Perni Nani Satirical Comments on TDP Kollu Ravindra - Sakshi
Sakshi News home page

అబ్బా.. ఏమీ యాక్టింగ్‌ కొల్లు రవీంద్ర! బందరు కమల్‌హాసన్‌

Published Tue, Feb 7 2023 12:34 PM | Last Updated on Tue, Feb 7 2023 2:02 PM

Perni Nani Satirical Comments On TDP Kollu Ravindra - Sakshi

సాక్షి, కృష్ణా:  టీడీపీ నేత కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగనీతులని.. కానీ చేసేదంతా వేరేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. బందరులో కొల్లు రవీంద్ర చేసిన నటన ముందు కమల్‌ హాసన్‌, ఎస్వీ రంగారావు లాంటి నటుల యాక్టింగ్‌ కూడా దిగదుడుపేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

తాజాగా మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై కొల్లు రవీంద్ర దాడి చేశారు. డ్రామాలు చేసి.. దాడులు చేసి.. కేసులు పెట్టించుకుని మరీ బెయిల్‌ వస్తే ఊరేగింపులు చేసుకుంటాడు. పదవి ఉన్నప్పుడు పని చేయడు. కానీ, పదవి పోగానే ఇలాంటి దిక్కుమాలిన డ్రామాలు ఆడతాడు. కొల్లు రవీంద్ర బందరుకు కమల్‌ హాసన్‌ లాండోడని వ్యాఖ్యానించారు.

‘ప్రభుత్వ ఆస్తులపై కన్నేసింది ఎవరు? హైదరాబాద్‌ నడిబొడ్డున టీడీపీ పార్టీ ఆఫీస్‌ ఉన్న స్థలం ప్రభుత్వ భూమి కాదా? మంగళగిరిలో టీడీపీ పార్టీ ఆఫీస్‌ ఉన్న స్థలం ఎవరిది?.. ప్రభుత్వ భూమి కాదా?.  అబద్ధాలు, మోసాలు, డ్రామాలు ఆడే ఈ జన్మ అవసరమా? కొల్లు రవీంద్ర అని విమర్శలు గుప్పించారు పేర్ని నాని. 

మచిలీపట్నం టీడీపీ కార్యాలయానికి యాభై సెంట్ల ప్రభుత్వ భూమి లీజుకి కావాలని అడిగింది నువ్వు కాదా? మీ పార్టీ కార్యాలయానికి స్థలం అడిగి.. ఇప్పుడు కబుర్లు చెప్తున్నావా? పోలీసులపై దాడులు చేసి.. మళ్లీ రక్షణకు పోలీసులనే ఆశ్రయిస్తారా?. బందరులో పోలీసులను ఎందుకు కొట్టారు?. కొల్లు రవీంద్ర లాంటి వ్యక్తుల వల్లే రాజకీయ నాయకుల విలువలు ప్రజల్లో దిగజారిపోతున్నాయని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement