Commercial Taxes Dept
-
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ అధికారి
గన్‌ఫౌండ్రి: ఒక ప్రైవేటు సంస్థకు చెందిన ఆడిట్ పూర్తి చేయడానికి, గతంలో అందించిన నోటీసును మూసి వేయడానికి ఓ వ్యాపారి వద్ద నుండి తెలంగాణ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ అధికారి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన బుధవారం అబిడ్స్‌లోని వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్‌కు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మూడు సంవత్సరాలకు గాను ఆడిట్ చేయించేందుకు పంజగుట్ట సర్కిల్‌కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అతను పొందుపరిచిన ఫార్మాట్ సరిగ్గా లేదంటూ శ్రీకాంత్‌కు వాణిజ్యపన్నుల శాఖ అధికారి నోటీసులు పంపించారు. అన్ని వివరాలను సరిగ్గానే అందజేశామని ఆ నోటీసులకు శ్రీకాంత్ సమాధానం చెప్పినప్పటికి మీ వివరాలను అసెస్మెంట్ చేయాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను రూ.3 లక్షలు ఇవ్వలేనని, రూ.2 లక్షలు ఇస్తానని సదరు అధికారితో శ్రీకాంత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అబిడ్స్‌లోని తన కార్యాలయంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు పొందిన ఉద్యోగులకు పోస్టింగ్ లు ఇవ్వాలని, వెంటనే సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టాలని వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్‌లకు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రం పంపించారు. వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 498 మంది ఉద్యోగులు పదోన్నతులు పొంది దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వలేదన్నారు. మరోవైపు ఐదేళ్ల నుంచి సాధారణ బదిలీల ప్రక్రియ కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
ఏపీ: రెవెన్యూ పరిధిలోనే ఆ రెండు శాఖలు
సాక్షి, అమరావతి: కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు ఆర్థికశాఖకు బదిలీ జీవోను ప్రభుత్వం అబియన్స్‌లో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యథాతథంగా రెండు శాఖలు రెవెన్యూ శాఖ పరిధిలోనే కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. -
వాణిజ్య పన్నుల శాఖకు రూ.84.11 కోట్లు నష్టం
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు రూ.84.11 కోట్ల ఆర్థిక నష్టం కలిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్)లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం117 వాణిజ్య శాఖ కార్యాలయాలు ఉండగా.. 2018–19 సంవత్సరానికి గాను అందులో 37 కార్యాలయాల్లోని రికార్డులను కాగ్ పరిశీలించింది. చట్టాలను సరిగా అమలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల మొత్తం 448 కేసుల్లో రూ.84.11 కోట్ల వ్యాట్‌ను తక్కువగా మదింపు చేసినట్టు వెల్లడైంది. 180 కేసుల్లో వ్యాట్‌ను విధించకపోవడం లేదా తక్కువగా విధించడం ద్వారా ఖజానాకు రూ.65.29 కోట్ల నష్టం వాటిల్లింది. జరిమానాలు, వడ్డీలు విధించకపోవడం ద్వారా రూ.6.68 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అధికంగా లేదా తప్పుగా క్లెయిమ్ చేయడం ద్వారా రూ.5 కోట్లు, సీఎస్టీ చట్టం కింద 67 కేసుల్లో పన్ను విధించకపోవడం వల్ల రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా రాయితీల చెల్లింపులు రాష్ట్ర పారిశ్రామిక విధానం 2015–20కి విరుద్ధంగా కొన్ని పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలను చెల్లించినట్టు కాగ్ నివేదికలో నిగ్గు తేలింది. నెల్లూరు జిల్లా పరిధిలోని మూడు ఐస్ ఫ్యాక్టరీలకు 2017 నుంచి 2019 మార్చి కాలానికి రూ.1.32 కోట్ల రాయితీలను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు కాగ్ పేర్కొంది. తినడానికి ఉపయోగించే ఐస్‌ను కాకుండా నిల్వ, సంరక్షణ కోసం తయారు చేసే ఐస్ ఫ్యాక్టరీ అయినప్పటికీ ఆహార తయారీ ప్రోత్సహాక విధానం కింద వీటికి రాయితీలు చెల్లించినట్టు పేర్కొంది. మొత్తం మంజూరైన రూ.1.32 కోట్ల రాయితీ సక్రమం కాదని, ఇప్పటికే చెల్లించిన రూ.76.39 లక్షలు తిరిగి రాబట్టాలని కాగ్ ప్రభుత్వానికి సూచించింది. రుణ భారంలో పీఎస్‌యూలు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల పేరుతో భారీగా రుణాలను సమీకరించినట్టు కాగ్ పేర్కొంది. వరి ధాన్యం కొనుగోలు, పీడీఎస్ బియ్యం సేకరణ, మౌలిక వసతుల కల్పన పేరిట ప్రభుత్వరంగ సంస్థల పేరిట భారీగా రుణాలను సేకరించినట్టు తెలిపింది. 2016–17లో రాష్ట్ర పీఎస్‌యూల అప్పులు రూ.8,518.99 కోట్లుగా ఉంటే.. 2018–19 నాటికి రూ.30,530.91 కోట్లకు గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎస్బీఐ నుంచి రూ.19 వేల కోట్లను అప్పు తీసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఈడబ్ల్యూఎస్ ఇళ్ల భూములు, మౌలిక వసతుల కల్పనకు ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ రూ.3,951.59 కోట్ల రుణాలను తీసుకున్నట్టు పేర్కొంది. చదవండి: ఏపీ: 18వ రోజుకు కర్ఫ్యూ.. ఆంక్షలు మరింత కఠినతరం Cyclone Yaas: యాస్ తుపాను.. పలు రైళ్ల రద్దు -
టపాకాసుల దందా
టపాసుల పండగొస్తే కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు పండగే. శివకాశి నుంచి దొడ్డిదారిలో తెచ్చుకున్న సరుకును రాచమార్గంలో అమ్ముకునేందుకు అనధికార అనుమతులు ఇచ్చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రూ. వందల కోట్ల ఈ వ్యాపారంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వాటానే ఎక్కువ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా ఆవైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. సాక్షి, అనంతపురం : జిల్లాలో ఏటా టపాసుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈ పండుగొస్తే చాలు ఇటు వ్యాపారులతో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఎలాంటి పన్నులు చెల్లించకుండానే టపాసుల విక్రయాలు చేస్తూ పెద్ద ఎత్తున టపాసుల దందా సాగిస్తున్నారు. గంపగుత్తగా పన్నులు కట్టించుకుని జేబులు నింపుకుంటున్నారు. కమర్షియల్ అధికారులు ఉత్తుత్తి జీఎస్టీ పేరుతో టపాసుల వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్ల కార్యక్రమానికి తెరలేపుతూ సిరుల వర్షం కురిపించుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి మార్కెట్లో విక్రయించే ప్రతి వస్తువుకూ పన్నులు చెల్లించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే పన్ను (జీఎస్టీ) విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. సరకు తయారీ సమయంలో కానీ.. కొనుగోలు సమయంలో కానీ తప్పనిసరిగా ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. టపాసులపై జీఎస్టీ (గూడ్స్ సర్వీస్ ట్యాక్స్) 14 శాతం, ఎస్ఎస్టీ (సెంట్రల్ సర్వీస్ టాక్స్) 14శా>తం చొప్పున మొత్తం 28 శాతం మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రతి ఏటా రూ. 100 కోట్ల నుంచి రూ.120 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. ఈ లెక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు దాదాపు రూ.30 కోట్ల వరకూ పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో మాత్రం పన్నుల వసూళ్లు మాత్రం న్యాయ బద్దంగా చేపట్టడం లేదు. ఇందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులుకు అందుతున్న ముడుపులే కారణమనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారులకు ముడుపులు ముట్టేదిలా.. జిల్లాకు ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుంచి టపాసులు దిగుమతి అవుతున్నాయి. ఇదంతా ‘జీరో’ దందానే. కొంతమంది పేరుమోసిన డీలర్లు ఈ తంతంగం నడిపిస్తున్నారు. దీపావళి పండుగ రోజు నిబంధనల ప్రకారం అన్నట్లు రెవెన్యూశాఖ అధికారులు హంగామా చేస్తారు. నెల రోజుల ముందే వ్యాపారాల అనుమతి కోసం దరఖాస్తుల స్వీకరణ, లైసెన్స్ కేటాయింపు చేస్తారు. సదరు వ్యాపారస్తులు పేరుకు మాత్రమే. కానీ వీరి వెనుక ఉన్నది పేరు మోసిన బడా లీడర్లే. తొలుత మూడు రోజుల వ్యాపారమే కదా అని కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వద్ద పంచాయతీ పెడతారు. వారికి ముట్టజెప్పేది ముట్టిన తర్వాత వ్యాపారుల నుంచి గంపగుత్తగా ట్యాక్స్‌లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. రూ. 5 లక్షల వ్యాపారం చేసే వ్యాపారి చేత రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు మాత్రమే ట్యాక్స్ చెల్లించినట్లు ఓ డీడీని సమర్పిస్తారు. అంతే ఇక ఎన్ని రూ.లక్షల సరుకు విక్రయాలు చేపట్టినా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కన్నెత్తి చూడరు. రూ.కోట్లలో వ్యాపారం చేసినా.... కొన్నేళ్లుగా టపాసుల వ్యాపారానికి పేరుగాంచిన ఓ నేత కోట్లకు పడగలెత్తాడు. అనంతపురం నగరంతో పాటు ధర్మవరం, తాడిపత్రి, రాప్తాడు తదితర నియోజకవర్గాలోని మండలాలకు సరకును ఇతనే సరఫరా చేస్తున్నాడు. ఏటా దాదాపుగా రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వ్యాపారం ఇతనొక్కడే సాగిస్తుండడం గమనార్హం. అయితే ఆ వ్యాపారం తగ్గట్టు పన్నులు మాత్రం చెల్లించడం లేదు. పండుగ రోజు మూడురోజుల పాటు సాగే టపాసు దుకాణాల విక్రయదారులతోనే కాస్తో కూస్తో పన్నులు కట్టించి చేతులు దులుపుకుంటున్నాడు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు మాత్రం పెద్ద మొత్తంలో చేతులు తడిపి వ్యాపారాన్ని కొనసాగించుకుంటున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
అక్కసుతో రాజకీయాలు చేయొద్దు..
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదాయం కోసం పనిచేసే ప్రభుత్వం కాదని..ప్రజా సంక్షేమమే ప్రధానమని అని ఎక్సైజ్,వాణిజ్య శాఖ పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. కేవలం ఆదాయమే లక్ష్యంగా పనిచేసిందని మండిపడ్డారు. నాటుసారాను పూర్తిగా అరికట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇంత వరకూ కాపు సారా కాసే వారిపైన మాత్రమే కేసులు పెట్టేవారని...వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సారా నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. నాటుసారాను అరికట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రికి పేరు వస్తుందనే అక్కసుతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. పత్రికలు, మీడియా మద్యపాన నిషేధంపై అవగాహన కల్పిస్తూ..ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. మద్యం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్ర్పభావాలను పాఠ్యాంశాలలో పొందుపరుస్తామని వెల్లడించారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో మంత్రి సమీక్ష.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో శనివారం మంత్రి నారాయణ స్వామి సమీక్ష నిర్వహించారు. రిటర్న్ ఫైలింగ్‌పై రివ్యూ చేశామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేసి.. అనుమతులు ఇస్తే బోగస్ సంస్థలు ఉండవని తెలిపారు. ఇబ్బందులు కలగకుండా పాత బకాయిల కోసం ఒన్ టైం సెటిల్మెంట్ చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఐదు వేల కోట్లకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని.. న్యాయ నిపుణులతో చర్చిస్తామని వెల్లడించారు. -
సీఎస్టీ యాప్.. ట్యాక్స్‌లో టాప్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ దేశంలోనే తొలిసారిగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) విధానానికి శ్రీకారం చుట్టింది. అంతర్రాష్ట అమ్మకాల పన్ను వసూళ్లకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దేశ పన్ను వసూళ్ల వ్యవస్థకు ఆదర్శంగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కమిషనర్ అనిల్ కుమార్ మార్గదర్శకాలతో ఉన్నత అధికారుల రూపొందించిన సీఎస్టీ యాప్‌తో పన్ను వసూళ్ల ప్రక్రియ ఎంతో సులభతరమైందని అధికారులు చెబుతున్నారు. యాప్‌లో అంతర్రాష్ట అమ్మకాలు, డీలర్లకు సంబంధించిన వివరాలతో పాటు వారు సమర్పించాల్సిన సీ, ఎఫ్, ఐ ఫారాలతో పాటు బిల్ ఆఫ్ ల్యాండింగ్‌కు సంబంధించిన దస్తావేజులను ఉంచారు. దీంతో పాటు డీలర్లు పన్ను మినహాయింపునకు అందించాల్సిన ఫారాలు సమర్పించారా..? అమ్మకాలకు తక్కువ ధరల కోసం నివేధికలు అందింOచారా..? అనే సమాచారం యాప్‌లో పొందుపర్చారు. పన్ను వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్‌లో ఉండడంతో అధికారులకు విధులు సులభతరమయ్యాయి. యాప్‌తో అన్ని ప్రక్రియలూ సులువు.. సీఎస్టీ యాక్ట్ కింద ఈ ఏడాది జూన్ వరకు అంతర్రాష్ట్ర అమ్మకాలపై డీలర్లు కోరిన పన్ను మినహాయింపులు, తక్కువ ధరలకు సంబంధించి సీ, ఎఫ్, ఐ ఫారాల బిల్ ఆప్ ల్యాండింగ్ దస్తావేజులు సమర్పించాల్సి ఉంటుంది. ఒక త్రైమాసికంలో జరిగిన అమ్మకాలపై కోరిన మినహాయింపులు, అంతర్రాష్ట్ర, తక్కువ పన్ను రేట్లను తర్వాత త్రైమాసికం లోపు దస్తావేజులు రుజువులు, పత్రాలు వాణిజ్య పన్నుల శాఖకు డీలర్లు సమర్పించాలి. ఒకవేళ వారు సమర్పించని పక్షంలో.. సమర్పించని అమ్మకాల వివరాలను సాధారణ అమ్మకాలుగా పరిగణించి పన్ను మదింపు చేస్తారు. దీనికిగాను వాణిజ్య పన్నుల శాఖకు నాలుగేళ్లలోపు మదింపు చేయాల్సి ఉంటుంది. కానీ వాణిజ్య పన్ను శాఖ మదింపు చేయడానికి ఎక్కువ మంది సిబ్బంది, సమయం కావాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో సీఎస్టీ యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా అన్ని సీఎస్టీ నోటీసులు గత సంవత్సరాలకు సంబంధించినవన్నీ డీలర్ల నమోదు చేసిన ఈ మెయిల్ అడ్రస్‌కు ఒకే క్లిక్‌తో వెళ్లిపోయే వెసులుబాటు కలిగింది. ఈ ప్రక్రియతో వాణిజ్య పన్నుల శాఖకు సమయం ఆదా అవుతుంది. సిబ్బంది కూడా ఎక్కువ మంది అవసరం ఉండదు. నోటీస్ అందిన డీలర్లు వాటిలో ఉన్న ఒక లింక్ ద్వారా అభ్యంతరాలు, రుజువులు, పత్రాలను, ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించిన తర్వాత డీలర్లు ఈ– మెయిల్ ద్వారా వ్యక్తిగత వివరణ పత్రం చేరుతుంది. దీనిని ఆన్లైన్లో పూర్తి చేసి అధికారులు ఇచ్చిన తేదీల్లో వ్యక్తిగతంగా హాజరై అందజేయాలి. పారదర్శకతకు అవకాశం.. సీఎస్టీ పన్ను వసూళ్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కంప్యూటర్, ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంది. ఇటు శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అటు డీలర్లు సమర్పిస్తున్న వివరాలు అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి. డీలర్లు సమర్పించాల్సిన పత్రాలు, రుజువులు, వివరాలు అన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించడంతో ఎలాంటి అక్రమాలకు తావు ఉండదు. ఒకవేళ ఏవైనా దస్తావేజు పత్రాలు సమర్పించకపోతే ఆన్లైన్లో తెలిసిపోతుంది. దీంతో పన్ను వసూళ్ల ప్రక్రియా మొత్తం పారదర్శంగా కొనసాగుతోంది. ఈ యాప్‌తో పన్ను వసూళ్ల ప్రక్రియ సులభంగా మారింది. ఒక్కో అధికారికి 50 మంది డీలర్లు లక్ష్యంగా.. సీఎస్టీ పన్ను వసూళ్ల కోసం కేంద్ర కార్యాలయం ద్వారా సర్కిల్లోని ఒక్కో అధికారికి 50 మంది డీలర్ల పన్ను వసూళ్లకు టార్గెట్ ఇస్తున్నారు. దీంతో కేంద్ర కార్యాలయం సీ, ఎఫ్, ఐ ఫారాలు, నివేదికలు అందజేసే డీలర్ల వివరాలను అధికారులకు టార్గెట్‌గా ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు తొలుత ఫోన్ ద్వారా సమాచారం తీసుకుంటున్నారు. డీలర్ల వివరాలు అందజేయనివారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న డీలర్లు వివరాలను ఆన్లైన్లో అందించి పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.2వేల కోట్ల ఆదాయం సమకూర్చేందుకు ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకెళ్తున్నారు. -
ఎట్టకేలకు సునీల్ అరెస్ట్
సాక్షి, నిజామాబాద్ : వాణిజ్యపన్నులశాఖలో పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ఏ–2 నిందితుడు సునీల్‌ను సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ట్యాక్స్‌కన్సల్టెంట్ శివరాజ్ కుమారుడైన ఈ సునీల్‌ను సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు సీఐడీ అధికారులు హైడ్రామా నడిపారు. శివరాజ్‌తో పాటు, సునీల్ కూడా సుమారు మూడు నెలలుగా పరారీలో ఉన్నాడు. శివరాజ్‌ను గతనెల 23న అరెస్టు చూపించిన సీఐడీ అధికారులు, మరో నెల రోజుల అనంతరం సునీల్‌ను అరెస్టు చేయగలిగారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, కొందరు వ్యాపారులు కలిసి రూ.వందల కోట్లలో వ్యాట్, సీఎస్టీ ఎగవేశారు. ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, ఆయన కుమారుడు సునీల్‌లు ఈ కుంభకోణాన్ని నడిపారు. ఈ వ్యవహారంపై బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఫిబ్రవరి మొదటి వారంలో బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివరాజ్, సునీల్‌లతో పాటు, బోధన్ సీటీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీఓ విజయ్‌కృష్ణ, మరో ఇద్దరు సిబ్బంది హన్మాన్‌సింగ్, వేణుగోపాల్‌లపై కేసు నమోదైన విషయం విధితమే. ఈ కేసులో మిగిలిన నలుగురు ఇప్పటికే అరెస్టు కాగా, తాజాగా సునీల్ కూడా అరెస్టు అయ్యాడు.