'ఎన్టీఆర్ పేరు పెట్టడం.. ఆయనస్థాయి తగ్గించడమే'
శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన స్థాయిని తగ్గించడమేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కేవలం డొమెస్టిక్ టెర్మినల్కు మాత్రమే ఆయన పేరు పెట్టడం ఏంటని అన్నారు.
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, వైశ్రాయ్ హోటల్లో ఆయనపై చెప్పులు వేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని బీజేపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని కూడా రఘువీరారెడ్డి ఆరోపించారు.