anti corruption bureau
-
Formula E Car Race Case: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేసు కేసు (Formula E Car Race Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (ktr)కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జనవరి 6న ఈ-కార్ రేసు కేసు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఇదే కేసులో ఈడీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఏసీబీ సైతం నోటీసు జారీ చేయడం చర్చాంశనీయంగా మారింది. ఈడీ నోటీసులు ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఏసీబీ కంటే ముందే ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. 👉చదవండి : కేటీఆర్‌కు ఈడీ నోటీసులు -
ఫార్ములా– ఈ కార్ రేసులో 'ఏ1 కేటీఆర్'
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావును ఏ–1 (మొదటి నిందితుడు)గా, పురపాలక శాఖ (ఎంఏయూడీ) మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ–2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ–3గా చేర్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండానే.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి పలు దఫాల్లో రూ.54,88,87,043 బదిలీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఫిర్యాదుతో.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 13(1) (ఏ), 13(2), ఐపీసీ సెక్షన్ 409, 120–బీ కింద గురువారం కేసు (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతివ్వడంతో ఏసీబీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ నిధుల నుంచే రూ.54,88,87,043 చెల్లింపులు హైదరాబాద్‌లో ఫార్ములా⇒ ఈ కార్ రేసు సీజన్ 9, 10, 11, 12 నిర్వహించేందుకు 2022 అక్టోబర్ 25న యూకేకు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈఓ), తెలంగాణ ప్రభుత్వ పురపాలక శాఖ, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేటు లిమిటెడ్ (స్పాన్సర్)కు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన ఫార్ములా–ఈ రేస్ మొదటి సీజన్ (9) కోసం హెచ్ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత ఎఫ్ఈఓకు స్పాన్సర్‌కు మధ్య వచ్చిన విభేదాలతో ఫార్ములా⇒ ఈ కార్ రేసు సీజన్ 10 నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు స్పాన్సర్ స్థానంలో తామే అన్ని ఖర్చులు భరించేలా హెచ్ఎండీఏ అధికారులు, ఎఫ్ఈఓ మధ్య చర్చలు జరిగాయి. సీజన్ 10 కార్ రేసు నిర్వహణకు సంబంధించిన ఫీజుల నిమిత్తం, ఇతర సదుపాయాల ఏర్పాటుకు అయ్యే మొత్తం రూ.160 కోట్లు ఖర్చు పెట్టేందుకు పురపాలక అధికారులు పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో మొదటి దఫా కింద 2023 అక్టోబర్ 3న రూ.22,69,63,125 చెల్లించేందుకు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ మంజూరు ఇచ్చారు. రెండో దఫా కింద 2023 అక్టోబర్ 11న మరో రూ.23,01,97,500 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హిమాయత్‌నగర్ బ్రాంచ్ నుంచి యూకేలోని ఎఫ్ఈఓ కంపెనీ ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు బదిలీ చేయడంలో నిబంధనలు పాటించకపోవడంతో హెచ్ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు మరో రూ.8,06,75,404 పన్నుల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం మరో రూ.1,10,51,014 హెచ్ఎండీఏ చెల్లించింది. ఇలా మొత్తం రూ.54,88,87,043 హెచ్ఎండీఏ చెల్లించింది. ఇవన్నీ సాధారణ నిధుల నుంచే సంస్థ చెల్లించిందని ఏసీబీ పేర్కొంది. అనుమతుల్లేకుండానే చెల్లింపులు ⇒ హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం రూ.10 కోట్లకు మించి ఖర్చు అయ్యే పనులు చేసేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి తీసుకోలేదు. ⇒ హెచ్ఎండీఏ చెల్లించిన రూ.54,88,87,043కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఆర్థికశాఖ దృష్టికే తీసుకెళ్లలేదు. ⇒ హెచ్ఎండీఏ అగ్రిమెంట్లో పార్టీ కాకపోయినా నగదు చెల్లింపులు చేసింది. ⇒ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే 2023 అక్టోబర్ 30న అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. ⇒ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా..ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఎఫ్ఈఓకు హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు జరిగాయి. ⇒ ఫారిన్ ఎక్సేంజ్ రెమిటెన్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశీ మారకద్రవ్యం రూపంలో చెల్లింపులు జరిగాయి. ⇒ ప్రభుత్వం తరఫున ఏవైనా అగ్రిమెంట్లు చేసుకోవాలంటే ఆర్థిక, న్యాయశాఖల సమ్మతితో పాటు కేబినెట్ అనుమతి తీసుకోవాలి. తీసుకోలేదు. ⇒ ఈ ఒప్పందాలన్నీ మోసపూరితమైనవని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ⇒ అధికారులు, మాజీ మంత్రి కేటీఆర్ కలిసి నేర పూరిత కుట్రకు, ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అధికార దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏసీబీ తన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఏమిటీ సెక్షన్లు.. శిక్ష ఏమిటి? ⇒ నిజాయితీ లేకుండా, మోసపూరితంగా సొంత ప్రయోజనం కోసం ప్రభుత్వ ఆస్తిపై ఇతరులకు హక్కు కట్టబెట్టడం అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్ 13(1) (ఏ), సెక్షన్ 13(2) కిందకు వస్తాయి. నేరపూరిత దు్రష్పవర్తన, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా రుజువైతే ఏడాదికి తక్కువ కాకుండా అత్యధికంగా ఏడేళ్ల వరకు ఈ సెక్షన్ల కింద జైలు శిక్ష వేయవచ్చు. అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. ⇒ ఐపీసీ సెక్షన్ 409, 120–బీ నేరపూరిత కుట్రకు సంబంధించినది. ప్రభుత్వోద్యోగి, బ్యాంకర్, వ్యాపారి నేరపూరితంగా విశ్వాస ఉల్లంఘనకు పాల్పడటం పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఉండి అతని అదీనంలోని ఆస్తి విషయంలో నేర ఉల్లంఘటనకు పాల్పడటం, నిధులను పక్కదారి పట్టించడం వంటివి దీని కిందకు వస్తాయి. నేరం రుజువైతే ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. హైకోర్టులో నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్! తనపై నమోదైన కేసు కొట్టివేయాలని, అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్, ఇతర నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేటీఆర్ ప్రజా ప్రతినిధి కావడంతో పోర్ట్‌ఫోలియో ప్రకారం జస్టిస్ కె.లక్ష్మణ్ వద్ద ఇది విచారణకు వస్తుంది.అయితే శుక్రవారం ఆయన సెలవులో ఉండటంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ వద్ద లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. -
Telangana: చెక్‌పోస్టుల్లో ఏసీబీ మెరుపు దాడులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంటర్ స్టేట్ చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. లెక్కలు చూపని నగదును ఏసీబీ బృందాలు సీజ్ చేశాయి.నల్గొండ విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,500, భోరజ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎవరైన లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు సూచించారు. -
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
సాక్షి, హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసం, అదే అపార్ట్మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, విశాఖపట్నంలోని బంధువులకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.సోదాల్లో భాగంగా ఉమామహేశ్వర ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. బంగారు ఆభరణాలు, సిల్వర్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ల్యాండ్ డాక్యుమెంట్లు సైతం పట్టుబడుతున్నాయి. ఉమామహేశ్వర్ రావు.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఓ పోలీస్ అధికారితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తన మామ ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్‌లో పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.కాగా అశోక్ నగర్లో సోదాలు జరిగే ప్రాంతానికి ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర చేరుకున్నారు. ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంటితో పాటు 7చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, తనిఖీలు పూర్తయిన తర్వాత మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
శివ బాలకృష్ణ కేసులో మరో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయలను నగదును సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తోంది. పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదీ చదవండి: తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు! -
HMDA భూముల వేలం ఆపేసిన సర్కార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ‘కల్పతరువు’గా భావిస్తూ వస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) భూముల వేలంను ఆపేయాలని నిర్ణయించుకుంది. వేలంపాటలో అక్రమాలు.. అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. హెచ్ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్ఎండీఏలోని అధికారులు సమాచారం చేరవేశారట. తద్వారా ఆ ఫలానా రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చర్యలు తీసుకున్నట్లు తేలింది. ఈ మేరకు.. వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. దీంతో వేలంపాటను ఆపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే.. వేలంపాట సమయంలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా హెచ్ఎండీఏలో తన పరిచయాల ద్వారా శివ బాలకృష్ణ ఈ తతంగాన్ని నడిపించినట్లు గుర్తించారు . భూములు వేలం తో పాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేర్చారు హెచ్ఎండీలో పని చేసిన అధికారులు. అంతేకాదు ధరలను నిర్ణయించడంలోనూ వీళ్లే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అధికారుల పాత్రపైనా ఏసీబీ లోతైన దర్యాప్తు చేపట్టింది. ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాన్వేషణలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల్ని వేలం వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారం అండతో.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు శివబాలకృష్ణ. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏసీబీకి అతను ఆస్తులు కూడబెట్టిన తీరు ఏసీబీని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇంట్లోవాళ్లు, బంధువులు, ఆఖరికి పనివాళ్ల పేరిట మీద కూడా బినామీ ఆస్తుల్ని కూడబెట్టాడతను. దీంతో బినామీలను అరెస్ట్ చేసి ఈ పాటికే విచారణ చేపట్టిన ఏసీబీ.. ఇవాళో, రేపో కీలక అరెస్టులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
డ్రైవర్‌నూ వదలని శివబాలకృష్ణ!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదిలా ఉంటే.. ఇప్పటికే శివ బాలకృష్ణ బినామీలకు నోటీసులు జారీ చేశారు. భరత్, భరణి, ప్రమోద్ కుమార్‌లతో పాటు సోదరుడు శివ నవీన్‌కుమార్, స్నేహితుడు సత్యనారాయణలను ఇవాళ ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. శివ బాలకృష్ణ దగ్గర పీఏగా పని చేసిన భరణి.. కంప్యూటర్ ఆపరేటర్గానూ పని చేశాడు. అదే సమయంలో ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లే అవుట్ బిల్డింగ్‌లకు అనుమతులు మంజూరు చేశాడు. మరో బినామీ అయిన ప్రమోద్‌కు మీనాక్షి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సోదరుడు నవీన్‌కుమార్‌తో పాటు స్నేహితుడు సత్యనారాయణను సైతం ఏసీబీ విచారిస్తోంది. -
రాచులూరు గ్రామపంచాయితీలో ఏసీబీ తనిఖీలు
-
విధుల్లో ఉన్నప్పుడు రూ.1000 చేతిలో ఉంచుకోవచ్చు
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమ చేతిలో ఉంచుకునే మొత్తాన్ని ప్రభుత్వం రూ.1000కి పెంచింది. గతంలో ఇది రూ.500గా ఉండేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. జిల్లాలు, హెచ్వోడీలు, రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమ దగ్గర రూ.500, పర్యటనలో ఉన్నప్పుడు రూ.10 వేలు ఉంచుకోవచ్చని గతంలో నిబంధన ఉండేది. ఏసీబీ దీన్ని సమీక్షించి చేతిలో ఉంచుకునే మొత్తాన్ని రూ.1000కి పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్స్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదని తెలిపింది. అయినా ఆ మొత్తాన్ని కొద్దిగా పెంచి రూ.1000కి పరిమితం చేయాలని సూచించింది. దీనికి సాధారణ పరిపాలన శాఖ ఆమోదం తెలిపి జీవో ఇచ్చింది. చదవండి: (Ashwini Vaishnaw: ఈ గ్రామాల్లో 4జినే లేదు!) -
ఆప్ ఎమ్మెల్యే, సహచరుల ఇళ్లపై ఎసీబీ దాడులు.. భారీగా నగదు, ఆయుధాలు స్వాధీనం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని సహచరులకు చెందిన పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు విభాగం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం దాడులు నిర్వహించింది. 2020లో ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి రెండేళ్లనాటి అవినీతి కేసులో ఓక్లా నియోజకవర్గ ఎమ్మెల్యే అనమతుల్లా ఖాన్‌ను ఏసీబీ శుక్రవారం ప్రశ్నించింది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని వ్యాపార భాగస్వామి హమీద్ అలీఖాన్ మసూద్ ఉస్మాన్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎమ్మెల్యే సహచరుడి నుంచి అక్రమంగా కలిగి ఉన్న ఓ పిస్తోల్, బుల్లెట్లు, 12 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆప్ కార్యకర్త, అమానతుల్లా ఖాన్‌కు సన్నిహితుడు అయిన కౌసర్ ఇమామ్ సిద్ధిఖీ వద్ద నుంచి రూ. 12 లక్షల రూపాయల నగదుతో పాటు ఆయుధం, కొన్ని కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Delhi Liquor Scam: 18 కంపెనీలతోపాటు 12 మందికి ఈడీ నోటీసులు -
ఏలూరులో ఏసీబీ సోదాలు.. టౌన్ ప్లానింగ్ లో రికార్డుల తనిఖీ
ఏలూరు టౌన్: ఏలూరు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఏలూరులో భవన నిర్మాణాలకు అనుమతులు, అపార్టుమెంట్లలో అనుమతులకు విరుద్ధంగా పెంట్‌హౌస్‌ల నిర్మాణం, ప్లాన్ల అనుమతులకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలు సాగుతున్నాయనే ఫిర్యాదులతో ఏసీబీ రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల కార్యాలయాల్లోని టౌన్‌ప్లానింగ్ విభాగాలను గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూ రు జిల్లా ఏసీబీ డీఎస్పీ పీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు ఎన్వీ భాస్కరరావు, కె.నాగేంద్రప్రసాద్, సిబ్బంది రికార్డులు తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి గత కొన్నేళ్లుగా ఉన్న రికార్డులన్నీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాయంత్రం 8.30 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. శుక్రవారం కూడా సోదాలు ఉంటాయని డీఎస్పీ స్పష్టం చేశారు. భవన నిర్మాణ అనుమతుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా అవకతవకలు జరిగినట్టు తనిఖీల్లో గుర్తిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని, అవినీతి, అవకతవకలు చోటుచేసుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు చేపట్టామని, ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. -
గులాబీ రంగునీళ్లు బాటిలే మెయిన్ ఎవిడెన్స్.. దీని వెనుక కథ తెలుసా?
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): అవినీతి నిరోధక శాఖ(యాంటీ కరప్షన్ బ్యూరో) పలు ఆకస్మిక దాడుల్లో లంచావతారాలను పట్టుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయా అధికారులు లంచాలు తీసుకునే క్రమంలో ముందస్తు పథకం ప్రకారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అయితే ఇలా అవినీతిపరులను పట్టుకున్నప్పుడు కామన్‌గా కనిపించే ఒక ఇమేజ్ ఎప్పుడైనా గుర్తించారా.? అదే కరెన్సీ నోట్లపై గులాబీ రంగు నీళ్ల బాటిళ్లు ఉంచే ఫొటో. అయితే దీని వెనుక కథ ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయతనించారా? చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే? నిజానికి ఈ రంగు నీళ్ల బాటిలే ఆ నేరంలో ప్రధాన సాక్షమని మీకు తెలుసా.? అయితే రండి తెలుసుకుందాం. లంచం డిమాండ్‌తో విసుగుపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించినప్పుడు ఆయనకు ఇవ్వబోయే కరెన్సీ నోట్లకు ఏసీబీ అధికారులు ముందుగా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ నోట్లపై ఫినాప్తలీన్ అనే తెల్లని రసాయన పొడిని ఆ నోట్లపై చల్లి బాధితుడి చేత అవినీతి అధికారికి ఇప్పిస్తారు. బాధితుడి నుంచి అధికారి ఆ నోట్లు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. లంచగొండి అధికారి తీసుకున్న ఆ నోట్లను గుర్తించి వాటిని తొలుత ఆ అధికారి ఎదుటే చేతులతో తాకుతారు. అనంతరం చేతులను సోడియం కార్బోనేట్‌తో ఓ బౌల్లో కడిగినప్పుడు రసాయన చర్య జరిగి నీళ్లు గులాబీ రంగులోకి మారతాయి. దీంతో ఆ అధికారి లంచం తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారించడంతో పాటు ఈ ద్రావణాన్ని బాటిళ్లలో సేకరించి నోట్లపై ప్రదర్శిస్తారు. ఆ అవినీతి ఘటనలో ఆ బాటిళ్లలో ద్రావణాన్ని ప్రధాన సాక్షంగా తీసుకుంటారు. -
కర్ణాటకలో ఏసీబీ అధికారుల సంచలనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ అధికారులపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఏక కాలంలో 80 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో 300 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. చదవండి: (తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్) -
‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే?
సాక్షి, అమరావతి: అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నామని.. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. చదవండి: Fact Check: 'ఆ పథకాల రద్దు అవాస్తవం.. ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదు' సీఎం ఇంకా ఏమన్నారంటే: ♦చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపాం ♦ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటే. ♦తమ చేతుల్లోని ఫోన్లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్ చేసి... బటన్ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది ♦అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నాం ♦ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది ♦ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉంది ♦అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది ♦మన స్థాయిలో అనుకుంటే.. 50శాతం అవినీతి అంతం అవుతుంది ♦మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది ♦అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యం: ♦ఎవరైనా పట్టుబడితే.. కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి: యాప్ ఎలా పనిచేస్తుందంటే...: ♦పౌరులు నేరుగా యాప్‌ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ♦గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ ♦యాప్ డౌన్లోడ్ చేయగానే మొబైల్ నంబర్‌కు ఓటీపీ ♦ఓటీపీ రిజిస్టర్ చేయగానే వినియోగానికి యాప్ సిద్ధం ♦యాప్‌లో 2 కీలక ఫీచర్లు ♦యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌రిపోర్ట్ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ♦లాడ్జ్ కంప్లైంట్ ఫీచర్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ♦ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు ♦త్వరలో ఐఓఎస్ వెర్షన్లోనూ యాప్‌ను సిద్ధంచేస్తున్న ఏసీబీ -
కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కాగా సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డికి సంబంధించిన నివాసంలో సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి నివాసంలో భారీగా ఆస్తులు, నగలను అధికారులు గుర్తించారు. ఇంట్లో 60 తులాల బంగారం, బ్యాంక్ లాకర్స్‌లో 129.2 తులాల బంగారం, నాలుగు ఓపెన్ ప్లాట్స్, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2,31,63,600 అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్‌లో.. -
ఏసీబీ వలలో శేరిలింగంపల్లి టీపీవో
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేరిలింగం పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మెతుకు నర్సింహ రాములుపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. గురువారం ఈ కేసులో వ్యవహారంలో ముసారాంబాగ్‌తో పాటు ఆర్కేపురం, మరో రెండు చోట్ల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందాలు సోదాలు నిర్వహించాయి. టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న నర్సింహ రాములపై ఏసీబీ అనేక ఫిర్యాదులు రావడంతో ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆయన కుటుంబీకులకు సంబంధించి వారిపై నిఘా పెట్టిన ఏసీబీ కీలక డాక్యుమెంట్లను సేకరించింది. దీనితో ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నట్లు ధృవీకరించుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలిపింది. నివాసాలు, కార్యాలయాల్లో పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ పేరిట కొనుగోలు చేసిన భూములు, బంగారం, నగదును స్వాధీ నం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను శుక్రవారం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చాంబర్ సీజ్.. శేరిలింగంపల్లి సర్కిల్ టీపీవో ఎం.నర్సింహ రాములు చాంబర్‌ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. గురువారం ఉదయం బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి టీపీవో చాంబర్ ఎక్కడ అని అడిగి తెలుసుకున్నాడు. అప్పటికే తెరిచి ఉన్న చాంబర్‌ను డోర్ లాక్ వేసి సీజ్ చేశారు. చాంబర్లో ముఖ్యమైన ఫైళ్లు ఉన్నాయని, ఎవరు తెరవరాదని సెక్యూరిటీతో చెప్పి వెళ్లారు. లాక్‌పై వేసిన సీల్‌పై సీబీ డీఎస్పీ డాక్టర్ శ్రీనివాస్ పేరుతో పాటు ఫోన్ నెంబర్ రాసి వెళ్లారు. కాగా సిటీ ప్లానర్ నర్సింహ రాములు షిరిడీ యాత్రలో ఉన్నట్లు సమాచారం. ఉలిక్కిపడ్డ అధికారులు ఏసీబీ అధికారులు సిటీ ప్లానర్ చాంబర్‌ను సీజ్ చేయడంతో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఆందోళనకు లోనయ్యారు. రెండో అంతస్తులో ఉన్న జోనల్ టౌన్ ప్లానింగ్‌లో పనిచేసే ఏసీపీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పత్తా లేకుండా పోయారు. అకౌంట్స్ సెక్షన్‌తో పాటు మొదటి అంతస్తులో ఉన్న శేరిలింగంపల్లి సర్కిల్–21 టౌన్ ప్లానింగ్ విభాగంలోను ఎవరు ఆఫీస్‌కు రాలేదు. వెస్ట్‌జోనల్ కమిషనర్ ప్రియాంక అల సమీక్షా సమావేశాన్ని చందానగర్ సర్కిల్లో నిర్వహించడం గమనార్హం. అటు మూసారాంబాగ్‌లోని నివాసంలో మరో డీఎస్పీ ఫయాజ్ సయ్యద్ నేతృత్వంలో అధికారుల బృందం సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది. -
చెత్తబుట్టలో నోట్ల కట్టలు, నగలు.. అధికారి ఇంట్లో బాగోతం
సాక్షి, బెంగళూరు: అవినీతి అక్రమాలు, ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై బుధవారం ఏసీబీ పంజా విసిరింది. రాష్ట్ర వ్యాప్తంగా 75కు పైగా చోట్ల సోదాలు జరిగాయి. సుమారు 18 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేశారు. కోట్లాది రూపాయల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. బెంగళూరులో ముగ్గురు అధికారుల ఇళ్లపై ఏసీబీ తనిఖీలు జరిపింది. రాయచూరు ఏఈఈ అశోక్ రెడ్డి పాటిల్ ఇంటి చెత్త బుట్టలో రూ. 7 లక్షల నగదు, 600 గ్రాముల వెండి, 418 గ్రాముల బంగారు ఆభరణాలు దొరకడం గమనార్హం. దొంగలు, ఏసీబీ చూపు పడకుండా ఏఈఈ ఇలా చెత్తబుట్టలో దాచుకున్నట్లు తెలిపింది. బాగలకోటె రేంజ్ ఫారెస్ట్ అధికారి ఇంట్లో 3 కేజీల శ్రీగంధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరి ఇళ్లలో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు, వెండి పట్టుబడ్డాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చదవండి: మూడు పాములతో యువకుడి స్టంట్.. చివరకు ఏమైందో చూడండి.. -
ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్…
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీగా అంజనీ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంజనీ కుమార్‌కు ప్రస్తుత డీజీ గోవింగ్ సింగ్ బాధ్యతలు అప్పజెప్పి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఏసీబీ డీజీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏసీబీలో పని చేసే ప్రతి ఒక్క అధికారి నిబద్ధతతో పని చేయాలని సూచించారు. అవినీతి నిర్మూలనకు కృషిచేస్తానని పేర్కొన్నారు. తనను ఏసీబీ డీజీగా నియమించేందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ కమిషనర్‌గా మూడేళ్లు పనిచేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో హైదరాబాద్ సీపీగా విధులు నిర్వహించాను. అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంది. నాతో పాటు కలిసి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పనిచేసిన అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు. నేను సీపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాం. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లింది. హైదరాబాదులో ఒక మంచి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని ఇన్నాళ్ల పాటు కంటిన్యూ చేశాను. ఏసీబీ డీజీగా నియమించి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. శాఖాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం* అని అంజనీ కుమార్ ప్రకటించారు. చదవండి: తీన్మార్ మల్లన్నపై బీజేపీ అధిష్టానం సీరియస్! -
అవినీతి కేసులో డీఎస్పీ జగన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని నుంచి లంచం డిమాండ్ చేసి, కొంత మొత్తం తీసుకున్న కేసులో డీఎస్పీ గ్యార జగన్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు బుధవారం ప్రకటించారు. ఈయనతో పాటు హెచ్ఎండీఏలో ఔట్ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బి.రామును సైతం కటకటాల్లోకి పంపారు. కొన్ని రోజుల క్రితం వరకు హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీఎస్పీగా పని చేసిన జగన్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్నారు. ఈ లంచం వ్యవహారం అప్పట్లోనే చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన బొమ్మిన కోటేశ్వరరావు ప్రజాపతి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సంస్థ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ విషయంలో చూసీ చూడనట్లు పోవడంతో పాటు సహకరించడానికి జగన్ రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరారు. కోటేశ్వరరావు ఈ మొత్తాన్ని జూన్ 11న రాము ద్వారా జగన్‌కు ఇచ్చారు. మిగిలిన మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా జగన్ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. తన వద్ద ఉన్న ఆధారాలతో పాటు జగన్, రాములతో జరిగిన ఫోన్ సంభాషణల వివరాలనూ అందించాడు. చదవండి: రైళ్లలో పూజలు చేసుకోవచ్చు కానీ.. దీంతో జగన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఏసీబీ అధికారులు రెండు నెలల క్రితమే వలపన్నారు. ఇది కార్యాచరణలోకి వచ్చేసరికి జగన్ హెచ్ఎండీఏ నుంచి బదిలీ అయ్యారు. బాధితుడు అందించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం హబ్సిగూడలోని జగన్ ఇంటిపై దాడి చేసి అతడిని, అనంతరం సెక్యూరిటీ గార్డు రామును అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. నిందితులను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. చదవండి: గాడిద పాలకు మంచి డిమాండ్.. కప్పు పాల ధర ఎంతంటే.. -
తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు ఇకపై కేసు విచారణను ఏసీబీ చేతికి అప్పగించనున్నారు. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. క్రిమినల్ చర్యలతో పాటు అధికార దుర్వినియోగానికి నిందితులు పాల్పడినట్లు గుర్తించారు. చదవండి: నిధుల మాయం వెనుక మాఫియా! ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సీసీఎస్ విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక అవకతవకల్లో ప్రభుత్వ సిబ్బంది పాత్ర ఉంటే.. కేసు దర్యాప్తులో వారిని ఏసీబీ కోర్టులోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అకాడమీకి సంబంధించి నమోదైన మూడు ఎఫ్ఐఆర్లను సీసీఎస్ అధికారులు ఏసీబీకి పంపించారు. అవినీతి నివారణ చట్టం(పీసీ) కింద ఏసీబీ విచారణ చేయనుంది. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నందున కేసు పూర్తిస్థాయి దర్యాప్తు సీసీఎస్ చేస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న నిందితులకు సంబంధించి మాత్రమే ఏసీబీ దర్యాప్తు చేస్తుందని సీసీఎస్ జేసీపీ మహంతి వెల్లడించారు. చదవండి: దొరక్కూడదని ధ్వంసం చేశాడు కాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీ నిధులు రూ.64.5 కోట్లు గోల్మాల్ అవ్వడం తెలిసిందే. ప్రధాన నిందితుడు వెంకట సాయి కుమార్ సహా 18మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ ఏఓ రమేష్‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ బ్యాంక్ అధికారుల పాత్రపై సైతం ఏసీబీ విచారణ జరపనుంది. -
ఏసీబీ దాడులు: అదుపులో తణుకు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్
సాక్షి, తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అదనంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు పలు అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబు వద్ద లెక్కలు చూపని నగదు రూ.54,100 స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల వసూలుకు ప్రైవేటుగా కొందరు వ్యక్తులను నియమించుకున్నట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేసి సంబంధిత అధికారులకు నివేదిస్తామన్నారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. రాత్రంతా తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, కె.నాగేంద్రప్రసాద్, కె.ఏసుబాబు పాల్గొన్నారు. -
ఓటుకు నోటు కేసు: వాంగ్మూలాలు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోట్లు కేసు విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం ఏసీబీ కోర్టులో సెబాస్టియన్, ఉదయసింహ , స్టీఫెన్ డ్రైవర్ శంకర్, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. వారి వాంగ్మూలాలను నమోదు ఏసీబీ న్యాయస్థానం నమోదు చేసుకుంది. ఈ కేసుపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
1.20 లక్షల ఐఫోన్, 20 వేల కాస్మోటిక్స్, పొట్టేళ్లు.. ఏంటి సార్ ఇది?
►జూన్ 17న వరకట్న వేధింపుల కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి బెజ్జారపు రాజేశ్ అనే వ్యక్తి నుంచి జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ, అతని వాహన డ్రైవర్ రవి రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నారు. చివరకు లంచంగా తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ►జూన్ 27న జగిత్యాల జిల్లా కథలాపూర్ ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఓ ఇసుక ట్రాక్టర్‌ను వదిలిపెట్టేందుకు రూ.10 వేలు అడుగగా బాధితుడు ఉప్పరపల్లి నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైటర్ రమేశ్ తీసుకుంటుండగా ఏసీబీ వారు పట్టుకొనికేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ►జూన్ 25న గంగాధర పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ చంద్రారెడ్డి ఒక కేసు విషయంలో వారికి అనుకూలంగా వ్యవహరించి రాజమల్లు అనే వ్యక్తి నుండి రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా నడవాలన్నా.. భూ తగాదాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు సెటిల్ కావాలన్నా.. సాధారణంగా సంబంధిత స్టేషన్లో ‘ముట్ట జెప్పడం’ ఆనవాయితీ. ఎస్ఐ, సీఐ లకు వెళ్లే మామూళ్లను బట్టి కేసుల పురోగతి ఉంటుంది. అయితే.. ఇటీవల ప్రజల్లో వచ్చిన చైతన్యంతో అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారులు సైతం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుపడుతున్నారు. గత నెలలో ఉమ్మడి జిల్లాలో ఏకంగా ఐద్దరు ఎస్సైలు,ఒక ఏఎస్సై ఏసీబీకి చిక్కారు. అయితే.. ఏసీబీ వలలో చిక్కుతున్న ఎస్ఐ, సీఐలు నేరమంతా తమపైనే వేసుకొని పై అధికారులను కేసుల నుంచి తప్పించి రక్షిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీస్స్టేషన్లలో జరిగే దందాలో ఒకరిద్దరు డివిజన్ స్థాయి అధికారుల ప్రమేయం అధికంగా ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఎస్ఐ, సీఐ స్థాయి అధికా రులు కొందరు డివిజన్ స్థాయి అధికారులకు కేసులు, స్టేషన్లను బట్టి మామూళ్లు పంపిస్తున్నా, అవేవీ రికార్డుల్లో ఉండడం లేదు. జిల్లా స్థాయిలో ఎస్పీలు, కమిషనర్లకు ఆయా డివిజన్ అధికారుల దందాల గురించి తెలిసినా, వాళ్లకున్న రాజకీయ అండదండల కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. ఉన్నతస్థాయి అధికారులకు డివిజన్ అధికారుల తీరును నివేదించి చేతులు దులుపుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి తీరు ఇప్పుడు పోలీసుల్లో చర్చనీయాంశమైంది. కేసు నుంచి తప్పించేందుకు రూ.1.20 లక్షల ఐఫోన్ ఉమ్మడి జిల్లాలోని ఓ పోలీసు అధికారి ఏడాది క్రితం ఓ కేసులో నిందితున్ని తప్పించేందుకు రూ.1.20 లక్షల విలువైన ఐఫోన్ కొనుగోలు చేయించుకుని చివరికి నిందితున్ని రిమాండ్‌కు తరలించిన ఘటన పోలీస్ వర్గాల్లో వైరలైంది. ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటైన కొత్త జిల్లాలోని ఓ గ్రామంలో ఏడాది క్రితం ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహిళ వద్ద మధ్యవర్తి సహాయంతో 30 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలు చేసిన వ్యక్తి వద్ద పూర్తిస్థాయిలో డబ్బులు లేకపోవడంతో ఆ భూమిని బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి కమీషన్ రాకపోవడంతో వారి మధ్య గొడవ జరిగింది. ►ఈ కేసు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం, చివరికి ఉన్నతాధికారి వద్దకు విచారణకు వెళ్లడంతో బాధితుడు కేసు మాఫీ కోసం రూ.1.20 లక్షల విలువైన ఐఫోన్ సమర్పించుకోవలసి వచ్చింది. అయినా.. చట్టం పేరుతో బాధితున్ని పోలీసు అధికారి రిమాండ్‌కు తరలించారు. దీంతో సదరు బాధితుడు పోలీసు అధికారిపై ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేశాడు. ►సదరు పోలీసు అధికారి తనకు సన్నిహితుడైన ఓ వ్యక్తి కూతురు వివాహానికి ఆ పరిధిలో పనిచేసే ఎస్ఐ 2 క్వింటాళ్ల బియ్యం, 2 గొర్రె పొట్టేళ్లు పంపించాలని ఆదేశించారు. దీంతో అక్కడి ఎస్సై కూడా అధికారి మాట ప్రకారం బియ్యంతో పాటు గొర్రె పొట్టేళ్లను అప్పగించాడు. ►కరీంనగర్ నుంచి కొత్త జిల్లా కేంద్రానికి వెళ్లే జాతీయ రహదారి పక్కన బుగ్గారంకు చెందిన ఓ వ్యక్తి 20 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. భూ విక్రయదారునికి, కొనుగోలుదారునికి రోడ్డు విస్తరణపై విభేదాలు రావడంతో పోలీ స్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.సమస్య పరిష్కారం కోసం పోలీసు అధికారి రూ.లక్ష తీసుకొని విక్రయదారునికే వత్తాసు పలికినట్లు ఆరోపణ. ►నెల రోజుల క్రితం రూ.20 వేల విలువ గల కాస్మోటిక్స్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేసి, ఆ డబ్బును తన పరిధిలో పనిచేస్తున్న ఓ ఎస్ఐ ద్వారా చెల్లించినట్లు సమాచారం. ►తన కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్తే తన కింద పనిచేసే ఎస్ఐల ద్వారా అద్దె కారు ఎంగేజ్ చేయిస్తున్నట్లు పోలీసులు చెపుతున్నారు. ►ప్రభుత్వం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వాహనం నిర్వహణకు ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు 110 లీటర్లకు బిల్లులు చెల్లిస్తోంది. ఇందులో ప్రతినెలా 50 లీటర్ల డీజిల్ పోలీసు అధికారికే అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీనియర్ మంత్రితో విభేదాలు.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించినట్లు ఆరోపణ. ఈ మేరకు మంత్రి అతనిపై కొంత కాలంగా ఆగ్రహంతో ఉన్నారు. దీంతోపాటు జిల్లా కేంద్రంలోని ఓ భూ సెటిల్మెంట్లో కూడా అధికారి పాత్ర ఉందని మంత్రి ఆగ్రహంతో ఉన్నారు. సదరు అధికారిని కలిసేందుకు కూడా మంత్రి సుముఖత చూపలేదని సమాచారం. దీంతో అధికారి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు రాష్ట్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పాల్వంచ ఎంపీడీఓ
సాక్షి, పాల్వంచ : ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటూ శుక్రవారం పాల్వంచ ఎంపీడీఓ పి.ఆల్బర్ట్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. ఏసీబీ వరంగల్, ఖమ్మం డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..పాండురంగాపురం గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డు నిర్మించిన కాంట్రాక్టర్ ఆడెపు రామలింగయ్యకు బిల్లు మంజూరు కావాల్సి ఉండగా..ఎంపీడీఓ ఆల్బర్ట్ రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. గతంలోనే కొంత డబ్బు ఇచ్చానని, అయినా ఇంకా అడుగుతున్నాడని విసిగిన సదరు కాంట్రాక్టర్ ఈనెల 9వ తేదీన ఖమ్మం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీఓకు డబ్బులు ముట్టజెప్పాడు. అప్పటికే నిఘావేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆయన గదిలోకి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, ఎంపీడీఓపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, క్రాంతికుమార్‌లు పాల్గొన్నారు. గతంలో ఇద్దరు.. రెండు సంవత్సరాల క్రితం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో రూ.7,000లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గత మార్చి 20వ తేదీన పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ మోహన్ చక్రవర్తి పాండురంగాపురం గ్రామానికి చెందిన అరుణ్‌సాయికి ఓ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.3,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఎంపీడీఓనే రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. పాల్వంచలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
కోట్లకు పడగెత్తిన పంచాయతీ కార్యదర్శి.. ఆస్తి ఎంతో తెలిస్తే షాక్!
విశాఖ క్రైం: శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి, రణస్థలం మండలంలో గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆగూరు వెంకటరావు ఇంటిపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు అతనితో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీకాకుళం, విజయనగరంతో పాటు విశాఖలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.35,67,100 నగదు, రూ.17,65,373 విలువైన 669 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన భూముల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా అరసాడ గ్రామానికి చెందిన ఆగూరు వెంకటరావు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. అక్కడ నుంచి ప్రస్తుతం గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శిగానే కాకుండా ఇన్చార్జి ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు విజయనగరం, రాజాం, నెల్లిమర్ల ప్రాంతాల్లో ఉన్న వెంకటరావుతో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖలోని రామా టాకీస్ డౌన్లోని వెజిటబుల్ మార్కెట్ దరి సువర్ణ రెసిడెన్సీలో రెండో అంతస్తులో వెంకటరావు నివాసం ఉంటున్న 202 ప్లాట్‌లో అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో అక్రమాస్తుల విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. అయితే అతని ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ ధర సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ భాస్కర్‌రావు, హరి, మహేష్, ఎస్ఐ చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆగూరు వెంకటరావును అరెస్ట్ చేసినట్టు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపారు. అతన్ని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలిస్తామన్నారు. చదవండి: ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మానవత్వం చూపించిన వీఆర్వో -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్: బాంబులు పేల్చి సంబరాలు
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లా వేంసూర్ తహశీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ రైతు నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్‌లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. సత్తుపల్లికు చెందిన తోట సాంబశివరావు అనే రైతు తనకు వేంసూర్ మండలంలో ఉన్న 25 ఎకరాల వ్యవసాయ భూమికి సంభందించి సర్వే నిమిత్తం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సర్వే చేయటం కోసం వేంసూర్ సర్వేయర్ గుర్వేశ్, డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్‌లు దరఖాస్తుదారుడిని రెండు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. లక్షన్నరకు బేరం కుదరటంతో నేడు తహశీల్దార్ కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తోట సత్యనారాయణ అనే రైతు పిర్యాదు మేరకు తహశీల్దార్ కార్యాలయంపై దాడి చేసిన అధికారులు లంచం తీసుకుంటున్న ఉపేందర్, సర్వేయర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ సహా సర్వేయర్ అడ్డంగా బుక్కయ్యారని తెలియడంతో పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. అవినీతి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: లంచం అడిగే.. అడ్డంగా దొరికిపాయే.. జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్ -
డ్రగ్ కంట్రోల్ డీడీ నివాసంపై ఏసీబీ దాడులు
సాక్షి, విజయవాడ : డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివ సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో నాలుగు చోట్ల అధికారులు సోదాలు జరిపారు. వారి తనిఖీల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శివ సత్యనారాయణ భార్య, కుమారుడి పేరు మీద మూడు భవనాలు, హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్, కారు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ డీవీవీ ప్రతాప్ నారాయణ తెలిపారు. అలాగే కృష్ణాజిల్లా కంచికచర్ల, జక్కంపూడిలో 800 గజాల స్థలం, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 ఎకరాలు భూమితో పాటు బ్యాంక్‌లో రూ.50 లక్షలు నగదు, రూ.15 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా రెండు బ్యాంకుల్లో లాకర్లను తనిఖీ చేయాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సోదాలు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
140 ఎకరాల భూమిపై ధర్మారెడ్డి కన్ను
సాక్షి, హైదరాబాద్: కీసర నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటూ దొరకడం జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు స్థానికులు, రియల్టర్లతో కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. కీసర తహసీల్దార్‌గా ఉన్న సమయంలో నాగరాజు రాంపల్లికి చెందిన కందాడి ధర్మారెడ్డి పేరిట, తన స్నేహితులు, బంధువుల పేరిట రెండెకరాలకుపైగా భూమిని దక్కించుకున్నాడు. ఈ భూములతోపాటు మొత్తం 24 ఎకరాల భూములకు నకిలీపత్రాల సాయంతో పాసుబుక్కులు జారీ చేసిన నాగరాజును రెండోసారి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టిన ఏసీబీకి నాగరాజు అక్రమాలకు సంబంధించిన అనేక ఆధారాలు లభిస్తున్నాయని తెలిసింది. అనేక భూ సెటిల్మెంట్లు.. స్థానికంగా పలుకుబడి కలిగిన కందాడి ధర్మారెడ్డితో కలిసి నాగరాజు అనేక భూ సెటిల్మెంట్లు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. గ్రామపరిధిలో ఉన్న 140 ఎకరాలను ధర్మారెడ్డి కాజేద్దామని ప్రయత్నించిన సమయంలోనూ నాగరాజు సహాయసహకారాలు అందించినట్లు సమాచారం. సర్వే నంబరు 621, 639లలో 140 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. దీనిపై కన్నేసిన ధర్మారెడ్డి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని 24 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. 1996లో ఆ భూమి తనదే అంటూ ప్రొటెక్ట్ టెనెంట్ (పీటీ) పత్రాలను సృష్టించాడు. దీనిపై సుమారు 20 మంది స్థానికులు అభ్యంతరం తెలిపారు. 1958లో తాము కిషన్‌సేఠ్ అనే వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేశానంటూ నకిలీపత్రాలను అప్పటి ఎమ్మార్వోకు సమర్పించారు. అయితే, అప్పుడు తన పాచిక పారలేదు. కీసరకు నాగరాజు తహసీల్దార్‌గా రాగానే మళ్లీ పైరవీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ విషయాలన్నీ ప్రస్తుత ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయని తెలిసింది. ఇటీవల 24 ఎకరాలకు అక్రమంగా పాసుబుక్కులు జారీ చేయడంపైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో నాగరాజు, ధర్మారెడ్డితోపాటు అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్, రియల్టర్లు వెంకటేశ్వర్రావు, జగదీశ్వరరావు, భాస్కర్‌రావులను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ 24 ఎకరాల భూమి విలువ రూ.48 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14న పట్టుబడిన సమయంలోనూ దాదాపు 53 ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. -
కీసర నాగరాజా మజాకా!
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కె.ధర్మారెడ్డి అతని మనుషులకు అక్రమంగా ధారాదత్తం చేశాడన్న ఆరోపణలపై ఇటీవల విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీబీ డీజీని ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినిæయోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామపరిధిలో సర్వేనం 621లో కందాడి లక్ష్మమ్మ పేరిట 14 గుంటలు, సర్వే నం.623లో కందాడి బుచ్చిరెడ్డికి 33 గుంటలు, సర్వే నం.625లో కందాడి మీనమ్మ పేరిట 19 గుంటలు, సర్వే నం 633/ఏలో కందాడి ధర్మారెడ్డి పేరిట ఎకరం రెండు గుంటలకు జూలై 9వ తేదీన అప్పటి తహసీల్దార్‌గా ఉన్న నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ సైన్లతో పాసుబుక్కులు జారీ చేశాడు. నాగరాజు మరికొందరితో కలిసి మొత్తంగా 24 ఎకరాల 16 గుంటల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ విషయం కీసర ఆర్డీవో వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నా అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. ఈ భూముల ధర రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో విలువ రూ.48.8 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. -
కోటి 12లక్షల లంచం డిమాండ్ కేసులో విచారణ
-
డిప్యూటీ తహసీల్దార్ నారాయణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, మెదక్ : జిల్లాలోని నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డితోపాటు మరో ముగ్గురు కటకటాలపాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బాగోతాన్ని మరువక ముందే మెదక్ కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న నారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో పనిచేసిన జిన్నారం మండలంలో మృతిచెందిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాపాస్ బుక్కులు సృష్టించడంలో ఆయన పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (రూ.80 కోట్ల భూమికి ఎసరు) అదేవిధంగా.. ఆ సమయంలో అక్కడ వీఆర్వోగా ఉండి.. ఆ తర్వాత మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గిరిధావర్‌గా పని చేసి 2016లో రిటైర్డ్ అయిన జె.వెంకటేశ్వర్రావు హస్తం కూడా ఉన్నట్లు గుర్తించగా.. క్రిమినల్ చర్యలకు సర్కారు ఆదేశించడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి గ్రామంలో సర్వే నంబర్ 181లో అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములు రూ.కోట్ల విలువ చేస్తుండడంతో ఇదివరకే కన్నేసిన ఎక్స్ సర్వీస్మెన్లకు సహకరించి.. భారీగా దండుకునేందుకు అప్పటి మండల రెవెన్యూ శాఖ అధికారులు స్కెచ్ వేశారు. 2013లో దరఖాస్తు రాగా.. అప్పుడు తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత మెదక్ కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న డీటీ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్ఓగా పనిచేసి.. నర్సాపూర్‌లో గిరిధావర్‌గా రిటైర్డ్ అయిన జె.వెంకటేశ్వర్రావు కుట్రకు తెరదీశారు. (అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్) స్థానికంగా పనిచేసి మృతిచెందిన తహసీల్దార్ పేరుతో ఫోర్జరీ సంతకం చేసి నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించారు. నలుగురు ఎక్స్సర్వీస్మెన్లు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున రూ.80 కోట్ల విలువైన 20 ఎకరాలు కట్టబెట్టారు. అసైన్డ్ భూమి కావడంతో ఎన్ఓసీ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో 2019లో సదరు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా.. సంగారెడ్డి కలెక్టర్‌కు అనుమానం వచ్చి విచారణ జరిపించారు. మృతి చెందిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాలు సృష్టించినట్లు విచారణాధికారి నిగ్గు తేల్చడంతో వీరిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ఘటనలో భాగస్వాములైన ముగ్గురిపై బొల్లారం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓతోపాటు మెదక్ కలెక్టరేట్ డీటీపై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీబీ నజర్.. 112 ఎకరాలకు రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ సత్తార్, సర్వే, ల్యాండ్ జూనియర్ అసిస్టెంట్ వసీంతోపాటు ఏసీ బినామీ కోల జీవన్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న వీరిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఖాజీపల్లి భూబాగోతంలో మెదక్ కలెక్టరేట్ డిప్యూటీ తహసీల్దార్ ఉండడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనపై నజర్ వేసినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం.. ఫోర్జరీ.. నకిలీ పట్టాలు సృష్టించి రూ.80 కోట్ల భూమిని కట్టబెట్టిన ఘటనలో ఎనిమిది మంది రెవెన్యూ అధికారులు, నలుగురు ఎక్స్ సర్వీస్మెన్లపై కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో డీటీ నారాయణతోపాటు మిగిలిన వారు తమ అడ్వకేట్ ద్వారా మెదక్ జిల్లా కోర్టులో ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్‌కు అప్లై చేసినట్లు సమాచారం. కాగా, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. సుమారు నెల రోజులుగా విధులకు రావడం లేదని జిల్లా ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా వరుసగా అవినీతి కోణాలు వెలుగు చూడడం రెవెన్యూ వర్గాల్లో అలజడి రేపుతోంది. -
మెదక్ ఏసీబీ కేసులో దర్యాప్తు ముమ్మరం...
సాక్షి, మెదక్ : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు సంబంధించిన కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అయిదుగురు నిందితులను అరెస్టు చేసి వారిని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అయిదుగురు నిందితులను అధికారులు విచారిస్తున్నారు. ఉన్నతాధికారి పాత్రతో పాటు కింది స్థాయి ఉద్యోగుల పాత్రపై నిందితులను నుంచి వివరాలు సేకరిస్తున్నారు. (మరో 'కోటి'గారు దొరికారు!) స్టాంప్ అండ్ రీజిస్టేషన్‌కు రాసిన లేఖతో మాజీ కలెక్టర్ పాత్రపై ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ కలెక్టర్ రిటైర్మెంట్ రోజునే స్టాంప్ అండ్ రీజిస్టేషన్‌కు లేఖ రాయడంతో మాజీ కలెక్టర్ పై అనుమానాలు బలవపడుతున్నాయి. అరెస్ట్ చేసిన అయిదుగురు నిందితులను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. (మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్) -
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నగేష్‌తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణా రెడ్డి, చల్పిచేడు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, సర్వేల్యాండ్ రికార్డ్ జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిందరికీ వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు. భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ నగేస్ పట్టుబడిన విషయం తెలిసిందే. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్) కాగా కోట్ల రూపాయిలు లంచాలు తీసుకుంటున్న నగేష్‌కు ఏసీబీ అధికారులను చూడగానే ముచ్చెమటలు పట్టాయి. ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తనకు 103 డిగ్రీల జ్వరం ఉందని, ఛాతీలో నొప్పి, ఆయాసంగా ఉందంటూ చెప్పడంతో... వైద్యుల పర్యవేక్షణలో నగేష్‌కు ఫీవర్ చెక్ చేయడంతో పాటు మందులు అందిస్తూనే మరోవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని ఆస్పత్రిలో చేర్పించాలంటూ అడిషనల్ కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను కోరారు. (రూ.1.12 కోట్లకు డీల్: ఆడియో సంభాషణ) ఎకరానికి లక్ష చొప్పున ఒప్పందం ఈ కేసుపై ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ‘శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఫిర్యాదుతో సోదాలు చేశాం. మాకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేశాం. 29 ఫిబ్రవరి 2020 న, ఆయనతో పాటు మరో నలుగురు 112 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేయడానికి అమ్మకం ఒప్పందానికి ఎన్వోసీ ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితాలో భూమి ఉన్నందున ఎన్వోసీ కోసం బాధితుడు వెళ్ళాడు. జులై 31న మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌కు రూ.1 కోట్ల 12 లక్షలు మేరకు డీల్ కుదిరింది. ఎకరానికి లక్ష రూపాయిల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట విడతగా ఫిర్యాదుదారుడి నుండి19.5 లక్షలు అడిషనల్ కలెక్టర్ తీసుకున్నారు. ఆగస్ట్ 7 తేదీన ఫిర్యాదుదారుడి నుండి మరోసారి 20.5 లక్షలు లంచం తీసుకున్నారు. మిగిలిన రూ.72 లక్షలకుగాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ కోలా జీవన్ గౌడ్‌కి బాధితుడు బదిలీ చేసినట్టు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం గడ్డం నగేష్ ఫిర్యాదుదారుడి నుండి 8 ఖాళీ చెక్కులను తీసుకున్నాడు. జూలై 31న జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి 5 లక్షలు తీసుకున్నాడు. లక్ష రూపాయిలు ఆర్డీవోకి, మరో లక్ష తహసీల్దార్‌కు వసీం ఇచ్చాడు. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటు పలు భూ డాక్యుమెంట్లు కూడా గుర్తించాం. నగేష్ ఇంట్లో అగ్రిమెంట్ సెల్ డీడ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం’ చేసుకున్నట్లు తెలిపారు. -
రూ.1.12 కోట్లకు డీల్: ఆడియో సంభాషణ
సాక్షి, హైదరాబాద్ : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. అడిషనల్ కలెక్టర్ సహా పలువురు రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఏసీబీ దర్యాప్తులో అడిషనల్ కలెక్టర్ మొదలు వీఆర్వో స్థాయి వరకూ ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భూ వివాదానికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.40లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆడియోలో బాధితుడిని నగేష్ లంచం డిమాండ్ చేయడమే కాకుండా ఎంత అడిగానో తనకు క్లారిటీ ఉందని చెప్పడం గమనార్హం. మరోవైపు ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున నగలు, నగదును అధికారులు గుర్తించారు. సోదాలు అనంతరం హైదరాబాద్ ఏసీబి ప్రధాన కార్యాలయంకు తరలించనున్నారు. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్) బాధితుడితో అడిషనల్ కలెక్టర్ ఆడియో సంభాషణ ►మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్ గా, మీకు క్లారిటీ ఉందా ►మీకు క్లారిటీ ఉందా లేదా అనేది కూడా నాకు అర్థం అవ్వడం లేదు - అడిషనల్ కలెక్టర్ ►నాకు క్లారిటీ ఉంది సర్ - బాధితుడు ►మొదటగా 25 లక్షలు ఇస్తాం అన్నారు , ఆ తరువాత 19.5 ఇచ్చారు - అడిషనల్ కలెక్టర్ ►మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు - అడిషనల్ కలెక్టర్ ►వసీం 5 లక్షలు ఇచ్చాను , మొదటగా రెండు లక్షలు , ఆ తరువాత మూడు లక్షలు ఇచ్చాను - బాధితుడు ►నేను రెండు లక్షలు చెప్పాను కదా, నాకు చెప్పాలి కదా - అడిషనల్ కలెక్టర్ ►మీకు వసీం కాల్ చేశాను అని చెప్పాడు , అందుకే ఇచ్చాను సర్ - బాధితుడు ►ఎవరికీ ఏమి ఇచ్చిన ప్రతిదీ నాకు చెప్పాలి కదా - అడిషనల్ కలెక్టర్ ►ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు - అడిషనల్ కలెక్టర్ ►ఆడియో క్లిప్‌లో డబ్బు లావాదేవీల చర్చతో అడ్డంగా బుక్కైన అధికారి -
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. (మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి) అడిషనల్ కలెక్టర్ నగేష్.. ఒక ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 15 రోజులుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన మూర్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా నగేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు. బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొత్తం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది. (రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా) అయితే, నర్సాపూర్ మండలం చిప్పలకుర్తిలో 113 ఎకరాల ల్యాండ్ ఎన్వోసీ కోసం.. ఏకంగా అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎకరాకు లక్ష చొప్పున రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదిరింది. రూ.40 లక్షల నగదుతో పాటు తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్‌కు ఒప్పందం కుదిరింది. ఇక, ఏసీబీ తనిఖీల్లో నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో బండారు అరుణా రెడ్డి, ఎమ్మార్వో సత్తార్, విఆర్వో, విఆర్ఏ,జూనియర్ అసిస్టెంట్ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించారు.ఇతర రెవిన్యూ సిబ్బంది నివాసాలపై సోదాలు జరుపుతున్నారు. చౌదరిగూడా ఆర్డీవో నివాసం, కొంపల్లి జేసీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నగలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. (పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు) -
నాగరాజు లాకర్లో 1.5 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్‌లోని ఓ బ్యాంక్ లాకర్ నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) మరోవైపు నాగరాజు అవినీతిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గత నెల 14న రూ.కోటి పది లక్షల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం జాతీయస్థాయిలో కలకలం రేపింది. అతడి బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పుడు వారంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నాగరాజు వేధింపులకు గురైన ఓ ఎస్పీ ర్యాంకు మాజీ పోలీస్ అధికారి మీడియా ముందుకు అతడి అవినీతి బాగోతం వివరించారు. కస్టడీ ముగిసినా దరిమిలా నాగరాజు అక్రమాలపై ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.ఇక నాగరాజు వేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
తహసీల్దార్ కారులో రెండు లక్షలు లభ్యం
సాక్షి, కృష్ణా జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. మండల తహసీల్దార్ టీ.చంద్రశేఖర్ నాయుడును అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు అతని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. (అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్) రెవెన్యూ కార్యాలయంతో పాటు, అధికారుల వాహనాలను స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో రెండు లక్షరూపాయలు డిప్యూటీ తహసీల్దార్ కారులో లక్ష రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో మహేశ్వర రాజు, హ్యాపీ కృపానందం, నజీరుద్దిన్ బృందం పాల్గొన్నారు. (తెలుగు తమ్ముళ్ల వీరంగం, కెమెరాలో రికార్డు) గుంటూరు: రాజుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాస్ పుస్తకాల మంజూరులో అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు: గూడురు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కర్నూలు: ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. భారీగా లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ తన సిబ్బందితో కలసి పట్టణంలోని పాత, కొత్త తహసీల్దార్ కార్యాలయాలపై దాడి చేశారు. పాత కార్యాలయం అడ్డాగా కొందరు వీఆర్వోలు అక్రమాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామయ్యను కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు సాయంత్రం తెలుపుతామన్నారు. అలాగే రేషన్ డీలర్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. శ్రీకాకుళం : జిల్లాలో పలు తహశీలార్ల కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సంతకవిటి కార్యాలయంలో తనిఖీలు చేస్తుండగా వీఆర్వోలు, సిబ్బంది పరారయ్యారు. అనంతపురం: కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. భూ రికార్డులకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది అవినీతిపై విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు విజయనగరం: బలిజపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. -
అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ సమీక్ష
-
అవినీతిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
అవినీతి చేయాలంటే భయపడాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1902 నెంబర్‌ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి. వచ్చిన ఫిర్యాదులను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. 1902కు వచ్చే కాల్స్‌పై బలోపేతమైన అమలు విభాగం ఉండాలి. దీనికి కలెక్టర్ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి. టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదు. ( సెప్టెంబర్ 3 న ఏపీ కేబినెట్ భేటీ ) దీనిపై ఫోకస్‌గా ముందుకు వెళ్లండి. 14400 నెంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించండి, పర్మినెంట్ హోర్డింగ్స్ పెట్టండి. రెడ్ హ్యండెడ్‌గా దొరికిన కేసుల్లో చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టకూడదు. అవినీతికి పాల్పడుతూ, లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లో కూడా దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ఉండాలి. కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోంది అంటే.. అవినీతి నిరోధకత విషయంలో సీరియస్‌గా లేమనే సంకేతాలు వెళ్తున్నాయి. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలి. దీనికోసం అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలి. 28 ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి రూ.322 కోట్లు కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 2018, జులైలో ఒప్పందం కుదిరింది. 4,766.28 ఎకరాల భూమిని సదరు కంపెనీకి ఇచ్చారు. అప్పటి ప్రభుత్వంలో ఎకరాకు కంపెనీ చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు మాత్రమే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కంపెనీతో తిరిగి సంప్రదింపులు జరిపింది. అవే స్పెసిఫికేషన్లతో విద్యుత్ ప్రాజెక్టు ఆ కంపెనీ నిర్మాణానికి ఓకే అంది. ప్రభుత్వానికి ఎకరాకు రూ.2.5 లక్షలకు బదులు రూ.5 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఎకరాకు అదనంగా రూ. 2.5 లక్షలు ఈ ప్రభుత్వం తీసుకురాగలిగింది. దీని వల్ల అదనంగా రూ.119 కోట్ల ఆదాయం వస్తోంది. అలాగే సోలార్/విండ్ కింద ఉత్పత్తి చేసే 1550 మెగావాట్ల ఉత్పత్తికి గాను మెగావాట్‌కు రూ.1 లక్ష చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. దీని వల్ల ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్ల కాలంలో రూ.322 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి. అంతే కాక రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తి చేయనున్న 1680 మెగావాట్ల కరెంటుకు గాను, మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో రూ.1 లక్ష, తద్వారా ఏడాదికి రూ.16.8 కోట్లు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షలు చొప్పున ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 2,940 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీతో సంప్రదింపులు కారణంగా రూ.3,381 కోట్లు ప్రభుత్వానికి అదాయం వస్తోంది. ఇదే గత ప్రభుత్వంలో కేవలం రూ.119 కోట్లు మాత్రమే ఆదాయాన్ని చూపించారు. ప్రభుత్వానికి ఈ రకమైన మేలు చేయడానికి ప్రయత్నించిన అధికారులను అభినందిస్తున్నా. ప్రభుత్వం మారింది.. 500 ఎకరాలు మిగిలింది భోగాపురం ప్రాజెక్టు విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటో చాలా స్పష్టంగా కనిపించింది. గత ప్రభుత్వం 2703 ఎకరాలను విమానాశ్రయానికి కేటాయిస్తే.. అదే కంపెనీతో ఈ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. అదే కంపెనీ 2203 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందుకు వచ్చింది. గత ప్రభుత్వంతో ఒప్పందం సమయంలో కడతానన్న ప్రతి సదుపాయం కూడా 2203 ఎకరాల్లో ఆ కంపెనీ కట్టేందుకు ముందుకు వచ్చింది. కంపెనీ మారలేదు, ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవు, భూమీ మారలేదు. వచ్చిందల్లా ప్రభుత్వంలో మార్పే. పునర్ సంప్రదింపులు కారణంగా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరాకు రూ. 3 కోట్లు వేసుకున్నా ప్రభుత్వానికి రూ.1500 కోట్లు ఆదాయం మిగిలినట్టే. రివర్స్ టెండరింగ్ : సుపరిపాలనలో భాగంగా, విప్లవాత్మక మార్పుగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ పైనా అధికారులు సీఎంకు వివరాలు అందించారు. మొత్తంగా 788 టెండర్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని తెలిపారు. సాధారాణ టెండర్ల ప్రక్రియ ద్వారా 7.7 శాతం మిగులు ఉండగా, రివర్స్ టెండరింగ్ ద్వారా 15.01 శాతం మిగులు ఉంటుందని వెల్లడించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ: రూ.100 కోట్లు దాటిన ఏ ప్రాజెక్టుకైనా జ్యుడిషయల్ ప్రివ్యూకు వెళ్తున్నామని అధికారులు వివరించారు. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు 45 ప్రాజెక్టులు ఆ ప్రివ్యూకు వెళ్లాయని చెప్పారు. రూ.14,285 కోట్లు విలువైన పనులు జ్యుడిషయల్ ప్రివ్యూకు వెళ్లాయని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. -
అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు హాజరయ్యారు. లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేందుకు దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే 1902కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలు ఏసీబీకి చెందిన 14400కు బదిలీతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానంతో పాటు ఎమ్మార్వో, ఎండీవో, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ జరగాల్సిందేనని, టెండర్ విలువ రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్ట్‌తో పాటు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ల ప్రాజెక్ట్‌ల విషయంలో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా స్పష్టం అయిందని సీఎం జగన్ పేర్కొన్నారు. -
ఏసీబీ డీఎస్పీ గుండెపోటుతో మృతి
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో మృతి చెందారు. కొంపల్లిలోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన మరణించారు. కాగా వారం రోజుల క్రితం ప్రతాప్ సస్పెన్షన్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈఎస్ఐ రిమాండ్ రిపోర్ట్
-
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
-
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
-
బంజారాహిల్స్ పీఎస్ ఎస్ఐ అరెస్ట్
సాక్షి, జూబ్లీహిల్స్ : భూ ఆక్రమణ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు డిమాండ్ చేసినందుకుగాను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవీందర్ నాయక్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాలీద్ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై షేక్‌పేట మండల తహసీల్దార్ సుజాత గత ఏప్రిల్ 30న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఖాలీద్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు గాను రూ. 3 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ రవీందర్ డిమాండ్ చేశాడు.(లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్ఐ) ఖాలీద్ ఇటీవల రూ.1.50 లక్షలు రవీందర్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు. అందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులకు అందించిన ఖాలీద్ అతను మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు షేక్‌పేట మండల కార్యాలయం, ఆర్ఐ నివాసం, తహసీల్దార్ ఇంట్లో, ఎస్ఐ రవీందర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా అర్థరాత్రి వరకు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. అర్థరాత్రి రాత్రి 12 గంటలకు తహసిల్దార్ సుజాతను ఇంటికి పంపించారు. నేడు కూడా ఈ కేసుకు సంబంధించి తహిసిల్దార్ సుజాతను విచారించనున్నారు. ఎస్ఐ రవీందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజు కూడా తహసిల్దార్ సుజాతను విచారించనున్న ఏసీబీ అధికారులు. అసలు ఏం జరిగిదంటే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 సర్వే నంబర్ 129/59లో ఉన్న 4865 గజాల ప్రభుత్వ స్థలాన్ని సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ అనే వ్యక్తి ఆక్రమించి హెచ్చరిక బోర్డును తొలగించి తన పేరుతో బోర్డు ఏర్పాటు చేశాడు. సదరు స్థలాన్ని తాను కోర్టులో గెలిచినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ స్థలాన్ని తన పేరిట క్రమబద్దీకరించి హద్దులు చూపించాల్సిందిగా షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో తహసిల్దార్ సుజాత గత జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్థలాన్ని ప్రైవేట్ పరం చేస్తూ హద్దులు చూపిస్తానంటూ అదే కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ నాగార్జున రెడ్డి ఖాలిద్ నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా శనివారం ఖాలిద్ రూ.15 లక్షల నగదును సాగర్‌సొసైటీ రోడ్డులో హార్లి డేవిడ్ సన్ షోరూం పక్క సందులో నాగార్జున్ రెడ్డికి ఇస్తుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాగార్జునరెడ్డి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు యూసుఫ్‌గూడలోని అతడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. నిందితుడిని కార్యాలయానికి తీసుకువచ్చి విచారించగా కలెక్టరేట్లో ఓ అధికారికి రూ. 15 లక్షలు ఇవ్వాల్సి ఉందని అందుకే రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. -
బల్లకింద బుక్కయ్యారు
-
తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి డ్రోన్ కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.(రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది. ఎవరు సమకూర్చారు అనే అంశం కీలకంగా మారింది. ఇప్పటికే కోర్టుకు ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు చేరాయి. ఓటుకు కోట్లు కేసు విచారణ ఏసీబీ కోర్టులో వేగంగా సాగుతుంది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. (చర్లపల్లి జైలుకు రేవంత్..) (రేవంత్ నేరాల పుట్ట బయటపడింది) -
మరోసారి తెరపైకి ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను రేపు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. త్వరలోనే కీలక పరిణామాలు..! మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోర్టుకు చేరింది. ఈ కేసులో స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది కీలకం కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటి తహసీల్దార్
సాక్షి, నాగర్‌కర్నూల్ : కలెక్టరేట్లోని సి–సెక్షన్లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డిప్యూటి తహసీల్దార్ జయలక్ష్మి సోమవారం సాయంత్రం రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన దోమ వెంకటయ్య అనే రైతు అదే గ్రామానికి చెందిన బంధువులు విమల, విప్లవ, వికాస్ అనే వ్యక్తుల వద్ద 3 ఎకరాల 15 గుంటల భూమిని 2016లో కొనుగోలు చేశాడు. ఆ భూమిని తన పేరుపై పట్టా మార్చుకునేందుకు తిమ్మాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి 2006లో విమల, విప్లవ, వికాస్‌ల తాతయ్య బృంగి తిర్పతయ్య తనకు ఆ భూమిని ముందే అమ్మాడని, దోమ వెంకటయ్యకు పట్టా చేయవద్దంటూ తిమ్మాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో పిటిషన్ వేశాడు. అప్పటినుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై నాగర్‌కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటయ్య జేసీకి పిటిషన్ ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన క్రమంలో సి–సెక్షన్లో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మీతో పరిచయం ఏర్పడింది. ఈ వ్యవహారాన్ని తాను చక్కబెట్టి వెంకటయ్యకు అనుకూలంగా కేసు వచ్చేలా చూస్తానని డీటీ రూ.13లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.10 లక్షలకు బేరం కుదిరింది. ఒకేసారి అంత నగదు ఇవ్వలేకపోతే విడతలవారీగా ఇవ్వాలని జయలక్ష్మి కోరడంతో తన వద్ద అంత డబ్బు లేదని వెంకటయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పట్టుబడిందిలా.. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు అవినీతి చేపను పట్టేందుకు వలపన్నారు. సోమవారం రూ.లక్ష అడ్వాన్స్‌గా డీటీ జయలక్షి్మకి వెంకటయ్య ఇచ్చేలా పతకం రచించారు. ముందుగా డీటీని వెంకటయ్య కలిసి డబ్బులు తెచ్చానని కోరగా కాసేపు అటుఇటు తిప్పి కలెక్టరేట్లోని ఓ గదిలో తీసుకరావాలని కోరారు. అనుకున్నట్టుగా డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి ఏసీబీ అధికారులకు చెప్పాడు. వెంటనే వారు దాడిచేసి రెడ్ హ్యాడెడ్‌గా çపట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు . కోర్టులో హాజరు పరుస్తాం రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు ఫిర్యాదును స్వీకరించి దాడులు చేశామని, అనుకున్నట్టుగానే డబ్బులు తీసుకుంటూ డీటీ పట్టుబడ్డారని తెలిపారు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో కూడా మరో బృందం తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీనెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పాలమూరులో తనిఖీలు మహబూబ్‌నగర్ క్రైం: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న జయలక్ష్మీ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సరిగ్గా అదే సమయంలో పాలమూరులోని ఆమె ఇంట్లో సైతం తనిఖీలు జరిగాయి. జయలక్ష్మీ నివాసం ఉండే మర్లులోని మహాలక్ష్మీ టవర్స్‌లోని 203 ఫ్లాట్‌లో ఏసీబీ సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు ఇంటిని మొత్తం తనిఖీలు చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి గదిని, బీరువాలు, ఇతర స్థలాలు అన్నింటిని పరిశీలించారు. ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్, ల్యాప్‌టాప్‌ను స్వా«దీనం చేసుకున్నారు. -
ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై ఏసీబీ పంజా!
సాక్షి, కరీంనగర్: వివాదాస్పదమైన మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మరోసారి దృష్టి సారించింది. అప్పుల కింద బాధితుల నుంచి భూములను స్వాధీనం చేసుకొని బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన కేసుల్లో రెండేళ్ల క్రితమే పలు అరెస్టులు జరిగాయి. వివిధ కేసుల్లో పలువురు నిందితులు రిమాండ్‌కు వెళ్లి వచ్చారు కూడా. నిందితులుగా ఉన్న బినామీలు ఒకటి రెండు కేసుల్లో ఏసీబీ మీదే ఎదురు తిరిగి కోర్టులను ఆశ్రయించడంతో అవినీతి నిరోధక శాఖ మళ్లీ కొరడా విదిల్చింది. గతంలో పరారీలో చూపించిన మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులను తాజాగా అరెస్టు చేశారు. మంగళవారం మోహన్‌రెడ్డి కుమారుడు అక్షయ్‌రెడ్డి(క్రైం నెంబర్ 06/2018 కేసులో ఏ–3)ని, బుధవారం ఆయన తండ్రి బొబ్బల ఆదిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో మోహన్‌రెడ్డి బినామీల నుంచి ఏసీబీ అధికారులు బాధితులకు భూములను, ఇతర ఆస్తులను వారికే తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా కొందరు బినామీలు ఏసీబీ అధికారులే బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఎదురు తిరుగుతుండడంతో ఏసీబీ మళ్లీ పంజా విసరుతోందని సమాచారం. ఈ నెలలో నలుగురి అరెస్టు భూకబ్జాలు, బినామీల పేరిట భూముల రిజిస్ట్రేషన్ తదితర కేసుల్లో ఈ నెలలోనే ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో మోహన్‌రెడ్డి బినామీల గుండెల్లో గుబులు రేగుతోంది. ఈ నెల 13న సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డి, బాణాల రమణారెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. మంగళవారం మోహన్‌రెడ్డి కొడుకు బొబ్బల అక్షయ్‌రెడ్డిని మధ్యాహ్నం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మోహన్‌రెడ్డి తండ్రి బొబ్బల ఆదిరెడ్డి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిమ్మాపూర్ కేసులో.. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర సారయ్య భూ కబ్జా కేసులో 8 మంది నింది తులున్నారు. రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర సారయ్యతోపాటు అతని వ్యాపార భాగస్వాములకు సంబంధించిన 30 గుంటల భూమిని, రూ.50 లక్షల విలువ చేసే కిన్నెర సారయ్యకు సంబంధించిన ఇళ్లను మోహన్‌రెడ్డి తదితరులు ఆక్రమించుకున్నారనేది ఫిర్యాదు. మోహన్‌రెడ్డి బినామీ అయిన శ్రీపాల్‌రెడ్డి మామ అమరం రాజిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడని కిన్నెర సారయ్య 2018 ఫిబ్రవరి 17న ఫిర్యాదు చేశారు. మోహన్‌రెడ్డి వద్ద డబ్బులు అప్పుగా తీసుకొని అసలు, వడ్డీ చెల్లించినప్పుటికీ, తనఖా పెట్టిన భూమిని ఇతరుల పేరుమీదికి మార్చాడని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 మోహన్‌రెడ్డి కాగా, ఏ2 లత(మోహన్‌రెడ్డి భార్య), ఏ3 అక్షయ్‌రెడ్డి(మోహన్‌రెడ్డి కుమారుడు), ఏ4 మహేందర్‌రెడ్డి(మోహన్‌రెడ్డి తమ్ముడు), ఏ5 బొబ్బల ఆదిరెడ్డి(మోహన్‌రెడ్డి తండ్రి), ఏ6 శ్రీపాల్‌రెడ్డి(మోహన్‌రెడ్డి బావమరిది), ఏ7 బి.రమణారెడ్డి(మోహన్‌రెడ్డి సమీప బంధువు), ఏ8 అమరం రాజిరెడ్డి(శ్రీపాల్‌రెడ్డి మామ)లు నిందితులుగా పేర్కొన్నారు. ఏసీబీ పైనే రివర్స్ నోటీసులు? మోహన్‌రెడ్డి బినావీులపై 2017 చివరలో, 2018లో ఏసీబీ అధికారులు అరెస్టులు చేసి వారి వద్ద నుంచి బాధితులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించారు. మోహర్‌రెడ్డి బినామీల వద్ద నుంచి గత సంవత్సరం బా«ధితులకు ఏసీబీ రిజిస్ట్రేషన్లు చేయించింది. అప్పుడు మోహన్‌రెడ్డి, అతని బావమరిది శ్రీపాల్‌రెడ్డి ఇద్దరు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. మోహన్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డిలు బెయిల్‌పై విడుదలైన తర్వాత ఏసీబీ అధికారులు బినావీులను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని మోహన్‌రెడ్డితోపాటు అతని బినామీలు కోర్టు ద్వారా ఏసీబీ వాళ్లకు నోటీసులు పంపించినట్లు సమాచారం. దీంతో ఏసీబీ మళ్లీ బినావీులపై పంజా విసురుతోందని తెలుస్తోంది. దాడి సుధాకర్ భూమి కేసులో సీన్ రివర్స్ దాడి సుధాకర్ అనే వ్యక్తికి సంబంధించిన భూమి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌కు చెందిన సీహెచ్.రమణారెడ్డి అనే వ్యక్తి(మోహన్‌రెడ్డి బినావీు)కి గతంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కేసులో ఏసీబీ పోలీసులు సీహెచ్.రమణారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించి బాధితుడు దాడి సుధాకర్ భూమిని తిరిగి అతనికి ఇప్పించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. కాగా మోహన్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత సీహెచ్.రమణారెడ్డిని సంప్రదించి దాడి సుధాకర్ వల్ల చాలా నష్టపోయామని, తిరిగి అతనిపై కేసు వేస్తే ఎంతోకొంత డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో రమణారెడ్డితో న్యాయవాది ద్వారా కోర్టులో కేసు వేయించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులే బలవంతంగా రమణారెడ్డి వద్ద నుంచి దాడి సుధాకర్‌కు భూమిని రిజిస్ట్రేషన్ చేయించారని ఏసీబీ అధికారులకే నోటీసులు పంపించినట్లు తెలిసింది. ఇలాగే మరికొందరు బినావీులతో కూడా కోర్టు ద్వారా నోటీసులు పంపించడంతో ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోందని భావిస్తున్నారు. -
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసు పిటిషన్‌పై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. లక్ష్మీపార్వతి తరఫున సీనియర్ న్యాయవాది కోకా శ్రీనివాస్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ఆస్తుల వివరాల ఆధారంగానే తాము ఫిర్యాదు చేశామని కోర్టుకు తెలిపారు. రూ.వేలల్లో ఆదాయం ఉన్న చంద్రబాబు కొద్ది కాలానికే కోట్లకు ఎలా పడగెత్తారో వివరించలేదన్నారు. ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్ కూడా కట్నం ఇవ్వలేదని అధికారిక పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎన్నికల సమయంలో.. అసెంబ్లీకి ఇచ్చిన పత్రాల్లో ప్రస్తావించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పొందిన జీతభత్యాలతోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడగట్టారో తేల్చాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ కంపెనీ ఏర్పాటు చేశాక నెలకు రూ.20 వేలు చొప్పున ఐదు నెలలే తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాంటప్పుడు కోట్ల రూపాయల ఆస్తిని ఎలా ఆర్జించారో తేల్చేందుకు తగిన ఉత్తర్వులివ్వాలి’ అని కోర్టును కోరారు. అయితే సాంకేతిక కారణాల వల్ల నేటికీ ఈ కేసులో స్టే ఉన్నట్లు వెబ్సైట్లో ఉండటంతో పూర్తి వివరాలు తెలుసుకుని వచ్చే విచారణ సమయంలో చెప్పాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కేసు నేపథ్యం ఇదీ.. : ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2005లో చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలను సైతం వినాలని కోరారు. అయితే ఫిర్యాదును విచారణకు స్వీకరించడానికి ముందు దశలోనే వాదనలు వినడం సాధ్యంకాదని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై చంద్రబాబు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి స్టే పొందారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్టే గడువు ముగిసింది. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు గతేడాది నవంబర్ 18న విచారణ ప్రారంభించింది. -
ఏపీలో ఏసీబీ మెరుపు దాడులు
ఏపీలోని 13 జిల్లాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో చేపట్టిన ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ దాడుల్లో 10.34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏబీసీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రజల నుంచి 14400 టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదులతో మెరుపుదాడులు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. విజయనగరం: విజయనగరం వెస్ట్‌జోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్‌కి వస్తున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తున్నామని ఏసీబీ డిఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. ఎనిమిది మంది అనధికార డాక్యుమెంట్ రైటర్స్ నుంచి రూ.50వేలు, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది దగ్గర నుంచి రూ.11 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతపురం: అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ మూర్తి నుంచి రూ.2.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు, కొంతమంది ప్రైవేటు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తూర్పుగోదావరి: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించారు.దాడులు జరుగుతున్నాయని ముందుగానే సమాచారం అందడంతో కొందరు అధికారులు తప్పించుకున్నారు. కాకినాడ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కార్యాలయ సిబ్బంది వద్ద అనధికారికంగా లెక్కల్లో లేని రూ.1,29,640 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. ప్రజల నుంచి ‘14400 కాల్ సెంటర్’ కు వచ్చిన ఫిర్యాదులతో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేపడుతున్నామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ వెల్లడించారు. ప్రకాశం: జిల్లాలోని సింగరాయకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలువురి సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విశాఖపట్నం: అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు సమక్షంలో రూ. 83,660 నగదును సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డులను అడిషనల్ ఎస్పీ షకీలా భాను, ఏసీబీ డీఎస్పీ రంగరాజు తనిఖీలు చేశారు. పలువురి సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. శ్రీకాకుళం: కాశీబుగ్గ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయ రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. పలువురి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. పశ్చిమగోదావరి: జిల్లాలోని కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.84 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో ఉన్న ముగ్గురు డాక్యు మెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. గుంటూరు: తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఆకస్మిక దాడుల్లో కార్యాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.16,250 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏసీబీ పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం
-
ఏసీబీ పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీపై సీఎం జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలంగా అంకిత భావంతో పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ..‘ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదు. అవినీతి నిరోధానికి 14400 కాల్ సెంటర్ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయి. కాల్ సెంటర్ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలి. ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదు. లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. ఎమ్మార్వో, కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఇలా ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదు. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలి. సెలవులు లేకుండా పని చేయండి. మూడు నెలల్లోగా మార్పు కనిపించాలి. కావాల్సినంత సిబ్బందిని తీసుకోండి. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరో నెల రోజుల్లో సమీక్ష చేస్తాం. అప్పటికి మార్పు కనిపించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
సాక్షి, రామచంద్రాపురం: రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే వీఆర్ఓ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేసే వీఆర్ఓ వెంకటయ్య, మహ్మద్ జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి నుంచి గురువారం రూ.2 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు సెక్షన్లో పని చేసే వెంకటయ్య పహణీ నఖలు ఇచ్చేందుకు జాకీర్‌ను లంచం అడిగారు. రూ.6 వేల లంచం డిమాండ్ చేయగా రూ.4 వేలు ఇస్తానని చెప్పినా వెంకటయ్య వినిపించుకోలేదని, దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు జాకీర్ వివరించారు. వెలిమెల గ్రామంలోని సర్వే నంబర్ 361, 364లోని తన కుటుంబీకుల భూమి వివరాలకు సంబంధించిన రికార్డులు అవసరమై తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. రికార్డు సెక్షన్లో ఉన్న వెంకటయ్య లంచం అడిగాడని బాధితుడు వివరించారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలోవీఆర్‌ఓ వెంకటయ్యను వలపన్ని పట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ రవి కుమార్ విలేకరులతో మాట్లాడుతూ జాకీర్ ఇచి్చన ఫిర్యాదుతో వెంకటయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని చెప్పారు. ఫిర్యాదులు వస్తున్నాయి: ఏసీబీ డీఎస్పీ రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భూము ల విలువ బాగా పెరిగిందని, దాంతో అధికారులు కూడా లంచాలు ఆశిస్తున్నారనే ఫిర్యాదు లు పెరిగాయని ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరించారు. ఆ అంశంపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు. -
ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి ఏడీఏ
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్) : పెద్దపల్లి వ్యవసాయశాఖ ఏడీఏ క్రిష్ణారెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కరీంనగర్‌కు చెందిన నగునూరి లక్ష్మణ్ పెద్దపల్లిలో ఫెర్టిలైజర్ దుకాణం ఏర్పాటుకు లైసెన్సుకోసం ఏడీఏ రూ.15వేలు డిమాండ్ చేశారు. లక్ష్మణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.10వేలు ఏడీఏ చేతికి అందిస్తుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య పట్టుకున్నారు. పట్టణంలోని జెండాచౌరస్తా ఏరియాలో ఫెర్టిలైజర్ దుకాణం కోసం లైసెన్సు ఇవ్వాల్సిందిగా రెండు నెలలుగా లక్ష్మణ్ «అధికారులచుట్టూ తిరుగుతున్నాడు. ఏడీఏ క్రిష్ణారెడ్డిని కలిసి లైసెన్స్ గురించి ప్రశ్నిం చాడు. తనకు రూ.15వేలు ఇవ్వాలని, మిగతా ఉద్యోగులకు ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చి లైసెన్స్ తీసుకెళ్లాల్సిందిగా క్రిష్ణారెడ్డి సూచిం చాడు. తాను రూ.10వేలు ఇస్తానని ఒప్పుకుని ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ఏడీఏ కార్యాలయం వద్ద డబ్బులు తీసుకుం టుండగా అధికారులు అరెస్ట్ చేశారు. లక్ష్మ ణ్‌వాగ్మూలం సేకరించారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న లైసెన్స్ పత్రాలను పరిశీలించారు. కార్యాలయం వద్దకు మరో ఇద్దరు బాధితులు విషయం తెలుసుకున్న మరో ఇద్దరు బాధితులు ఏసీబీ అధికారులను కలిసేందుకు కార్యాలయానికి వచ్చారు. తాను రూ.5 వేలు ఇచ్చానని, మరొకరు రూ.15 వేలు ఇచ్చానంటూ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న కొందరు ఇప్పటికే క్రిష్ణారెడ్డి ఉద్యోగానికి ఎసరు వచ్చిందని, ఇక కొత్తగా ఫిర్యాదు వద్దంటూ వారించడంతో బాధితులు వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. పెద్దపల్లిలోనే నలుగురు అవినీతిపరులు పెద్దపల్లిలోనే ఆరునెలల కాలంలో నలుగురు అవినీతిపరులు ఏసీబీకి చిక్కారు. రెండువారాల క్రితమే వీఆర్వో లింగమూర్తి రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. శుక్రవారం వ్యవసాయశాఖ అధికారి క్రిష్ణారెడ్డి రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం నివ్వెరపరిచింది. సబ్‌రిజిస్ట్రార్, ఇరిగేషన్ శాఖ డీఈ, పాఠశాల హెచ్ఎం, తాజాగా చిక్కిన ఏడీఏ లకు రూ.లక్షకు ఐదుపదివేలు తక్కువ జీతం తీసుకొనేవాళ్లే. ప్రభుత్వం భారీగా వేతనాలు చెల్లిస్తున్నా అవినీతిలో మాత్రం తగ్గకుండా ఉద్యోగులు రూ.ఐదు, పది వేలకు చేతులు చాచి, తమ ఉద్యోగ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఏసీబీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
టౌన్‌ప్లానింగ్ అధికారి సహా ఇద్దరు విలేకరుల అరెస్టు
బంజారాహిల్స్ : భవన నిర్మాణ యజమానిని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి సిద్ధాంతం మదన్‌రాజుతో పాటు ఓ రెండు పత్రికల విలేకర్లు సోపాల శ్రీనివాస్, ఆకుల కిరణ్‌గౌడ్‌లు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ సిటీ రేంజ్–2 డీఎస్పీ ఎస్. అచ్చేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని మెట్రో స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా షెడ్డు నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్‌లు ఆయన వద్దకు వెళ్లి ఇది అక్రమ నిర్మాణమంటూ బెదిరించారు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే సెక్షన్ అధికారి మదన్‌రాజుకు చెప్పి కూల్చివేయిస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మదన్‌రాజును కూడా వెంటబెట్టుకొని నిర్మాణ స్థలానికి వెళ్లి.. కేశవరెడ్డిని వారు డబ్బులు డిమాండ్ చేశారు.దీంతో తాను రూ. 2 లక్షలు ఇచ్చేందుకు ఆయన వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు. అప్పటికే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో కేశవరెడ్డి సెక్షన్ అధికారితో పాటు ఇద్దరు విలేకరులను ఇంటికి పిలిపించాడు. అక్కడ అతను రూ. 2లక్షలు ఈ ముగ్గురికీ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణ చేపట్టి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. సెక్షన్ అధికారి మదన్‌రాజు, ఈ ఇద్దరు విలేకరులను కొంత కాలంగా తన అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడని వారితోనే డబ్బులు వసూ లు చేయిస్తున్నాడని అధికారులు తెలిపారు. ఇది లా ఉండగా ఈ ఇద్దరు విలేకరులు బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. -
ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ రవికుమార్ అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు బడ్డారు. వివరాలు.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ తన పదవీ కాలం(2014ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు) లోని అభివృద్ధి పనులు, ఖర్చులకు సంబంధించిన ఆడిట్ లెక్కల్ని నివేదించాలని డీపీఓగా పనిచేస్తోన్న రవికుమార్ అడిగారు. ఆయన చెప్పిన ప్రకారమే ఆడిట్ లెక్కల్ని క్లియర్ చేసేందుకు వెళ్లగా.. ఆపని పూర్తి చేసేందుకు రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బులివ్వలేనని ఈశ్వర్ తెలుపగా, ఇరువురి మధ్య రూ.5 నుంచి రూ.4 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఈశ్వర్ ఏసీబీకి తెలిపారు. గురువారం ఈశ్వర్ రూ.లక్ష రవికుమార్‌కు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంపల్లిలోని రవికుమార్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
బాగానే వెనకేశారు.. దొరికిపోయారు
సాక్షి, విజయవాడ/కాకినాడ: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఇద్దరు ప్రభుత్వ అధికారులు చిక్కారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో విజయవాడ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మురళీ గౌడ్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు చేశారు. సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదును అధికారులు గుర్తించినట్టు సమాచారం. 2014లో సీఆర్డీఏలో టౌన్ ప్లానింగ్ అధికారిగా, 2017లో తిరుపతిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా విధులు నిర్వస్తున్న సమయంలో మురళీ గౌడ్ భారీగా అక్రమాస్తులు కూడపెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విజయవాడతో పాటు తిరుపతి, కర్నూల్, హైదరాబాద్, బెంగళూరులో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సుమారు 50 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు కలిగివున్నారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న గుణ్ణం సత్యనారాయణ చౌదరి నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జగన్నాధపురం మరీడమ్మపేటలోని సత్యనారాయణ నివాసంతో పాటు కాకినాడ, రెండు రావులపాలెంలో రెండేసి చోట్ల, సామర్లకోటలో ఒక చోట ఏకకాలంలో దాడులు చేశారు. కేజీన్నర బంగారు ఆభరణాలు, కేజీ వెండి సహా రూ. రెండున్నర కోట్లు విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బ్యాంకు అకౌంట్లు సహా, పలు బ్యాంకుల్లో లాకర్లు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
‘ప్రమోషన్ కోసం ఠాకూర్ మమ్మల్ని ట్రాప్ చేశారు’
సాక్షి, విజయవాడ : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకుల మెప్పు కోసం ఆర్పీ ఠాకూర్ తమను ట్రాప్ చేసి అక్రమ కేసులు పెట్టారని బాధితులు ఆరోపించారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏసీబీ అక్రమ కేసుల బాధితుల మీడియా సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బాధితుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఠాకూర్ డీజీ నుంచి డీజీపీ ప్రమోషన్ కోసం అక్రమంగా కేసులు పెట్టారని ఆయన వాపోయారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అన్యాయంగా కేసులు పెట్టిన వాటిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఠాకూర్ పెట్టిన అక్రమ కేసులకు మనస్తాపానికి గురై కొందరు ఉద్యోగులు ఆతహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి రీ పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నామని వెంకటేశ్వరావు అన్నారు. మిగిలిన వారికి పోస్టింగ్ ఇవ్వాలి.. 3 ఏళ్లుగా అన్యాయనికి గురైన వారిలో కొందరికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏసీబీలో లోపాలను ఎత్తి చూపిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మా కృతజ్ఞతలు. ఠాకూర్ కేసుల బాధితులందరికీ న్యాయం చేయాలి. విచారణకు వెళ్లేముందు కేసులు పునర్ పరిశీలించమని కోరుతున్నాము. -బాధితుడు పయ్యావుల శ్రీనివాసరావు -
ఏసీబీ వలలో అవినీతి అధికారి
-
ఏసీబీకి చిక్కిన అటవీశాఖ అధికారులు
సాక్షి, జగిత్యాల : పాత ఇంటి కర్రకు అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు మంగళవారం నగదు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. అటవీశాఖ సెక్షన్ అధికారి, బీట్ అధికారుల లంచావతారం ఎట్టకేలకు బట్టబయలైంది. వివరాలు ఇలా..సారంగాపూర్ మండలం మ్యాడారంతండా గ్రామానికి చెందిన భూక్య గంగాధర్ నాయక్ (52 ) గిరిజనుడు ఒంటిరిగా నివాసం ఉంటున్నాడు. 30 రోజుల ప్రణాళికలో కూలిపోయే దశలోని ఇంటిని తొలగించాలని అధికారులు ఆదేశించారు. గంగాధర్ తన తాత సుమారు 70 ఏళ్లక్రితం నిర్మించిన రెండు ఇళ్లను తొలగించడానికి నిర్ణయించుకున్నాడు. అందులోని విలువైన టేకు కలప భద్రపరుచుకున్నాడు. ఈ కలపతో కొత్తగా ఇళ్లు నిర్మాణం చేసుకోవడానికి వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 20 రోజులక్రితం అటవీశాఖ సెక్షన్ అధికారి పవనసుతరాజు, గ్రామ బీట్ అధికారి ఎండి. వసీంను కలిసి కొత్త ఇంటికి కలప వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరాడు. ప్రతీ ఇంటికి రూ.10 వేల చొప్పున రూ.20 వేలు ఇస్తేనే అనుమతిస్తామని తెగేసి చెప్పారు. రోజులతరబడి తిరిగినా కాళ్లు కూడా పట్టుకున్నా కనికరించలేదు. డీఎఫ్‌వోను కలిసి పరిస్థితిని మొరపెట్టుకున్నాడు. ఆయన ఆదేశించినా సెక్షన్ అధికారి, బీట్ అధికారులు పట్టించుకోకపోగా లంచంకోసం వేధించారు. దీంతో విసిగిపోయిన గంగాధర్ ఈనెల11న ఏసీబీ అధికారులను కలిశాడు. పక్కా ప్లాన్‌తో మంగళవారం గ్రామానికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, సంజీవ్‌కుమార్, రాముతోపాటు మరో 10 మంది సిబ్బంది మ్యాడరంతండా పరిధిలోని రేచపల్లి గ్రామంలోని అటవీశాఖ బీట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే బాధితుడు గంగాధర్‌కు రూ.6 వేలు ఇచ్చి, అటవీశాఖ సెక్షన్ అధికారి పవనసుతరాజు, బీట్ అధికారి ఎండి.వసీమోద్దీన్ దగ్గరికి పంపించారు. బీట్అధికారి డబ్బు తీసుకోగా, సెక్షన్ అధికారి, బీట్ అధికారి ఇద్దరు కలిసి గంగాధర్‌తో మాట్లాడుతుండగా దాడి చేసి ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వేధిస్తే 1064 నంబర్‌కు ఫోన్ చేయండి ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా ప్రజలు ఏసీబీ 1064 నంబర్‌కు ఫోన్ చేయాలని డీఎస్పీ కోరారు. కాగా ఇద్దరు అధికారులు పట్టుబడడంతో రేచపల్లి గ్రామస్తులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేయడం విశేషం. -
లంచంగా బంగారం అడిగిన ‘లక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రానికి అనుకూలంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్ చేసిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్(డీఐ)ను అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆ డీఐ నుంచి బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ అవినితీ అధికారిని కోర్టులో హాజరు పరిచారు. లింగంపల్లి లక్ష్మీరెడ్డి 15 ఏళ్లుగా బోయిన్‌పల్లిలో జనని వాలంటరీ పేరుతో రక్తనిధి కేంద్రాన్ని నిర్వహిస్తోంది. జంటనగరాల జోన్ కు డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఉన్న బొమ్మిశెట్టి లక్ష్మీ ఇటీవల ఆ రక్తనిధి కేంద్రంలో తనిఖీలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా రికార్డ్స్‌లో దాతల వివరాలు సరిగా లేకపోవడంతో పాటుగా రక్తం నిల్వ చేసిన గదిలో ఏసీ పని చేయడం లేదని డీఐ లక్ష్మీ గుర్తించి బ్లడ్ బ్యాంక్‌పై కేసు నమోదు చేసింది. రక్తనిధి కేంద్రాన్ని సీజ్ చేయకుండా ఉండాలంటే రూ.2 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతమొత్తం ఇచ్చుకోలేనని, నోటీసులిస్తే లోపాలను సరిదిద్దుకుంటానని లక్ష్మీరెడ్డి వేడుకుంది. తమకు కూడా టార్గెట్లు ఉన్నాయని, తాము కూడా పై అధికారులకు ముట్టజెప్పాలని, అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ డీఐ హుకుం జారీ చేసింది. డీఐ వేధింపు లు భరించలేక బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ డ్రగ్ ఇన్స్పెక్టర్కు లక్ష్మీరెడ్డి కబురు పంపించింది. అయితే డీఐ నగదు రూపంలో కాకుండా బంగారు ఆభరణాల రూపంలో కావాలని కోరింది. అప్పటికే ఏసీబీకి సమాచారం ఇచ్చిన రక్తనిధి నిర్వాహకురాలు లక్ష్మీరెడ్డి ఏసీబీ ప్రణాళిక ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ను గురువారం సాయంత్రం అబిడ్స్‌లోని ఓ బంగారు దుకాణానికి రప్పించింది. రూ.1.10 వేల విలువ చేసే బంగారు గొలుసు ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది. అయితే లక్ష్మీరెడ్డి ప్రస్తుతం తనవద్ద ఇంత డబ్బుల్లేవని, ఇదే బంగారు గొలుసును మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పి, డ్రగ్ ఇన్స్పెక్టర్ను పంపివేసింది. పట్టుబడిన ఆభరణాలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి ఆ తర్వాత ఆ గొలుసుకు డబ్బులు చెల్లించి, షాపు నుంచి బిల్లు తీసుకుంది. డీఐకి బంగారు గొలుసును ఇచ్చేందుకు లక్ష్మీరెడ్డి శుక్రవారం రాత్రి మధురానగర్ సూర్య అపార్ట్ మెంట్‌కు వెళ్లింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మికి బంగారు గొలుసును అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే సమయంలో ఆమె నుంచి పలు నగలను కూడా సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ తతంగమంతా అధికారులు వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. తనిఖీల పేరుతో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వేంటనే 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది. -
ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, నెల్లూరు : తెలుగుగంగ ప్రాజెక్ట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ నరసింహం ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ సోదాలు చేపట్టింది. లక్ష్మీనరసింహం నివాసంతోపాటు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిగాయి. నెల్లూరు, కావలి, రాజమండ్రి, ఒంగోలులో సోదాలు నిర్వహించారు. రాజమండ్రి, ఒంగోలులో పొలాలు, ఇళ్ల స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. సోదాల సందర్భంగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 1989 ఆగస్టు 9వ తేదీన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రామ అభివృద్ధి అధికారి (విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్)గా ప్రకాశం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన రెవెన్యూశాఖకు బదిలీ అయి నెల్లూరు జిల్లాకు వచ్చారు. 1995లో నెల్లూరు జిల్లా పొదలకూరు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. 2002లో తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. నెల్లూరు, జలదంకి, వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో పనిచేశారు. 2011లో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజేషన్ (భూ సేకరణ) విభాగంలో సోమశిలలో పనిచేశారు. 2012లో రాజంపేట, 2014–17 వరకు కావలి ఆర్డీఓగా విధులు నిర్వహించారు. 2018 నుంచి తెలుగుగంగ ప్రాజెక్ట్ రాపూరు ఎస్డీసీగా పనిచేస్తూ బుధవారం జరిగిన బదిలీల్లో చిత్తూరు జిల్లా కేఆర్ఆర్సీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు డైకస్‌రోడ్డులో నివాసం ఉంటున్నారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన వైనం రెవెన్యూ శాఖలో అడుగిడిన అనంతరం ఆయన తన అక్రమార్జనకు తెరలేపారు. పనిచేసిన ప్రతిచోట భారీగా ఆస్తులను కూడబెట్టారు. ప్రధానంగా తహసీల్దార్, ఆర్డీఓగా ఉన్న సమయాల్లో పెద్ద ఎత్తున ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు భార్గవ్ పేర్లుపై ఆస్తులను కొనుగోలు చేశారు. అక్రమ ఆస్తుల విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్‌శాంతో నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు గురువారం తెల్లవారుజామున ఆరు బృందాలుగా విడిపోయి నెల్లూరు డైకస్‌రోడ్డులోని ఆయన ఇంటితో పాటు, బాలాజీనగర్‌లోని స్నేహితుడు కృష్ణారెడ్డి, జలదంకి మండలం అగ్రహారంలోని స్నేహితుడు ప్రభాకర్ ఇంట్లో, స్వగ్రామం కలవల్ల గ్రామంలోని ఆయన కుటుంబ సభ్యుల ఇంట్లో, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఆయన అత్త ఇళ్లు, నెల్లూరులోని కార్యాలయంలో ఏకకాలంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. దీంతో ఏసీబీ అధికారులు విస్తుపోయారు. రూ.కోట్లలో ఆస్తులు గుర్తింపు.. ఏసీబీ సోదాల్లో లక్ష్మీనరసింహం, ఆయన భార్య, కుమారుడి పేరుపై ప్రభుత్వ మార్కెట్ ధరల ప్రకారం రూ.4,14,80,000 మేర ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 25 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. గుర్తించిన ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనరసింహం నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో 2008లో రూ.33,075 విలువ చేసే 252 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు ప్రకాశం జిల్లా కందుకూరులో 2006లో రూ.34 వేల వంతున ఎకరా వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. భార్య పేరుతో.. లక్ష్మీనరసింహం భార్య విజయలక్ష్మి పేరుతో 2013లో నెల్లూరు డైకస్‌రోడ్డులో రూ 26,30,200లతో జి+2 హౌస్ నిర్మాణం చేశారు. విజయలక్ష్మి పేరుతో 1999లో నెల్లూరు రూరల్ మండలం గుండ్లపాళెంలో రూ.27వేలు విలువ చేసే 33 అంకణాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. విజయలక్ష్మి పేరుతో 2018లో గుంటూరు జిల్లా తుళ్లూరులో రూ .8.55 లక్షలు విలువ చేసే ప్లాటును కొనుగోలు చేశారు. 2007లో కందుకూరులో రూ.52 వేలు విలువ చేసే వ్యవసాయభూమి కొనుగోలు చేశారు పొదలకూరు మండలం భోగసముద్రంలో 2006లో రూ.1.29 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు పొదలకూరు మండలం భోగసముద్రంలో 2007లో రెండు దఫాలుగా రూ .2.04 లక్షల విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు పొదలకూరు మండలం బోగసముద్రంలో 2012లో రూ. 30 వేలు విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. కుమారుడు పేరుతో.. లక్ష్మీనరసింహం కుమారుడు భార్గవ్ పేరుపై కావలిలో రూ. 2,98,57,000 విలువతో 605 గజాల స్థలంలో జి+5 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.10 లక్షలు అడ్వాన్స్‌ను సైతం చెల్లించారు. 2013లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.18.20 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 2013లో నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో రూ.2.14 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 2012లో రూ. 6 లక్షలు వెచ్చించి టాటా ఇండికా విస్టా కారు కొన్నారు. అదే ఏడాది రూ.45 వేలు వెచ్చించి మహీంద్ర డ్యూరో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించి వాటి తాలుకు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 18 లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు, రూ.4.50 లక్షల నగదు, రూ.15 లక్షలు విలువ చేసే 650 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంక్‌లో రూ.2 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో సంచలనం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బదిలీ ఉత్తర్వులు అందుకునే లోపే.. ఇదిలా ఉంటే ఈ నెల 9వ తేదీన జరిగిన బదిలీల్లో లక్ష్మీనరసింహం చిత్తూరు జిల్లా కేఆర్ఆర్సీకి బదిలీ అయ్యారు. గురువారం ఆయన బదిలీ ఉత్తర్వులు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో దాడులు చేయడం, ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ సోదాల్లో నెల్లూరు ఏసీబీ ఇన్స్పెక్టర్ బి.రమేష్‌బాబు, తిరుపతి ఇన్స్పెక్టర్ ప్రసాద్‌రెడ్డి, విజయశేఖర్, ప్రకాశం ఇన్స్పెక్టర్ ఎన్. రాఘవరావు, తూర్పుగోదావరి ఇన్స్పెక్టర్ తిలక్, తిరుపతి ఎస్సై విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి నివాసంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. మలక్‌పేటలోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, వికారాబాద్ సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు మధుసూదన్‌రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. మధుసూదన్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకూ జరిపిన సోదాల్లో సుమారు రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సాయంత్రం వరకూ సోదాలు కొనసాగనున్నాయి. మరోవైపు వికారాబాద్‌లో న్యాయవాది సుధాకర్ రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు జరుపుతోంది. -
రెండు నెలలు కాలేదు.. అప్పుడే..
సాక్షి, హైదరాబాద్/తుర్కయంజాల్: ఓ రైతుకు సంబంధించిన భూమిని మ్యుటేషన్ చేసేందుకు వీఆర్వో రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) చేతికి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడలో గురువారం ఈ ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుర్రంగూడకు చెందిన రైతు ముత్యంరెడ్డి తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో కొంతకాలం క్రితం ఎకరం 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమికి సంబంధించిన మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మ్యుటేషన్ చేయాలని రైతు ముత్యంరెడ్డి వీఆర్వోను ఆశ్రయించగా, రూ.1 లక్ష లంచం ఇవ్వాలని వీఆర్వో శంకర్ డిమాండ్ చేశాడు. అంతడబ్బు ఇవ్వలేనని, రూ.70 వేలు ఇస్తానని రైతు వీఆర్వోకు చెప్పాడు. అనంతరం ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపాడు. ఈ మేరకు వీఆర్వోను పట్టుకోవాలని ఏసీబీ అధికారులు పథకం పన్నారు. గురువారం రూ.50 వేలను రైతు ముత్యంరెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలోని వీఆర్వో కార్యాలయంలో శంకర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. అధికారులు ఎవరైనా పనులు చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే తమను ఆశ్రయించాలని 94404 46140 నంబర్లో ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సూచించారు. కాగా, వీఆర్వో శంకర్ రెండు నెలల క్రితమే తొలిసారిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం. -
తవ్వేకొద్దీ శివప్రసాద్ అవినీతి బాగోతం
సాక్షి, కర్నూలు : ఏసీబీ అధికారుల ముందు అవినీతి దొంగ వ్యవహారం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణలతో కర్నూలు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ.శివ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. కర్నూలు, హైదరాబాద్, బెంగుళూరుతోపాటు మొత్తం అయిదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ. 8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతేగాక ఇతని పేర దాదాపు రూ. 20 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఏసీబీ సోదాలు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశం ఉంది. శివప్రసాద్ అక్రమ ఆస్తులు చిట్టా.. ► బెంగళూరులోని కార్తీక్ నగర్లో మూడు కోట్ల విలువైన జీప్లస్ సెవెన్ అపార్ట్ మెంట్, ఉదాల్ హల్లిలో రెండు కోట్ల విలువ చేసే ఇంటి స్థలం. ► హైదరాబాద్‌లోని జయభేరి ఆరెంజ్ ఆర్కేట్ లో కోటిన్నర విలువచేసే అపార్ట్మెంట్, గాజుల మల్లాపురంలో కోటి రూపాయల ఇంటి స్థలం. ► ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో రూ.1.45 లక్షల నగదు, కిలో బంగారం లభించింది. ► మనీ ట్రాన్స్ఫర్ కోసం భార్య పేరు మీద ఆక్సీ ట్రీ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ , సిన్బిడ్స్ అనే రెండు సూట్ కేసు కంపెనీల స్ధాపన. ► యుగాండా దేశంలోని బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయి. -
బయటపడ్డ ఆడియో టేపులు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కుంభకోణానికి సంబంధించిన అక్రమాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరో సంచలన విషయం శనివారం బయటపడింది. డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్ర నాథ్ బెదిరించిన ఆడియో టేపులు బయటకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణంలో ఈ ఆడియో టేపులు బయటకి వచ్చినట్టు సమచారం. వీటి ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సురేంద్ర నాథ్, డాక్టర్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈఎస్ఐ డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ ఒత్తిడి చేశాడు. క్యాంపుల పేరుతో మెడిసిన్ పంపించినట్లు రాసుకొని ఓ రికార్డు తయారుచేయాలని డాక్టర్‌కు చెప్పాడు. అయితే డాక్టర్ ఒప్పుకోకపోవడంతో సెక్షన్ ఆఫీసర్ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా మరో మహిళా డాక్టర్‌కు కూడా సురేంద్ర ఫోన్ చేసి బెదిరించాడు. ఏడాది తర్వాత క్యాంప్ నిర్వహించినట్లు బిల్లులు తయారు చేయాలని ఆ మహిళా వైద్యురాలిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఏడాది తర్వాత బిల్లులు తయారు చేయలేనని ఆ ఈఎస్ఐ డాక్టర్ తెగేసి చెప్పారు. అయితే డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ బిల్లుల కోసం అడుగుతున్నారని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ డాక్టర్ మాత్రం నిబంధనల ప్రకారమే ముందకు వెళ్తానని సురేంద్రకు స్పష్టంగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగాతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణితోపాటు వరంగల్ జాయింట్ డైరెక్టర్ కె.పద్మ, అడిషనల్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, రిప్రజెంటేటివ్ శివ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఆమ్ని మెడికల్‌కు చెందిన హరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 455 (ఏ), 465, 468, 471, 420, 120–బీ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 17మంది ఐఎంఎస్ ఉద్యోగులు, ఐదుగురు మెడికల్ కంపెనీల ప్రతినిదులు, ఓ టీవీ చానల్ రిపోర్టర్‌పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే.. -
ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. షేక్‌పేటలోని తన నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో దేవికా రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో తెలిసిందే. దీంతో నిన్నంతా దేవికా రాణి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 17మంది ఉద్యోగులు, నలుగురు ప్రయివేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నకిలీ బిల్లులు సృష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ, సుమారు రూ.10 కోట్ల వరకూ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్లోనూ ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో దేవికా రాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మసిస్ట్ రాధిక, ఈఎస్ఐ ఉద్యోగి నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్థన్, ఎండీ శ్రీహరిని అరెస్ట్ చేసి, ఈఎస్ఐ సిబ్బందిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే 23 ప్రదేశాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, బంగారాన్ని సీజ్ చేశారు. మరోవైపు దేవికా రాణి ఇంట్లో రెండు సూట్‌కేసులు, రెండు బ్యాగుల డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎమ్ఎస్) విభాగంలోని అవీనీతి పుట్ట బద్దలయింది. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఐఎమ్ఎస్ విభాగానికి చెందిన 23 మంది ఉద్యోగుల ఇళ్లపై నిన్న (గురువారం) ఏకకాలంలో దాడులు జరిపింది. దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లలుకు సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదించింది. దేవికా రాణిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలింపు నేపథ్యం ఏంటి? ఐఎమ్ఎస్ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కారని, భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఐఎమ్ఎస్ ఉద్యోగులు, మెడికల్ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు దిగమింగారని ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాని ఈఎస్ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ ఏసీబీకి లేఖ రాసారు. ఈ మేరకు ఈ కేసును ఏసీబీ స్వీకరించింది. ముందుగా విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. పలు రికార్డులను, కొనుగోళ్లను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు అక్రమాలను ధ్రువీకరిస్తూ ఏసీబీకి నివేదిక అందజేసారు. దేవిక రాణి నివాసంలో ఏసీబీ తనిఖీలు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంగా ఐఎమ్ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు చేసారు. ఈ విభాగానికి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఆమ్నీ మెడికల్ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్ ఫార్మాకు చెందిన సుధాకర్‌రెడ్డి, వీ–6 చానల్ రిపోర్టర్ నరేందర్‌రెడ్డితోపాటు పలువురు ఉద్యోగులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులతో టెండర్లు లేకుండా మందులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. షేక్‌పేటలోని దేవికా రాణి నివాసం ఏసీబీ అధికారులు ఏమంటున్నారు ఐఎమ్ఎస్ జాయింట్ డైరెక్టర్ డా.కె.పద్మ 2018 మే 26, 28వ తేదీల్లో రూ.1.03 కోట్ల నకిలీ బిల్లులను రూపొందించారు. వీటిని పటాన్చెరు, బోరబండ ఇన్‌ఛార్జి మెడికల్ ఆఫీసర్ల సాయంతో ఈ బిల్లులు క్లెయిమ్ చేశారు.అదే నెలలో బొంతపల్లి, బొల్లారం డిస్పెన్సరీలకు రూ.1.22 కోట్ల నకిలీ బిల్లులు తయారు చేసి మందులను మాత్రం పంపకుండా డబ్బులు జేబులో వేసుకున్నారు. ఐఎమ్ఎస్ డైరెక్టర్ దేవికారాణి ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది. అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరతో కలిసి ఏకంగా రూ.9.43 కోట్లను బిల్లులపేరిట 2017–18 ఆర్థిక సంవత్సరంలో స్వాహా చేశారు. మొత్తంగా మందుల కోనుగోళ్ల పేరిట రూ.11.69 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఐఎమ్ఎస్ సిబ్బందితోపాటు పలువురు ప్రైవేటు మెడికల్ ఏజెన్సీల ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ శివ, తేజ ఫార్మా ఏజెంట్ సుధాకర్‌రెడ్డి, ఆమ్నీ మెడిసిన్స్కు చెందిన శ్రీహరి, వీ–6 చానల్ రిపోర్టర్ నరేందర్‌రెడ్డి ఇళ్లపైనా దాడులు జరిగాయి. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరిపితే...మరిన్నిఅ క్రమాలు వస్తాయని ఈఎస్ఐ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
సాక్షి, సీతానగరం(విజయనగరం) : భూములు ఆన్లైన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఉద్యోగిని ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. లంచం ఇచ్చిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోను విచారణ జరపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... సీతానగరం మండలం బూర్జ రెవెన్యూ పరిధిలోని చెల్లన్నాయుడువలస గ్రామానికి చెందిన రైతు భాస్కరరావు తన భూములను ఆన్లైన్ చేయాలని వీఆర్వో రాయిపిల్లి బలరాంకు విన్నవించాడు. భూముల పత్రాలను సైతం అందజేశాడు. ఏడాదిగా తిరుగుతున్నా ఇప్పటికీ పని పూర్తిచేయలేదు. ఇప్పటికే కొంత మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాడు. మళ్లీ లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇస్తానని వీఆర్వోకు భాస్కరరావు నమ్మబలికాడు. వీఆర్వో సూచనల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తానని చెప్పాడు. లంచం డబ్బుల కోసం ఉదయం 11.30 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి వీఆర్వో చేరుకున్నాడు. రైతు కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికే వలపన్నిన ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచం ఇవ్వాల్సిన రూ.9 వేలును దాసరి భాస్కరరావుకు అందజేశారు. వాటిని తీసుకెళ్లి రైతు ఇస్తుండా వీఆర్వోను ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
అవినీతిని ‘కాల్’చేస్తున్నారు!
పెద్దపల్లిలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.2,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. కామారెడ్డికి చెందిన ఓ ఎక్సైజ్ సీఐ, ఎస్సై లంచం అడిగినందుకే క్రిమినల్ మిస్ కండక్ట్ కింద ఏసీబీ అధికారులు కేసులు బుక్ చేశారు. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు అవినీతిపై సమరశంఖం పూరిస్తున్నారు. లంచం డిమాండ్ చేస్తున్న ఒక్కో అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టిస్తున్నారు. అవినీతిపై మీడియా ప్రచారం, ఇటు ఏసీబీ చర్యలు వెరసి ప్రజల్లో కదలిక వచ్చింది. ఫలితంగా బాధితులు ఒక్కొక్కరు ముందు కొస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం మొదలుకుని మిగిలిన 33 జిల్లాల కార్యాలయాలకు ప్రతీరోజూ పలువురు బాధితులు ఫోన్లు చేస్తున్నారు. ప్రతీ కార్యాలయానికి రోజుకు ఐదు నుంచి 10 వరకు బాధితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రజల్లో పెరిగిన చైతన్యంతో ఏసీబీ రెట్టింపు దూకుడుతో పనిచేస్తోంది. ఓ వైపు ప్రజలను వేధించే అవినీతి జలగలకు వల వేస్తూనే.. మరోవైపు అక్రమంగా దోచే సిన సొమ్ముతో ఆస్తులు కూడబెడుతున్న వారిపై దాడులు చేస్తోంది. వరంగల్ జోన్ నుంచే ఎక్కువగా.. ఏసీబీని ఉమ్మడి జిల్లాల ప్రకారంగా మూడు జోన్లుగా విభజించారు. వాటిలో వరంగల్ (కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్), హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి), రూరల్ హైదరాబాద్ (నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్) జోన్లుగా ఉన్నాయి. వీటికి డీఎస్పీ ర్యాంకు అధికారి చీఫ్‌గా వ్యవహరిస్తారు. కొత్త జిల్లాల అనంతరం కూడా వాటి బాధ్యతలను కూడా వారే చూసుకుంటున్నారు. ఈ మూడు జోన్లలో వరంగల్ నుంచి అంటే ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో గ్రామీణ ప్రాం తాల్లో రెవెన్యూ, గ్రామ పంచాయతీ విభాగాలపై ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి. ఇక హైదరాబాద్ జోన్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు క్లియర్ చేసేందుకు అధికారులు లంచం అడుగుతున్నారు. ఇందులో పోలీసు, ఎక్సైజ్, జీఎస్టీ, రెవెన్యూ మొదలుకుని దాదాపుగా అన్ని విభాగాలున్నాయి. ఈ మూడు జోన్లలో తక్కువ ఫిర్యాదులతో హైదరాబాద్ రూరల్ నిలిచింది. ఏసీబీ కార్యాలయాలకు వస్తున్న ఫోన్ కాల్స్‌లో 50 శాతం మాత్రమే కేసుల వరకు వెళ్తున్నాయి. ఫిర్యాదు చేసిన తరువాత చాలామంది తర్వాత పరిణామాలకు భయపడి వెనకడుగు వేయడమే దీనికి కారణం. దీంతో అధికారులు రూట్ మార్చారు. ఆడియో, వీడియోలతో చెక్.. ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఏసీబీ అవినీతి అధికారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజల్ని లంచాలడిగి పీడిస్తోన్న అధికారులను చాకచక్యంగా పట్టుకుంటోంది. ముందుగా లంచం అడిగే అధికారి సంభాషణలను ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారి ఆఖరి నిమిషంలో లంచం తీసుకోవడానికి ఆసక్తి చూపకపోయినా, ఫిర్యాదుదారుడు వెనక్కు తగ్గినా.. లంచం అడిగిన అధికారిపై కేసులు నమోదు చేస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారి లంచం డిమాండ్ చేయడం నేరమే. అందుకు క్రిమినల్ మిస్ కండక్ట్ కింద సెక్షన్ 7ఏ/2018 పీసీ సవరణ చట్టం ప్రకారం కేసులు బుక్ చేస్తున్నారు. దీంతో లంచం అడిగేందుకు అధికారుల్లో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. -
ఏసీబీ వలలో ఆర్ఐ
సాక్షి, చాగల్లు(పశ్చిమగోదావరి) : అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో రెవెన్యూ అధికారి చిక్కారు. పట్టాదారు పాస్‌పుస్తకం కోసం సొమ్ములు డిమాండ్ చేసిన అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంగళవారం చాగల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన రైతు అయినం దుర్గాప్రసాద్ వద్ద చాగల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న గాడి సుబ్బారావు పొలం పట్టాదారు పాస్ పుస్తకం నిమిత్తం రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు దుర్గాప్రసాద్ తండ్రి భీమయ్య మృతిచెందడంతో తండ్రి పేరు మీద ఉన్న 1 ఎకరా 75 సెంట్ల వ్యవసాయ భూమిని తన తల్లి కాంతమ్మ పేరుపై మార్చి పాస్ పుస్తకం ఇవ్వాలని కోరుతూ ఈనెల 1న మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వో ధ్రువీకరించిన తర్వాత అతని దరఖాస్తు ఆర్ఐ సుబ్బారావు వద్ద పెండింగ్‌లో ఉంది. అప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రైతు దుర్గాప్రసాద్ పలుమార్లు తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో పాస్ట్‌పుస్తకం కావాలంటే రూ.2 వేలు ఇవ్వాలని ఆర్ఐ సుబ్బారావు ఫోన్లో దుర్గాప్రసాద్‌ను డిమాండ్ చేశారు. దీంతో దుర్గాప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అతని ఫిర్యాదు మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆర్ఐ సుబ్బారావుకు దుర్గాప్రసాద్ రూ.2 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. సుబ్బారావుపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సుబ్బారావును రాజమండ్రి ఏసీబీ కోర్టుకు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏసీబీ సీఐలు కె.శ్రీనివాసరావు, ఎం.రవీంద్ర, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. అనంతరం రైతు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనకు పాస్‌పుస్తకం ఇప్పించాలని పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగానని.. సొమ్ములు ఇస్తేనే పని అవుతుందని ఆర్ఐ సుబ్బారావు చెప్పడంతో విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయిం చానని చెప్పారు. ఆర్ఐ సుబ్బారావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. చాగల్లులో తహసీల్దార్ కార్యాలయంలో గతంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు కూడా అతనిపై ఫిర్యాదులు రావడంతో కొంతకాలం విధులకు దూరమయ్యారు. అవినీతిపై సమాచారం ఇవ్వండి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అవినీతి అధికారులపై తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ అన్నారు. 94404 46157 ఫోన్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి
సాక్షి, హైదరాబాద్ : ఈస్ట్‌జోన్ జీహెచ్ఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తూ పలు ఫైళ్లకు సంబంధించిన వివారాలు అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ టాక్స్ ఇన్స్‌స్పెక్టర్ రవిప్రసాద్, బిల్ కలెక్టర్ పోచయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఓ భవన యజమాని వద్ద నుంచి 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్ : దుండిగల్ పంచాయతీ కార్యలయంలో ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. పంచాయతీ కార్యలయంలో 31 వేలు లంచం తీసుకుంటూ మేనేజర్ గోవింద్ రావు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డి , ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ రెడ్డి పట్టుబడ్డారు. ఒక కేసుకు సంబంధించి బాధితుల నుంచి 2 లక్షల 50 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్ఐ
సాక్షి, విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీలో లంచం తీసుకుంటూ ఓ ఆర్ఐ.. ఏసీబీకీ పట్టుబడ్డాడు. దరఖాస్తు దారుని నుంచి లంచం తీసుకుంటూ ఆర్ఐ శంకరరావు అడ్డంగా దొరికిపోయాడు. పట్టణంలోని బహుళ అంతస్తు భవనానికి అసెస్మెంట్ ట్యాక్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుంచి 2.80 లక్షల భారీ మొత్తం డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించటంతో పక్కా ప్రణాళికతో నిఘా వేసిన ఏసీబీ.. మున్సిపల్ ఆర్ఐ శంకరరావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. -
రూ. 25 కోట్ల అధర్మ ఆదాయం!
సాక్షి, మంత్రాలయం(కర్నూలు) : ఆలయ ఆదాయాలను దిగమింగాడో.. బినామీ కాంట్రాక్టర్ అవతారమెత్తి కాసులను మెక్కాడో తెలియదు గానీ మొత్తానికి ఆదాయానికి మించి ఆస్తులు గడించాడు ఈ పి.రాంప్రసాద్. ధర్మ సంస్కృతికే మచ్చ తెచ్చాడు. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి గ్రేడు–1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. ఎదుగుతూనే అక్రమ ఆస్తులను అంతకు అంత పెంచుకున్నాడు. గురువారం ఏసీబీ దాడుల్లో ఆయన అక్రమాస్తుల గుట్టు రట్టయ్యింది. దాదాపు పాతిక కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు రికార్డులు తెలుపుతుండడం దేవదాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉరకుంద ఈరన్న స్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా రాంప్రసాద్ 1990లో ఉద్యోగం సంపాదించారు. ఏడేళ్ల క్రితం గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి పొందారు. కసాపురం, మహానంది, శ్రీశైలం, ఉరకుంద, ఆదోని గ్రూపు టెంపుల్ ఈవోగా పనిచేశారు. 2013 నుంచి 2014 నవంబర్ వరకు , అనంతరం 2018 జూన్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు ఉరుకుంద ఆలయ ఈవోగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనూ హుండీ ఆదాయం పక్కదారి పట్టించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతకు మించి బినామీ పేర్లతో టెంకాయ దుకాణాలు దక్కించుకోవడం, సున్నాలు వేయడం తదితర పలను చేశారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ నాయకుల పంచన ఉండి పదవులతో పాటు పైకం కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమాలు ఇలా బయటపడ్డాయి... ప్రస్తుతం గూడురు మండలం దేవాలయాల గ్రేడ్–1 గ్రూపు ఈఓగా పనిచేస్తున్న రాంప్రసాద్ అక్రమాలు..ఏసీబీ అధికారుల దాడులతో బయటికి వచ్చాయి. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో సీఐలు ఖాదర్‌భాష, శ్రీధర్, చక్రవర్తి, ప్రవీణ్‌కుమార్ ఆద్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఆదోని పట్టణంలోని రాంప్రసాద్ ఇంటితో పాటు ఆయన సమీప బంధువుల ఇళ్లపై గురువారం దాడులు చేశారు. రాంప్రసాద్ తన పేరు, కుటుంబ సభ్యుల పేర్లపై రూ.2కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల సోదాలో తేలింది. తాజా మార్కెట్ విలువ మేరకు వీటి విలువ పదింతలకు పైగా ఉండొచ్చని అంచనా. దాడుల్లో ఆదాయానికి మించి భారీ స్థాయిలో అస్తులు కూడబెట్టుకున్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు తెల్లబోయారు. సోదాలో పట్టుబడిన బంగారు, నగదు ఇవీ ఆస్తులు.. ► రాంప్రసాద్ భార్య లక్ష్మీదేవి పేరుపై ఆదోని, ఎమ్మిగనూరులో 23 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. ► కోసిగిలో 2.5 ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించారు. ► ఇద్దరు కూతుళ్లు ఉండగా ఓ కూతురు పేరిట రూ.15.5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ► రూ.28.44లక్షలు అప్పు ఇచ్చినట్లు ప్రాంసరీనోట్లను అధికారులు గుర్తించారు. ► కూతురు పేరిట ఉన్న 2 స్కూటర్లను అధికారులు జప్తు చేశారు. ► ఇంట్లో దాచిన రూ.6లక్షల నగదు, 75 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ► ఆదోని పట్టణంలో మొత్తం మూడు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబందించిన డాక్యుమెంట్లను కూడాస్వాధీనం చేసుకున్నారు. ► కర్నూలు శ్రీనివాసనగర్‌లో కూడా ఇటీవలే ఇల్లు కొనుగోలు చేసిటనట్లు సోదాలు దొరికిన డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. ► కర్నూలులో కూడా మరో మృందం సోదాలు నిర్వహిస్తోందని డీఎస్సీ నాగభూషణం తెలిపారు. ► ఆదోని పట్టణంలోని కర్ణాటక బ్యాంకులో లాకర్ ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నం సోదాలు జరిపారు. ► లాకర్లో రూ.లక్ష నగదు, 55 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ► రూ.40వేలు జీతం పొందుతున్న రాంప్రసాద్ రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడ బెట్టడం వెనుక అవినీతి అక్రమాలు ఉన్నట్లు తేటతెల్లం అవుతోందని డీఎస్సీ నాగభూషణం తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టుకున్న ఈఓ రాంప్రసాద్ ఇంటిపై జరిగిన ఏసీబీ దాడులు అక్రమార్కుల్లో వణుకు ప్రారంభం అయింది. ఇలాంటి అధికారులు ఇంకా చాలా మంది ఉన్నారని, వారి ఆస్తులను కూడ గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
సబ్ రిజస్ట్రార్ కార్యాలయంపై.. ఏసీబీ దాడి
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వచ్చిన అవినితీ ఆరోపణల నేపథ్యంలో ఆకస్మికంగా దాడి చేశామని ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజువారి వేతనానికి పనిచేస్తున్న ఉద్దగిరి శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద రూ.70 వేలు ఉన్నట్లు డీఎస్పీ గుర్తించారు. రిజస్ట్రార్ కార్యాలయంలోని క్రయ, విక్రయ దస్త్రాలను పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ రాజేశ్వరరావుతో పలు విషయాలపై డీఎస్పీ విచారించారు. తనిఖీలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో అవినీతి నిరోధక శాఖ సీఐలు భాస్కరరావు, హరి, ఇతర సిబ్బంది ఉన్నారు. ఉలిక్కిపడిన సిబ్బంది ఆగస్టు 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతున్నాయని తెలియడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం క్రయ, విక్రయధారుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ సమయంలో ఏసీబీ అధికారుల ప్రవేశంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందితోపాటు కార్యాలయం సమీపంలోనే క్రయ, విక్రయాల లావాదేవీలపై డాక్యుమెంటేషన్ చేసే మధ్యవర్తులను అదుపులోనికి తీసుకుని కార్యాలయంలో జరిగే కార్యక్రమాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటైన తరువాత ఏసీబీ దాడులు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల అడ్డా్డగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రైవేటు వ్యక్తుల అడ్డగా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరి చెప్పినదానికే సిబ్బంది కూడా తల ఉపడంతో చేసేది ఏమిలేక క్రయ, విక్రయాలకు కూడా వీరినే సంప్రదించడం పరిపాటిగా మారింది. ఈ తతంగం కొన్నేళ్లుగా జరుగుతున్నా.. రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది అడ్డుకట్ట వేయడంలేదు. ఈ కార్యాలయంలో ప్రతి పని కాసులపైనే నడుస్తుంది. ఆస్తుల క్రయ, విక్రయాల లావాదేవీలు ప్రైవేటు వ్యక్తుల కనుసైగల్లోనే జరుగుతున్నాయి. రిజిస్ట్రేన్‌కు సంబంధించిన వ్యవహారాలన్ని వీరు చూడడంతో ఒక్కో పనికి ఒక రేటు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలతో పనిలేకుండా నేరుగా వీరి సమక్షంలోనే లావాదేవీలు జరపడంతో అటు కార్యాలయంలోని దిగువ స్థాయి సిబ్బంది, ఇటు క్రయవిక్రయాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో దస్తావేజులు తదితర వ్యవహారమంతా ప్రైవేటు వ్యక్తులే చూడడం పరిపాటిగా మారింది. ఎవరికైనా దస్తావేజు పత్రాలు అవసరమైతే వారి వద్ద నుంచి భారీ మొత్తాన్ని తీసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి తెలియకుండానే పనులు చక్కబెడుతున్నారు. భూముల ధరలు ప్రైవేటు వ్యక్తులకు బయటకు తెలియపర్చడంతో కొన్నిసార్లు క్రయ, విక్రయాదారుల మధ్య వివాదాలు చోటుచేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ ఝాన్సీ రాణి బదిలీ అయ్యారు. 15 రోజుల క్రితమే రాజేశ్వరరావు రిజిస్ట్రార్‌గా వచ్చారు. -
ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు
సాక్షి, హైదరాబాద్: కేశంపేట తహశీల్దార్ లావణ్య ఏసీబీ విచారణకు సహకరించట్లేదు. శుక్రవారం ఉదయం ఆమెను చం చల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. విచారణ ప్రారంభించగానే తల తిరుగుతోందని, వాంతు వచ్చేలా ఉందంటూ ప్రశ్నలు అడగనీయకుండా చేసి నట్లు తెలిసింది. వీడియో చూసి మౌనం.. ఇటీవల ఏసీబీ దాడిలో లావణ్య వద్ద రూ.93 లక్షల నగదు లభించిన విష యం తెలిసిందే. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిం దన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. రూ.35 లక్షలు సింగిల్ సెటిల్మెంట్ అనడానికి తమ వద్ద ఉన్న వీడియో సాక్ష్యాలను అధికారులు ఆమె ముం దుంచినట్లు సమాచారం. వాటిని చూడగానే ఆమె మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారించినా ఆమె నుంచి ఏసీబీ అధికారులు సమాధానాలు రాబట్టలేకపోయారు. శనివారం మధ్యాహ్నం వరకే సమయం ఉండటంతో ఈ లోపు ఆమె చేత నిజాలు చెప్పించగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. మరో రూ.36.8 లక్షల గుర్తింపు.. ఏసీబీ దాడి చేసిన రోజు రూ.36.8 లక్షలను లావణ్య ఆమె బంధువుల ఖాతాల్లో గుర్తించారు. ఆమె సోద రుడి ఖాతాలో రూ.20.5 లక్షలు, నల్లగొండలోని బంధువు ఖాతాలో రూ.8 లక్షలు, లావణ్య ఖాతాలో రూ.5.99 లక్షలు, భర్త వెంకటేశం బ్యాంకు ఖాతాలో రూ.1.36 లక్షలు, ఇవి కాకుండా లావణ్యకే చెందిన మరో 2 ఖాతాల్లో రూ.40 వేలు, రూ.50 వేలు రూ.36.8 లక్షల సొమ్ము గుర్తించారు. ఇందులో లావణ్య ఖాతాలో ఉన్న సొమ్ము ఆమె వేతనంగా భావిస్తున్నారు. కేశంపేట తహశీల్దార్‌గా నియామకం కావడం కంటే ముందు లావణ్య ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పనిచేశారు. అక్కడ పరిచయమైన ఓ అధికా రిని తన బంధువు అని చెప్పుకొంటూ పలు లావాదేవీల్లో ఆ అధికారి పేరును వాడుకున్నట్లు తెలిసింది. -
బోర్డులో నీతి.. లోపలంతా అవినీతి
సాక్షి హైదరాబాద్/షాద్‌నగర్ టౌన్: కార్యాలయాలబయట అవినీతి రహిత సేవలు అంటూ పెద్ద అక్షరాలతో ప్రకటనలు.. లోపలకు అడుగుపెడితే చాలు గుప్పుమంటున్న అవినీతి వాసనలు. ఇది అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లుగా మారిన రెవెన్యూ కార్యాలయాల పరిస్థితి. ఇందులో దొరికిన వారే దొంగలు.. కానీ దొరకని వారు చాలా మందే దర్జాగా దండుకుంటున్నారు. రెవెన్యూశాఖలో ఇలాంటి తిమింగళాలు ఎందరో ఉన్నారు. వీరిద్వారా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకున్నందుకే.. రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు సీఎం కేసీఆర్ నడుంబిగించారు. కాగా.. ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు పొంది.. అక్రమ సంపాదనలో రికార్డు సృష్టించిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య తీరు పై విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మనమందరం కలిసి పంచుకుందాం అనే నినాదంతో కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని వెల్లడైంది. 2016 నవంబర్ 21న కేశంపేట తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లావణ్య మండలంలో పట్టుబిగించారు. ఈప్రాంతం లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కన్నేశారు. తన పేరు బయట పడకుండా మధ్యవర్తులను తెరపైకి తీసుకొచ్చి భూవివాదాలు సెటిల్మెంట్లు చేసేవారని తెలుస్తోంది. ఫైలు కదలాలంటే ఆమ్యామ్యా తప్పదు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదంటే ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని.. భూ రికార్డుల మార్పిడి, ఆన్లైన్లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం బయట ‘ఈ కార్యాలయం అవినీతి రహిత కార్యాల యం’అంటూ పెద్ద అక్షరాలతో బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. వీఆర్ఏ, వీఆర్ఓ, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయా లని లావణ్య ఇటీవల కార్యాలయం ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. కానీ, ఆ బోర్డులను ఏర్పాటు చేయించిన తహసీల్దారే భారీ అవినీతి తిమింగళమని తెలియడంతో రైతులు, ప్రజలు అవాక్కయ్యారు. చంచల్‌గూడ జైలుకు లావణ్య, వీఆర్వో బుధవారం రూ.93 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని గురువారం ఉదయం 6 గంటల వరకు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఉంచి విచారించారు. కార్యాలయం లోని ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండిం గ్ ఫైళ్ళ గురించి ఆరా తీసి.. ఎందుకు పెండింగ్‌లో ఉంచారని లావణ్యను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్యాలయంలోని రికార్డు గదిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. గురువారం ఉదయం 6గంటల ప్రాం తంలో ఆమెను, వీఆర్వోను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి మరోసారి విచారణ చేపట్టారు. ఇద్దరికీ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఇం ట్లో హాజరుపర్చారు. 14రోజులపాటు రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వీద్దరినీ చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ఇదే తంతు ఈమె గతంలో పనిచేసిన చోట్ల కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కౌడిపల్లి, దౌల్తా బాద్, ములు గు, కొండాపూర్ మండలాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన లావణ్య అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారులు, స్థానిక రాజకీయ నాయకుల అండతో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని వెల్లడైంది. ములుగు మండలంలో ఆమె పనిచేస్తున్న సమయంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలను అడ్డాగా చేసుకుని దందా కొనసాగించేవారని తెలుస్తోంది. కొండాపూర్ నుంచి బదిలీ అయిన రోజు కూడా కార్యాలయానికి వచ్చి పాత ఫైళ్లన్నింటినీ క్లియర్ చేసి అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులెన్నో.. ఏసీబీలో ఓ ముఖ్యమైన అధికారి తన సన్నిహితుడి పనికోసం లావణ్యను సంప్రదిస్తే.. దాన్ని పరిష్కరించేందుకు ఆమె ఏకంగా 2నెలలు తిప్పినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖకే చెందిన మరో అధికారి చేత సిఫారసు చేయిస్తే గానీ ఆ పని పూర్తి కాకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఓ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో ఆమెకు రూ.40లక్షలు ముట్టాయని..ఏసీ బీ దాడుల్లో పట్టుబడింది కూడా ఆ నగదేనంటూ ప్రచారం జరుగుతోంది. లావణ్య వంటి అవినీతి తిమింగళాలు రెవెన్యూశాఖలో ఎందరో ఉన్నారు. అడపాదడపా వీరు పట్టుబడుతున్నా.. చర్యలు తీసు కోవడంలో ఉన్నతాధికారుల ఉదాసీనత కూడా అవి నీతి పెరిగేందుకు ఊతమిస్తోందనే విమర్శలున్నా యి. అరెస్టు చూపిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు, అధికారులు, సచివాలయంలోని పేషీలు శ్రద్ధ చూపకపోవడంతోనే.. రెవెన్యూ శాఖ అవినీతి ఊబిగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. అందుకే కేసీఆర్ ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు. ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్న మచ్చుకు కొన్ని కేసులివి: హైదరాబాద్ కలెక్టరేట్లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ 2010, ఫిబ్రవరిలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కారు. ఈ కేసు సమగ్రంగా విచారణ జరిపి అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ద్వారా ప్రాసిక్యూషన్‌కు సిఫారసు చేస్తూ ఏసీబీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ప్రాసిక్యూషన్‌కు నాలుగేళ్ల పాటు అనుమతి ఇవ్వకపోగా, కేసును విరమించుకోవడం గమనార్హం. అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మోహన్‌రావు 2010లో చేతివాటం ప్రదర్శిస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయనపై విచారణ జరిపి ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వాలని ఏసీబీ కోరినా ఎలాంటి పురోగతి లేదు. పైగా కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉండడం గమనార్హం. డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్ 2011లో అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో సోదాలు చేయగా, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో రాములు నాయక్ ప్రాసిక్యూషన్‌కు ఏసీబీ కోరింది. కానీ, కేసును మూడేళ్లు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం చివరకు శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకుంది. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ సహదేవ్ 2011లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసును సమగ్రంగా విచారణ జరిపిన ఏసీబీ 2012లో ఆయన్ను కూడా ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరగా, ప్రభుత్వం మాత్రం రెండేళ్ల తర్వాత శాఖాపరమైన విచారణకే పరిమితమైంది. ఆ విచారణ ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. గత ఐదేళ్లలో 50 వరకు ఇలాంటి అవినీతి కేసులను ప్రభుత్వం మూసివేసింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద గుమిగూడిన రైతులు, ప్రజలు లంచాలు తిరిగి ఇచ్చేస్తున్నారంటూ పుకార్లతో.. లావణ్యకు లంచాల రూపంలో ఇచ్చిన నగదును ఏసీబీ వారు తిరిగి ఇచేస్తున్నారంటూ మొదలైన పుకార్లు క్షణాల్లో పాకిపోవడంతో.. కేశంపేట ఎమ్మెఆర్వో కార్యాలయానికి బాధిత ప్రజలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అయితే.. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, నగదు గురించి ఎవర్ని అడగాలో తెలియకపోవడంతో ఇవన్నీ పుకార్లేనని అర్థం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు.