swarna Bar
-
'ఉద్దేశపూర్వకంగానే విష్ణుపై కక్ష సాధింపు'
విజయవాడ: కల్తీ మద్యం వ్యవహారంలో మల్లాది విష్ణుకు ఎలాంటి సంబంధం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బయట వ్యక్తులు నీళ్లలో సైనేడ్ కలిపారని, ఉద్దేశపూర్వకంగానే విష్ణుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్‌లకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని రఘువీరా ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వస్తే చిల్లర దొరకదని ప్రత్యేక ప్యాకేజీ అడుగుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ, బీజేపీ కుట్రపన్ని హోదా బిల్లుపై ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నాయని రఘువీరా అన్నారు. కాగా విజయవాడ స్వర్ణబార్ మరణాల వెనుక సైనేడ్ ఉందని రుజువయింది. విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణుకు చెందిన ఈ బార్లో మద్యం తాగి గత ఏడాది డిసెంబర్లో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 30 మద్యం శాంపిళ్లకుగాను 20 శాంపిళ్లలో సైనేడ్ కలిసిందని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. మద్యంలో కల్తీలేదని, నీటిలో ఎవరో సైనేడ్ కలిపారని తెలిపింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా మరేదన్నా ఉందా అనేది తేలాల్సి ఉంది. -
కొలిక్కిరాని 'స్వర్ణ' కల్తీ మద్యం కేసు !
కొనసాగుతున్న సిట్ దర్యాప్తు తవ్వేకొద్ద్దీ బయటికొస్తున్న లోపాలు నిర్ధారణకు రాని బృందం విజయవాడ : కల్తీ మద్యం కేసు కొలిక్కి రాలేదు. ఈ కేసుపై నియమించిన పోలీస్ ఉన్నతాధికారుల బృందం (సిట్) రిపోర్టు ఇవ్వలేకపోతున్నారు. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నారు. అందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయినా కేసు దర్యాప్తు ముగించలేకపోయారు. మద్యంలోనే కల్తీ ఉంది? మద్యంలో కల్తీని నిరూపించడం ఎలా? ఇప్పుడు పోలీసులను వేదిస్తున్న ప్రశ్న ఇది. బార్ కాబట్టి కల్తీ చేసి అమ్మారా? మద్యం బాటిళ్లలోనే కల్తీ వచ్చిందా అనేది కూడా తేలాల్సి ఉంది. పోలీసులకు ప్రాథమికంగా వచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తే బార్లోనే కిక్ వచ్చేందుకు ఒక లిక్విడ్‌ను లిక్కర్లో కలిపారు. దీంతో తాగిన వారంతా తూలుతూ బార్లో కొందరు, రోడ్డుపై మరికొందరు, ఇంటికి వచ్చిన తరువాత ఇంకొందరు పడిపోయారు. నోటి నుంచి నురగలు, వాంతులు వచ్చాయి. దీనిని బట్టి తప్పకుండా బార్లోనే కిక్ ఇచ్చే మందు కలిపారనేది పోలీసుల వద్ద ప్రాథమిక సమాచారం ఉంది. బార్లో సాధారణ నీళ్లలో మందు కలుపుకుని తాగిన వారు పడిపోయారు. అలాగే ఫ్యూరిఫై చేసిన వాటర్ పాకెట్లు అక్కడే తీసుకొని తాగిన వారు కూడా పడిపోయారు. అంటే నీళ్లలో కల్తీ జరగలేదని స్పష్టమైంది. తప్పకుండా లిక్కర్‌లోనే కల్తీ ఉంటుందని భావిస్తున్నారు. అది ఎలా జరిగిందనేదే ప్రస్తుతం పోలీసులను, సిట్ ఉన్నతాధికారులను వేదిస్తున్న ప్రశ్న. సిట్ బందానికి కేసు అప్పగించి రెండు నెలలు పూర్తయింది. ఈ బృందంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీ మహేష్‌చంద్ర లడ్హా బృందానికి సారథ్యం వహిస్తున్నారు. ఆయనకు కూడా ఈ కేసు అంతుబట్టడం లేదు. కిక్ కోసమే కల్తీ.. ఇక్కడ మద్యం తాగిన వారికి బాగా కిక్ రావాలి. తాగితే అక్కడే మందు తాగాలి అనే ప్రచారం రావాలని కొందరు బార్‌లోని వారు కల్తీ కలిపి ఉంటారని, అది ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి దాపురించిందని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎందుకంటే బార్లో ఉద్యోగులు చూస్తుండగానే కొందరు పడిపోయారు. రోజు మాదిరిగానే పడిపోయి లేచి వెళతారనుకున్నారు కాని ఇలా జరుగుతుందనేది బార్ ఉద్యోగులు ఊహించలేదు. ఈ విషయం వారు పోలీసుల వద్ద అంగీకరించారు. సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు పంపించిన పది రోజుల్లో వచ్చింది. సెంట్రల్ ఫోరెన్సిక్ లేబొరేటరీ నుంచి రావాల్సిన రిపోర్టు మాత్రం ఇంకా రాలేదు. దీని వెనుక కూడా మతలబు ఉండి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిపోర్టులో మద్యంలో కల్తీ లేదని వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వస్తే కాని కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
'స్వర్ణ బార్ మల్లాది విష్ణుదే'
హైదరాబాద్ : విజయవాడ నగరంలో స్వర్ణ బార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చెందినదని ఉన్నతాధికారుల విచారణలో తెలిందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కల్తీ మద్యం ఘటనపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి రవీంద్ర ఓ ప్రకటన చేశారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం అందజేసినట్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలోని స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మంది మృతి చెందగా... మరో 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బార్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణుదని టీడీపీ నాయకులు ఆరోపించారు. మల్లాది విష్ణు బంధువులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాముడు ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై విచారణాధికారిగా విజయవాడ సబ్ కలెక్టర్ జి సృజనను ప్రభుత్వం నియమించింది. -
'బార్లోనే కల్తీ జరిగింది'
-
'బార్లోనే కల్తీ జరిగింది'
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనలో విచారణ నివేదిక సిద్ధమైంది. స్వర్ణ బార్లోనే మద్యం కల్తీ జరిగినట్లు అధికారులు ఓ నిర్థారణకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ నివేదికను ఎక్సైజ్ కమిషనర్ మీనా స్వయంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించనున్నారు. బార్లోనే మోతాదుకు మించి మిథైనల్ కలిపినట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పుతున్నారు. దీనిని ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇద్దరి అధికారుల సస్పెన్షన్‌తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ మద్యం సేవించి అయిదుగురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. -
కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన డీజీపీ
విజయవాడ : కృష్ణలంక కల్తీ మద్యం కేసులో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. మంగళవారం విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్ను జెవి రాముడు పరిశీలించారు. అంతకుముందు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఆయన పరామర్శించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రాముడు చెప్పారు. కృష్ణలంక కల్తీ మద్యం కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.