'స్వర్ణ బార్ మల్లాది విష్ణుదే' | Malladi Vishnu Owns Swarna Bar, says kollu ravindra | Sakshi
Sakshi News home page

'స్వర్ణ బార్ మల్లాది విష్ణుదే'

Published Wed, Dec 23 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

'స్వర్ణ బార్ మల్లాది విష్ణుదే'

'స్వర్ణ బార్ మల్లాది విష్ణుదే'

హైదరాబాద్ : విజయవాడ నగరంలో స్వర్ణ బార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చెందినదని ఉన్నతాధికారుల విచారణలో తెలిందని  ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కల్తీ మద్యం ఘటనపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి రవీంద్ర ఓ ప్రకటన చేశారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం అందజేసినట్లు రవీంద్ర తెలిపారు.    

విజయవాడలోని స్వర్ణబార్లో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మంది మృతి చెందగా... మరో 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బార్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణుదని టీడీపీ నాయకులు ఆరోపించారు. మల్లాది విష్ణు బంధువులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాముడు ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై విచారణాధికారిగా విజయవాడ సబ్ కలెక్టర్ జి సృజనను ప్రభుత్వం నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement