పీతల సుజాత(ఫైల్)
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగదని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు, సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎన్టీఆర్ పై అభిమానంతో తన కుమారుడికి ఆయన పేరు పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు పేరు మారుస్తారా లేదా ఎన్టీఆర్ పేరుందని కుమారుడిని వదులుకుంటారా అని ప్రశ్నించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కుపెట్టినందుకు తెలుగుజాతి గర్వపడాలని ఏపీ బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.