సాక్షి, ముంబై: నగరంలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఫిర్యాదుల వచ్చిన తక్షణమే స్పందిస్తున్నారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న 60 మంది ప్రభుత్వ అధికారులపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసులు నమోదు చేశారు. వారు కూడబెట్టుకొన్న రూ.66 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ ప్రారంభించారు.
ప్రస్తుతం సత్వరమే విచారణ
ఇంత కు ముందు అక్రమ ఆస్తులు కల్గి ఉన్న ఉన్నతాధికారులతోపాట చిన్నాచితాక ఉద్యోగులపై శాఖపరంగా చర్చించేవారు. దోషిగా తేలితే తప్ప పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యేది కాదు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు వ చ్చిన వారిపై విచారణ జరిపేందుకు హోం శాఖ నుంచి ఏసీబీ అనుమతి తీసుకోవల్సి వచ్చేది.
అనుమతి లభించిన తరువాత సమగ్ర విచారణ జరిపి దోషిగా తేలితేనే కేసు నమోదు చేయాల్సి వచ్చేది. కానీ నిబంధనలల్లో స్వల్ప మార్పులు చేయడం వల్ల వారిపై విచారణ ప్రాంభించేందుకు ఏసీబీ అధికారులకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు.
ఈ ఏడాది 60 మందిపై కేసులు
అవినీతి శాఖ అధికారులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 60 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఆదాయానికి మించి కల్గి ఉన్నారని కేసు నమోదు చేశారు. ఇందులో ప్రథమ శ్రేణి ఉద్యోగులు రూ. 50 కోట్లు అక్రమంగా ఆస్తులు కూడ గట్టినట్లు విచారణలో తేలింది. ఇలాంటి అవినీతి అధికారుల ఫొటోలు ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఫేస్ బుక్‌లో పెడుతున్నారు. అవినీతి నిర్మూలనకు ఈ చర్యలు తోడ్పడుతాయని పేర్కొన్నారు.
ఇలా చేయడం వల్ల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అవినీతికి దూరంగా ఉంటారని ఏసీబీ డెరైక్టర్ ప్రవీణ్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు, లేదా అధికారులు ఎవరైనా అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినా, బాధితులు నేరుగా ఫిర్యాదు చేసినా, సమాచారం ఇచ్చినా స్పందిస్తామని ఆయన తెలిపారు.
నమోదైన కేసులు
ఇరిగేషన్ శాఖలో-14 కేసులు (10 కోట్లు), బీఎంసీ-11 కేసులు (రెండు కోట్లు), రెవెన్యూ-9 కేసులు (15 కోట్లు), అటవీ శాఖ-7 కేసులు (16 కోట్లు), పిడబ్ల్యూడీ-4 కేసులు (10 కోట్లు), సంక్షేమ శాఖ-3 కేసులు (13 కోట్లు) ఇలా ఉన్నాయి.
దూకుడు పెంచిన ఏసీబీ
Published Tue, Sep 30 2014 10:36 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement