
మంగుళూరు: అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని కొడమాన్ కోడిలోని ఓ ఇంట్లో మద్యం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ సిబ్బంది దాడి చేశారు. మద్యం తయారీకి ఉపయోగిస్తున్న 1200 లీటర్ల బెల్లం ద్రావణం, 950 కేజీల బెల్లం, 500 లీటర్ల నకిలీ మద్యం, 300 లీటర్ల బంగాళాదుంప-బెల్లం మిక్సర్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ శైలజా కోటే ఆదేశాలతో ఎక్సైజ్ ఎస్పీ వినోద్‌కుమార్ దాడులకు నేతృత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment