చెన్నై : ఆయన పోలీస్ శాఖలో ఎస్‌ఐగా చేరి పదోన్నతితో ఇన్స్‌పెక్టర్ అయ్యాడు. విధుల్లో చేరిన పది సంవత్సరాల్లోనే తమిళనాట వందల కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. ఆయనకున్న ఆస్తులను చూసి అవినీతి నిరోధక శాఖనే నివ్వెరపోయింది. ఇప్పుడు మనం చెప్పుకున్నది వేలూరులో ఆర్థిక నేరాల ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నరమేశ్‌రాజ్ అనే పోలీస్ అధికారి గురించే.
రమేశ్ రాజ్ తన తల్లిదండ్రులు, బందువుల పేర్ల మీద వేలూరు, చెన్నై నగరాల్లో 54 ఇళ్లను కలిగి ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందింది. ఏసీబీ అధికారులు వేలూరులోని రమేశ్ రాజ్ నివాసంలో శనివారం దాడులు నిర్వహించి రూ.10 కోట్ల విలువైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్ రాజ్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment