హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే దీనిపై చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల ఆధిపత్యాన్ని తెలంగాణలో చూపిస్తే సహించేది లేదన్నారు. టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీమాంధ్ర ఆధిపత్యం వద్దు అనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేశామన్నారు. ఎయిర్పోర్టులో రెండు రన్వేలు ఉన్నప్పుడు రెండు పేర్లు పెట్టడానికి ఉంటుందని జీవన్ రెడ్డి అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఒకే రన్వే ఉన్నందున ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇదే అంశంపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. దాందో సమావేశాలు అరగంట పాటు వాయిదా పడ్డాయి.
కాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో బేగంపేట విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది.
తెలంగాణలో సీమాంధ్రుల ఆధిపత్యమా..?
Published Fri, Nov 21 2014 10:20 AM | Last Updated on Sun, Apr 7 2019 4:32 PM
Advertisement
Advertisement