గుంటూరు ఈస్ట్ : మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంటే, భ్రూణ హత్యలు పెరిగిపోవడం ఆందోళనకరమని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. బృందావన్ గార్డెన్స్, కుందులరోడ్డులోని కమ్మజనసేవాసమితిలో 12వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన కోడెల ప్రసంగిస్తూ అభివృద్ధి చెందిన ఈ సమాజంలో ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. బాలికలు చదువుతోపాటు క్రమశిక్షణ అలవరచుకున్నప్పుడు జీవితంలో విజయంవైపు నడవ గలరన్నారు.
వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సమితి నిర్వాహకులు వ్యాపారం నిర్వహించుకుంటూనే సమితి అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నానన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అవినీతి రహితంగా పనిచేసి కులానికి మంచిపేరు వచ్చేలా పనిచేస్తామన్నారు. అనంతరం నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్యను సమితి తరపున ఘనంగా సత్కరించారు.
కోటి రూపాయల విరాళం
చల్లా రాజేంద్రప్రసాద్ సమితి అభివృద్ధికి కోటి రూపాయాలు విరాళాన్ని అందించారు. మల్లి డ్యాన్స్ అకాడమీ పర్యవేక్షణలో విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహ పరిచాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీఎస్ ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నవ సుబ్బారావు, దాతలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
భ్రూణ హత్యలు పెరగడం ఆందోళనకరం
Published Mon, Feb 23 2015 3:34 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
Advertisement