గన్‌ఫౌండ్రి: ఒక ప్రైవేటు సంస్థకు చెందిన ఆడిట్ పూర్తి చేయడానికి, గతంలో అందించిన నోటీసును మూసి వేయడానికి ఓ వ్యాపారి వద్ద నుండి తెలంగాణ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ అధికారి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన బుధవారం అబిడ్స్‌లోని వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్‌కు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మూడు సంవత్సరాలకు గాను ఆడిట్ చేయించేందుకు పంజగుట్ట సర్కిల్‌కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అతను పొందుపరిచిన ఫార్మాట్ సరిగ్గా లేదంటూ శ్రీకాంత్‌కు వాణిజ్యపన్నుల శాఖ అధికారి నోటీసులు పంపించారు.
అన్ని వివరాలను సరిగ్గానే అందజేశామని ఆ నోటీసులకు శ్రీకాంత్ సమాధానం చెప్పినప్పటికి మీ వివరాలను అసెస్‌మెంట్ చేయాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను రూ.3 లక్షలు ఇవ్వలేనని, రూ.2 లక్షలు ఇస్తానని సదరు అధికారితో శ్రీకాంత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అబిడ్స్‌లోని తన కార్యాలయంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment