సాక్షి, కర్నూలు : ఏసీబీ అధికారుల ముందు అవినీతి దొంగ వ్యవహారం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణలతో కర్నూలు మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ.శివ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. కర్నూలు, హైదరాబాద్, బెంగుళూరుతోపాటు మొత్తం అయిదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ. 8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతేగాక ఇతని పేర దాదాపు రూ. 20 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఏసీబీ సోదాలు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశం ఉంది.
శివప్రసాద్ అక్రమ ఆస్తులు చిట్టా..
► బెంగళూరులోని కార్తీక్ నగర్‌లో మూడు కోట్ల విలువైన జీప్లస్ సెవెన్ అపార్ట్ మెంట్, ఉదాల్ హల్లిలో రెండు కోట్ల విలువ చేసే ఇంటి స్థలం.
► హైదరాబాద్‌లోని జయభేరి ఆరెంజ్ ఆర్కేట్ లో కోటిన్నర విలువచేసే అపార్ట్‌మెంట్, గాజుల మల్లాపురంలో కోటి రూపాయల ఇంటి స్థలం.
► ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో రూ.1.45 లక్షల నగదు, కిలో బంగారం లభించింది.
► మనీ ట్రాన్స్‌ఫర్ కోసం భార్య పేరు మీద ఆక్సీ ట్రీ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ , సిన్బిడ్స్ అనే రెండు సూట్ కేసు కంపెనీల స్ధాపన.
► యుగాండా దేశంలోని బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment