్రసాదరావు, పి.మిథున్‌రెడ్డి గెలుపొందారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ రెండోసారి సైతం గెలుపొందారు. ఈ ముగ్గురిలోనూ మిథున్‌రెడ్డి లక్షా డెబ్బైనాలుగు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు. రాజకీయ అరంగ్రేటంలోనే ఎన్టీఆర్ తనయ, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరితో తలపడ్డారు. అయినప్పటికీ ఓట్ల లెక్కింపు జరిగిన ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించి సునాయాసంగా విజయం సాధించారు. రాజంపేట లోక్‌సభ పరిధిలోని పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటిలోనూ ఆధిక్యాన్ని చాటుకున్నారు. మిథున్‌రెడ్డికి 6,01,752 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన పురందేశ్వరికి 4,26,990 ఓట్లు వచ్చాయి. జైసమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసిన హుస్సేన్‌కు 59,777 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌కు 29,332 ఓట్లు మాత్రమే వచ్చాయి. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో మరోసారి కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ కీలకమైంది. చిత్తూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్.శివప్రసాద్ 44,138 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సామాన్య కిరణ్‌పై ఆయన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ కూడా శివప్రసాద్‌కు అనుకూలించింది. చిత్తూరు,నగరి, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే సామాన్యకిరణ్కు తక్కువ వచ్చాయి. దీనిని బట్టి ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. కిందటి ఎన్నికల్లో కేవలం 10 వేల మెజారిటీతో గెలుపొందిన శివప్రసాద్, ఈ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని పెంచుకోగలిగారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వి.వరప్రసాదరావు వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి 37,425 ఓట్ల ఆధిక్యంతో సమీప బీజేపీ అభ్యర్థి జయరాంపై విజయం సాధించారు. ఇక్కడ వరప్రసాదరావుకు 5,80,376 ఓట్లు రాగా జయరాంకు 5,42,951 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన చింతామోహన్‌కు 33,333 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గంలోనూ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇక్కడ ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ వైఎస్సార్ సీపీ అభ్యర్థికి అనుకూలించింది. లోక్‌సభ నియోజకవర్గం ఫలితాల వెల్లడి ప్రారంభమైన మొదటి మూడు రౌండ్లలో వెనుకంజలో ఉన్న వరప్రసాదరావు ఆ తరువాత క్రమంగా పుంజుకున్నారు. చివరికి 37 వేల పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో తగ్గిన ఓట్లను నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లె, సూళ్లూరుపేట స్థానాలు భర్తీ చేశాయి. -
శివప్రసాదూ...ఇదేమి దుర్బుద్ధి?
ఎంపీ నిధుల్లో చిలక్కొట్టుడు వీధి దీపాల పంపిణీలో భారీగా అవినీతి రూ.వెయ్యి విలువచేసే వాటికి రూ.2500 బిల్లు ఎన్నికల కోడ్ ఉన్నా యథేచ్చగా లైట్ల పంపిణీ నోరు విప్పడానికి భయపడుతున్న యంత్రాంగం ‘సాక్షి’ ఆపరేషన్‌లో నిజాలు తేటతెల్లం చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఎంపీ నిధుల వినియోగానికి కమీషన్లు అడిగి, కొందరు ప్రజాప్రతినిధులు స్టింగ్ ఆపరేషన్లలో అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అదే తరహాలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సైతం ప్రజల మౌలిక వసతులకు కేటాయించిన నిధుల్లో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం ఓ అజ్ఞాత వ్యక్తి ‘సాక్షి’కి దీనిపై సమాచారం అందించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో వెదురుకుప్పం మండలానికి చెందిన వ్యక్తి, పంచాయతీ కార్యదర్శి ఇద్దరూ కలిసి చిత్తూరు నగరంలోని బజారువీధిలో ఉన్న ఒక ఎలక్ట్రికల్ దుకాణానికి వెళ్లారు. ఆ దుకాణ యజమాని, సర్పంచ్, ఓ వ్యక్తి నుంచి బిల్లుల్లో సంతకాలు పెట్టించుకున్నారు. అక్కడే ఉన్న వినాయకస్వామి ఆలయం ఎదురుగా ఉన్న వీధిలో గోదాములో అప్పటికే ఎంపీ పేరిట స్టిక్కర్లతో ముద్రించి ఉంచిన వీధిదీపాల సెట్లను బయటకు తీసి 14 సెట్లను ఓ ఆటోలో వేసి పంపించారు. ఆటో కొంగారెడ్డిపల్లె సమీపానికి రాగానే ‘సాక్షి’ విలేకరి ఆటోలోని వస్తువులను చూపించమని అడిగితే అలాగేనని ఆటోలో ఉన్న బాక్సులు తెరచి చూపించారు. చూస్తే అందులో 80 వాట్స్ పవర్ ఉన్న సీఎల్ఎఫ్ బల్బు, డూమ్ ఒకటి, ఓ పైపు, రెండు క్లాంపులు చొప్పున మొత్తం 14 సెట్ల వీధి దీపాలు ఉన్నాయి. వీటిపై డాక్టర్ శివప్రసాద్, ఎంపీ అని ఒకవైపు, రెండో వైపు ఎంపీ ల్యాడ్స్ అని పెద్ద అక్షరాలతో స్టిక్కర్లుఉన్నాయి. వీటి విలువ ఎంత అని సర్పంచ్‌ను అడిగితే *25 వేలని సమాధానమిచ్చారు. మరి బిల్లు ఎక్కడ అని అడిగితే తమ చేతికి ఎలాంటి బిల్లు ఇవ్వలేదని ఆ వ్యక్తి సమాధానమిచ్చి వెళ్లిపోయారు. ధరలో భారీ తేడా వాస్తవానికి ఎంపీ నిధుల నుంచి పంపిణీ చేసిన వీధి దీపాలకు మార్కెట్లో లభించే అదే నాణ్యతతో ఉన్న వీధి దీపాల ధరలకు పెద్ద ఎత్తున వ్యత్యాసముంది. 85 వాట్స్ సీఎల్ఎఫ్ వీధి దీపం ఒక్కటి రూ.500కి చిత్తూరులోని అన్ని దుకాణాల్లో లభ్యమవుతోంది. దీని డూమ్ ధర రూ.300, ఇనుప పైపు, క్లాంపులు రూ.100కు దొరుకుతున్నాయి. మొత్తం కలిపి ఒక్క సెట్ సీఎల్ఎఫ్ వీధి దీపం రూ.900కే లభ్యమవుతోంది. అదే వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే రూ.800కు కూడా ఇస్తామని డీలర్లు చెబుతున్నారు. ఇవేమీ తెలియకుండా అసలు ఎంపీ నిధుల నుంచి ఒక్కో వీధి దీపాన్ని రూ.2500 వెచ్చించి కొనుగోలు చేయడం, కనీసం గ్రామ సర్పంచ్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని వెదురుకుప్పం మండలంలోని సర్పంచ్‌లు అందరూ ప్రశ్నిస్తున్నారు. వీధి దీపాలకు సైతం ఎంపీ శివప్రసాద్ పేర్లు వేయిం చుకుని ఆయన సొంత డబ్బులిచ్చినట్లు డబ్బా కొట్టుకోవడంపై కూడా సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఆరు నెలల ముందే వేయించాల్సింది ఎంపీ నిధుల కింద వీధి దీపాల కొనుగోలుకు ఆరు నెలల క్రితం లెటర్ ఇచ్చిన ఎంపీ శివప్రసాద్, అప్పుడేమీ పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపించడంతో హుటాహుటిన నిధులు ఖర్చు పెట్టడానికి కంకణం కట్టుకున్నారు. అనుకున్నదే అదనుగా చిత్తూరు నగరంలోని స్నేహితుడైన ఎలక్ట్రికల్ దుకాణం యజమానికి వీధి దీపాల పంపిణీ వ్యవహారాన్ని పురమాయించారు. ఒట్టి కాగితాలు, బిల్లుల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల నుంచి సంతకాలు పెట్టించుకుని వీధి దీపాలను పంపిణీ చేస్తున్నారు. కోడ్ ఉల్లంఘన వచ్చే నెల 7న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అవేమీ పట్టించుకోకుండా వీధి దీపాలకు సైతం తన పేరిట ఉన్న స్టిక్కర్లు అంటించి మరీ గ్రామాలకు వీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం వెదురుకుప్పం, రామచంద్రాపురం, పూతలపట్టు, ఎస్ఆర్ పురానికి చెందిన నాలుగు మండలాల్లో రూ.9లక్షలకు వీధి దీపాలను పంపిణీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మౌనంగా అధికారులు ఈ వ్యవహారంపై ‘న్యూస్‌లైన్’ జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావును సంప్రదించగా, ఇందులో తమకు ఏమీ సంబంధం లేదని తెలిపారు. సీపీవో కార్యాలయంలోనే ఎంపీ, ఎమ్మెల్యే నిధుల పంపిణీ, ఖర్చుల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. సీపీవోను వివరణ కోరడానికి ప్రయత్నిస్తే ఆయన ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు. -
నామినేషన్ల వెల్లువ
సాక్షి, నెల్లూరు: మంచి తిథి, వారం కలిసిరావడంతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బుధవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఒక్క రోజే గడువు ఉండడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లకు 216, కావలి మున్సిపాలిటీలో 73, సూళ్లూరుపేటలో 27, గూడూరులో 24, వెంకటగిరిలో 31, ఆత్మకూరులో 33, నాయుడుపేటలో 5 నామినేషన్లు వచ్చాయి. నెల్లూరు మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన డాక్టర్ జడ్.శివప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. మొదటి రెండు రోజులు తిథులు బాగ లేకపోవడంతో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. బుధవారం ఒక్కసారిగా ఊపందుకోవడంతో నామినేషన్ స్వీకరణ కేంద్రాలన్నీ అభ్యర్థులు, వారి ప్రతిపాదకులతో కిటకిటలాడాయి. గురువారం చివరి రోజు కావడంతో ఈ సందడి మరింత పెరగనుంది. ఈ క్రమంలో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ జాన్‌శ్యాంసన్ నగరంలోని 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించి, అధికారులకు సూచనలిచ్చారు. -
ఖైదీలకు ఫోన్ సౌకర్యం
విశాఖ కేంద్ర కారాగారంలో జిల్లా న్యాయమూర్తి ప్రారంభం రిమాండ్ ఖైదీలకూ త్వరలో అందుబాటు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఖైదీల కల నెరవేరింది. తమవారి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం కలిగింది. విశాఖ కేంద్ర కారాగారంలో వీరికి గురువారం నుంచి ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసినరెండు ల్యాండ్ ఫోన్లను జిల్లా న్యాయమూర్తి జయసూర్య ప్రారంభించారు. వెంటనే శిక్షపడిన ఖైదీతో అతని కుటుంబీకులతో మాట్లాడించారు. డీపిజా టెలికమ్యూనికేషన్స్‌కు ఈ ఫోన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాస్, డెప్యూటీ సూపరింటెండెంట్ సన్యాసినాయుడు, డెప్యూటీ జైలర్ శివ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఫోన్ సౌకర్యంపై జైలు సూపరింటెండెంట్ విలేకరులకు వివరించారు. వారానికి రెండు సార్లే... ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏవైనా రెండు ఫోన్ నంబర్లను ముందుగా జైలు అధికారుల రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. ఆయా నంబర్లకు మాత్రమే వారానికి రెండుసార్లు చొప్పున నెలలో ఎనిమిదిసార్లు మాట్లాడవచ్చు. ప్రతి కాల్లో అయిదు నిమిషాలు మాత్రమే ఖైదీ మాట్లాడాలి. డయిల్ చేసిన అయిదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఆగిపోతుంది. ప్రతి నిమిషానికి రూ.4 బిల్లు పడుతుంది. ఖైదీలకు ముందుగానే ఈ టోకెన్లను అధికారులు విక్రయిస్తారు. ఈ సౌకర్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఖైదీలు కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడుతున్నారో సిబ్బంది దగ్గరుండి పరిశీలిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజమండ్రి, చెర్లపల్లి కారాగారాల్లో ఉండగా, ఇప్పుడు విశాఖ కారాగారంలోకి అందుబాటులోకి వచ్చింది. రిమాండ్ ఖైదీలకు కూడా కొద్ది రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. -
శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆమోదించాలి
సీమ హక్కులను నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటే బాస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల స్పష్టీకరణ మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ఊపందుకున్న వేళ రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం సీమ నేత లు స్వరం పెంచుతున్నారు. రాయలసీమను సౌభాగ్య సీమగా మార్చగల ‘శ్రీబాగ్ ఒప్పందం’ అమలు కోసం భారతీయ అంబేద్కర్ సేన (బాస్) కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా శనివారం పట్టణంలోని బేబి వెల్కమ్ హోమ్‌లో పార్టీలకు అతీతంగా, ప్రజాసంఘా లు, వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘రాయలసీమ సమస్యలు-పరిష్కార మార్గాలు’ అన్న అంశంపై బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసా ద్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగిం ది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ చినబాబు, టీడీపీ మాజీ ఎమెల్యే దొమ్మలపాటి రమేష్, వల్లిగట్ల రెడ్డెప్ప, సీపీఐ నాయకులు కృష్ణప్ప, సమాజ్‌వాదీ పార్టీకి చెంది న తుర్ల ఆనంద్యాదవ్తో పాటు పలు స్వ చ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, కుల సం ఘాల నాయకులు పాల్గొని సీమ సమస్యలను వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్(జీవోఎం)బిల్లులో శ్రీబాగ్ ఒప్పందంపై చర్చించక పోవడాన్ని పలువురు నేతలు తీవ్రం గా ఖండించారు. ఇప్పటికైనా సీమ హక్కులపై స్పందించి లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించి, శ్రీబాగ్ అమలును ఆమోదించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేకుంటే సీమ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా తిరుగుబాటు తప్పదని నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో బాస్ జిల్లా అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు జింకా వెంకటాచలపతి, పోర్డు లలితమ్మ, కృషి సుధాకర్, డీఎస్ఎస్ నాయకుడు చిన్నప్ప, బీసీ నాయకులు పులిశ్రీనివాసులు, డీవీ.రమణ, రాయల్‌బాబు, కొమరం భీమ్ అధ్యక్షులు దివాకర్, బాస్ నాయకులు శ్రీచందు, కేవీ.రమణ, నాషీ, మను, లారా, లక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మండలిలో చర్చిస్తాం ఏళ్ల తరబడి రాయలసీమ కరువు కోరల్లో విలవిల్లాడుతోం ది. ఇక్కడి ప్రజల నీటి కష్టాలు వర్ణనాతీతం. వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక రంగం, అభివృద్ధి సూచిల్లో తెలంగాణ కంటే సీమ వెనుకబడింది. శ్రీబాగ్ ఒప్పంద అమలు ద్వారా సీమ కష్టాలు తీరుతాయి. దీనిపై శాసనమండలిలో చర్చిస్తా. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పొలిట్‌బ్యూరోలో మాట్లాడుతా. - ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి (వైఎస్సార్సీపీ) మ్యానిఫెస్టోలో పెట్టేవిధంగా ఒత్తిడి తెద్దాం శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తామని రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ మ్యానిఫెస్టోలో పెట్టే విధంగా సీమ నేతలు ఒత్తిడి తేవాలి. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఈ ప్రమాదం నుంచి సీమను కాపాడుకోవాలంటే శ్రీబాగ్ ఒప్పందం అమలు జరగాల్సిందే. - దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే(టీడీపీ) నదీ జలాలు సీమకే కేటాయించాలి కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల నీటిపై శ్రీబాగ్ ఒప్పందం ద్వారా సంపూర్ణ హక్కులు లభించినా, దాన్ని కాలరాసి కోస్తాంధ్ర, తెలంగాణాలకు నదీజలాలను తరలించుకుపోతున్నారు. 40 అడుగుల్లో భూగర్భ జలాలున్న కోస్తాంధ్రకు నదీజలాలు ఇస్తున్నారు. వెయ్యి అడుగుల బోర్లు వేసినా నీళ్లు పడని సీమకు నదీ జలాలు ఇవ్వకుండా ఎడారిగా మార్చారు. సీమాంధ్ర నేతలు శ్రీబాగ్ ఒప్పందం అమలుకు కృషి చేయాలి. - జింకా చలపతి వైఎస్సార్సీపీ సీమను సింగ్‌పూర్‌లా మార్చుకుందాం 30 ఏళ్లలో సింగపూర్ ఎంతో అభివృద్ధి సాధించి అమెరికా వంటి దేశాలతో పోటీపడుతోంది. సీమలో అపారమైన ఖనిజ, అటవీ సంపద ఉన్నాయి. నదీజలాలు, విద్యుత్ మిగులు ఉంది. కష్టజీవులున్నారు. ఈ వనరులన్నీ వినియోగంలోకి తెస్తే రాయలసీమ రానున్న 20 ఏళ్లలో సింగపూర్ ను మించిపోతుంది. శ్రీబాగ్ ఒప్పందం అమలుకు రాజకీ య పార్టీలు ఉద్యమించాలి. - పీటీఎం. శివప్రసాద్, బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు -
బాబుకు చంద్రగిరి సెగ
హైదరాబాద్‌లో పంచాయితీ అరుణమ్మ పార్టీలోకి వద్దని నియోజకవర్గ నాయకుల ఫిర్యాదు ఎంిపీ శివప్రసాద్‌పై ఆగ్రహం మంత్రి వేధింపులకు బలయ్యామని తమ్ముళ్ల ఆవేదన తిరుపతి రూరల్, న్యూస్‌లైన్ : మంత్రి గల్లా అరుణకుమారిని టీడీపీలోకి తీసుకోవద్దని అధినేత చం ద్రబాబు వద్ద చంద్రగిరి తమ్ముళ్లు మొరపెట్టుకున్నారని తెలిసింది. నియోజకవర్గంలోని తమ్ముళ్లు గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొంత మంది టీడీపీ మం డల నాయకులు పార్టీ కార్యాలయంలో ఉన్న చంద్రబాబును శుక్రవారం రాత్రి కలిశారు. గల్లా చేరికపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్ట్టు విశ్వసనీయ స మాచారం. ఎంపీ శివప్రసాద్ తీరు పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని వాపోయారు. నిత్యం గల్లాను పొగుడుతూ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని బాబుకు చెప్పినట్టు తెలిసింది. తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీధర్‌నాయుడును అ రుణకుమారి ఆర్థికంగా దెబ్బతీసిన విషయాన్ని చెప్పి వాపోయినట్టు తెలిసింది. టీడీపీలోకి చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సమయంలోనే శ్రీధర్‌నాయుడును ఆమె తీవ్రంగా మందలించారని వాపోయారు. అరుణకుమారి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు, వర్గాలను ప్రోత్సహించారని అలాంటి నాయకురాలు పార్టీలోకి వస్తే మరింతగా గ్రూపులు తయారవుతాయని ఆవేదనను వెళ్ల గక్కారు. ఎంపీ శివప్రసాద్ సైతం పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదని, మంత్రి అనుచరులకే పెద్ద పీట వేస్తున్నారని తీవ్రస్థాయిలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 15 ఏళ్లుగా అరుణకుమారి పార్టీ నాయకులపై కేసులు పెట్టి వేధించారని ఫి ర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అరుణకుమారిని తీ సుకోకుంటేనే పార్టీ బతుకుతుందని అధినాయకు డి వద్ద వాపోయినట్టు సమాచారం. అదేవిధంగా ఎంపీని కట్టడి చేయకుంటే ద్వితీయశ్రేణి నాయకు ల్లో అసంతృప్తిని చల్లార్చచడం కష్టమని బాబు వద్ద కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. ‘అన్నీ నేను చూసుకుంటా. నాకు వదిలేయండి, మీరు కలిసి పనిచేయండి చాలు’ అని బాబు తనదైన శైలిలో నాయకులకు చెప్పి పంపారని తెలిసింది. అధినేత నుంచి సమాధానం దాటవేత ధోరణిలో ఉండడంతో తమ్ముళ్లు చేసేదిలేక అసహనంతో వెనుతిరిగినట్టు తెలిసింది.