
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కాగా సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డికి సంబంధించిన నివాసంలో సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి నివాసంలో భారీగా ఆస్తులు, నగలను అధికారులు గుర్తించారు. ఇంట్లో 60 తులాల బంగారం, బ్యాంక్ లాకర్స్‌లో 129.2 తులాల బంగారం, నాలుగు ఓపెన్ ప్లాట్స్, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2,31,63,600 అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
చదవండి: బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్‌లో..
Comments
Please login to add a commentAdd a comment