
నేడు బెజవాడకు వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ వెళ్లనున్నారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ వెళ్లనున్నారు. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా వైఎస్ జగన్ కలవనున్నారు.
విజయవాడలోని కృష్ణలంకలోగల స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి మొత్తం 34 మంది తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మరణించగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.