
సాక్షి, హైదరాబాద్ : దుబాయ్ నుంచి మనీలా వెళుతున్న సీబు పసిఫిక్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మనీలాకు చెందిన సెరిదా అనే ప్రయాణికురాలికి ఆకస్మాత్తుగా పురుటి నొప్పులు రావడంతో విమానాన్ని ఏటీసీ అనుమతితో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.