Illegal assets
-
ఏఈఈ అక్రమాస్తులు రూ. 200 కోట్లపైనే..!
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: బఫర్ జోన్లలో నిర్మాణాలకు అక్రమంగా అనుమతులిచ్చి అందుకు ప్రతిగా లంచాలుగా ఆస్తులు పొందడంతోపాటు ఇటీవల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కి సస్పెండైన ఓ అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి రూ. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెరూర్ నిఖేశ్ కుమార్‌ను ఏసీబీ శనివారం రాత్రి అరెస్ట్ చేసింది. అంతకుముందు శనివారం ఉదయం నుంచి రాత్రి దాకా ఆయన ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏసీబీ మెరుపుదాడులు చేసింది.హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన ఇంటితోపాటు 19 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి, మొయినాబాద్‌లో 3 ఫాంహౌస్‌లు, విలాసవంతమైన 3 విల్లాలు, 5 నివాస స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ఫ్లాట్లు, రెండు కమర్షియల్ స్థలాలకు సంబంధించిన పత్రాలను ఏసీబీ గుర్తించింది. వాటి విలువ రూ. 17,73,53,500గా వెల్లడించింది. అయితే బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ రూ. 200 కోట్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఏసీబీ సోదాల సమయంలో పెద్ద మొత్తంలో ఖరీదైన వస్తువులు, విలువైన ఆభరణాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని తెలిసింది. మరోవైపు పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు, నిఖేశ్‌కుమార్‌కు మధ్య జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాజ పుష్ప అనే రియల్ ఎస్టేట్ సంస్థలో ఆయనకు 56 ఆస్తులు ఉన్నట్లు పత్రాలు లభించాయి. అలాగే మరో సంస్థలో ఆయనకు చెందిన 26 ఆస్తుల పత్రాలు కూడా బయటపడ్డాయి. రూ. లక్ష తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి.. రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ కార్యాలయంలో ఏడబ్ల్యూ సెక్షన్లో ఏఈఈగా పనిచేస్తున్న సమయంలో నిఖేశ్‌కుమార్ మరికొందరు అధికారులతో కలిసి మణికొండ, నేక్నామ్పూర్లో ఒక భవన నిర్మాణానికి అనుమతలిచ్చేందుకు రూ. 2.5 లక్షల లంచాన్ని తీసుకొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో ముందుగా రూ. లక్షన్నర తీసుకున్నారు. ఈ ఏడాది మే 30న లంచం మొత్తంలోని మిగిలిన రూ. లక్ష తీసుకుంటుండగా ఈఈ కె.భన్సీలాల్, నిఖేశ్‌కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.దీంతో నిఖేశ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో లంచాల సొమ్ముతో నిఖేశ్‌కుమార్ పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి తాజాగా సోదాలు చేపట్టారు. బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణ అనుమతులు.. చెరువులు, కుంటల దగ్గర భూముల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేసే విభాగంలో నిఖేశ్ కుమార్ విధులు నిర్వర్తించిన సమయంలో గండిపేట బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. -
కడప తహసీల్దార్ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి/కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప మండల తహసీల్దార్ సిద్దల శివప్రసాద్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో 9చోట్ల సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు తిరుపతి, పీలేరు, రేణిగుంట, కడపతో పాటు మొత్తం తొమ్మిది చోట్ల దాడులు చేశారు.కడపలోని ఆయన ఇంట్లో రూ.36 లక్షలను స్వా«దీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల ఖర్చుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్ఓ) కడప ఆర్డీఓ మధుసూదన్ నిధులను విడుదల చేసినట్లు తహసీల్దార్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీబీ అధికారులు ఆర్డీఓను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆయన కుటుంబం నివాసముంటున్న తిరుపతి వైకుంఠపురంలోని ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. తిరుపతి వైకుంఠపురంలో 266.66స్క్వయర్ యార్డుల విస్తీర్ణం కలిగిన జీప్లస్1 భవంతి, మాతృత్వ ఆస్పత్రి ప్రాంగణం, పీలేరులో 158.89స్క్వయర్ యార్డుల విస్తీర్ణంలో నిర్మాణ దశలో ఉన్న జీప్లస్2 భవనం, తిరుపతి, రేణిగుంటలో 5 ఇంటిస్థలాలు, తిరుపతి దామినేడు పరిధిలో 33 సెంట్ల స్థలం, తిరుపతి చెర్లోపల్లిలో 1,685 అడుగుల స్థలం, తిరుపతి వైకుంఠపురంలోని అలంకృతి మాల్ తదితర స్థిరాస్తులను గుర్తించారు. అలాగే టొయోటా ఇన్నోవా, మహింద్రా థార్ కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2.31లక్షలు, 390 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. వారి అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. సోదాలు కొనసాగుతున్నాయని, ఇంకా పెద్ద సంఖ్యలో అక్రమాస్తులు, లాకర్లలో దాచిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను కూడా గుర్తించినట్లు వివరించారు. రేణిగుంట మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములను రియల్టర్లకు ధారాదత్తం చేసి పెద్దమొత్తంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. -
షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకులపై ఫోకస్ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రియల్ కంపెనీలతో పలు లావాదేవీలు ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్ చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. -
బిగుస్తున్న ఉచ్చు.. మాజీ సీఎస్ సోమేష్పై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించారంటూ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమేష్‌కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించిన శ్రీకాంత్.. ఆయనకు గుర్గావ్లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయన్నారు. నోయిడాలోనూ కీలక ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు కొన్నారని శ్రీకాంత్ అంటున్నారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను జారీ చేశారన్న శ్రీకాంత్.. యాచారంలో సోమేష్‌కుమార్ భార్య పేరిట 25 ఎకరాల భూమిని కొన్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనూ సోమేష్‌కుమార్‌కు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఫిర్యాదు చేసిన శ్రీకాంత్.. సోమేష్‌కుమార్, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ అధికారాన్ని దుర్వినియోగంతోనే సంపాదించారని ఆరోపించారు. సోమేష్‌కుమార్ ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేసిన శ్రీకాంత్.. దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇదీ చదవండి: టీవీ5 సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు -
బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ చైర్మన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేసే క్రమంలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకునేందుకు బాలకృష్ణ ఎలాంటి మార్గాల్ని అనుసరించాడో తెలిసి అధికారులే కంగుతింటున్నారు. పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. ఇక.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. బంజారాహిల్స్ స్టేషన్‌ను తరలించి విచారిస్తోంది. ఆయన ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చిందో ఆరా తీస్తోంది. మరోవైపు బంధువులు, మిత్రుల పేర్లు మీద కూడా ఎకరాల కొద్దీ ఆయన భూములు కొన్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. కీలకమైన డాక్యుమెంట్లనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా బయటపడిన పత్రాలు, ఇతరాలను బట్టి.. ఆయన కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 300-400 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం జరిగిన సోదాల్లో.. ఒక్క నానక్‌రామ్‌గూడ లోని బాలకృష్ణ ఇంట్లోనే రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు.. నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఆయన వెనకేసినట్లు గుర్తించారు. -
నలుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడపశ్చిమ) : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో ఐదుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ అధికారులు శుక్ర, శనివారాలు తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున అక్రమ ఆస్తులను గుర్తించారు. ♦ కాకినాడ జిల్లా బెండపూడి ఆర్టీఏ చెక్‌పోస్ట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) పెసరమెల్లి రమేశ్‌బాబు నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్, మెదక్, కంచికచర్ల, విజయవాడ, గుడివాడ, కనుమోలులలో కలిపి మొత్తం ఎకరా భూమి, మూడు ఫ్లాట్లు, 11 ఇంటి స్థలాలు, రెండు నివాస గృహాలు, రెండు వాణిజ్య దుకాణాలతో పాటు ఇన్నోవా కారు, రూ.8.94 లక్షల నగదు, రూ.33.83 లక్షల బంగారు ఆభరణాలు, ఇతర గృహోపకణాలను గుర్తించారు. ♦నంద్యాల రవాణా కార్యాలయంలో పరిపాలన అధికారి కుంపటి సువర్ణ కుమారి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె నివాసంతో పాటు హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, బనగానపల్లి, మార్కాపురంలలోని బంధువుల నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. సువర్ణ కుమారికి కర్నూలు, కడపలలో ఇళ్లు, నంద్యాల, ఓర్వకల్, డోన్లలో ఇంటి స్థలంతో పాటు పెద్ద ఎత్తున చరాస్తులున్నట్టు గుర్తించారు. ♦ నంద్యాల గనుల శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ గండికోట వెంకటేశ్వరరావుకు గుంటూరు, నంద్యాల తదితర ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకటేశ్వరరావు, ఆయన భార్య పేరిట గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌ను ఆనుకుని జి+3 నివాసం, గుంటూరు రూరల్ మండలం, తాడికొండ, పెదకాకాని మండలాల్లో వ్యవసాయ భూములు, గుంటూరు నగరం, గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డును ఆనుకుని ఇళ్ల స్థలాలతో పాటు గుంటూరు నగరం, నరసరావుపేట, పెదకాకాని, గోరంట్లలో ఇళ్ల స్థలాలతో పాటు పెద్ద ఎత్తున చరాస్తులను గుర్తించారు. ♦ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ లాలా బాలనాగధర్మసింగ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ధర్మసింగ్, ఆయన కుటుంబ సభ్యులపేరిట విజయవాడలోని గొల్లపూడి, బాపట్ల జిల్లా కొల్లూరులలో జి+1 నివాసాలతో పాటు విజయవాడలో ఇంటి స్థలం, 4 ఫ్లాట్లు, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలతో పాటు రూ.69 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.10 లక్షల బ్యాంకు బ్యాలన్స్, రూ.18 లక్షల ఎల్ఐసీ పాలసీలు, పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలను గుర్తించారు. బినామీలపేరిట కూడా విజయవాడ, నల్లజర్లలో రెండు భవనాలు, మూడు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమి ఉన్నట్టు కూడా వెలుగు చూసింది. మరికొన్ని స్థిర, చరాస్తులు సింగ్ బంధువులు, స్నేహితుల పేరిట ఉన్నట్లు గుర్తించామని, తాము సోదాలకు వచ్చే సమయానికి సింగ్ పారిపోయారని ఏసీబీ అధికారులు చెప్పారు. -
హౌసింగ్ డీఈఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఒంగోలు టౌన్/చీరాల/మేదరమెట్ల/నగరంపాలెం/ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గుంటూరులో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈగా పని చేస్తున్న చెంచు ఆంజనేయులు ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో గుంటూరు, ఒంగోలు, బాపట్ల జిల్లా మేదరమెట్ల, వేటపాలెం మండలం కొత్తపేట, కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులో ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఈ సోదాల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒంగోలులో జీ ప్లస్ త్రీ హౌసింగ్ కాంప్లెక్స్, ఒక ప్లాటు, కొప్పోలులో 8 ఇళ్ల స్థలాలు, చీరాలలో ఒక జీ ప్లస్ వన్ భవనం, రెండు స్థలాలు, కడవకుదురు వద్ద 1.9 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.53 లక్షల సేల్‌డీడ్ పత్రాలు లభించినట్లు తెలిపారు. కిలో బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ధరల మేరకు ఆస్తుల విలువ రూ.2.81 కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. ఆంజనేయులును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఎస్ఈబీ సీఐ ఇళ్లల్లో రూ.కోటి విలువైన అక్రమాస్తుల గుర్తింపు శ్రీకాకుళం జిల్లా పొందూరులో లంచం తీసుకుంటూ దొరికిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.కోటి విలువైన అక్రమాస్తులను గుర్తించారు. విశాఖలోని విశాలాక్షినగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ఇంటితోపాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలోని ఆయన బంధువుల ఇంట్లోనూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఎస్ఈబీ సీఐగా పనిచేసిన శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ ఈ నెల 7న ఏసీబీకి దొరి కారని తెలిపారు. అప్పటి నుంచి ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. గతంలో పాడేరు ఎస్ఐగా పనిచేస్తున్న కాలంలోనూ ఆయన గంజాయి కేసులో ఏ8 నిందితుడిగా పట్టు బడి ఏడాది జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. -
పాక్ ఆర్మీ చీఫ్‌కు వేలకోట్ల అక్రమాస్తులు
పాక్ ఆర్మీ చీఫ్‌కు వేలకోట్ల అక్రమాస్తులు -
కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కాగా సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డికి సంబంధించిన నివాసంలో సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి నివాసంలో భారీగా ఆస్తులు, నగలను అధికారులు గుర్తించారు. ఇంట్లో 60 తులాల బంగారం, బ్యాంక్ లాకర్స్‌లో 129.2 తులాల బంగారం, నాలుగు ఓపెన్ ప్లాట్స్, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2,31,63,600 అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్‌లో.. -
బాబు అక్రమ ఆస్తులపై తీర్పు18కి..
సాక్షి, హైదరాబాద్ : అక్రమ ఆస్తులు కూడబెట్టాడంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్లో సోమవారం తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. న్యాయమూర్తి మరోసారి వాయిదా వేశారు. చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలంటూ లక్ష్మీపార్వతి 2006లో ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అయితే ఆరు నెలలకు మించి స్టే ఉత్తర్వులు కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించిన నేపథ్యంలో... ఈ ఏడాది మొదట్లో ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేసేలా ఏసీబీని ఆదేశించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది నివేదించారు. (దేవుడు చేసిన మనుషుల్లారా మీపేరేమిటి?) దీంతో ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ పిటిషన్‌పై ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నా... పలుమార్లు వాయిదాపడుతూ వస్తోంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అవినీతిపై దాఖలైన పిటిషన్లను రోజువారీ పద్ధతిలో విచారించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై వెంటనే తీర్పును వెలువరించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది పలుమార్లు ఏసీబీ ప్ర త్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సుప్రీం తీర్పు ఈ పిటిషన్‌కు వర్తించదని, కేసులు నమోదై న్యాయ స్థానాల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న వాటికే ఆ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసిన న్యాయమూర్తి... ఈ పిటిషన్‌పై తీర్పును 18కి వాయిదా వేశారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్మే అక్రమాలపై దాడులు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అక్రమాలపై మూడో రోజు రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు. పెందుర్తి బస్టాండ్ పక్క గెడ్డ ఆక్రమ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అక్రమాల బాగోతంపై వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రభుత్వ భూములను దోచుకున్నారని మండిపడ్డారు. పెందుర్తి పరిసరాల్లో ఎకరాల కొద్దీ భూమి వారి చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు లోతుగా విచారణ సాగిస్తే పీలా కుటుంబం అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. చదవండి: గోవిందా.. గోవిందా..? -
పదేళ్లలో కోట్లు కొల్లగొట్టాడు
చెన్నై : ఆయన పోలీస్ శాఖలో ఎస్ఐగా చేరి పదోన్నతితో ఇన్స్పెక్టర్ అయ్యాడు. విధుల్లో చేరిన పది సంవత్సరాల్లోనే తమిళనాట వందల కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. ఆయనకున్న ఆస్తులను చూసి అవినీతి నిరోధక శాఖనే నివ్వెరపోయింది. ఇప్పుడు మనం చెప్పుకున్నది వేలూరులో ఆర్థిక నేరాల ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నరమేశ్‌రాజ్ అనే పోలీస్ అధికారి గురించే. రమేశ్ రాజ్ తన తల్లిదండ్రులు, బందువుల పేర్ల మీద వేలూరు, చెన్నై నగరాల్లో 54 ఇళ్లను కలిగి ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందింది. ఏసీబీ అధికారులు వేలూరులోని రమేశ్ రాజ్ నివాసంలో శనివారం దాడులు నిర్వహించి రూ.10 కోట్ల విలువైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్ రాజ్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. -
అక్రమాస్తులు @ రూ.100కోట్లు!
విజయవాడ/సీతమ్మధార (విశాఖ): ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు.. రాష్ట్ర పర్యాటక శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్.శివరావు, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో శివరావుకు రూ.80 కోట్లు, శంకరరావుకు రూ.20 కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సెంట్రల్ టీమ్‌కు చెందిన 25మంది అధికారులు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయంలో ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివరావు ఇంటితో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో మొత్తం 6చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శివరావు భార్య, అత్త, బావమరిది, బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. వారి పేరు మీద దాదాపు రూ.80కోట్ల విలువ చేసే భూములు, స్థలాలు, ఇళ్లకు చెందిన డాక్యుమెంట్లు, చెక్కులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరంలో బందరు రోడ్డు పక్కనే ఉన్న టిక్కిల్ రోడ్డులో శ్వేత టవర్స్‌లో నివాసం ఉంటున్న శివరావు ఇంట్లో 793 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు, చెక్కులు డాక్యుమెంట్లు సోదాల్లో దొరికాయి. సోదాల్లో మొత్తం 14 ఇంటి ఫ్లాట్లు, 2 ఫ్లాట్లు 2ఇళ్లు, 0.96సెంట్ల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తమ సమీప బంధువులైన అన్నపూర్ణమ్మ, సుబ్బారావు, శ్రీనివాసరావు పేర్లతో 4 స్థలాలు కంకిపాడు, కంచికచర్లలో కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్న మొత్తం శివరావు అక్రమాస్తులు బహిరంగ మార్కెట్లో సుమారు రూ.80 కోట్లు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెప్పారు. కాగా విచారణ గురువారం కూడా కొనసాగుతుందని తెలిపారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని డీఎస్పీ రమాదేవి చెప్పారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నర్సీపట్నం, మధురవాడ, బొబ్బిలి, పలాస, టెక్కలి, భీమిలిలో సోదాలు నిర్వహించారు. రామకృష్ణ ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ సోదాల్లో విశాఖపట్నం ఎంవీపీకాలనీ, సెక్టార్–4లో 207 గజాల స్థలంలో ఇల్లు, మధురవాడ వాంబేకాలనీలో 267 గజాల్లో మూడు ఆంతస్తుల భవనం, భీమిలి, సంగివలస, నేరెళ్ల వలసలో 60 సెంట్ల భూమి ఉన్నట్లు గుర్తించారు. చిట్టివలస స్టేట్‌బ్యాంకు, భీమిలి స్టేట్‌బ్యాంకులో రూ.5 లక్షలు, బొబ్బిలి కరూర్ వైశ్యా బ్యాంకులో రూ.2లక్షల 50 వేలు విలువ గల బంగారం తనఖాలో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని స్థలాలు బినామీల పేరుతో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 కోట్ల పైన ఉంటుంది. శంకరావును అరెస్టు చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. -
మత్తెక్కించే అవినీతి
చిత్తూరు అర్బన్: ప్రభుత్వ ఉద్యోగంలో ఓ సాధారణ కానిస్టేబుల్‌గా చేరిన వ్యక్తి 26 ఏళ్ల సర్వీసులో ఏం సాధించావని ఎవరైనా అడిగితే మంచి పేరు అనో, నిజాయితీ ఉన్న వ్యక్తనో, ఎవ్వరికీ తలవంచడనో సమాధానాలు రావాలి. కానీ చిత్తూరుకు చెందిన విజయ్‌కుమార్ మాత్రం ఈ 26 ఏళ్ల సర్వీసులో దాదాపు రూ.35 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. కల్తీ మద్యం తయారు చేసిన కేసులో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సీఐడీ పోలీసుల చేత అరెస్టయి జైల్లో ఉన్నాడు. అయినా మార్పు రాలేదు. ఈసారి ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఇప్పటికీ ట్రాక్టర్ నడుపుతూ.. చిత్తూరు నగరంలోని కాజూరుకు చెందిన విజయ్ కుమార్‌ను చూస్తే ఎవరైనా ఇన్ని రూ.కోట్ల విలు వైన ఆస్తులున్నాయంటే నమ్మరు. ఎందుకంటే ఆబ్కారీ శాఖలో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాఓ సాధారణ వ్యక్తిలానే ఇతని దినచర్య ఉంటుంది. కర్నూలు నుంచి చిత్తూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు ఉదయాన్నే నీటి ట్యాంకరున్న ట్రాక్టర్ నడుపుతూ వీధుల్లో తాగునీరుఅమ్ముతుంటాడు. ఇక్కడున్న పెట్రోలు బంకు వద్ద తనకు చెందిన శుద్ధినీటి ప్లాంటులో కూర్చుని నీళ్ల క్యాన్లు విక్రయిస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి ఇన్ని రూ.కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నాడంటే స్థానికులు ఆశ్యర్యంగా చూస్తున్నారు. పాఠం నేర్పని గతం.. జిల్లాలోని తిరుపతిలో ప్రభుత్వ మద్యం బాటిళ్ల సరఫరా డిపోలో పనిచేస్తున్నప్పుడే విజయ్‌కుమార్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎన్నికల్లో కల్తీ మద్యం జిల్లాలోకి తీసుకొచ్చారనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు 2014లో విజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. బెయిల్ రాకపోవడంతో ఆరు నెలల వరకు జైల్లో ఉన్నాడు. అప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. జిల్లా నుంచి కర్నూలుకు బదిలీ అయినప్పటికీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అన్ని ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వామ్మో ఇన్ని ఆస్తులా.. విజయ్‌కుమార్ అక్రమ సంపాదన, ఆస్తుల గురించి సొంత శాఖలోని ఓ వ్యక్తి నుంచి ఆధారాలతో కూడిన పక్కా సమాచారం ఏసీబీకి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొద్దుపోయే వరకు తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ తిరుమలేష్, సీఐలు చంద్రశేఖర్, విష్ణువర్దన్, ప్రసాద్‌రెడ్డి, గిరిధర్, విజయశేఖర్, రమేష్, శివకుమార్, ఎస్ఐ విష్ణువర్దన్, కడప, కర్నూలుకు చెందిన ఏసీబీ అధికారులు చిత్తూరు, యాదమరి, తమిళనాడులోని కాట్పాడి, తిరుపతి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో విజయ్‌కుమార్ భార్య మీన పేరిట మూడంతస్తుల భవనం, రెండంతస్తుల భవనం, మరో రెండు భవనాలకు సంబంధించి పత్రాలు దొరికాయి. ఇరువారం, కాజూరు ప్రాంతాల్లో ఎనిమిది ప్లాట్లు, కాజూరులో ఓ ఇల్లు, తమిళనాడులోని కాట్పాడిలో ఓ ఇల్లుకు సంబంధించిన పత్రాలు, విజయ్‌కుమార్ పేరిట కాజూరులో ఓ శుద్ధినీటి ప్లాంటుకు చెందిన ఖాళీ స్థలం, ఇరువారం వద్ద ఓ స్థలాన్ని, ఇతని కొడుకు పేరిట ఉన్న ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇక బంగారు ఆభరణాల్లో ఆడవాళ్లు పెట్టుకునే చెవి కమ్మల్లో 10 రకాలు, చేతి కడియాలు, ఐదు రకాల గొలుసులు, పదికి పైగా ఉంగరాలు, రాళ్ల హారాలు, వెండి ఆభరణాలు చూసిన అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. టీడీపీ నేతల భరోసా... విజయ్‌కుమార్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు చిత్తూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత అండగా నిలిచినట్లు బహిరంగంగా చెబుతున్నారు. జైల్లో ఉన్న విజయ్‌కుమార్‌ను బయటకు తీసుకురావడంతో పాటు మళ్లీ పోస్టింగ్ ఇప్పించడం, పదోన్నతి కల్పించడంలో టీడీపీ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ స్థాయిలో పనిచేసిన ఓ మంత్రి అండదండలు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. మరోవైపు విజయ్‌కుమార్ ఆస్తులపై జరిగిన ఏసీబీ దాడులు జిల్లాలోని ఎక్సైజ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. తిరుపతిలోనూ తనిఖీలు తిరుపతి క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చిత్తూరు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ విజయ్‌కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి వివేకానందనగర్‌లో ఎస్ఐ చెల్లెలు విశాలాక్షి ఇంట్లో కూడా అధికారులు తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ మల్లేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేయగా ఎలాంటి ఆస్తులూ పట్టుబడలేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన ఆస్తుల కోసం ఆరా తీస్తున్నారు. -
ఏసీబీ వలలో చిక్కిన లేబర్ కోర్టు జడ్జీ
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ శనివారం ఉదయం దాడులు జరిపింది. ఆదాయానికి మించి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారనే అభియోగంతో వారాసిగూడలోని జడ్జి గాంధీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపారు. హైకోర్టు అనుమతితో జడ్జి అక్రమ ఆస్తులపై దాడులు నిర్వహించారు. ప్రస్తుతం గాంధీ జిల్లా జడ్జి క్యాడర్లో ఉన్నారు. ఏసీబీ అధికారులు జడ్జీపై కేసు నమోదు చేసి విచారుస్తున్నారు. వారాసిగుడలోని జడ్జీ ఇంటితో పాటు.. నాంపల్లి, డీడీ కాలనీ, ఆంధ్ర ప్రదేశ్‌లోని కొవ్వూరులో రెండు చోట్ల, ఏలూరు, రాజమండ్రితో సహా మొత్తం 7 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు చేపట్టింది. -
డీఈ అక్రమాస్తులు రూ.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాటపల్లి శ్రవణ్‌కుమార్‌రెడ్డి అక్రమాస్తులు రూ. 5 కోట్ల పై చిలుకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఆయన అక్రమాస్తులపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఉద్యోగం చేస్తున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ, ఆయన తల్లిదండ్రులున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఆయన కుటుంబసభ్యులుంటున్న హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఏసీబీ బృందాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో రూ.1.70 కోట్ల ఆస్తులు గుర్తించగా, ప్రస్తుతం మార్కెట్ ప్రకారం రూ.5 కోట్ల మేర ఆస్తులుంటాయని ఏసీబీ డీజీ పూర్ణ చందర్రావు తెలిపారు. శ్రవణ్కుమార్రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వెల్లడిం చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, వర్ని, రుద్రూర్ మండలాల ఇరిగేషన్ డీఈగా శ్రవణ్‌కుమార్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం వేకువజామునే అద్దె ఇంట్లో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కార్యాలయంలో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఆయన తల్లిదండ్రుల ఇళ్లలో సోదాలు జరిపారు. కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్రా గ్రీన్‌పార్క్ కాలనీలోని విశాలమైన భవంతిలో ఆయన కుటుంబ సభ్యులు ఉండగా.. ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుర్తించిన ఆస్తులు... - జీడిమెట్లలో రూ.50 లక్షల విలువైన (జీ ప్లస్) విశాలమైన భవంతి. - బేగంపేటలో రూ. 25 లక్షల విలువైన 2,100 ఎస్ఎఫ్టీ గల ప్లాట్ - జీడిమెట్లలో రూ. 20 లక్షల విలువైన కమర్షియల్ కాంప్లెక్స్ - నిజామాబాద్‌లోని నవీపేట్, ఆర్మూర్ పరిధిలో రూ.62.81 లక్షల విలువగల 34 ఎకరాల వ్యవసాయ భూమి. - అల్వాల్‌లో రూ. 2.5 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్. - మేడ్చల్‌లో రూ.15 లక్షల విలువైన ఓపెన్ ప్లాట్ - నిజామాబాద్ కేంద్రంలో రూ.2.4 లక్షల విలువైన ఖాళీ స్థలం. - రూ.14 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు. - రూ.50 వేల నగదు, రూ.3 లక్షల ఇన్సూరెన్స్ బాండ్లు. - నాలుగు బ్యాంకు ఖాతాల్లో రూ.12.90లక్షల నగదు, రూ.11.98 లక్షల చిట్టీలు. - రూ.5 లక్షల విలువగల గృహోపకరణాలు, రూ.12 లక్షల విలువైన కారు. - రూ.11లక్షల విలువగల మరో రెండు కార్లు, రూ.50 వేల విలువగల బైక్‌లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. -
మోహన్‌రెడ్డి కేసులో కీలక మలుపులు
కరీంనగర్‌క్రైం: గతంలో రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చిన మోహన్‌రెడ్డిపై తర్వాత ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. 9 నెలల క్రితం వరకూ సీఐడీ, ఇతర ఠాణాల్లో నమోదైన కేసులు కొలిక్కి వస్తున్నాయనుకున్న సమయంలో ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. దీంతోపాటు వెను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. అప్పటి నుంచీ మోహ న్‌రెడ్డి జైలులోనే ఉండిపోయాడు. ఏసీబీ కూడా బెయి ల్ రాకుండా పటిష్ట చర్యలూ తీసుకుంటోంది. దీంతో పాటు మోహన్‌రెడ్డి, అతని కుటుంబసభ్యులకు చెంది న సుమారు రూ.5 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే కేసు విచారణ వేగం పెం చింది. దీంతో బాధితులు కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఏసీబీకి ఫిర్యాదులు అందిస్తున్నారు. విచా రణ చేపట్టి వెంటనే బినామీ పేరుతో ఉన్న ఆస్తులను బాధితులకు బదలాయింపు చేస్తుండడంతో బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొదటి కేసు నమోదైన 26 నెలల తర్వాత బాధితులకు ఊరట లభిస్తుం డడంతో మళ్లీ కేసుల నమోదు పరంపర మొదలైంది. ఇప్పటికే 56 కేసులు నమోదయ్యాయి. తాజాగా.. సో మవారం ఐటీ టవర్ల ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌కు చిగురుమామిడి మండలం నవాబ్‌పేటకు చెం దిన కాంతాల స్వప్న తన ఫిర్యాదను అందించింది. ఆమెకు సంబంధించి 7.04 ఎకరాల భూమి ఉంది. డబ్బు అవసరం ఉండగా.. విషయం తెలుసుకున్న మోహన్‌రెడ్డి అనుచరులు రవీందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ముత్యంరెడ్డి, స్వరూపలు రంగంలోకి దిగారు. ఆమెకు రూ.5 లక్షల అప్పు ఇప్పించారు. తర్వాత ఎప్పటిలాగే తనఖా పెట్టిన భూమిని కబ్జా చేశారు. అయితే.. బాధితురాలు గతంలో సీఎం కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడంతో మోహన్‌రెడ్డి అనుచరులు బెదిరింపులకు దిగారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ పోలీస్ అధికారులను ఆదేశించారని తెలిసింది. నాడు సీఐడీ పేర్కొన్న బినామీలు.. మోహన్‌రెడ్డికి పెద్ద ఎత్తున బినామీలు ఉన్నారని సమాచారం. నాడు విచారణ సందర్భంగా పలువురు బినామీల పేర్లు బయటకొచ్చాయి. విశ్వనీయ సమాచారం మేరకు బినామీల్లో పుర్మ శ్రీధర్‌రెడ్డి, పుల్గం మల్లేశం, ఇట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి, బొబ్బల ఆదిరెడ్డి, బొబ్బల మహేందర్‌రెడ్డి, ఇట్టిరెడ్డి రాజిరెడ్డి, కొమటిరెడ్డి పద్మ, ఎస్.మహిపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, మేనేని సుమతీదేవి, కలకొండ ఆనందరావు, దేవులపల్లి మోహన్‌దాస్, ఇనుగంటి రామ్మోహన్రావు, చింతలపల్లి తిరుపతిరెడ్డి, సూరారం తిరుపతిరెడ్డి, కత్తి రమేశ్, అన్నాడి తిరుపతిరెడ్డి, బొబ్బల మమత, బొబ్బల లత, బొబ్బల రాంరెడ్డి, బొబ్బల నిర్మల, మంజుల, శ్యాంసుందర్‌రెడ్డి, కొల్లి మమత, నారాయణరెడ్డి, కుంట లలిత, కుంట రవీందర్‌రెడ్డి, కుంట రమణారెడ్డి, సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, జలేందర్‌రెడ్డి, తిప్పిరెడ్డి రాంరెడ్డి, బానాల రమణారెడ్డి, సూరారపు తిరుపతిరెడ్డి, నర్సింగం, సంపత్ శ్రీధర్‌రెడ్డి, బొబ్బల వజ్రమ్మ, సింగిరెడ్డి బాలకృష్ణరెడ్డి, సింగిరెడ్డి కమల, సింగిరెడ్డి రాజిరెడ్డి, నాగేంద్రచారి, బూరుగు రవీందర్‌రెడ్డి ఉన్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మందికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే.. తర్వాత ప్రభుత్వం నుంచి ఒత్తిడి కారణంగానే కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు చేసిందని బాధితులు ఆరోపించారు. తాజాగా నమోదైన కేసులో.. కరీంనగర్ జ్యోతినగర్‌లోని కమలాహైట్స్ ప్లాట్ నంబర్ 602కు చెందిన గుర్రం అమరేంద్రి అనే మహిళ కుటుంబç అవసరాల కోసం 2009లో మోహన్‌రెడ్డి వద్ద రూ.13 లక్షలు అప్పుగా తీసుకుంది. దీనికి గాను 7 ఖాళీ చెక్కులు, 6 ప్రామీసరి నోట్లు బాండ్ పేపర్స్‌పై సంతకాలు తీసుకున్నారు. మంకమ్మతోటలోని కోటి రూపాయల విలువైన ఇంటికి మోహన్‌రెడ్డి బినామీ అయిన బత్తిని తిరుపతిగౌడ్ పేరు మీద జీపీఏ చేయించారు. తర్వాత ఎనిమిది నెలల్లో రూ.8.32 లక్షలు చెల్లించారు. వడ్డీ కాకుండా మరో రూ.6 లక్షలు ఇచ్చారు. అయితే.. మరో 7 లక్షల రూపాయలు రావాలని.. వాటిని వెంటనే ఇవ్వాలని మోహన్‌రెడ్డి అనుచరులు భయబ్రాంతులకు గురిచేశారు. కాగా.. రెండు నెలల గడువు కోరారు. 2010 జూన్ 6వ తేదీన మోహన్‌రెడ్డి ధర్మారానికి చెందిన మాజీ నక్సలైట్ నర్సింగం వచ్చి తుపాకీతో బెదిరించారు. తర్వాత ఇట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి, పుర్మం శ్రీధర్‌రెడ్డి, పర్మిందర్‌సింగ్, పులుగం మల్లేశం, బొబ్బల మహేందర్‌రెడ్డి, పర్శరాములు, పూదర శ్రీనివాస్ వచ్చి ఇంటి నుంచి వెళ్లగొట్టి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తిరుపతిగౌడ్ ఆ ఇంటిని పింగలి అలియా అయిరెడ్డి శ్యామలాదేవికి అమ్మకం చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా.. అక్రమంగా తన ఇంటిని స్వాధీనం చేసుకుని.. తమకు తెలియకుండా అమ్మకాలు చేసిన వారందరిపై చర్య తీసుకోవాలని కోరుతూ అమరేంద్రి శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్‌గౌడ్ తెలిపారు. మరో ఆస్తిని తిరిగిచ్చేశారు.. కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లి గ్రామంలో సంపత్‌రావు, సునిల్రావుకు చెందిన 6 గుంటల స్థలం ఉండేది. వారి అవసరం కోసం మోహన్‌రెడ్డి వద్ద 2014లో రూ.12 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించారు. అయినా భూమిని ఇవ్వకుండా దానిని బెజ్జంకి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే.. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రవీందర్‌రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని మంగళవారం బాధితులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా బాధితులు ఏసీబీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
కోట్లు.. కొల్లగొట్టు!
అక్రమార్జనకు ‘అనంత’ కేంద్రం – జిల్లాలో మేజర్ టెండర్లు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కే – ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లకు పైగా పనులను కట్టబెట్టిన ప్రభుత్వం – పేరూరు, బీటీపీ రూపంలో మరో రూ.2,300 కోట్ల పనులు కట్టబెట్టే యత్నం – పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లిచ్చే అవకాశం - అయినా రూ.1130కోట్లతో డీపీఆర్ – 36వ ప్యాకేజీ ద్వారా నీళ్లిచ్చే మార్గం ఉన్నా రూ.1170 కోట్లతో బీటీపీకీ డీపీఆర్ – జిల్లా వెనుకబాటు బూచిగా దోపిడీ ఏమన్నారంటే.. అభివృద్ధి విషయంలో ‘అనంత’కే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. కరువు రహిత జిల్లాగా మారుస్తాం. కరువును చూసి మనం భయపడటం కాదు.. మనల్ని చూసి కరువే భయపడేలా చేస్తాం. – ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పే మాటలివీ.. ఏం చేస్తున్నారంటే.. ‘అనంత’ వెనుకబాటును బూచిగా చూపి రాజకీయ బలంతో వీలైనంత దండుకోవడం మినహా అభివృద్ధిపై చిత్తశుద్ధి కరువయింది. గత మూడేళ్లలో ప్రభుత్వం జిల్లాకు చేసిన అభివృద్ధి, ప్రస్తుతం అనుసరిస్తోన్న వైఖరి చూస్తే ముఖ్యమంత్రి నిజస్వరూపం తేటతెల్లమవుతోంది. ప్రాజెక్టుల అంచనాలను అనూహ్యంగా పెంచడం.. టెండర్లను అస్మదీయులైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వందల కోట్ల రూపాయలను దండుకోవడమే ధ్యేయంగా సర్కారు ముందుకు సాగుతోంది. ఇద్దరు ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పంపకాల్లో తేడా వస్తే నేతలు పరస్పరం విమర్శించుకోవడం మినహా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా జిల్లా అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. సాక్షిప్రతినిధి, అనంతపురం : వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు జిల్లాలో రూ.వెయ్యి కోట్ల పనులు కట్టబెట్టారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)కు సంబంధించి రూ.120 కోట్ల టెండర్‌ను ఈ సంస్థ చేజిక్కించుకుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనుల్లో మొదటి ప్యాకేజీకి సంబంధించి రూ.380 కోట్ల టెండర్ ఈ సంస్థ చేతిలో ఉంది. పనులు కర్నూలు జిల్లాలో జరుగుతున్నప్పటికీ వ్యవహారం హంద్రీనీవాదే. ప్రాజెక్టులో భాగంగా డిస్ట్రిబ్యూటరీలు నిర్మించేందుకు రూ.336కోట్లతో ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇందులో ఫేజ్–1లో రూ.250కోట్ల పనులను రిత్విక్ దక్కించుకుంది. ఇవి కాకుండా రూ.300 కోట్లతో చేపట్టనున్న గుత్తి జాతీయ రహదారి పనులూ ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి. ఇదే పనులను ముందుగా 12 శాతం తక్కువకు రిత్విక్ కోట్ చేసింది. ఈ టెండర్లను రద్దు చేయించి, తాజాగా 12 శాతం ఎక్కువకు తిరిగి అదే కంపెనీ టెండర్లను దక్కించుకుంది. ఈ మొత్తం పనుల విలువ రూ.వెయ్యి కోట్ల పైనే. ఇతర నిర్మాణ సంస్థలు ముందుకొచ్చినా అధికార పార్టీ నేతల పక్కా వ్యూహంతో టెండర్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా పనులు జరుగుతున్న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సీఎం రమేష్ సంతృప్తి పరుస్తారనే చర్చ జరుగుతోంది. మరో రూ.2,300కోట్ల పనులు కట్టబెట్టే యత్నం రిత్విక్‌కు మరో రూ.2,300కోట్ల పనులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బీటీపీ(భైరవాన్ తిప్ప)కి ఆగస్టు 15న శంకుస్థాపన చేస్తానని చంద్రబాబు ఇటీవల రాయదుర్గంలో ప్రకటించారు. ఈ పనులకు టెండర్లు పిలిచేందుకు నీటిపారుదలశాఖ రంగం సిద్ధం చేస్తోంది. బీటీపీ ఫేజ్–1కు రూ.450కోట్లను ముఖ్యమంత్రి గతేడాది ఆగస్టు 15న ప్రకటించారు. అయితే అధికారులు రూ.1170కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. బోరంపల్లి లిఫ్ట్ నుంచి 50కిలోమీటర్ల దూరంలోని బీటీపీకి నీళ్లివ్వాలి. లైనింగ్ లేకుండా కేవలం మట్టిని తవ్వి చేసే పనులివి. కిలోమీటరుకు రూ.2కోట్ల చొప్పున లెక్కించినా రూ.వందకోట్లతో బీటీపీకి నీళ్లివ్వొచ్చు. కానీ రూ.1170కోట్లతో డీపీఆర్ పంపారంటే ఇందులో రూ.1070కోట్ల దోపిడీ జరుగుతుందని తెలుస్తోంది. ఈ పనులను కూడా రిత్విక్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. నిజానికి సీఎం రమేశ్ కంపెనీ దక్కించుకున్న 36వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలోని ప్రధాన కాలువ జీడిపల్లి నుంచి ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల మీదుగా హగరి నది వరకూ వెళ్తుంది. 36 ప్యాకేజీలో నుంచే బీటీపీకి నీళ్లిచ్చే మార్గం ఉంది. పైగా 36వ ప్యాకేజీ పనులను కూడా అమాంతం పెంచారు. 2005లో ఓం–రే(జాయింట్ వెంచర్) రూ.93.92కోట్లతో ఈ పనులను దక్కించుకుంది. ఇందులో రూ.38కోట్ల పనులను ఆ సంస్థ పూర్తి చేసింది. మిగిలింది రూ.55కోట్ల పనులే. ఏడాదికి 10 శాతం చొప్పున అంచనా వ్యయం పెంచినా రూ.110కోట్లు ఖర్చవుతుంది. ఈ పనులకు రూ.336కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదే ఓ దోపిడీయే. ఇంత భారీగా కేటాయింపులు ఉన్నప్పుడు.. బీటీపీకి దగ్గరగా కాలువ వెళుతున్నప్పుడు 36వ ప్యాకేజీ నుండే నీళ్లివ్వొచ్చు. అదనంగా తిరిగి జీడిపల్లి నుంచి సమాంతరంగా మరో కాలువను తవ్వాల్సిన అవసరం లేదు. రూ.1170కోట్లు ఖర్చు పెట్టాల్సిన పనిలేదనే వాదన వనిపిస్తోంది. పేరూరు పనులను కూడా.. పేరూరు ప్రాజెక్టుకు రూ.1130కోట్లతో డీపీఆర్ ప్రభుత్వానికి చేరింది. నిజానికి మడకశిర బ్రాంచ్ కెనాల్లో 26కిలోమీటర్ నుండి(6వ లిప్ట్ తర్వాత) తురకలాపట్నం వంకలోకి నీళ్లు వదలితే పేదకోడిపల్లి మీదుగా పావుగడ మండలంలోని నాగలమడక చెరువులోకి నీళ్లు చేరి నేరుగా పేరూరు డ్యాంకు అందుతాయి. ఈ పనికి స్వల్పంగా మాత్రమే ఖర్చవుతుంది. విపక్షాలైతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లిచ్చే మార్గం ఇది అని చెబుతున్నాయి. ఈ పనులకు రూ.1130కోట్లతో డీపీఆర్ పంపారంటే ఏస్థాయిలో దోపిడీ జరగనుందో అర్థమవుతోంది. ఈ పనులకు కూడా సెప్టెంబర్‌లో టెండర్లు పిలవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా రిత్విక్కే కట్టబెట్టాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఇటీవలే రూ.300కోట్ల పనులను హంద్రీనీవా ఫేజ్–2లో రిత్విక్ చేసింది. మొత్తం పనులను నిశితంగా పరిశీలిస్తే దోపిడీ ఇట్టే అర్థమవుతుంది. ఈ నిధులను జిల్లాలో ఎమ్మెల్యేలకు వాటాలు పంచడం, మేజర్ వాటాను అమరావతిలో చినబాబుకు అప్పగించడం కోసమే అంచనా వ్యయాలను పెంచినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
ఎంవీఐ ఇంటిపై ఏసీబీ దాడులు
కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం మెరుపు దాడులకు దిగారు. కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిచేస్తున్న గౌస్‌పాషా ఇంటిపై ఏసీబీ సోదాలు చేపట్టింది. కొత్తగూడెంలోని ఆయన ఇంటితో పాటు హైదరాబాద్, జమ్మికుంటలో ఉన్న బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని ఆయన ఇంట్లో రూ.26 వేల నగదుతో పాటు 5 సెల్ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్‌లో 18 ఎకరాల ఫాంహౌస్, బండ్లగూడలో రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు, పీరం చెరువులో 3,500 గజాల స్థలం, మూడు ఖరీదైన కార్లు గుర్తించామని డీఎస్పీ సాయిబాబా తెలిపారు. ఆయనపై తీవ్రస్థాయిలో అవినీతీ ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. -
మంత్రి అక్రమాస్తులు రూ.115 కోట్లు
-
మంత్రి అక్రమాస్తులు రూ.115 కోట్లు
సాక్షి, బెంగళూరు: ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాల్లో కర్ణాటక చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి రమేష్ జారకీహోళీకి చెందిన అక్రమ ఆస్తులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మొత్తం రూ.115.2 కోట్ల మేరకు ఆస్తులను గుర్తించారు. బెంగళూరు, బెళగావి, గోకాక్ ప్రాంతాల్లో రమేష్ గృహ సముదాయాలు, కార్యాలయాలతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై నాలుగు రోజులుగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తన వద్ద ఉన్న నగదును మార్చుకునేందుకు మంత్రి అక్రమమార్గం పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సహకార బ్యాంకుల్లో బంధువులు, స్నేహితుల పేర్లపై అకౌంట్లను తెరిచి అందులో నగదును డిపాజిట్ చేస్తూ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన వద్ద ఉన్న నగదుతో భారీ స్థాయిలో బంగారం బిస్కెట్లు, నగలు కొనుగోలు చేశారు. మరోవైపు స్థిర, చరాస్తులను సైతం నోట్ల రద్దు తర్వాతే ఎక్కువ సంఖ్యలో కొన్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా, బెళగావి నగరంలో కర్ణాటక పీసీసీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీహెబ్బళ్కర్ నివాసంలో జరిపిన ఐటీ సోదాల్లో రూ.50 కోట్ల విలువైన నగదు, బంగారం బయటపడ్డాయి. -
ఒంగోలు పీటీసీ డీఎస్పీ ఇంటిపై ఏసీబీ దాడులు
ప్రకాశం : ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖాధికారులు మెరుపు దాడులకు దిగారు. గుంటూరు బ్రాడీపేటలోని దుర్గాప్రసాద్ నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్‌లలో ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. దుర్గాప్రసాద్ కొంతకాలంగా గుంటూరు నుంచే ఒంగోలు కార్యాలయ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ దాడుల సమాచారం తెలియగానే డీఎస్పీ బాధితులు సంబరాలు చేసుకున్నారు. దుర్గాప్రసాద్ ఇంటి ఎదుటే బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. డీఎస్పీ తమను అన్యాయంగా వేధించాడని బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. -
ఒంగోలు పీటీసీ డీఎస్పీ ఇంటిపై ఏసీబీ దాడులు
-
బినామీ ఆస్తులపై కేంద్రం తాజా నిర్ణయం !
-
ఇక బినామీల వేట !
► ఆస్తులు జప్తు చేసుకునేందుకు కేంద్రం అడుగులు ► బినామీ అని రుజువైతే ఏడేళ్ల వరకు జైలు.. ► ఆస్తి విలువలో 25% జరిమానా ► తప్పుడు సమాచారమిచ్చినా 10 శాతం ఫైన్ ► ఆదాయానికి మించినా.. లెక్క చెప్పలేని ఆస్తులున్నా ఇదే చట్టం ► పాత చట్టాన్ని ఆగస్టులోనే సవరించిన కేంద్రం ► జప్తులో జాప్యం నివారణకు మరోసారి సవరణ యోచన ► ఈ నెల 30తో ‘నోట్ల రద్దు’కు ముగియనున్న గడువు ► ఆ తర్వాత బినామీలపై చర్యలకు కసరత్తు సాక్షి, హైదరాబాద్ : నల్లధనానికి చెక్ పెట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక బినామీ ఆస్తులపై దృష్టి సారిస్తోంది. ఆ ఆస్తులను జప్తు చేసుకునేందుకు అడుగు ముందుకేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు... లెక్క చెప్పలేని ఆస్తులుంటే జప్తు చేసే చట్టానికి పదును పెడుతోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తును వేగవంతం చేసింది. 1988 నుంచే బినామీ లావాదేవీల నిషేధిత చట్టం అమల్లో ఉంది. ఆ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ కొన్ని లొసుగులను సవరిస్తూ ఈ ఏడాది ఆగస్టులోనే కేంద్రం... బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం–2016 అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సలహాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే ఈ చట్టానికి మెరుగులు దిద్దింది. నోట్ల రద్దు కంటే ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదిపింది. ఈలోగా ఆకస్మికంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 30తో నోట్ల రద్దుకు నిర్దేశించిన గడువు ముగియనుంది. దీంతో రెండో దశలో బినామీ ఆస్తుల జప్తుకు రంగంలోకి దిగాలని యోచిస్తోంది. బినామీ ఆస్తులని రుజువైతే..? అవినీతి పరులు, అక్రమార్జనకు పాల్పడ్డ నల్ల కుబేరులు నగదు నిల్వలు చేయకుండా, విచ్చలవిడిగా ఆస్తులు కొంటున్నారనే అభియోగాలున్నాయి. తమ పేరిట లావాదేవీలు నిర్వహించకుండా, పన్నులు ఎగ్గొట్టేందుకు బినామీల పేరుతో వీటిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. నోట్ల రద్దుతో దేశంలో చెలామణిలో ఉన్న నగదు మొత్తం ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశముందని కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది. నగదుకు చిక్కకుండా ఆస్తుల రూపంలో మళ్లించిన నల్ల«ధనాన్ని కట్టడి చేసేందుకు ఈ బినామీ చట్టంపై ఆశలు పెట్టుకుంది. బినామీ ఆస్తులుగా రుజువైతే వాటిని ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది. అలాగే ఏడాది నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్షతోపాటు మార్కెట్ విలువ ప్రకారం బినామీ ఆస్తి విలువలో 25 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బినామీ లావాదేవీలపై తప్పుడు సమాచారమిస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి విలువలో 10 శాతం జరిమానా విధించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సేకరించిన సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల లావాదేవీలు, రుణాల ఆధారంగా బినామీ ఆస్తుల చిట్టాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. బడా కంపెనీలు, బహుళ అంతస్తుల భవనాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై తొలి దశలో దృష్టి సారించే అవకాశాలుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి చట్టానికి సవరణ? చట్టంలో ఉన్న న్యాయపరమైన వెసులుబాటుతో బినామీ ఆస్తులను జప్తు చేసుకునేందుకు ప్రభుత్వానికి ఏళ్లకు ఏళ్లు పట్టే అవకాశముంది. అందుకే న్యాయపరమైన అడ్డంకులు తొలగిస్తూ మరోమారు చట్టాన్ని సవరించాలని కేంద్రం యోచిస్తోంది. బినామీ ఆస్తులకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం లేదా అనుమానం మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ముందుగా నోటీసులిస్తారు. సదరు ఆస్తి కొనేందుకు వచ్చిన ఆదాయం ఎక్కణ్నుంచి వచ్చిందో ఆధారాలను సమర్పిస్తే సరిపోతుంది. లేకుంటే బినామీ ఆస్తిగా గుర్తించి జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారుల చర్యను తప్పుపడితే... సదరు ఆస్తి తమకే చెందుతుందని వాటి యజమానులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే వీలుంటుంది. ఏడాదిలోపు ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాలి. తర్వాత హైకోర్టుకు వెళ్లే అవకాశం పిటిషనర్‌కు ఉంటుంది. దీంతో బినామీ ఆస్తుల స్వాధీనానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందని గుర్తించిన కేంద్రం ప్రత్యామ్నాయాలు యోచిస్తోంది. ఏది బినామీ? ఎవరైనా తమ ఆదాయ పరిధికి మించి.. లెక్క చెప్పలేని ఆస్తులు కలిగి ఉంటే చట్టం ప్రకారం బినామీ ఆస్తులుగా పరిగణిస్తారు. ఇతరుల పేరుతో ఆస్తులు కొనుగోలు చేయడం, తమ అధీనంలో ఉన్న ఆస్తులకు ఇతరులెవరో డబ్బులు చెల్లించటం, గుర్తు తెలియని వ్యక్తులు తమ పేరిట ఆస్తులు బదలాయించటం.. ఇవన్నీ బినామీ లావాదేవీలే. ఆస్తి ఉన్న వ్యక్తులు అది తమదని నిరూపించుకోలేకపోయినా, దానికి సంబంధించి తనకేమీ తెలియదని చెప్పినా, అది తనది కాదని తను డబ్బులు చెల్లించి కొనలేదని చెప్పినా దాన్ని బినామీ ఆస్తిగా పరిగణిస్తారు. స్థిర చరాస్తులు, బంగారు బాండ్లు, ఫైనాన్షియల్ సెక్యూరిటీలు, షేర్లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అయితే ఉమ్మడి కుటుంబ యజమాని, జీవిత భాగస్వామి చట్టబద్ధంగా ప్రకటించిన ఆదాయంతో కొనుగోలు చేసిన ఆస్తులు బినామీ కిందికి రావు. అలాగే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉమ్మడి ఆస్తి కొనుగోలు చేసినా, తాను యజమానిగా ఉన్న సంస్థ ద్వారా కొనుగోళ్లు చేసినా ఈ చట్టం పరిధిలోకి రావు. -
ఆదాయ పన్ను అధికారి ఇంటిపై సీబీఐ దాడులు
హైదరాబాద్ : ఆదాయ పన్ను శాఖాధికారి ఇంటిపై సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఆదాయ పన్ను అధికారి బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు ఏకకాలంగా తనిఖీలు చేపట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. వెంకటేశ్వరరావు కుమారుల పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహారించి భారీగా డబ్బులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. సప్త వర్ణ క్రియేషన్స్ పేరుతో ఆయన కుమారుడిని హీరోగా చిత్రం నిర్శిస్తున్నట్లు సమాచారం. నగరంతో సహా 15 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల విలువ దాదాపు 40 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెల్లూరు ఆర్టీవో ఇంటిపై ఏసీబీ దాడులు
నెల్లూరు : అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు ఆర్టీవో నేరెళ్ల పూర్ణచంద్రరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌శాంతో నేతృత్వంలో ప్రత్యేక బృందాలు గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, వినుకొండ, విజయవాడ, చీరాల, అద్దంకి ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తొమ్మిది ఫ్లాట్లు, వినుకొండలో ఒక నివాసం, చీరాలలో ఒక వస్త్ర దుకాణం, పిడుగురాళ్లలో పప్పుల మిల్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు కొత్తపేటలో ఆయన ఉంటున్న నివాసంలో రూ.3.5 లక్షల నగదు, కిలోన్నర బంగారం, 60 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో మరో రూ.20 లక్షలు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఐదుగురు బినామీల వద్ద ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ జేడీ డి.నాగేంద్రకుమార్ గుంటూరుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరో రెండు రోజులపాటు సోదాలు జరిగే అవకాశం ఉందని, పూర్ణచంద్రరావుకు సంబంధించిన లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. దాడుల్లో పలు జిల్లాల ఏసీబీ డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏరియాకో గ్యాంగ్ గల్లికో డెన్
సాక్షి, సిటీబ్యూరో: జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు...విసిరేసినట్లు ఉండే కాలనీలు...జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఏరియాలు... సిటీలోని ఇలాంటి వాటినే ఎంచుకున్న నయీం అక్కడి ఇండిపెండెంట్ ఇళ్లల్లో డెన్లు ఏర్పాటు చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం ఎన్కౌంటర్ అయిన తర్వాత తొలుత నార్సింగి ఠాణా పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో తొలి డెన్ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పోలీసులు కూపీ లాగడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గల్లీకో డెన్, ప్రాంతానికో గ్యాంగ్ బయటపడుతున్నాయి. రెండేళ్ళ వరకు శంషాబాద్‌లో... నయీం కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బుధవారం నగరంలోని శంషాబాద్, అల్కాపూర్లతో పాటు హస్తినాపురం, వనస్థలిపురం, మన్సూరాబాద్, కుంట్లూర్‌లోని ఇళ్ళపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. వీటిలో నయీంకు అల్కాపూర్‌లో ఉన్న ఇంటితో పాటు శంషాబాద్‌లో మరో ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో తన అనుచరుల కోసం ఇంకో ఇంటిని వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఈ రెండూ ఖాళీగానే ఉన్నాయి. నయీం రెండేళ్ళ క్రితం వరకు దాదాపు మూడేళ్ళ పాటు శంషాబాద్‌లోని సాతంరాయిలో ఉన్న ఇంట్లోనే నివసించాడు. ఈ ఇల్లు ప్రస్తుతం అల్కాపూర్‌లోని నయీం ఇంట్లో సోమవారం పోలీసులకు చిక్కిన ఫర్హానా పేరుతో ఉంది. ఈ డెన్ ఏర్పాటు చేసుకోవడానికి అప్పట్లో ఆ ప్రాంతంలో నివసించిన ఓ పోలీసు అధికారి సహకరించాడని తెలిసింది. కబ్జా చేసి అనుచరులకూ నివాసాలు... రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ దందాలు చేసిన నయీం మొత్తమ్మీద గడిచిన ఐదేళ్ళుగా నగరం చుట్టుపక్కలే నివసించాడు. ప్రతి సందర్భంలోనూ తన నివాసానికి సమీపంలోనే ముఖ్య అనుచరులకు షెల్టర్లు ఏర్పాటు చేసే వాడు. అలాగే వారికి ‘గిఫ్ట్’గా ఇచ్చిన ఫ్లాట్స్, ఇళ్ళల్లోనూ ఇతడు షెల్టర్ తీసుకునేవాడు. ఈ డెన్స్‌లో అత్యధికం కబ్జా పెట్టినవే అని పోలీసులు చెప్తున్నారు. శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ కాలనీలో కబ్జా చేసిన ఇంటిని అనుచరులకు అప్పగించాడు. వనస్థలిపురం, హస్తినాపురంతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి డెన్స్ ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నయీం ఎన్‌కౌంటర్‌తో అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో వీటిని గుర్తించడం కష్టసాధ్యంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. అనువైన ప్రాంతాలనే ఎంచుకుని... నయీం తనతో పాటు అనుచరులకూ డెన్స్ ఏర్పాటు చేసే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎవరి దృష్టీ పడని ప్రాంతాలనే ఎంచుకున్నాడు. ప్రధానంగా అనేక ప్రాంతాలు, వర్గాలకు చెందిన వారు నివసించే ఏరియాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. అలాంటి చోట్లలో ఏర్పాటు చేసుకుంటే ఇతరుల దృష్టి పడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ డెన్స్‌లో అత్యధికం ఇండిపెండెంట్ హౌస్‌లు కావడం గమనార్హం. అలాగే పైకి కనిపించకుండా ప్రాంతాల వారీగా ముఠాలను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. స్థానికంగా సెటిల్మెంట్లు తదితరాలను వీరి ద్వారా చేయించేవాడు. ఈ డెన్స్ అన్నీ ఎస్కేప్ రూట్స్‌కు సమీపంలోనే ఉండేలా చూసుకున్నాడు. మరోసారి ఫహీం ‘హంగామా’... నల్గొండ జిల్లా చిట్యాల మండలం నాగారం వీఏఓ, నయీం సమీప బంధువు ఎం.ఎ.ఫహీం మరోసారి కలకలం సృష్టించాడు. కొన్నేళ్ళ క్రితం వనస్థలిపురం ప్రాంతం నుంచి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కు చెందిన ఫహీం భార్య షాజేదా, కూతురు, తల్లితో కలసి మన్సూరాబాద్ సహారా ఎస్టేటులో నివసిస్తున్నాడు. 2009లో సీబీఐ అధికారులు సొహ్రాబుద్దీన్ కేసులో ప్రశ్నించడానికి కోఠిలోని తమ కార్యాలయానికి పిలిపించారు. నయీం సమాచారం ఇవ్వాలంటూ ఇతడిపై ఒత్తిడి సైతం తీసుకువచ్చారు. దీంతో ఫహీం అప్పట్లో హఠాత్తుగా కనిపించకుండా వెళ్లిపోయాడు. దీనిపై వనస్థలిపురం ఠాణాలో కేసు నమోదు కావడంతో పాటు తీవ్ర కలకలం రేగింది. అప్పట్లో నయీమే ఫహీంను తీసుకువెళ్ళి, వదిలినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా నయీం ఎన్కౌంటర్ తర్వాత ఫహీం సైతం ఓ గ్యాంగ్ నిర్వహించినట్లు తేలడంతో ఇతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. బుధవారం ఇతడి ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు. సిటీ నుంచి ముగ్గురు ‘సిట్టింగ్’... తెహరీఖ్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది విఖార్ అహ్మద్ తన అనుచరులతో సహా గత ఏడాది ఏప్రిల్‌లో నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద ఎన్కౌంటర్ అయ్యాడు. వరంగల్ జైలు నుంచి నగరంలోని కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సిటీకి చెందిన ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నయీం కార్యకలాపాలు, కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసి సిట్‌లో ముగ్గురికి చోటు దక్కింది. మొత్తం ఎనిమిది మంది సభ్యుల్లో సైబరాబాద్ అదనపు డీసీపీ (క్రైమ్స్) శ్రీనివాస్‌రెడ్డి, బేగంబజార్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుధాకర్‌లు ఉన్నారు. -
సీఐ బాలకృష్ణ ఇళ్లపై ఏసీబీ దాడులు
విశాఖపట్నం: విశాఖలో అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం ఉదయం మెరుపు దాడులకు దిగారు. విశాఖ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం పీఎం పాలెంలోని బాలకృష్ణ నివాసంతో పాటు 4వ టౌన్ పీఎస్, విజయనగరం, కొవ్వూరు సహా మొత్తం ఏడు చోట్ల ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఆయన నివాసంలో రూ.కోటిన్నర పైగా అక్రమాస్తుల గుర్తించినట్లు తెలుస్తుంది. వీటిలో మూడంతస్తుల భవనం, 25 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.30 వేలు నగదు ఉన్నట్లు సమాచారం. కొవ్వూరులోని బాలకృష్ణ మామ వెంకటరత్నం ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. వివరాలు వెల్లడించడానికి ఏసీబీ అధికారులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆరోపణలు అభూతకల్పనలు
నైతిక విలువలతో ఉద్యోగం చేస్తున్నా.. ఉద్యోగంలో చేరకముందే తండ్రి ఆస్తి సంక్రమించింది విశాఖపట్నం : అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అభూతకల్పనలని ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ ఎం.విజయలక్ష్మి స్పష్టం చేశారు. పీఎంపాలెంలోని తన ఇంటిపై ఏసీబీ దాడుల సందర్భంగా పత్రికల్లో వచ్చిన కధనాల్లో వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. అక్రమ ఆస్తులుగా పేర్కొన్నవన్నీ ఉద్యోగంలో చేరకముందే తండ్రి నుంచి తనకు సంక్రమించాయని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1994లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో మహిళలు, పిల్లల పట్ల ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తూ సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నానన్నారు. అయితే తనపై కొందరు పనిగట్టుకొని చేసిన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమని భావించే తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఉన్నత కుటుంబం స్వతహాగానే తమది ఆస్తిపాస్తులున్న కుటుంబమని విజయలక్ష్మి పేర్కొన్నారు. 1986లో వివాహం తర్వాత తండ్రి ద్వారా తనకు సంక్రమించిన మూడో వంతు ఆస్తిని విక్రయించి 1994కు ముందే.. అంటే సర్వీసులో చేరకముందు ఇక్కడ వేరే ఆస్తులు కొన్నామన్నారు. సహజంగానే ఇప్పుడు వాటి మార్కెట్ విలువ పెరిగిందన్నారు. అఆగే ఉద్యోగంలో చేరిన 1994 నాటికి తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి వెల్లడించానని వివరించారు. భర్త వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులతో పాటు, తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి ప్రతి ఏటా నివేదిస్తున్నానని చెప్పారు. తన జీతాన్ని పొదుపు చేస్తూ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారం సమకూర్చుకుంటుంటే.. అదేదో తప్పు అన్నట్లు.. దాన్ని అక్రమ ఆస్తి అని ఆరోపించడం తన మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 ఏళ్ల సర్వీసులో ఏనాడూ ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. తన సర్వీసు రిజిస్టరే దీనికి సాక్ష్యమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలు మొత్తం ఎంపిక ప్రక్రియను ఆన్లైన్లోనే పారదర్శకంగా నిర్వహించామన్నారు. తన కుమార్తె పెళ్లి మరో రెండు నెలల్లో ఉన్నందున తమ ఇంటి పైఅంతస్తును నివాసయోగ్యంగా చేయడానికి కొంత నగదు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో ఉంచామన్నారు. అలాగే తన కుటుంబానికి మూడు ఖరీదైన కార్లు లేవన్నారు. తన భర్త 2010లో బ్యాంకు రుణంతో కొన్న కారు, కుమార్తె తన ఉద్యోగం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొన్న సెకండ్ హ్యాండ్ కారు మాత్రమే ఉన్నాయన్నారు. తనవి కాని ఆస్తులను తన అక్రమ ఆస్తులుగా చూపించడాన్ని ఖండిస్తున్నానన్నారు. భర్త కుటుంబ ఆస్తి వివాదాలే కారణం! ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ విజయలక్ష్మి భర్త తరఫు కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ ఆక్కసుతోనే కొందరు విజయలక్ష్మి కుటుంబంపై తప్పుడు ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల ఆధారంగానే ప్రాథమిక విచారణ కూడా జరపకుండా నేరుగా సోదాలకు దిగినట్లు సమాచారం. అందువల్లే ఉద్యోగంలో చేరడానికి ముందు ఉన్న విజయలక్ష్మి ఆస్తులను అక్రమ ఆస్తులుగా మీడియా ముందు చూపించారు. ఐసీడీఎస్‌లో చేరినప్పటి నుంచి ఈమె నిబద్ధతతోనే పని చేస్తున్నారని తోటి అధికారులు చెబుతున్నారు. -
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీలోకి ‘కిడారి’ చేరిక
మండల వైఎస్సార్ పీపీ నాయకుల ధ్వజం పెదబయలు: ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరారని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సందడి కొండబాబు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్సింగి గంగాభవానీ, వైస్ ఎంపీపీ వంతాల శాంతి విమర్శించారు. పెదబయలులో బుధవారం ఏర్పాటుచేసిన మండల స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో గిరిజనునలు ఓట్లు వేసి అధిక మెజార్టీతో కిడారిని, కొంతమంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను గెలిపిస్తే వారంతా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీలో చేరారని ఆరోపించారు. మన్యంలో బాక్సైట్ గునపం దింపాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలో ప్యాకేజీలకు ఆశపడి వారంతా పార్టీ మారారని ఆరోపించారు. చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలు చేయమని చెప్పడం వల్లే టీడీపీలో చేరినట్టు కిడారి చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి రావెల బాక్సైట్‌కు అనుకూలంగా ప్రకటన చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గిరిజనులను మభ్యపెడుతున్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజనులు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే వారికి వంచనకు గురిచేశారని పేర్కొన్నారు. ఇలాంటి వారిని గ్రామాల్లో రాకుండా ప్రజలు నిలువరించాలని కోరారు. గిరిజన జాతిలో వారికే ద్రోహం చేయడానికి కూడా వెనుకాడడంలేదన్నారు. వీరి అడుగుజాడల్లో పెదబయలు ఎంపీపీ ఉమామహేశ్వరరావు ఉన్నారని, వీరికి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఇలాంటి వారు వెళ్లిపోయినా పార్టీకి నష్టం లేదని, పెదబయలు మండలంలో ఒక్క ఎంపీపీ మినహా ఎంపీటీసీ సభ్యులను ఎవరూ పార్టీ నుంచి విడదీయలేకపోయారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జర్సింగి బాలంనాయుడు, జర్సింగి సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు పోయిభ కృష్ణారావు, కొరవంగి మాధవరావు, చింతా బోడిరాజు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ మండల నాయకులు వంతాల అప్పారావు, కూడ అనంతరావు, గంపరాయి వెంకయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీఆర్డీఏలో అవినీతి తిమింగలం
ఏసీబీ సోదాల్లో రూ.4కోట్లపైగా అక్రమ ఆస్తుల గుర్తింపు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో ఏకకాలంలో తనిఖీలు దస్తావేజులు, నగదు, బంగారు ఆభరణాలు సీజ్ గుంటూరు (పట్నంబజారు) : ఏసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కింది. విధి నిర్వహణలో భారీగా అవినీతికి పాల్పడుతూ అక్రమ ఆస్తులు ఆర్జించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఆర్డీఏ టౌన్‌ప్లానింగ్ అధికారి నివాసంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు భారీగా కలిగి ఉండడాన్ని గుర్తించారు. గుంటూరులోని కోబాల్డ్‌పేటలో నివాసం ఉండే షేక్ ఫజలూర్ రెహమాన్ ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏలో టౌన్‌ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన అసిస్టెంట్ టౌన్‌ప్లానింగ్ అధికారిగా కర్నూలు, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో పనిచేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విధుల్లో చేరిననాటి నుంచి అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. 1997లో సైతం కర్నూలులో ఏసీబీ దాడి చేసినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ఏక కాలంలో కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలలో సోదాలు నిర్వహించారు. గుంటూరులోని ఆయన ఇంటితోపాటు, మిగిలిన ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. గుంటూరు కోబాల్డ్‌పేటలో నివాసం ఉండే ఆ అధికారి సోదరుడు హబీబ్ రెహమాన్ నివాసంలో సైతం తనిఖీలు జరిగాయి. కర్నూలులో ఒక స్థలం, గుంటూరులో అపార్టుమెంట్, ఒక నివాసం, విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్, ఓ స్థలం కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో మూడు సంవత్సరాల పాటు అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేసిన రెహమాన్‌పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఏసీబీ దాడులు నిర్వహించేందుకు దృష్టి సారించిందని సమాచారం. ఈ క్రమంలో కోబాల్డ్‌పేట నివాసంలో అక్రమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, భారీ స్థాయిలో నగదు, కిలోకు పైగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ. 4 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెహమాన్ నివాసంలో సోదాలు నిర్వహించడం కోసం విశాఖపట్నం నుంచి డీఎస్పీ ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, సిబ్బంది ప్రత్యేకంగా వచ్చారు. బృందాలుగా ఏర్పడి సీఐల నేతృత్వంలో దాడులు జరిగాయి. గుంటూరులోని నివాసంలో దొరికిన దస్తావేజులు, నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. బ్యాంక్ లాకర్లను సైతం రోజుల వ్యవధిలోనే తనిఖీ చేస్తామని అధికారులు స్పష్టంచేశారు. సోదాల్లో సీఐలు రాజశేఖర్, గణేష్, రాజేంద్రలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
’పనామా దోషులు’ ఎప్పటికి చిక్కేను?
న్యూఢిల్లీ: పనామా లీకుల్లో వెలుగులోకి వచ్చిన భారతీయుల డాక్యుమెంట్లపై దర్యాప్తు జరిపేందుకు బహుళ సంస్థలను ఆదేశించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దర్యాప్తుకు ఎంత కాలం పడుతుంది? ఎప్పటిలోగా పూర్తవుతుంది? దోషులెవరు, ఎవరు కాదు? తేలడానికి ఎంత సమయం పడుతుంది? మొత్తానికి దోషులకు శిక్ష పడుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సమాజాన్ని తొలుస్తున్నాయి. దోషులు ఎవరో తేలడానికి కొన్ని సంవత్సరాలేకాదు, కొన్ని యుగాలే పడుతుందని, దర్యాప్తు ప్రక్రియ నిరంతరం కూడా కొనసాగవచ్చని న్యాయ నిపుణలు అంటున్నారు. ‘వేల సంఖ్యలో వున్న డాక్యుమెంట్లను పరిశీలించి దర్యాప్తు జరపడానికి సంవత్సరాలు పడుతుంది. ఆ డాక్యుమెంట్లు నకిలీవని, ఫోర్జరీ చేశారని నిందితులు వాదించవచ్చు. అప్పుడు డాక్యుమెంట్ల అథెంటిసిటీని రుజువు చేయడానికి ఏళ్లు పడుతుంది. అనంతరం డాక్యుమెంట్ల ఆధారంగా డబ్బు లావాదేవీలను కనుగొనేందుకు యుగాలు పడుతుంది. ఆ తర్వాత అప్పీళ్ల మీద అప్పీళ్లు కొనసాగుతూనే ఉంటాయి’ అని దుష్యంత్ అరోరా, కాలమిస్ట్ తెలిపారు. ‘విదేశాల్లో కంపెనీలు, షేర్లు, అకౌంట్లు కలిగి ఉండడం 2004లో తీసుకొచ్చిన సరళీకరణ చట్టం ప్రకారం నేరం కాదు. వాటి వివరాలను ఆర్బీఐకి తెలియజేయక పోవడం నేరం. ఈ నేరానికి ఫెమా, ఫెరా చట్టాల కింద విచారించవచ్చు. డబ్బులు వచ్చిన సోర్స్ గురించి తెలియజేయకపోతే ఆదాయం పన్ను కింద విచారించవచ్చు. హెచ్ఎస్బీసీ లీక్స్‌లో భారతీయుల అక్రమ ఖాతాల వివరాలు వెలుగులోకి వచ్చినా వాటిని ప్రభుత్వం ప్రజల ముందుంచలేదు. సుప్రీం కోర్టు వేసిన సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఎవరికి శిక్ష పడలేదు. పెద్ద వాళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో అధికారంలోవున్న ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబించడం జరుగుతోంది’ అని సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. 2011లో వెలుగులోకి వచ్చిన హెచ్ఎస్బీసీ డాక్యుమెంట్లలో మొత్తం 569 ఎంటిటీలను గుర్తించారు. వాటిలో 390 ఎంటిటీలు అక్రమమైనవని తేల్చారు. 154 ప్రాసిక్యూషన్లను దాఖలు చేశారు. వాటి విచారణ ఇప్పటికీ నత్తనడకలాగా సాగుతోంది. అంతెందుకు 2007లో వెలుగు చూసిన ‘లీక్టెస్టైన్’ డాక్యుమెంట్లలోనే ఇప్పటికీ దోషులెవరో తేలలేదు. విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్ భూషణ్ చెబుతున్నట్టుగా పనామా పత్రాల్లో భారతీయుల పేర్లు ఉన్నంత మాత్రాన వారు నేరం చేశారనడానికి వీలు లేదు. విదేశీ కంపెనీలు, డబ్బు లావాదేవీలకు సంబంధించి 1990 దశకంలో ఓసారి, 2004లో ఓసారి భారత ప్రభుత్వం సరళీకరణ చట్టాలు తీసుకొచ్చింది. 2004 చట్టం ప్రకారమైతే ఓ భారతీయుడు విదేశాల్లో ఏడాదికి 2.5 లక్షల డాలర్ల లావాదేవీలు స్వేచ్ఛగా జరపొచ్చు. అనుమానితులు చట్టప్రకారమే లావాదేవీలు జరిపినట్లయితే వాటి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదుగదా. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని బాలివుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్లు పత్రికా ముఖంగా చెబుతున్నారు. అలాంటప్పుడు వారి విదేశీ కంపెనీల గురించి, షేర్ల గురించి ముందే వెల్లడించి ఉండవచ్చుగదా! అలా ఎందుకు చేయలేదు. పైగా పనామా లీక్స్ లో వెలుగులోకి వచ్చిన పత్రాలు 1977 కాలం నాటి నుంచి ఉన్నాయి. భారత సరళీకరణ చట్టాలను తీసుకరాకముందు విదేశీ కంపెనీల వ్యవహారాలు నిర్వహించిన వారు కచ్చితంగా దోషులే అవుతారు. ఎందుకంటే అప్పటి డాక్యుమెంట్లకు ఇప్పటి చట్టాలు వర్తించవు. డాక్యుమెంట్లు ఏ కాలం నాటివో, ఆ నాటి చట్టం ఏం చెబుతుందో అన్న అంశాలను కూడా దర్యాప్తు సంస్థలు పరిగణలోకి తీసుకొని కేసుల విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కూడా విచారణలో ఎంతో జాప్యం జరుగుతుంది. -
ఏసీపీ సంజీవరావుపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కూకట్పల్లి ఏసీపీ సంజీవరావుపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడటంతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారులు ...సంజీవరావును గురువారం సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కూకట్ పల్లి కొత్త ఏసీపీగా భుజంగరావు నియమితులయ్యారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అనినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) సంజీవరావు నివాసంతో పాటు, కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ సోదాలు జరిపింది. ఈ దాడుల్లో భారీ ఎత్తున నగదు, ఆస్తి పత్రాలు, లాకర్లలోని నగలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. -
ఏసీటీఓకు రూ.10 కోట్ల అక్రమ ఆస్తులు
నల్గొండ : నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ సాయికిశోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో గురువారం ఉదయం నల్గొండ, హైదరాబాద్ లలో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. రూ.10 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కలిగిఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయికిశోర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. -
అక్రమార్జన కేసులో మూడేళ్ల జైలు
నెల్లూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడటెట్టిన కేసులో నెల్లూరు మద్యపాన నిషేధం విభాగం రిటైర్డు ఉద్యోగికి ఏసీబీ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు, రూ.15 లక్షల జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన షేక్ కాలేషా 1971లో ప్రొహిబిషన్ శాఖలో వ్యాను క్లీనర్‌గా ఉద్యోగం పొందారు. అనంతరం జీపు డ్రైవర్‌గా 2005లో రిటైరయ్యారు. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదు మేరకు అదే ఏడాది ఏసీబీ అధికారులు కాలేషా ఆస్తులపై దాడులు చేశారు. ఆయనకు నగరంలో వీనస్ బార్ అండ్ రెస్టారెంట్‌తో పాటు రెండు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు రూ.2, 26, 370 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆదాయం అంతా అదనపు ఆస్తియేనని తేల్చిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో రూ.49 లక్షల మేర కాలేషాకు అదనపు ఆస్తులున్నట్లు రుజువు కావటంతో మూడేళ్ల జైలు, రూ.15 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. -
ముప్పేటదాడి
సాంబశివరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు రూ.1.30 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు భవనాలు, బంగారం స్వాధీనం వరంగల్ క్రైం/ఎంజీఎం : అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పంజా విసిరారు. డీఎంహెచ్‌వో, రాష్ట్ర సంచాలకుడిగా విధులు నిర్వహించి ఇటీవల అవినీతి ఆరోపణలతో సస్పెండైన పిల్లి సాంబశివరావు స్వగృహంలో గురువారం సోదాలు చేశారు. ఈ విషయూలను ఏసీబీ కార్యాలయంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సారుుబాబా వెల్లడించారు. ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు బృందాలుగా విడిపోరుు ఏకకాలంలో సాంబశివరావు బంధువులు, బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు. హన్మకొండలోని సర్క్యూట్ హౌస్‌లో గల ఆయన స్వగృహంతోపాటు అశోక్‌నగర్‌లో నివాసముంటున్న ఆయన సోదరుడు సారంగం ఇంటిపై, ఆరెపల్లిలోని కార్తికేయన్ ఎడ్యుకేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో, హైదరాబాద్ ఉప్పల్‌లోని ఫ్లాట్‌లో, సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడైన జైహింద్ సెక్యూరిటీ ఏజెన్సీస్‌కు చెందిన జయేందర్‌రెడ్డి స్వగృహం, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని మామ బబ్బెట ఉపేందర్ ఇళ్లలో మూకుమ్మడి దాడులు నిర్వహించారు. అక్రమ ఆస్తుల చిట్టా.. పిల్లి సాంబశివరావుకు హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్ సమీపంలో ఇల్లు, జేపీఎన్ రోడ్డులో రెండు కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆరెపల్లిలో కార్తికేయన్ ఎడ్యుకేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా రూ.24 లక్షల విలువ చేసే 85 తులాల బంగారం, ఐదు కిలోల వెండి, పైడిపల్లి, జఫర్గఢ్లలో 4 ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమికి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులు 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యలో కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా వెల్లడవుతుంది. కాగా, అప్పటి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.1.30 కోట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ కోట్లాది రూపాయాలు ఉంటుంది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్న సాంబశివరావును గురువారం సాయంత్రం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చి చర్లపల్లి జైలుకు తరలించారు. బినామీలపై ఏసీబీ నజర్ ఏసీబీ అధికారులు సాంబశివరావుకు సంబంధించిన బినామీలపై దృష్టి సారించారు. అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న జయేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు బినామీలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారి ఆస్తులపై ప్రత్యేకంగా నిఘా వేసి దాడులు చేసే అవకాశం ఉంది. ఈ దాడుల్లో వరంగల్ డీఎస్పీ సాయిబాబా, కరీంనగర్, ఆదిలాబాద్ ఇన్చార్జి డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, నల్గొండ ఏసీబీ డీఎస్పీ కోటేశ్వర్రావు, హైద్రాబాద్‌లో డీఎస్పీ ప్రభాకర్‌లతోపాటు సీఐ సాంబయ్య, రాఘవేందర్రావు, వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. ఎంజీఎంలో వైద్య పరీక్షలు సాంబశివరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న అనంతరం గురువారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ భిక్షపతిరావు సాంబశివరావుకు వైద్య పరీక్షలు చేశారు. సాంబశివరావును ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో ఈ వైద్యపరీక్షలు నిర్వహించారు. -
'చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాదించారు'
-
దూకుడు పెంచిన ఏసీబీ
సాక్షి, ముంబై: నగరంలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఫిర్యాదుల వచ్చిన తక్షణమే స్పందిస్తున్నారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న 60 మంది ప్రభుత్వ అధికారులపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసులు నమోదు చేశారు. వారు కూడబెట్టుకొన్న రూ.66 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం సత్వరమే విచారణ ఇంత కు ముందు అక్రమ ఆస్తులు కల్గి ఉన్న ఉన్నతాధికారులతోపాట చిన్నాచితాక ఉద్యోగులపై శాఖపరంగా చర్చించేవారు. దోషిగా తేలితే తప్ప పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యేది కాదు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు వ చ్చిన వారిపై విచారణ జరిపేందుకు హోం శాఖ నుంచి ఏసీబీ అనుమతి తీసుకోవల్సి వచ్చేది. అనుమతి లభించిన తరువాత సమగ్ర విచారణ జరిపి దోషిగా తేలితేనే కేసు నమోదు చేయాల్సి వచ్చేది. కానీ నిబంధనలల్లో స్వల్ప మార్పులు చేయడం వల్ల వారిపై విచారణ ప్రాంభించేందుకు ఏసీబీ అధికారులకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ఏడాది 60 మందిపై కేసులు అవినీతి శాఖ అధికారులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 60 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఆదాయానికి మించి కల్గి ఉన్నారని కేసు నమోదు చేశారు. ఇందులో ప్రథమ శ్రేణి ఉద్యోగులు రూ. 50 కోట్లు అక్రమంగా ఆస్తులు కూడ గట్టినట్లు విచారణలో తేలింది. ఇలాంటి అవినీతి అధికారుల ఫొటోలు ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఫేస్ బుక్‌లో పెడుతున్నారు. అవినీతి నిర్మూలనకు ఈ చర్యలు తోడ్పడుతాయని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అవినీతికి దూరంగా ఉంటారని ఏసీబీ డెరైక్టర్ ప్రవీణ్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు, లేదా అధికారులు ఎవరైనా అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినా, బాధితులు నేరుగా ఫిర్యాదు చేసినా, సమాచారం ఇచ్చినా స్పందిస్తామని ఆయన తెలిపారు. నమోదైన కేసులు ఇరిగేషన్ శాఖలో-14 కేసులు (10 కోట్లు), బీఎంసీ-11 కేసులు (రెండు కోట్లు), రెవెన్యూ-9 కేసులు (15 కోట్లు), అటవీ శాఖ-7 కేసులు (16 కోట్లు), పిడబ్ల్యూడీ-4 కేసులు (10 కోట్లు), సంక్షేమ శాఖ-3 కేసులు (13 కోట్లు) ఇలా ఉన్నాయి. -
మంచాల డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ కన్ను
మంచాల, న్యూస్‌లైన్: అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై మంచాల డిప్యూటీ తహసీల్దార్ బాలరాజు నివాసం, కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. నగరంలోని అంబర్‌పేట్‌లో ఉన్న ఆయన నివాసంతోపాటు స్నేహితులు, బంధువులు ఇళ్లపై ఏక కాలంలో ఎనిమిది బృందాలుగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ దాడుల్లో భాగంగా ఆయన విధులు నిర్వహిస్తున్న మంచాల తహసీల్దార్ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగాయి. ఆయనకు సంబంధించిన ప్రతి రికార్డును అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఆయనకు సంబంధించిన బీరువాలకు తాళం ఉండడంతో వాటిని పగులగొట్టి మరీ రికార్డులు పరిశీలించి, కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం12 గంటల నుంచి 2 గంటల వరకు కొనసాగిన ఈ సోదాల్లో బీఎల్ఓటు(బూత్‌లెవల్ అధికారులు)కు సంబంధించిన డబ్బులు, ఓ పట్టా పాసు పుస్తకంతో పాటు పి.ఆలివేలు పేరు మీద ఉన్న ఖాళీ చెక్కును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటిలో జాపాల, రంగాపూర్ వీఆర్ఏల వేతనాలు కూడా ఉన్నట్లు తెలిసింది. మంచాలలో నిర్వహించిన దాడుల్లో ఏసీబీ ఎస్సై సుదర్శన్‌రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ దాడులకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడంతో మిగిలిన వివరాలు బయటకు రాలేదు. దాడులు కొనసాగిన ఎనిమిది చోట్ల స్వాధీనం చేసుకున్న రికార్డులను క్రోడీకరించి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. మిగిలిన అధికారుల్లో గుబులు మంచాల డీఫ్యూటీ తహసీల్దార్ బాలరాజు పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతోనే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. ఈ దాడులు హైదరాబాద్ ఏసీబీ రేంజ్ డీఎస్పీ ప్రభాకర్, సిటీ రేంజ్ ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలో కొనసాగాయి. మంచాల తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలతో స్థానికంగా పనిచేస్తున్న ఇతర ప్రభుత్వ కార్యాలయాల అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇబ్రీహ ంపట్నం, యాచారం, హయత్‌నగర్ మండలాల అధికారులు మంచాలలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడుల గురించి చర్చించుకున్నారు.