గాల్లోదిశను మార్చుకునే 'బుల్లెట్'!
వాషింగ్టన్: ఇంతవరకూ మనం లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకుని ప్రయోగించే బుల్లెట్లను మాత్రమే చూశాం. అయితే గాల్లో కూడా దిశను మార్చుకుని ఒక బుల్లెట్ ను తాజాగా యూఎస్ బలగాలు పరీక్షించాయి. స్మార్ట్ బుల్లెట్ గా నామకరణం చేసిన ఈ బుల్లెట్ ప్రత్యేకత ఏమిటంటే గాల్లో దిశను మార్చుకుని లక్ష్యాన్ని ఛేదించడమే. ఇది గాలి బలంగా వీచే క్రమంలో కూడా లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగపడుతుందని డీఏఆర్పీఏ (ద అడ్వాన్స్డడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్లు ఏజెన్సీ) స్పష్టం చేసింది.
మిలటరీ బలగాలను దృష్టిలో పెట్టుకునే స్మార్ట్ బుల్లెట్ ను తయారు చేసినట్లు తెలిపింది. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా ఈ బుల్లెట్ మిలటరీ బలగాలకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని డీఏఆర్పీఏ పేర్కొంది.