లెనిన్ సెంటర్‌లో వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సందర్శించారు.
విజయవాడ: లెనిన్ సెంటర్‌లో వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. కనీసవేతనాలు వర్తింప చేయాలన్న వీఆర్ఏల డిమాండ్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం దారుణం అని వైఎస్ జగన్ అన్నారు.
అంతకు ముందు కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విజయవాడలోని కృష్ణలంకలోగల స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి మొత్తం 34 మంది తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మరణించగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.