shamshabad airport
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. విమానం ఎమర్జెనీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెనీ ల్యాండింగ్ అయ్యింది. కౌలాలంపూర్ ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఏటీసీ అధికారులకు పైలట్ సమాచారం ఇచ్చారు. పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. 73 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.వారం క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులు ఫైట్ ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించారు.ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావటంతో.. పైలట్ విమానాన్ని డౌన్ చేశాడు. అయితే అప్పటికే రన్‌వేపై టేకాఫ్ తీసుకోవడానికి మరో విమానం రెడీగా ఉండగా.. దాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బాంబు ఉందని సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత అదొక ఫేక్ కాల్‌గా తేల్చారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈ మధ్యకాలంలో నగరంలోని స్కూళ్లకు సైతం ఇదే తరహాలో మెయిల్స్ బెదిరింపులు వస్తుండడం తెలిసిందే. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అమరారాజ బ్యాటరీ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం వద్ద నిర్మాణంలో ఉన్న అమరారాజా బ్యాటరీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వెంటనే.. మూడో అంతస్తులోకి వ్యాపించాయి. దీంతో, అక్కడ పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
శంషాబాద్.. షంషేర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐ) అగ్రగామిగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా డేటా వెల్లడించిన విశేషాలివే...మన తర్వాతే బెంగళూరుమునుపటి ఏడాదితో పోలిస్తే గత ఏప్రిల్–సెప్టెంబర్‌లో భారతదేశంలోని మొదటి ఐదు మెట్రోలలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అత్యధిక వృద్ధిని సాధించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మన ఎయిర్‌పోర్ట్‌లో 11.7 శాతం పెరుగుదల నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న బెంగళూరు (10.1), కోల్‌కతా (9.4), ఢిల్లీ (7.4), ముంబై (5.4), చెన్నై 3.3 శాతం రద్దీని పెంచుకున్నాయి. దేశ విదేశీ ప్రయాణికుల రద్దీతో...ప్రస్తుతం 72 దేశీయ, 18 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతున్న శంషాబాద్ విమానాశ్రయం అమెరికా, యూకేలకు దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తోంది. గత అక్టోబర్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 25 లక్షల మంది ప్రయాణికుల తాకిడి చవిచూసింది..ఆ నెలలో రద్దీ 22 శాతం పెరిగింది. దేశీయ అంతర్జాతీయ ప్రయాణాల్లోనూ ఈ వృద్ధి కనిపించింది. దేశీయ ప్రయాణికుల రద్దీ సంవత్సరానికి 22.7 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్ 16.3 శాతం వరకూ పెరిగింది. ఒక్కరోజే...87 వేలతో రికార్డుగత అక్టోబర్ 14న ఒక్కరోజే 87,000 మంది ప్రయాణికుల రాకతో శంషాబాద్ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. అదే నెలలో 17,553 విమానాల రాకపోకలు జరిగాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 19 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. గత 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ 80 లక్షలు ఉండగా 2024లో 2.5 కోట్లకు నాలుగు రెట్లు పెరిగింది అంటే.. ఈ వృద్ధి రేటు 45 శాతం కావడం విశేషం. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాములు కలకలం
-
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘బాంబు’ అలజడి
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ హల్ చల్ చేశాడు. దీంతో.. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో.. విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చారు.మరోవైపు.. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో పైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై.. అది ఉత్తదేనని తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు.. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించే దిశగా పౌర విమానయానశాఖ ఆలోచన చేస్తోంది. అయితే అందుకు తగ్గట్లు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.ఇదీ చదవండి: మా జీతాల్లో కోతలు వద్దు సార్! -
హైదరాబాద్ లో అలెర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
-
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు.శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల్లో బాంబు ఉన్నాయని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. విమానాశ్రయంలో ఉన్న ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ వర్గాలు, సిబ్బంది అప్రమత్తమయ్యాయి. విమానాల్లో సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా పలు విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. బాంబుల బెదిరింపుల బెడద ఎక్కువ కావడంతో దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికీ వస్తున్న ఫేక్ బాంబు బెదిరింపులపై కేంద్రం దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం అంగతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అగంతకుల ఫోన్ కాల్‌తో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 130 ప్రయాణికులతో చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని దించి సోదాలు నిర్వహించారు.గతకొన్ని రోజులగా విమానాలకు బాంబుల బెదిరింపుల బెదడ ఎక్కువైంది. ఈ బాంబు బెదిరింపులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించారు. 9 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. వాటిపై కేంద్రం దృష్టి సారించింది. విమానంలో బాంబ్ పెట్టామంటూ ఫేక్ కాల్ చేసిన బాలుడిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికీ వస్తున్న బాంబు బెదిరింపులపైఫేక్ కాల్స్ లేదంటే ఉగ్రకోణం ఉందా? అనే దిశగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖరీదైన 415 మద్యం బాటిళ్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ : గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఖరీదైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గోవా నుంచి మూడు విమానాల్లో మద్యం వస్తుందనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అదేశాలతో ఏఈఎస్ జీవన్‌కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఎస్టీఎఫ్ సీఐలు సుబాష్ చందర్రావు, చంద్రశేఖర్, డీటీఎఫ్ సీఐ ప్రవీణ్, శంషాబాద్ ఎక్సైజ్ సీఐ దేవేందర్‌రావుతోపాటు ఎస్సైలు, సిబ్బంది కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎయిర్పోర్ట్ అధికారుల సహకారంతో మద్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. 415 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 12 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, సరూర్‌నగర్ ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీలు గోవాలోని ఓ సదస్సుకు వెళ్లారు. వీరంతా తిరుగు ప్రయాణంలో మద్యం తీసుకొస్తున్నట్టు సమాచారం అందింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చిన నేరం కింద ఎక్సైజ్ ఈఏఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో శంషాబాద్ సీఐ దేవేందర్‌రావు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ‘చంఢీగడ్’మద్యం సీజ్చండీగఢ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా చేరిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ముషీరాబాద్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మెట్రోసేషన్ సమీపంలో రూ.3.85 లక్షల విలువ చేసే 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
కీచక కానిస్టేబుల్ మైనర్ అమ్మాయిలను బెదిరించి లైంగికంగా
-
ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
-
గాల్లో మంటలు.. హైదరాబాద్-కౌలా లంపూర్ విమానానికి తప్పిన ప్రమాదం
రంగారెడ్డి, సాక్షి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగగా, పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు.హైదరాబాద్ నుంచి కౌలా లంపూర్(మలేషియా) వెళ్లాల్సిన విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే కుడి వైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అది గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్) ల్యాండింగ్‌కు అఉనమతి ఇచ్చారు. ఈ గ్యాప్‌లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ హుటాహుటిన బయటకు తెచ్చారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడం.. అంతా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
శంషాబాద్: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యతి్నంచడంతో అందులోని ఉద్యోగులు నివారించారు.ఈ విషయమై ఆర్జీఐఏ పీఎస్‌లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశి్నంచిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు. -
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి జ్యువెల్లరీని పట్టుకున్నారు. శుక్రవారం(మే3)న పోలీసులు విమానాశ్రయం సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. -
ధ్యానంతోనే మనస్సు నియంత్రణ
సాక్షి, హైదరాబాద్/నందిగామ: ధ్యానంతోనే మనస్సు నియంత్రణలో ఉంటుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతివనంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచశాంతికి మొదటగా మనలో మనం మార్పు చెందాలని, అనంతరమే ఇతరుల్లో మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యక్తులంతా నిస్వార్థంగా పనిచేస్తే మానవాళి సరైన మార్గంలో నడిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని సర్వమతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను ఒక చోటకు తీసుకురావడం, అందరూ శాంతికి పాటుపడటం గొప్ప విషయమన్నారు. అన్ని మతాల్లోని వారిని చైతన్యం చేయడమే ఆధ్యాత్మిక చైతన్యమని, ఎలాంటి వివక్షకు తావులేకుండా ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వశాంతికి ఈ సమ్మేళనం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. బుద్ధుడు, జగద్గురు శంకరాచార్య, కబీర్, సంత్ రవిదాస్, గురునానక్‌తోపాటు స్వామి వివేకానంద ప్రపంచానికి ఆధ్యాత్మిక సారం అందించారని రాష్ట్రపతి గుర్తుచేశారు. మహాత్మగాంధీ రాజకీయాల్లో ఆధ్యాత్మిక విలువలను సమగ్రపరిచారని, అందుకే అయన్ను సబర్మతీ సంత్ అని పిలుస్తామన్నారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన నైతిక ఆదర్శాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని íపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు ఒకే వేదికపైకి రావడం హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ దాజీ గొప్పదనం అని ఆమె కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ మాట్లాడుతూ ప్రపంచానికి 21వ శతాబ్దంలో ఆర్థికపరంగా, ఆధ్యాత్మికంగా మన దేశం మార్గదర్శకంగా నిలుస్తుందని వందేళ్లకు పూర్వమే స్వామి వివేకానంద జోస్యం చెప్పారన్నారు. రామచంద్రమిషన్ అధ్యక్షుడు కమలేశ్ డీ పటేల్ (దాజి) మాట్లాడుతూ మతాలకతీతంగా మానవజాతి దృఢంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ఈ సదస్సులో అపోలో ఆస్పత్రుల సీఎస్ఆర్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజలు నిరంతరం జీవితంతో పోరాడే ఒత్తిడిలో ఉన్నారని, వారి జీవితం మారాలంటే సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలని సూచించారు.చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతి మనసు ప్రేమమయం కావాలని, ప్రతి పువ్వు మధురమైన మకరందాన్ని నింపుకున్నట్టు ప్రతి మనిషి ప్రేమ తత్వాన్ని మనసులో నింపుకోవాలన్నారు. అంతకు ముందు ద్రౌపది ముర్ముకు కాన్హా శాంతివనం గురుజీ కమ్లేష్ పటేల్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే ఓ మొక్క నాటారు. ఆధ్యాత్మికవేత్తలు స్వామీగౌరంగదాస్, స్వామీ చిదానందసరస్వతి, స్వామి ముకుందానంద, యోగి నిరంజన్‌దాస్, నమ్రముని మహరాజ్ దాస్, దాజీ, దేవి చిత్రలేఖ, తారాచంద్ కంటాలే, డాక్టర్ భవానీరావు, దిల్షాద్, టోనీలాడర్, అభ్యాసీలు పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం శంషాబాద్: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. -
జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.. బిహార్ ఎమ్మెల్యేలు వచ్చారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్ రాజకీయం ప్రారంభమయింది. 3 రోజుల క్రితం రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్‌కు చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంపయీ సొరేన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంపయీ సొరేన్ బలనిరూపణకు సోమ వారం వరకు గడువు ఉండడంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న ఓ రిసార్టుకు తీసుకువచ్చారు. శుక్ర, శని,ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లిపోయారు. వారు అటు వెళ్లిపోగానే బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్నా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, సీనియర్ నేత మల్రెడ్డి రాంరెడ్డిలు ఎయిర్‌పోర్టులో ఆహ్వానం పలికారు. వారిని అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్‌కు తరలించారు. ఈనెల 10వ తేదీన బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోనుండటంతో అప్పటివరకు వీరంతా రిసార్ట్‌లోనే ఉంటారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. -
HYD: విమాన ప్రయాణికులకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. మూడు రోజుల్లో 37 విమానాల రాకపోకలను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే విమానాలు.. ఆదివారం 14 విమానాలు, సోమవారం 15 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండ్రోజులుగా ఎయిర్‌పోర్టులో ఉండిపోయారు ప్రయాణికులు. ఇక హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఏయిర్ లైన్స్ కు స్టాండర్డ్ ఆపరేటింటగ్ ప్రొసీజర్స్(ఎస్వోపీ)ను విడుదల చేశారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఆది, సోమ,మంగళవారాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. 150పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైజాక్ కలకలం
శంషాబాద్: ఓ తప్పుడు ఈ మెయిల్ సందేశంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. మరి కొద్ది నిమిషాల్లో టేకాఫ్ తీసుకునే విమానం సైతం రద్దు కావడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 8 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–951 విమానం 111 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైంది. మరికాసేపట్లో టేకాఫ్ తీసుకునే సమయంలో ఎయిర్‌పోర్టుకు ఈ మెయిల్లో ఓ సందేశం వచ్చింది. అందులో బాదినేని తిరుపతయ్య అనే వ్యక్తి ఐఎస్ఐకు ఇన్ఫార్మర్గా ఉన్నాడని అతడు కాసేపట్లో విమానాన్ని హైజాక్ చేయనున్నాడని సాధ్యమైతే వెంటనే అతడిని ఆపాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అతడికి సహకరించే వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందంతో విమానంలోకి వెళ్లి ప్రయాణికులందరి తనిఖీ చేశారు. ప్రయాణికులను అందులోంచి దించి వేసి, విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. మెయిల్లో పేర్కొన్న తిరుపతయ్యతో పాటు వినోద్‌కుమార్, రాకేష్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దుబాయ్ మీదుగా వీరు ఇరాక్ వెళుతున్నట్లు సమాచారం. తిరుపతయ్యతో సన్నిహితంగా ఉండే ఓ మహిళే అతడి ప్రయాణాన్ని అడ్డుకునేందుకు మెయిల్ పంపినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మెయిల్ ఉన్న సమాచారం నిజం కాదని నిర్ధారించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది...? ఎవరు పంపారు..? అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. మెయిల్ పంపిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రాంచందర్‌రావు తెలిపారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న అమెరికా వెళ్లిన ఏపీ విద్యార్థులు
-
RGIA Hyderabad: బంగారం తెచ్చి.. చెత్తబుట్టలో వేసి
సాక్షి, శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని బంగారాన్ని బయటికి తరలించేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే బంగారాన్ని బయటికి తీసుకురాకుండా, ఎయిర్‌పోర్టు ఉద్యోగులతో బయటికి తరలిస్తున్న సంఘటనలు బయటపడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడి ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్ తనిఖీలకు వెళ్లాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా అనుమానించిన అధికారులు అతడిని విచారించడంతో తాను తీసుకొచ్చిన బంగారాన్ని చెత్తడబ్బాలో వేసినట్లు చెప్పాడు. దానిని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు. 933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఇదే తరహాలో కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు 1,300 గ్రాముల బంగారాన్ని చెత్తడబ్బాలో దాచిపెట్టడంతో కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి.. విద్యాశాఖ ఆదేశం -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ నెలకొంది. బాంబు బెదిరింపు మెయిల్‌తో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ టీం తనిఖీలు చేపట్టాయి. అయితే కాసేపటికే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఇవాళ రాత్రి ఏడుగంటలకు పేల్చేస్తామంటూ ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఓ మెయిల్ వచ్చింది. దీంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే కాసేపటికే అదే మెయిల్ ఐడీ నుంచి మరో మెయిల్ వచ్చింది. తమ కుమారుడి మానసిక స్థితి బాగోలేదని.. అందుకే అలా సందేశం పంపాడని.. క్షమించాలని ఆ మెయిల్లో ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తనిఖీలు మాత్రం కొనసాగించి.. ఆ బెదిరింపును ఫేక్‌గా నిర్ధారించుకున్నాయి. మరోవైపు ఆ మెయిల్స్ బెంగాల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మెయిల్స్ పంపిన చిరునామాను ట్రేస్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. -
8 కిలోల బంగారం దుస్తుల్లో దాచేశారు..
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడు ప్యాంటులో దాచి తీసుకొచ్చిన 2 కేజీల బంగారం బిస్కెట్ ముక్కలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.21 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. అదే విమానంలో వచ్చిన మరో ప్రయాణికుడు కూడా లోదుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 1.75 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ 1.8 కోట్లుగా నిర్ధారించారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద లో దుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 2.17 కేజీల బంగారం పేస్టును బయటికి తీశారు. దీని విలువ 1.31 కోట్లుగా నిర్ధారించారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ధరించిన లో దుస్తుల్లో 2.05 కేజీల బంగారం బయటపడింది. దీని 1.24 కోట్లుగా నిర్ధారించారు. ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పట్టుబడిన 8 కేజీల బంగారం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒకే రోజులో అత్యధికంగా పట్టుబడిన బంగారం ఇదేనని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్.. ప్రయాణికులకు కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 15 పంద్రాగస్టుపై శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విధించారు. సీఐఎస్ఎఫ్, పోలీసుల తనిఖీలతో ముమ్మరం చేయనున్నారు. అంతేకాదు.. ఆగష్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రయాణికులతో వెళ్లేవారికి అధికారులు సూచనలు చేస్తున్నారు. వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరే రావాలని సూచిస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో దుమ్మురేపుతున్న దోస్తులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ రావొద్దు!
శంషాబాద్: ప్రయాణికుల స్వాగత, వీడ్కోలు జరిగే సమయాల్లో అత్యధికమంది రావడంతో ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పార్కింగ్, రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇటీవల విదేశాలకు వెళుతున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి పెద్దఎత్తున స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు సహకరించాలన్నారు. -
బంగారం ద్రవాన్ని చీరపై స్ప్రేగా చల్లి అక్రమ రవాణా
హైదరాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని పరిశీలించారు. అందులో ఉన్న ఓ కాటన్ చీరపై బంగారం ద్రవాన్ని స్ప్రేగా చల్లి తీసుకొచ్చినట్లు గుర్తించి దానిని బయటికి తీశారు. బయటపడిన 461 గ్రాముల బంగారం విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సర్కార్ దగ్గర పైసల్లేక భూముల అమ్మకం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సర్కారు దగ్గర పైసల్లేక ఎన్నికల తాయిలాల కోసం భూములను అమ్ముతోందని.. మద్యం షాపుల టెండర్లను ముందుగా నిర్వహిస్తున్నదీ అందుకేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని సీఎం కేసీఆర్ గుర్తించారని.. అందుకే హామీల అమలు పేరిట ఎన్నికల స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయేది రామరాజ్యం, మోదీ రాజ్యమేనని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్.. సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో ఏనాడూ హామీలను పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. అన్నీ ఎన్నికల స్టంట్లే..! ‘‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రుణమాఫీ, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధి కరణ, పీఆర్సీ అంటూ బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ చేస్తున్న ప్రకటనలన్నీ ఎన్నికల డ్రామాలే. సర్కార్ దగ్గర పైసల్లేక ఎన్నికల తాయిలాల కోసం భూములను అమ్ముతున్నారు. సర్కారు జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. పైసలే లేనప్పుడు హామీలను ఎక్కడి నుంచి నెరవేస్తారు’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి మద్యం వ్యాపారం ఈజీ దందాగా మారిందని.. నవంబర్ దాకా గడువున్నా ముందే మద్యం టెండర్లు పిలిచి వేల కోట్లు దోచుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మేస్తూ భావితరాలను మోసం చేస్తున్నారని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఆ సంస్థ ఆస్తులను అమ్ముకోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అంతా కలసి పనిచేస్తాం తాము ఎన్నికల యుద్ధ రంగంలో ఉన్నామని, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయమిదని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘‘బీజేపీలో గ్రూపులున్నాయి, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది దు్రష్పచారమే. ప్రజల మనసుల్లో బీజేపీ పదిలంగా ఉంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటే వాటిని భూతద్దంలో చూపడం మూర్ఖత్వం. పేదల పక్షాన మేం చేసిన పోరాటాలు జనం మదిలో నిలిచిపోయాయి. కార్యకర్తల త్యాగాలను వృధా పోనివ్వబోం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం..’’ అని సంజయ్ చెప్పారు. -
సాఫ్రాన్ అతిపెద్ద ‘ఎంఆర్వో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో ఉన్న ప్యారిస్ కంపెనీ సాఫ్రాన్ తాజాగా శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇంజన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) కోసం అతిపెద్ద ఫెసిలిటీ ఏర్పాటు చేస్తోంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సరీ్వసెస్ ఇండియా ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్‌తో ఒప్పందం చేసుకుంది. శంషాబాద్‌లోని ఈ సెజ్‌లో లీజు ప్రాతిపదికన 23.5 ఎకరాల్లో లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ టర్బోఫ్యాన్ ఇంజన్స్ కోసం ఎంఆర్వో కేం్రద్రం రానుంది. ఏటా 100 ఇంజన్లతో ప్రారంభమై 2035 నాటికి 300 ఇంజన్లకు సర్వీస్ చేయగలిగే స్థాయిలో రూపుదిద్దుకోనుంది. 2023 సెప్టెంబరులో నిర్మాణ పనులు మొదలై 2025లో కార్యరూపం దాల్చనుంది. పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకునే నాటికి 1,000 మందికి ఉపాధి కలి్పంచనుంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కేంద్రం అతిపెద్ద ఎంఆర్వో ఫెసిలిటీ కానుందని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సపోర్ట్, సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నికోలస్ పొచియే తెలిపారు. జీఎంఆర్ ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ పార్క్‌లో ఇప్పటికే సాఫ్రాన్ కేబుల్ హార్నెసింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ కంపోనెంట్ తయారీ కేంద్రాలను స్థాపించింది. -
‘సీఎం.. సీఎం..’ నినాదాలు.. వారించిన బండి
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లపాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన మార్క్ చూపించుకున్న బండి సంజయ్ కుమార్.. ఆ పదవికి రాజీనామా తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. కీలక నేతలతో పార్టీ బలోపేతం గురించి చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ బయట కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సుమారు 500 వాహనాల కాన్వాయ్ ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే కార్యకర్తలు, అభిమానులు భుజాల మీద ఎత్తుకుని బండిని కండువాలు కప్పే క్రమంలో ‘జై శ్రీరామ్’.. పాటు ‘సీఎం.. సీఎం..’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానం ప్రదర్శించారు. ఆ సమయంలో అత్యుత్సాహం వద్దని, నినాదాలు చేయొద్దని వాళ్లను బండి సంజయ్ వారించారు. ఇక ప్రధాని మోదీ ఓరుగల్లు పర్యటన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కేసీఆర్ నన్ను చూసి భయపడుతున్నాడు -
శంషాబాద్ కు చేరుకున్న జేపీ నడ్డా
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మహత్యాయత్నం.. భర్తతో గొడవపడి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. గత రాత్రి ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే.. అది గమనించిన సీఐఎస్ఎఫ్ బలగాలు.. ఆ యువతిని రక్షించారు. శుక్రవారం రాత్రి డిపార్చర్ విభాగం వద్ద పైనుంచి దూకేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. వెంటనే అధికారులు ఆమెను కాపాడి.. మహిళా ఎయిర్పోర్ట్ అధికారులకు అప్పగించారు. సదరు యువతిని బెంగళూరు(సౌత్)కి చెందిన శ్వేతగా గుర్తించారు. భర్త విష్ణు వర్ధన్ రెడ్డి, భార్య శ్వేతతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. హైదారాబాద్ లో కంపెనీ పెట్టాలని ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే భార్యభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అనారోగ్యాన్ని తట్టుకోలేకపోయాడు! చివరకు ఆ కానిస్టేబుల్.. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఏపీ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు
-
హైదరాబాద్ యువ డిక్లరేషన్‌ను ప్రకటించనున్న ప్రియాంక గాంధీ
-
చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. అయినా దొరికిపోయారు
-
ఇదేం తెలివిరా నాయనా.. చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. చివరికి!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 269 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోపల రూ.16.5 లక్షల విలువైన బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికులను అధికారులు పరిశీలించగా.. 269 గ్రాముల బంగారాన్ని చాక్లెట్ కవర్లలో చుట్టి తీసుకొచ్చినట్లు గుర్తించారు అట్టపెట్టెలో ఉంచిన 13 చాక్లెట్లలో 13 చిన్న బంగారు ముక్కలను అమర్చి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద 269 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: ‘గీత కార్మికుల బీమా’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
అమిత్‌షా చేవెళ్ల సభపై రాజకీయ వేడి
-
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా చేవెళ్ల సభకు వెళ్లనున్న అమిత్ షా
-
కర్ణాటక ఎన్నికలయ్యాక తెలంగాణకు వస్తా: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణపై దృష్టిసారించనున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిశాక తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తానని ఆయన టీ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. బీఆర్ఎస్తో పొత్తు ఉండదని తేల్చి చెప్పండని ఆయన కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. పొత్తు ఉందని ప్రచారం చేస్తూ బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని, ఆ ప్రయత్నానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వాళ్లకు చెప్పారు. అలాగే.. కులగణనపై పీసీసీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని ఆయన నేతలకు సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక.. మే 15 తర్వాత తెలంగాణకు వస్తానని, ఇక్కడ ఎక్కువ సమయం కేటాయిస్తానని ఆయన టీ కాంగ్ నేతలకు తెలియజేశారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో పాటు బీఆర్ఎస్తో పొత్తుపై కాంగ్రెస్ నేతలు తలో ప్రచారం చేస్తుండడంతో కొందరు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల నుంచి 3,175 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని క్యాప్సూల్స్‌లో నింపి మహిళలు తమ కడుపులో దాచి తరలించే ప్రయత్నం చేయగా.. అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్‌లో బంగారం బయట పడింది. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ నలుగురు మహిళలను కస్టమ్స్ అధికారులు శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మంగళవారమే శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 66 లక్షల విలువ చేసే 1,100 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. తెల్లవారుజామున వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇద్దరు దుబాయ్ ప్రయాణికులను అరెస్ట్ చేసిన అధికారులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ వార్.. అదే దారిలో బీజేపీ కౌంటర్ -
ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రోరైల్ సేవలను ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరిస్తాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను అనుసంధానిస్తాం. అంతేకాదు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోరైల్‌ను నిర్మిస్తాం’ అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ఎల్బీనగర్ చౌరస్తా నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌ను శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ.658 కోట్లతో 12 ప్రాజెక్టులు చేపడితే.. ఇప్పటివరకు తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని కేటీఆర్ చెప్పారు. బైరామల్‌గూడలో పెండింగ్‌లో ఉన్న మూడు ప్రాజెక్టులను కూడా సెపె్టంబర్లోపు పూర్తి చేస్తామని.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళతామని పేర్కొన్నారు. గతంలో ఎల్బీనగర్ చౌరస్తా దాటాలంటే కనీసం పది పదిహేను నిమిషాలు పట్టేదని.. ఇప్పుడా సమస్య తీరిందని చెప్పారు. పేదలకు పట్టాలిస్తాం.. హైదరాబాద్‌లో ఏడాదిన్నర కాలంలో వెయ్యి పడకల సామర్థ్యంతో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక 118 జీవో కింద దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెలాఖరులోగా పట్టాలు పంపిణీ చేస్తామని.. ఈ జీవో పరిధిలోకి రాని కాలనీలను కూడా త్వరలో దీని పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. జీవోలు 58, 59 కింద ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 1.28 లక్షల మందికి నివాస పట్టాలు ఇచ్చామని.. మిగతా పేదలకు కూడా పట్టాలిచ్చే బాధ్యత తమదేనని ప్రకటించారు. ఎస్ఆర్డీపీ, ఎస్‌ఎన్‌డీపీల కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు ఒకవైపు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోనే.. మరోవైపు పార్టీ లో అంతర్గత వర్గపోరు బయటపడింది. బీఆర్ఎస్కు చెందిన చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గీయులు రమణారెడ్డిపై దాడికి యత్నించగా ఆయన, ఆయన వర్గీయులు పరుగులు తీశారు. చివరికి పోలీసులు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమం అనంతరం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచి, బీఆర్ఎస్లో చేరాక.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. పా ర్టీ లోని అసలైన ఉద్యమకారులు, సీనియర్లపై ఎమ్మెల్యే పెయిడ్ ఆరి్టస్టులు, గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎల్బీనగర్ జంక్షన్‌కు శ్రీకాంతాచారి పేరు ఎల్బీనగర్ జంక్షన్‌కు తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని.. ఫ్లైఓవర్‌కు మాల్ మైసమ్మ పేరు పెడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లే కాకుండా ప్రజారవాణా బాగా మెరుగుపడాల్సి ఉందన్నారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
-
శంషాబాద్: కోపంతో బాంబు బెదిరింపు కాల్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో కాసేపు అధికారులు హడలి పోయారు. హైదరాబాద్-చెన్నై ఇండిగో విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అయితే.. తనిఖీ చేశాక విమానంలో బాంబులేదని అధికారులు నిర్ధారించుకున్నారు. ఇక.. ఫోన్ చేసిన వ్యక్తిని వెంటనే ట్రేస్ చేశారు అధికారులు. ఆ వ్యక్తిని అజ్మీరా భద్రయ్యగా గుర్తించించింది సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్. దీంతో భద్రయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను చెప్పిన కారణం విని అధికారులు బిత్తరపోయారు. విమానంలో భద్రయ్య చెన్నై వెళ్లాల్సి ఉంది. కానీ, ఆలస్యంగా రావడంతో విమానం ఎక్కేందుకు ఆయన్ని సిబ్బంది అనుమతించలేదు. దీంతో కోపంతోనే విమానంలో బాంబు పెట్టానంటూ ఫోన్ చేసి బెదిరించాడట భద్రయ్య. -
శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
హైస్పీడ్‌లో మెట్రో పనులు.. రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మధ్య అలైన్మెంట్ ఖరారు!
సాక్షి, సిటీబ్యూరో: ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మధ్యన అలైన్మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులను వేగవంతం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మార్గంలో జరుగుతున్న సర్వే పనులను ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకం కానుందన్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కి.మీ మేర ఉన్న ఈ మార్గంలో కాలినడకన వెళుతూ ఇంజినీర్లకు, సర్వే బృందాలకు తగిన సూచనలిచ్చారు. దిశానిర్దేశం ఇలా.. - మెట్రో స్టేషన్లు ప్రధాన రహదారి జంక్షన్లకు దగ్గరగా ఉండాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్‌ను శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగ పడేలా తయారు చేయాలన్నారు. ఈ కారిడార్ విమానాశ్రయ ప్రయాణికులతో పాటు ఈ ప్రాంతంలో ఉండే వారందరికీ, శివార్లలో నివసించే తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఎనీ్వఎస్ రెడ్డి ఆదేశించారు. - ప్రయాణికులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిముషాల వ్యవధిలో చేరుకునేలా ఈ కారిడార్‌ను డిజైన్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఇప్పటికే ఆకాశహరŠామ్యలతో నిండి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి ఊహించలేనంతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, స్కై వాక్‌ల నిర్మాణం ఉండాలని సూచించారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణికుల వాహనాల పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయాలన్నారు. - రాయదుర్గ్ స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు స్టేషన్‌ను పొడిగించనున్న నేపథ్యంలో.. నూతన టెరి్మనల్ స్టేషన్, ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానానికి మార్గాలను అన్వేíÙంచాలన్నారు. స్థలాభావం కారణంగా ఐకియా భవనం తర్వాత రెండు కొత్త స్టేషన్లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. - మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్ పోర్ట్ కొత్త రాయదుర్గ్ స్టేషన్, పొడిగించిన కొత్త బ్లూ లైన్ స్టేషన్ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలని అన్నారు. జేబీఎస్ స్టేషన్, అమీర్‌పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈ స్టేషన్ల నిర్మాణం ఉండాలని సూచించారు. ఈ రూట్లో ట్రాన్స్‌కో సంస్థ ఇటీవల వేసిన 400 కేవీ అదనపు హై ఓల్టేజ్ భూగర్భ విద్యుత్ కేబుళ్లను మార్చే అవసరం లేకుండా చూడాలన్నారు. - బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ మీదుగా ఎయిర్పోర్ట్ మెట్రో వయాడక్ట్ క్రాసింగ్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయాలని సూచించారు. హై ఓల్టేజ్ అండర్‌గ్రౌండ్ కేబుళ్లను మార్చాల్సిన అవసరం లేకుండా చూడాలి. సైబర్ టవర్స్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర చేసినట్లు, ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్ కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలన్నారు. - బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రే స్టేషన్‌ను నిర్మించే సమయంలో.. ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో నిర్మించనున్న బీహెచ్ఈఎల్– లక్డీకాపూల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి సారించాలని ఎండీ సూచించారు. నానక్‌రామ్‌గూడ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణ విషయంలో అక్కడ నాలుగు దిక్కుల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను విశ్లేషించాలన్నారు. ఇక్కడ నిర్మించబోయే స్కైవాక్ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ నుంచి వచ్చే వారి ప్రయాణ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు. ∙నార్సింగి, కోకాపేట తదితర ప్రాంతాలలో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌కు ఆవల నుంచి వచ్చే ప్రయానికులను అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన
-
Hyd: ఎయిర్పోర్ట్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు శుక్రవారం శంకుస్థాపన జరుగుతోంది. రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రాయదుర్గం మైండ్‌స్పేస్ వద్ద శుక్రవారం ఉదయం 10.05 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత 10.20 గంటలకు తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ప్రతీ అంశం విశేషమేనని హైదరాబాద్ మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గురువారం రసూల్‌పురాలోని మెట్రోరైల్ భవన్లో ఆయన ఈ వివరాలు తెలిపారు. మూడు విధాలుగా మార్గం రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఎక్స్‌ప్రెస్ మెట్రోను నిర్మించనున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్(ప్రస్తుత మెట్రో తరహాలో)కాగా.. విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మిస్తారు. మిగతా కిలోమీటరు మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్లను ప్రతిపాదించామని.. విమానాశ్రయంలో రెండు మెట్రోస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మూడో లెవల్లో.. రాయదుర్గం వద్ద ప్రారంభమయ్యే ఎయిర్పోర్ట్ మెట్రో బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు ఫ్లైఓవర్లపైన మూడో లెవల్లో నిర్మించనున్నారు. ఖాజాగూడ రోడ్డులో కుడివైపుగా నానక్‌రాంగూడ జంక్షన్ మీదుగా ఓఆర్ఆర్ ప్రవేశ ప్రాంతానికి మెట్రో చేరుతుంది. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఓఆర్ఆర్కు, సర్వీస్‌రోడ్డుకు మధ్యలో కొనసాగుతుంది. రెండోదశ కింద మరిన్ని మార్గాల్లో.. మెట్రో రెండో దశలో భాగంగా బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ కారిడార్ (31కి.మీ.), నాగోల్–ఎల్బీనగర్ (5కి.మీ.), బీహెచ్ఈఎల్–లక్టీకాపూల్ (26కి.మీ.) మార్గాల డీపీఆర్‌లను కేంద్రానికి పంపించామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలిదశ మెట్రో మార్గాల్లో 31.50 కోట్ల మంది ప్రయాణం చేశారన్నారు. దీనితో 9.2 కోట్ల లీటర్ల ఇంధన ఆదా జరిగిందని, 21 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించగలిగామని చెప్పారు. అత్యాదునిక సదుపాయాలతో.. ఎయిర్‌పోర్ట్‌లోనే కార్గో, ప్యాసింజర్ పేరిట రెండు మెట్రోస్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రయాణికులు తమ లగేజీని మోయాల్సిన అవసరం లేకుండా.. ప్యాసింజర్ మెట్రోస్టేషన్లో దిగిన తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్ ప్రవేశద్వారం వద్దకు లగేజీ చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు ప్రవేశద్వారం వద్ద లగేజీని తీసుకోవచ్చు. ►విమాన ప్రయాణికులు, వారి లగేజీని రాయదుర్గం మెట్రోస్టేషన్ వద్దే చెకింగ్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. విమాన రాకపోకల సమయాలకు సంబంధించిన వివరాలను మెట్రోస్టేషన్లలో డిస్ప్లే చేస్తారు. ►ఎయిర్పోర్ట్ మెట్రోలో మొదటిసారిగా ప్లాట్‌ఫాం స్క్రీన్డ్ డోర్స్ (పీఎస్డీ)ను ప్రవేశపెట్టనున్నారు. దీనిద్వారా రైలు వస్తున్న సమయంలో ప్లాట్‌ఫాంపై గేట్లు తెరుచుకుంటాయి. ►రైలువేగం మరింతగా పెరిగేలా స్టెయిన్లెస్ లేదా అల్యుమినియంతో రూపొందించిన లైట్ వెయిట్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ►ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తయ్యాక మొదట మూడు కోచ్‌లతో ప్రారంభిస్తారు. తర్వాత రద్దీని బట్టి ఆరు కోచ్‌లకు విస్తరిస్తారు. ఇందుకు అనుగుణంగా ప్లాట్‌ఫాంలను 6 కోచ్‌లకు అనుగుణంగా నిర్మించనున్నారు. ►తొలుత రద్దీ సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో 20 నిమిషాలకో రైలు నడుపుతారు. తర్వాత అవసరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ పెంచుతారు. ఇక సిటీ మెట్రోకు భిన్నంగా ఎయిర్పోర్ట్ మెట్రోలో సీటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
శంషాబాద్‌కు భారీ ‘తిమింగలం’!
సాక్షి, శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో ఆదివారం రాత్రి ఓ భారీ ‘తిమింగలం’వాలి చూపరులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది! ఒక రోజంతా సేదతీరి తిరిగి సోమవారం రాత్రి రెక్కలు కట్టుకొని రివ్వున ఎగిరిపోయింది!! ఎయిర్‌పోర్టులోకి ‘తిమింగలం’రావడం ఏమిటని అనుకుంటున్నారా? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సరుకు రవాణా విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా విమానం (ఏ300–600 సూపర్ ట్రాన్స్పోర్టర్) శంషాబాద్ విమానాశ్రయానికి అతిథిగా విచ్చేసింది. ఈ విమాన ఆకారం ఉబ్బెత్తు తలలతో ఉండే బెలూగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఇది ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్లని అని అర్థం. దుబాయ్‌లోని అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని పట్టాయా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ కార్గోను మోసుకెళ్తూ మార్గమధ్యలో ఇంధనం నింపుకోవడంతోపాటు పైలట్లు విశ్రాంతి తీసుకొనేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దీన్ని ల్యాండ్ చేశారు. విమాన ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం విమానాశ్రయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విమానం తిరిగి సోమవారం రాత్రి 7:20 గంటలకు టేకాఫ్ తీసుకొని పట్టాయా బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మౌలిక వసతుల సామర్థ్యం, సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌బస్ బెలూగా ఇక్కడ ల్యాండ్ అయిందని ఆర్జీఐఏ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్ ఏఎన్–225 మ్రియా సైతం ఇంధనం, విశ్రాంతి కోసం 2016 మే 13న శంషాబాద్‌లో ల్యాండ్ అయిందని గుర్తుచేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. ఈ తెల్ల తిమింగలం ప్రత్యేకతలు ఇవీ ► ఇలాంటి ఆకారం ఉన్న విమానాలు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఐదే ఉన్నాయి. ► దీన్ని ప్రత్యేకించి విమానాల విడిభాగాల రవాణాతో పాటు అతిభారీ యంత్రాల రవాణాకు వినియోగిస్తున్నారు. ► ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. ► దీని పొడువు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు. ► బెలూగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. A wonder in the sky, a head-turner on the runway. Marvel at the majestic Airbus Beluga that has recently landed on equally majestic #HYDAirport.#FlyHYD #AirbusBeluga #Aircraft@Airbus @AAI_Official @MoCA_GoI pic.twitter.com/c5NEWKZlsl — RGIA Hyderabad (@RGIAHyd) December 5, 2022 -
ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా నాలుగేళ్లుగా అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రాన్ని వీఐపీ మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెర్మినల్ భవనంలో కొనసాగించారు. గతంలో ఉన్న డిపార్చర్ కేంద్రానికి అనుసంధానంగా నిర్మించిన కొత్త భవనం ఇటీవల పూర్తయింది. దీంతో ప్రధాన టెర్మినల్‌లోనే కొత్త అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఈవో ప్రదీప్ ఫణీకర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం సాయంత్రం సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం తొలిసారిగా కొత్త టెర్మినల్ కేంద్రంగా బయల్దేరింది. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం పురోగమిస్తోందని సీఈవో ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి మెట్రో సేవలు
-
Hyderabad Metro: గుడ్‌న్యూస్.. ఎయిర్‌పోర్టుకు మెట్రో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌కు తలమానికమైన శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు వివరాలను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సుమారు 31 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ మార్గాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.6,250 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. రాయదుర్గం–ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ఏర్పాటైతే ఐటీ కారిడార్ నుంచి విమానాశ్రయానికి చేరుకునేవారికి దూరాభారం, సమయం తగ్గుతాయి. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతోంది. మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను కూడా గతంలోనే ఏర్పాటు చేశారు. మెట్రో రెండోదశపై చిగురిస్తున్న ఆశలు మంత్రి కేటీఆర్ ప్రకటనతో హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు రెండో దశ విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి. రెండో దశ కింద రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ.)తోపాటు బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ (26 కి.మీ), నాగోల్–ఎల్బీనగర్ (5 కి.మీ) మార్గాల్లో మెట్రో ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధంచేసి కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. రెండోదశకు అవసరమైన రూ.8,500 కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్ ఇటీవలే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. సంబంధిత అధికారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ప్రతీ 5 కిలోమీటర్లకు ఓ స్టేషన్ విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రోస్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నట్టు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని గచి్చ»ౌలి, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, గండిగూడ చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థలపరిశీలన కూడా పూర్తయింది. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్ టెస్ట్ చేస్తున్నట్టు మెట్రో వర్గాలు తెలిపాయి. -
భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో శనివారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తి బంగారు బిస్కెట్లు ఉన్న లగేజీని కస్టమ్స్ కంటపడకుండా తరలించేందకు యత్నించాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో లగేజీలో 2.1 కేజీ బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారం విలువ రూ.కోటి ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రసాద్‌గౌడ్ క్యారియర్‌గా బంగారాన్ని తరలించేందుకు యత్నించినట్లు అనుమానిస్తున్నారు. అలాగే కువైట్ నుంచి కేయూ–373 విమానంలో వచ్చిన అహ్మద్ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి కదలికలను అనుమానించి అతడి లగేజిని తనిఖీ చేయగా 268 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ.12 లక్షలు ఉంటుదని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెనుప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే.. ఎయిర్‌పోర్ట్‌లో సేప్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: బంగారం అక్రమ రవాణా పరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం ఐదుగురు వేర్వేరు ప్రయాణికుల నుంచి అధికారులు 4.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుబాయ్ నుంచి ఈకే–524 విమా నంలో వచ్చిన మహిళ తన తలకు ఉన్న హేర్ బ్యాండ్‌లో 234 గ్రాముల బంగారం తీసుకొచ్చింది. కువై ట్ నుంచి జె9–403 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీలో 855 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చారు. బిస్కెట్లు, గుండీల రూపంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈకే –526 విమానంలో మరో ముగ్గురు మహిళా ప్రయాణికు లను అనుమానించిన అధికా రులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముగ్గురి లోదుస్తుల నుంచి 3283 గ్రాముల బంగారం పేస్టు ను బయటికి తీశారు. దీని విలువ రూ. 1.72 కోట్లు ఉంటుందని అధికా రులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 4 కోట్ల విలువైన బంగారం పట్టివేత
శంషాబాద్ (హైదరాబాద్): దుబాయ్ నుంచి ముగ్గురు వేర్వేరు ప్రయాణికులు అక్రమంగా తీసుకొచ్చిన రూ.నాలుగుకోట్ల పైచిలుకు విలువైన బంగారాన్ని శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి. దుబాయ్ ఈకే –528 విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అందులో సిల్వర్ కోటింగ్ చేసి ఉన్న ఎయిర్‌కంప్రెసర్ కనిపించింది. దాన్ని పరిశీలించగా 4,895 గ్రాముల బరువున్న ఇరవైనాలుగు క్యారట్ల బంగారం బ్లాకు బయటపడింది. బంగారం విలువ రూ.2.57 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఇద్దరి నుంచి..: దుబాయ్ నుంచి ఈకే–524 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో 2,800 గ్రాముల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారం విలువ రూ.1.47 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మిథాలీ రాజ్‌తో జేపీ నడ్డా సమావేశం
-
అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: అక్రమంగా నిషేధిత సిగరెట్లను తరలిస్తున్న నిందితులను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రూ. 2.98 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. బెహరాన్ నుంచి జీఎఫ్274 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 29,800 నిషేధిత సిగరేట్లు లభ్యమయ్యాయి. కస్టమ్స్ అధికారులు నిందితుని విచారణ చేస్తున్నారు. -
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా సిగరెట్లు పట్టివేత
-
పేస్టుగా చేసి బంగారం దాచి..
శంషాబాద్ (హైదరాబాద్): బూట్ సాక్సుల్లో కొంత.. మలద్వారంలో మరికొంత బంగారం దాచి విమానం దిగిన ఒక ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. వివరాలివి. శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున జె9403 కువైట్ విమానం దిగిన ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె బూటు సాక్సుల్లో నల్లటి కవర్లలో దాచి ఉంచిన బంగారం బయటపడింది. మహిళను మరింత విచారించగా.. నల్లటి ఉండల మాదిరిగా చేసి మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చిన బంగారం పేస్టు గురించి ఆమె వివరించింది. దీంతో ఆ మహిళకు వైద్యులతో శస్త్రచికిత్స చేయించి బంగారాన్ని బయటికి తీయించారు. మొత్తం ఆమె నుంచి 1.646 కేజీల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.86 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైబిగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా వెళ్లాల్సిన ఫ్లైబిగ్ విమానం రన్‌వే పైకి వెళ్లగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి రన్‌వేపై నిలిచిపోయింది. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు విమానం బయలుదేరకపోవడంతో అధికారులపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఆధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రన్ వేపై ప్రయాణికులు ధర్నాకు దిగారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో -
కడుపులో 108 డ్రగ్స్ క్యాప్యూల్స్.. అడ్డంగా బుక్కయ్యాడు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి కడుపులో ఏకంగా 108 డ్రగ్స్ క్యాప్యూల్స్‌ను కనిపెట్టారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 11.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడు జోహెన్స్‌బర్గ్ నుంచి అబుదాబీ మీదుగా వచ్చాడని అధికారులు వెల్లడించారు. కడుపులో డ్రగ్స్ రవాణా చేయడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. -
కడుపులో 11.57కోట్ల కొకైన్..
సాక్షి, హైదరాబాద్: కిలోకు పైగా కొకైన్ డ్రగ్స్‌ను ట్యాబ్లెట్ల రూపంలో పొట్టలో పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తున్న టాంజానియా వ్యక్తి (44)ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. పొట్టలోంచి 79 ట్యాబ్లెట్లను బయటకు తీశారు. జోహెన్నెస్‌బర్గ్ నుంచి ఈ నెల 21న ఎమిరేట్స్ విమానంలో ఆ వ్యక్తి హైదరాబాద్ చేరుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను టాంజానియా నుంచి జోహెన్నెస్‌బర్గ్ వచ్చానని.. జోహెన్స్‌బర్గ్ నుంచి ఇండియాకు వచ్చే ముందు ప్రొటేరియా వెళ్లి అక్కడ కొకైన్ ట్యాబ్లెట్లు మింగానని అధికారుల విచారణలో వెల్లడించాడు. 3 నుంచి 4 రోజులు కడుపులోనే దాచుకొని మరో వ్యక్తికి డెలివరీ చేయాల్సిందిగా ఆదేశాలున్నాయన్నాడు. ఆ వ్యక్తి నుంచి 22 కొకైన్ ట్యాబ్లెట్స్ను అధికారులు బయటకు తీశారు. మిగిలిన ట్యాబ్లెట్లను తీయడం కష్టమవడంతో ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ ద్వారా మంగళవారం మరో 57 ట్యాబ్లెట్లను తీశామని డీఆర్ఐ వెల్లడించింది. ఇవి 1,157 గ్రాముల బరువున్నాయని, అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.11.57 కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. ఆ వ్యక్తిపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నాడో విచారణ చేయాల్సి ఉందని చెప్పింది. -
రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు. కెన్యా రాజధాని నైరోబీ నుంచి హెరాయిన్‌తో వచ్చిన మలావీ దేశ జాతీయురాలిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఆమె నుంచి రూ. 21.9 కోట్ల విలువైన 3.129 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె క్యారియర్ అని, ఈ డ్రగ్‌ను తీసుకొనే రిసీవర్లు ఎవరనేది గుర్తించే కోణంలో దర్యాప్తు చేస్తు న్నామని డీఆర్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పక్కా రెక్కీ అనంతరం... మలావీకి చెందిన మహిళను బిజినెస్ వీసాపై కొన్ని రోజుల క్రితం నైరోబీకి పిలిపించిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియా... రెక్కీ కోసం అక్కడ నుంచి రెండుసార్లు ఆమెను హైదరాబాద్‌కు పంపి ఒకట్రెండు రోజుల తర్వాత తిరిగి వెనక్కు రప్పించింది. అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న మాఫియా సూత్రధారులు శుక్రవారం 3.129 కేజీల హెరాయిన్‌ను ఆమెకు అప్పగించారు. దీన్ని రెండు పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి ట్రాలీ బ్యాగ్ కింది వైపు ఏర్పాటు చేసిన రహస్య అరలో ఉంచారు. స్కానింగ్‌లోనూ హెరాయిన్ ఉనికి బయటపడకుండా నల్లరంగు పాలిథిన్ సంచులను వాడారు. ఈ బ్యాగ్‌తో నైరోబీ నుంచి బయలుదేరిన మలావీ జాతీయురాలు తొలుత దోహాకు.. అక్కడి నుంచి సోమవారం శంషాబాద్‌కు చేరుకుంది. అయితే ఆమె బిజినెస్ వీసాపై నైరోబీ నుంచి రావడం, గతంలోనూ రెండుసార్లు వచ్చివెళ్లడంతో డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని లగేజీని తనిఖీ చేయగా హెరాయిన్ లభ్యమైంది. ఆ మహిళను అరెస్టు చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చేతివాటం
శంషాబాద్(హైదరాబాద్): ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగులోంచి రియాల్స్ తస్కరించిన సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. నిజామాబాద్ డిచ్పల్లికి చెందిన షేక్ అల్తాఫుద్దీన్ శుక్రవారం రాత్రి రియాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. బంధువులు, కుటుంబసభ్యులు అరైవల్స్‌లోకి కాకుండా డిపార్చర్ వైపు వెళ్లడంతో హడావుడిగా అల్తాఫుద్దీన్ కూడా అక్కడికి వెళ్లాడు. చదవండి👉: చిల్.. జిల్.. టాప్ గేర్‌లో అమ్మకాలు.. పొంగుతున్న బీరు కారు పార్కింగ్ సమయం మించిపోతుందని సిబ్బంది సూచించడంతో బ్యాగు మరచిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఓ బ్యాగు లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఆరా తీశారు. బ్యాగులో 3050 రియాల్స్‌తో పాటు కొన్న ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాగును తీసిన సదరు సెక్యూరిటీ సిబ్బంది తిరిగి అప్పగించినా అందులో కేవలం 500 రియాల్స్ మాత్రమే ఉండడంతో మిగతా రియాల్స్ ఎక్కడిపోయాయని బాధితుడు అడిగాడు. దీంతో మరో ఆరువందల రియాల్స్‌ను అతడికి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మిగతా రియాల్స్ తమవద్దలేవని చేతులెత్తేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించినట్లు ఆర్జీఐఏ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. కొత్తగా మరో టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సదుపాయాల విస్తరణలో మరో అడుగు ముందుకేసింది. విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టెర్మినల్ మొదటి దశలో భాగంగా తూర్పు వైపు కొత్తగా 15,742 చదరపు మీటర్ల టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. భద్రతా తనిఖీల అనంతరం మరో నెల రోజుల్లో దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అవకాశం ఉంది. తాజాగా పూర్తి చేసిన విస్తరణతో ఎయిర్‌పోర్టు టెర్మినల్ వైశాల్యం 3,79,370 చదరపు మీటర్లకు పెరిగింది. సాలీనా సుమారు 3.4 కోట్ల మంది ప్రయాణీకుల సామర్థ్యానికి వీలుగా ఎయిర్‌పోర్టు విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా తొలి దశ టర్మినల్ విస్తరణలో కొంత భాగం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అదనంగా పలు సౌకర్యాలు.. ఏటా కోటి 20 లక్షల మంది ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్‌పోర్టులో 2019 నాటికి ప్రయాణికుల సంఖ్య 2.1 కోట్లకు చేరింది. దీంతో ఎయిర్‌పోర్టు విస్తరణపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ ఇంటెరిమ్ డిపార్చర్ టెర్మినల్, ఇంటెరిమ్ డొమెస్టిక్ అరైవల్ టెర్మినల్‌ను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. విస్తరించిన ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్‌తో 149 చెక్ఇన్ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషీన్లు, 44 ఎమిగ్రేషన్, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పయర్ భవనాల్లో మరిన్ని లాంజ్‌లు, రిటైల్ అవుట్లెట్లు ఉంటాయి. అలాగే 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపార్చర్ గేట్లు, 9 రిమోట్ అరైవల్ గేట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. (క్లిక్: ఫలించిన పరి‘శ్రమ’.. టీఎస్ఐపాస్ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు) రన్‌వే సామర్థ్యం పెంపు... రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్తగా నాలుగు రాపిడ్ ఎగ్జిట్ టాక్సీ వేలను ఏర్పాటు చేశారు. దీంతో విమానాలు తక్కువ దూరంలోనే రన్‌వే నుంచి ట్యాక్సీ ఆఫ్ కావడానికి అవకాశం ఉంటుంది. రన్‌వే ఆక్యుపెన్సీ సమయం కూడా తగ్గి, సామర్థ్యం పెరుగనుంది. అలాగే సెకెండరీ రన్ వేను ఉపయోగించుకునే సందర్భంలో సమర్థవంతమైన ఆపరేషన్ కోసం మరో కొత్త సమాంతర ట్యాక్సీవేను కూడా అభివృద్ధి చేశారు. కొత్తగా మూడు ఎయిరోబ్రిడ్జిలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం 6 ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల కోసం అన్ని సదుపాయాలతో కూడిన రెండు బేబీ కేర్ రూములు, 2 ఫ్యామిలీ రూమ్‌లను నిర్మించారు. ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు అనుగుణంగా కొత్తగా ఒక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. (క్లిక్: నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు!) -
మేం వచ్చేశాం
సాక్షి, న్యూఢిల్లీ, ముంబై/శంషాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు విడతలవారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానాలలో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు చెందిన 11 మందితోపాటు ఏపీకి చెందిన మరో 11 మంది ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే సోమవారం సాయంత్రం తెలంగాణకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి వచ్చారు. వారికి ఏపీ, తెలంగాణ భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు అందించారు. వీరు ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం 6:30 గంటలకు ముంబై చేరుకోనున్న మరో విమానంలోనూ పదుల సంఖ్యలో తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలంగాణ ఐఏఎస్ అధికారి ఎ. శరత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోడల్ అధికారి వి. రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. రెండు నెలల్లో ఎంబీబీఎస్ పూర్తయ్యేది మరో రెండు నెలల్లో నా ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యేది. కానీ ఈ యుద్ధం కారణంగా అన్నీ వదిలేసి తిరిగి రావాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత కోర్సుకు సంబంధించి యూనివర్సిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాల్సిందే. – సుధేశ్ మోహన్ నట్ల, ఒంగోలు సరిహద్దులో రెండు రోజులు మేము టికెట్ బుక్ చేసుకున్నా విమానాలు లేకపోవడంతో స్నేహితులందరం తొలుత ఉక్రెయిన్ సరిహద్దుకు చేరుకున్నాం. అక్కడ రెండు రోజులపాటు మమ్మల్ని రొమేనియాలోకి వెళ్లనీయకుండా సైనికులు అడ్డుకున్నారు. చివరకు సరిహద్దు దాటాక భారత రాయబార అధికారులు మమల్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌లో మన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. –నిషారాణి (ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం) శంషాబాద్ ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. యుద్ధం కారణంగా మా యూనివర్సిటీలో వాళ్లందరం తొలుత ఎంతో కష్టపడి ఉక్రెయిన్ సరిహద్దుకు చేరుకున్నాం. కానీ అక్కడి భద్రతా దళాలు ఉక్రెయినియన్లకే మొదటగా దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాయి. దీంతో సరిహద్దు దాటడానికి మాకు ఒకటిన్నర రోజులు పట్టింది. ఇంకా చాలా మంది భారతీయులు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. – విష్ణు, సూర్యాపేట -
శంషాబాద్ కు చేరుకున్నతెలుగు విద్యార్థులు
-
అందరు నవ్వుకుంటున్నారు.. ప్రధాని రాకతో కేసీఆర్‌కు జ్వరం
-
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
ప్రధాని మోదీ పర్యటన సాగిందిలా..
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా..
శంషాబాద్ రూరల్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి నుంచి తుక్కుగూడ సమీపంలోంచి మరో దారి ఇది వరకే ఉండగా.. ప్రస్తుతం గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండలోని ఔటర్ రోటరీ జంక్షన్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా రహదారిని విస్తరిస్తున్నారు. విమానాశ్రయం రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో కార్గో వాహనాల కోసం నాలుగు వరసల రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారి ముఖ్యంగా కార్గో టెర్మినల్ నుంచి సరుకుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఉన్న ఎయిర్‌పోర్టు మార్గాలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలో కార్గో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్గో వాహనాలు ఔటర్ మీదుగా పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. (చదవండి: ‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!) రూ.6 కోట్లతో విస్తరణ పనులు.. ఎయిర్‌పోర్టు లోపల నుంచి కార్గో వాహనాల కోసం గొల్లపల్లి శివారు వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణం ఇది వరకే పూర్తి చేశారు. శంషాబాద్ నుంచి గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వరకు ఉన్న రహదారితో ఎయిర్‌పోర్టు రోడ్డును గొల్లపల్లి వద్ద అనుసంధానం చేస్తున్నారు. దీంతో గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్ వరకు ఉన్న దారిని సుమారు రూ.6 కోట్లతో విస్తరిస్తున్నారు. 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ దారిని ప్రస్తుతం 10 మీటర్లకు విస్తరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రోడ్డు మార్గం ఇలా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరానికి రోడ్డు మార్గంలో చేరుకోవడానికి గొల్లపల్లి నుంచి ఔటర్ జంక్షన్ మీదుగా పీ– వన్ రోడ్డు మీదుగా చేరుకుంటారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంగా ఈ రహదారిని నిర్ణయించడంతో ఈ మార్గంలో మొక్కలు, అందమైన పూల మొక్కలను నాటుతున్నారు. పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వద్ద రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’) -
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి 6ఈ025 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేయగా అందులో 2.7 కేజీల బంగారు గొలుసులు, కవర్లలో చుట్టి తీసుకొచ్చిన బంగారం పేస్టు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.36 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతి వెళ్లి ల్యాండ్ అవకుండానే వెనక్కి
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరిన విమానం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండయింది. శుక్రవారం ఉదయం 6.20 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి స్పైస్ జెట్ 1075 విమానం తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే సమయంలో అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ల్యాండింగ్‌కు అనుమతినివ్వలేదు. దీంతో ఆ విమానం తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి 9.30 గంటలకు చేరుకుంది. ఏటీసీ అనుమతి మేరకు ల్యాండ్ చేసిన విమానం 10 గంటలకు మరోసారి ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని బయలుదేరి 11. 26 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
శంషాబాద్‌లో స్పైస్‌జెట్ అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: స్పైస్ జెట్ విమానం తిరిగి శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు తిరుపతి ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. ఉదయం 7.45 నిమిషాలకు తిరుపతి బయలుదేరిన విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
-
ఆ ప్రయాణికులకు షాకిచ్చిన ఓలా, ఉబర్ డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ డ్రైవర్లు క్యాబ్ బంద్ తలపెట్టారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే సుమారు మూడు వేల క్యాబ్‌లపై ప్రభావం పడింది. ఉబెర్, ఓలా సంస్థలు సరైన కమీషన్లు ఇవ్వడం లేదని, తమ శ్రమకు తగిన ఆదాయం లభించడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో రాకపోకలు సాగించే క్యాబ్‌లు చాలావరకు నిలిచిపోయాయి. ఓలా, ఉబెర్ సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్ పోర్టు మూడు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ►ఎయిర్‌పోర్టు నుంచి సాధారణంగా ప్రతిరోజూ సుమారు 5000 క్యాబ్‌లు 24 గంటల పాటు సేవలందజేస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ కోవిడ్ దృష్ట్యా కొంతకాలంగా క్యాబ్‌ల సంఖ్య 3 వేలకు తగ్గింది. గతంలో ఎయిర్‌పోర్టుకు నడిపే క్యాబ్‌లకు రోజుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఆదాయం లభించగా ఇప్పుడు రోజుకు రూ.1000 కూడా రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ►ఎయిర్‌పోర్టులో రూ.250 పార్కింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చు మినహాయిస్తే రోజుకు రూ.500 మాత్రమే మిగులుతున్నాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ విస్మయం వ్యక్తం చేశారు. ఓలా, ఉబెర్ సంస్థల నుంచి సరైన కమీషన్లు లభించకపోవడంతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌ల సేవలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచాలి.. ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్లుగా కిలోమీటర్‌కు రూ.17 చొప్పున ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతంఒక కిలోమీటర్‌పై రూ.10 కూడా గిట్టుబాటు కావడం లేదని, దీంతో రూ.లక్షల్లో అప్పులు తెచ్చి కొనుగోలు చేసిన వాహనాలకు నెల నెలా రుణాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచే వరకు క్యాబ్‌లు నడపబోమని సలావుద్దీన్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా మూడు క్యాబ్ సర్వీసులు.. డ్రైవర్ల ఆందోళన దృష్ట్యా ఉబెర్, ఓలా సేవలకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి చాయిస్, 4 వీల్స్, క్విక్ రైడ్ అనే మూడు క్యాబ్ సర్వీస్ ఆపరేటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆర్టీసీ పుష్పక్ బస్సు లు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదవండి: వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె -
మలద్వారంలో బంగారం స్మగ్లింగ్!
శంషాబాద్: మల ద్వారంలో బంగారం పెట్టుకుని దొంగ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న నలుగురు సూడాన్ దేశస్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 7.3 కిలోల బరువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల నడక తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వారిని వైద్యాధికారుల దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు. వారు మలద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి, బయటికి తీయించారు. ఈ నలుగురు సూడాన్ దేశస్తులని, వారు స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఎవరు ఎక్కడి నుంచి, ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
జ్యూస్ యంత్రంలో బంగారం
శంషాబాద్: జ్యూస్ యంత్రంలో అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–952 విమానంలో శనివారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతని కదలికలకపై అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చేతితో జ్యూస్ తయారు చేసే ఓ యంత్రాన్ని కనుగొని, దాన్ని కట్ చేయగా 671 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ 34.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్: విమానంలో సీటుకింద కేజీకిపైగా బంగారం
శంషాబాద్: విమానాశ్రయంలో పకడ్బందీ తనిఖీలు నిర్వహించి బంగారం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో విదేశాలనుంచి బంగారాన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 025 విమానంలో సీటు కింద దాచిన 1,207 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), కస్టమ్స్ అధికారులతో కలసి పట్టుకున్నారు. ఈ విమానంలో అక్రమ బంగారం రవాణా జరుగుతున్నట్లు డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో వచి్చన ప్రయాణికులను తనిఖీలు చేయగా ఎవరివద్దా బంగారం పట్టుబడలేదు. అయితే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సీటుకింద మూడువరుసలుగా ఉన్న ఈ అక్రమబంగారం బయటపడింది. దీని విలువ రూ.59.03లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని సీటు కింద దాచిన ప్రయాణికుల వివరాలను ఆరా తీస్తున్నారు. -
ప్రయాణికుడి వద్ద బంగారం పట్టివేత
శంషాబాద్: ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు సోమవారం రియాద్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులకు లోదుస్తుల్లో ప్రయాణికుడు దాచిన 100 గ్రాముల బంగారు కడ్డీ బయటపడింది. దీని విలువ సుమారు 4.90 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెప్పులో బంగారం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే–526 విమానంలో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అతడు ధరించిన చెప్పులకు వెండి రంగులో ఉన్న డిజైన్ పలకలను తొలగించడంతో బంగారం బయటపడింది. అంతేకాకుండా అతడి బ్యాగేజీలో ఉన్న ఫేషియల్ క్రీమ్ బాక్సులో కూడా బంగారం లభించింది. మొత్తం 495 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 24.14 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. -
పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం ఉందా? తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. గతంలో అతను లైసెన్స్ తీసుకున్న ఆయుధానికి, బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో అతని బ్యాగేజ్ నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్‌కు పొంతన లేకపోవడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లోనే ఆయుధం సరెండర్... పరిటాల సిద్ధార్థ్ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అనంతపురం కలెక్టర్ నుంచి ఆయుధ లైసెన్స్ తీసుకొని .32 క్యాలిబర్ పిస్టల్ కొన్నారు. దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే తన ఆయుధాన్ని రామగిరి పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన బ్యాగేజ్లో లభించినవి 5.56 క్యాలిబర్ తూటాలు. ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్ రైఫిల్స్‌కు సంబంధించినవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ వద్ద 5.56 క్యాలిబర్‌కు చెందిన అక్రమ ఆయుధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరి స్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా నిషేధిత తుపాకీ తూటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులను విడిచిపెట్టరు. అయితే సిద్ధార్థ్‌ను మాత్రం వివరణ కోరుతూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేసి వదిలేయడం గమనార్హం. ఆ కానిస్టేబుల్‌తో లింకులు ఉన్నాయా..? సిద్ధార్థ్ వద్ద లభించిన తూటాకు, ఈ ఏడాది ఏప్రిల్‌లో అస్సాంలోని బాగ్డోగ్రా విమానా శ్రయంలో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్ వద్ద లభిం చిన తూటాలకు లింకులున్నాయా? అనే అను మానాలు కలుగుతున్నాయి. అస్సాంలో పని చేసే అనంతపురం జిల్లా ములకనూరుకు చెందిన ఓ ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు కానిస్టేబుల్ ఏప్రిల్ 17న బెంగళూరు వెళ్లేందుకు బాగ్డోగ్రా విమానాశ్రయానికి రాగా ఆయన బ్యాగేజ్లో 5.56 క్యాలిబర్‌కు చెందిన 100 పేల్చని తూటాలు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికితోడు ఆ కానిస్టేబుల్‌కు పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
శంషాబాద్ విమానాశ్రయం వద్ద పటిష్ట బందోబస్తు
-
రూ.21 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇం టెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియాకు చెందిన మహిళ మాదకద్రవ్యాలు తీసుకొ స్తున్నట్లు నిఘావర్గాల ద్వారా డీఆర్ఐకి సమా చారం అందింది. ఖతార్ ఎయిర్వేస్ ద్వారా జోహన్నెస్‌బర్గ్, దోహా మీదుగా సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న విమానంలో ఆమె హైదరాబాద్ చేరుకుంది. లగేజీని తనిఖీ చేయగా, అధికారులకు అనుమానాస్పద పొడి లభించింది. దాన్ని పరీక్షించి హెరాయిన్ అని నిర్ధారించారు. 3.2 కిలోల బరువున్న దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. గతనెలలో జూన్ 6న ఇద్దరు ఆఫ్రికా మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన, జూన్ 21న జాంబియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మరోసారి భారీగా హెరాయిన్ పట్టుబడింది. జాంబియా దేశానికి చెందిన ఓ మహిళ వద్ద దాదాపు 3.2 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశం నుండి ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా మీదుగా మహిళ ప్రయాణికురాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ ఆధికారులు ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ దాదాపు రూ. 21 కోట్లు ఉంటుందని డీఆర్ఐ ఆధికారులు అంచనా వేశారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్ లీక్
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైనేజీ పైపులకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్ సమీపంలో ఉన్న భవనంలో డ్రైనేజీ పైపులకు లీకేజీ రావడంతో ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ప్లంబర్లు నాగన్నగారి నరసింహారెడ్డి(42), జకీర్, ఇలియాస్ మరమ్మతులకోసం వచ్చారు. లీకేజీ భవనం పైఅంతస్తు నుంచి వస్తున్న పైపులో ఉండడంతో నిచ్చెన సాయంతో ఎక్కి ఫాల్స్ సీలింగ్ కొంతభాగం తొలగించి పైపులో యాసిడ్ పోశారు. దాంతో డ్రైనేజీ పైపు నుంచి ఘాటైన గ్యాస్ లీక్ కావడంతో నరసింహారెడ్డికి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందగా జకీర్, ఇలియాస్‌లు అక్కడే పడిపోయారు. అధికారులు వారిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. -
మహిళ తెలివి: లో దుస్తుల్లో బంగారం పేస్ట్..
సాక్షి, శంషాబాద్: షార్జా నుంచి వచ్చిన ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లో దుస్తుల్లో బంగారం పేస్టును రెండు ఉండలను గుర్తించారు. 548 గ్రాముల బరువు గల బంగారం విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన విదేశీ కరెన్సీ విదేశీ కరెన్సీ పట్టివేత హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకెళుతూ పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జి–9541 విమానంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగేజీలో భారత కరెన్సీలో రూ.8.4 లక్షల విలువ చేసే యూఎస్, ఒమన్, యుఏఈ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్‌లో బంగారం -
చూయింగ్‌గమ్, చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్
సాక్షి, శంషాబాద్: ఎయిర్‌పోర్టులో నలుగురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 471 గ్రాముల బంగారం, ఒక ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి షార్జా నుంచి 6ఈ–1406 విమానంలో వచ్చిన నలుగురు ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఏమీ దొరకలేదు. అయితే వారి కదలికలు, మాటల తీరు అనుమానించిన అధికారులు నోట్లో తనిఖీ చేశారు. నలుగురి నోట్లో ఉన్న చూయింగ్ గమ్‌ను బయటకు తీయించగా, అందులో 471 గ్రాముల చిన్న చిన్న ముక్కలుగా ఉన్న బంగారంతో పాటు ఒక ఉంగరం బయటపడింది. ఈ బంగారం విలువ సుమారు రూ.20.67 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అలాగే షార్జా నుంచి ఎయిర్ అరేబియా జి–9458 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి చెప్పుల్లో 694 గ్రాముల బంగారం బయటపడింది. ఈ చెప్పులను కవర్లు, కార్బన్ పేపర్లతో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.27.04 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
మొత్తం కేసులు 536, బంగారం 312 కిలోలు
సాక్షి, హైదరాబాద్: ‘పలుకే బంగారమ య్యేనా..’‘నీ ఇల్లు బంగారం కానూ..’‘మా ఆయన బంగారం..’ఇలాంటి మాటలను బట్టి చూస్తే తెలియడంలేదూ.. బంగారమంటే ఎవరికైనా ఎంతిష్టమో! ఒంటిపై బంగారు నగలుంటే ఆ దర్జానే వేరు. సామాజిక, ఆర్థిక అంతరాలకు అతీతంగా అంద రూ పసిడిని అమితంగా ఇష్టపడుతుంటారు. మగువల సంగతి సరేసరి. ఈ ఇష్టం ఈనాటిది కాదు. వేల ఏళ్లనాటిది. బంగారానికి ఆదరణ అధికంగా ఉన్నచోట పలు అక్రమాలు వెలుగుచూడటం మరోకోణం. కొందరు సుంకాన్ని ఎగ్గొట్టేందుకు బంగారాన్ని అక్రమరవాణా చేస్తుంటారు. విదేశాల్లో తక్కువకు కొని, మనదేశంలో పన్ను ఎగ్గొట్టి రహస్యంగా తరలిస్తుంటారు. కస్టమ్ లేకుండా వచ్చి.. ఇక్కడ చిక్కుతున్నారు. పన్ను ఎగ్గొట్టేందుకే..! మనరాష్ట్రంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సింహద్వారం శంషాబాద్ విమానాశ్రయం. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల విదేశీయానానికి ఇదే ముఖద్వారం. అందుకే, ఈ విమానాశ్రయం ద్వారా విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేవారు తరచూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. వాస్తవానికి వీరు అక్కడ బంగారాన్ని కొనుక్కునే వస్తారు. దానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లిస్తే ఏ సమస్యా ఉండదు. కానీ, చాలామంది కస్టమ్స్ డ్యూటీ చెల్లించేందుకు ఇష్టపడక.. పలు అడ్డదారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, నిఘావ్యవస్థలు అక్రమ బంగారం రవాణాను ఇట్టే పట్టేస్తున్నాయి. కిలో వరకు చాన్స్ వాస్తవానికి విదేశాలకు వివిధ వేడుకలు, విహారయాత్రలు, వ్యాపారాల పనిమీద వెళ్లేవారికి ఒక కిలో వరకు బంగారం కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. ఈ సదుపాయం కేవలం భారత పౌరులకు మాత్రమే. వీరు తీసుకువచ్చిన కిలో బంగారం మొత్తం విలువలో 38.5 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ సంవత్సరంపాటు భారతీయులు విదేశాల్లో ఉండి ఇండియాకు వచ్చినట్లయితే వారు తీసుకువచ్చిన మొత్తం బంగారం విలువలో 13.5 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అక్రమమార్గంలో ఎంతంటే.? గత ఐదేళ్లలో కస్టమ్స్ అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంత బంగారాన్ని పట్టుకున్నారన్న విషయం తెలుసుకునేందుకు నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద దరఖాస్తు చేసుకున్నారు. 2015 నుంచి 2020 డిసెంబర్ వరకు 536 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం రూ.96.15 కోట్ల విలువైన 312.87 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ దేశాల నుంచే అధికంగా.. విదేశాల నుంచి శంషాబాద్‌కు వచ్చే బంగారంలో అధికశాతం గల్ఫ్ దేశాలదే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, సౌదీ అరేబియా, జెడ్డా, మలేసియా, బెహ్రా యిన్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల వద్దే పైన పేర్కొన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. ఆయా దేశాల్లో బంగారం విక్రయాలపై పెద్దగా ఆంక్షలు లేవు. అందుకే, చాలామంది బంగారం కొనేసి విమానమెక్కుతారు. తీరా ఇండియాకు వచ్చేసరికి విధించే 38.5 శాతం కస్టమ్స్ ట్యాక్స్ చూసి కళ్లు తేలేస్తుంటారు. కానీ, బంగారం విక్రయాల్లో ఆరితేరిన వారు అక్రమమార్గాల్లో తీసుకువస్తుంటారు. ఈ రెండు మార్గాల్లో కాకుండా విదేశాల్లో స్థిరపడి ఏడాదికి ఒకసారి వచ్చేవారిని కొందరు ఆశ్రయిస్తారు. ఇక్కడ నుంచి డబ్బులు పంపి బంగారం కొనిపించి మరీ తెప్పిస్తారు. 13.5 శాతం ట్యాక్స్ కూడా వీరే కడతారు. ఇలా బంగారం తెచ్చిచ్చినందుకు వారికి టికెట్ ఖర్చులో, ఇతర బహుమానాలో ఇస్తుంటారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం!
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలోని డెకథ్లాన్ స్పోర్ట్స్ రూమ్‌లో బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. స్టోర్‌లో బాంబ్ పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి సోమవారం బెదిరింపు కాల్ వచ్చింది. రిమోట్ బాంబ్ పెట్టినట్లు బెదిరించిన అగంతకుడు.. కోటి రూపాయలు ఇవ్వాలని లేకుంటే రిమోట్‌తో బాంబును పేల్చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర భయభ్రాంతుకలకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. విస్తృత తనిఖీల తర్వాత బాంబు లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో స్టోర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అనంతరం ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఎంజీబీఎస్‌లో డ్రైవర్ నిర్లక్ష్యం, చిన్నారి మృతి -
చిరుత సంచారం.. ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో పులి సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. పులుల సంఖ్య పెరగడంతో ఆ వన్యమృగాలు జనసంద్రంలోకి వస్తున్నాయి. గతంలో రాజేంద్రనగర్, శంషాబాద్ పరిసరాల్లో అలజడి రేపిన చిరుత మళ్లీ ఆదివారం రాత్రి సంచరించిందనే వార్త ఉలిక్కిపడేలా చేసింది. శంషాబాద్ బహదూర్‌గూడలో చిరుత సంచరించినట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో అర్ధరాత్రి పులి పది నిమిషాల పాటు సంచరించిందని గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి గొల్లపల్లి రోడ్డులో ఎయిర్పోర్ట్ గోడ దూకి చిరుత వెళ్లింది. పులి సంచరించిందనే వార్తతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. గతంలో శంషాబాద్, రాజేంద్రనగర్ పరిసరాల్లో పులి కలకలం రేపిన విషయం తెలిసిందే. రహదారిపై దర్జాగా కూర్చుని అనంతరం జనాల రద్దీతో భయాందోళన చెంది వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. అప్పుడప్పుడు కనిపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఎయిర్ పోర్ట్ సమీపంలో కనిపించడం అధికారులు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. -
రేపటి నుంచి షికాగోకు నాన్‌స్టాప్ విమానం
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నేరుగా షికాగో వెళ్లేందుకు ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. షికాగో నుంచి బుధవారం బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్–777 విమానం గురువారం రాత్రి 12.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఇదే విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ అయి నేరుగా షికాగో బయల్దేరుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. ప్రతి శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి షికాగోకు ఈ సర్వీసు వెళుతుంది. 238 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో 8 మొదటి తరగతి, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. -
ఆ సేవలు అభినందనీయం: సోనూ సూద్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన రియల్ హీరో సోనూ సూద్ శంషాబాద్ విమానాశ్రయంలోని స్వర్ణిమ్ కౌంటర్‌ను సందర్శించారు. దివ్వాంగులు, శిశువులతో ఉన్న మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణిమ్ సేవలు బాగున్నాయని ఆయన కితాబునిచ్చారు. స్వచ్చంద సంస్థ సహకారంతో సీఐఎస్ఎఫ్ స్వర్ణిమ్ పేరుతో దివ్వాంగులకు, మహిళలకు ప్రత్యేక సేవలను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం సీఐఎస్ఎఫ్ అందిస్తున్న ఈ ప్రత్యేక సేవలు బాగున్నాయంటూ అక్కడ ఉన్న పుస్తకంలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అయితే లాక్డౌన్లో వలసజీవుల కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నానంటూ సోనూ సూద్ తన సేవలను కొనసాగిస్తున్నారు. చదవండి: నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అదే: సోనూసూద్ -
దూసుకెళ్తున్న డొమెస్టిక్ విమానాలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ విమానాలు దేశవ్యాప్తంగా దూసుకెళ్తున్నాయి. దేశీయ విమానాల రాకపోకల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కోవిడ్ నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా నిలిపివేసిన విమాన సర్వీసులను మే నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. పరిమిత రూట్లలో సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతోపాటు ఎయిర్‌పోర్టులో కోవిడ్ నియంత్రణ చర్యలు, ప్రస్తుతం ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షా కేంద్రం అందుబాటులో ఉన్నందున ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మేలో నిత్యం 3 వేల మంది రాకపోకలు సాగించగా ప్రస్తుతం వారి సంఖ్య 37 వేలకు చేరుకుంది. మే నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అన్‌లాక్ 5.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికుల వైద్య పరీక్షల ఆధారంగా క్వారంటైన్ నిబంధనలను సడలించడంతో విమానరంగం వేగం పుంజుకున్నట్లు చెప్పారు. పది రెట్లు పెరిగిన ప్రయాణికులు.. ⇔ మే 25 నుంచి దేశీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. మొదటి కొన్ని వారాల్లో హైదరాబాద్ నుంచి రోజూ సుమారు 3 వేల మంది రాకపోకలు సాగించారు. ⇔ నవంబర్ నుంచి ప్రయాణికుల సంఖ్య 30 వేలకు పెరిగింది. ఇది విమాన సరీ్వసులు పునఃప్రారంభం నాటితో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ⇔ మే 25 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ⇔ మొదట్లో నిత్యం 40 విమానాలు రాకపోకలు సాగించగా ప్రస్తుతం 260 దేశీయ విమానాలు అందుబాటులో ఉన్నాయి. విమాన సరీ్వసులు పునఃప్రారంభమైన మొదటి రోజుకు ఇది 6 రెట్ల కంటే ఎక్కువ. నవంబర్ 23 వరకు 35 వేల విమానాల నడిచాయి. ⇔ ఇటీవల దేశీయ ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 37 వేలకు చేరుకుంది. అలాగే విమానాల రాకపోకల సంఖ్య ఒకే రోజు 284ను దాటింది. ⇔ కోవిడ్‌కు ముందు హైదరాబాద్ నుంచి 55 గమ్యస్థానాలు ఉండగా, ప్రస్తుతం 51 గమ్యస్థానాలకు సరీ్వసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా కొత్తగా కోజికోడ్, ఇంపాల్, జగదల్పూర్లకు కూడా సరీ్వసులు ప్రారంభమయ్యాయి. నమ్మకానికి ప్రతీక.. జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ.. విమాన ప్రయాణంపై ప్రయాణికుల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ 30 లక్షల మంది ప్రయాణికులు ఒక తార్కాణమన్నారు. కోవిడ్‌కు పూర్వం ఉన్న సామర్థ్యంలో 70 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సురక్షితమైన రాకపోకల కోసం ఎయిర్‌పోర్టులో ఉన్నచోట్ల కాంటాక్ట్ లెస్ సేవలను అందుబాటులోకి తెచి్చనట్లు పేర్కొన్నారు. త్వరలోనే కోవిడ్ పూర్వ పరిస్థితులు ఏర్పడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌కు 64 దేశాల రాయబారుల బృందం
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు 64 దేశాల రాయబారులు బృందం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ బృందంలో పలు దేశాల హైకమిషనర్లు కూడా ఉన్నారు. వీరు ఎయిర్‌పోర్టు నుంచి శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఈ హైకమిషనర్, రాయబారుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, ఈ బయోలాజికల్స్ లిమిటెడ్ సంస్థలను సందర్శించి వ్యాక్సిన్‌పై చర్చించన్నారు. ఈ నేపథ్యంలో టీకాల పురోగతిని పరిశీలించి అనంతరం ఈ విదేశీ బృందం శాస్త్రవేత్తలతో భేటీ కానుంది. ఇక సమావేశం ముగిసిన తర్వాత సాయంత్ర 5:50 గంటలకు అంబాసిడర్, హైకమిషనర్లు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. విదేశి పత్రినిధుల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లు చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. బయోలాజికల్ ఈ-సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్ర గత నెలలలో అనుమతిచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్‌కు వచ్చి భారత్ బయోటెక్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
-
‘వందే భారత్ మిషన్’నూ వదల్లేదు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. వందే భారత్ మిషన్ విమానాల్లో వస్తున్న ప్రయాణికుల్లో కొంతమంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. దామన్ నుండి వస్తున్న 11 మంది ప్రయాణికులు అధికారులు కన్నుగప్పి లోదుస్తుల్లో బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించారు. వారి నుంచి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు విలువైన 3.11 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎయిర్‌పోర్టులో గంధపు చెక్కల కలకలం..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంధపు చెక్కల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. అక్రమంగా తరలిస్తున్న 114 కిలోల గంధపు చెక్కలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ నుంచి ఖర్టూమ్‌కు అక్రమంగా తరలించేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూడాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ : జైపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానానికి పైలట్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. జైపూర్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఏషియా ఐ5–1543 విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు దిగాల్సి ఉంది. అయితే, మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ కానున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు (ఏటీసీ) సమాచారం అందించారు. ఏటీసీ అనుమతితో ఒకే ఇంజిన్‌తో పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని సాంకేతికలోపంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఎ-320 విమానం పైలట్ ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్ లీకేజీని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా దానిని నిలిపివేసి.. ఒకే ఇంజిన్‌పై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎ-320 విమానంలో సాంకేతిక లోపంపై స్పందించిన ఏయిర్ ఏషియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు సహకరిస్తామని తెలిపింది. పైలట్ల చాకచక్యంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది. -
19 విమానాలు.. 1,600 మంది ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా 2 నెలలుగా నిలిచిన దేశీయ విమానాల రాకపోకలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పలువురు ఉన్నతాధికారులతో కలసి సందర్శించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికుల లగేజీతో పాటు ట్రాలీ వాహనాలను కూడా పూర్తిగా శానిటైజ్ చేసేందుకు ప్రత్యేక టన్నెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి హైదరాబాద్‌కు, నగరం నుంచి దేశంలోని ఇతర నగరాలకు 19 విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షిం చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిబంధనల మేరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా సెన్సర్లు ఏర్పాటు చేశామన్నారు. విదేశీ విమానాల టెర్మినళ్లను కూడా సీఎస్ సందర్శించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ సూచించే సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ఆరోగ్య సేతు ఉంటేనే అనుమతి రక్షణ, ఆరోగ్యం పరంగా శంషాబాద్ విమానాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య సేతు యాప్ ఉన్న వారినే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. తొలి రోజు సుమారు 1,600 మంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించగా, ప్రయాణికులు లేని విమానాలను రద్దు చేస్తున్నారు. విమానాశ్రయంలో ప్రవేశించింది మొదలు విమానంలోకి వెళ్లేంత వరకు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం నుంచి విమానాలు, ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టును సందర్శించిన వారిలో సీఎస్‌తో పాటు జీఏడీ కార్యదర్శి వికాస్ రాజ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఉన్నారు. భారీగా రద్దయిన విమానాలు దేశీయ సర్వీసులు ప్రారంభమైన తొలిరోజే భారీగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమానం ఉదయం 8.06 గంటలకు ట్రూజెట్ 2టీ 623 కేవలం 12 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి కర్నాటకలోని విద్యానగర్‌కు బయల్దేరింది. అలాగే బెంగళూరు నుంచి బయల్దేరిన ఎయిర్ ఏషియాకు చెందిన 1576 విమానం 104 మంది ప్రయాణికులతో ఉదయం 8.20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వీసులు రద్దు చేయడంతో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబ్‌ల చార్జీలు పెట్టుకుని ఎయిర్‌పోర్టు వరకు వచ్చాక చెప్పడమేంటని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సర్వీసులు పూర్తిగా రద్దు కాగా.. పలు ముంబై, ఢిల్లీ సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతోనే పలు ఎయిర్‌లైన్స్‌లు తమ సర్వీసులను రద్దు చేసినట్లు సమాచారం. స్వీయ రక్షణ.. విమానంలో భౌతిక దూరం లేదేమోనని ప్రయాణికులు కొందరు స్వీయరక్షణ చర్యల్లో భాగంగా ప్రత్యేక సూట్లను ధరించి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు డిపార్చర్ ప్రవేశమార్గాల్లోనే వీరికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు కెమెరా స్కానింగ్ ద్వారానే పత్రాలను పరిశీలించి లోపలికి పంపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులకు సైతం ఎయిర్‌పోర్టు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పంపారు. -
కువైట్ టు హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు కేంద్రం ప్రారంభించిన వందేభారత్‌లో భాగంగా తొలి విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగింది. కువైట్‌లో చిక్కుకుపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం తరలించింది. అక్కడి నుంచి శనివారం రాత్రి 10.07 గంటలకు ఎయిరిండియా ఏఐ 988 విమానం 163 మంది ప్రయాణికులతో చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వలస కార్మికులు ఉన్నట్లు తెలిసింది. కాగా, ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీలు చేపట్టిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. భౌతిక దూరం పాటించడంలో భాగంగా ఒక్కో బస్సులో 15 మంది ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లారు. ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను సైబరాబాద్ సీపీ సజ్జనార్ దగ్గరుండి పర్యవేక్షించారు. (చదవండి: సహజీవనం చేయాల్సిందే) 4 హోటళ్లు రెడీ.. విదేశాల నుంచి వచ్చే వారికి సొంత ఖర్చులతో హోటళ్లలో క్వారంన్‌టైన్ అవకాశం కల్పించిన నేపథ్యంలో కువైట్ నుంచి వచ్చిన వారి కోసం హైదరాబాద్‌లో నాలుగు హోటళ్లు సిద్ధం చేశారు. హైటెక్‌సిటీ సమీపంలోని షెరటాన్ హోటల్, గచ్చిబౌలిలోని రెడ్ ఫాక్స్ హోటల్‌ను ఎక్కువ చార్జీ కేటగిరీలో కేటాయించారు. ఇక్కడ ఒక్కొక్కరికి భోజనంతో కలుపుకొని రూ.30 వేలు (క్వారంటైన్ మొత్తానికి) చార్జీ చేస్తారు. రూ.15 వేల కేటగిరీ కింద కామత్ లింగాపూర్, కాచిగూడలోని ఫ్లాగ్షిప్ హోటళ్లను కేటాయించారు. ఆ తర్వాత వచ్చే వారికి కూడా ఇప్పటికే ఆయా హోటళ్లలో గదులు సిద్ధం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని హోటళ్లకు తరలించే బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించారు. ఇందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు తిప్పుతోంది. హోటళ్ల ఎంపిక, తదితర అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ పర్యవేక్షిస్తోంది. (చదవండి: ఇక పరీక్షల్లేకుండానే..!) -
హైదరాబాద్ నుంచి బ్రిటన్‌కు ప్రత్యేక విమానం
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా నగరంలో చిక్కుకున్న బ్రిటన్ దేశస్తులను శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆ దేశానికి తరలించారు. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానం బీఏ (9116 /బీఏ 9117) శుక్రవారం సాయంత్రం 4.59 గంటలకు బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సాయంత్రం 6.46 గంటలకు 136 మంది యూకే జాతీయులను విమానంలో ఎక్కించుకుని అహ్మదాబాద్‌కు వెళ్లింది. అక్కడ మరికొందరు ఆ దేశానికి చెందిన వారు సైతం అదే విమానంలో ఎక్కారు. అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్ మీదుగా లండన్‌కు బయలుదేరింది. శానిటైజ్ చేసిన టెర్మినల్ సిద్ధం చేశాక.. ఈ ప్రయాణికుల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో పూర్తిగా శానిటైజ్ చేసిన ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్‌ను సిద్ధంగా ఉంచారు.యూకే డిప్యూటీ హై కమిషన్, తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న బ్రిటన్ ప్రయాణికులు మధ్యాహ్నం 3.30 గంటలకే విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ఎస్.జి.కె. కిశోర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో చిక్కుకున్న వివిధ దేశాలకు చెందిన వారిని ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.యూకే డిఫ్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో ఉన్న తమ దేశానికి చెందిన పౌరులు స్వదేశానికి తరలి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 వేల మందికి పైగా బ్రిటిష్ పర్యాటకులను తమ దేశానికి పంపించినట్లు చెప్పారు. స్వదేశాలకు తరలిన 600 మంది..... లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోయిన వివిధ దేశాలకు చెందిన 600 మందిని హైదరాబాద్ æ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8 ఎవాక్యుయేషన్ విమానాల ద్వారా జర్మనీ, అమెరికా, యూకే, తదితర దేశాలకు తరలించారు. ఒకవైపు నిరంతరం ప్రత్యేక విమానాల ద్వారా ప్రయాణికులను తరలిస్తూనే మరో వైపు నిత్యావసర వస్తువుల సప్లై చెయిన్ విమానాలను నడుపుతున్నారు. -
అంతర్జాతీయ ప్రయాణికులకు హోం క్వారంటైన్ ముద్రలు
శంషాబాద్: అంతర్జాతీయ ప్రయాణికులకు హోం క్వారంటైన్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు శనివారం సాయంత్రం వివిధ దేశాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హోం క్వారంటైన్ ముద్రలు వేశారు. ఈనెల 31న హోం క్వారంటైన్ చేయాల్సిందిగా ఆ ముద్రల్లో రాసి ఉంది. ఈ సమయంలో కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. క్వారంటైన్ గదుల్లో సౌకర్యాల లేమిపై స్పందించిన హైకోర్టు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచే గదుల్లో తగిన సౌకర్యాలు ఉండటం లేదంటూ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురిని ఉంచుతున్నారని, ఆ గదుల్లో ఏ మాత్రం పరిశుభ్రత లేకపోవడం, దోమలు, నల్లులు ఉంటున్నట్లు ఆ కథనాల్లో వచ్చిందని ఆ పిల్లో పేర్కొంది. మరుగుదొడ్లలో కనీసం నీటి వసతి కూడా లేని విషయాన్ని ప్రస్తావించింది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొంది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. పురపాలికల్లో క్వారంటైన్ కేంద్రాలు కోవిడ్–19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో క్వారంటైన్ కేంద్రాలు, తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన భవనాలను గుర్తించాలని మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. అన్ని పురపాలికల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడాలని సూచించారు. కోవిడ్–19 వ్యాప్తి, నివారణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పురపాలికల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల నియంత్రణ ఏసీ ద్వారా కోవిడ్–19 వ్యాప్తి చెందే అవకాశాలుండటంతో పురపాలక శాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై నియంత్రణ పాటించాలని పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అవసరమైనప్పుడు మాత్రమే ఏసీలు వాడాలని, వెలుతురు వచ్చేలా కార్యాలయాల కిటికీలు తెరిచి ఉంచాలని సూచించారు. -
చెకప్ చేసిన్రు.. మంచిగనే ఉంది
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ బాగుందంటూ దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపించాడు. ఇది గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగిన అతడు తన సోదరుడిని డిస్ట్రబ్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పెట్టి.. లేచిన తర్వాత సందేశం ఇవ్వాలంటూ సూచించాడు. (కరోనా నిర్థారణ పరీక్షకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?) అందులోని అంశాలు ఇవి.. ‘‘అన్నా నమస్తే... అంతా బాగేనా? ఇగో చేరుకున్నాం మంచిగ. ఫ్లైట్ రెండున్నరకు (తెల్లవారుజామున) ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో చెకప్ చేసిన్రు. కౌంటర్ మీద ఇమిగ్రేషన్ ఆఫీస్‌లో పాస్‌పోర్ట్ ఉంచుకుని, డిటేల్స్ రాసుకున్నాడు. మనకో పేపర్ ఇచ్చాడు. అదే పాస్‌పోర్ట్‌తో సమానం జాగ్రత్తగ పెట్టుకో అని చెప్పాడు. అక్కడ నుంచి లగేజ్ కాడికి వచ్చి తీసుకున్నం. ఆ తర్వాత ఇంకో లైన్ కట్టున్రి అని చెప్పిన్రు. అలా బయటకు వచ్చాం. అక్కడ ఎర్ర బస్సులు గదే క్వారంటైన్ వ్యాన్లు రెడీగా పెట్టారు. దుబాయ్, లండన్, యూఎస్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్స్‌లో వచ్చిన అందరినీ అందులో తీసుకువచ్చి రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీకి తీసుకువచ్చి ఉంచిర్రు. ఇక్కడ మనిషికి సింగిల్ రూమ్, వైఫై, టీవీ, ఏసీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నయ్. స్నానం చేసి కూర్చున్నా. ఎన్ని రోజులు ఉంచుకుంటారో తెలీదు. ఖైదీలను తోల్కపోయినట్లు ముందొక పోలీసు గాడీ.. వెనుక మా బస్సు.. అలా ఎయిర్పోర్ట్ నుంచి 40 నిమిషాల్లో తోల్కొని వచ్చారు. గట్లుంది పరిస్థితి. ఇక చూడాలి ఎట్లుంటదో. ఏం టెన్షన్ తీసుకోకున్రీ. చెప్తా మల్లా విషయాలు. లేచినాక నాకు మెసేజ్ పెట్టు’’. (విమానం దిగగానే క్వారంటైన్కే..) పోలీసులకు కేటీఆర్ అభినందనలు నాగోలు: కోవిడ్ వైరస్‌పై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఎల్బీనగర్లో వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సూచనల మేరకు ఎల్బీనగర్ అదనపు సీఐ అంజపల్లి నాగమల్లు గురువారం కొత్తపేట, ఎల్బీనగర్ చౌరస్తా వద్ద వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు కోవిడ్ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మైక్ ద్వారా వివరించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నాగమల్లుకు అభినందనలు తెలిపారు. (ఇజ్రాయిల్‌లో మనోళ్లకు కష్టాలు) -
విమానం దిగగానే క్వారంటైన్కే..
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. గత రెండ్రోజులుగా 1,160 మందిని ధూలపల్లి, వికారాబాద్, గచ్చిబౌలి స్టేడియం, ఎంసీఆర్హెచ్ఆర్డీ, రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీ, నారాయణమ్మ కాలేజీ, అమీర్‌పేట నేచర్ క్యూర్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక పడక గదులు సిద్ధం చేశామన్నారు. విమానాశ్రయంలో దిగగానే వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని స్లిప్పులను అందజేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి వెళ్లకుండా ఒక్కో కేంద్రానికి ఒక ఏసీపీని ఇన్చార్జ్గా నియమించినట్లు తెలిపారు. కాగా దూలపల్లి ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఒక్కో గదిని ఇద్దరికి కేటాయించారని, బాత్రూంలు ఇలా చాలా చోట్ల పరిశుభ్రత లేదని పలువురు ఎన్ఆర్ఐలు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం 6 అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు దేశీయంగా 30 విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
కరోనా అలర్ట్: ఎయిర్‌పోర్టు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తితో జనాలు గడప దాటాలంటేనే జంకుతున్నారు. పలు దేశాలు సైతం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ వైరస్ భయంతో జనాలు ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయే శంషాబాద్ విమానాశ్రయం గురువారం నిర్మానుష్యంగా మారింది. అంతేకాక పలు ఎయిర్‌లైన్ సర్వీసులు కూడా రద్దవడంతో రాకపోకలు స్థంభించాయి. మరోవైపు విదేశాల నుంచి వస్తున్న వారిని నేరుగా వారి లగేజ్‌తో సహా ఐసోలేషన్ వార్డులకు తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను, డీసీఎం వ్యానులను ఎయిర్‌పోర్టులో అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో పది అంబులెన్స్‌లు వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో ప్రతిరోజు 2 వేల నుంచి 2,500 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వారితో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తున్న ప్రయాణికులకు నగరంలోని గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మిగతావారిని వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. (ఆకాశవీధిలో..నో టూర్స్) విమానాలు భారీగా రద్దు.. కొన్నిరోజులుగా ఆయా దేశాల ఆంక్షలతోపాటు ప్రయాణికులు కూడా రాకపోకలకు రద్దు చేసుకుంటుండటంతో అంతర్జాతీయ ట్రాఫిక్‌తోపాటు దేశీయ ట్రాఫిక్ కూడా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ ప్రభావంతో బుధవారం నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు 25 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఢిల్లీ, కొచ్చిన్, బెంగళూరు, చెన్నైలాంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేశాయి. (చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్పోర్ట్ సిబ్బంది) -
కరోనా ఎఫెక్ట్... ఎయిర్‌పోర్టులో అప్రమత్తం
-
‘థర్మల్ స్క్రీనింగ్’ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. కరోనా వైరస్ (కోవిడ్–19) హైదరాబాద్‌ను కూడా తాకడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ‘తెలంగాణ లో కరోనా వైరస్ ప్రభావం లేదు. విదేశాల నుండి వచ్చే వారి ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాల నుండి వచ్చే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీన్ చేస్తున్నామని’ అధికారులు మంత్రికి వివరించారు. -
పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి
-
చర్లపల్లి జైలుకు రేవంత్.. 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. జన్వాడలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్‌పై డ్రోన్ కెమెరా వాడిన కేసులో రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రేవంత్.. అక్కడి నుంచి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. డ్రోన్ కెమెరా వాడిన కేసులో తనపై సెక్షన్ 188, 287, 109, 120(b) కింద కేసు ఎలా నమోదు చేస్తారని రేవంత్ పోలీసులతో వాదనకు దిగారు. అలాగే ఆ ఘటనకు సంబంధించి తన ప్రమేయం గురించి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన పోలీసులకు సహకరించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ప్రభుత్వాస్రత్రికి తరలించారు. అనంతరం ఆయన్ని ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. (చదవండి : భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!) కాగా, ఈ కేసుకు సంబంధించి సెక్షన్ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, రెడ్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద రేవంత్‌రెడ్డితోసహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే వీరు డ్రోన్ ఎగరవేసినట్టు పోలీసులు తేల్చారు. రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి.(చదవండి : హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ సోదరులు) -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘కరోనా’ అలర్ట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక వేసవి సెలవుల్లోఇంటిల్లిపాది కలిసి తమకు నచ్చిన దేశంలో పర్యటించేందుకు ప్రణాళికలను రూపొందించుకున్న నగర వాసులు తమ పర్యటనలను పూర్తిగా రద్దు చేసుకున్నారు.ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కోవిడ్–19ప్రభావంతో ఇప్పటికే అంతర్జాతీయ పర్యాటక రంగం అతలాకుతలమైంది. హైదరాబాద్ నుంచి సాధారణంగా ప్రతిరోజు సుమారు 10 వేలమందికి పైగా ప్రయాణికులు వివిధ దేశాలకు రాకపోకలుసాగిస్తారు. కోవిడ్–19 ప్రభావంతో ఈ ప్రయాణికుల సంఖ్య సగానికి పడిపోయినట్లు అధికారవర్గాలుఅంచనా వేస్తున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, తదితర తప్పనిసరైతే కానీ ఎవరూ విదేశాలకు వెళ్లడం లేదని నగరానికి చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, ఇరాన్ తదితర దేశాలకు ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోగా, హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లే మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్, యూరోప్ దేశాలకు సైతం రాకపోకలు దాదాపు స్తంభించినట్లు ట్రావెల్స్ సంస్థలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలు ఎయిర్‌లైన్స్ సైతం తమ విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లేవాళ్లు మాత్రమే కాకుండా వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్లు కూడా తగ్గుముఖం పట్టడంతో పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉన్న ట్రావెల్స్ సంస్థలతో పాటు, హోటళ్లు ఆర్ధికంగా తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నాయి. కోవిడ్–19 షాక్.... ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్–19 తాజాగా హైదరాబాద్‌ను కూడా తాకడంతో నగరం ఒక్కసారిగా షాక్గురైంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గుముఖం పట్టగా, రానున్న ఒకటి, రెండు నెలల కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు సైతం ముందు జాగ్రత్తగా తమ బుకింగ్‌లను రద్ద చేసుకుంటున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 55 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లే వారు ఉన్నారు. దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికులే సుమారు 3500 మంది ఉంటారు. ఆ తరువాత అమెరికా, యురోప్ దేశాలకు, శ్రీలంక,తదితర దేశాలకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 25 అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమాన సదుపాయం ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలపైన పలు విమానయాన సంస్థలు చార్జీలను గణనీయంగా తగ్గించినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బ్యాంకాక్, సింగపూర్ వంటి దేశాలకు హైదరాబాద్ నుంచి వెళ్లి తిరిగి వచ్చేందుకు రూ.20 వేల వరకే ఉండడం గమనార్హం. సాధారణంగా అయితే ఈ చార్జీలు రూ.30 వేల పైనే ఉంటాయి. ఎయిర్‌పోర్టులో అలర్ట్... కరోనా నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో కొంతకాలంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు తాజా పరిణామాలతో మరింత అమ్రపత్తమయ్యారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయడంతో పాటు, స్వచ్చందంగా ముందుకు వచ్చే వారికి సైతం పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
8,212 మందికి కరోనా స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా థర్మల్ స్కానింగ్ ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల 30 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 8,212 మందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసింది. వారంతా చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, సింగపూర్, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చినవారే. కరోనా లక్షణాలుంటే ప్రాథమికంగా థర్మల్ స్కానింగ్‌లో గుర్తించడానికి వీలుంది. ప్రధానంగా జ్వరం ఉష్ణోగ్రతలు థర్మల్ స్కానింగ్‌లో గుర్తిస్తారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే నేరుగా నిర్ధారిస్తున్నారు. థర్మల్ స్కానింగ్‌లో కరోనా అనుమానిత లక్షణాలున్న వారిలో కొందరిని ఆసుపత్రికి తరలించగా, మరికొందరికి జాగ్రత్తలు సూచిస్తూ వారి వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని సలహాలిచ్చి పంపారు. ఇప్పటివరకు 96 మందిని బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఒంటరిగా 28 రోజులు ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు సూచించాయి. వారంతా వివిధ జిల్లాలకు చెందినవారు. కాగా వారి వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే వారికి కరోనా అనుమానిత లక్షణాలున్నాయన్న ప్రచారం జరిగితే, చుట్టుపక్కలున్న వారు బహిష్కరణ చేసే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖ వరా>్గలు తెలిపాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 87 మంది నుంచి నమూనాలను సేకరించారు. వారిలో 85 మందికి నెగెటివ్ రాగా, మరో ఇద్దరి నమూనాలను గురువారం పరీక్షల కోసం పంపారు. వాటి వివరాలు రావాల్సి ఉంది. కరోనాపై ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు వేడిగా ఉండటంతో కరోనా వైరస్ బతికే పరిస్థితి ఉండదని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు భరోసా ఇస్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించాలని పదేపదే చెబుతున్నారు. అనంతర పర్యవేక్షణపై అయోమయం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా వైరస్‌పై తలెత్తుతున్న అనేక అనుమానాలను నివృత్తి చేస్తూ బులిటెన్ విడుదల చేసింది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని విమానాశ్రయంలో థర్మల్ స్కానింగ్‌లో స్క్రీనింగ్ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జ్వరం వచ్చిన వ్యక్తులను గుర్తించడంలో థర్మల్ స్కానర్లు ప్రభావవంతంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ సోకితే వారు అనారోగ్యానికి గురై జ్వరం రావడానికి 2 నుంచి 10 రోజుల సమయం పడుతుందని, ప్రాథమిక దశలో ఉన్నప్పుడు థర్మల్ స్కానింగ్‌లో కనుగొనలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యక్తులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలేంటనే దానిపై స్పష్టత లేదు. జ్వరం, జలుబు, ఇతరత్రా అనుమానిత లక్షణాలున్న వారినే గుర్తించి ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేస్తున్నారు. అయితే 8 వేల మందిని స్క్రీనింగ్ చేశాక, వారిలో వేలాది మందికి అప్పటికప్పుడు లక్షణాలు లేవు. కానీ వారిలో ఎవరికైనా తర్వాత కరోనా లక్షణాలు వృద్ధి చెందుతున్నాయా లేదా అన్న విషయంలో పర్యవేక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వారిని సాధారణ ప్రయాణికుల మాదిరిగా పంపేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వారి ఆరోగ్య పరిస్థితులపై స్పష్టమైన నిఘా పెట్టలేదన్న చర్చ జరుగుతోంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ కూడా ఎటువంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని పలువురు అంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో సూచనలు.. కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు తరచుగా చేతులను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి. లేదా సబ్బుతో కడుక్కోవాలి. చేతులు శుభ్రం చేసిన తర్వాత చేయి తడి లేకుండా ఆరబెట్టాలి. చైనా నుంచి లేఖ లేదా ఏదైనా ప్యాకేజీలను స్వీకరించడం సురక్షితమే. వాటి నుంచి కరోనా వైరస్ సంక్రమించదు. లేఖలోని అక్షరాలు లేదా ప్యాకేజీలలో ఉండే వస్తువులపై ఒకవేళ కరోనా వైరస్ ఉన్నా అది ఎక్కువ కాలం జీవించదు. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల నుంచి కరోనా వైరస్ వస్తుందనడానికి ఆధారాల్లేవు. అయినా పెంపుడు జంతువులతో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ సబ్బుతో చేతులు కడుక్కోవడం సురక్షితం. న్యుమోనియాకు ఉపయోగించే వ్యాక్సిన్లు కరోనా వైరస్ రాకుండా ఏమాత్రం కాపాడలేవు. ఈ వైరస్ కొత్తది.. పైగా భిన్నమైన లక్షణాలున్నది. దీనికి సొంత టీకా రావాల్సి ఉంది. అయితే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి టీకాలు వేయించుకోవడం మంచిదే. వెల్లుల్లి తింటే కరోనా రాదన్న వాదనకు ఆధారాల్లేవు. వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారమే. ఇది కొన్ని యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. నువ్వుల నూనె వాడటం వల్ల కరోనా వైరస్ శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుందన్న వాదనలో వాస్తవం లేదు. నువ్వుల నూనె కరోనా వైరస్‌ను చంపదు. అన్ని వయసుల వారికి కరోనా వైరస్ సోకుతుంది. ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి ఉన్న వారికి ఈ వైరస్‌తో తీవ్ర అనారోగ్యం కలిగే ప్రమాదముంది. కరోనా వైరస్ నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట మందులు లేవు. -
‘గోల్డెన్’ లేడీస్.. బంగారాన్ని లోదుస్తుల్లో దాచి!
సాక్షి, రంగారెడ్డి: అతివలు స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. ఎన్నో విధాలుగా ఆశలు చూపి వీరిని క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. ఒక్క ఆదివారమే జిద్దా నుంచి 2.5 కేజీల బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తీసుకువస్తూ నగరానికి చెందిన నలుగురు మహిళలు చిక్కారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పడానికే.. సాధారణంగా స్మగ్లర్లు వీరి కోసం బంగారాన్ని తీసుకుని వచ్చే క్యారియర్లు అనగానే అందరూ పురుషులు అనే భావిస్తుంటారు. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భంతో, చంకలో పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు అనుమానించం చాలా తక్కువ. ఈ కారణంగానే దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తిస్తున్న స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ.. వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో ఒంటిపై ఏర్పాటు చేసుకుని బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్‌లు (డీఎఫ్ఎండీ) కూడా కొంత వరకు పసిగట్టలేకపోతున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. తప్పించుకుంటున్న కీలక వ్యక్తులు.. ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా.. ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ముమ్మర కసరత్తు.. బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్ణంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారిగా ఎప్పుడు వచ్చారు.. ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఇవిగో ఉదాహరణలు.. దుబాయ్ నుంచి ‘గర్భవతిగా’ వచి్చన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచి్చన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వా«దీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
భోగాపురం దాకా విశాఖ లైట్ మెట్రో
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ నిర్మించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) సన్నాహాలు చేస్తోంది. కేవలం నగరంలోనే మెట్రో రైలు నడపడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలను తీర్చలేమన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏర్పడే భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలో నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంచనాకు వచ్చినట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం కాకపోవడం ఒక లోపంగా మారింది. అలాంటి పరిస్థితి విశాఖలో ఉత్పన్నం కాకుండా చూడాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్నంలో 46.40 కిలోమీటర్ల మేర మూడు లైట్ మెట్రో కారిడార్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మొత్తాన్ని కలుపుతూ 140 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్లను ప్రతిపాదించింది. అందులో కొమ్మాది–ఆనందపురం జంక్షన్, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ప్రతిపాదించిన కారిడార్లను రెండో దశలో నిర్మించాలని తొలుత భావించారు. కానీ, భోగాపురం ఎయిర్‌పోర్టుతో తొలి దశలోనే నగరాన్ని అనుసంధానిస్తే బాగుంటుందన్న అంచనాతో రోడ్ మ్యాప్ రూపొందించారు. డీపీఆర్, టెండర్ల ప్రక్రియ ఒకేసారి తొలి దశలో స్టీల్‌ప్లాంట్–కొమ్మాది జంక్షన్, గురుద్వారా–పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం–ఆర్కే బీచ్, కొమ్మాది–ఆనందపురం జంక్షన్, లా కాలేజి–మరికివలస, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ 79.91 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్, యూఎంటీసీ, రైట్స్ సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. డీపీఆర్‌కి సమాంతరంగా ఈ ఆరు కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో టెండర్లు పిలిచే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తద్వారా మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధమయ్యేటప్పటికి నిర్మాణ సంస్థను కూడా ఎంపిక చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. రెండో దశలో ట్రామ్ వ్యవస్థ! రెండో దశలో 60.2 కిలోమీటర్ల మేర నిర్మించే ఎన్ఏడీ జంక్షన్–పెందుర్తి, స్టీల్‌ప్లాంట్–అనకాపల్లి, పాత పోస్టాఫీస్–రుషికొండ బీచ్, రుషికొండ బీచ్–భీమిలి బీచ్ కారిడార్లను ఆధునిక ట్రామ్ వ్యవస్థలుగా నిర్మించాలని భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం తొలి దశలో చేపట్టే ఆరు కారిడార్లలో జన సమ్మర్థం ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో వాటిని లైట్ మెట్రోగా, రెండో దశలో చేపట్టే కారిడార్లలో జన సమ్మర్థం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ట్రామ్ వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం తర్వాతే దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. కానీ, ముందస్తు అంచనాతో ట్రామ్ వ్యవస్థపైనా డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్లను ఈ సంవత్సరమే ప్రారంభించి 2024 నాటికి, రెండో దశను 2023లో ప్రారంభించి 2028–29 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు ఏఎంఆర్‌సీ అధికారులు స్పష్టం చేశారు. -
బాంబు అనుకుని తెరిస్తే బంగారం..
శంషాబాద్: అనుమానిత వస్తువుగా భావించిన ఓ బ్యాగులో బంగారం బయటపడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానాశ్రయంలోని అంతర్జాతీయ అరైవల్‌లో బ్యాగులు తీసుకొచ్చే బెల్టుపై ఆదివారం రాత్రి ఓ బ్యాగు మిగిలిపోయింది. ప్రయాణికులు ఎవరూ దానిని తీసుకోకపోవడంతో సీసీ కెమెరాల్లో పరిశీలించిన అధికారులు వెంటనే సీఐఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో బాంబు ఉండవచ్చేమోనని అనుమానించిన అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించారు. స్కానింగ్ ద్వారా బ్యాగ్‌లో ఓ అనుమానిత వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ మోటార్‌ను బయటికి తీశారు. దానిని బద్దలు చేసి చూడగా.. బంగారు ప్లేట్లకు ఇనుప పూతపూసి మోటారులో పెట్టినట్లు గుర్తించారు. ఈ బంగారు ప్లేట్ల బరువు దాదాపు 1.5 కేజీలు ఉన్నట్లు తెలిపారు. దీనిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారుల తనిఖీలు గమనించిన ప్రయాణికుడే దానిని బెల్టుపై వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ప్రయాణికుడు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
బాయ్‌ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ ప్రమాదవశాత్తు..
సాక్షి, రంగారెడ్డి : బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనం పైనుంచి కింద పడి ఓ యువతి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటు చేసుకుంది. మృతురాలు ఎయిర్పోర్ట్ ఉద్యోగిని సిమ్రాన్(22)గా గుర్తించారు. కర్ణాటకలోని ముధోల్ టౌన్ బాగల్కోట్ జిల్లాకు చెందిన సిమ్రాన్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో హాస్టల్లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్ర 5 గంటల ప్రాంతంలో హాస్టల్ మూడో ఫ్లోర్ నుంచి కింద పడి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. తన డిప్రెషన్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు పేర్కొన్నారు. -
నలుగురిని బలిగొన్న అతివేగం
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మంతెన జనార్ధన్ దుబాయ్‌లో ఉంటాడు. ఆయన భార్య లావణ్య (35), కూతురు రోషిణి (15) నిజామాబాద్‌లో నివాసముండగా, కుమారుడు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. అయితే, జనార్ధన్ ఇంట్లో అద్దెకుండే నాగమణి కుమారుడు అరుణ్ ఆదివారం రాత్రి ఇరాక్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు కారు ఇవ్వాలని అరుణ్ ఇంటి యజమాని లావణ్యను అడగడంతో ఆమె సరేనంది. హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడ్ని చూసేందుకు తాను కూడా వస్తానని తెలిపింది. దీంతో లావణ్య, ఆమె కూతురు రోషిణి, అరుణ్‌తో పాటు డ్రైవర్ అంగూర్ సుశీల్ (22), ఆయన స్నేహితుడు నవీపేట మండలం సుభాష్‌నగర్‌కు చెందిన మ్యాదరి ప్రశాంత్ (30) ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో కారు (ఏపీ15ఏడీ 5050)లో బయల్దేరారు. ఎయిర్‌పోర్టులో అరుణ్‌ను విడిచి పెట్టిన అనంతరం లావణ్య కుమారుడి వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అతివేగం, నిద్రమత్తే కారణం! డ్రైవర్ సుశీల్ నిద్రమత్తులో అతివేగంగా నడపడంతో కారు అదుపు తప్పింది. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు భిక్కనూరు మండలం జంగంపల్లి వద్దకు రాగానే కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. కిలోమీటరు సూచిక రాయిని ఢీకొని, అదే వేగంతో వంద మీటర్ల దూరంలో ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్‌తో కారు తలుపులను తొలగించి బయటకు తీశారు. మృతదేహాలను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్పోర్ట్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి అడవి పిల్లి ముచ్చెమటలు పట్టించింది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏరో టవర్స్ సమీపంలో ఓ జంతువు తిరగడం గమనించారు. దానిని చిరుతగా భావించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలో కి దిగిన అటవీ శాఖ సిబ్బంది.. మూడు గంటలపాటు శ్రమించి దానిని బంధించారు. అయితే అది చిరుత కాదని.. అడవి పిల్ల అని తేల్చారు. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
షిరిడీకి విమానాలు రద్దు
శంషాబాద్: షిరిడీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అక్కడికి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. స్పైస్‌జెట్ 1096, 3578 విమానాలతోపాటు ఇండిగో, ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మంగళవారం వెళ్లాల్సిన ఆయా విమానాలను బుధవారానికి రీ షెడ్యూల్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణాలు రద్దవడంతో ప్రయాణికులకు ఆయా సంస్థలు విమాన చార్జీలు తిరిగి చెల్లిస్తున్నాయి. -
ఇండిగో విమానంలో విదేశీయుడి హల్చల్
హైదరాబాద్ : గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ జర్మనీ దేశస్థుడు హల్చల్ చేశాడు. విమానం బాత్రూమ్లో బట్టలు లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు గుర్తించారు. దీంతో పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఆ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడనే అనుమానంతో.. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. -
విమానంలో మహిళకు పురిటినొప్పులు
శంషాబాద్: విమాన ప్రయాణంలో ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సిబు ఫసి పిక్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం ఉదయం దుబాయి నుంచి మనీలా బయలుదేరింది. మార్గమధ్యలో మనీలా దేశానికి చెందిన మన నాయేటా బేబిజీన్ లెడెస్మా (26) అనే ప్రయా ణికురాలికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో పైలట్ శంషాబాద్ ఏటీసీని సంప్రదించి విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రి వైద్యసిబ్బంది మహిళను అంబులెన్స్‌లోకి ఎక్కించారు. నొప్పులు తీవ్రమవడంతో వైద్యులు ఆమెకు అక్కడే ప్రసవం చేశారు. మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. -
శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్ : దుబాయ్ నుంచి మనీలా వెళుతున్న సీబు పసిఫిక్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మనీలాకు చెందిన సెరిదా అనే ప్రయాణికురాలికి ఆకస్మాత్తుగా పురుటి నొప్పులు రావడంతో విమానాన్ని ఏటీసీ అనుమతితో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
ఎగిరిపోతే ఎంత బావుంటుంది!
సాక్షి, హైదరాబాద్: కారు, బస్సు, రైలు.. ఇవేవీ కాదు. విమానయానానికే ప్రయాణికులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎగిరిపోతేనే ప్రయాణం బావుంటుందని భావిస్తున్నారు. గగనయానమే బెస్ట్ అని విమానాలు అలవోకగా ఎక్కి దిగేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. 2018–19లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యలో 20% వృద్ధి నమోదు కావడం విశేషం. విమానాల రాకపోకలు తెలిపే ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్ (ఏటీఎం)తోపాటు కార్గో ట్రాఫిక్, ఎయిర్ రూట్ కనెక్టివిటీలోనూ ఆర్జీఐఏ దూసుకెళ్తోంది. ఫ్లైనాస్ సంస్థ హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు నేరుగా సర్వీసులు నడుపుతుండగా.. స్పైస్‌జెట్ సంస్థ బ్యాంకాక్‌కు ప్రతిరోజూ విమానం సర్వీసు అందిస్తోంది. ఇక ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్) కింద హైదరాబాద్ నుంచి హుబ్లీ, కొల్హాపూర్, నాసిక్‌తోపాటు అమృత్సర్, వడోదర, పోర్ట్‌బ్లెయిర్, ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, ఇంఫాల్, కన్నూర్, భోపాల్ నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ మీదుగా 18 అంతర్జాతీయ సర్వీసులు.. దేశంలోని 48 నగరాలను కలుపుతూ దేశీయ సర్వీసులు ఆర్జీఐఏ విమానాశ్రయం ద్వారా అందుబాటులో ఉన్నాయి. తాజాగా వెలువడిన సామాజిక ఆర్థిక సర్వే–2019లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. విమాన సేవల్లో శంషాబాద్ విమానాశ్రయం దక్షిణమధ్య భారతావనికి ముఖద్వారంగా అవతరించిందని సర్వే అభిప్రాయపడింది. ఆర్జీఐఏ మరికొన్ని ఘనతలివీ.. 2017–18లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి 1.32 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. 2018–19లో ఆ సంఖ్య 1.58 కోట్లకు చేరింది. 2017–18లో 1.05 కోట్ల మంది దేశీయ ప్రయాణాలు చేయగా.. 2018–19లో 22 % వృద్ధి నమోదై వారి సంఖ్య 1.29 కోట్లకు చేరింది. 2017–18లో 26.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలందించగా.. 2018–19లో ఆ సంఖ్య 29.6 లక్షలకు చేరి 11% పెరుగుదల రికార్డయింది. 2017–18లో 1,08,773 విమానాలు శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించగా.. 2018–19లో 23% పురోగతి తో ఆ సంఖ్య 1,33,755కు చేరుకుంది. 2017–18లో 1,03,120 మెట్రిక్ టన్నుల రవాణా జరగ్గా.. 2018–19లో 8% వృద్ధి నమోదై 1,33,775 మెట్రిక్ టన్నులకు పెరిగింది. -
‘స్మార్ట్’గా మొక్కలకు చుక్కలు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అడుగు ముందుకేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌పోర్టులోని గార్డెన్లు, ఇతర అవసరాలకు నీటిని పొదుపుగా వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఇరిగేషన్ మేనేజ్మెంట్, మానిటరింగ్ సాఫ్ట్వేర్’పరిజ్ఞానంతో పని చేసే ఈ నీటిపారుదల వ్యవస్థ ద్వారా సుమారు 10 కిలోమీటర్ల మార్గంలోని ఎనభైకి పైగా ఎకరాల్లోని గార్డెన్స్‌కు నీటిని అందజేస్తారు. దీంతో 35 శాతానికి పైగా నీరు ఆదా కానుంది. మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రణ.. క్లౌడ్‌బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ టెక్నాలజీలో మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లోనే నీటి నిర్వహణ జరుగుతుంది. తొలుత 2018 జనవరిలో ఎయిర్‌పోర్టులోని ప్రధాన రహదారి గుండా ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రారంభించారు. 2.4 కిలోమీటర్ల చొప్పున మూడు పొడవైన భాగాలను ఏర్పాటు చేసి వాటిలో రెండు సైట్ కంట్రోలర్లు అమర్చారు. మొదటి దశలో నీటిపారుదల షెడ్యూల్‌ను, విడుదల చేసే నీటి పరిణామాన్ని సైట్ కంట్రోలర్ల ద్వారా నియంత్రించారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేశారు.దీంతో నీటి పారుదల వ్యవస్థలో ఇప్పటి వరకు వినియోగించిన కంట్రోలర్లు ఇక నుంచి క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఈ వ్యవస్థ నిరంతరం నీటి పారుదలను పర్యవేక్షిస్తుంది. ఈ క్లౌడ్ బేస్డ్ సెంట్రల్ ఇరిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఎక్కడి నుంచైనా మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, టాబ్లెట్ లాంటి ఏ ఇంటర్నెట్ కనెక్టెడ్ పరికరంతోనైనా నీటి పారుదలను నిర్వహించవచ్చు. పర్యావరణ పరిరక్షణకు దోహదం సహజ వనరులను పరిరక్షించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎయిర్‌పోర్టులో నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో క్లౌడ్ బేస్డ్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ చాలా ముఖ్యమైంది. దీనివల్ల నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల ద్వారా నియంత్రించొచ్చు. – కిశోర్, సీఈవో, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పొదుపు మంత్రం.. - ఈ టెక్నాలజీ ద్వారా నీటి పొదుపు సాధ్యమవుతుంది. - వేసవిలో విమానాశ్రయంలోని ప్రధాన రహదారిపై నీటిపారుదలకు రోజూ 1,684 కిలో లీటర్ల నీరు అవసరమవుతుంది. క్లౌడ్ బేస్డ్ నీటిపారుదల వల్ల 35% వరకు నీరు ఆదా చేయొచ్చు. - లీకేజీలు, నీటి వృథాను గుర్తించి అరికట్టొచ్చు. - నీటి పారుదలలో లోటుపాట్లను గుర్తించి మెసేజీల రూపంలో చేరవేస్తుంది. - ఎయిర్ పోర్టు పరి ధిలో భూగర్భ జలాల పెంపు కోసం 40 ఎకరాల విస్తీర్ణం లో రీచార్జ్ బేసిన్‌ను, 10 కృత్రిమ రీచార్జ్ బావులను అభివృద్ధి చేశారు. - నీటి సంరక్షణలో పాటిస్తున్న చర్యలకు ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి ‘గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ రికగ్నిషన్–2019’పురస్కారం లభించింది. -
దోస్త్ ఫారిన్ పోవొద్దని...
శంషాబాద్: స్నేహితుడు ఇస్తున్న విందులు, లభిస్తున్న విలాసాలు దూరమైపోతాయని అతడి విదేశీ ప్రయాణాన్ని రద్దు చేయడానికి ఓ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకమిది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు పేలుస్తానంటూ బెదిరింపు మెయిల్‌తో భద్రతాధికారులు, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి బుధవారం తన కార్యాలయంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన కస్టమర్ సపోర్ట్ మెయిల్‌కు కాలేరు సాయిరాం అన్న ఐడీతో ఓ సందేశం వచ్చింది. అందులో ‘ఐ వాంట్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ఎయిర్‌పోర్టు టుమారో’అని ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ ఐడీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేరు సాయిరాందిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు ఉప్పల్‌లోని ఫిర్జాదిగూడలో నివాసముండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కెనడాలో ఉన్నత చదువుల కోసం సాయిరాం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. వరంగల్‌కు చెందిన తన స్నేహితుడు శశికాంత్ నగరంలోనే ఎంటెక్ చదువుతూ అమీర్‌పేట్‌లో నివాసముంటున్నాడు. సాయిరాం మొదటిసారి వీసా రాకపోవడంతో రెండోసారి ఆగస్టు 5న తన వివరాలన్నింటిని పీడీఎఫ్ ఫైల్‌గా చేసి శశికాంత్ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి కెనడా వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సమయంలో శశికాంత్ సాయిరాం వివరాలన్నింటిని తస్కరించాడు. సాయిరాం వెళ్లిన తర్వాత కెనడా ఇమిగ్రేషన్‌కు అసభ్యకరమైన సందేశాలను సాయిరాం మెయిల్ ఐడీ ద్వారా పంపాడు. ఈ విషయమై సాయిరాంకు అక్కడి నుంచి సమాచారం రావడంతో వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరుగుతోంది. మరోసారీ చెడగొట్టాలని.. కెనడాలో ఉన్నత చదువుల కోసం మరోసారి సాయిరాంకు అవకాశం రావడంతో సెప్టెంబర్ 4న కెనడా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ఈసారి సాయిరాం ప్రయాణాన్ని ఎలాగైనా చెడగొట్టాలని శశికాంత్ నిర్ణయించుకున్నాడు. తాజాగా సెప్టెంబర్ 3న మరోసారి సాయిరాం ఐడీతోనే శంషాబాద్ విమానాశ్రయంలోని కస్టమర్సపోర్ట్ మెయిల్ ఐడీకి ఎయిర్‌పోర్టులో బాంబు పేలుస్తానంటూ సందేశం పంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులను రంగంలోకి దింపారు. కాలేరు సాయిరాం ద్వారా వివరాలను సేకరించడంతో అతడి స్నేహితుడైన శశికాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే తప్పుడు సందేశాలు పంపినట్లు అంగీకరించాడు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టు భద్రతకు భగ్నం కలిగించే విధంగా వ్యవహరించినందుకుగాను వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ రామకృష్ణ పాల్గొన్నారు. -
'ఆ బాంబు బెదిరింపు నకిలీయే'
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. సాయిరాం కాలేరు అనే పేరుతో ఒక అగంతకుడు మెయిల్ రూపంలో అధికారులకు పంపిన విషయం విదితమే . కాగా, ఈ బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్‌గా గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి బుధవారం ప్రెస్మీట్లో పేర్కొన్నారు. డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాయిరాం, శశికాంత్ ఇద్దరు మంచి స్నేహితులు. కాగా, సాయిరాం గత కొన్ని రోజులుగా కెనడా వెళ్లే పనిలో వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయిరాం వీసా అప్లికేషన్ దరఖాస్తు చేయడం కోసం శశికాంత్ ఇంటికి వెళ్లాడు. అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలను సాయిరాం కంప్యూటర్లో అప్లోడ్ చేస్తుండగా శశికాంత్ ఆ వివరాలను రహస్యంగా సేకరించినట్లు తెలిపారు. సాయిరాం పేరుతో అసభ్య పదజాలంతో కూడిన సమాచారాన్ని శశికాంత్ కెనడా వీసా సైట్లో అప్లోడ్ చేయడాన్ని తెలుసుకున్న సాయిరాం రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఫిర్యాదు ఇచ్చాడన్న కోపంతో ఎలాగైనా సాయిరాంను కెనెడా వెళ్లకుండా అడ్డుకోవాలని శశికాంత్ విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే 4వ తేదిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సాయిరాం కెనడాకు వెళ్తున్నట్లు తెలుసుకున్న శశికాంత్ సాయిరాం మెయిల్ ఐడీతో ఎయిర్‌పోర్ట్‌ను బ్లాస్ట్ చేయనున్నట్లు మెయిల్ రూపంలో అధికారులకు పంపినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ఘటనకు సూత్రధారుడైన శశికాంత్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. (చదవండి : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు) -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. రేపు ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బ్లాస్ట్ చేయబోన్నానంటూ ఓ ఆగంతకుడు మెయిల్ పంపాడు. సాయిరాం కాలేరు అనే మెయిల్ ఐడీతో విమానాశ్రయానికి మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు తనిఖీలు చేస్తూనే మరో వైపు ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును గుర్తించలేదని సమాచారం. -
టాయిలెట్లో బంగారం
శంషాబాద్ : విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారనే భయంతో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ ప్రయాణికుడు దాన్ని టాయిలెట్ రూంలో పడేశాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. 6 ఈ 1406 విమానంలో షార్జా నుంచి నగరానికి వస్తున్న షేక్ అబ్దుల్ సాజిద్ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నాడని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. విషయాన్ని గ్రహించిన షేక్ అబ్దుల్ సాజిద్ తన వద్దనున్న బంగారం బిస్కెట్లను టాయిలెట్ రూంలో పడేశాడు. సాజిద్‌ను తనిఖీ చేసిన అధికారులకు అతడి వద్ద బంగారం బయటపడలేదు. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించడంతో అసలు విషయం వెల్లడించాడు. అధికారులు టాయిలెట్ రూం నుంచి 26 బంగారు బిస్కెట్లను (2.99కేజీలు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1,11,60,160 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. -
నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తొలుత హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆయనకు సాదర స్వాగతం పలికారు. సీఎంను చూసేందుకు వెల్కమ్ ప్లకార్టులతో పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకున్నారు. కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌కు అక్కడి తెలుగువారి నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలికారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ యూఎస్ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా వాషింగ్టన్ డీసీలో ఇచ్చిన విందులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మందికిపైగా సీనియర్ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. డల్లాస్‌లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. -
'కస్టమ్స్'.. తీర్చేయాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి దుబాయ్‌లో తన మేనమామ ఇంట్లో విందుకు హాజరైంది. వారిచ్చిన బంగారు నెక్లెస్‌ను వేసుకుని శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే కస్టమ్స్‌వాళ్లు సరైన పత్రాలు లేవని భారీగా పన్ను విధించారు. హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్యాసింజర్‌కు దుబాయ్ ఎయిర్‌పోర్టులో మరో భారతీయుడు ఒక బ్యాగు ఇచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తమ వాళ్లకు ఇవ్వాలని కోరాడు. అలా తెచ్చి కస్టమ్స్ అధికారుల తనిఖీలో అందులో బంగా రం ఉండటంతో జైలుపాలయ్యాడు. విదేశీ వస్తువులు భారత్‌కు తీసుకొచ్చే విషయంలో నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన లేకపోవడంతో ఒక్కోసారి అమాయకులు కస్టమ్స్ వద్ద తీవ్ర ఇబ్బందులు పడటం, అధిక పన్ను చెల్లించాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో అరెస్టు కావడం జరుగుతోంది. విదేశాలకు వెళ్లేవారు లగేజీ, వస్తువుల విషయంలో నిబంధనలను యాప్ ద్వారా తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. నిబంధనలు ఇవీ... 1 రెండు లీటర్ల లిక్కర్, 100 సిగరెట్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక ఫోన్ మాత్రమే తీసుకొస్తే పన్ను విధించరు. రెండో ఫోన్, రెండో ల్యాప్‌టాప్ తీసుకొస్తే దాని ఖరీదు రూ.50 వేలు దాటితే కస్టమ్స్ డ్యూటీ 38.5 శాతం చెల్లించాలి. 2 కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు అస్సలుండదు. ఉదాహరణకు.. కొందరు టీవీలు తెచ్చుకుంటారు. దాని ధర రూ.50 వేలలోపు ఉన్నా అధికారులు చెప్పినంత డ్యూటీ కట్టాల్సిందే. 3 చాలామంది మహిళలు విదేశాల్లో నగలు కొనుగోలు చేసి వేసుకుని వస్తుంటారు. విదేశాల్లో ఏడాదికిపైగా ఉండి భారత్ తిరిగి వచి్చన మహిళలకు 40 గ్రాముల (విలువ రూ.లక్ష మాత్రమే) వరకు బంగారానికి డ్యూటీ ఉండదు. విలువ రూ.లక్ష దాటితే 38.5 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. పురుషులకైతే ఇది 20 గ్రాములకే పరిమితం. 4 విదేశాల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొచ్చేవారు ఇమిగ్రేషన్ కౌంటర్లోనే కస్టమ్స్ అధికారులను సంప్రదించి డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. దాని ఆధారంగా ఎంత పన్ను కట్టాలో అధికారులు చెబుతారు. అది కట్టి బయటికి రావాల్సి ఉంటుంది. కట్టకుంటే అక్రమ రవాణాగా పరిగణించి అరెస్టు చేస్తారు. ఎలాంటి డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేనివాళ్లు గ్రీన్ చానల్ ద్వారా బయటికి రావొచ్చు. 5 విదేశీ నగదు విషయంలోనూ 5,000 డాలర్ల కంటే నగదు, 10,000 డాలర్ల చెక్ కంటే అధికంగా ఉండకూడదు. వీటిని కరెన్సీ డిక్లరేషన్ ఫారం తీసుకుని అందులో పొందుపరచాలి. విదేశాలకు వెళ్లే సమయంలో ఫారిన్ కరెన్సీ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. కానీ, దాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న విషయంపై సరైన పత్రాలు çసమర్పించాలి. ఒకవేళ ఇండియన్ కరెన్సీని తీసుకెళ్లాలంటే మాత్రం రూ.25 వేల కంటే అధికంగా అనుమతించరు. 6 విదేశాల్లో విందులకు, వివాహాలకు హాజరయ్యే మహిళలకు తాము వెంట తీసుకెళ్లే నగల విషయంలో జాగ్రత్త అవసరం. ఎంత విలువైన నగలను తీసుకెళ్తున్నామన్నది ముఖ్యం. ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థల ద్వారా ఎంత బంగారం తీసుకెళ్తున్నా మన్నది సరి్టఫై చేయించుకోవాలి. దాన్ని ఎక్స్పోర్ట్ డిపార్చర్ ఆఫీసర్ వద్ద సరి్టఫై చేయించుకుని తీసుకెళ్లొచ్చు. వచ్చే సమయంలో దాన్ని చూపిస్తే ఎలాంటి అనుమానాలు రాకుండా ఉంటాయి. 7 ఇలాంటి నిబంధనలు పాటిస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రావు. మరిన్ని వివరాలకు http://www.cbic.gov.in/ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. 8 విదేశీయులు లేదా విదేశాల్లో కొంతకాలం ఉండి ఇండియాకు వచ్చేవారు ఏమేం తీసుకొచ్చే విషయంలో అనుమానాల నివృత్తికి యాప్ కూడా ఉంది. ‘ఇండియన్ కస్టమ్స్ ట్రావెల్ గైడ్ యాప్’ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
బంగారు ఇస్త్రీపెట్టెలు
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నా.. అక్రమార్కులు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. తాజాగా దుబాయి నుంచి భారీఎత్తున బంగారాన్ని తీసుకు వచి్చన ఓ ప్రయాణికుడిని ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. అతడి వద్ద ఉన్న బ్యాగుల్లోని 4 ఇస్త్రీ పెట్టెలను విప్పిచూడగా అందులో కాయిల్స్ రూపంలో 9.2 కేజీల బంగారం బయటపడింది. బహి రంగ మార్కెట్లో ఈ బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అదు పులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓలా క్యాబ్ అంటూ ప్రైవేటుకారులో...
శంషాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ప్రయాణికులను ఎక్కించుకుని అనుమానాస్పదంగా వెళ్లిన కారును కుటుంబసభ్యులు వెంబడించి అడ్డుకున్నారు. ముంబైకి చెందిన శ్రీనాథ్, అతని కుటుంబసభ్యులు నగరంలో ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని కలవడానికి ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. రెండు ఓలా క్యాబ్‌లను బుక్ చేసుకున్నారు. ముందుగా వచ్చిన ఓలా క్యాబ్‌లో శ్రీనాథ్, అతడి భార్య, మరొకరు కూర్చున్నారు. వీరి కుటుంబంలోని యువతితోపాటు బాలిక, బాలుడు మరో ఓలా క్యాబ్ కోసం బస్టాప్ వద్ద వేచి ఉన్నారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన ఓ కారు డ్రైవర్.. ఓలా క్యాబ్ అని చెప్పి వారిని ఎక్కించుకున్నాడు. క్యాబ్ ముందుకెళుతున్న సమయంలో ఓటీపీ చెబుతానని యువతి అనడంతో అక్కర్లేదని క్యాబ్ డ్రైవర్ తిరస్కరించాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత కారులోకి అతడి స్నేహితుడు ఎక్కాడు. యువతి అనుమానించి కారును నెమ్మదిగా తీసుకెళ్లమని చెప్పినా డ్రైవర్ వినిపించుకోకుండా వేగం పెంచాడు. ఆమె వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి డ్రైవర్ తీరు అనుమానాస్పదంగా ఉందని అప్రమత్తం చేసింది. దీంతో వారు ఆ కారును వెంబడించి ఓవర్ టేక్ చేశారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద కారును ఆపి యువతితోపాటు బాలిక, బాలుడిని అందులో నుంచి దించారు. అయితే, డ్రైవర్ పరార్ కాగా కారులో ఉన్న అతడి స్నేహితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్జీఐఏ) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌నకు యత్నించిన కారు డ్రైవర్ రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చెందిన కిషన్ అని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ క్యాబ్ డ్రైవర్ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లు బుక్ చేసుకుంది. తల్లిదండ్రులు తొలుత మగ్గురు పిల్లలను ఒక క్యాబ్‌లో ఎక్కించారు. తరువాతి క్యాబ్‌లో తల్లిదండ్రులు బయలుదేరారు. అయితే పిల్లలు ఉన్న క్యాబ్ డ్రైవర్.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో తల్లిదండ్రులు కారును వెంబడించారు. దీంతో అతడు పిల్లల్ని, లగేజ్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే డ్రైవర్‌తో పాటు క్యాబ్‌లో ఉన్న అతడి స్నేహితుడిని మాత్రం పిల్లల తల్లిదండ్రులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
26 నుంచి రాష్ట్ర వాసుల హజ్ యాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి హజ్ యాత్ర– 2019కు వెళ్లే యాత్రికుల విమాన షెడ్యూల్‌ను రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లాన్ సోమవారం విడుదల చేశారు. నాంపల్లి హజ్ హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బృందం ఈ నెల 18న నగరం నుంచి హజ్ యాత్రకు బయలుదేరిందని తెలిపారు. తెలంగాణ హజ్ యాత్రికుల ప్రయాణ తేదీలు ఖరారయ్యాయని వెల్లడించారు. రాష్ట్ర యాత్రికులు మొత్తం 15 విమానాల ద్వారా ఈ నెల 26 నుంచి 30 వరకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణం అవుతారని చెప్పారు. రాష్ట్ర హజ్ యాత్రికుల మొదటి బృందం ఈ నెల 26న రాత్రి 8:25కి జిద్దాకు ప్రయాణం అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,685 మంది యాత్రికులు ఈ ఏడాది హజ్ కమిటీ ద్వారా యాత్రకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 4 వరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర యాత్రికులు హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. -
నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆందోళన..!
సాక్షి, హైదరాబాద్: ఉదయం 7.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇంకా కదలడం లేదు. దాంతో 80 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ఎంతకు విమానం కదలకపోవడంతో వారు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్పైస్‌జెట్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాము గంటల తరబడి నిరీక్షిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగానే విమానం ఆగిపోయిందని స్పైస్‌జెట్ సిబ్బంది వెల్లడించారు. -
గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం గాలిలో అదే పనిగా చక్కర్లు కొడుతూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయి.. గాలిలోకి ఎగిరిన తర్వాత విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు.. విమానాన్ని కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
-
ఉత్తుత్తి ఫోన్‌కాల్‌తో ఉరుకులు, పరుగులు
శంషాబాద్: ఓ భగ్నప్రేమికుడి నిర్వాకానికి విమానాశ్రయ భద్రతాసిబ్బంది, పోలీసులు హైరానా పడ్డారు. విమానంలో బాంబులున్నాయంటూ ఫోన్ చేయడంతో హడలెత్తిపోయారు. పోలీసులు, భద్రతాసిబ్బంది ఉరుకులు, పరుగుల మీద విమానాల్లో తనిఖీలు చేపట్టారు. చివరికి అది ఉత్తుత్తిదేనని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన రోజే బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. వివరాలు... శంషాబాద్ విమానాశ్రయానికి శనివారం ఉదయం 7 గంటలకు ఓ యువకుడు ఫోన్ చేసి ఇండిగో 6ఈ–188 విమానంతోపాటు ట్రూజెట్ 2టీ 201 చెన్నై విమానంలో బాంబులున్నాయని చెప్పాడు. దీంతో సీఐఎస్ఎఫ్, ఆర్జీఐఏ పోలీసులు వెంటనే అప్రమత్తమై రెండు విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలించారు. విమానాల్లో బాంబులేమీ లేవని నిర్ధారించారు. అనంతరం విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకున్నాయి. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నకిలీ ఫోన్ కాల్ చేసినవ్యక్తి కె.విశ్వనాథన్(24)గా గుర్తించారు. తమిళనాడులోని చెన్నై తెయ్నంపేట్కు చెందిన విశ్వనాథన్ సికింద్రాబాద్‌లోని గ్లోబ్లింక్ డబ్ల్యూడబ్ల్యూ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ట్రూజెట్ 2టీ201 విమానంలో చెన్నై బయలుదేరడానికిగాను ఉదయం ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రేమ విఫలం కావడంతో తాను మానసికంగా ఇబ్బందిలో ఉన్నానని విశ్వనాథన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. భద్రతకు భగ్నం కలిగించినందుకుగాను అతడిపై పౌర విమానయాన చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి వచ్చే సమయంలోనే... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉన్న సమయంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఫోన్‌కాల్ వచ్చిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కేవలం బెదిరింపు కాల్ అని తేలడంతో పోలీసులు, భద్రతాసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
6.46 కిలోల బంగారం పట్టివేత!
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లర్లు అక్రమ రవాణా కోసం పేదలను ఎంచుకుని నామమాత్రపు చార్జీలతో/ఉచిత ఉమ్రా యాత్ర పేర ఎర వేశారు. అలా వెళ్లిన వారిని భయపెట్టి జిద్దా నుంచి 6.46 కేజీల పసిడిని పంపారు. పక్కా సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులతో కలసి శంషాబాద్ విమానాశ్రయంలో ఆపరేషన్ చేపట్టగా 14 మంది చిక్కారు. ఈ వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న సూత్రధారులు అంతర్జాతీయ స్థాయిలోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వీరికి సంబంధించిన కొందరు ఏజెంట్ల ద్వారా కొత్త పంథాలో పసిడి అక్రమ రవాణాకు ప్రయత్నించారు. నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కొందరు ఏజెంట్లను నియమించుకున్న సూత్రధారులు వీరి సాయంతో నిరుపేదలైన మైనార్టీలను ఆకర్షించారు. ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో ఉమ్రా యాత్రకు తీసుకువెళ్తామంటూ వారికి ఎర వేశారు. వీరి వలలో పడిన 14 మంది స్త్రీ, పురుషులు గత నెలలో యాత్రకు వెళ్లారు. క్యారియర్లుగా మారాలని ఒత్తిడి... యాత్ర పూర్తయిన తర్వాత వీరందరిని స్మగ్లర్లు జిద్దా తీసుకువెళ్లారు. అక్కడ ఓ ప్రాంతంలో నిర్భంధించి బంగారం స్మగ్లింగ్‌కు తమకు సహకరించాలని ఆదేశించారు. ఈ పని చేయడానికి యాత్రికులు విముఖత చూపగా... తమ మాట వినకపోతే జిద్దాలో అరెస్టు చేయిస్తామని, యాత్రకయ్యే మొత్తం ఖర్చులు చెల్లించాలని భయపెట్టారు. చివరకు ఎటూపాలుపోని స్థితిలో యాత్రికులు క్యారియర్లుగా మారడానికి అంగీకరించారు. దీంతో మొత్తం 6.46 కేజీల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలు, 24 క్యారెట్ల కడ్డీలు, చైన్ల రూపంలోకి మార్చారు. వీటిని ఆ 14 మందికి అప్పగించి లోదుస్తుల్లో దాచుకునేలా ఆదేశించారు. మంగళవారం జిద్దా నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో వీరిని హైదరాబాద్‌కు పంపారు. ఇలా వచ్చే వీరి ఫొటోలు, వివరాలను జిద్దాలో ఉండే ఏజెంట్లు వాట్సాప్ ద్వారా నగరంలోని ఏజెంట్లకు పంపారు. వీరి వివరాలను క్యారియర్లకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వీళ్లు చిక్కినా సూత్రధారులు వ్యవహారం బయటకు రాకూడదనే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ వద్ద వీళ్లకు స్థానిక ఏజెంట్లు కలుస్తారు. అక్కడ నుంచి వీరిని ఓ రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి బంగారం స్వాధీనం చేసుకుంటారు. ఈ పసిడిని చేరాల్సిన వ్యాపారులకు చేర్చి క్యాష్ చేసుకుంటారు. పక్కా సమాచారంతో.. నిరుపేదలకు పవిత్ర యాత్ర పేరుతో ఎర వేసి క్యారియర్లుగా మార్చుకునే ముఠా వ్యవహారంపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఈ స్మగ్లింగ్‌కు చెక్ పడింది. మరికాస్త లోతుగా ఆరా తీసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు గ్రూప్ బుకింగ్ ద్వారా వెళ్లిన వీరందరికీ విమానం టికెట్లు ఒకే పీఎన్ఆర్ నంబర్‌తో బుక్ అయినట్లు తెలుసుకున్నారు. దీంతో అదనపు డీసీపీ చైతన్య ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి ఆ పీఎన్ఆర్ నంబర్, ఓ ప్రయాణికుడి పేరు సేకరించారు. వీళ్లు విమానం దిగి బయటకొస్తే పట్టుకోవడం కష్టమని, కొందరైనా పారిపోయే ప్రమాదముందని భావించా రు. విమానాశ్రయంలోకి వెళ్లి ఆపరేషన్ చేపట్టే అవకాశం టాస్క్‌ఫోర్స్‌కు లేకపోవడంతో విషయాన్ని మంగళవారం రాత్రి డీఆర్ఐకి అందించారు. అప్రమత్తమైన ప్రత్యేక టీమ్స్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. సదరు పీఎన్ఆర్ నంబర్‌ను తనిఖీ చేయగా మొత్తం 14 మంది యాత్రికుల పేర్లు బయటపడ్డాయి. దీంతో విమానాశ్రయం లోపల డీఆర్ఐ, బయట టాస్క్‌ఫోర్స్ అధికారులు వలపన్నారు. విమా నం దిగి ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేసిన 14 మందిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ.. తనిఖీ చేయగా వివిధ రూపా ల్లో ఉన్న 6.46 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ మార్కెట్లో రూ.2.17 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీనికి సంబంధించి వీరివద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో అక్రమ రవాణాగా తేల్చారు. -
శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, డీఆర్ఐ అధికారులు 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సౌది ఎయిర్‌లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన 14 మందిని అదుపలోకి తీసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డవారిని పాతబస్తీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అయితే తమను జెడ్డాలోని గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు బెదిరించడం వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని నిందితులు పోలీసుల ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమంతా ఉమ్రా యాత్రకు వెళ్లగా.. అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు వేధింపులకు గురిచేశారు. మాకు బంగారం ఇచ్చి.. దానిని హైదరాబాద్‌లో ఇవ్వాల్సిందిగా ఆదేశింశారు. లేకపోతే అక్రమంగా ఉమ్రా యాత్రకు వచ్చారని స్థానిక పోలీసులకు పట్టిస్తామని వాళ్లు బెదిరింపులకు దిగారు. అందుకు భయపడి బంగారాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చామ’ని నిందితులు పోలీసులకు వివరించారు. మరోవైపు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్: యువతి పట్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే యువతి పట్ల ఓ క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే 18 ఏళ్ల యువతి.. సల్మాన్ అనే డ్రైవర్ నడుపుతున్న ఇన్నోవా క్యాబ్‌ను ఎక్కింది. ఆమె వాహనంలోకి ఎక్కిన తర్వాత సల్మాన్‌లోని కామాంధుడు తన వికృతరూపం బయటపెట్టాడు. ఆ యువతి చేతులు పట్టుకొని లాగి.. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్ తిన్న ఆ యువతి వెంటనే కేకలు వేసింది. యువతి కేకలతో భయపడిపోయిన సల్మాన్.. ఆమెను అక్కడే క్యాబ్‌లోంచి దింపేసి పరారయ్యాడు. బాధితురాలు ఈ ఘటనపై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా క్యాబ్ డ్రైవర్ సల్మాన్‌ను అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిపోయే ప్రయాణికులు పోలీసు అనుమతి ఉన్న క్యాబ్‌ల్లోనే ప్రయాణించాలని ఎయిర్పోర్ట్ ఏసీపీ అశోక్‌కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద మహిళ అదృశ్యం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరో మహిళ అదృశ్యమైంది. మస్కట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన భవానీ (28) అనే మహిళ అదృశ్యమయ్యారు. భవానీని రిసీవ్ చేసుకొనేందుకు ఆమె భర్త భీమారావు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఆయన ఎంతసేపు వేచిచూసినా భార్య కనిపించలేదు. ఫోన్ చేస్తే.. స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన భీమారావు తన భార్య కనిపించడం లేదంటూ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం
-
సౌదీ నుంచి స్వదేశానికి..
మోర్తాడ్: సౌదీ అరేబియాలోని జేఅండ్‌పీ కంపెనీ క్యాంపులో దాదాపు ఏడాదిన్నర కాలంగా పనిలేక మగ్గిపోయిన తెలంగాణకు చెందిన 39 మంది కార్మికులు సోమవారం స్వదేశానికి రానున్నారు. విదేశాంగ శాఖ చొరవతో హైదరాబాద్ చేరుకోనున్నారు. జేఅండ్‌పీ కంపెనీ సౌదీ అరేబియాలో నిర్మాణరంగంలో పనులు నిర్వహిస్తోంది. ఈ పనుల కోసం వివిధ దేశాల నుంచి కార్మికులను రప్పించుకుంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఎంతో మంది కార్మికులు జేఅండ్‌పీ కంపెనీలో పని చేయడానికి వెళ్లారు. 2018 ఏప్రిల్ వరకు కంపెనీ కార్యకలాపాలు బాగానే నడిచాయి. ఆ తర్వాత కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో కార్మికులకు పని కల్పించలేదు. అంతేకాకుండా నెలల తరబడి వేతనాలు కూడా ఇవ్వలేదు. కార్మికుల అకామాలను రెన్యూవల్ చేయకపోవడంతో వారు బయట తిరగలేక పోయారు. కంపెనీ యాజమాన్యం క్యాంపుల్లో ఉన్న కార్మికులకు భోజన సదుపాయాన్ని కల్పించినా నాసిరకం భోజనాలను అందించిందని కార్మికులు పేర్కొంటున్నారు. కనీసం ఇళ్లకు పంపించడానికి కూడా జేఅండ్‌పీ కంపెనీ యాజమాన్యం చొరవ తీసుకోలేదని ఆరోపించారు. కంపెనీ తీరుతో కార్మికులు విదేశాంగ శాఖ అధికారుల సహకారంతో సౌదీ లేబర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కార్మికుల వేతన బకాయిలు చెల్లించడానికి కొంత సమయం ఇచ్చిన లేబర్ కోర్టు.. కార్మికులను ఇళ్లకు పంపించడానికి ఎగ్జిట్ వీసా ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో విదేశాంగ శాఖ కార్మికులకు టికెట్లు సమకూర్చడంతో సోమవారం 39 మంది కార్మికులు సౌదీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఒక్కో కార్మికుడికి రూ.వెయ్యి సహాయం విదేశాంగ శాఖ చొరవతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న కార్మికులు ఎయిర్‌పోర్టు నుంచి వారి సొంత గ్రామాలకు చేరుకోవడానికి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ఒక్కో కార్మికుడికి రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందించనుంది. గతంలో కార్మికులకు రవాణా చార్జీల కోసం రూ. 500 చొప్పున చెల్లించేవారు. ఆ మొత్తాన్ని ప్రస్తుతం రెట్టింపు చేశారు. ఎయిర్‌పోర్టులో కార్మికులు అడుగిడిన వెంటనే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందిస్తారు. కేరళ తరహాలో పునరావాసం కల్పించాలి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటి దారి పడుతున్న కార్మికుల సంక్షేమానికి కేరళ తరహాలో తెలంగాణ ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకోవాలి. పునరావాసానికి శాశ్వత ప్రాతిపదికన సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్వగ్రామాలకు కార్మికులు వచ్చిన తరువాత తగిన ఉపాధి లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చితికిపోయి.. కుటుంబ పోషణ భారంకావడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాగే గల్ఫ్ దేశాల్లో కార్మికులు సంపాదించుకున్న నైపుణ్యాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగించుకోవాలి. ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 11కిలోల బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. ఆ మహిళ నుంచి 11.1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 3.6 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న 7 క్లాత్ ప్యాకెట్స్‌తో పాటు, సాక్స్లలో ఆమె బంగారం తీసుకోచ్చినట్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా గత మూడు నెలలుగా ఆ మహిళ నివాసం ఉంటున్న ఫైవ్ స్టార్ హోటల్ రూమ్‌లో సైతం తనిఖీలు చేపట్టిన అధికారులు స్మగుల్డ్ గూడ్స్‌తో పాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
-
భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడింది. దాదాపు రూ.3 కోట్ల విలువైన బంగారాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న థామస్ అనే ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లెక్కలు చూపకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన సీఐఎస్ఎఫ్ అధికారులు ధామస్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. థామస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారణ జరుపుతున్నారు. -
శంషాబాద్ ఎయిపోర్ట్‌లో బంగారం పట్టివేత