సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి దాదాపు 50 మంది మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తెలంగాణకు చౌకైన మద్యం బ్రాండ్‌లను తెస్తున్నారు. రాష్ట్రంలో తమిళనాడు కల్తీ సారా ఘటనలు రాకూడదు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
Let’s make sure this doesn’t happen in Telangana
Hope the Congress Govt is taking note and will not introduce cheap brands and risk the lives of people https://t.co/Qbx4edURQB— KTR (@KTRBRS) June 21, 2024
Comments
Please login to add a commentAdd a comment