Updates..
👉మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ పరిహారం..
Death toll due to Kallakurichi hooch tragedy rises to 34.
Tamil Nadu CM MK Stalin announces Rs 10 lakhs each for the family of deceased and Rs 50,000 each for the people under treatment. A one-man commission, comprising former judge Justice B Gokuldas, announced for probing the…— ANI (@ANI) June 20, 2024
👉తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
👉కల్తీ మద్యం ఘటనపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్‌దాస్‌తో కూడిన వన్ మ్యాన్ కమిషన్ ఈ అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికలు సమర్పించాలని ప్రకటించింది.
👉 తమిళనాడు కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది. కల్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుంది.
#DGNews |The #deathtoll in the Kallakurichi illicit #liquor incident has risen to 37.
#tamilnadu #Kallakurichi #Resign_Stalin #DMK #DMKGovt— Saji Agniputhiran (@Sajiagniputhira) June 20, 2024
👉 కాగా, సారా తయారీలో మోతాదుకు మించిన మిథనాల్‌ను వినియోగించినట్లు తేలింది
👉 నేడు తమిళనాడు అసెంబ్లీ సెషన్ ప్రారమైంది. ఈ నేపథ్యంలో కల్తీ సారా విషయంపై అధికార-విపక్షాల వాగ్వాదంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
👉 ఇక, ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించి విచారణ చేపట్టాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ.
👉 ఈ కేసులో కల్తీ సారా తయారు చేసిన గోవిందరాజు సహా ఓ మహిళ, యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
👉 కల్తీ సారా ఘటనలో దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది.
👉ఈ ఘటనలో మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
👉ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు.
Tamil Nadu CM tweets, "I was shocked and saddened to hear the news of the deaths of people who had consumed adulterated liquor in Kallakurichi. Those involved in the crime have been arrested in this matter. Action has also been taken against the officials who failed to prevent…
— ANI (@ANI) June 19, 2024
👉గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు.
👉మరోవైపు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు.
👉ఇదిలా ఉండగా.. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
#WATCH | Tamil Nadu: At least 25 people died and several were hospitalised after reportedly consuming illicit liquor in Tamil Nadu's Kallakurichi district: District Collector MS Prasanth
(Visuals from Kallakurichi Government Medical College) pic.twitter.com/WI585Cbxbk— ANI (@ANI) June 19, 2024
👉ఇక, ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 40 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు.
VIDEO | #TamilNadu: Several people were reported dead, and many others hospitalised after consuming spurious liquor in #Kallakurichi district.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/IFicB26zG0— Press Trust of India (@PTI_News) June 20, 2024
Comments
Please login to add a commentAdd a comment