విజయవాడ : కృష్ణలంక కల్తీ మద్యం కేసులో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. మంగళవారం విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్ను జెవి రాముడు పరిశీలించారు.
అంతకుముందు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రాముడు చెప్పారు. కృష్ణలంక కల్తీ మద్యం కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.