kollu ravindra
-
ఓ వీడియో విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
-
దళారీల ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: దళారులు నిమిషాల్లో ఆన్లైన్లో భారీగా ఇసుక బుకింగ్ చేస్తున్నారని, ధరలు పెంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న ఇసుక మాఫియానే ఇప్పుడూ దోచేస్తోందని ఆరోపించారు. దళారుల వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని చెప్పాలంటూ సీఎం చంద్రబాబు అంతకుముందు మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ఆయన ప్రత్యేకంగా రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఇసుక ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పలువురు మంత్రులు వాపోయినట్లు తెలిసింది. అయితే దళారులు, రవాణా చేసేవారి వల్ల ధరలు పెరిగాయని ప్రజలకు చెప్పాలని సీఎం వారికి సూచించారు. తక్కువ రేటుకు ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్లో ఎక్కువకు అమ్ముతున్నట్లు ప్రచారం చేయాలని నిర్దేశించినట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగవిుంచేందుకు ఇసుకపై సీనరేజీ చార్జీ ఎత్తేశామని, ఓవర్‌లోడ్ వాహనాలను ఆపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించినట్లు సమాచారం. ఇసుకను పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు సీనరేజ్, జీఎస్టీని రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక సంస్ధలకు చెందాల్సిన రూ.264 కోట్ల సీనరేజ్‌ను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధి, వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు.రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేపట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం అనుమతించిందని, ఎన్జీటీ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. 108 రీచ్‌లు, 25 స్టాక్ పాయింట్లు, 17 మాన్యువల్ రీచ్‌లను జిల్లా ఇసుక కమిటీలకు అప్పగించామన్నారు. సొంత అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో రీచ్‌లకు వెళ్లి నేరుగా ఇసుక తీసుకెళ్లవచ్చని, అయితే వారంతా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలిపారు. ఆన్లైన్లో చేసుకోలేకపోతే రీచ్ దగ్గరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తీసేందుకు బోట్ల అసోసియేషన్లను అనుమతించామన్నారు.ఐదు జిల్లాల్లో 20 శాతం మార్జిన్‌తో విక్రయంవిశాఖ, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఇసుక రీచ్‌లు లేనందున చిన్న అవసరాలకు ఇసుక కావాల్సిన వారికి సరఫరా చేసేందుకు మినరల్ డీలర్లను నియమించి 20 శాతం మార్జిన్‌తో విక్రయించేంలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఐదు జిల్లాల్లో బల్‌్కగా కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చన్నారు. అక్రమ రవాణా, అక్రమ విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి సీసీ కెమేరాలతో నిఘా పెడతామన్నారు. రాష్ట్రంలో అవసరాలకే ఇసుక వినియోగించాలని, బయట రాష్ట్రాలకు ఒక్క ట్రక్కు కూడా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సొంత అవసరాల కోసం రీచ్‌కు వెళ్లి నేరుగా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చునని, అయితే తిరిగి అధిక ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకందీపావళి సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుంచి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అర్హత గల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తామన్నారు. అక్టోబర్ 31వ తేదీన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. గ్యాస్ సరఫరా ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు డిపాజిట్ చేస్తుందని, సంబంధిత ఏజెన్సీ 48 గంటల్లోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఏప్రిల్ – జూలై వరకు ఒక ఉచిత సిలిండర్, ఆగస్టు – నవంబర్ మధ్యలో ఒక ఉచిత సిలిండర్, డిసెంబర్ – మార్చి మద్యలో ఒక ఉచిత సిలిండర్‌ను పంపిణీ చేస్తామన్నారు. రెండు నెలల్లో అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని అమలు చేయడం మహిళల సాధికారత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనిత చెప్పారు.జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం రద్దురూ.100 కోట్లు దాటిన పనుల టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో పారదర్శకత లేదని, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని మంత్రి పార్ధసారధి తెలిపారు. సీవీసీ నిర్దేశించిన విధి విధానాల మేరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.⇒ వార్షిక ఆదాయం రూ.20 కోట్లు ఉన్న దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్య 15 నుంచి 17కు పెంపు చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం. పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరు చొప్పున అవకాశం. ⇒ విశాఖలో శ్రీ శారదా పీఠానికి వేదపాఠశాల, సంస్కృతి పాఠశాల నిర్వహణకు 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన నాలుగు జీవోల రద్దుకు మంత్రి మండలి ఆమోదం.⇒ 2021 ఆగస్టు 15 నుంచి గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ జీవోఐఆర్ వెబ్సైట్లో పొందుపరచాలని నిర్ణయం. ⇒ చెవిటి, మూగ, కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష నిర్మూలించేందుకు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం –1968, ఆయుర్వేదం, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం–1956, డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్టం–1986లో పలు అంశాల సవరణలకు మంత్రిమండలి ఆమోదం. ⇒ విశాఖ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ సీట్లను 25 నుంచి 100కి పెంచుతూ జారీ చేసిన 134 జీవోకు మంత్రిమండలి ఆమోదం. కళాశాలలో 25 టీచింగ్, 56 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. ⇒ మంగళగిరిలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకలుగా మార్చేందుకు ఆమోదం. 73 అదనపు పోస్టుల మంజూరు. ⇒ వరి సేకరణ కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే తీసుకున్న రూ.80 కోట్ల బ్యాంకు ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీని కొనసాగించేందుకు మంత్రి మండలి ఆమోదం.ఆ దళారులు మీవాళ్లే కదా?⇒ కూటమి సర్కారు రాగానే పచ్చ ముఠాల ఇసుక దందా⇒ గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుక మాయం⇒ నిర్మాణ రంగం కుదేలై 40 లక్షల మంది కార్మికుల అవస్థలు⇒ ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకోలేకే బ్లాక్ మార్కెట్ ఆరోపణల పాటఅధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
మద్యం అమ్మకాల్లో తగ్గేదే లే!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఉండేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ఇక నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెడతామని తెలిపింది. కొత్త మద్యం విధానాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్‌లు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. తమ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి ఆయనతో చర్చించారు. కొత్త మద్యం విధానంలో చేర్చాల్సిన పలు అంశాలను సీఎం వారికి సూచించారు. కొత్త మద్యం విధానంపై రూపొందించిన నివేదికను బుధవారం నిర్వహించనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం ఈ నెల 30తో ముగుస్తుందన్నారు. దాంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగుల కాల పరిమితి కూడా ముగుస్తుందని పరోక్షంగా వెల్లడించారు. నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలు ప్రైవేటు మద్యం దుకాణాలను జిల్లా కమిటీలు లాటరీ విధానంలో కేటాయిస్తాయని మంత్రి రవీంద్ర చెప్పారు. మద్యం దుకాణాల టెండర్లలో సిండికేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కమిటీలదేనని స్పష్టం చేశారు. గీత కారి్మకులకు 10 శాతం మద్యం దుకాణలను కేటాయిస్తామన్నారు. జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం ధరలను ఓ కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరలో ఒక బ్రాండును ప్రవేశపెడతామని వెల్లడించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మద్యం విధానాన్ని రూపొందించామన్నారు. మద్యం విక్రయాల ద్వారా వ చ్చిన ఆదాయం నుంచే మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేలా కొత్త మద్యం విధానం ఉంటుందన్నారు. నాణ్యమైన మద్యాన్ని అందిస్తూనే ఆదాయ సముపార్జనలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించిన అనంతరమే కొత్త మద్యం విధానాన్ని రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ఏపీలో లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు
-
మంత్రి వర్గంలో ఇద్దరికి చోటు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాజకీయంగా ప్రాధాన్యమున్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు మంత్రివర్గంలో రెండు పదవులు మాత్రమే దక్కాయి. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద బుధవారం జరిగిన ప్రమాణస్వీకా రంలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రి వర్గంలో చోటు దక్కింది. నూతనంగా ఏర్పడిన ఎనీ్టఆర్ జిల్లా నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. టీడీపీలోని సీనియర్లు, సామాజికవర్గాల పరంగా తమకు మంత్రిపదవి ఖాయమనుకున్న వారికి నిరాశ తప్పలేదు. ఎన్నికల ముందు పార్టీ మారిన కేపీ సారథికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. బీజేపీ నుంచి గెలుపొందిన సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రులే. ఒకరు కేంద్రంలో, మరొకరు రాష్ట్రంలో అమాత్యులుగా విధులు నిర్వర్తించిన వారే. ఉమ్మడి కృష్ణాకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదనే అభిప్రాయాలు ఆయా పారీ్టల నుంచి వ్యక్తమవుతున్నాయి. కొల్లు రవీంద్ర ప్రస్థానం ఇదీ.. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లు రవీంద్ర స్వగ్రామం బందరు మండలంలోని గరాలదిబ్బ. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన నడకుదుటి నరసింహారావు అల్లుడైన రవీంద్ర ఆయన వారసుడిగా 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2007లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కనీ్వనర్‌గా, బీసీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన రవీంద్ర 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కొలుసు పార్థసారథి ప్రస్థానం ఇలా.. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి చేరిన నూజివీడు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి కొలుసు పెద్ద రెడ్డయ్య మచిలీపట్నం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన పార్థసారథి 2004లో అప్పటి ఉయ్యూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2009, 2019లో పెనమలూరు నుంచి ఎన్నికయ్యారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరి, పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్లకు నిరాశ ఎనీ్టఆర్ జిల్లాలో పలువురు ఆశావహులకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నిౖకైన గద్దె రామ్మోహనరావు పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా తనకు అవకాశం దక్కుతుందని ఆశించారు. విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన బొండా ఉమామహేశ్వరరావు కూడా తనకు చోటు దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీరాం తాతయ్యకు ఈ సారీ నిరాశే మిగిలింది. ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కకుండా టీడీపీ సామాజికవర్గం వారే అడ్డుకొన్నారనే భావన నియోజకవర్గంలో వ్యక్తమైంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీని వీడీ టీడీపీలో చేరి మైలవరం ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్‌కు లోకేష్ ఆశీస్సులతో మంత్రివర్గం చోటు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి, జనసేన తరఫున అవనిగడ్డ నుంచి గెలుపొందిన మండలి బుద్ధప్రసాద్‌కు మంత్రి వర్గంలో చోటు ఖాయ మనే అనే ప్రచారం జరిగింది. ఎస్సీ మహిళ కోటాలో మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆశించారు. గన్నవరం, గుడివాడ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు, వెనిగండ్ల రాముకు కూడా అవకాశం లభించొచ్చని పార్టీ నాయకులు భావించారు. -
పోలింగ్ సరళి పరిశీలించాక ఓటమి ఖరారు చేసుకున్న కొల్లు రవీంద్ర
-
కొల్లు రవీంద్రలో కలవరం
పచ్చ పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రిగా ఉన్న ఆ నేత నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సముద్ర తీరాన ఉన్న ఆ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. కాని ఈసారి మేమే గెలుస్తాం అంటూ టీడీపీ అభ్యర్థి పోలింగ్ రోజు డప్పు వేసుకున్నారు. అయితే సునామీలా పోటెత్తిన ఓటర్లు వచ్చింది ఎవరికోసం అన్నవిషయం పోలింగ్ ముగిసాక కాని ఆయనకు అర్థం కాలేదట. దీంతో ఆశల మేడలన్నీ కుప్పకూలి నిరాశలో కూరుకుపోయారట ఆ పసుపు పార్టీ అభ్యర్థి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందో..? ఆ నేత ఎవరో చూద్దాం.ఎన్నికల్లో గెలిచే నాయకులు పోలింగ్‌కు ముందు..తర్వాత ఒకేలా ఉంటారు. మరింత జోష్‌గా ఉంటారు. కాని ఓడిపోయే అభ్యర్థులు పోలింగ్‌కు ముందు ఎంత హడావుడి చేసినా..పోలింగ్ పూర్తయ్యాక పరిస్థితులు అర్థం కావడంతో నిరాశకు లోను కావడం మామూలే. ఇప్పుడు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పరిస్థితి అలాగే తయారైందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు మాటలు నమ్మిన కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మచిలీపట్నంలో ఈసారి కచ్చితంగా పసుపు జెండా ఎగరేయడం ఖాయమనుకున్నారట. అయితే పోలింగ్ రోజున ఓట్ల సునామీని చూశాక టీడీపీ వారికి కళ్ళు బైర్లు కమ్మాయట. ప్రారంభంలో ఆ ఓట్లన్నీ ప్రబుత్వానికి వ్యతిరేకమే అని సంబరపడ్డాక...సమయం గడిచే కొద్దీ వాస్తవం బోధపడింది. వైఎస్ జగన్‌ను గెలిపించేందుకే ప్రజలు తరలివచ్చారనే విషయం వారికి ఆలస్యంగా అర్థమైంది.మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 1,96,680 ఓటర్లు ఉండగా.. వీరిలో 1,61,109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే 4,898 మంది మహిళలు అధికంగా ఉండటంతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను ఆందోళనకు గురిచేస్తోందట. వాస్తవానికి గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి కేవలం ఈ ఐదేళ్లలో మచిలీపట్నం ప్రజలు చూశారు. దశాబ్ధాల కల బందరు పోర్టు నిర్మాణం పనులు ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయితే బందరు పరిసరాలు పరిశ్రమలతో కళకళలాడతాయి. అలాగే ఉమ్మడి జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇప్పటివరకు బందరులో మెడికల్ కాలేజ్ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తొలివిడతలోనే బందరు మెడికల్ కాలేజీని నిర్మించి ప్రారంభోత్సవం కూడా చేశారు. కాలేజ్‌తో పాటు అద్భుతమైన ఆస్పత్రి కూడా కృష్ణా జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చింది.ఇవే కాకుండా ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు..భారీ ఎత్తున సంక్షేమ ఫలాలు కూడా అందుకున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల కారణంగానే మచిలీపట్నం ప్రజలు ఓటేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. రాత్రి వరకూ వేచిఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీగా ఓటర్లు రావడంతో టీడీపీ నేతలు ఆ ఓట్లన్నీ తమకే పడ్డాయని ఆశపడ్డారట. కానీ పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రలో కలవరం మొదలైందట. ఓటింగ్ లో భారీగా పాల్గొన్న వారిలో అధికంగా మహిళలే ఉండటంతో ఆందోళన మరీ ఎక్కువైందట.చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ... టీడీపీ సూపర్ సిక్స్ హామీలు తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేస్తాయని కలలు కన్న కొల్లు రవీంద్రకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదట. 2019లో 80.78 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో 1.13 శాతం అధికంగా నమోదైంది. పోలింగ్ జరిగిన తీరు గమనించాక కొల్లు రవీంద్ర బందరు సీటుపై ఆశలు వదిలేసుకున్నారన్న చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
-
రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం చేస్తావా?
సాక్షి, మచిలీపట్నం: ‘ప్రభుత్వ ఆదేశాలతో పని చేసే రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం చేస్తావా?, ఒక బీసీ మహిళా అధికారిని తోలు తీస్తా అనడం కొల్లు అహంకారానికి నిదర్శనం’ అని టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో అధికారులు రాత్రి వేళల్లో పనిచేయలేదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయమని, మళ్లీ అధికారంలోకి వచ్చాక పేదలకు మంచి చేసేదీ తామే అని అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని తనపై కొల్లు చేసిన ఆరోపణలకు పేర్ని నాని ఘాటుగా జవాబు ఇచ్చారు. కొల్లు హయాంలో పేదలతో పాటు విలేకరులకు ఇచ్చిన దొంగ పట్టాలు, ఆర్ఎస్సార్ రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను మీడియా ముందు ఆధారాలతో చూపారు. రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పారు. కొల్లు మంత్రిగా ఉండి మామతో కలిసి ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టాడని విమర్శించారు. తమ కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తామన్నారు. తాను ప్రజలకు ఏ రోజూ దొంగ పట్టాలు ఇవ్వలేదన్నారు. పదవి పోయే పది రోజుల ముందు విలేకర్లకు ఎలాంటి వార్డు నంబర్లు లేకుండా కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చారని, ఆ రోజు అందుకు ప్రభుత్వ అనుమతి, జీవో ఉందా అని ప్రశ్నించారు. విలేకరులకే దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేసిన కొల్లు శ్రీరంగ నీతులు చెప్పడం ఏమిటన్నారు. 1977–78 తుపాన్లో నష్టపోయిన గిరిపురం మత్స్యకారులకు ఒక్కరికైనా టీడీపీ నేతలు ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదని, వారికి అండగా నిలిచి, రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించింది తానే అని చెప్పారు. విజయవాడలో నివసిస్తూ ఎన్నికల వేళ ఓట్లు కోసం బందరుకు వచ్చే కొల్లుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తన కుమారుడు పేర్ని కిట్టు బోగస్ శంకుస్థాపనలు చేస్తున్నారని అరోపించారని, అవి 70 శాతం పూర్తయిన పనులని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కిట్టు ఎమ్మెల్యే అవటం ఖాయమని.. ప్రజలకు అతడే పట్టాలిస్తాడని అన్నారు. ఈ సమావేశంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు భారతి, విజయలక్ష్మీ, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఈ పేర్ని నాని ప్రాణం పోయినా దొంగ పనులు చేయడు
-
రెచ్చిపోయిన టీడీపీ నేత కొల్లు రవీంద్ర..
-
అధికారులపై టీడీపీ నేత కొల్లు దౌర్జన్యం
సాక్షి, మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొట్లు రవీంద్ర గురువారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సమయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పేదల ఇళ్ల పట్టాల తయారీలో నిమగ్నమై ఉండగా రాత్రి 9:30 గంటల సమయంలో కొల్లు రవీంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొరబడ్డారు. రాత్రి వేళ రెవెన్యూ కార్యాలయంలో ఏదో చేస్తున్నారంటూ తహశీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఏం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. వారు చేస్తున్న పనిని ఫొటోలు, వీడియోలు తీయాలంటూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. నకిలీ పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు తయారు చేస్తున్నారంటూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వారి చేతుల్లోని ఫైళ్లు లాక్కొని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు. కలెక్టర్ దృష్టికి కొల్లు దౌర్జన్యం తహసీల్దార్ కార్యాలయంలోకి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుల చొరబాటు, అధికారుల విధులకు ఆటంకం కల్పించడంపై తహసీల్దార్ పి. సతీష్ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు ఫిర్యాదు చేశౠరు. దీనిపై ఆయన స్పందించి జాయింట్ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. దీనిపై జాయిట్ కలెక్టర్ విచారించి.. విధుల నిర్వహణ సక్రమంగానే ఉందని, సమయం తక్కువ ఉండటంవల్లే అధికారులు రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంపై గురువారం రాత్రి తహశీల్దార్ పి. సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయ సిబ్బంది కొత్తగా వచ్చిన కన్వెయన్స్ డీడ్లు సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తుండగా కొల్లు రవీంద్ర 30 మందితో కార్యాలయంలోకి వచ్చారని, ఫోటోలు, వీడియోలు తీసి తన వివరణ కోరారని తెలిపారు. మచిలీపట్టణం మండలంలోని అర్బన్, రూరల్‌లో 18,119 నివాస స్థలాల ఎన్పీఐ కన్వెయన్స్ డీడ్లు ప్రింట్ చేశామని, ఇంకా 2,829 డీడ్లను పరిశీలన చేస్తున్నట్లు వివరించామని పేర్కొన్నారు. -
టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుందని.. ఇంగితజ్ఞానం లేకుండా అబద్ధాలు చెబుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తానని మోసం చేశారని, ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఒక్కరికీ మేలు చేయలేదంటూ దుయ్యబట్టారు. ‘‘కొల్లు రవీంద్రలా నాటకాలాడటం మాకు రాదు. నవయుగ సంస్థను అడ్డుపెట్టుకుని కోర్టులో అడ్డంకులు సృష్టించింది మీరు కాదా?. 2004లో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను. మోసం చేసే కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. కళ్లుతెరిచి అభివృద్ధిని చూడు ఒకసారి. నీలాంటి స్థాయిలేనివాడితో.. గతిలేనివాడితో నేను చర్చకు రావడమేంటి?. ఏనాడైనా పేదవాడికి మేలు చేశావా?. మీలా దొంగ శంకుస్థాపనలు చేయడం మా వల్ల కాదు. మీ కుటుంబం కోసం నేను మాట్లాడను.. నాకు సభ్యత ఉంది’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. నీకు చేతనైతే పేర్ని కృష్ణమూర్తిలా ఒక్కరోజు బతికి చూపించు. మత్స్యకార గ్రామాలను దగా చేసిన మోసగాడు కొల్లు రవీంద్ర. ఈ డ్రామా కోర్ ఒట్టి మోసగాడు. దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నాడు. మా కుటుంబం గురించి వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. మీ తప్పుడు ఆలోచనలు మచిలీపట్నంలో సాగవు. రైతులకు భూ హక్కు కల్పించడానికి యజ్ఞం చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి సీఎం జగన్ అండగా ఉంటారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవు’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్ -
మద్యంకుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. చీకటి జీవోలతో అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టి ఏటా రూ.1,300 కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన తీరుపై కీలక ఆధారాలు సేకరించింది. దాంతో ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120 (బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13 (1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నోట్ ఫైళ్లు, చీకటి జీవోల గుట్టురట్టు: రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన తీరుపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతోపాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనార్హం. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ చేసింది. అంటే కేబినెట్‌కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించడం గమనార్హం. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదానిని సృష్టించారు. అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. మరోపక్క డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడమే కాకుండా, అప్పటివరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండిపడిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఈ మొత్తం బాగోతంపై గురించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇక నిందితుల విచారణే మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందులో పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు ఉపక్రమిస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంది. ప్రధానంగా నోట్‌ఫైళ్లు, ఇతర ఆధారాలను సేకరించింది. ఒకే రోజులో పరస్పర విరుద్ధంగా నోట్‌ఫైళ్లు రూపొందించడం, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన తరువాత కూడా బార్ల యజమానుల పేరిట వినతిపత్రాన్ని రికార్డుల్లో చేర్చిన పన్నాగాన్ని ఛేదించనుంది. అందుకోసం త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. నిందితుల విచారణకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. వారికీ నోటీసులు జారీ చేయనుంది. మద్యం కంపెనీల ప్రతినిధులతోపాటు కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధపడుతోంది. ఆ విచారణ ద్వారా గుర్తించిన అంశాలను సమీక్షించిన తరువాత కేసు దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
టీడీపీ కొల్లు రవీంద్రకి పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
-
అది కొల్లు రవీంద్ర దిగజారుడుతనం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: రాజకీయాల్లో టీడీపీ నేత కొల్లురవీంద్ర వంటి దిగజారుడు మనిషిని ఇంకొకరిని చూడలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బురదజల్లి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని కొల్లు రవీంద్ర చూస్తున్నారని, ఇది ఆయన దిగజారుడు తననానికి నిదర్శనమని నాని మండిపడ్డారు. ‘‘గుమ్మటాల చెరువులో డబ్బులు తీసుకుని ఇళ్లు అమ్మిందెవరు?. పేదల దగ్గర వేల రూపాయలు వసూలు చేసిందెవరు?. సంపత్ అనే మున్సిపల్ కమీషనర్‌ను బూతులు తిట్టి అవమానించి పంపిందెవరు? మీరు కాదా? అని కొల్లు రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. చేయడు కూడా. రాజుపేట కరెంట్ సబ్ స్టేషన్ వెనుక పేదల పాకలు తొలగిస్తుంటే పోరాడిన వ్యక్తిని నేనే. పేదవాళ్లకు అండగా ఉండే వ్యక్తి పేర్నినాని అయితే.. తప్పుడు పనులు చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కుమ్మరిగూడెం ప్రజలకు తాను అండగా నిలబడతా అని పేర్ని నాని ప్రకటించారు. చాలా మంది టీడీపీ నేతలు, ప్రత్యర్ధులతో తాను రాజకీయాల్లో పోటీ పడి నెగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. -
కొల్లు రవీంద్రకు పేర్నినాని స్ట్రాంగ్ వార్నింగ్
-
కొల్లు రవీంద్రకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయాలని సూచించారు. బందరు అభివృద్ధి రవీంద్ర చేసిందేమిటో తాను చేసిందేమిటో శ్వేతపత్రం విడుదల చేద్దామా అని సవాల్ విసిరారు. కాగా, పేర్నినాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్రకు దేవుడు సిగ్గు లేకుండా మాట్లాడమనే ఒక శాపం ఇచ్చాడు. సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో అబద్ధాలు మాట్లాడి కడుపు మంట తీర్చుకుంటున్నాడు. మదర్సా స్థలం మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు. మీ హయాంలో పోర్ట్ కట్టకుండానే 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్. పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు. పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్. మెడికల్ కాలేజ్ నీ హయంలో అంటున్నావ్. ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్. నువ్వు కనీసం ఒక్క జీవో అయినా ఇచ్చావా?. ఇస్తే చూపించు. ఈరోజు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పేర్ని నాని చలవే. ఎవరో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్‌ని చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు. ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం. కానీ, నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాం. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయండి. నేను నా కొడుకుని క్రొత్తగా ప్రమోట్ చేసుకోవడం ఏంటి?. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. -
సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణం ద్వారా అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన మాజీ సీఎం చంద్రబాబు నిర్వాకాలు సంతకాలు సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లూ ఆయనకు ఏమీ తెలియదంటూ బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాదనలో ఏమాత్రం నిజం లేదని నోట్‌ఫైళ్ల సాక్షిగా తేటతెల్లమైంది. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని, గుట్టు చప్పుడు కాకుండా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని నిరూపించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నాడు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్‌కు తెలియకుండా అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8 శాతం ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీ, బార్లపై ఉన్న 9 శాతం ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీని తొలగిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ఖజానాకు రూ.1,299.64 కోట్ల మేర గండి కొట్టారు. ఈమేరకు సంబంధిత నోట్ ఫైళ్లపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేసినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఖజానాకు తూట్లు పొడిచి సన్నిహితులు, బినామీలకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సాగించిన మద్యం కుంభకోణం ఇలా సాగింది!! ఆర్థిక శాఖ అనుమతి లేదు... కేబినెట్ ఆమోదం లేదు అధికారంలో ఉండగా మద్యం విధానం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడింది. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించింది. కనీసం ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే కథ నడిపించింది. రెండు జీవోలకు కేబినెట్ తీర్మానం చేసి ప్రివిలేజ్ ఫీజు తొలగించే కీలకమైన జీవోను మాత్రం అడ్డదారిలో తేవడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని అందులో ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ దృష్టికే తీసుకెళ్లలేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేయగా ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు (ఏ 4 షాపులు) ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ఓ నోట్ పంపారు. మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని అందులో సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈమేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసని తేలిపోతోంది. సాయంత్రం గుట్టుగా జీవో చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ అదే రోజు అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. ఈ జీవో గురించి కేబినెట్లో చర్చించలేదు. అజెండాలో ఆ అంశమే చేర్చలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియచేయలేదు. అనుమతి తీసుకోలేదు. అంటే కేబినెట్‌కు తెలియకుండా, కనీసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కథ నడిపించాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. బార్లలోనూ అదే బరితెగింపు... మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు అంతటితో ఆగలేదు. తన సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అదే రీతిలో లబ్ధి చేకూర్చారు. ఈమేరకు చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని, అందుకోసం ఎకైŠస్జ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న ఓ సర్కుల్యర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కనికట్టు చేశారు. 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు ఈమేరకు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపడం గమనార్హం. సెప్టెంబరు 9న వినతి పత్రం సమర్పిస్తే దానికి వారం రోజులు ముందుగానే సెప్టెంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యూలర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయించారు. బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. నాటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపారు. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ అసలు ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయం చంద్రబాబుకు కనీసం తెలియదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు రామోజీరావు బుకాయించారు. తీవ్రంగా తప్పుబట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ టీడీపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడాన్ని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఈమేరకు తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. -
ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో టీడీపీ నేతలు లబ్ధి పొందారు
సాక్షి, అమరావతి: మద్యం ప్రివిలేజ్ ఫీజు రద్దు వల్ల టీడీపీ నేతలు పైనుంచి కింది వరకు లబ్ధి పొందారని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వారి పార్టీ నేతలకు, కావాల్సిన వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చారనేందుకు ఆధారాలున్నాయని తెలిపారు. డబ్బు లావాదేవీల వ్యవహారాలు తదుపరి దర్యాప్తులో బయటకు వస్తాయన్నారు. ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయన డిస్టిలరీకి లబ్ధి చేకూర్చారని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు కొల్లు రవీంద్ర దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. ఏజీ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగింపు నోట్ ఫైల్‌ను సిద్ధం చేశారని, దీనికి అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆమోదముద్ర వేశారని తెలిపారు. దీనివల్ల ఖజానాకు రూ.1,299 కోట్ల మేర నష్టం కలిగిందన్నారు. ఈ నష్టాన్ని కాగ్ సైతం ధ్రువీకరించిందని చెప్పారు. ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపలేదని, మంత్రి మండలిలో, అసెంబ్లీలో చర్చించలేదని తెలిపారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు పూర్తిగా రాజకీయ నిర్ణయమని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు తదితరులకు పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 17ఏ వర్తించదన్నారు. 2018 జూలైకి ముందు నేరం జరిగినందున గవర్నర్ అనుమతి అవసరం లేదన్నారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని, దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ దశలో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ముందుకెళ్లదన్నారు. అంతేకాక 31–10–23న పిటిషనర్లపై సీఐడీ కేసు నమోదు చేసిందని, ఆ వెంటనే వారిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారన్నారు. దర్యాప్తును కొనసాగనివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అనంతరం చంద్రబాబు, రవీంద్రల తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు ఫైల్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరనేలేదన్నారు. అప్పటి ఎక్సైజ్ మంత్రి, కమిషనర్ స్థాయిలోనే నిర్ణయం జరిగిందని తెలిపారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో జరిగిన పొరపాట్లను క్రిమినల్ చర్యలుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రాతపూర్వక వాదనలను సమర్పించిన తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయనుంది. -
అస్మదీయులకు అడ్డగోలుగా..
-
టీడీపీ నాయకుడి దాష్టీకం
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడైన కుంచే నానిపై కిడ్నాప్ కేసు నమోదైంది. వడ్డీ చెల్లించడం లేదంటూ అప్పు తీసుకున్న వ్యక్తిని బంధించగా.. తప్పించుకున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడైన కుంచే నాని వద్ద వర్రేగూడెంకు చెందిన ఎస్కే అమీన్ అలియాస్ మున్నా కుటుంబ సభ్యులు ఆర్థిక అవసరాల నిమిత్తం 2014లో రూ.4 లక్షల అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోకపోవడంతో అమీన్ కుటుంబం కొన్ని నెలలుగా వడ్డీ చెలించడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన కుంచే నాని.. తాతా సురేష్ అనే వ్యక్తి సహాయంతో బుధవారం అమీన్ ఇంటికి వెళ్లి అందరూ చూస్తుండగా అతన్ని దుర్భాషలాడి బలవంతంగా బైక్ ఎక్కించుకొని బైపాస్‌రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో అమీన్‌ను బంధించి, అప్పు కట్టే వరకు వదిలేది లేదంటూ భీష్మించాడు. అతనిపై కర్రలతో దాడి చేశారు. జేబులో నగదు బలవంతంగా తీసుకుని సుమారు రెండు గంటల పాటు హింసించి వదిలారు. అక్కడి నుంచి బయట పడిన అమీన్ నేరుగా ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కుంచే నాని, తాతా సురేష్‌పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కుంచే నాని, తాతా సురేష్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మొదటి నుంచీ ఇదే తీరు.. గత ప్రభుత్వంలో వడ్డీ వ్యాపారం పేరుతో అనేక మందిని హింసించిన కుంచె నాని.. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ పేదల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. వడ్డీలు కట్టలేని వారిని బంధించి హింసిస్తున్నారు. ఇప్పుడు అమీన్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పరారీలో కుంచే.. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కుంచే నాని అతని అనుచరుడు సురేష్‌లపై కిడ్నాప్ కేసు నమోదు కాగా విషయం తెలుసుకున్న ఇరువురు పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నారు. అయితే పోలీసులు ఇరువురిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మూడు బృందాలుగా ఏర్పడి కుంచే నాని, సురేష్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. -
గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హనుమాన్ జంక్షన్లో జిల్లా నేతల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నెల 12,13,14వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలకు సర్దిచెప్పలేక టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడ నుంచి జారుకున్నారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
‘కొల్లు రవీంద్ర.. బందరు కమల్‌హాసన్’
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగనీతులని.. కానీ చేసేదంతా వేరేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. బందరులో కొల్లు రవీంద్ర చేసిన నటన ముందు కమల్ హాసన్, ఎస్వీ రంగారావు లాంటి నటుల యాక్టింగ్ కూడా దిగదుడుపేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు. తాజాగా మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై కొల్లు రవీంద్ర దాడి చేశారు. డ్రామాలు చేసి.. దాడులు చేసి.. కేసులు పెట్టించుకుని మరీ బెయిల్ వస్తే ఊరేగింపులు చేసుకుంటాడు. పదవి ఉన్నప్పుడు పని చేయడు. కానీ, పదవి పోగానే ఇలాంటి దిక్కుమాలిన డ్రామాలు ఆడతాడు. కొల్లు రవీంద్ర బందరుకు కమల్ హాసన్ లాండోడని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ ఆస్తులపై కన్నేసింది ఎవరు? హైదరాబాద్ నడిబొడ్డున టీడీపీ పార్టీ ఆఫీస్ ఉన్న స్థలం ప్రభుత్వ భూమి కాదా? మంగళగిరిలో టీడీపీ పార్టీ ఆఫీస్ ఉన్న స్థలం ఎవరిది?.. ప్రభుత్వ భూమి కాదా?. అబద్ధాలు, మోసాలు, డ్రామాలు ఆడే ఈ జన్మ అవసరమా? కొల్లు రవీంద్ర అని విమర్శలు గుప్పించారు పేర్ని నాని. మచిలీపట్నం టీడీపీ కార్యాలయానికి యాభై సెంట్ల ప్రభుత్వ భూమి లీజుకి కావాలని అడిగింది నువ్వు కాదా? మీ పార్టీ కార్యాలయానికి స్థలం అడిగి.. ఇప్పుడు కబుర్లు చెప్తున్నావా? పోలీసులపై దాడులు చేసి.. మళ్లీ రక్షణకు పోలీసులనే ఆశ్రయిస్తారా?. బందరులో పోలీసులను ఎందుకు కొట్టారు?. కొల్లు రవీంద్ర లాంటి వ్యక్తుల వల్లే రాజకీయ నాయకుల విలువలు ప్రజల్లో దిగజారిపోతున్నాయని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. -
మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతల దాడి
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. పోలీసులపై పిడిగుద్దులతో కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఆర్ఎస్ఐ శంకర్ కిందపడిపోయారు. డీఎస్పీ అడ్డుకున్నా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చెప్పులు చూపిస్తూ పోలీసులపైకి టీడీపీ మహిళా కార్యకర్తలు దూసుకువచ్చారు. చదవండి: నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన బాలకృష్ణ -
కోర్టుకు హాజరైన లోకేశ్
విజయవాడ లీగల్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ నేతలు పలువురు ఓ ధర్నా కేసులో సోమవారం విజయవాడ ఒకటో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడిని 2020 జూన్ 12న అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఆ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై దాఖలైన కేసులో మాజీ మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్రలతో పాటు నాయకులు పట్టాభిరామారావు, దేవినేని చంద్రశేఖర్, జాస్తి సాంబశివరావులపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరు సోమవారం కోర్టుకు హాజరయ్యారు. విచారించిన న్యాయాధికారి జ్యోత్స్న కేసును జూలై 28కి వాయిదా వేశారు. -
దివిసీమ టీడీపీలో ఉప్పెన
మోపిదేవి (అవనిగడ్డ): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మోపిదేవి మండల టీడీపీ నాయకుల మూకుమ్మడి రాజీనామాలు దివిసీమలో తీవ్ర చర్చలకు దారితీశాయి. మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబం నుంచే ఈ ముసలం పుట్టడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రులు నడకుదటి నరసింహారావు సోదరుడు, కొల్లు రవీంద్ర మేనమామ అయిన జనార్దనరావు అధిష్టానంపై రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఈయన మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతగా, రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. శనివారం ఉత్తర చిరువోలులంకలోని ఆయన ఇంటివద్ద టీడీపీకి, అవసరమైతే ఎంపీటీసీ పదవికి సైతం తాను, తన కుటుంబం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కమ్యూనిస్టు పార్టీలో కొనసాగామని, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు పిలుపు మేరకు ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి టీడీపీకి మండలంలో కంచుకోటగా గ్రామాన్ని బలోపేతం చేశానని చెప్పారు. సర్పంచ్‌గా తాను, తన భార్య జననీకుమారి బాధ్యతలు నిర్వహించామని గుర్తు చేశారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీని చేస్తామని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ పోటీచేయాలని, గెలిస్తే ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో తన భార్య జననీకుమారిని కార్యకర్తలు గెలిపించారని పేర్కొన్నారు. అయితే ఎంపీపీ పదవి ఇవ్వకుండా.. హామీని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను గడ్డిపరకలకన్నా హీనంగా చూస్తున్నారని అన్నారు. అవసరానికి మాత్రమే వాడుకుంటూ అవకాశం ఉన్నా.. తమకు పదవి ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన భార్య జననీకుమారి ఎంపీటీసీ పదవిని కూడా వదులు కోవడానికి సిద్ధంగా ఉందని జనార్దనరావు వివరించారు. కాగా, ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
కృష్ణా: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్లో ఆక్రమణల తొలగింపును మున్సిపల్ అధికారులను చేపట్టారు. అయితే రవీంద్ర కల్సించుకుని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా వారు ఎంత చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు వచ్చి రవీంద్రను అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు. అయినప్పటికీ వినకపోవడంతో పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై చేయి చేసుకున్న కారణంగా కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
బీసీ అయితే పోలీసులను కొడతారా?
సాక్షి, తాడేపల్లి: కొల్లు రవీంద్ర బీసీ అయినంత మాత్రాన పోలీసులు కొట్టొచ్చా అని ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్. బీసీ అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదు.. ప్రజాస్వామ్యంలో కులాల వారిగా న్యాయాలు ఉండవు అన్నారు జోగి రమేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లు రవీంద్రకు లోకేశ్ తరహాలో పిచ్చి ముదిరింది. అందుకే పోలీసులపై దాడి చేశారు. కొల్లు రవీంద్రపై కేసు పెడితే టీడీపీ నేతలు అన్యాయం జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఆయన బీసీ అయితే పోలీసులను కొట్టడం.. తిట్టడం వంటివి చేయవచ్చా. చంద్రబాబు ఏనాడైనా కొల్ల రవీంద్రను గౌరవించాడా.. బీసీలను ఏనాడైన ఎదగనిచ్చాడా అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర పోలీసు అధికారులతో పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించారు. పోలీసులపై చేయి చేసుకోవడం నేరం కాదా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. బలహీన వర్గాలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమే. రాష్ట్రంలో చంద్రబాబు టీడీపీ నేతలను నట్టేటా ముంచేస్తాడు అని విమర్శించారు. చదవండి: దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. -
టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్
-
టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్
సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై చేయి చేసుకున్న కొల్లు రవీంద్రపై కేసు నమోదైంది. ఆయనను ఇనుకుదురు పీఎస్‌కు పోలీసులు తరలించారు. కొల్లు రవీంద్రపై 506, 341, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్ర బుధవారం పోలింగ్ సెంటర్ వద్ద వీరంగం సృష్టించిన సంగతి విదితమే. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు, తనను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఏకంగా విధుల్లో ఉన్న ఎస్ఐపై చేయి చేసుకున్నారు. మచిలిపట్నం 25వ డివిజన్ సర్కిల్‌పేటలోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర, మరి కొందరి కార్యకర్తలతో కలిసి వచ్చారు. తాను లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ హాడావుడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉందని.. ఆయన లోపలికి వెళ్లడానికి కుదరదని కొల్లు రవీంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర.. పోలీసులపై విరుచుకుపడ్డాడు.. ‘‘ఏయ్ ఎస్పై నన్ను ఆపుతావా’’ అంటూ బెదిరించడమే కాక.. ‘‘చంపుతావా.. చంపు’’ అంటూ ఎస్ఐ మీదకు వెళ్లాడు. వారిని వెనక్కి నెట్టాడు. నేను లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ వారితో వాదనకు దిగారు. చదవండి: ఏయ్ ఎస్సై నన్నే ఆపుతావా: కొల్లు రవీంద్ర చంద్రబాబు జాతి నాయకుడే -
విధుల్లో ఉన్న ఎస్ఐని నెట్టేసిన కొల్లు రవీంద్ర
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ వేళ తెలుగుదేశం పార్టీ బరి తెగించింది. ఓటమి భయంతో టీడీపీ నేతలు, శ్రేణులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. దాడుల్లో పలుచోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు గాయాల పాలయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌లకు యత్నించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు సైతం వెనుకాడలేదు. పోలింగ్ జరుగుతుండగానే ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారు. కృష్ణా జిల్లా బందరులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వీరంగం సృష్టించారు. 25వ వార్డు జలాల్ పేట పోలింగ్ కేంద్రంలోకి కార్యకర్తలతో కలిసి వెళ్తున్న రవీంద్రను పోలీసులు వారించబోగా.. విధుల్లో ఉన్న పోలీసులను కొట్టి అక్కడే ఉన్న ఎస్సైను నెట్టేశారు. ‘ఏయ్.. ఎస్ఐ. నన్నే ఆపుతావా’ అని బెదిరించడమేకాక, ‘చంపుతావా.. చంపు’ అంటూ ఎస్ఐని రెచ్చగొట్టారు. మోదుగులపై రాళ్లదాడి.. రిగ్గింగ్‌కు యత్నం గుంటూరులో దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారం అందడంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు బండరాళ్లతో దాడి చేశారు. మోదుగుల కారుతోపాటు మరో రెండు కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో మోదుగులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ నేతలు 10కి పైగా డివిజన్లలో ఓ సామాజిక వర్గానికి చెందిన హాస్టల్లో ఉన్న యువతులు, విద్యార్థులను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే 38వ డివిజన్ పరిధిలో స్తంభాల గరువు మున్సిపల్ పాఠశాలలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ముగ్గురు యువతులను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన మరో యువతిని పట్టుకున్నారు. వారి కోసం టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మారణాయుధాలతో ఓటర్లను బెదిరించారు. 6వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సమత కుమారుడు గౌతమ్ రైలుపేటలోని పోలింగ్ కేంద్రం వద్ద కత్తితో హల్చల్ చేస్తూ ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానిక యువకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే జిల్లాలోని సత్తెనపల్లిలో ఓటమి భయంతో టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు ప్రయత్నించాయి. 24వ వార్డులో మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా.. ఓటమి పాలవుతామనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ నేత చౌటా శ్రీనివాసరావు పార్టీ నేతలను రప్పించి రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం, డబ్బుతో నేరుగా పోలింగ్ కేంద్రానికి కారులో వచ్చారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ నేత చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి చేతికి గాయం కాగా, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కారు వెనుక అద్దం ధ్వంసమైంది. సత్తెనపల్లిలోని 7వ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావును జనసేన కార్యకర్తలు కొట్టారు. ఎల్లో మీడియాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు ప్రచారం జరిగింది. తిరుపతిలో దొంగ ఓట్లు వేయించే యత్నం తిరుపతి 43వ డివిజన్లో దొంగ ఓట్లు వేయించబోయిన టీడీపీ అడ్డంగా బుక్కయ్యింది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని వైఎస్సార్సీపీ ఏజెంట్లు అడ్డుకోగా.. ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15వ డివిజన్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విజయవాడలో ప్రలోభాల పర్వం విజయవాడలో పలుచోట్ల పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రలోభాలకు తెరలేపారు. 8వ డివిజన్లో టీడీపీ కార్యకర్తపై వైఎస్సార్సీపీ అభ్యర్థి భర్త దాడి చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసింది. వాస్తవానికి ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారి ప్రలోభాలను వైఎస్సార్సీపీ అభ్యర్థి భర్త అడ్డుకోవడంతో దుష్ప్రచారానికి తెరతీశారు. అనంతపురంలోని 29వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోగా.. వారితో టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దురుసుగా ప్రవర్తించారు. సీఐ మధుసూదన్‌ను దుర్భాషలాడారు. ప్రకాశం జిల్లా అద్దంకి 20వ వార్డులో టీడీపీ చీఫ్ ఏజెంట్ విషయంలో చోటుచేసుకున్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లా గుత్తిలోని 20వ వార్డులో టీడీపీ అభ్యర్థి సునీల్ తరఫున ఆ పార్టీ నాయకుడు శ్రీనివాసులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశాఖలో టీడీపీ ఓవరాక్షన్ ఎమ్మెల్యే వెలగపూడి హల్చల్ సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరపాలక సంస్థలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నించింది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఏయూ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిబంధనల మేరకు కేంద్రానికి 100 మీటర్ల దూరంలో తన వాహనాన్ని నిలిపి కారులోనే ఉన్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం కారులో నేరుగా పోలింగ్ కేంద్రం గేటు వద్దకు వచ్చి ఓటర్లు వద్దకు వెళ్లారు. దీనిపై స్థానికులతో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వెలగపూడిని బయటకు తీసుకొచ్చారు. స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణుల డిమాండ్‌తో వెలగపూడిని అరెస్ట్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు హల్చల్ చేశారు. గోపాలపట్నం పోలింగ్ బూత్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ నేతలు చోడవరం ప్రాంతం నుంచి కొందర్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయారు. నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొత్తం 300 మంది ఓటు వేసినట్లుగా అనుమానం వ్యక్తం చేసిన నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు 10, 11 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
ఏయ్ ఎస్సై నన్నే ఆపుతావా: కొల్లు రవీంద్ర
కృష్ణా: తెలుగు దేశం నేత కొల్ల రవీంద్ర పోలింగ్ సెంటర్ వద్ద వీరంగం సృష్టించాడు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. తనను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఏకంగా విధుల్లో ఉన్న ఎస్ఐపై చేయి చేసుకున్నాడు. ఆ వివరాలు.. మచిలిపట్నం 25వ డివిజన్ సర్కిల్‌పేటలోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర, మరి కొందరి కార్యకర్తలతో కలిసి వచ్చాడు. తాను లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ హాడావుడి చేసే ప్రయత్నం చేశాడు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉందని.. కనుక ఆయన లోపలికి వెళ్లడానికి కుదరదని కొల్లు రవీంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర పోలీసులపై విరుచుకుపడ్డాడు.. ‘‘ఏయ్ ఎస్పై నన్ను ఆపుతావా’’ అంటూ బెదిరించడమే కాక.. ‘‘చంపుతావా.. చంపు’’ అంటూ ఎస్ఐ మీదకు వెళ్లాడు. వారిని వెనక్కి నెట్టాడు. నేను లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ వారితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో టీడీపీ నేతల దౌర్జన్యాన్ని అరికట్టాలని.. ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని జనాలు కోరుతున్నారు. చదవండి: బరి తెగించిన టీడీపీ: దొంగ ఓట్లు వేయించేందుకు యత్నం -
కొల్లు రవీంద్ర దౌర్జన్యం
-
కోర్టుల ద్వారా పనిష్మెంట్లు ఇప్పిస్తా!
సాక్షి, అమరావతి: పోలీసులకు కోర్టుల ద్వారా పనిష్మెంట్లు ఇప్పిస్తామని, జాగ్రత్తగా ఉండాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు హెచ్చరించారు. తాను ఇంతకుముందులా ఉండనని, అన్నీ లెక్కలు వేసుకుంటున్నానని, ఎప్పుడు అవకాశం వచ్చినా ఎవరినీ వదలనని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో టీడీపీ నేత కొల్లు రవీంద్రను వేధిస్తున్నారని, రాష్ట్రంలో ఏం జరిగినా తమ పార్టీ నాయకులకే ముడిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 నెలల్లో ఏం చేశారో చెప్పుకునే సత్తా లేక ఐదు రోజులు తమ సభ్యుల్ని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండి తాము లెక్కలు సరిగా చెబుతున్నామని, అధికారంలో ఉండి వైఎస్సార్సీపీ తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. పెండింగ్ ఉపాధి బిల్లులు చెల్లించాలని టీడీపీ పాదయాత్ర వెలగపూడి (తాడికొండ): పెండింగ్‌లో ఉన్న రూ.2,500 కోట్ల ఉపాధి హామీ బిల్లులను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. -
కొల్లు రవీంద్రకు నోటీసులు
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై జరిగిన హత్యాయత్నం కేసులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 91 కింద విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ కొల్లు నివాసానికి వెళ్లి ఇనగుదురుపేట సీఐ శ్రీనివాస్ నోటీసులు అందజేశారు. అయితే తన ఆరోగ్యం బాగాలేదని కుదుటపడగానే విచారణకు హాజరవుతానని మాజీ మంత్రి బదులిచ్చారు. కాగా, ఘటన జరిగిన వెంటనే కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఆయనపై అనుమానం కలిగేలా చేశాయి. ఇసుక కొరత వల్ల పనుల్లేకే నిందితుడు బడుగు నాగేశ్వరరావు మంత్రి నానిపై దాడి చేశాడని రవీంద్ర వ్యాఖ్యానించారు. నిందితుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలైన బడుగు ఉమాదేవికి స్వయానా సోదరుడైనప్పటికీ అతనికి తమ పార్టీతో ఎలాంటి సంబంధాల్లేవని ప్రకటించారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో మాదిరిగానే ఈ కేసులో కూడా తనను కావాలనే ఇరికించేస్తారని అన్నారు. ప్రాథమిక విచారణ కూడా పూర్తికాకుండానే మాజీ మంత్రి నుంచి ఈ తరహా స్టేట్మెంట్ రావడంతో ఈ కేసులో నిజంగానే ఆయన ప్రమేయం ఉందనే అనుమానాలు తలెత్తాయి. దీంతో ఈ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు గతంలో నోటీసులు జారీ చేయగా.. టీడీపీతో నిందితుడు బడుగు నాగేశ్వరరావుకు సంబంధం లేదని, ఇసుక కొరత వల్లే నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టుగా ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తానలా మాట్లాడానని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కొల్లు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని విచారణాధికారైన బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి తాజాగా సీఆర్పీసీ కింద శుక్రవారం నోటీసులు జారీ చేశారు. విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రవీంద్రను పోలీసులు హెచ్చరించారు. పలువురు టీడీపీ సీనియర్లతో చర్చించిన మీదట.. విచారణకు హాజరవుతానని రవీంద్ర తెలిపారు. సబ్‌జైలుకు నిందితుడి తరలింపు మరోపక్క రెండ్రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో నిందితుడు బడుగు నాగేశ్వరరావును శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షలనంతరం మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. మంత్రిని హతమార్చేందుకే తాను వెళ్లానని, ఇందుకు తనను ఎవరూ పురిగొల్పలేదని విచారణలో నిందితుడు బదులిచ్చినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. కాగా టీడీపీ నేతలు మారగాని పరబ్రహ్మం, శ్రీను, నిందితుడి సోదరి ఉమాదేవి తదితరులను విచారించిన పోలీసులు కొంత మేర సమాచారాన్ని రాబట్టినట్టు తెలియవచ్చింది. -
కొల్లు రవీంద్రకు షరతులతో బెయిల్
చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్సీపీ సీనియర్ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.లక్ష్మణరావు సోమవారం తీర్పు ఇచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 28 రోజులపాటు విజయవాడ హోం క్వారంటైన్లో ఉండాలని, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, కేసు గురించి ఎవరితోనూ చర్చించకూడదని న్యాయస్థానం షరతులు పెట్టింది. విచారణ అధికారికి కేసు విషయంలో పూర్తిగా సహకరించాలని, ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. -
మాజీ మంత్రి కొల్లుకు చుక్కెదురు
-
హత్య కేసు: కొల్లు రవీంద్రకు షాక్
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ సీనీయర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు గురువారం కొట్టేసింది. ఆయన బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అతనికి బెయిల్ ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద పట్టపగలు వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావును దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. విచారణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. శనివారం కొల్లు రవీంద్ర తరపున వాదనలను న్యాయమూర్తి విన్నారు. అయితే సోమవారం రోజున ప్రాసిక్యూషన్ వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. కాగా.. వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్‌రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఏ4 నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై కూడా సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. -
మరో 14 రోజుల పాటు రిమాండ్
-
కొల్లుకు రిమాండ్ పొడిగింపు
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్సీపీ సీనీయర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్‌ను మరో 14 రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు మచిలీపట్నం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గురు అరవింద్ ఆదేశాలు జారీ చేశారు. గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద పట్టపగలు వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావును హతమార్చడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్ చేశారు. వీరందర్ని వీడియో కాన్ఫరెన్స్‌లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా, బెయిల్ కోసం కొల్లు రవీంద్రతో పాటు ఇతర నిందితులు జిల్లా కోర్టులో వేర్వేరుగా ఫైల్ చేసిన పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి. -
వైఎస్సార్ సీపీ నేత హత్య కేసులో కీలక సమాచారం
సాక్షి, కృష్ణా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాస్కర్ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఏ1 చింతా చిన్నీ, ఏ2 చింతాపులిలను మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. అనంతరం నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు పోలీసుల పేర్కొన్నారు. -
గోడ దూకి ఎందుకు పారిపోయారు..
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రను స్పష్టమైన ఆధారాలతోనే అరెస్టు చేశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కొల్లు రవీంద్ర తప్పు చేయకపోతే పోలీసుల్ని చూసి గోడ దూకి ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, నేరం చేసిన వారిని అరెస్టు చేస్తే తప్పా అని నిలదీశారు. తప్పులు చేస్తే కులం, మతం అంటకట్టవచ్చా అని ప్రశ్నించారు. హత్య కేసులో చనిపోయిన వ్యక్తీ బీసీ కాదా అని, భాస్కర్ రావు చనిపోతే ఆయన కుటుంబం రోడ్డు మీద పడ్డారని అన్నారు. (మహిళా ఉద్యోగికి మంత్రి అనిల్ పరామర్శ) అయ్యన్నపాత్రుడు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే కౌరవుల సభ గుర్తుకు వస్తోందని అనిల్ కుమార్ ఎద్దేవా చేశాడు. ఓ మహిళపైన అసభ్యంగా చేసిన ఆయన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్ధిస్తాడా అని నిలదీశారు. 150 కోట్ల రూపాయలు దోచిన అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే కూడా బీసీ కులం వాడతారా అని మండిపడ్డారు. తప్పు చేసి అడ్డంగా దొరికితే కులాన్ని అంటకట్టడం టీడీపీకి మామూలు అయిపోయిందన్నారు. బీసీలపై అంతా ప్రేముంటే అయిదేళ్లు వాళ్ల కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని కోరారు. 50వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కనీసం 15వేల కోట్లు కూడా ఖర్చు పెట్ట లేదని దుయ్యబట్టారు. బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంది చంద్రబాబేనని మంత్రి అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. (రైతు భరోసా కేంద్రాలకు ‘వైఎస్సార్’ పేరు) ‘బీసీల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడాది కాలంలోనే 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నామినేట్ పదవుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. మేము, మా నాయకుడు ఎప్పుడు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చెయ్యం. చంద్రబాబు ప్రభుత్వంలో నాపై అక్రమంగా కేసులు పెట్టారు .వాటిలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. నేను బీసీ ఎమ్మెల్యేను కాదా. మీరా బీసీల ఆత్మాభిమానం గురించి మాట్లాడేది. చట్టం ముందు కులాలు,మతాలు ఒక్కటే. 30లక్షల మందికి ఇళ్లు ఇస్తుంటే.. కోర్టుకు వెళ్లి దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. 30లక్షల లబ్దిదారుల్లో 22లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లబ్దిదారులు ఉన్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం’ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. (టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..) -
పక్కా ఆధారాలతోనే రవీంద్రను అరెస్ట్ చేశారు
-
రాజకీయ హత్య
-
‘కొల్లు’ ప్రోద్బలంతోనే మోకా హత్య
కోనేరు సెంటర్ (మచిలీపట్నం)/ గూడూరు (పెడన): టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారు. ఆయన కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారామపురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనం తరం ఆయనను కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు, కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. నిందితులందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మచిలీపట్నం రెండో అసిస్టెంట్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చారు. జడ్జి ఆదేశాల మేరకు కొల్లు రవీంద్ర, మిగిలిన నిందితులను 14 రోజుల రిమాండ్ నిమిత్తం భారీ బందోబస్తు నడుమ మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ–4, ఏ–5గా ఉన్న నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణలను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన విషయాలను ఎస్పీ ఎం.రవీంద్ర నాథ్‌బాబు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ‘నా పేరు బయటకు రాకుండా చంపేయండి’ ► టీడీపీ మాజీ కౌన్సిలర్ చింతా నాంచారయ్య అలియాస్ చిన్నీకి మోకా భాస్కరరావుతో విభేదాలు ఉండటంతో అతడిని అడ్డు తొలగించు కోవాలనుకున్నాడు. ► కొల్లు రవీంద్రను కలిసి మోకాను అం తమొందిస్తే తప్ప తనకు స్థానికంగా బలం ఉండదని, సహకరించాలని చిన్నీ కోరగా.. స్థానిక ఎన్నికలు ముగిశాక ఆలోచిద్దామని కొల్లు చెప్పారు. ► కొన్ని రోజుల క్రితం చిన్నీ మరోసారి రవీంద్రను కలిసి మోకాను హతమా ర్చేందుకు సహకరించాలని కోరాడు. ► అందుకు అంగీకరించిన మాజీ మంత్రి రవీంద్ర ‘నా పేరు ఎక్కడా బయటకు రాకుండా చంపేయండి. ఈ విషయమై మాట్లాడటానికి నాకెలాంటి ఫోన్లు చేయకండి. ఏదైనా ఉంటే నా పీఏలతో మాట్లాడండి’ అని సూచించారు. ► దీంతో చింతా చిన్నీ గతనెల 29న మోకా భాస్కరరావు చేపల మార్కెట్లో ఒంటరిగా ఉండగా.. చింతా పులి, చింతా కిషోర్ (మైనర్)లతో కలిసి కత్తులతో పొడిచి చంపారు. ‘నేనున్నా.. ఏం జరిగినా చూసుకుంటా’ ► భాస్కరరావును హత్య చేసిన చిన్నీ నిందితులిద్దరితో కలిసి ఊరి చివరకు వెళ్లి కొల్లు రవీంద్ర పీఏకి ఫోన్ చేశాడు. ► కలెక్టరేట్లో ఉన్న రవీంద్ర పీఏ నుంచి ఆ ఫోన్ తీసుకుని మాట్లాడగా.. ‘అన్నా.. పని పూర్తయ్యింది. మోకాను వేసేశాం’ అని చిన్నీ చెప్పాడు. ► ‘సరే జాగ్రత్త. నేనున్నా.. ఏం జరిగినా నేను చూసుకుంటా. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి’ అని చిన్నీకి మాజీ మంత్రి అభయమిచ్చారు. ► నిందితుల వాంగ్మూలం, ఫోన్ కాల్స్ డేటా ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కేసులో కొల్లు రవీంద్రను నాలుగో (ఏ–4) నిందితునిగా నిర్ధారించినట్టు ఎస్పీ చెప్పారు. -
కొల్లు రవీంద్ర ఇంతకి తెగిస్తాడనుకోలేదు
సాక్షి, మచిలీపట్నం : తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్‌రావు భార్య వెంకటేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతటి ఘోరానికి పాల్పడుతాడని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుమానించినట్లే పోలీసుల విచారణలో నిందితులు కూడా అదే విషయాన్ని వెల్లడించారన్నారు. తన భర్తకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక కొల్లు రవీంద్ర తన అనుచరులతో ఈ దురాగతం చేయించారన్నారు. కొల్లు రవీంద్ర అక్రమాలను తన భర్త ప్రశ్నించేవాడని, గూటాల చెరువు భూముల అమ్మకంపై పోరాటం చేశారని వెంకటేశ్వరమ్మ గుర్తు చేసుకున్నారు. తన భర్తను హతమారుస్తారన్న ఆలోచన తమకు ఎప్పుడూ రాలేదన్నారు. రాజకీయ లబ్ది కోసం ఓ మనిషిని చంపేంత దారుణానికి ఒడిగడతారనుకోలేదన్నారు. (అన్న కోసమే.. మోకా హత్య !) ఈ హత్యతో ప్రమేయం లేకపోతే కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయారని వెంకటేశ్వరమ్మ సూటిగా ప్రశ్నించారు. తన భర్త హత్యకేసులో ప్రమేయం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలని వెంకటేశ్వరమ్మ కోరారు.(రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొల్లు రవీంద్ర) -
మచిలీపట్నం సబ్ జైలుకు కొల్లు రవీంద్ర
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న కొల్లు రవీంద్రను తుని వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను పెడన నియోజకవర్గం గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు పూర్తి చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అయిదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా భాస్కర్‌రావును హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు హత్య కేసుకు సంబంధించి పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు బయపటడుతున్నాయి. (అన్న కోసమే.. మోకా హత్య !) -
‘పేరు బయటకు రాకుండా మర్డర్ ప్లాన్’
సాక్షి, విజయవాడ: రాజకీయ ఆధిపత్యపోరుతోనే వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్‌రావును హత్య చేశారని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. 2013లో కూడా భాస్కర్‌రావు హత్యకు కుట్ర జరిగిందని అన్నారు. గడిచిన నాలుగు నెలలుగా భాస్కర్‌రావు హత్యకు పలుమార్లు ప్రయత్నించారని చెప్పారు. ఎస్పీ రవీంద్రబాబు శనివారం హత్యకేసు వివరాలను మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాన నిందితుడు నాంచారయ్యకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అండ ఉంది. హత్యా ఘటనకు 15 రోజుల ముందు రవీంద్రను నాంచారయ్య కలిశారు. ఒక రూమ్‌లో దాదాపు గంట సేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. భాస్కర్‌రావు హత్యకు ప్రయత్నిస్తున్నట్లు నాంచారయ్య రవీంద్రకు చెప్పారు. తన పేరు బయటకు రాకుండా ప్లాన్ చేయాలని రవీంద్ర స్పష్టం చేశారు. ఆ సమయంలో ఆయన పీఏ కూడా ఉన్నారు. (చదవండి: టీడీపీ నేతల దౌర్జన్యం ) చేపల మార్కెట్‌కు భాస్కర్‌రావు ఒంటరిగా వస్తున్నారని గుర్తించి పథకం ప్రకారం హత్య చేశారు. నాలుగు రోజుల ముందు నుంచే హత్య ఎలా చేయాలో నిందితులకు ట్రైనింగ్ ఇచ్చారు. దాడి చేసిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న బైక్‌లపై నిందితులు పరారయ్యారు. ప్రధాన నిందితుడు నాంచారయ్య ఇచ్చిన వాంగ్మూలంతో పాటు.. కాల్ డాటా ఆధారంగా విచారణ చేసిన తర్వాతే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశాం. కొల్లు రవీంద్రకు నోటీసులు ఇవ్వడానికి వెళితే ఆయన పరారయ్యారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై తుని వద్ద ఆయనను పట్టుకున్నారు’ అని ఎస్పీ రవీంద్రబాబు పేర్కొన్నారు. (అన్న కోసమే.. మోకా హత్య ! ) -
కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు
-
మోకా హత్య కేసు: విస్తుగొలిపే నిజాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘వాడు మీకే కాదు... నాకూ తలనొప్పిగా తయారయ్యాడు. ప్రతి దాంట్లో వేలు పెడుతున్నాడు.. దారుణంగా మాట్లాడుతున్నాడు.. వాడిని ఎలాగైనా వేసేయాల్సిందే.. అయితే ఇప్పుడే కాదు.. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే చూద్దాం.. అప్పటి వరకు ఓపిక పడదాం.. ‘మనం రంగంలోకి దిగితే వాడు చావాల్సిందే. తప్పించుకున్నాడో మనందర్నీ వేసేస్తాడు.. కత్తి దించితే అక్కడే పూర్తయిపోవాలి. అందుకు మనమే ముందుండాలి. లేదంటే ఆ తరువాత అన్నీ చిక్కులే...’ ఇదీ మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కరరావు హత్యకు ముందు ప్రత్యర్థుల ప్లానింగ్‌లో రెండున్నర నెలల కిందట చర్చకు వచ్చిన అంశాల్లో మచ్చుకు కొన్ని.. మోకాను ఏవిధంగా హతమార్చాలనే విషయంలో బందరుకు చెందిన తెలుగుదేశం పార్టీలోని ఓ సామాజికవర్గం నాయకులు పలు దఫాలు భేటీ అయ్యారని వెల్లడవుతోంది. పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు తెలియవస్తున్నాయి. రెండున్నర నెలల కిందటే.. గత ప్రభుత్వంలో మంత్రిగా కొల్లు రవీంద్ర అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మోకా భాస్కరరావు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వాటిని తాను నిరూపించగలనని సవాల్ విసిరారు. దీనిపై కొల్లు రవీంద్రతో పాటు టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ చింతా చిన్ని ప్రత్యారోపణలు చేశారు. పరస్పర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో మోకా భాస్కరరావు ప్రతి విషయంలోనూ అడ్డుగా వస్తున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందేనని టీడీపీ నేతలు రెండన్నర నెలల కిందట నిర్ణయానికి వచ్చారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత హతమార్చడం మేలని కుట్రదారుల మధ్య అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మోకా జోరు పెరుగుతోందని, ఇప్పుడే అడ్డుకోకపోతే ఎన్నికల్లో సమస్యలు తప్పవని 20 రోజుల కిందట ఆరేడుగురు కలిసి చర్చించుకున్నారు. ‘మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. దెబ్బ మిస్ కాకూడదు. పనిపూర్తయ్యాక చెప్పండి. ఆ తరువాత వ్యవహారాలన్నీ నాకు వదిలేయండి. నేను చూసుకుంటా.. అయితే ఎక్కడా నా పేరు బయటకు రాకూడదు.. అసలు ప్రస్తావనకే రానీయొద్దు.. నా నెంబర్‌కు మీరు ఫోన్లు చేయవద్దు.. ఫలానా వారికి ఫోన్ చేయండి. నేను మాట్లాడతా... అని టీడీపీ ముఖ్య నాయకుడు భరోసా ఇవ్వడంతో చింతా కుటుంబీకులు మోకాను గత నెల 29వ తేదీ స్థానిక చేపల మార్కెట్లో దారుణంగా హతమార్చారు. అన్నదమ్ముల్లా... కొల్లు రవీంద్ర, చింతా చిన్ని అన్నదమ్ముల తరహాలో కలిసిమెలిసి ఉంటారనేది బందరు టీడీపీ నాయకులతో పాటు స్థానికులకు ఎరుకే. ప్రతి విషయాన్ని వారు చర్చించుకుంటారని, ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారనేది బహిరంగ రహస్యం. అయితే మోకా హత్యకు నాలుగు రోజుల ముందు నుంచి చింతా చిన్ని, కొల్లు రవీంద్రల మధ్య ఫోన్‌కాల్స్ లేవు. కొల్లు పీఏల ఫోన్లకు చింతా చిన్ని ఫోన్ చేసి కొల్లుతో పలుమార్లు మాట్లాడుకున్నారు. గత నెల 28వ తేదీనే హత మార్చాలని చూసినప్పటికీ వీలుకాలేదు. మరుసటి రోజు స్పాట్ పెట్టారు. అన్నా పనైపోయింది! మోకా హత్య తరువాత 15 –20 నిమిషాల మధ్య కొల్లు పీఏకి చింతా చిన్ని నుంచి ఫోన్ వెళ్లింది. అన్నకు ఫోన్ ఇవ్వమన్న చిన్ని... అన్నా పనైపోయిందనగానే అంతా ఓకేగా అని ఫోన్ పెట్టేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆ తరువాత కూడా వేర్వేరు నెంబర్లతో ఫోన్లలో సంభాషణ జరిగినట్లు విచారణలో రూఢీ అయ్యింది. దీన్నిబట్టి హత్యకు ప్రోత్సహించింది కొల్లు అనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసులో నాలుగవ నిందితుడిగా మాజీమంత్రిని చేర్చారు. హత్య తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగి పోవాలనే సూచన కూడా సీనియర్ నేతదేనని తేలింది. పాత కక్షల నేపథ్యంలో అనేలా! మోకా భాస్కరరావు హత్యలో చింతా చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్ పులి, చింతా కిషోర్ రక్త సంబందీకులు. వీరు వరుసగా మొదటి నిందితులు కాగా నాలుగో నిందితునిగా కొల్లు ఉన్నారు. నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా పలువురి ప్రమేయం ఉందని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసు అధికారి సాక్షికి తెలిపారు. -
మర్డర్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్
కోనేరు సెంటర్ (మచిలీపట్నం), సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో నిందితుడైన తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన తన స్వస్థలమైన మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తూ పోలీసులకు చిక్కారు. గత నెల 29వ తేదీన మచిలీపట్నం చేపల మార్కెట్లో జరిగిన మోకా భాస్కరరావు హత్యకేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై నాలుగో నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా, కొల్లు రవీంద్ర పోలీసుల కళ్లు గప్పి పరారవుతూ తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులకు చిక్కారు. కొల్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మచిలీపట్నంకు తరలిస్తున్నట్లు సమాచారం. మంచి నాయకుడిగా మోకాకు గుర్తింపు మచిలీపట్నం ఉల్లింఘిపాలేనికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు మోకా భాస్కరరావు పార్టీపరంగా, సామాజికపరంగా డివిజన్లో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నాడు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన ఆయన ఆ సామాజికవర్గంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తూ మంచి నేతగా గుర్తింపు పొందాడు. గత ప్రభుత్వంలో టీడీపీకి చెందిన అప్పటి కౌన్సిలర్ చింతా చిన్ని అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర మద్దతుతో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు. గుమటాలచెరువును ఆక్రమించుకుని ప్లాట్లుగా మార్చి అమ్మేసుకుని కోట్లు గడించాడు. భాస్కరరావు తరచూ చింతా చిన్ని అవినీతిని ఎండగడుతూ ఉండేవాడు. ఇటీవల జరిగిన ఓ వివాదంలో సైతం చిన్ని అదే తరహాలో వ్యవహరిస్తుండటంతో మోకా అడ్డుకున్నాడు. చిన్నికి మద్దతుగా మాజీ మంత్రి కొల్లు పంచాయతీకి వెళ్లారు. వారి అవినీతిని మోకా అందరిలో ఎండగట్టాడు. కొల్లు ప్రోద్బలంతోనే హత్య? వార్డులో మోకా ఎదుగుదలను చూసి ఓర్వలేని చిన్ని, తాను అక్రమ మార్గంలో ఎదగాలంటే మోకాను అడ్డు తొలగించటం ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చాడు. తన సమీప బంధువులతో కలిసి మోకాను అంతమొదించేందుకు స్కెచ్ వేశాడు. మోకాను అంతమొందించేందుకు చిన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి మద్దతు కోరినట్లు పోలీసుల విచారణలో రూఢీ అయ్యింది. రవీంద్ర ప్రోత్సాహంతో గత నెల 29న చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్ పులి, చింతా కిషోర్ (మైనర్)లు చేపల మార్కెట్లో ఉన్న మోకాపై కత్తులతో దాడి చేసి పొడిచి చంపారు. అదే రోజు సాయంత్రం హత్య చేసిన ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ వ్యవహారమంతా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సలహా మేరకే జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆర్‌పేట స్టేషన్లో మాజీ మంత్రిపై కేసు నమోదు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కరరావు హత్య జరిగిందని మోకా బంధువులు ఆర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హత్యకు పాల్పడిన ముగ్గురితో పాటు కొల్లు రవీంద్రపైన 302, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మోకా హత్యకేసులో ఇప్పటికే ప్రధాన నిందితులైన చిన్నీ, నాంచారయ్య, కిషోర్లతో పాటు వారికి సహకరించిన నాగమల్లేశ్వరరావు, వంశీలను అరెస్ట్ చేశారు. నాలుగో నిందితుడైన కొల్లు రవీంద్ర పోలీసు కళ్లుగప్పి పరారయ్యారు. పరారై పట్టుబడ్డ కొల్లు శుక్రవారం మధ్యాహ్నం బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా నేతృత్వంలో పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికెళ్లారు. అయితే, ఆయన ఇంట్లో లేరు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయన విశాఖ వైపు కారులో వెళ్లిపోతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో విజయవాడ – విశాఖపట్నం రహదారులపై పోలీసులు నిఘా వేశారు. రవీంద్ర మొబైల్ సిగ్నళ్ల ఆధారంగా ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని వద్దకు రాగానే వాహనాన్ని నిలిపివేసి, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయన్ని విజయవాడకు తరలించారు. ఇదిలా ఉండగా మోకా హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ చేయాలంటూ ఉల్లింఘిపాలెం వాసులు శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వైఎస్సార్సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు జిల్లా ఎస్పీని కలిసి కొల్లుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని కోణాల్లో పరిశీలించాకే రవీంద్రపై కేసు మోకా భాస్కరరావు హత్యలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలం ఉన్నట్లు నిందితుల వాంగ్మూలంతోపాటు కాల్‌డేటా, సాంకేతిక అంశాల ద్వారా రూఢీ అయిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే రవీంద్రపై కేసు నమోదు చేశామని చెప్పారు. రవీంద్రపై అక్రమంగా కేసు బనాయించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా చట్టపరంగానే అన్ని చర్యలు చేపట్టామని సమాధానం ఇచ్చారు. -
పోలీసుల అదుపులో టీడీపీ నేత కొల్లు రవీంద్ర
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు (57) దారుణ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద కొల్లు రవీంద్రను మఫ్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ4 నిందితుడిగా కొల్లు రవీంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్ర విచారణ కోసం నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా.. పోలీసులకు చిక్కకుండా కొల్లు రవీంద్ర తప్పించుకున్నాడు. విశాఖపట్నం వైపు వెళుతున్న కొల్లు రవీంద్రను మఫ్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోకా హత్యకేసులో ఇప్పటికే ఐదు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే మోకా కుటుంబసభ్యుల ఫిర్యాదు, పట్టుబడ్డ నిందితుల వాంగ్మూలం ఆధారంగా కొల్లు రవీంద్రను పోలీసులు విచారించనున్నారు. కొల్లు రవీంద్రను మచిలీపట్నం తరలించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి -
మోకా హత్య కేసు: మరో ఇద్దరు అరెస్టు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీలను అరెస్టు చేశామని బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపైనా కేసు నమోదు చేశామని అన్నారు. నోటీసులు ఇచ్చేందుకు కొల్లు రవీంద్ర ఇంటికెళ్తే ఆయన తప్పించుకుపోయారని చెప్పారు. కొల్లు రవీంద్ర కోసం మూడు బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ తెలిపారు. కాగా, మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్‌లను గురువారం ఆర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: అజ్ఞాతంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!) -
అజ్ఞాతంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. హత్యకేసులో పట్టుబడ్డ నిందితుల వాంగ్మూలంతో సూత్రదారుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మోకా హత్యలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందన్న ఆరోపణలో నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటికి చేరుకోగా.. విషయం తెలుసుకుని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కొల్లు రవీంద్ర కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. (చదవండి: ‘మోకా’ది రాజకీయ హత్యే) -
టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు నమోదు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావుది రాజకీయ హత్యేనని పోలీసులు నిర్ధారించారు. రాజకీయంగా, సామాజికంగా మోకా ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు (టీడీపీ నాయకులు) ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. భవిష్యత్తులో మోకా రాజకీయంగా, సామాజికంగానూ మరింత బలపడితే తమకు మనుగడ ఉండదనే అక్కసుతో ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మోకాను హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మచిలీపట్నం ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎదుగుదలను చూసి ఓర్వలేకనే... మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు (57) బందరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి ముఖ్య అనుచరుడిగా, నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. ముప్పై ఏళ్లుగా నియోజకవర్గ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న భాస్కరరావు పేర్ని నాని రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఆయనకు అనుచరుడిగా ఉంటూ 24వ వార్డుకు ఒక మారు కౌన్సిలర్‌గా పని చేశాడు. రెండు సార్లు మార్కెట్‌యార్డు చైర్మన్‌గా పని చేశారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన భాస్కరరావు అటు రాజకీయంగా, ఇటు సామాజికపరంగా మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీ తరఫున 24వ వార్డుకు నాయకుడిగా మోకా వ్యవహరిస్తున్నాడు. అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు (మాజీ కౌన్సిలర్) చింతా చిన్నీకి, భాస్కరరావుకు మధ్య పారీ్టపరంగా, సామాజికపరంగా విభేధాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో టీడీపీ కౌన్సిలర్‌గా 24వ వార్డు ఉల్లింఘిపాలెంకు ప్రాతినిధ్యం వహించిన చింతా చిన్నీ అనేక కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడుతూ వచ్చాడు. భాస్కరరావు చిన్నీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుండగా గత ప్రభుత్వంలో చిన్నీ తన కౌన్సిలర్ పదవిని అడ్డం పెట్టుకుని గుమ్మటాలచెరువును ఆక్రమించి అక్రమంగా అమ్మేసుకున్నాడు. ఈ విషయంలో భాస్కరరావు పలుమార్లు చిన్నీని నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య వైరం మరింత పెరిగింది. చిన్నీ అవినీతి అక్రమాలను పదే పదే మోకా ఎండగడుతుండంతో వార్డులో చిన్నీ ప్రజల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పథకం ప్రకారమే హత్య రాజకీయంగా, సామాజికంగా మోకా భాస్కరరావు వార్డులో మంచి పట్టు సాధించగా చింతా చిన్నీ టీడీపీ తరఫున వార్డులో పట్టు మరింత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో మోకా కారణంగా వార్డులో పట్టుకోల్పోతున్నామన్న అక్కసు పెంచుకున్న చింతా చిన్నీ తన రాజకీయ మనుగడ కోసం మోకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన పెదనాన్న కుమారుడు చింతా నాంచారయ్య అలియాస్ పులి, అన్న కుమారుడు చింతా కిషోర్ (16)లతో కలిసి మోకాను ఎలాగైనా అంతమొందించి వార్డులో తన పట్టు నిలబెట్టుకోవాలని పథకం రచించాడు. అందుకోసం నాలుగు రోజుల పాటు మోకా కదలికలను చింతా చిన్నీ గమనిస్తూ వచ్చాడు. మోకా భాస్కరరావు నాలుగు రోజులుగా చేపలమార్కెట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వస్తుండటం గమనించిన చిన్నీ గత నెల 29వ తేదీన మోకా హత్యకు పన్నాగం పన్నాడు. ఆ రోజు ఉదయం మోకా భాస్కరరావు ఇంటి నుంచి బయలుదేరింది మొదలు ఆయన ప్రతి కదలికను చింతా చిన్నీ గమనిస్తూ వచ్చాడు. మోకా మార్కెట్ వద్దకు ఒంటరిగా రావటాన్ని గమనించిన చిన్నీ అతని బందువులైన నాంచారయ్య, కిషోర్‌లను మార్కెట్ వద్దకు పిలిచి మోకా ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో అప్పటికే ఆయుధాలతో వచ్చిన నాంచారయ్య, కిషోర్‌లు మార్కెట్లో ఒంటరిగా ఉన్న భాస్కరరావుపై దాడి చేసి కొబ్బరిపీచు వలిచే ఆయుధంతో గుండెల్లో మూడు పోట్లు పొడిచారు. దీంతో భాస్కరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి చేసిన ఇరువురిని చిన్నీ వాహనాలపై అక్కడి నుంచి తప్పించాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆటోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మోకా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోకా భాస్కరరావు హత్యకేసులో చింతా చిన్నీ ప్రధాన నిందితుడు కాగా చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్‌లను గురువారం ఆర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా భాస్కరరావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే జరిగిందంటూ కుటుంబసభ్యులు ఆరోపించటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతా చిన్నీ, నాంచారయ్య, కిషోర్లతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. మోకా హత్యకేసుకు సంబంధించి మరింత దర్యాప్తు నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించటం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. అలాగే ఈ కేసులో మరి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని పూర్తి వివరాలు అతి తొందరలోనే విలేకరులకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. సమావేశంలో ఆర్‌పేట, చిలకలపూడి సీఐలు కడలి వెంకటేశ్వరరావు, మోర్ల వెంకటనారాయణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
భాస్కరరావు హత్య: టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, మచిలీపట్నం : వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు (57) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆర్‌పేట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రాజకీయ ఆధిపత్యం చాటేందుకే భాస్కర రావును హత్య చేసినట్లు పోలీసుల విచారణ నిర్ధారణ అయ్యింది. దీనిపై మరికొందరిని సైతం విచారించే అవకాశం ఉంది. భాస్కర్‌రావు హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. (వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య) గతనెల 29న బందరు నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు ఈ హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే ఆయన అనుచరుడు చింతా చిన్ని పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్టుగా భాస్కరరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా హత్యతో ఈ ముగ్గురికి సంబంధం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. రాష్ట్ర రవాణా సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య మోకా భాస్కరరావు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. -
వైఎస్సార్సీపీ నేత హత్య: బందరులో కలకలం
సాక్షి, మచిలీపట్నం/కోనేరుసెంటర్: ప్రశాంత నగరమైన బందరులో కలకలం రేగింది. నగరం నడిరోడ్డున అందరూ చూస్తుండగా పక్కా ప్రణాళికతో ఓ సీనియర్ రాజకీయ నాయకుడు హత్యకు గురవడం సంచలనం రేపింది. మత్స్యకార వర్గాల్లో మంచి పట్టున్న వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కరరావు (57) పాశవికంగా హత్యకు గురవడం ఆందోళన రేపుతోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో ఆయన అనుచరులు పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వార్తలు గుప్పుమనడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో.. ►ఉదయం 11.30 గంటల సమయం. నిత్యం రద్దీగా ఉండే కోనేరు సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న చేపల మార్కెట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావుపై ఓ ఇద్దరు ఆగంతుకులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ►నిల్చొన్న భాస్కరరావును తోసేయడంతో కిందపడి పోయాడు. అంతే అందరూ చూస్తుండగానే తమ వెంట తెచ్చుకున్న కత్తితో నేరుగా ఛాతిలోకి పొడిచారు. ►ఆ పోట్లకు జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలిపోయింది. వంటిపై చొక్కా కాలిపోయింది. శరీరంపై కాలిన గాయాలయ్యాయి. ►గుండెల్లో పొడవడంతో తీవ్ర రక్తస్రావమైన భాస్కరరావును ఆటోలో హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. పక్కా స్కెచ్..! ►ఈ హత్య పూర్తిగా పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిలో నలుగురు పాల్గొన్నట్టుగా, వారిలో ఇరువురు 18–22 ఏళ్ల లోపు వారే అంటున్నారు. ►కనీసం నాలుగైదు రోజుల నుంచి భాస్కరరావు కదలికలను గమనిస్తూ ఆయన వెళ్లే ప్రతిచోటా రెక్కీ నిర్వహించారని తెలియవచ్చింది. ►ఈ ఘటనలో ఇరువురు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో ఇరువురు మెయిన్ రోడ్లో బైకులపై వేచి ఉన్నట్టుగా సీసీ ఫుటేజ్‌ను బట్టి తెలుస్తోంది. టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు రాజకీయ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని ప్రచారంతో తమ పార్టీ నేతలపై దాడులు జరిగే అవకాశాలున్నాయని తమకు రక్షణ కలి్పంచాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎస్పీ రవీంద్రనాథ్‌బాబును కలిసి అభ్యర్థించారు. ఎస్పీ ఆదేశాలతో మాజీ మంత్రి కొల్లు ఇంటితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నగర ప్రధాన కూడళ్లల్లో కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కన్నీటి పర్యంతం.. భాస్కరరావు హత్యకు గురైన వార్తతో బందరు నగరం శోకసంద్రంలో మునిగిపోయింది. తన ఆప్తుడ్ని కోల్పోయిన రాష్ట్ర మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ బుల్లెట్ చింత చిన్నిదే హత్యనంతరం మెయిన్‌రోడ్డు వైపు పరుగు తీసిన నిందితుల్లో ఒకరు ఓ బుల్లెట్ ఎక్కారు. ఆ బుల్లెట్ ఎవరదని పోలీసులు ఆరా తీశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ బుల్లెట్ ఈ హత్యోదంతంలో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న చింత చిన్నకు చెందినదేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఆర్ పేట సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. చింత చిన్నీయే స్వయంగా తన బుల్లెట్ ఏపీ 16వీఎల్ 6669తో వచ్చి నిందితుడ్ని ఎక్కించుకుని పరారైనట్టుగా భావిస్తున్నారు. ‘బాచీ బాబాయ్’ ప్రస్థానం కోనేరు సెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో సోమవారం హత్యకు గురైన మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ముప్పై ఏళ్ల క్రితం ప్రారంభం అయ్యింది. ఆది నుంచి మంత్రి పేర్ని నాని కుటుంబం వెంటే నడుస్తూ వారికి నమ్మిన బంటుగా ముద్ర వేసుకున్నారు. తన సామాజిక వర్గంలో ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ వారికి అండగా నిలుస్తూ అందరితో ముద్దుగా బాచీ బాబాయ్ అని పిలిపించుకునే వారు. ►భాస్కరరావు తండ్రి మోకా రామయ్య మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి హయాంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆ తర్వాత తన భార్య మోకా వెంకటేశ్వరమ్మను అదే వార్డు నుంచి వరుసగా రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిపించుకున్నారు. ►మత్స్యకార కుటుంబానికి చెందిన భాస్కరరావు మత్స్యకారుల సమస్యలపై నిరంతంర పోరాటాలు చేస్తూ ఉల్లింగిపాలెం మత్స్య కారులకు పెద్ద దిక్కుగా నిలిచారు. తండ్రి, భార్యను గెలిపించుకున్న భాస్కరరావు ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి కాంగ్రెస్ పార్టీ తరఫున 1995–2000 మధ్య 24వ వార్డు నుంచి గెలుపొంది తనకు తిరుగు లేదని నిరూపించారు. బందరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా వరుసగా రెండు పర్యాయాలు సేవలందించారు. పోలీసుల అదుపులో నిందితులు హత్యోదంతంపై కేసు నమోదు చేసిన ఆర్ పేట పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్పీ రవీంధ్రనాథ్‌బాబు ఆదేశాలతో ఏఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ మహబూబ్ బాషా విచారణ చేపట్టారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీటీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన నిందితుల కోసం మరో నాలుగు బృందాలు వేట మొదలు పెట్టాయి. హత్య జరిగిన ఏడు గంటలు తిరక్కుండానే నిందితుల్లో ఇరువుర్ని సోమవారం రాత్రి అదుపులో తీసుకున్నారు. వీరిని గూడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. మరొక వైపు ఈ హత్య చేయించినట్టుగా అనుమానిస్తున్న చింతా చిన్ని కుటుంబం మొత్తం పరారీలో ఉన్నట్టుగా తెలియవచ్చింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో నిందితుడు చింతా చిన్ని కుట్రతోనే హత్య.. బాబాయి హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుట్రతోనే జరిగిందని మోకా భాస్కరరావు అన్న కుమారుడు మోకా రాజేష్ కన్నా ఆరోపించారు. ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతున్న బాబాయిని చూసి ఓర్వలేని కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు చింతా చిన్నా అతని అనుచరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. గుమ్మటాలచెరువు విషయంలో బాబాయి భాస్కర రావుకు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మధ్య వివాదం జరిగిందన్నారు. అప్పుడే కొల్లు రవీంద్ర బాబాయినుద్దేశించి ‘నేను మంత్రిగా చేశాను.. గుర్తు పెట్టుకో.. నీ అంతుచూస్తా’నంటూ తీవ్ర స్థాయిలో బెదిరించాడని, ఇప్పుడు అన్నంత పని తన అనుచరులతో చేసి చూపించాడని, ఇది ముమ్మాటికీ కొల్లు రవీంద్ర పనేనని ఆరోపించారు. -
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న భాస్కరరావు కుటుంబ సభ్యులు భాస్కరరావు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మంత్రి పేర్ని నాని సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర రావు (57) దారుణ హత్యకు గురయ్యారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ప్రశాంతంగా ఉండే బందరు నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు ఈ హత్య జరగడం జిల్లాలోనే సంచలనం రేపుతోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే ఆయన అనుచరుడు చింతా చిన్ని పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్టుగా భాస్కరరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర రవాణా సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అనుచరునిగా ఉన్న మోకా భాస్కరరావును అతని రాజకీయ ప్రత్యర్థులు సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో చేపల మార్కెట్లో అత్యంత పాశవికంగా హత మార్చారు. నిత్యం రద్దీగా ఉండే కోనేరు సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న చేపల మార్కెట్లో జరుగుతున్న పనులను మంత్రి ఆదేశాల మేరకు పర్యవేక్షించి తిరిగి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్న సమయంలో అక్కడే మాటు వేసిన ప్రత్యర్థులు భాస్కరరావుపైకి దూసుకొచ్చి ఒక్క ఉదుటన తోసేసారు. దీంతో కిందపడిపోయిన భాస్కరరావు గుండెల్లో రెండు చోట్ల, పొట్టపై మరొక చోట కత్తితో పొడిచారు. ఆ సమయంలో జేబులో ఉన్న సెల్‌ఫోన్‌కు కత్తిపోటు తగలడంతో బ్యాటరీ పేలిపోయింది. దీంతో చొక్కాతో పాటు వంటిపైనా కాలిన గాయాలయ్యాయి. నేరుగా గుండెల్లో గురిచేసి పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన భాస్కరరావును ఆటోలో హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. భాస్కరరావు మృతదేహం వద్ద రోదిస్తున్న మంత్రి పేర్ని నాని, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైన పేర్ని నాని దంపతులు తమ నాయకుడ్ని అత్యంత పాశవికంగా హతమార్చారని తెలుసుకున్న మార్కెట్‌యార్డు చైర్మన్ అచ్చాబా, పట్టణాధ్యక్షుడు షేక్ సలార్ దాదా, మండల కన్వీనర్ లంకే వెంకటేశ్వరరావులతో పాటు పెద్దఎత్తున పార్టీ శ్రేణులు ఆస్పత్రికి తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ఆస్పత్రికి చేరుకుని భాస్కరరావు మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య వెంకటేశ్వరమ్మ, కుమార్తె శిరీషలను ఓదార్చారు. హైదరాబాద్ ప్రయాణంలో ఉన్న మంత్రి పేర్ని నాని విషయం తెలియగానే హుటాహుటిన మచిలీపట్నం వచ్చి నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. భాస్కరరావు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఎదుగుదలను చూసి ఓర్వలేకనే... భాస్కరరావు తండ్రి ఒకసారి, భార్య వెంకటేశ్వరమ్మ రెండుసార్లు, ఆయన ఓసారి మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌గా రెండు పర్యాయాలు సేవలందించారు. ప్రస్తుతం జరగబోతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా మరోసారి బరిలో నిలిచారు. భాస్కరరావు గెలుపును అడ్డుకోలేమని తెలియడంతో ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే టీడీపీకి చెందిన ప్రత్యర్థి పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టారు.తమ చుట్టూ నేర చరిత్ర కలిగిన వారిని పెంచి పోషిస్తే ఇలాంటి రాజకీయ హత్యలు జరిగే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఆయన (కొల్లు రవీంద్ర) విజ్ఞతకే వదిలేస్తున్నా – పేర్ని నాని, రాష్ట్ర మంత్రి పక్కా పథకం ప్రకారమే... ఈ హత్యోదంతంలో ఇద్దరు కంటే ఎక్కువ మందే పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి భాస్కరరావు కదలికలపై రెక్కీ నిర్వహించే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నాం. ప్రత్యక్ష సాకు‡్ష్యలు, సీసీ పుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేపట్టాం. విచారణ కోసం మూడు బృందాలు, నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. ఏఎస్పీ వకుల్ జిందాల్ సారథ్యంలో డీఎస్పీ మహ్మద్ బాషా కేసు విచారణ చేస్తున్నారు. – ఎం.రవీంద్రనాథ్ బాబు, ఎస్పీ -
టీడీపీ నాయకుల హంగామా!
సాక్షి, విజయవాడ: మూడు రాజధానులు వద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం విజయవాడలో హంగామా సృష్టించారు. వీరి హడావుడి వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వేదిక కళ్యాణమండపంలో చేపట్టిన 24 గంటల దీక్షను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. అనంతరం చినకాకానిలో చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధనంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడులతో కలిసి వారు బయలుదేరారు. బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నారా లోకేష్, కొల్లు రవీంద్ర, రామానాయుడులు ఓవర్ యాక్షన్ చేశారు. దీంతో పోలీసులు లోకేష్‌ను తొట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధా పోలీసుస్టేషన్ వద్దకొచ్చి ధర్నా చేశారు. పోలీసులను తిట్టిపోసిన బొండా ఉమా చినకాకాని వద్ద హంగామా సృష్టించడానికి బయలుదేరిన ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా బొండా ఉమా ఓ ఎస్ఐతో దురుసుగా వ్యవహరించారు. ‘నోరు మూసుకో.. ఖాకీ చొక్కాను ఎలా విప్పదీయించాలో నాకు తెలుసు’ అంటూ నోరు పారేసుకున్నారు. నిరసన తెలిపేందుకు మాత్రమే అనుమతి తీసుకుని మాజీ మంత్రి దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై హైడ్రామా సృష్టించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన 24 గంటల దీక్షకు స్పందన కరువైంది. -
టీడీపీ నేతకు భంగపాటు
సాక్షి, మచిలీపట్నం: గ్రామ వాలంటీర్ వ్యవస్థపై బురద చల్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రకు ఆశాభంగం ఎదురైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో ఆయనకు శనివారం చుక్కెదురైంది. గ్రామ వాలంటీర్లు దసరా మామూలు అడిగారని పెన్షనర్లతో చెప్పించేందుకు ప్రయత్నంచి భంగపడ్డారు. తన అనుచరులతో కలిసి రుద్రవరంలో పర్యటించిన ఆయన గ్రామ వాలంటీర్ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కారు. దసరా మామూళ్ల కోసం పెన్షనర్లను వేధిస్తున్నారని నోటికి వచ్చినట్టు ఆరోపించారు. అయితే తమను ఎవరూ దసరా మామూలు అడగలేదని ఆయన ముఖంపైనే పెన్షనర్లు తెగేసి చెప్పడంతో కొల్లు రవీంద్ర ఖిన్నులయ్యారు. తమ కుటిలప్రయత్నం ఫలించకపోవటంతో ‘పచ్చ’ నాయకులు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. మంత్రి పదవిలో ఉండగా కొల్లు రవీంద్ర ఒక్కసారి కూడా తమ ఊరి వంక చూడలేదని, ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్లమని, వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికే పెన్షన్లు తెచ్చిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. -
ట్విట్టర్ వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
-
‘అధికారం పోయినా బలుపు తగ్గలేదు’
సాక్షి, విజయవాడ : చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. పబ్లిసిటీ కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్ల హక్కుల్ని వదిలేసి.. రాత్రికిరాత్రే పారిపోయి వచ్చింది చంద్రబాబు, లోకేష్ కాదా అని ప్రశ్నించారు. ‘2018 కల్లా పోలవరం పూర్తి చేస్తాం. రాసి పెట్టుకోండి’అని గొప్పలు చెప్పిన చంద్రబాబు ఏం చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల పేరుతో దండుకున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయినా వారి బలుపు తగ్గలేదని ఎద్దేవా చేశారు. జనం ఛీకొట్టినా.. మారరా..! దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని నాని హితవు పలికారు. జనం ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పురావడం లేదని అన్నారు. రాజకీయంగా బతికున్నాని చెప్పుకోవడానికే బందరు పోర్టుపై కొల్లు రవీంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు, ప్రొక్లెయిన్లు, జేసీబీ, బోర్వెల్ డ్రిగ్గింగ్ మిషన్లతో పోర్టు కడతారా అని ఎద్దేవా చేశారు. ఆ మిషన్లన్నీ బందరు నుంచి అద్దెకు తీసుకొచ్చినవేని చెప్పారు. పోర్టుకు పర్యావరణ అనుమతులు వైఎస్సార్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేచ్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. బందరు పోర్టు హామీని కూడా సీఎం జగన్ నిలబెట్టుకుంటారని అన్నారు. -
బొండా, బోడే, కొల్లు తొలిసారితో సరి..
సాక్షి, విజయవాడ : శాసన సభ్యులుగా ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని జనానికి చేరువు కాకుండా రూ.కోట్ల సంపాదనపై దృష్టి పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరించారు. మంత్రులతో పాటు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రజలు ఏ మాత్రం దయ చూపలేదు. అందర్ని ఓడించి ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని చూపించారు. పదవి అలంకారం కాదు.. బాధ్యతల సమాహారం అని భావించాల్సిన వారు అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. దౌర్జన్యం.. దోపిడీకి కొమ్ము కాయడంతో ప్రజలు ఎన్నికల సమరంలో ఓటు అనే ఆయుధంతో కుళ్లబొడిచారు. ‘మీ ప్రజా సేవ చాలులే’ అని ఓటుతో చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఘోర పరాజయానికి స్వయంకృతమే తొలి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన అవకాశాన్ని.. ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమవ్వడం వల్లే ఫలితాలు టీడీపీ అభ్యర్థులకు చేదు నిజాన్ని తెలియజెప్పాయి. స్వయంకృతాపరాధం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కొల్లు రవీంద్రకు తొలిసారి ఎన్నిక కాగానే మంత్రి పదవి వరించింది. అయినా ఆయన రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. బొండా ఉమామహేశ్వరరావు ఐదేళ్లలో నియోజకవర్గాన్ని తన సొంత జాగీరుగా భావించి పెత్తనం సాగించారు. స్వాతంత్య్ర సమరయోధుల భూములు కబ్జా, ఒక మహిళకు చెందిన ఇంటిని కబ్జా చేశారు. ఓ కుటుంబానికి చెందిన చిన్నారి మరణానికి కారణమయ్యారు. తన నోటి దురుసుకు కార్పొరేటర్లు కూడా ఆయన్ను చీదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి ప్రచారం చేసినా ఆయన విజయం సాధించలేకపోయారు. చివరకు 25 ఓట్లు తేడాతో ఓడిపోయారు. బోడే ప్రసాద్ కూడా తన పదవీ కాలంలో ఇసుక దందాలు చేయడం, బిల్డర్ల వద్ద ముక్కుపిండి దందాలు చేశారు. దీంతో ఈసారి ప్రజలు ఆయన్ను పదవికి దూరం చేసి కె.పార్థసారథికి పట్టం కట్టారు. అవినీతే కొంప ముంచింది.. దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, జలీల్‌ఖాన్, వల్లభనేని వంశీమోహన్, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. నీరు–చెట్టు పథకం కింద రూ.కోట్లు కొల్లగొట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై కంటే ఆ పనుల్లో వచ్చే వాటాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఐదేళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే కనీసం రూ.100 కోట్లకుపైగా సంపాదించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మంత్రి ఉమా అయితే జలవనరుల ప్రాజెక్టుల నుంచి నీరు–చెట్టు పథకం వరకు ఎక్కడ అవకాశం వచ్చినా అడ్డంగా దోచేశారు. నియోజకవర్గానికి ఆయన చెప్పుకోదగిన పనులు ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఆయనకు షాక్ ఇచ్చారు. కొల్లు రవీంద్ర మంత్రిగా చెప్పుకోదగిన ప్రతిభ కనబరచలేదు. కేవలం మంత్రిగానే కొనసాగారు తప్ప నియోజకవర్గానికి కానీ, జిల్లాకు గానీ ఆయన సాధించింది ఏమీ లేదు. దీంతో ఆయన్ను మచిలీపట్నం ప్రజలు తిరస్కరించారు. అవనిగడ్డ నుంచి డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం, రైతులకు సాగునీరు ఇప్పించలేకపోవడంతో ఆయనకు ఓటర్లు బాయ్.. బాయ్ చెప్పారు. మహిళా అభ్యర్థులకు నో చాన్స్ ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తంగిరాల సౌమ్య (నందిగామ), ఉప్పులేటి కల్పన (పామర్రు), షాబానా ఖాతూన్ (విజయవాడ పశ్చిమ) ఎన్నికల బరిలో దిగారు. ఇందులో తంగిరాల సౌమ్య, ఉప్పులేటి కల్పన ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వీరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఖాతూన్ తండ్రి జలీల్‌ఖాన్ పార్టీ ఫిరాయించడం, వక్ఫ్ ఆస్తులపై కన్నేయడంతో ఆమెను ప్రజలు పదవికి దూరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ మహిళా అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో చుక్కెదురైంది. -
టీడీపీ అసమర్థ పాలనకు ఇదే సాక్ష్యం
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల అసమర్థ పాలనపై గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు చొరవ చూపకుండా విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. మూలుగుతున్న ఇంటింటికి కుళాయి నిధులు గ్రామాల్లోని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మండలానికి రూ.37 కోట్లు కేటాయించింది. కేవలం నెల రోజుల్లో పథకాన్ని పూర్తి చేసి తాగునీటిని అందిస్తామని కొల్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం ఎక్కడా ప్రారంభం కాకపోవడం అసమర్థ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. మంగినపూడికి మంగళం అరిసేపల్లి, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, పోతేపల్లి, పోతిరెడ్డిపాలెం, పొట్లపాలెం, మంగినపూడి, చిరివెళ్లపాలెం, గోకవరం, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామ పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మంగినపూడి తాగునీటి పథకాన్ని2012లో అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2015 వరకు ఈ పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు పుష్కలంగా చేరింది. టీడీపీ నాయకులు పథకం నిర్వహణ కాంట్రాక్ట్ పనులు చేజిక్కించుకుని పైప్‌లైన్‌కు ఏర్పడుతున్న లీకులకు మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం ఏ గ్రామానికి తాగునీరు సక్రమంగా చేరకపోవడంతో ప్రజలు బిందె నీటిని రూ.20 కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఏడాది జరుగుతున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. డంపింగ్ యార్డు తరలింపులోనూ నిర్లక్ష్యమే.. స్థానిక రాజుపేట శివారులో శివగంగ మేజర్ డ్రెయిన్‌కు ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డును తరలించడంలోనూ పాలకులు విఫలమయ్యారు. రాజుపేట, కరెంటుకాలనీ ప్రజలతోపాటు మండలంలోని ఎస్ఎన్ గొల్లపాలెం, సీతారామపురం, సుల్తానగరం గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ఈ యార్డు ప్రభావం చూపుతోంది. దీన్ని అక్కడి నుంచి తరలించాలని గత పాలకవర్గం హయాంలోనే రూ.2.75 కోట్ల మునిసిపల్ నిధులను సమకూర్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా యార్డు తరలింపు అంగుళం ముందుకు కదలకపోవడం పాలనాతీరును ఎద్దేవా చేస్తోంది. తాగునీటి పథకాన్ని వీడని గ్రహణం చిన్నాపురం గ్రామంలో తాగునీటి పథకం ఏర్పాటు చేసి శివారు పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. పథకం నిర్మాణానికి భూమి కొలుగోలు ప్రక్రియ అప్పట్లోనే పూర్తయింది. ఈ ప్రాంతాన్ని రెండుసార్లు అప్పటి జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పరిశీలించారు. పాలకుల చొరవ లేకపోవడంతో పథకం పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలకుల అసమర్థత కారణంగా చిన్నాపురం గ్రామ పంచాయతీతోపాటు ఎన్‌గొల్లపాలెం, పెదయాదర, తుమ్మలచెరువు, వాడపాలెం, కొత్తపల్లెతుమ్మలపాలెం గ్రామ పంచాయతీల ప్రజలు ఐదేళ్లుగా ఉప్పునీరు తాగుతున్నారు. అప్రోచ్ నిర్మించ లేకపోయారు పల్లెతాళ్లపాలెం గ్రామం వద్ద తాళ్లపాలెం మేజర్ డ్రెయిన్‌పై నిర్మాణం చేసిన వంతెనకు అప్రోచ్‌ను నిర్మాణం చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు. గత పాలకవర్గం హయాంలోనే రూ.60 లక్షలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. సత్తెనపాలెం ఎస్సీకాలనీ, బోట్లవానిపాలెం గ్రామాలను కలుపుతూ పల్లెతాళ్లపాలెం గ్రామం మీదుగా కానూరు, పెదపట్నం సులువుగా చేరుకునేందుకు అప్పట్లో పేర్ని నాని ఈ వంతెన నిర్మాణం చేశారు. వంతెనకు ఒక వైపున అప్రోచ్ రోడ్డును నిర్మాణం చేసేందుకు ఓ రైతు వద్ద కొంత భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. సదరు రైతుకు పరిహారం మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. -
ప్రజాధనాన్ని ‘కొల్లు’గొట్టి
సాక్షి, కృష్షా : అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి కాదు అవినీతికి పాల్పడటానికి అని తెలుగుదేశం పార్టీ నాయకులు నిజం చేసి చూపారు. గడిచిన ఐదేళ్లలో మచిలీపట్నం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేకపోయినా.. అవినీతి సామ్రాజ్యాన్ని మంత్రి కొల్లు రవీంద్ర నిర్మించారు. కాంట్రాక్టు పనైనా, ఉద్యోగమైనా, మట్టి, ఇసుక, ఇలా సొంత లాభం లేకుండా ఏ పనీ చేయలేదు. పర్సంటేజీలు ముట్టచెబితే చాలు ఎలాంటి వ్యవహారమైనా క్షణాల్లో పరిష్క రిస్తారు. అంతేనా సహజ వనరులను దోచేస్తారు.. అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యం చేస్తారు.. సహజ వనరులకు రక్షణగా ఉండాల్సిన పాలకులే భక్షకులుగా మారారు. ప్రజాధనాన్ని సంరక్షించాల్సిన వారే.. అక్రమంగా బొక్కేశారు. ఇలా ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలు లూటీ చేశారు. కరకట్ట నిర్మాణం నాసిరకంగా చేపట్టడంతో జారిపోతున్న కట్టమట్టి మంత్రి కొల్లు రవీంద్ర అనుంగ అనుచరులైన కుర్రా నరేంద్ర, కొల్లూరి శివలు సైతం ఐదేళ్లుగా కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం. గతంలో ఏమీ లేని నరేంద్ర ప్రస్తుతం విజయవాడ నగరంలో రూ.5 కోట్ల విలువ చేసే 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్, మరో రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా బందరు పోర్టు పరిధిలోని ల్యాండ్ పూలింగ్‌లో ఉన్న భూములను తక్కువ ధరకు 15 ఎకరాల మేరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని విలువ ఎకరం రూ.15 లక్షలుండగా రూ.2.25 కోట్లు పలుకుతున్నాయి. రాజధాని అమరావతి పరిధిలో సైతం రూ.6 కోట్లు విలువ చేసే భూములు కొనుగోలు చేశారంటే ఏ మేరకు దండుకున్నారో అర్థం అవుతోంది. ఇందులో మంత్రికి సైతం వాటాలు ఉన్నట్లు తెలిసింది. మరో అనుచరుడు కొల్లూరి శివ మాత్రం తానేమీ తీసిపోని విధంగా అక్రమాలకు తెగడబ్డారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో రూ.4 కోట్లు విలువ చేసే కమర్షియల్ బిల్డింగ్ ఉంది. మచిలీపట్నంలో సైతం రూ.కోట్లు విలువ చేసే ఇళ్లు సైతం కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే మంత్రి, మంత్రి అనుచరులు ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి దోపిడీలకు తెగబడ్డారో అవగతం అవుతోంది. ఎక్సైజ్‌లో కుమ్మేశారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 నుంచి రూ.40 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఇలా మంత్రిగా ఉన్న రెండేళ్లలో రూ. 60 నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి తెర లేపారు. బార్లు, బ్రాందీ షాపులపై ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తారు. దాడుల్లో షాపుల లైసెన్స్ రద్దు చేయిస్తానని బెదిరింపులకు దిగుతారు. అనంతరం మంత్రి అనుచరులైన కుర్రా నరేంద్ర, కొల్లూరి శివలు రంగంలోకి దిగుతారు. షాపు లైసెన్స్ తిరిగి పునరుద్ధరిస్తామని షాపు యజమానుల వద్ద నమ్మబలుకుతారు. ఇలా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారంతో సుమారు రూ.15 కోట్లకు పైగా దండుకున్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖలో డిజిటలైజేషన్ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్ టెండర్ల అనంతరమే ప్రభుత్వ పెద్దలకు రూ.5 కోట్ల కమీషన్ చెల్లించాడు. అది చాలదన్నట్లు తాను సంతకం పెట్టానని, తనకేమైనా చూడాలని సదరు కాంట్రాక్టర్ వద్ద మంత్రి రూ.2 కోట్లు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ స్టేషన్ల నుంచి ప్రతి నెలా మామూళ్లు వసూలు చేసేవారు. ఈ తంతు మొత్తం తన పీఏ స్వయంగా చూసుకునే వాడని ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి జిల్లా నుంచి నెలకు రూ.2 లక్షలు చొప్పున రెండేళ్లకు రూ.52 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గుట్టుగా గుట్కా దందా నిషేధిత గుట్కా వ్యాపారం మంత్రి అనుచరులు, ఓ పీఏ కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులను పావులుగా వాడుకుని మిగిలిన విక్రయదారులపై పోలీసులతో దాడులు చేయించి వ్యాపారాన్ని మూయించేశారు. స్వయంగా మంత్రి అనుచరులే భీమవరం నుంచి ప్రతి రోజూ రూ.3 లక్షలు విలువ చేసే సరుకు దిగుమతి చేసుకోవడం.. బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని 150 బడ్డీ కొట్లకు సరుకు సరఫరా చేస్తుంటారు. ప్యాకెట్ రూ.5కు కొనుగోలు చేయడం.. బడ్డీ కొట్లకు రూ.10కి విక్రయించి రూ.లక్షలు గడిస్తున్నారు. ఇది చాలదన్నట్లు గుట్కా విక్రయించే బడ్డీ కొట్లకు సరఫరా చేయడం.. తిరిగి ఏ కొట్టుకు సరుకు అందించామన్న సమాచారం పోలీసులకు చెప్పడం.. వారిపై దాడులు చేయిస్తున్నారు. ఇదే అదునుగా సెటిల్ మెంట్లకు దిగుతున్నారు. ఒక్కో బట్టీ నిర్వాహకుడి వద్ద పోలీసులకు ఇవ్వాలని రూ.లక్ష వసూలు చేయడం అందులో రూ.40 వేలు దిగమింగుతున్నారు. గత రెండేళ్లలో ఒక్కో బట్టీ నిర్వాహకుడిపై మూడు సార్లు పోలీసు దాడులు చేయించారు. దాడుల్లో పోలీసులకు ముట్టజెప్పిన మొత్తం పోగా.. మంత్రి అనుచరులు, ఓ పీఏ రూ.1.20 కోట్ల వరకు దండుకున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో గుట్కాను ఆర్‌పేట పోలిస్ స్టేషన్ పరిధిలో గుట్కా విక్రయిస్తున్న వారి నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి పీఏ స్టేషన్‌కు వెళ్లి సరకు తీసుకెళ్లేలా చేశారంటే గుట్కా వ్యాపారానికి అండదండలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది. రైస్ మిల్లులోనూ అంతే.. కొల్లు రవీంద్రకు చెందిన రైస్‌మిల్ ధాన్యం కొనుగోలు అనంతరం ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు వాటిని ఆడించి నిర్దేశించిన సమయంలో ప్రభుత్వానికి బియ్యం అప్పజెప్పాలి. నిబంధనల మేరకు కమీషన్ తీసుకోవాలని. కానీ మంత్రి ఇలాఖాలో మాత్రం అలాంటి పప్పులు ఉడకడం లేదు. మంత్రి తన సొంత రైస్ మిల్లును అడ్డాగా పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి పాసు పుస్తకాలు బలవంతంగా తీసుకోవడం.. రూ.3 కోట్లు విలువైన ధాన్యం కొన్నట్లు దొంగ లెక్కలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వానికి ధాన్యం అప్పజెప్పాల్సిన నిర్ణీత సమయం కంటే అదనంగా తీసుకుంటున్నారు. ఈ వ్యవధిలో బహిరంగ విపణిలో స్టోర్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా ధాన్యం సరఫరా పేరిట రవాణా చార్జీలు సైతం పొందుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఇదే తంతు నడుపుతూ సుమారు రూ.3 కోట్ల వరకు దిగమించినట్లు తెలిసింది. దీనిపై సీబీఐ అధికారులు లోతైన విచారణ జరిపితే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది. భారీగా ఆస్తులు గోపాల్‌నగర్ శ్మశానాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు నాలుగేళ్లు దండుకున్న అక్రమ సంపాదనతో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఇవన్నీ బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్, బందరులో రూ.6 కోట్ల విలువ చేసే స్థలాలు కొనుగోలు చేశారు. కృత్తివెన్ను మండలంలో రాంబాబు, రంగా, పవన్, గుప్తాలను బినామీలుగా పెట్టి 38 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ భూమి రిజిస్ట్రేషన్ విలువ రూ.2.80 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.6.84 కోట్లు పలుకుతోంది. బందరు మండలంలోని రాడార్ కేంద్రం వద్ద పల్లపాటి సుబ్రహ్మణ్యంను బినామీగా పెట్టి 40 ఎకరాల స్థలం(22–ఏ) తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఎకరం రూ.15 లక్షలు చొప్పున రూ.6 కోట్లు విలువ చేసే స్థలం కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లో సైతం రూ.కోట్లు విలువ చేసే స్థలాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి ప్రాంతంలో సైతం రూ.కోట్లు విలువ చేసే పొలాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్రమాల్లో మరికొన్ని.. రూ.లక్ష విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుకు రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా నాలుగేళ్లుగా రూ.కోటి వరకు స్వాహా చేశారు. ఒక్కో రైతు రథం ట్రాక్టర్ మంజూరుకు లబ్ధిదారుడి నుంచి రూ.30 వేలు, ట్రాక్టర్ కంపెనీ నుంచి రూ.30 వేలు గుంజుతున్నారు. 112 రైతు రథాలకు సంబంధించి రూ.62 లక్షలు దండుకున్నారు. అదనపు తరగతి నిర్మాణాల్లో ఒక్కో గదికి రూ.40 వేలు చోప్పున నాలుగున్నరేళ్లుగా 25 గదులకు సంబంధించి రూ.10 లక్షలు దండుకున్నారు. రూ.1.50 కోట్లు బీనామీ పేర్లతో కాల్‌మనీకి తిప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చి ఏళ్లయినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో ప్రశ్నించిన సదరు అభ్యర్థికి రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్లో లోన్ ఇప్పిస్తానని చెప్పారు. మంత్రి అనుచరుడు కన్నా ప్రసాద్ బినామీగా బందరు పట్టణంలో చేపట్టిన డివైడర్ గ్రిల్ వర్క్‌లో రూ.లక్షలు స్వాహా చేశారు. అంతేగాక బీచ్‌ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో సీఎం పర్యటనలో సైతం భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. -
ఏ ముఖం పెట్టుకుని వచ్చారు..
వజ్రపుకొత్తూరు రూరల్: తిత్లీ తుఫాన్ ప్రభావంతో సర్వం కోల్పోయిన తమను ఇన్నాళ్లూ గాలికి వది లేసి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర, పలాస ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరిని తుఫాన్ బాధితులు కడిగి పారేశారు. మండలంలోని గరుడబద్ర, ధర్మపురం, చినవంక, పెద్దబొడ్డపాడు, సీతాపురం గ్రా మాల్లో వారు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారికి గ్రామాల్లో బాధితులు అడుగడుగునా నిలదీశారు. తుఫాన్ వచ్చిన తర్వాత మూడు రోజులు రహదారుల్లో భారీ వృక్షాలు పడి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, పసి పిల్లలకు పాలు, నీరు, భోజనం లేక ఆకలికి అలటించామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టలేదని అన్నారు. గ్రామాల్లో ఇళ్లు కూలిపోయి నిలువ నీడ లేకుండా అయిపోయిందని అన్నారు. ఇంతటి విలయం వస్తే కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గరుడబద్రలో పాడైన ఆహార పొట్లాలు అందించారని వాపోయారు. బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారు అక్కడి నుంచి జారుకున్నారు. -
మంత్రులపై తుపాను బాధితుల ఆగ్రహం
వజ్రపుకొత్తూరు: తుపాను సాయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కారుపై ఉద్దానం ప్రజలు కన్నెర్ర చేశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడితే తీరిగ్గా ఇప్పుడు వస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అల్లుడు వెంకన్న చౌదరిని సోమవారం రోడ్డుపైనే అడ్డుకుని రెండు గంటల పాటు మండుటెండలో నిలబెట్టారు. అనంతరం పూండి కూడలి నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో పెద్దమురహరిపురం గ్రామం వరకు నడిపించి తీసుకెళ్లారు. పూండి పరిసర ప్రాంతాలైన పీఎంపురం, సీఎంపురం, సీతంపేట, గూనాలపాడు, యూజీపురం, అమలపాడు తదితర గ్రామాల నుంచి వచ్చిన యువకులు, మహిళలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని నిలదీశారు. సీఎం డౌన్ డౌన్, మంత్రి కొల్లు రవీంద్ర, వెంకన్నచౌదరి గోబ్యాక్ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తంచేశారు. అంతకుముందు బాధిత గ్రామాల ప్రజలు పూండిలోని వైఎస్సార్ కూడలి వద్ద రహదారిని దిగ్బంధించారు. ఈలోగా మంత్రి అక్కడకు చేరుకోవడంతో బాధితులంతా ఆయన కాన్వాయ్‌ని చుట్టుముట్టారు. తిత్లీ తుపాను వచ్చి ఐదు రోజులు కావస్తోంది.. బతుకులు ఛిద్రమై ఏడుస్తుంటే ఇప్పుడా మా గ్రామానికి వచ్చేది అంటూ నిలదీశారు. బాధితుల ఆగ్రహం చూసి మంత్రి నోట మాట రాలేదు. బాధితులకు హెచ్చరిక ఇదిలా ఉంటే.. బాధితులు ఓ వైపు తమ ఆవేదన వినిపిస్తుంటే వెంకన్న చౌదరి వారిని ఉద్దేశించి ‘అడ్డు తొలగుతారా.. పోలీసులను రప్పించి తొలగించమంటారా’.. అంటూ దురుసుగా ప్రవర్తించడంతో బాధితులు మరింత రెచ్చిపోయారు. తొలగించండి చూద్దాం.. అంటూ ఎదురుతిరిగారు. నష్టపరిహారం, పునరావాసంపై స్పష్టమైన హామీ ఇస్తేగానీ వదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మంత్రి వారితో పాటు రెండు గంటలు నడిచారు. దారిలో ఓ మహిళ చంటి బిడ్డతో ఏడుస్తూ ఆందోళన వ్యక్తంచేసింది. పాలు పట్టేందుకు పాల ప్యాకెట్లు కూడా లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ఈలోగా ప్రత్యేక పోలీసు దళంతో జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆయనకు రక్షణగా నిలిచారు. పెద్దమురహరిపురం గ్రామానికి చేరకున్న మంత్రికి గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షుడు కళిశెట్టి గోపాల్ సమస్యలు వివరించారు. అడుగడుగునా నిరసనలు మరోవైపు.. తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. పీఎంపురం, రెయ్యిపాడు గ్రామాల్లో రైతులు మంత్రులు, అధికారుల తీరుపై వ్యతిరేకత వ్యక్తంచేశారు. అమలపాడు, యూఆర్‌కేపురం, కంబారాయుడుపేట గ్రామాల్లో మంత్రికి నిరసనల సెగ తగిలింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ పాత టెక్కలి మీదుగా వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఆయనకూ నిరసనలు చుట్టుముట్టాయి. కష్టాల్లోనూ దాతృత్వం కాసులు కురిపించే తోటలు నేలమట్టమై పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తమకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్న పొరుగు వారిని అక్కున చేర్చుకుని తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించడం ద్వారా చాలామంది రైతులు తమలోని ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. ‘ఒకరికొకరు.. అందరికి అందరం..’ అనే మాటను వారు నిజం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం చినబైపల్లిలో ఇటీవలి తుపాను బీభత్సానికి పలు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోగా మరికొన్ని ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఈ పరిస్థితుల్లో మూడు కుటుంబాల వారు మంచాల కింద తలదాచుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. గూడు కోల్పోయిన ఇలాంటి ఎనిమిది కుటుంబాల వారికి అదే గ్రామానికి చెందిన పి. మధుసూదనరావు తన ఇల్లూ దెబ్బతిన్నప్పటికీ వారికి ఆశ్రయం కల్పించారు. ‘ఇలాంటి కష్టాల్లో ఒకరికొకరు తోడూనీడలా ఉండకపోతే బతికి ఏమి ప్రయోజనం’.. అని మధుసూధనరావు భార్య ‘సాక్షి’తో అన్నారు. వీరిలాగే చాలామంది రైతులు తమ గ్రామాల్లో అనేకమందికి ఆశ్రయం కల్పించి దాతృత్వం చాటుకుంటున్నారు. మరోవైపు.. ‘మా బిడ్డ కరిష్మ విశాఖలో బి.ఫార్మసి చదువుతోంది. దసరాలోగా ఫీజులు కట్టాలని కాలేజీ వారు నోటీసులు పంపారు. తుపాను బాధితుల పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి’.. అని మధుసూదనరావు భార్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదేనా ఆదుకునే తీరు? నేను చంటి పిల్లతో ఉన్నాను. తాగేందుకు నీరులేదు. బిడ్డకు పాల ప్యాకెట్ కూడా అందలేదు. సహాయక చర్యలేవీ చేపట్టలేదు. ఏం తిని బతకాలి? కిలో టమాటా రూ.80కు.. అగ్గిపెట్టె రూ.6కు అమ్ముతున్నారు. సర్వం కోల్పోయిన వారిని ఇదేనా ఆదుకునే తీరు. ఇప్పటికే ఐదు రోజుల గడిచిపోయాయి. ఇంకా అంధకారంలోనే ఉన్నాం. మా గ్రామం వైపు చూసేవారే లేరు. – కె. రోహిణి, పీఎంపురం బియ్యం, సరుకులు ఇవ్వలేదు ఇల్లూ వాకిలి కోల్పోయి రోడ్డున పడ్డాం. రహదారులపై పడిన చెట్లను మేమే తొలగించాం. అధికారులు, ప్రజాప్రతినిధుల జాడే కరువైంది. కోట్లాది రూపాయల జీడి, కొబ్బరి చెట్లను కోల్పోయాం. చేతిలో చిల్లి గవ్వలేదు. నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. అయినా మా గ్రామంలో బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేయలేదు. – ఎస్. వినోద్, పెద్దమురహరిపురం -
మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, కృష్ణా జిల్లా : ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు పెను ప్రమాదం తప్పింది. కంకిపాడు గుండా వెళుతున్న మంత్రి ఎస్కార్ట్‌లోని వాహనానికి ద్విచక్ర వాహనం ఎదురుగా రావడంతో ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తూ ఆయన ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా వేరే వాహనంలో ఆయన విజయవాడకు చేరుకున్నారు. -
మంత్రికి వైఎస్ఆర్సీపీ సభ్యుల వినతి పత్రం
కువైట్ : వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ సభ్యులు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష ద్వారా స్వస్ధలం వెళుతున్న వారికి ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి కోల్లు రవీంద్రకు వినతి పత్రం అందించారు. కువైట్ ప్రభుత్వం జనవరి 29న ఆఖమా లేని వారు ఏజంట్ల చేతిలో మోసపోయి పాస్ పోర్ట్ లేనివారిపై ఎటువంటి కేసులు, జరిమానా లేకుండా వెళ్లి మళ్ళి కొత్త వీసాలకు అవకాశం కల్పించింది. దీంతో కువైట్‌లో ఉన్న తొమ్మిది వేల మంది అభాగ్యులు ఏడు సంవత్సరాల తరవాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నారు. వారిలో టికెట్లకు డబ్బులు లేక అవస్ధలు పడుతున్న అభాగ్యలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి అభాగ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గతంలో పత్రిక ముఖంగా గల్ఫ్, కువైట్ ప్రతినిధులు ఏపీఎన్ఆర్టీ, ప్రభుత్వం పై విమర్శించగా ఎట్టకేలకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్ఆర్ఐ మంత్రి కొల్లు రవీంద్ర ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు చైర్పర్సన్ వేమూరి రవి ఈ నెల 20న కువైట్ విచ్చేసిన సందర్బంగా తెలుగు వారి తరుపున వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కమిటీ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తెలుగువారి కష్టాలపైన వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ.. క్షమాబిక్ష సమయంలో ఇండియా వచ్చిన అభాగ్యులను అన్ని విధాలుగా ఆదుకొని వారికి పునరావాసం కల్పించాలని కోరారు. ఇక్కడ నుంచి వెళ్లే పేద వారిని ప్రభుత్వ తరుపున టికెట్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అలాగే మన తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు దిగేటట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మనవి చేశారు. కో కన్వినర్లు గోవిందు నాగరాజు ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ.. కువైట్ లో పని చేస్తున్నపుడు అకస్మాత్తుగా మరణించిన వారి పార్ధవ శరీరాన్ని భారత దేశం లోని విమానాశ్రయం తమ స్వస్థలికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కువైట్ వచ్చిన పేద బడుగు వర్గాల వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను రద్దు చేయవద్దని కోరారు. ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మీడియా ప్రతినిది మాట్లాడుతూ.. కువైట్ ప్రమాదంలో మరణించిన వారికీ, ప్రమాదంలో వికలాంగులు అయిన వారికీ భీమా ద్వారా ఆదుకోవాలన్నారు. దొంగ ఏజంట్ల నుంచి అమాయక ప్రజలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు అబుతురాబ్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ విభాగం లీడర్ రమణ యాదవ్, యువజన విభాగం లీడర్ మర్రి కళ్యాణ్, ఎస్సీ, ఎస్టీ విభాగం బీఎస్ సింహ, పిడుగు సుబ్బారెడ్డి, షేఖ్ సబ్దర్ తదితరులు పాల్గొన్నారు. -
'అందుకే లోకేశ్‌ను పప్పు అంటున్నారేమో'
-
'అందుకే లోకేశ్‌ను పప్పు అంటున్నారేమో'
విజయవాడ: మంత్రి నారా లోకేశ్ మంచివాడని, అందుకే ఆయనను పప్పు అంటున్నారేమోనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. పప్పు అనేది బూతు కాదని ఆయన అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని, ఖజానా నిండగానే నిరుద్యోగభృతి చెల్లిస్తామని చెప్పారు. కృష్ణా నది కబ్జా విషయాన్ని టీవీలో చూశానని.. కబ్జాకు పాల్పడిన వారిలో తమ పార్టీ నేతలు ఎవరున్నా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నిరుగుద్యోగులకు వెంటనే భృతి చెల్లించాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, నెలనెలా రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నేటికీ వాటిని నెరవేర్చలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత లేఖతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. త్వరలో యూత్ పాలసీని ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంప్లాయిమెంట్ బోర్డు ద్వారా నిరుద్యోగుల జాబితా ప్రకటిస్తామన్నారు. నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. -
త్వరలో స్పోర్ట్స్ పాలసీ: కొల్లు రవీంద్ర
అమరావతి: యువతను ముందుకు తీసుకుని వెళ్లే గురుతర బాధ్యత మాపై ఉందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం యువతకు పెద్ద ఏత్తున ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూ.500 కోట్లు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతి ఏవిధంగా యువతకు చేరితే మంచిదో ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి యువతతో మాట్లాడి నిరుద్యోగ భృతి ఎలా వారికి చేరాలో నిర్ణయిస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మిస్తామన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తామన్నారు -
ఎవరెస్టు పర్వతారోహణ బృందం ఎంపిక
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ కోసం ఆరుగురు సభ్యల బృందాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర యువజన సర్వీసులశాఖమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది ఔత్సాహికులకు వివిధ పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనపరిచిన ఆరుగురిని ఎంపిక చేశామని తెలిపారు. ఈ బృందం ఈ నెల 12వ తేదీన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంప్ నుంచి తమ ప్రయాణం మొదలు పెడుతుందని అన్నారు. మే 15 నుంచి 25వ తేదీల మధ్య ఈ బృందం ఎవరెస్ట్ కు చేరుతుందని అంచనా చేస్తున్నట్లు తెలిపారు. ఎవరెస్ట్ పై భారత పతాకాన్ని ఎగురవేస్తారని తెలిపారు. మొత్తం రూ. రెండు కోట్ల నలభై లక్షల రూపాయలను ఈ మిషన్ కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి పటిష్టమైన శిక్షణ తీసుకున్న అభ్యర్థులను ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లు అభినందించారు. -
నేడు జిల్లాకు మంత్రి కొల్లు రవీంద్ర
అనంతపురం సప్తగిరి సర్కిల్ : నేడు జిల్లాకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రానున్నారని జిల్లా అధికార యంత్రాంగం పెర్కొంది. గన్నవరం నుంచి బెంగుళూరుకు విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పరిగిలో జరిగే జన్మభూమి మా ఊరులో పాల్గొంటారు. మధ్యాహ్నం కళ్యాణదుర్గంలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో బెంగుళూరుకు బయలుదేరి వెళ్తారన్నారు. -
పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి, ఎంపీ రహస్య భేటీ
భూ సమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులు వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వని అధికారులు టీడీపీ ముఖ్యనాయకులతో మంత్రి, ఎంపీ రహస్య సమావేశం అధికారపార్టీ నాయకులతో నాలుగు కమిటీలు భూసమీకరణను వ్యతిరేకిస్తే తరిమికొడతామన్న మంత్రి కొల్లు పోతేపల్లి, కోన గ్రామాల్లో ఎంఏడీఏ అధికారుల నిర్భందం మచిలీపట్నం : బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణకు అనుకూలంగా టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. నయానో, భయానో రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతర, అంగీకార పత్రాలు తీసుకుంటున్న ఎంఏడీఏ (మడా) అధికారులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులకు అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలేదు. కోన గ్రామంలో భూసమీకరణకు తమ భూములు ఇచ్చేది లేదని అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతులు ఆ మేరకు ధ్రవీకరణ పత్రంపై సంతకం చేసి ఇవ్వమంటే అధికారులు నిరాకరిస్తున్నారు. ఫారం-2 ఇచ్చిన రైతులకు ఆ పత్రం అందినట్లు సంతకం చేసి ఇవ్వాలని ఎక్కడా లేదని, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని కోన డెప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కోన గ్రామానికి వెళ్లి ఎంఏడీఏ అధికారులతో మాట్లాడారు. ఫారం-2 ఇచ్చినట్లుగా సంతకం చేయాలని కోరగా తన వద్ద స్టాంపు లేదని మంగళవారం సంతకాలు చేస్తానని సుబ్బరాజు బదులిచ్చారు. అయితే సంతకాలు చేసిన తరువాతే గ్రామం నుంచి కదలాలని పంచాయతీ కార్యాలయం వద్ద సుబ్బరాజు, ఇతర సిబ్బందిని రైతులు నిర్భందించినంత పనిచేశారు. పోతేపల్లిలో రైతులు ఇచ్చిన అభ్యంతర ఫారాలు అందినట్లు డెప్యూటీ కలెక్టర్ బదులుగా తాను సంతకం చేస్తానని వీఆర్వో ప్రసాద్ చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఆయన్ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పేర్ని నాని అక్కడకు వెళ్లి రైతులతో మాట్లాడి వీఆర్వోను బయటకు తీసుకువచ్చారు. వెలువడని గడువుపెంపు ఉత్తర్వులు భూసమీకరణకు సంబంధించి అభ్యంతరాలు, అంగీకార పత్రాలు తీసుకునే గడువును నవంబర్ 4వ తేదీ వరకు పెంచినట్లు ప్రకటించినా సోమవారం సాయంత్రానికి కూడా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. డీఆర్డీఏ కార్యాలయంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటి వరకు అధికారులు, పాలకులు ప్రకటించారు. సోమవారం డీఆర్డీఏ కార్యాలయం కాదు, జిల్లా వ్యవసాయశాఖ కోసం నూతనంగా నిర్మించిన భవనంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులకు సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తాం టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరులతో మాట్లాడారు. తాను, ఎంపీ కొనకళ్ల నారాయణరావు నెల రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతులను ఒప్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భూసమీకరణకు అడ్డుపడే వారిని తరిమికొడతామన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. భూసమీకరణ ద్వారా భూములను ఇచ్చిన రైతులకు మెగా టౌన్షిప్లో ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క ప్లాట్ విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. రైతులు భూసమీకరణకు సిద్ధంగానే ఉన్నారని ఎంపీ చెప్పారు. టీడీపీ నేతలతో రహస్య భేటీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు సోమవారం మచిలీపట్నం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులతో ఆర్అండ్బీ అతిథిగృహంలో రహస్య సమావేశం నిర్వహించారు. భూసమీకరణకు రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించే బాధ్యతను కీలకమైన నాయకులకు అప్పగించారు. ఇందుకు మండలంలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్‌తో కమిటీలను ఏర్పాటు చేసి వారికి కొంత మంది నాయకులను అప్పగించారు. ఈ కమిటీల ద్వారా ఆయా సామాజిక వర్గాలు ఉండే గ్రామాలను ఎంపిక చేసుకుని రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. రైతులు భూసమీకరణకు అంగీకరించడం లేదని, భూమి కోల్పోతే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు భావిస్తున్నారని, అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ సక్రమంగా లేదని ఎంపీ, మంత్రి దృష్టికి ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు టీడీపీ నాయకులు తీసుకెళ్లారని సమాచారం. -
నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక
అనంతపురం అర్బన్ : బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు అనంతపురం చేరుకుని 10.30 వరకు ఆర్అండ్బి అతిథి గహంలో బసచేస్తారు. అనంతరం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. 1.15 గంటలకు రోడ్డు మార్గంలో రాయదుర్గం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన నీరు– చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు. -
మంత్రి కొల్లును బుక్ చేసిన మంత్రి పల్లె
-
బీసీలు, కాపుల సంక్షేమానికి ఏపీ సర్కార్ కృషి
విశాఖపట్టణం : రాష్ట్రంలో బీసీలు, కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మంగళవారం విశాఖపట్టణం జిల్లా చోడవరంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న మరో మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గ్రామాలలో రూ. 3 వేల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నామని చెప్పారు. 14న ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రోడ్లు వేసేందుకు పంచాయతీలు ముందుకు రావాలని అయ్యన్నపాత్రుడు కోరారు.