illicit liquor
-
తమిళనాట కల్తీ మద్యం కాటు.. తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి దాదాపు 50 మంది మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తెలంగాణకు చౌకైన మద్యం బ్రాండ్లను తెస్తున్నారు. రాష్ట్రంలో తమిళనాడు కల్తీ సారా ఘటనలు రాకూడదు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. Let’s make sure this doesn’t happen in Telangana Hope the Congress Govt is taking note and will not introduce cheap brands and risk the lives of people https://t.co/Qbx4edURQB— KTR (@KTRBRS) June 21, 2024 -
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో ఘోర విషాదం
-
అత్యంత విషాదంగా తమిళనాడు కల్తీ సారా ఘటన.. మరణాలు ఎన్నంటే?
Updates..👉మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ పరిహారం.. Death toll due to Kallakurichi hooch tragedy rises to 34. Tamil Nadu CM MK Stalin announces Rs 10 lakhs each for the family of deceased and Rs 50,000 each for the people under treatment. A one-man commission, comprising former judge Justice B Gokuldas, announced for probing the…— ANI (@ANI) June 20, 2024 👉తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.👉కల్తీ మద్యం ఘటనపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్దాస్తో కూడిన వన్ మ్యాన్ కమిషన్ ఈ అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికలు సమర్పించాలని ప్రకటించింది. 👉 తమిళనాడు కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది. కల్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుంది. #DGNews |The #deathtoll in the Kallakurichi illicit #liquor incident has risen to 37.#tamilnadu #Kallakurichi #Resign_Stalin #DMK #DMKGovt— Saji Agniputhiran (@Sajiagniputhira) June 20, 2024 👉 కాగా, సారా తయారీలో మోతాదుకు మించిన మిథనాల్‌ను వినియోగించినట్లు తేలింది👉 నేడు తమిళనాడు అసెంబ్లీ సెషన్ ప్రారమైంది. ఈ నేపథ్యంలో కల్తీ సారా విషయంపై అధికార-విపక్షాల వాగ్వాదంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.👉 ఇక, ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించి విచారణ చేపట్టాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ.👉 ఈ కేసులో కల్తీ సారా తయారు చేసిన గోవిందరాజు సహా ఓ మహిళ, యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.👉 కల్తీ సారా ఘటనలో దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. 👉ఈ ఘటనలో మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 👉ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు. Tamil Nadu CM tweets, "I was shocked and saddened to hear the news of the deaths of people who had consumed adulterated liquor in Kallakurichi. Those involved in the crime have been arrested in this matter. Action has also been taken against the officials who failed to prevent…— ANI (@ANI) June 19, 2024 👉గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు. 👉మరోవైపు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. 👉ఇదిలా ఉండగా.. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. #WATCH | Tamil Nadu: At least 25 people died and several were hospitalised after reportedly consuming illicit liquor in Tamil Nadu's Kallakurichi district: District Collector MS Prasanth(Visuals from Kallakurichi Government Medical College) pic.twitter.com/WI585Cbxbk— ANI (@ANI) June 19, 2024 👉ఇక, ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 40 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. VIDEO | #TamilNadu: Several people were reported dead, and many others hospitalised after consuming spurious liquor in #Kallakurichi district.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/IFicB26zG0— Press Trust of India (@PTI_News) June 20, 2024 -
అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టాలి
సాక్షి, అమరావతి/సింగరాయకొండ (మర్రిపూడి)/శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా)/నెల్లూరు(బారకాసు): త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలు, మద్యం గొడౌన్ల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ–నిల్వ చేసే స్థలాల వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గోడౌన్ల నుంచి షాపులకు మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఈనెల 15లోగా ఏర్పాటు చేసి ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. అదేవిధంగా తనిఖీలను ముమ్మరం చేయాలని అబ్కారీ శాఖ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపరచకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రలోభాలపై గట్టి నిఘా రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలపై గట్టి నిఘా ఉంచామని, ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులు జప్తు చేశామని ముకేశ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారా అలాగే పోలీస్, ఎక్సైజ్, ఐటీ, ఫారెస్టు, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో నిరంతరం నిఘా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జప్తు చేసిన వాటిలో రూ. 25.03 కోట్ల నగదు, రూ. 12.49 కోట్ల విలువైన మద్యం, రూ.2.05 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 51.23 కోట్ల విలువైన లోహాలు, రూ. 2.42 కోట్ల విలువైన ఉచితాలు, రూ. 7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులను జప్తుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. నామినేషన్లకు 18న నోటిఫికేషన్ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి గురువారం ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం అవుతుందని చెప్పారు. కోడ్‌ను అమలు చేస్తున్న తీరు పరిశీలించి అధికారులను అభినందించారు. ఓటు ఆవశ్యకతను తెలుపుతూ ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన మస్కట్‌ను ఆవిష్కరించారు. ముక్కంటి సేవలో మీనా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆర్డీవో రవిశంకర్‌రెడ్డి, ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు మీనాకు ఆశీర్వచనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. సింగరాయకొండ చెక్‌పోస్టు తనిఖీ ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం ముకేశ్ కుమార్ మీనా తనిఖీ చేశారు. ఈమార్గంలో వస్తున్న వాహనాలను సిబ్బంది తనిఖీ చేస్తున్న తీరు, వీడియో రికార్డింగ్ చేస్తున్న విధానాన్ని ఆయన చెక్‌పోస్టు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు, నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రయాణికుల బ్యాగులను కచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాలని సూచించారు. తగిన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు పైగా నగదు ఉంటే దానిని సీజ్ చేసి ట్రెజరీకి జమచేయాలన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఎన్నికల రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలో విచారణ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నకిలీ మద్యం సరఫరా చేస్తే పీడీ యాక్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయానికి గండికొట్టేందుకు ఇతర రాష్ట్రాల్లోని మద్యాన్ని సరఫరా చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి పీడీ యాక్టు నమోదు చేయాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖలోని టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను పటిష్టపర్చాలని ఆదేశించారు. ఒడిషాలో నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మాఫియాను ఎక్సైజ్ అధికారులు సమర్థవంతంగా అడ్డుకున్నారని మంత్రి అభినందించారు. అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా నుంచి రాష్ట్రానికి వస్తున్న నకిలీ మద్యాన్ని కూడా అరికట్టాలన్నారు. ఎక్సైజ్ ఆదాయం పెరిగేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయడమే కారణమన్నారు. సమీక్షాసమావేశంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అడిషనల్ కమిషనర్ అజయ్ కుమార్, జాయింట్ కమిషనర్లు ఖురేషి, కె ఏ బి శాస్త్రి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, బ్రివరేజ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
స్మగ్లింగ్ దందా.. 51 లక్షల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి, అమరావతి: తక్కువకు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది స్మగుల్ గూడ్స్ కొంటూ ఉంటారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా ఏటా లక్షల కోట్లు చేతులు మారతాయంటే నమ్మగలమా? ఈ స్మగ్లింగ్ వల్ల ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తోంది. దేశంలో పరిశ్రమల విస్తరణకు విఘాతంగా మారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది. స్మగ్లింగ్ దందా దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా దెబ్బతీస్తోందనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రముఖ మార్కెట్ అధ్యయన సంస్థ ‘థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(టీఏఆర్‌ఐ) ద్వారా అధ్యయనం చేయించింది. దేశ మార్కెట్లోకి అక్రమంగా చొరబడుతున్న ఉత్పత్తుల్లో మొదటి ఐదు స్థానాల్లో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, గృహ వినియోగ, మద్యం, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఐదు కేటగిరీల్లో స్మగ్లింగ్ దందా ప్రభావాన్ని టీఏఆర్‌ఐ ద్వారా అధ్యయనం చేశారు. విదేశాల నుంచి దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్న టాప్–5 ఉత్పత్తుల విలువ ఏటా రూ. 2.60 లక్షల కోట్లుగా ఉంటోంది. దాంతో భారత ప్రభుత్వం పన్నుల ద్వారా రావాల్సిన రూ. 58 వేల కోట్ల ఆదాయాన్ని ఏటా కోల్పోతోంది. అంతే కాదు 51 లక్షల ఉపాధి అవకాశాలకు కూడా గండి పడుతోంది. ఆ ఐదు కేటగిరీల స్మగ్లింగ్ తీవ్రత ఎలా ఉందంటే.. ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు దేశంలోకి ఏటా సగటున రూ. 1,42,284 కోట్ల విలువైన ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల మార్కెట్లో ఈ అక్రమ దిగుమతి ఉత్పత్తుల వాటా ఏకంగా 25.09 శాతం ఉంటోంది. తద్వారా దేశం రూ. 17,074 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. అంతేకాదు అక్రమ ఉత్పత్తులతో దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల పరిశ్రమను దెబ్బతీస్తోంది. దాంతో దేశంలో 7.94 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. గృహ వినియోగ ఉత్పత్తులు గృహోపకరణాలు, గృహవినియోగ ఉత్పత్తులు, వ్యక్తిగత వినియోగ ఉత్పత్తులే దేశంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ ఉత్పత్తులు కొల్లగొడుతున్నాయి. దేశంలోకి ఏటా రూ. 55,530 కోట్ల విలువైన గృహవినియోగ ఉత్పత్తులు అక్రమగా దిగుమతి అవుతున్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఈ ఉత్పత్తుల వాటా 34.25 శాతం ఉంది. దాంతో దేశం ఏటా రూ. 9,995 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఇక పరిశ్రమలు దెబ్బతినడంతో దేశంలో ఏటా 2.89 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మద్యం ఉత్పత్తులు.. విదేశాల నుంచి వచ్చే అక్రమ మద్యం దేశ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఏటా రూ. 23,466 కోట్ల విలువైన విదేశీ అక్రమ మద్యం దేశ మార్కెట్లోకి చొరబడుతోంది. దేశంలో మద్యం మార్కెట్లో ఈ అక్రమ మద్యం వాటా 19.87 శాతం. దాంతో దేశం ఏటా రూ. 15,262 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 97 వేల మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. పొగాకు ఉత్పత్తులు విదేశాల నుంచి దేశ మార్కెట్లోకి ఏటా రూ. 22,930 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. దేశ పొగాకు మార్కెట్లో ఈ ఉత్పత్తుల వాటా 20.04 శాతం ఉంది. దాంతో దేశం ఏటా సగటున రూ. 13,331 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 3.7 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మొబైల్ ఫోన్ల మార్కెట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ల మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ చీడ పీడిస్తోంది. విదేశాల నుంచి స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఏటా రూ. 15,884 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు వచ్చి చేరుతున్నాయి. దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఈ ఫోన్ల వాటా 7.56 శాతంగా ఉంది. దాంతో దేశం రూ. 2,859 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో పాటు దేశంలో 35 వేల మంది ఉపాధి అవకాశాలకు గండి పడుతోంది. -
సారా, అక్రమ మద్యం కట్టడికి కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: నాటు సారా, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా సారా తయారీయే వృత్తిగా జీవిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పరివర్తనం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం నిర్వహించిన ఎక్సైజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడినవారి నుంచి సంబంధిత మొత్తాన్ని వసూలు చేసేందుకు ఆర్ ఆర్ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్రస్థాయి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పరివర్తన’ ఫలించేలా
సాక్షి, అమరావతి: గంజాయి సాగు, అక్రమ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టి కేసుల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్ఈబీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలన చర్యలు చేపడుతూనే ఉపాధి మార్గాలు చూపాలని అధికార యంత్రాంగానికి సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. ఎక్సైజ్, అటవీ, గనులు, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. అటు ఉక్కుపాదం.. ఇటు ఉపాధితో ఊతం పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చేయూత, ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి ఊతమివ్వాలని, ఆదాయం సమకూరే దిశగా ఉపాధి చూపాలని నిర్దేశించారు. అప్పుడే అక్రమ మద్యం తయారీ లాంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనతోపాటు ఉపాధి మార్గాలు కల్పించాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా, ఎవరైనా అర్హులు మిగిలిపోతే తనిఖీ చేసి వారికి కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించాలని ఆదేశించారు. తద్వారా పట్టాలు అందుకున్న రైతులకు రైతు భరోసా సాయం లభిస్తుందన్నారు. వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. అప్పుడే ఆశించిన స్ధాయిలో మార్పు వచ్చి అక్రమ మద్యం, గంజాయి సాగు నుంచి దూరం అవుతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరింత సౌలభ్యంగా పన్ను చెల్లింపులు పన్ను చెల్లింపులకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని పన్ను చెల్లింపుదారులకు వివరించాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. అవగాహన పెంపొందించి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై.. రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తూ శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న చోట్ల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై విస్తృత అవగాహన కలిగించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎలాంటి డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. నిర్వహణలో లేని గనులపై దృష్టి గనుల శాఖ కార్యకలాపాలపై సమీక్ష సందర్భంగా నిర్వహణలో లేని గనులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సూచించారు. సమీక్షలో విద్యుత్, అటవీ పర్యావరణ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలు తగ్గాయి గతంతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని సీఎం జగన్ వెల్లడించారు. బెల్టు షాపులను తొలగించడం, పర్మిట్ రూమ్‌ల రద్దు లాంటి పలు చర్యల వల్ల మద్యం విక్రయాలు తగ్గాయని చెప్పారు. దీంతో పాటు మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేందుకు షాక్ కొట్టేలా రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పరివర్తన కార్యక్రమం అమలు తీరుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. -
బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి
పాట్నా: కల్తీ మద్యం తాగి 11 మంది చనిపోగా 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో చాలా మంది కంటిచూపు కూడా పోగొట్టుకున్నారు. ఈ ఘటన బిహార్‌లోని సరన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి కారకులను గుర్తించేందుకు మకేర్, మర్హౌరా, భెల్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు దాడులు జరుపుతున్నారు. కల్తీ సారాను తయారీ, విక్రయించినందుకు ఇప్పటి వరకు అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు. కల్తీ సారా తాగి ఇద్దరు మరణించినట్లు మరికొంతమంది అనారోగ్యానికి గురైనట్లు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు. మకేర్ర్ పోలీసు స్టేషన్ పరిధిలో కల్తీసారా బాధితుల ఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. బాధితులంతా ఈ నెల 3న శ్రావణమాస పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం మత్తు పదార్థాలను సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. చదవండి: ప్రియాంక గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వీడియో దృశ్యాలు.. పోలీసులు, ఎక్సైజ్, వైద్యాధికారుల బృంధం ఘటన స్థలానికి చేరుకొని బాధితులను సదర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని పాట్నాలోని పిఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తొమ్మిది మంది, ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరు మరణించారు. అంతేగాక అధికారులకీ విషయం తెలియక ముందే ఒకరిని దహనం చేశారని తెలిపారు. మరో 12 మంది పన్నెండు మంది ఇంకా చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు కల్తీ మద్యం విక్రయాన్ని ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు స్థానిక పోలీస్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా నితీష్ కుమార్ ప్రభుత్వం 2016లో బిహార్‌లో మద్యం నిషేధించింది. అయితే 2021 నవంబర్ నుంచి జరుగుతున్న కల్తీ మద్యం ఘటనల్లో 50 మందికి పైగా చనిపోయారు. -
ఇంట్లో మద్యం తయారీ.. ఇద్దరి అరెస్టు
మంగుళూరు: అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని కొడమాన్ కోడిలోని ఓ ఇంట్లో మద్యం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ సిబ్బంది దాడి చేశారు. మద్యం తయారీకి ఉపయోగిస్తున్న 1200 లీటర్ల బెల్లం ద్రావణం, 950 కేజీల బెల్లం, 500 లీటర్ల నకిలీ మద్యం, 300 లీటర్ల బంగాళాదుంప-బెల్లం మిక్సర్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ శైలజా కోటే ఆదేశాలతో ఎక్సైజ్ ఎస్పీ వినోద్‌కుమార్ దాడులకు నేతృత్వం వహించారు. -
నాటు సారా కేంద్రాలపై మెరుపు దాడులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా నిర్మూలనకు పోలీసులు కదం తొక్కారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా కేంద్రాలపై పోలీసు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుండి దాడులు చేస్తున్నారు. పదివేల మంది సిబ్బందితో తనిఖీలు కొనసాగుతున్నాయి. వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సీఐలు,ఎస్సైలు, పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు జరుగుతున్నాయి. నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాలను జల్లెడపడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చేస్తున్నారు. -
ఉపేక్షించొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు కనిపించకూడదని, అక్రమ మద్యం తయారీ అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా నిరోధంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. ఇన్ని విప్లవాత్మక కార్యక్రమాల మధ్య బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా లాంటివి మన ఉద్దేశాలను దెబ్బ తీస్తాయన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ ఉండకూడదు. ఇసుక అక్రమ తవ్వకాలు.. అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణా, మద్యం రవాణా ఉండకూడదు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలి. గ్రామాల్లో 11 వేలకు పైగా ఉన్న మహిళా పోలీసులతో పాటు మహిళా మిత్రలను సమర్థవంతంగా వాడుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచండి. ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖలో మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనుల కోసం వినియోగించాలి. కలిసి కట్టుగా ఫలితాలు సాధించాలి. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేసుకోవడం ద్వారా విధి నిర్వహణలో సమర్థత పెంచుకోవాలి. -
టెంట్‌హౌస్‌లో అక్రమ మద్యం పట్టివేత
పీఎం పాలెం(భీమిలి): ప్రైవేటు మద్యం దుకాణాల గడువు ముగిసిన తరువాత కూడా మద్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్న వారి ఆటకట్టించారు ఎక్సైజ్, టాస్క్ఫోర్సు అధికారులు. పోతినమల్లయ్యపాలెం సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ టెంట్‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న ఈ బాగోతాన్ని బట్టబయలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3 లక్షల విలువైన మద్యాన్ని స్వాదీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించిన వివ రాలు ఇలా ఉన్నాయి. మదురవాడలో ఆర్కే నా యుడు వైన్స్, నర్సింగ్ వైన్స్, మిథులాపురి లే అవుట్‌లోని శ్రీసాయి వైన్స్ లైసన్స్లు ప్రభుత్వ నూతన మద్యం పాలసీ ప్రకారం సెప్టంబర్ 30తో ముగిశాయి. ఆయా దుకాణాల్లో ఉన్న లిక్కర్, బీ ర్లు ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 30 నాటికి తమ వద్ద ఉన్న సరకు అంతా అమ్ముడుపోయిందని ఆయా దుకాణాల యజమానులు అధికారులకు తప్పుడు లెక్క లు చూపారు. అనంతరం మద్యాన్ని టెంట్‌హౌస్‌కు తరలించారు. ఆయా మద్యాన్ని మదురవాడ ప్రాంతంలోని బెల్ట్ దుకాణాలకు గుట్టుగా తరలించి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ వ్యక్తి మోటర్ సైకిల్‌పై రెండు కేసుల మద్యాన్ని తరలిస్తుండగా టెంట్‌హౌస్‌కు సమీపంలో మాటు వేసిన ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ విభాగం సిబ్బంది తడ్ని అదుపులోకి తీసుకు ని విచారించారు. అతడు చెప్పిన సమాచారంతో టెంట్‌హౌస్‌కు వెళ్లి పరిశీలించగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బయటపడింది. 42 కేసుల బీర్లు, 19 కేసుల బ్రీజర్లు, వివిద రకాల బ్రాండ్ల లిక్కర్ 88 కేసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంకా నర్శింగరావు, వి.పుల్లాజీ, ప్రసాద్, రామకృష్ణ, మన్మధరావు, సోంపాత్రుడులను అరెస్ట్ చేశా రు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎన్.అన్నపూర్ణ, సహాయ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ దొర, ఎస్ఐ బాబూరావు, సి బ్బంది దాడుల్లో పాల్గొన్నారు. అక్రమ మద్యం ప ట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
25 మంది పోలీసులపై వేటు
బిహార్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో 16 మంది వ్యక్తులు అక్రమ మద్యానికి బలైన ఘటనలో 25 మంది పోలీసులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. ఘటనకు బాధ్యులైన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా 14 మందిపై ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు. పూర్తిగా మద్యం అమ్మకాల నిషేధం ఉన్న ఈ రాష్ట్రంలో, పోలీసుల నిర్లక్ష్యపూరిత వ్యవహారానికి అక్రమమద్య వ్యాపారం కొన్ని ప్రాంతాల్లో జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గోపాల్‌గంజ్ జిల్లా స్థానిక ప్రాంతంలో మంగళవారం సాయంత్రం అక్రమ మద్యం సేవించి 16 మంది వ్యక్తులు ప్రాణాలు వదిలిన ఘటన చోటుచేసుకుంది. అక్రమ మద్య వ్యాపారాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి పట్టించుకోని స్థానిక ఖజుర్వాని గ్రామ పోలీసుస్టేషన్ పరిధిలోని పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. అక్రమమద్యం సేవించడం వల్లనే వీరు మృతిచెందారని కుటుంబీకులు, స్థానిక ప్రజలు వాపోయారు. ముందస్తు రిపోర్టులు సైతం అక్రమ మద్యానికే వీరు బలైనట్టు వెల్లడించాయి. కానీ స్థానిక పోలీసులు, అధికారులు మాత్రం తమ నిర్లక్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఖండించారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో టీమ్ ను ఏర్పాటుచేసిన ప్రభుత్వం, అక్రమ మద్య వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ ఖజుర్వాని గ్రామంలోని స్థానిక పోలీసు స్టేషన్ పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తేల్చింది. వెంటనే 15 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించిన నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ సైతం తీవ్రంగా స్పందించారు. ఘటనకు దోహదం చేసిన వారిని ఎవరిని వదిలేది లేదన్నారు. తరుచు దాడులు నిర్వహిస్తూ అక్రమ మద్యాలను అరికడుతున్నామని పోలీసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతుండగా.. మద్య నిషేధం చేపట్టినప్పటినుంచి ఎలాంటి రైడ్స్ తమ ప్రాంతాల్లో జరగలేదని స్థానికులు పేర్కొంటున్నారు. పైగా పోలీసులే మద్యం సేవిస్తూ ఊగులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని ఆరు గ్రామాలకు నితీష్ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ నెల మొదట్లోనే స్టేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో తమ ప్రాంతాల్లో మద్యాన్ని రికవరీ చేయడం లేదని 11 ఎస్హెచ్ఓలు సస్పెండ్ అయ్యారు. -
రంగడు... మహా మాయగాడు!
జిల్లాలో జోరుగా కల్తీ మద్యం కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా స్పిరిట్, నకిలీ మూతల సరఫరా డీటీఎఫ్ దాడులతో గుట్టురట్టు పట్టుబడిన పాత నేరస్తుడు రంగన్న ఇది వరలో పలుమార్లు జైలుకు.. భారీ లాభాల నేపథ్యంలో తిరిగి ఇదే వ్యాపారం రంగన్న. నకిలీ మద్యం వ్యాపారంలో ఆరితేరిన మాయగాడు. జైలుకు వెళ్లి రావడమంటే.. అత్తగారింటికి వెళ్లొచ్చినట్లే. కాస్త కష్టపడితే.. లాభాలు మూటకట్టుకోవచ్చనే భావన పోలీసులకు పట్టుబడినా తిరిగి అదే వ్యాపారం వైపు నడిపిస్తోంది. పీడీ యాక్ట్ కూడా ఇతన్ని నిలువరించలేకపోవడం చూస్తే.. ఇతనొక్కడే ఈ వ్యాపారంలో లేడనే విషయం ఇట్టే అర్థమవుతోంది. మరి కనిపించని ఆ మద్యం మాఫియాను ఎక్సైజ్ శాఖ ఎందుకు పట్టుకోలేకపోతోంది? కర్నూలు: జిల్లాలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. నకిలీ మూతలను కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకొని బ్రాండ్ మిక్సింగ్ చేసి వ్యాపారాలు సాగిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ విచారణలో వెలుగు చూసింది. జిల్లాలోని మద్యం మాఫియా ఒకవైపు అధిక ధరలకు విక్రయాలు జరుపుతూనే సరికొత్త రూటును ఎంచుకొని ప్రీమియం బ్రాండ్ల మూతలు బాటిళ్లపై ట్యాపింగ్ చేసి బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. మద్యం డైల్యూషన్ అమ్మకాలను అధికార పార్టీ నేతల అండదండలతో జోరుగా సాగిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని పత్తికొండ, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, ఆలూరు, ప్రాంతాల్లో మద్యం మాఫియా బెల్టు దుకాణాల ద్వారా ఈ తర హా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ దాడులతో గుట్టురట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా టాస్క్ఫోర్సు అధికారుల దాడులతో నకిలీ మద్యం గుట్టు రట్టయింది. డీటీఎఫ్ సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ కిషోర్‌కుమార్ నేతృత్వంలో సోమవారం రాత్రి గోనెగండ్ల మండలం పుట్టపాశంలో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో స్పిరిట్, నకిలీ మూతలు.. ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పుట్టపాశం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు బోయ రంగన్న, ఆయన కుమారుడు బోయ గోవిందును అదుపులోకి తీసుకొని నకిలీ మద్యం రాకెట్ వెనుక ఎవరున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. అతని వద్ద నుంచి 10 లీటర్ల స్పిరిట్, 270 నకిలీ మూతలు, 236 ఒరిజినల్ చాయిస్ ఖాళీ సీసాలు, 60 ఎక్సైజ్ అడేసివ్ లేబుళ్ల(ఈఏఎల్)ను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర నెలల క్రితం కూడా రంగన్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ ఇదే తరహా వ్యాపారం సాగిస్తున్నట్లు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములుకు సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు డీటీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రం మద్య నిషేధం అమలులో ఉన్నప్పుడు కూడా రంగన్న జిల్లాలో మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తూ పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఈ తరహా వ్యాపారంలో భారీగా లాభాలు ఉండటంతో ఈ వ్యాపారాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. గతంలో ఈయనపై పీడీయాక్ట్ కూడా అమలు చేసి సుమారు 6 మాసాల పాటు జైలుకు పంపారు. మద్యం బ్రాండ్ మిక్సింగ్ కోసం నకిలీ మూతలు, నకిలీ మద్యం తయారీ కోసం స్పిరిట్, ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారనే విషయంపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. రాయచూరు కేంద్రంగా నకిలీ మద్యం సరఫరా కర్ణాటక రాష్ట్రం రాయచూరు కేంద్రంగా జిల్లాలోకి నకిలీ మద్యంతో పాటు బాటిళ్లు, స్పిరిట్, నకిలీ మూతలు, ఖాళీ సీసాలు సరఫరా అవుతున్నాయి. రాయచూరుకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి జిల్లాలోని పలు ప్రాంతాలకు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. క్యాన్లలో స్పిరిట్‌ను సరఫరా చేసి రహస్య ప్రాంతాల్లో ఉంచి నకిలీ మద్యాన్ని తయారు చేసి బె ల్టు దుకాణాల ద్వారా విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రాండ్ మిక్సింగ్ అంటే.. బ్రాండ్ మిక్సింగ్ అంటే మద్యాన్ని డైల్యూట్ చేయడం. ప్రీమియర్ బ్రాండ్లలో కొంత మద్యం తీసి చీప్ లిక్కర్ కలపడాన్ని బ్రాండ్ మిక్సింగ్ అంటారు. రాయల్‌స్టాగ్, ఎంసీ విస్కీ వంటి ముఖ్యమైన ప్రీమియం బ్రాండ్లలో చీప్ లిక్కర్‌ను కలిపి మద్యం మాఫియా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రయోగశాల ఉన్నప్పటికీ అది అలంకార ప్రాయంగా మారడంతో మద్యం వ్యాపారులకు వరంగా మారింది. మూలాలు ఎక్కడ? పుట్టపాశం ఘటన సమాచారాన్ని రాష్ట్ర ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు డీటీఎఫ్ అధికారులు చేరవేయడంతో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. వారం రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఇదే తరహాలో భారీ ఎత్తున బ్రాండ్మిక్సింగ్ మూతలు బయటపడటంతో కర్నూలు జిల్లాలో కూడా అదే తరహా వ్యాపారం సాగుతున్నట్లు రాష్ట్రస్థాయి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఎంతకాలం నుంచి బ్రాండ్ మిక్సింగ్ మూతలు సరఫరా అవుతున్నాయి? ఏఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు? అందులో రంగన్నతో పాటు జిల్లాలో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే విషయాలను నిర్ధారించే పనిలో జిల్లాటాస్క్ఫోర్సు నిమగ్నమైంది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతో పట్టుబడిన రంగన్నను కోర్టులో హాజరు పరిచి ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. గతంలో డోన్ సమీపంలోని కొత్తపల్లె వద్ద భారీ మొత్తంలో నకిలీ మద్యం బయటపడిన సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు కావడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం జిల్లాలో బయటపడుతున్న నకిలీ మద్యం కేసులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరికొందరు అక్రమార్కుల గుట్టు రట్టయ్యే అవకాశం లేకపోలేదు. -
సీసీటీవీలను వాడి పోలీసులకు షాకిచ్చారు!
న్యూఢిల్లీ: నేటి హైటెక్ యుగంలో నేరం జరిగితే సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పసిగట్టి నేరస్థుడిని అరెస్టు చేయడం తెలిసిందే. కానీ, ఇందుకు భిన్నంగా ఢిల్లీకి చెందిన ఓ గ్యాంబ్లింగ్ ముఠా ఏకంగా పోలీసుల మీద నిఘా పెట్టేసింది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ గావ్ ఏరియా లో అక్రమంగా గ్యాంబ్లింగ్ నడుపుతున్న ఓ ఇంటిపై పక్క సమాచారంతో ఎన్నిసార్లు సర్-ప్రైజ్ విజిట్ లు చేసినా.. ఎవరూ దొరకలేదు. దీంతో విచారించిన పోలీసులకు ఆ ఇంటి పరిసరప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని అందుకనే ఎవరూ దొరకడం లేదని తెలుసుకున్నారు. ముఠాను పట్టుకునేందుకు పకడ్బందీ వ్యుహం రచించారు. ఇందుకోసం ఆ ఇంటి వద్దకు వెళ్లగా ఇంటి ఓనర్ ఓ మహిళ పోలీసులను అడ్డుకోవడమే కాకుండా తనను వేధిస్తున్నారంటూ ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజ్ లు కూడా ఉన్నాయని బెదిరించడంతో వెనుదిరిగిన పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో మహిళలతో పోలీసులను బెదిరించడమే కాకుండా అక్రమంగా మద్యం, డ్రగ్స్ ను అమ్ముతున్న వారిని ఎట్టకేలకు ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాటిపై నిఘాను పెంచెందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. -
ఎక్సైజ్ సూపరింటెండెట్ రమణపై వేటు
-
గుంటూరులో వైఎస్ఆర్సీపీ అధ్వర్యంలో ధర్నా
-
అన్నా.. మద్యం మానుకోండి..
-
మేం రాగానే సంపూర్ణ మద్యనిషేధం
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటన సాక్షి, విజయవాడబ్యూరో: తమ ప్రభుత్వం రాగానే రాష్ర్టంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని విపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన విజయ వాడలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని వివిధ ఆసు పత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులనూ ఆయన పరామర్శించారు. సంఘటన వివరాలను వారిని అడిగి తెలుసు కున్నారు. అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి స్తుండడం విచారకరమన్నారు. షాపుల్లో ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరలను అనుమతి స్తూ కల్తీని ప్రోత్సహిస్తు న్నారని, అందుకోసం కిందిస్థాయి నుంచి సీఎం వరకు మామూళ్లు అందుతున్నాయని జగన్ విమర్శించారు.... వివరాలు ఆయన మాటల్లోనే... వచ్చేది ప్రజాప్రభుత్వమే.. వెంటనే నిషేధం ‘‘చంద్రబాబుకు బుద్ధి ఉంటే మద్య నిషేధం అమలు చేయాలి. రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వమే వస్తుంది. ప్రజల ప్రభుత్వం వస్తుంది. అపుడు రాష్ర్టంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో పర్మిషన్ ఇస్తే పరవాలేదు. బాగా డబ్బులున్నోడు.. సూట్లు బూట్లు వేసుకుని స్టార్ హోటల్లో తాగి పడిపోయినా ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా చదువుకునే పిల్లల చదువు నాశనమౌతోంది. దారి తప్పుతున్నారు. పదో తరగతి పాసవుతూనే పిల్లలు మద్యం షాపుల వైపు చూస్తున్నారు. పిల్లలు చదువుకునే చోట ఎదురుగా మద్యం షాపులు పెడుతున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాష్ర్టంలో ఎక్కడా మద్యం లేకుండా పూర్తిగా నిషేధం విధిస్తామని చెబుతున్నా. ఆరింటికే షాపులు రెడీ... ఇంత దారుణమైన పరిస్థితి మధ్య మాట్లా డాలంటేనే బాధ అనిపిస్తోంది.. సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడో లేదో కానీ మద్యం షాపుల తాళాలు మాత్రం కరెక్ట్‌గా ఆరింటికి తెరుస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట, తెల్లవారుజామున 3 గంటల వరకూ మద్యంషాపులు తెరిచి అమ్ముతున్నారు.. ప్రజలతో ఎంత ఎక్కువ తాగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండటం మన దౌర్భాగ్యం.. తాగించడం ఎలా అని ప్రభుత్వం లెక్కలు కడుతోంది.. ఈ నెల ఇంతే తాగారా? వచ్చే నెల ఇంకా ఎక్కువ తాగించాలంటే ఎలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.. మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది.. మద్యం షాపుల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తుంటే దానికి ప్రభుత్వానిది బాధ్యత కాదా?.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలను, కల్తీని ప్రోత్సహిస్తున్నారు.. ఇందుకు ప్రతీ షాపు నుంచి అధికారులు, పై అధికారులు, మంత్రులు, సీఎం, ముఖ్యమంత్రి కొడుక్కి మామూళ్లు అందుతున్నాయ్.. సాక్షాత్తూ సీఎం ప్రతి మద్యం షాపు నుంచి డబ్బులు వసూలుచేస్తూ విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్మిస్తున్నారంటే పాలన ఎలా ఉందో తెలుస్తోంది. కల్తీ మద్యం వ్యవహారాలపై అసెంబ్లీలోనూ నిలదీస్తాం. బెల్టుషాపులనూ వేలం వేస్తున్నారు.. బెల్ట్‌షాపులు తొలగిస్తామని ప్రమాణస్వీకారం నాడు సంతకం చేసిన సీఎం ఇప్పుడు అదే బెల్ట్‌షాపుల కోసం వేలంవేసే పరిస్థితిని తీసుకొచ్చారు. సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి సొంత నియోజకవర్గంలోని కరఅగ్రహారంలో బెల్ట్‌షాపునకు వేలం నిర్వహించారు. రాష్ట్రంలో 4,300 మద్యం షాపులు ఉంటే ఒక్కో మద్యం షాపునకు ఏకంగా 15 నుంచి 20 బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. ఆడవాళ్లు బయట తిరిగే పరిస్థితి లేదు. అన్నింట్లోనూ చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి. రూ.87 వేల కోట్ల రైతు రుణమాఫీ, బాబొస్తే జాబొస్తుంది, రూ.2వేల నిరుద్యోగ భృతి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ.. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు మోసం చేశాడు. బెల్ట్‌షాపులు తీస్తానంటాడు.. యూటర్న్ తీసుకుంటాడు. ఇసుక మొదలుకొని అన్ని ఆదాయాలూ చంద్రబాబు, ఆయన కొడుకుకే చేరుతున్నాయి. రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి కేవలం ఐదులక్షలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదం. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చెవులుపట్టుకుని ఈ ప్రభుత్వం గుంజీలు తీయాలి. అపుడే ఆ బాధిత కుటుంబాలు కాస్తో కూస్తో ఈ ప్రభుత్వాన్ని క్షమిస్తాయి. ఐదుగురు చనిపోయి 24 గంటలు గడిచినా ఆ మృతదేహాలకు ఇంకా పోస్టుమార్టం కాలేదు. రికార్డులు తిరగరాసి, మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోవడం, మరెంతోమంది ఆస్పత్రిపాలు కావడానికి పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత.’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తొలుత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచిన ఐదు మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబసభ్యులను జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్యం బాధితులను పరామర్శించారు. సెంటిని, ఆంధ్రా హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న వారిని కలిసి వారికి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్‌ఖాన్, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా ప్రతాప అప్పారావు, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, సామినేని ఉదయభాను, పేర్ని నాని, జోగి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల డిమాండ్లు న్యాయమైనవి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన వైఎస్జగన్ ‘పే స్కేల్ కావాలని, రెగ్యులరైజ్ చేయాలని వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్దమైనవి, వారికి పూర్తిగా మద్దతిస్తున్నా’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో 37 రోజులుగా వీఆర్ఏలు ఆందోళనలు, రిలే దీక్షలు చేస్తున్నారు. వారి దీక్షా శిబిరాన్ని జగన్ మంగళవారం సందర్శించి మద్దతు ప్రకటించారు. ప్రజలతో తాగించి ఆదాయం పెంచుకుంటారా? గుజరాత్లో మద్యం అమ్మకాలు లేక పోయినా ఆ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. బిహార్‌లో నితీష్ కుమార్ కూడా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని ప్రకటించారు. మన రాష్ర్టంలో మాత్రం ప్రజలతో విచ్చల విడి గా తాగించి ఆదాయం పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచన దారుణంగా ఉంది. డిస్టి లరీ లెసైన్సులు తమ వాళ్లకే సెలక్టివ్‌గా ఇస్తున్నారు. మద్యం అమ్మకాల్లో 2014లో రూ.6,632 కోట్లు వస్తే. ఈ ఏడాది అక్టోబర్ వరకు 7 నెలల్లోనే రూ.7,050 కోట్లు దాటిం ది. ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు మద్యం ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రజలతో తాగిస్తోంది. రానున్న 5 నెలలకు రూ.5 వేల కోట్లు కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.12వేల కోట్లు మద్యం తాగించాలని సర్కార్ డిసైడ్ అయ్యింది. -
కల్తీ మద్యం కేసులో FIR
-
'వీఆర్ఏలకు కనీస వేతనాలు వర్తింపచేయాలి'
విజయవాడ: లెనిన్ సెంటర్లో వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. కనీసవేతనాలు వర్తింప చేయాలన్న వీఆర్ఏల డిమాండ్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం దారుణం అని వైఎస్ జగన్ అన్నారు. అంతకు ముందు కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విజయవాడలోని కృష్ణలంకలోగల స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించి మొత్తం 34 మంది తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మరణించగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. -
కల్తీ మద్యం బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
'అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం'
-
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ.