mid-air
-
విమానంలో మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్
విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పైలెట్ డెలివరీ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న వీట్‌జెట్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఎంతో ధైర్యంగా. సమయస్పూర్తితో వ్యవహరించి గర్భిణీకి పురుడు పోసినపైలెట్ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాలు.. వీట్ జెట్‌కు చెందిన విమానం తైపీ(తైవాన్) నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వెళ్తోంది. విమానంలో ఓ గర్భిణి కూడా ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బాత్రూమ్లో ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించిన సిబ్బంది విషయాన్ని పైలట్ జకరిన్ సరార్న్రక్స్కుల్కు తెలియజేశారు. విమానం ల్యాండింగ్‌కు కూడా సమయంలో ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కెప్టెన్ జకరిన్ తన బాధ్యతలను కో పైలట్‌కు అప్పగించి కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చాడు. విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అడిగాడు. కానీ సమయానికి వైద్యులు కూడా లేకపోవడంతో వేరే మార్గం లేక తానే రంగంలోకి దిగాడు. మొబైల్ ద్వారా వైద్యులను సంప్రదించి.. వారి సూచనలతో మహిళకు పురుడు పోశాడు. ఇదంతా గమనించిన విమానంలోని ప్రయాణికులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. క్లిష్ట సమయంలో ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన పైలెట్‌ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. అనంతరం విమానం ల్యాండ్ అయ్యాక తల్లి, శిశువును ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డకు ముద్దుగా స్కై బేబబీ’ అని పేరు పెట్టారు. మరోవైపు 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపాడు. చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే -
గాల్లో తలకిందులుగా 30 నిమిషాలు.
టొరంటో: సరదాగా పార్కులో గడుపుదామనుకుని అక్కడికి విచ్చేసిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లాంబర్‌జాక్ రైడ్ పైకి వెళ్లాక హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో చిక్కుకుపోయిన సందర్శకులు 30 నిమిషాలపాటు తలకిందులుగా వేలాడుతూ సాయంకోసం అరి్థంచారు. కెనడాలోని ఒంటారియా నగరంలోని వండర్ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైడ్‌లో భాగంగా అందులో కూర్చున్న వారంతా అలా గాల్లో తలకిందులుగా వేలాడుతూ హాహాకారాలు చేస్తున్న వీడియో ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎట్టకేలకు 30 నిమిషాలకు అందరినీ ఎలాగోలా కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. అంతసేపు తలకిందులుగా వేలాడటంతో కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. -
సడెన్‌గా విమానం డోర్ ఓపెన్.. ప్రముఖ సింగర్ టీమ్‌కు తప్పిన ప్రమాదం
బ్రెసీలియా: ఇటీవలి కాలంలో విమానం గాల్లో ఉన్న సమయాల్లో ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఇక, ఈ విమానంలో ఉన్న బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్‌తో పాటు వారి బ్యాండ్ బృందానికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఎన్హెచ్ఆర్ టాక్సీ ఏరియోకు చెందిన ఎంబ్రేయర్ -110 విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్(కార్గో డోర్) తెరుచుకుంది. దీంతో, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు. కాగా, ఈ విమానంలో బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ గాయకుడు, పాటల రచయిత టియెర్రీ తన బృందంతో కలిసి ఈ విమానంలో ప్రయాణించారు. అయితే, మారన్ హావోలోని సావో లూయిస్‌లో ప్రదర్శన అనంతరం టియెర్రీ, అతని బ్యాండ్ సభ్యులు ఈ విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో డోర్ ఓపెన్ కావడంతో వారంతా కంగారు పడ్డారు. వారి మ్యూజిక్ పరికరాలు చెడిపోతాయేమోనని టెన్షన్‌కు గురయ్యారు. అయితే, విమానం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, విమాన సంస్థకు చెందిన అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్నొన్నాడు అలాగే, ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రయాణికులు, బ్యాండ్ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఇక, డోర్ తెరుచుకున్న సమయంలో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు దీన్నంతా వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా ఉందని ఒకరు కామెంట్స్ చేయగా, భయకరంగా ఉందని మరో వ్యక్తి కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు -
ప్రయాణికుడి దెబ్బకు 200 మందికి టెన్షన్.. ఏం జరిగిదంటే?
సియోల్: ఇటీవలి కాలంలో కొందరు విమాన ప్రయాణికులు అతిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు విమానంలో గాల్లో ఉన్న సమయంలో డోర్ ఓపెన్ చేయడం, మరికొందరు ఎదుటి వారితో వాగ్వాదానికి దిగడం వంటివి తరచుగా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఏషియానా విమానంలో చోటుచేసుకుంది. విమానం ఆకాశంలో ఉన్న సమయంలో ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేశాడు. దీంతో, కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. ఏ321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఆ విమాన్ డోర్‌ను తీశాడు. దక్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో, అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని డేగు విమానాశ్రయంలో దించారు. కాగా, సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేస్తున్న సమయంలో ప్రయాణికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ డోర్ ఓపెన్ అయ్యింది. ఇక, విమానం గాలిలో ఉన్న సమయంలో డోర్ ఓపెన్ కావడంతో అందులో ఉన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సదరు వ్యక్తి డోర్ ఎందుకు ఓపెన్ చేశాడన్నది తెలియరాలేదు. మరోవైపు.. ఉల్సన్‌లో జరుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు చాలా మంది అథ్లెట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. శ్వాస కోస ఇబ్బందులు తలెత్తిన్న ప్రయాణికులను హాస్పిటల్‌కు తరలించినట్లు రవాణాశాఖ తెలిపింది. కాగా, విమానంలో డేగు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 🚨 Un pasajero ha abierto una salida de emergencia del #A321 HL8256 de #AsianaAirlines en pleno vuelo. El vuelo #OZ8124 entre Jeju y Daegu del 26 de mayo se encontraba en aproximación cuando una de las salidas de emergencia sobre el ala fue abierta por un pasajero. El avión… pic.twitter.com/G0rlxPNQuW — On The Wings of Aviation (@OnAviation) May 26, 2023 ఇది కూడా చదవండి: బ్రిటన్ ప్రధాని నివాసంపైకి కారుతో దాడికి యత్నం?.. రిషి సునాక్ సేఫ్! -
శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్ : దుబాయ్ నుంచి మనీలా వెళుతున్న సీబు పసిఫిక్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మనీలాకు చెందిన సెరిదా అనే ప్రయాణికురాలికి ఆకస్మాత్తుగా పురుటి నొప్పులు రావడంతో విమానాన్ని ఏటీసీ అనుమతితో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
సూపర్ క్యాచ్ బాసూ..!
-
ఇలాంటి క్యాచ్‌ను ఎక్కడైనా చూశారా!?
సూపర్ క్యాచ్ బాసూ.. ఇలాంటి క్యాచ్‌ను ఎక్కడా చూడలేదు అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటన సంభవించింది ఆకాశంలో.. క్యాచ్ పట్టిన వస్తువు బాల్ కాకపోవడం ఇక్కడ విశేషం. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న రోలర్ కోస్టర్‌లో కూర్చున్న ఓ వ్యక్తి గాల్లో ఓ ఫోన్‌ను అద్భుతంగా క్యాచ్ పట్టి లెజెండ్ అనిపించుకుంటున్నాడు. వివరాలు.. శామ్యూల్ కెంఫ్ అనే వ్యక్తి ఈ నెల 4న స్పెయిన్‌లోని పోర్ట్అవెంచురా వరల్డ్ థీమ్ పార్కును సందర్శించాడు. ఈ పార్కులో అతిపెద్దది, వేగవంతమైన రోలర్ కోస్టర్‌లలో ఒకటైన శంభాల రైడ్‌ను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. శంభాల రోలర్ కోస్టర్‌ను ఎక్కి కూర్చున్నాడు. అది తిరగడం ప్రారంభించిన కొద్ది సేపటి తర్వాత తనకు కొన్ని సీట్ల ముందు కూర్చున్న వ్యక్తి ఫోన్ కిందపడటం గమనించాడు శామ్యూల్. వెంటనే అప్రమత్తమై ఆ ఫోన్‌ను గాల్లోనే క్యాచ్ పట్టుకున్నాడు. ఈ మొత్తం సంఘటన అంత అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దాంతో పార్కు యాజమాన్యం ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఇతర సోషల్ మీడియా వేదికల్లో కూడా దీన్ని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. శామ్యూల్ సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాక ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజంగా నువ్వు లెజెండ్‌వి’.. ‘ఇది ఓ గొప్ప ప్రయత్నం.. అతడు ఆ ఫోన్‌ను పట్టుకున్న విధానం నిజంగా గొప్పది. ఇందుకు అతనికి మెడల్, ట్రోఫిని ఇవ్వవచ్చు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
గగనంలో ఉత్కంఠ
ముంబై: ఢిల్లీ గగనతల సమాచార ప్రాంతంలో(ఎఫ్ఐఆర్)లో ఘోర ప్రమాదం తప్పింది. సమీపంగా వచ్చిన మూడు విమానాలు ఢీకొనకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ), ఇతర ఆటోమేటిక్ హెచ్చరికలు నిలువరించాయి. ఆ సమయంలో 3 విమానాల్లో కలపి వందలాది ప్రయాణికులు ఉన్నారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) విచారణ ప్రారంభించింది. డచ్ విమానం కేఎల్ఎమ్, తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్, అమెరికా విమానం నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎన్సీఆర్ 840 దాదాపు ఢీకొనేంత దగ్గరికొచ్చాయి. తొలుత ఎన్సీఆర్ 31 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. ఇవా విమానం ఎన్సీఆర్కు చేరువగా వచ్చింది. రెండు విమానాల్లో అంతర్గత హెచ్చరికలు జారీచేయడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో కేఎల్ఎమ్ 33 వేల అడుగుల ఎత్తులో ఉంది. హెచ్చరికల నేపథ్యంలో ఎన్సీఆర్ 35 వేల అడుగుల ఎత్తుకు ఎగిరి చక్కర్లు కొట్టింది. తర్వాత ఎడమ వైపు తిరగాలని ఏటీసీ ఆదేశించింది. ఈ మధ్యలో ఇవా.. కేఎల్ఎం ఎగురుతున్న 33 వేల అడుగుల ఎత్తుకు చేరడంతో మరో హెచ్చరిక జారీ అయింది. దీంతో ఇవాను పైలట్లు కేఎల్ఎం నుంచి దూరంగా నడిపారు. అదే సమయంలో ఎన్సీఆర్ 33 వేల అడుగుల స్థాయికి దిగిరావడంతో ఇవాకు సమీపంగా వచ్చింది. దీంతో మరోసారి హెచ్చరిక పంపి ప్రమాదాన్ని తప్పించారు. -
ఆ పెద్దాయన కోరిక ఎంత పని చేసింది..!
సాక్షి, ముంబై: విమాన ప్రయాణ నిబంధనల గురించి ఏ మాత్రం అవగాహన లేని ఓ పెద్దాయన ..ఇబ్బందుల్లో పడ్డారు. అంతేకాదు తోటి ప్రయాణీకుల గుండెల్ని గుభేల్మనిపించారు కూడా. ఆయన చేసిన పనికి అకస్మాత్తుగా విమానంలో గందరగోళం, భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పరిస్థితి సద్దు మణిగింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే హర్యానాలోని ఇజ్జర్ నివాసి రాజ్‌కుమార్ లక్ష్మీనారాయణ్ గార్గ్(65) మొదటిసారి విమానంలో ముంబై బయలుదేరారు. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యే నిమిత్తం అత్యవసరంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి జనవరి 9న రాయ్‌పూర్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో (6ఈ-802) బయలుదేరారు. ఇంతలో బీడీ తాగాలన్న కోరికను నియంత్రించుకోలేని లక్ష్మీనారాయణ్...వెంటనే విమానంలోని టాయ్లెట్లోకి దూరి, పనికానివ్వడం మొదలుపెట్టారు. అంతే..విమానంలో ఫైర్ అలారంలు తమ పని కానిచ్చాయి. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో వణికిపోయారు. సిబ్బంది పరిశీలనతో...పెద్దాయన వ్యవహారం బయటపడింది. వెంటనే వారు కెప్టెన్ రితేష్ మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్స్ నియమాలు, నిబంధనలు గురించి ఆయనకు కెప్టెన్ వివరించారు. అనంతరం విమానం ముంబై చేరున్నాక.. విమానాశ్రయం పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 336, ఎయిర్‌లైన్ రూల్ ఆఫ్ 25ఎ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో లక్ష్మీనారాయణ్, ఆయన కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
గాల్లోదిశను మార్చుకునే 'బుల్లెట్'!
వాషింగ్టన్: ఇంతవరకూ మనం లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకుని ప్రయోగించే బుల్లెట్లను మాత్రమే చూశాం. అయితే గాల్లో కూడా దిశను మార్చుకుని ఒక బుల్లెట్ ను తాజాగా యూఎస్ బలగాలు పరీక్షించాయి. స్మార్ట్ బుల్లెట్ గా నామకరణం చేసిన ఈ బుల్లెట్ ప్రత్యేకత ఏమిటంటే గాల్లో దిశను మార్చుకుని లక్ష్యాన్ని ఛేదించడమే. ఇది గాలి బలంగా వీచే క్రమంలో కూడా లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగపడుతుందని డీఏఆర్‌పీఏ (ద అడ్వాన్స్డడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు ఏజెన్సీ) స్పష్టం చేసింది. మిలటరీ బలగాలను దృష్టిలో పెట్టుకునే స్మార్ట్ బుల్లెట్ ను తయారు చేసినట్లు తెలిపింది. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా ఈ బుల్లెట్ మిలటరీ బలగాలకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని డీఏఆర్‌పీఏ పేర్కొంది. -
ఆకాశంలో విమానంలో మంటలు
పెర్త్: టేకాఫ్ తీసుకున్న కాసేపటికే గగనతలంలో విమానంలో మంటలు చెలరేగాయి. ఫైలట్ వెంటనే అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్రయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ప్రమాద సంఘటనపై విచారణ జరుపుతున్నారు. కోబమ్ ఏవియేషన్ విమానం ఉదయం 10: 45 గంటలకు పెర్త్ నుంచి బయల్దేరగా.. కాసేపటికే ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్టు కోబమ్ ఏవియేషన్ తెలిపింది. ఫైలట్ ఇంజన్‌ను ఆపివేయడంతో మంటలు ఆరిపోయినట్టు పేర్కొంది. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పెర్త్ విమానాశ్రయంలో దించాడు. విమానంలో 93 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులెవరూ గాయపడలేదని కోబమ్ ఏవియేషన్ తెలియజేసింది.