United States Department of Defense
-
అంతం కాదిది ఆరంభం
కొన్నేళ్ళుగా ప్రపంచానికి కంటిలో నలుసుగా మారి, అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తున్న అంతర్జాతీయ ఇస్లామిస్ట్ ఉగ్రమూక అల్‌ఖైదాకు ఇది ఊహించని దెబ్బ. అఫ్ఘానిస్థాన్లోని కాబూల్‌లో ప్రపంచం కంటపడకుండా నివసిస్తున్న అల్‌ఖైదా అధినేత అయ్మాన్ అల్–జవాహిరీని అమెరికా మాటు వేసి, జూలై 31 ఉదయం చాటుగా మట్టుబెట్టడంతో ఒక అధ్యాయం ముగిసింది. ‘9/11’ దాడులకు తెగబడిన ముష్కరమూకను నలిపి, నాశనం చేయాలని ప్రపంచపు పెద్దన్న ఇరవై ఒక్క ఏళ్ళుగా పగతో రగిలిపోతోంది. 2011లో ఒసామా బిన్ లాడెన్నూ, ఇప్పుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించిన జవాహిరీని హతమార్చడం అమెరికా నిఘా వ్యవస్థ ఎంత బలమైనదో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. అంతకన్నా ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్‌ను ఉగ్రమూకలకు స్థావరంగా మార్చబోమంటూ తాలిబన్లు చేసుకున్న ‘దోహా ఒప్పందం’లోని డొల్లతనం బయట పడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లాంటివి ఇప్పటికీ ఉగ్రమూకలకు స్వర్గధామాలే అన్న కఠిన వాస్తవం పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచమంతటినీ మరోసారి అప్రమత్తం చేస్తోంది. 1998 ఆగస్టులో తూర్పు ఆఫ్రికాలో అమెరికా ఎంబసీపై బాంబుదాడి నుంచి ‘9/11’గా పాపు లరైన 2001 సెప్టెంబర్ 11 నాటి న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై వైమానిక దాడి వరకు... అగ్రరాజ్యంపై అల్‌ఖైదా తెగబడిన అనేక సందర్భాల్లో తెర వెనుక సూత్రధారి జవాహిరియే. నేత్రవైద్యుడి నుంచి తీవ్రవాదిగా మారిన 71 ఏళ్ళ జవాహిరి అప్పట్లో అల్‌ఖైదాలో నంబర్ టూ. 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికన్ కమెండోలు లాడెన్‌ను గుట్టుగా మట్టుపెట్టినప్పటి నుంచి ఆ సంస్థకు ఆయనే నంబర్ వన్. అల్‌ఖైదా కొంత తెర వెనక్కి వెళ్ళాక, ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐసిస్) లాంటి హింసాత్మక జిహాదిస్టు పిల్లమొలకలు మొలిచి, ఐరోపాలో తెగబడడం చూస్తున్నాం. కొంత బలహీనపడ్డా, కార్యకర్తల సమీకరణ సత్తా ఉన్న సైద్ధాంతికుడిగా జవాహిరి అమెరికా మొదలు ఇండొనేసియా దాకా అనేక దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే వచ్చారు. అమెరికా ఎప్పుడో ఆయన తలకు 2.5 కోట్ల డాలర్ల భారీ వెల కట్టింది. భారత్‌కూ ముప్పు తేవాలని జవాహిరి ఆరాటపడ్డారు. ‘భారత ఉపఖండ అల్‌ఖైదా’ (ఏక్యూ ఐఎస్)ను ఆరంభిస్తున్నట్టు 2014లోనే ఒక వీడియోలో ప్రకటించిన ఆయన నిరుడు హురియత్ నేత గీలానీ చనిపోయినప్పుడు సంతాపం ప్రకటిస్తూ, కశ్మీర్ అంశాన్ని భుజానికెత్తుకొనే యత్నం చేశారు. ఈ ఏడాది కర్ణాటకలో హిజాబ్ వివాదం తలెత్తినప్పుడూ సాయుధపోరు చేయాలంటూ ముస్లిమ్ లను రెచ్చగొట్టేందు ప్రయత్నించారు. కానీ, సహనశీల భారతావనిలో ఆ పప్పులుడకలేదు. నిన్నటి దాకా గుర్తు తెలియనిచోట గడుపుతున్నాడనుకుంటున్న ఈ ఉగ్రనేత సాక్షాత్తూ కాబూల్ నడిబొడ్డున, అఫ్ఘాన్ ప్రభుత్వ పెద్దలెందరో నివసిస్తున్న భవనంలో సకుటుంబంగా కాపురమున్న వైనం దిగ్భ్రాంతికరం. నెలల క్రితమే ఆయన ఆచూకీ కనిపెట్టిన అమెరికా గూఢచారులు ఆనుపానులన్నీ చూసుకొని, చుట్టుపక్కల ఎవరికీ ఏమీ కాకుండా చిత్రమైన హిల్ఫైర్ క్షిపణుల రిమోట్ డ్రోన్ దాడితో లక్ష్యాన్ని ఛేదించిన వైనం కొన్నాళ్ళు కథలు కథలుగా చెప్పుకొనే జేమ్స్‌బాండ్ తరహా విన్యాసం. తాజా ఆపరేషన్‌తో తీవ్రవాదంపై పోరులో అమెరికా ప్రతిష్ఠ కొంత పెరగవచ్చు. ఉపఖండంలో పర్యవసానాలు అంతకన్నా పెరుగుతాయి. ఏడాది క్రితం అమెరికా సేనలు హడావిడిగా వెనక్కి తగ్గాక, అఫ్ఘాన్‌లో బలవంతాన పగ్గాలు చేజిక్కించుకున్న పిడివాద తాలిబన్లకూ, వారి ప్రభుత్వానికీ ఇవాళ్టికీ అంతర్జాతీయ గుర్తింపు అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో తమకు తెలియకుండానే జవాహిరి తమ నట్టింట్లోనే తలదాచుకున్నాడని తాలిబన్ సర్కార్ బొంకినా నమ్మేవారెవరూ లేరు. తమ దేశ సార్వభౌమాధికారానికి అమెరికా తాజా రహస్య దాడులు విఘాతమని కాబూల్ వాదన. మామూలుగానైతే ఆ మాటకు అంతో ఇంతో మద్దతు లభించేదేమో! కానీ, పది పడగల పాముకు నేటికీ పాలు పోసి పెంచుతున్న వైనం బట్టబయలయ్యాక తాలిబన్లను ఎవరూ బాహాటంగా సమర్థించ లేరు. ఇక, జవాహిరి వ్యవహారంలో పాకిస్థాన్ ఇవ్వాల్సిన సంజాయిషీ సైతం చాలానే ఉంది. దీర్ఘకాలం పాక్‌లో తలదాచుకొని, ఇప్పుడు అఫ్ఘాన్‌లోనూ పాకిస్థానీ స్థావర ఉగ్రమూక హక్కానీ నెట్వర్క్ నీడలోనే అల్‌ఖైదా అధినేత కాలక్షేపం చేశాడనేది సుస్పష్టం. ఇన్నాళ్ళూ కడుపులో పెట్టుకొని కాపాడిన ఉగ్రసారథితో తమకే బంధం లేదని దాయాది దేశం చెబితే హాస్యాస్పదం. ఆ మాటకొస్తే, స్వలాభం కోసం ఇప్పుడు పాకిస్థానే అతని ఉప్పందించిందనే వాదనా వినిపిస్తోంది. తాజా దాడితో అమెరికా పగ చల్లారిందేమో కానీ, ఆన్లైన్ విషప్రచారంతో వివిధ దేశాలకు వ్యవస్థను విస్తరించిన జిహాదిస్టు గ్రూపులు తోక తొక్కిన తాచులా లేచే ప్రమాదం ఉంది. అధినేతను కోల్పోయి ఇప్పటికి ఆ స్థాయి వారసుడెవరూ లేకపోయినా, కొత్త గ్రూపులను కూడగట్టుకొని అల్ ఖైదా ప్రతీకారం తీర్చుకోజూస్తుంది. ఇక తాలిబన్లు సరేసరి. అందుకే, జవాహిరి ఒక్కడి మరణంతో సమస్త ఉగ్రవాదం సమసిపోయినట్టు కాదు. ప్రపంచానికిస్తున్న హామీలకు విరుద్ధంగా ముష్కర మూకలను పెంచిపోషిస్తున్న పాక్, అఫ్ఘాన్లపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. ఉప ఖండంలో శాంతి సుస్థిరతలకు భంగం కలిగించే చర్యల్ని అనుమతించబోమనాలి. అందుకే, ‘9/11’ దాడుల్లో మరణించిన 3 వేల మంది కుటుంబాల కన్నీటి కథకు జవాహిరి అంతం ఒక ముగింపని బైడెన్ అన్నారు కానీ, దశకంఠుడి లాంటి ఉగ్రసంస్థలపై యుద్ధంలో ఇది మరో మజిలీ మాత్రమే! -
రష్యా జనరల్స్ హతం.. ఉక్రెయిన్ ప్లాన్ వెనుక వారి హ్యాండ్!
ఉక్రెయిన్‌లో రెండు నెలలకుపైగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌తో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాంబులు, మిస్సైల్స్ దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు, సైనికులు, రష్యా బలగాలు వేల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా, యుద్దభూమిలో సుమారు 12 మంది రష్యన్ జనరల్స్ మరణించినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కాగా, ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ కథనం పుతిన్‌కు బిగ్ షాకిచ్చింది. న్యూయర్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఉక్రెయిన్‌తో యుద్దంలో రష్యన్ జనరల్స్‌ను చంపడానికి ఉక్రేనియన్ దళాలకు అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించిందని పేర్కొంది. దీని కోసం అమెరికాకు చెందిన సీనియర్ అధికారులు సైతం సాయం అందించినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల కదలికలు, రష్యా మొబైల్ సైనిక ప్రధాన కార్యాలయం స్థావరం, ఇతర విషయాలపై ఇంటెలిజెన్స్ సాయం చేసినట్టు స్పష్టం చేసింది. కాగా, ఈ కథనంపై పెంటగాన్, వైట్ హౌట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌కు సాయం విషయంతో రష్యా ఇప్పటికే అమెరికాను త్రీవంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ విచిత్ర పరిస్థితులు.. అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా.. -
తెహ్రీక్-ఈ-తాలిబన్ నాయకుడి హతం..
ఇస్లామాబాద్ : పాకిస్తాని తాలిబన్ నాయకుడు మౌలానా ఫజ్లుల్లా, శుక్రవారం తూర్పు అఫ్ఘనిస్తాన్, కున్రార్ రాష్ట్రంలో జరిగిన అమెరికన్ డ్రోన్ దాడిలో మరిణించినట్లు సమాచారం. ఈ విషయం గురించి అమెరికా సైన్యాధికారి ఒకరు ‘గురువారం మా సైన్యం అఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఒక మిలిటెంట్ నాయకుడిని కేంద్రంగా చేసుకుని స్ట్రైక్ నిర్వహించింది. ఈ సందర్భంగా డంగమ్ జిల్లా, నౌర్ గల్ కలాయ్ గ్రామంలో తాలిబన్ అధ్యక్షుడు ఉన్నట్లు సమాచారం అందింది. దాంతో మా సైన్యం డ్రోన్ స్ట్రైక్‌ను చేపట్టింది. ఈ దాడిలో తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్ నాయకుడు మౌలానా ఫజ్లుల్లాతో పాటు మరో నలుగురు టీటీపీ కమాండర్స్ను మట్టికరిపింపచా’మని తెలిపాడు. మౌలానా తన కమాండర్స్తో కలిసి ఇఫ్తార్ విందుకు హాజరయిన సమయంలో అమెరికన్ రిమోట్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ వీరి మీద దాడి చెసిందని తెలిపారు. అయితే అమెరికా నిర్వహించిన డ్రోన్ స్ట్రైక్‌లో మరణించింది టీటీపీ నాయకుడు మౌలానానే అని ఆ సంస్థ నుంచి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మౌలానా టీటీపీ నాకయుడుగా 2013లో బాధ్యతలు చెపట్టాడు. అనంతరం మౌలానా నాయకత్వంలో పాక్, అమెరికాలో పలు భయంకర దాడులు జరిగాయి. వీటిల్లో ముఖ్యమైనది 2014లో పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో జరిగిన బాంబు దాడి. ఈ దాడిలో 151 మంది మరణిస్తే వారిలో 130 మంది స్కూల్ విద్యార్ధులే . మలాలా మీద దాడి చేసిన ఉగ్రవాదుల్లో మౌలానా కూడా ఒకడు. -
రక్షణ రంగంలో భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యం
-
చేతిలో చెవిని పెంచారు..!!
టెక్సస్ : వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుందనడానికి టెక్సస్‌లో జరిగిన ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఓ వ్యక్తి శరీరంలో ఏదైనా అవయవం పాడైపోతే.. దాని స్థానంలో మరో వ్యక్తి నుంచి సేకరించిన అవయవాన్ని అమర్చుతున్నారు. కానీ అమెరికా మిలిటరీ వైద్యులు చెవిని కొల్పోయిన ఓ మహిళ శరీరంలోనే కొత్త చెవిని పునరుత్పత్తి చేశారు. వివరాల్లోకి వెళితే... ఆర్మీలో పనిచేస్తున్న షమిక బ్యూరేగ్ అనే అధికారిణి 2016లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో ఆమె తన చెవిని కొల్పోయారు. వినికిడి శక్తిని కోల్పోయారు. దీంతో ఆమెను తిరిగి ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని భావించిన మిలిటరీ వైద్యుల బృందం సహజసిద్ధమైన చెవిని తిరిగి ఏర్పరచాలని భావించారు. ఇందుకోసం 2012లో తొలిసారి జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీలో సహజసిద్ధంగా చెవిని తిరిగి సృష్టించి.. దానిని అమర్చిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మిలటరీ వైద్యులు ఆ దిశగా అడుగులు వేశారు. టెక్సస్‌లోని విలియం బ్యూమెంట్ మెడికల్ సెంటర్లో షమిక పక్కటెముకల నుంచి మృదులాస్థిని తీసుకొని దాన్ని చెవి ఆకృతిలోకి మార్చారు. ఆ తర్వాత దానిని ఆమె ముంజేతిలో అమర్చి.. స్వతహాగా అది వృద్ధి చెందించడంతో పాటు కొత్త రక్త నాళాలు, స్పందనలు ఏర్పడేలా చేశారు. తర్వాత శస్త్ర చికిత్స ద్వారా చెవిని తిరిగి షమికకు అమర్చారు. దీనిపై షమిక మాట్లాడుతూ.. ‘మొదట్లో నేను దీనికి ఇష్టపడలేదు. వైద్యులు, ఆర్మీ అధికారులు దీని గురించి పూర్తిగా వివరించిన తర్వాత బాగుంటుందేమో అనిపించింది. అవయవ మార్పిడి భయం కలిగించినప్పటికీ నాకు చెవి ఉంటే బాగుంటుందని అనిపించడంతో ఇందుకు ఒప్పుకున్నాను’ అని పేర్కొన్నారు. -
హిజ్రాల నియామకాలపై ట్రంప్ నిషేధం
న్యూయార్క్ : హిజ్రాల ఆవేదనను పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నంత పని చేశారు. ఆ దేశ మిలటరీ రంగంలో హిజ్రాలు చేరకుండా నిషేధం విధిస్తూ ఓ మెమోపై సంతకం చేశారు. ఈ మెమోతో ఇక మిలటరీ సేవల్లో ట్రాన్సజెండర్ల నియామకాలు రద్దు అవుతాయి. ఈ మెమోను వైట్‌హౌజ్ విడుదల చేసింది. దేశీయ మిలటరీ రంగంలో పనిచేయడానికి హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందంటూ వారిపై ట్రంప్ గత నెలలో ఓ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్ చేసిన అనంతరం ఒక్క నెలలోనే ఈ నోటీసులు జారీచేశారు. హిజ్రాలకు కేటాయిస్తున్న ప్రభుత్వం ఫండ్లను ఆపివేయాలని దేశీయ డిఫెన్స్ డిపార్ట్మెంట్, హోమ్‌లాండ్ సెక్యురిటీ డిపార్ట్మెంట్కు ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. గత నెలలోనే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిఘటన మొదలైంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న హిజ్రాలు కన్నీరు కారుస్తూ 'ఈ ప్రెసిడెంట్ మాకొద్దూ అంటూ నినదించారు'. ఏం తప్పు చేస్తే మాపై నిషేధం విధించారంటూ ప్రశ్నించారు. అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని పేర్కొన్నారు. ట్రంప్ ఏమన్నారు మిలటరీలోని జనరల్స్, నిపుణులను సంప్రదించిన అనంతరమే తాను హిజ్రాలపై నిషేధాన్ని విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. మిలటరీ విజయాలపై దృష్టి సారించాలంటే హిజ్రా సైనికుల ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోక తప్పదని పేర్కొన్నారు. -
మనకంటే ముందే అమెరికాకు ఎలా?
మాంచెస్టర్ బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం లండన్ పోలీసులు మీడియాకు చెప్పడానికి ముందే అమెరికా మీడియాలో ఆ విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. వాళ్లకు ఈ సమాచారం లీక్ కావడం బ్రిటిష్ హోం మంత్రికి బాగా చికాకు తెప్పించింది. పేలుడుకు సంబంధించి బయటకు వెళ్లే సమాచారం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించి, తమ దర్యాప్తునకు విఘాగం కలగకుండా చూసుకోవడంలో బ్రిటిష్ పోలీసులకు అన్ని రకాలుగా స్పష్టమైన సూచనలు ఇచ్చామని, కానీ అదేమీ లేకుండా అమెరికన్ మీడియా మాత్రం ఇష్టారాజ్యంగా ఏవి పడితే అవి ప్రచురించిందని హోం మంత్రి అంబర్ రడ్ బీబీసీ రేడియోతో చెప్పారు. ఇది చాలా ఇరిటేటింగ్‌గా ఉందని, అధికార వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నుంచి సమాచారం లీక్ అవ్వడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని తన మిత్రులకు (అధికారులకు) మళ్లీ మళ్లీ చెబుతున్నానని ఆమె అన్నారు. దర్యాప్తు సక్రమంగా సాగకుండా అమెరికన్ అధికారులు ఏమైనా అడ్డుపడుతున్నారా అని ప్రశ్నించగా, తాను అంత దూరం వెళ్లబోనన్నారు. ఇక్కడి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని, ఇలాంటిది ఇంకోసారి జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అమెరికన్ పాప్ స్టార్ అరియానా గ్రేండ్ కచేరీ సాగుతుండగా సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించిన సంగతి తెలిసిందే. సల్మాన్ అబేది అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతడి పేరు ముందుగా అమెరికన్ మీడియాలోనే వచ్చింది. అందుకే అక్కడి హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఏం జరుగుతోంది? బాంబుకు అమ్మ పేరేంటి?’
మిలాన్: అమెరికాను పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. బాంబులకు తల్లి పేరు పెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. విధ్వంసాలు సృష్టించే బాంబులను వర్ణించేందుకు అమ్మ అనే పదాన్ని ఉపయోగించరాదని ఆయన హితవు పలికారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోని అన్ని బాంబులకు తల్లి(మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్)గా పేర్కొంటూ అమెరికా ఓ పెద్ద బాంబును సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై జారవిడిచిన విషయం తెలిసిందే. అనంతరం ప్రపంచ బాంబులకు తండ్రిలాంటి బాంబు(ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్) రష్యా వద్ద ఉందంటూ చర్చ జరిగింది. అయితే, అనూహ్యంగా శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన పోప్.. పేలుడు పదార్థాన్ని తల్లి పేరుతో వర్ణించరాదని అన్నారు. ‘ఆ పేరు నేను విన్నప్పుడు నాకు సిగ్గుగా అనిపించింది. తల్లి జన్మనిస్తుంది. బాంబు మాత్రం చావునిస్తుంది. అయినా దీనిని తల్లిగా పిలుస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది?’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న పోప్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంచలన తీర్పు: యువకుడికి వందేళ్ల జైలుశిక్ష
వాషింగ్టన్: అమెరికాలో ఇలినోయిస్ రాష్ట్రానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలిని లైంగికంగా వేధించి, దోపిడీకి పాల్పడిన కేసులో ఓ యువకుడికి కోర్టు వందేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేసింది. 2015 కొత్త సంవత్సరం రోజున టెవిన్ రైనీ (23) అనే యువకుడు చికాగోకు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న వెస్ట్మాంట్లోని ఓ అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి వేధించాడు. తర్వాత ఆమెను బలవంతంగా ఓ ఏటీఎమ్ దగ్గరకు తీసుకెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకుని పారిపోయాడు. ఈ కేసులో టెవిన్ నేరం చేసినట్టు రుజువు కావడంతో కోర్టు దోషిగా ప్రకటించింది. వృద్ధురాలిని లైంగికంగా వేధించినందుకు 60 ఏళ్లు, తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడినందుకు మరో 40 ఏళ్లు కలిపి టెవిన్కు మొత్తం వందేళ్ల జైలుశిక్ష విధించింది. -
కొరియా మంటలు: రష్యా సాయం కోరిన చైనా!
-
కొరియా మంటలు: రష్యా సాయం కోరిన చైనా!
బీజింగ్: ఉత్తర కొరియా తన దుందుడుకు అణ్వస్త్ర ప్రయోగాలతో తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న నేపథ్యంలో చైనా రష్యాను ఆశ్రయించింది. ఈ విషయంలో ఉద్రిక్తతలు సడలించేందుకు రష్యా సాయం చేయాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగమంత్రి రష్యా విదేశాంగ మంత్రిని కోరారు. ఇప్పటికే ఉత్తర కొరియా రాజేసిన ‘అణు’ మంటలతో ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశముందని చైనా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఆంక్షలు, ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా దూకుడుగా అణ్వాయుధ ప్రయోగాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్యలతో పుండు మీద కారం చల్లినట్టు మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే కొరియా ద్వీపకల్పంలో తమ దేశ నేవీ దళాన్ని మోహరించారు. కొరియా బెదిరింపులను దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియా కూడా తగ్గేది లేదంటున్నది. అమెరికా ఏదైనా రెచ్చగొట్టే చర్యలకు దిగితే.. అంతేదీటుగా కనికరంలేకుండా బదులిస్తామని ప్రకటించింది. ఉత్తర కొరియాకు ఏకైక మిత్రదేశం, ఆర్థిక ప్రాణాధారం అయిన చైనా ఈ ఉద్రిక్తతలతో ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్షణంలోనైనా యుద్ధం జరగవచ్చునని ఆ దేశం శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్తో శుక్రవారం చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి భేటీ అయ్యారు. కొరియా విషయంలో అన్ని పక్షాలను చర్చలకు ఆహ్వానించి ఉద్రిక్తతలను తగ్గుముఖం పట్టించడమే ఇరుదేశాల ధ్యేయమని చైనా ప్రకటించింది. ఈ విషయంలో రష్యా సాయాన్ని చైనా కోరినట్టు ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. -
‘అణ్వస్త్రాలతో మా వైపు ఎందుకు?’
-
‘అణ్వస్త్రాలతో మా వైపు ఎందుకు?’
ప్యాంగ్యాంగ్: అమెరికాపై మరోసారి ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద మొత్తంలో వ్యూహాత్మక అణుబాంబులతో అమెరికా యుద్ధ నౌక కొరియా ద్వీపకల్పంలోకి రావడమేంటని ప్రశ్నించింది. అమెరికా యుద్ధ నౌక సమీపిస్తుండగానే ఆరోసారి ఉత్తర కొరియా అణుపరీక్ష జరిపేందుకు సిద్ధమవుతుండటం ఇప్పుడు కలవరాన్ని రేపుతోంది. సిరియా అమాయక ప్రజలపై విషరసాయనాల దాడులు జరిగిన తర్వాత అక్కడి వైమానిక స్థావరాలపై అమెరికా ఏక కాలంలో మొత్తం 59 తొమాహక్ క్షిపణులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా పరోక్షంగా దూకుడుగా ఉన్న ఉత్తర కొరియా, చైనాకు అమెరికా హెచ్చరికలు చేసింది. అయినప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా యుద్ధం వస్తే తాము సై అంటూ ప్రకటించింది. దీంతో అమెరికా కొరియాను సమీపిస్తోంది. మరోపక్క, ఇక మా వ్యూహాత్మక ఓపిక నశించిందని అమెరికా ప్రకటించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
రసాయనదాడి.. ఓ కట్టుకథ: అసద్
తమ మీద క్షిపణులతో దాడి చేయడానికి అమెరికా ’రసాయన దాడి’ అనే కట్టుకథను ఉపయోగించుకుందని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తీవ్రంగా మండిపడ్డారు. నూటికి నూరుశాతం.. కచ్చితంగా అది కట్టుకథేనని, కేవలం తమ దేశం మీద దాడి చేయడం కోసం అమెరికా ఈ మొత్తం కథను అల్లేసిందని ఆయన అన్నారు. రసాయన ఆయుధాలన్నింటినీ సిరియా సైన్యం ఎప్పుడో విడిచిపెట్టేసిందని చెబుతూ.. అమెరికా దాడి చేసినంత మాత్రాన తమ సైనిక సామర్థ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు. సిరియా సైన్యం చేసిందని చెబుతున్న రసాయన దాడిలో ఇప్పటివరకు 87 మంది మరణించారు. వాళ్లలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈ దాడిలో మృతుల, క్షతగాత్రుల ఫొటోలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే సిరియా మాత్రం అసలు తాము ఈ తరహా దాడులే చేయలేదని చెబుతుండగా రష్యా కూడా దాన్ని సమర్థించింది. తిరుగుబాటుదారుల వద్ద విషపూరిత పదార్థాలతో కూడిన డిపో ఒకటి ఉందని, దానిమీద సిరియా వైమానిక దళం బాంబులు వేయడంతో దాన్నుంచి విషవాయువులు బయటకు వచ్చి ఉంటాయన్నది సిరియా, రష్యా వర్గాల వాదన. అసలు ఖాన్ షైఖుమ్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న దాడుల మీద కూడా అసద్ అనుమానం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వీడియోలలో వాస్తవం ఎంతో తెలియదన్నారు. ఆ పిల్లలు నిజంగా ఖాన్ షైఖుమ్ ప్రాంతంవారో కాదో ఎలా చెప్పగలమని, ఇప్పుడు చాలా వరకు ఫేక్ వీడియోలు ఉంటున్నాయని అన్నారు. రసాయన దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య సిరియాలోని ఒక వైమానిక స్థావరంపై మధ్యధరా సముద్రం నుంచి 59 తోమహాక్ క్షిపణులు ప్రయోగింపజేసిన విషయం తెలిసిందే. సిరియాలో ఆరేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుని ప్రత్యక్ష దాడికి దిగడం ఇదే మొదటిసారి. -
యూఎస్ మిలటరీ విమానం అత్యవసర ల్యాండింగ్
జకర్తా: అమెరికా మిలటరీకి చెందిన విమానాన్ని ఇండోనేసియాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శనివారం ఇండోనేసియా ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి ఈ విషయాన్ని చెప్పారు. శుక్రవారం అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన బోయింగ్ 707 విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి ఫెయిలైందని, ల్యాండింగ్ చేసుకోవడానికి అనుమతివ్వాలని వారు కోరగా, తాము అంగీకరించామని ఇండోనేసియా ఎయిర్ వైస్ మార్షల్ జెమీ త్రిసోంజయ చెప్పారు. ఏసెహ్ ప్రావిన్స్‌లోని బండా ఏసెహ్ విమానాశ్రయంలో రన్ వే పక్కన అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను మోహరించామని, యూఎస్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. హిందూ మహాసముద్రంలోని డీగో గార్కియా మిలటరీ బేస్ నుంచి జపాన్‌లోని హానెడా విమానాశ్రయానికి 20 మంది అమెరికా మిలటరీ అధికారులను విమానంలో తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలోని ఇంజిన్ ఫెయిల్ కావడానికి గల కారణాలు తెలియరాలేదు. -
ఉగ్రవాదులనుకొని బాంబులు వదిలితే..
బీరుట్: సిరియాలో మరోసారి అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భాగంగా సిరియా బలగాలతో కలసి పాల్గొంటున్న అమెరికా సైనిక విమానం జరిపిన బాంబు దాడిలో 33మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు అని భ్రమపడి ఓ మూతబడిన పాఠశాలపై అమెరికా యుద్ధ విమానం దానిపై బాంబును జారవిడచడంతో దాదాపు 33మంది ప్రాణాలుకోల్పోయారు. వీరంతా కూడా బాంబు దాడుల కారణంగా తమ తమ సొంత ప్రదేశాలను విడిచిపెట్టి వచ్చినవారే. సిరియా పౌర హక్కుల సంస్థ ఈ విషయం తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెరలో అల్ మన్సూరా అనే సిరియా ప్రాంతం ఉంది. ఇక్కడ రక్బా ప్రాంతానికి 20 మైళ్ల దూరంలో ఓ పాఠశాల ఉంది. అందులోకి ఆయా ప్రాంతాల్లో బాంబు దాడులకు తట్టుకోలేక నిరాశ్రయులుగా మిగిలిన కొంతమంది శరణార్థులుగా మిగిలిపోయారు. వారంతా కూడా ఆ స్కూల్ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. వారి కదలికలను గమనించి యూఎస్ యుద్ధ విమానం ఉగ్రవాదులుగా భావించి బాంబులు వేయడంతో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. -
ప్యాంటు జేబులోని సెల్ ఫోన్ కాలిపోవడంతో..
వాషింగ్టన్: అమెరికాలోని పుయల్లుప్ సిటీలో ఓ వ్యక్తికి విభ్రాంతికర సంఘటన ఎదురైంది. షాపింగ్ చేస్తున్న సమయంలో అతని ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ కాలిపోయింది. ప్యాంటు జేబులోంచి మంటలు రావడంతో అతను తనను కాపాడుకోవడానికి వెంటనే ప్యాంటు విప్పేశాడు. జాకెట్ విప్పి నడుం చుట్టు కట్టుకున్నాడు. ఓ ఉద్యోగి అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పివేశాడు. ఈ ఘటన జరిగినపుడు షాపులో ఉన్న ఎవరెట్ ట్రెల్ అనే ప్రత్యక్ష సాక్షి ఈ వివరాలు చెప్పాడు. ఇలాంటి ఘటనను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, భారీగా పొగలు వ్యాపించాయని, అక్కడున్నవారు భయపడ్డారని చెప్పాడు. షాపు మేనేజర్ బాధితుడికి జత కొత్త ప్యాంట్లు అందజేశాడు. బాధితుడికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాడు. అతని సెల్ ఫోన్ కాలి బూడిదైందని, ప్యాంటు పడిన చోట నల్లగా మరక ఏర్పడిందని చెప్పాడు. బాధితుడి పేరు, ఫోన్ ఎందుకు కాలిందన్న వివరాలు తెలియరాలేదు. -
అమెరికాకు చైనా వార్నింగ్!
-
అమెరికాకు చైనా వార్నింగ్!
-
అమెరికాకు చైనా వార్నింగ్!
బీజింగ్: దక్షిణ కొరియాలో అమెరికా మోహరిస్తున్న క్షిపణి రక్షక వ్యవస్థపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణి వ్యవస్థకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, దీని పరిణామాలను అమెరికా, దక్షిణ కొరియా ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. దక్షిణ కొరియాలో క్షిపణి రక్షక వ్యవస్థ ఏర్పాటును చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షౌంగ్ మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే అమెరికా మిస్సైల్ లాంచర్లు, ఇతర సామగ్రి దక్షిణ కొరియా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రత ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా కచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని జెంగ్ చెప్పారు. తాజా చర్యల నేపథ్యంలో ఎదురయ్యే పరిణామాలకు అమెరికా, దక్షిణకొరియానే బాధ్యత వహించాలని అన్నారు. ఉత్తరకొరియా నాలుగు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన నేపథ్యంలో తన మిత్రపక్షమైన దక్షిణకొరియాలో అమెరికా క్షిపణి రక్షక వ్యవస్థను ఏర్పాటును తలపెట్టింది. -
‘యూఎస్ స్థావరాల బద్దలుకే మా ప్రయత్నం’
టోక్యో: ఉత్తర కొరియా దుస్సాహాసానికి దిగబోతోంది. ఏకంగా ప్రపంచ అగ్ర రాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదువ్వబోతోంది. ఇటీవల వరుస క్షిపణుల పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం అవన్నీ కూడా తాము అమెరికాను లక్ష్యం చేసుకునే చేశామంటూ నేరుగా ప్రకటించింది. జపాన్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలు ధ్వంసం చేసేందుకు తాము గట్టిగా ప్రయత్నిస్తున్నామంటూ బహిరంగంగా మీడియాకు లీకులిచ్చింది. అందులో భాగంగానే తమ అణు క్షిపణుల సామర్ధ్యాన్ని మరింత పెంచుకుంటూ వెళుతున్నామని కూడా ఉత్తర కొరియా ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో ఆయన చూస్తుండగా నాలుగు బాలిస్టిక్ అణు ఖండాంతర క్షిపణులను పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది. తమ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాంతీయ సంరక్షణకు తాము క్షిపణుల సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు తెలిపిన ఉత్తర కొరియా తమ అసలు ఉద్దేశాన్ని మాత్రం బయటపెట్టింది. జపాన్‌లోని అమెరికాకు చెందిన చాలా ముఖ్యమైన సైనిక స్థావరాలున్నాయి. గతంలో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో జరిగిన ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన సైనిక స్థావరాలు ఏర్పాటుచేశారు. వీటిని ధ్వంసం చేసేందుకే ఉత్తర కొరియా ప్రయత్నిస్తోందంట. అదీ కాకుండా అమెరికా వ్యూహాత్మక కమాండ్ కూడా ఉత్తర కొరియా క్షిఫణి ప్రయోగాన్ని ట్రాక్ చేసిందట. అయితే, అది ఉత్తర అమెరికాకు లక్ష్యంగా చేసినట్లుగా అనిపించలేదని చెప్పింది. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గ్రిల్లోట్
-
ఉగ్రవాదుల తెలివైన చర్య.. చూస్తే అవాక్కే..
బావిజా: తమను వేటాడుతున్న బలగాలు బిత్తరపోయేలా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రతి వ్యూహాలతో పరుగులు పెట్టిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సిరియాలో బలగాలను పక్కదారి పట్టిస్తోంది. అది చేస్తున్న చర్యలు చూస్తుంటే మేథావులు కూడా ఔరా అనాల్సిందే. ప్రస్తుతం మోసుల్‌పై పూర్తిస్థాయి ఆదిపత్యం సంపాధించేందుకు అమెరికావంటి అగ్ర దేశాల సైన్యంతో కలిసి ఇరాక్ సేనలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వైమానిక దాడులే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ దాడుల నుంచి బయటపడేందుకు ఏకంగా ఐసిస్ చెక్కలతో తయారు చేసిన యుద్ధ ట్యాంకులను, అందులో గడ్డం అమర్చి ఉంచిన మనిషి బొమ్మలను పెడుతోంది. వీటిని చూసి వైమానిక బలగాలు నిజమైన యుద్ధ ట్యాంకులే, నిజమైన ఉగ్రవాదులే అనుకోని పక్కదారి పట్టాలనేది ఉగ్రవాదుల వ్యూహం. ఇలా భ్రమపడి దాడులు కూడా జరిగాయి కూడా. ఒక్కో ప్రాంతంపై దాడి చేస్తూ ముందుకు వెళుతున్న బలగాలు ఉగ్రవాదుల స్థావరాలను స్వాధీనం చేసుకొని పరిశీలించగా ఈ విషయం తెలిసింది. ఇది చూసి తాము ఆశ్చర్యానికి లోనయ్యామని అబ్బాస్ అల్ అజాజి అనే కల్నల్ చెప్పారు. -
భారత్ గొప్ప దేశం.. మా బంధం దృఢమైనది: అమెరికా
వాషింగ్టన్: భారత్-అమెరికాల సైనిక విభాగం విషయంలో ఎప్పటికీ చాలా అన్యోన్యమైన సంబంధం ఉంటుందని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ అన్నారు. తమ రెండు దేశాలు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశాలని కొనియాడారు. వ్యూహాత్మక విషయాల్లో, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఎప్పుడో చేతులుకలిపామని అన్నారు. ఉపరితల, గగనతల, సముద్రంపైనా తొలిసారి ఇరు దేశాలు కలిసి విన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 'అమెరికా వివిద ప్రాంతాల మధ్య స్థానిక భాగస్వామ్యాలు పెరగడమే కాదు.. మరింతగా బలపడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్ అమెరికాల మధ్య మిలటరీ సంబంధాలు బలపడ్డాయి. భారత్ గొప్ప దేశం. పెద్ద ప్రజాస్వామ్యం గలది' అంటూ ఆయన కొనియాడారు. 'భారత్ అమెరికా మధ్య ఒక్క సైనిక ఒప్పందాలే కాదు.. సాంకేతిక పరిజ్ఞానపరమైన ఒప్పందాలు కూడా జరిగాయి. మోదీ మేకిన్ ఇండియా ప్రచార కార్యక్రమంలో భాగంగా మా దేశాలకు కూడా సైనిక పరమైన అవసరాల విషయంలో, క్షిపణి వ్యవస్థ విషయంలో సహకారం చేసుకునే అవకాశం వచ్చింది' అని ఆయన అన్నారు. -
డల్లాస్‌లో కాల్పులు జరిపింది ఇతడే
డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో నల్లజాతీయుల నిరసన ర్యాలీ సందర్భంగా పోలీసులపై కాల్పులు జరిపిందే ఒకడేనని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని జేవియర్ జాన్సన్‌గా డల్లాస్ పోలీసులు గుర్తించారు. అతను గతంలో అమెరికా సైనిక బలగాల్లో పనిచేసినట్టు చెప్పారు. డల్లాస్ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు పోలీసులతో పాటు ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితుడు జాన్సన్‌ను హతమార్చారు. రొబోకు పేలుడు పదార్థాలు అమర్చి అతని దగ్గరకు పంపి పేల్చివేశారు. ఈ వారంలో లూసియానా, మిన్నోసోటా పోలీసు కాల్పుల్లో ఇద్దరు నల్లజాతీయుల మృతికి నిరసనగా చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. కాల్పులు జరిపిన జాన్సన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జాన్సన్ ఇంట్లో బాంబులు తయారు చేసే వస్తువులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కాగా గతంలో జాన్సన్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఇటీవల నల్లజాతీయులను చంపినందుకు ప్రతీకారంగా తెల్లజాతి అధికారులను చంపాలనుకున్నట్టు కాల్పుల ఘటన సమయంలో జాన్సన్ పోలీసులతో చర్చల సందర్భంగా చెప్పాడు. -
చిక్కుల్లో ఆపిల్
ఫ్లోరిడా: అసలే అమ్మకాలు పడిపోయి.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్న ఆపిల్ సంస్థను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా తన కాపీరేట్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి వేల కోట్ల దా వావేశాడు. ఐఫోన్ ఆలోచన తనదేనని.. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఐడియాను కొట్టేసిందని పోరాటానికి దిగాడు. ఫ్లోరిడాకు చెందిన థామస్ రాస్ ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ఈ వారం వ్యాజ్యం దాఖలు చేశాడు. ఆపిల్ సంస్థ తన ఐడియాను హైజాగ్ చేసిందని తద్వారా వేల కోట్లు ఆర్జిస్తోందని ఆరోపించాడు. ఇందుకు గాను తనకు సుమారు రూ. 74,177 కోట్లు (11బిలియన్ డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కోర్టు కెక్కాడు. అలాగే ఆపిల్ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో కనీసం 1.5 శాతం ఒక సహేతుకమైన రాయల్టీ గా చెల్లించాలని కోరుతున్నాడు. 1992 లోనే ఐ ఫోన్ డిజైన్ ను రూపొందించానని వాదించాడు. అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ ఆఫీసు అవసరం ఫీజు చెల్లించడంలో విఫలమైన కారణంగా 1995 లో ఈ పేటెంట్ అప్లికేషన్ రద్దయిందని పేర్కొన్నాడు. ఈ డిజైన్ నమూనా కాపీని కూడా జత చేశాడు. గత ఏడాది తన డిజైన్ ను కాపీ రైట్ చేయించానని లా సూట్ లో పేర్కొన్నాడు. తన మేధో సంపత్తిని చట్ట విరుద్ధంగా యాపిల్ ఉత్పత్తుల్లో, ప్యాకేజింగ్ లో వాడుకుంటోందని ఆరోపించాడు. తన సొంత ఆవిష్కరణలు కాకుండా డంప్ స్టర్ డైవింగ్ (ఒక కంప్యూటర్ నెట్ వర్క పై దాడి చేసేందుకు వాడబడే సమాచారాన్ని పొందడానికి ఉపయోగించే ఒక టెక్నిక్) కు పాల్పడుతోందన్నాడు. తనకు యాపిల్ నుంచి ఎలాంటి వివరణ కానీ, ఖండనగానీ రాలేదని తెలిపాడు. కాగా 2001 ఎంపీ3 మ్యూజిక్ ప్లేయర్ తో ఐపాడ్ లాంచయింది. అనంతరం ఆరేళ్ల తరువాత 2007 లో ఐ ఫోన్ ను ప్రవేశపెట్టారు. అయితే రాస్ పిటిషన్ పై దీనిపై స్పందించేందుకు ఆపిల్ నిరాకరించింది. -
అమెరికా ఇంకా ఫ్లాపీలు వాడుతోంది!
వాషింగ్టన్: ప్రపంచం ఎప్పుడో మర్చిపోయిన, 1970ల్లో తయారైన ఫ్లాపీ డిస్క్‌లను అమెరికా అణువిభాగంలో ఇంకా వాడుతున్నారని అక్కడి ‘ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం’ (జీఏఓ) విడుదల చేసిన తాజా నివేదిక ద్వారా వెల్లడైంది. ప్రస్తుత కాలంలో పనికిరాని పురాతన పరికరాలను అమెరికా ప్రభుత్వ విభాగాల్లో ఇంకా వాడుతుండటంపై జీఏఓ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వం టెక్నాలజీ కోసం కేటాయించిన 80 బిలియన్ డాలర్ల బడ్జెట్ లో మూడు-నాలుగో వంతు పాత కంప్యూటర్ల నిర్వహణకే వినియోగిస్తున్నట్టు జీఏఓ నివేదిక వెల్లడించింది. కంప్యూటర్లను అప్ డేట్ చేయాలని, వచ్చే ఏడాది చివరి నాటికి ఫ్లాపీ డిస్క్‌ల వాడకం లేకుండా చేసేందుకు పెంటగాన్ ప్రణాళికలు రచిస్తోంది. -
పాకిస్థాన్‌కు రూ. 2వేల కోట్ల సాయం కట్?
పాకిస్థాన్‌కు దాదాపు రూ. 2వేల కోట్ల సైనిక సాయాన్ని నిలిపివేసేందుకు వీలుగా ఒక చట్టాన్ని సెనేట్ సంఘం ఆమోదించింది. హక్కానీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అణిచివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ రుజువు చేసుకోలేకపోతే ఈ సాయాన్ని ఆపేస్తారు. గత సంవత్సరం నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టాన్ని ఆమోదించినట్లే ఈసారి కూడా సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ కొత్త చట్టాన్ని ఆమోదించింది. గత సంవత్సరపు చట్టం మాత్రం పాక్‌కు భద్రతాపరమైన సాయాన్ని కొనసాగించాలని తెలిపింది. ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందని పెంటగాన్ అధికార ప్రతినిధి, నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ తెలిపారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌కు సైనిక సాయం అందించడంపై అమెరికా పలు విమర్శలను ఎదుర్కొంది. ఈ అంశాన్ని కూడా కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పాక్ అంతర్గత భద్రత, సుస్థిరత కూడా ఆ ప్రాంతంలో సరిహద్దుల వెంబడి ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చాలా కీలకం అని సెనేట్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
తీర ప్రాంతాల్లోకి అమెరికా చొరబాటు
వాషింగ్టన్: అనుమతి లేకుండా తమ సముద్ రతీర ప్రాంతాల్లోకి అనుమతి లేదంటూ ప్రపంచ దేశాలు చేసిన వ్యాఖ్యలను అమెరికా తనదైన శైలిలో ఉల్లంఘించింది. గత ఏడాది దాదాపు 13 దేశాల్లో అమెరికా యుద్ధ నౌకలతో పాటు మిలటరీ విమానాలను తిప్పినట్లు పెంటగాన్ ప్రకటించింది. వీటిలో చైనా, భారత్, ఇండోనేసియా, ఇరాన్, లిబియా, మలేసియా, మాల్దీవులు, ఒమన్, ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర దేశాలు ఉన్నాయి. అయితే, ఎన్నిసార్లు ఆయా దేశాల తీరప్రాంతాల్లో అమెరికా దళాలు ప్రవేశించాయనే విషయాన్ని మాత్రం పెంటగాన్ వెల్లడించలేదు. ప్రపంచ దేశాలలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే అర్హత ఉందని చెప్పడానికి మాత్రమే ఇలా చేశామని పెంటగాన్ తెలిపింది. ఫ్రీడం నావిగేషన్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తైవాన్, నికార్ గువా, అర్జెంటీనాల్లో ఒక్కసారి మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించింది. చైనా సొంతగా తయారు చేసుకున్న ద్వీపాల ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో అనేకసార్లు ప్రయాణించినట్లు, ఇక చైనా నుంచి సంకేతాలు అంది ఆగిపోయినట్లు ప్రకటించింది. ఈ ఏడాది దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న మిలటరీ ల్యాండ్ వద్ద ఎక్కువగా సంచరించనున్నట్లు యూఎస్ ఫసిఫిక్ కమాండ్ అడ్మిరల్ హ్యరీ హ్యారీస్ చెప్పారు. ఇక 2014లో అమెరికా 19 దేశాల తీరప్రాంతాల్లో ప్రవేశించింది. వీటిలో ఇరాన్, ఫిలిప్ఫీన్స్ లు ముందువరుసలో ఉన్నాయి. -
కంప్యూటర్ గేమ్ పిచ్చిలో పడి కూతుర్నే..
న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్న తనను డిస్ట్రబ్ చేసిందనే కోపంతో ఓ 31 ఏళ్ల తండ్రి తన రెండేళ్ల కూతురును చంపేశాడు. గొంతుపట్టి పిసికి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అంథోని మైఖెల్ సాండర్స్ అనే వ్యక్తి గత డిసెంబర్లో ఎల్లీ శాండర్స్ అనే తన రెండేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు బాధ్యతలు చూసుకుంటున్నాడు. అయితే అతడు ఎలా ఆ బాలికను చంపాడనే విషయాన్ని పోలీసులు తెలుపుతూ 'ఆ సమయంలో అతడు కంప్యూటర్ గేమ్ లో విపరీతంగా లీనమై ఉన్నాడు. బహుషా.. ఆ సమయంలో ఆ పాప అతడిని డిస్ట్రబ్ చేసి ఉంటుంది. అందుకే అతడు కొట్టడమే కాకుండా ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటాడు. పోస్టుమార్టం నివేదిక కూడా ఆ పాపకు శ్వాస ఆడకచనిపోయిందని, రెండుమూడు గాయాలు కూడా ఉన్నాయని తెలిపింది' అని చెప్పారు. తన భార్య ఒక ఆర్ట్ షోకు వెళ్లినప్పుడు అతడు ఈ అఘాయిత్యం చేసినట్లు చెప్పారు. -
కారులో పాపను ఒంటరిగా వదిలేసినందుకు..
లాస్ ఏంజిలెస్: అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో ఓ వ్యక్తి తన తొమ్మిది నెలల కూతురును పార్కింగ్ వద్ద కారులో ఒంటరిగా వదిలి, స్ట్రిప్ క్లబ్‌కు వెళ్లినందుకు ఆరేళ్ల జైలుశిక్ష పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు. నిందితుడు ఆవిన్ డార్గిన్ (24)పై పిల్లలను హింసించారనే సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు లాస్ ఏంజిలెస్ జిల్లా అటార్నీ జాకీ లేసీ చెప్పారు. గత మార్చి 9న ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. డార్గిన్ బాధ్యత మరిచి కారులో పాపను ఒంటరిగా వదిలి స్ట్రిప్ క్లబ్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లాడు. పాప ఏడుపు విని సమీపంలో ఉన్నవారు, స్ట్రిప్ క్లబ్ సిబ్బంది వెళ్లి కారులోంచి ఆ పాపను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. క్లబ్లో డాన్స్ చేస్తూ ఆనందంలో మునిగిపోయిన డార్గిన్కు క్లబ్ మేనేజర్ ఈ విషయం చెప్పాడు. పాపకు సరిగా ఊపరి ఆడక అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా తాను తప్పు చేయలేదని డార్గిన్ చెబుతున్నా.. నేరం రుజువైతే ఆరేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది. -
వీర జవాన్ ఎక్కడున్నాడు?
శత్రువు చేతిలో చనిపోవడమేకాదు, శత్రుదుర్బేధ్యమైన 'బిహైండ్ ది ఎనిమీస్ లైన్స్' లోనూ చాకచక్యంగా వ్యవహరించడం, గుట్టుచప్పుడు కాకుండా విరోధిని మట్టుపెట్టడమూ వీరత్వమే అంటూ ప్రపంచదేశాల సైనికులకు 'నిగూఢ' పాఠాలు నేర్పుతున్నాడు బ్రెంట్ డోనింగ్. అమెరికా సైన్యంలో పనిచేస్తోన్న ఆయన.. రహస్యంగా దాక్కొని శత్రువును చంపటం(కామెఫ్లాగ్ టెక్నిక్) ఎలాగో నేర్పేందుకు ఏకంగా యూట్యూబ్ లో ఛానెలే ప్రారంభించాడు. ఆయా ప్రాంతాన్ని, అక్కడి పరిస్థితులను బట్టి అనువైన దుస్తులు ధరించి, చెట్టూపుట్టతో కలిసిపోయినట్లుండి అదనుచూసి శత్రువును ఎలా దెబ్బకొట్టాలో వీడియోలు రూపొందిస్తాడు బ్రెంట్. ఇటీవలే తన ఛానెల్ లో అప్ లోడ్ చేసిన ఓ వీడియోలో.. 'అడవిలో దాక్కున్న వీరజవాన్ ను కనిపెట్టండి చూద్దాం' అని నెటిజెన్లకు సవాలు విసిరాడు. ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో కొద్ది గంటల తర్వాత అతనే రివీల్ చేశాడు. బ్రెంట్ సవాలుపై మీరూ ఓ లుక్కెసి, జవాన్ ను కనిపెట్టండి.. -
పాక్‌కు అమెరికా ఫైటర్ జెట్లు.. భారత్ తీవ్ర ఆగ్రహం
ఎవరు ఎంత వద్దని చెప్పినా.. పాకిస్థాన్‌కు 8 ఎఫ్-16 బ్లాక్ -52 విమానాలను అమ్మాలని ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 4770 కోట్లు. అమెరికా విదేశాంగ శాఖ ఈ అమ్మకానికి ఆమోదం తెలిపిందని పెంటగాన్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు, చొరబాట్లను ఎదుర్కొనేందుకు ఈ యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు ఇవ్వడం సమంజసమేనని అమెరికా అంటోంది. కానీ అమెరికా చర్యను భారత్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై తన నిరసనను తెలియజేసేందుకు భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను పిలిపించింది. ఉదయం 9.30 గంటల సమయంలో రిచర్డ్ వర్మ ఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. 26/11 దాడుల్లో పాకిస్థాన్ హస్తం ఉందన్న విషయం డేవిడ్ హెడ్లీ విచారణలో స్పష్టంగా తేలుతున్నా, అమెరికా నుంచే హెడ్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతున్నా కూడా ఇప్పుడు పాకిస్థాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు అమ్మడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. దీనివల్ల భారత ఉపఖండంలో ఆయుధపోటీకి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తోంది. -
మళ్లీ తెరపైకి అమెరికా పేట్రియాట్ క్షిపణులు
గల్ఫ్ వార్ సమయంలో రష్యన్ స్కడ్ మిసైళ్లను ఛేదించడానికి తాను ప్రయోగించిన పేట్రియాట్ మిసైళ్లను ఇప్పుడు ఆమెరికా మళ్లీ తెరమీదకు తీసుకొచ్చింది. ఉత్తరకొరియా ఇటీవలే అణు పరీక్ష, లాంగ్ రేంజి రాకెట్ ప్రయోగాలు చేయడంతో.. దానికి చెక్ పెట్టేందుకు దక్షిణ కొరియాలో అదనంగా ఒక పేట్రియాట్ మిసైల్ బ్యాటరీ మోహరించింది. వచ్చే వారం దక్షిణ కొరియాలో మరిన్ని అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లను అమెరికా మోహరించనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పేట్రియాట్ మిసైళ్లను అక్కడకు తరలించింది. ఉత్తర కొరియా నుంచి వచ్చే ఎలాంటి దానినైనా ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇలాంటి ఎక్సర్సైజులు ఉపయోగపడతాయని ఎయిత్ ఆర్మీకి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ థామస్ వండాల్ చెప్పారు. -
అమెరికా ఆర్మీ హెలికాప్టర్ పై దాడి
- తాలిబన్ల దుశ్చర్యలో యూఎస్ సైనికుడి మృతి, మరొ ఇద్దరికి గాయాలు - అఫ్ఘానిస్థాన్ లోని హెల్మండ్ ఫ్రావిన్స్ లో ఘటన యుద్ధం ముగిసిన సుదీర్ఘ కాలం తర్వాత అఫ్ఘానిస్థాన్ నుంచి తన సైన్యాన్ని వెనక్కి రప్పించాలని భావిస్తున్న అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ అఫ్ఘాన్ లోని హెల్మండ్ ఫ్రావిన్స్ లో యూఎస్ ఆర్మీ మెడికల్ హెలికాప్టర్ పై తాలిబన్లు జరిపిన దాడిలో స్పెషల్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన సైనికుడు ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. హెల్మండ్ లోని మర్జా పట్టణంలో తిరిగి విస్తరించిన తాలిబన్ల ఏరివేతకు అమెరికా- అఫ్ఘాన్ సైన్యాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో గయపడ్డ సైనికులకు చికిత్స్ అందించేందుకు వెళ్లిన మెడికల్ హెలికాప్టర్ పై తాలిబన్లు రాకెట్ లాంచర్లతో దాడి చేశారని, స్వల్పంగా ధ్వంసమైనప్పటికీ హెలికాప్టర్ ఎయిర్ బేస్ కు తిరిగిచ్చిందని, ఈ సంఘటనలో ఒక సైనికుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని యూఎస్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. -
యూఎస్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఐఐఎస్సీ
వాషింగ్టన్ : బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కు అరుదైన అవకాశం దక్కించుకుంది. యూఎస్ మిలటరీకి చెందిన సోలార్ పవర్ మైక్రో గ్రిడ్ అభివృద్ధి పరిశోధన కాంట్రాక్ట్‌ను ఈ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ కింద రూ. 52,900 యూఎస్ డాలర్లను యూఎస్ పసిఫిక్ ఎయిర్ పోర్స్ నిధులు కేటాయించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దక్కిన అరుదైన అవకాశాల్లో యూఎస్ మిలటరీ కాంట్రాక్ట్ ఒకటి. వాషింగ్టన్లో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి అస్టోన్ కార్టర్ గురువారం పెంటగాన్‌లో భేటీ అయ్యారు. భారత్ - అమెరికా దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్చల్లో భాగంగా పారికార్ ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. -
'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం'
వాషింగ్టన్: ఆఫ్ఘానిస్థాన్‌లో ఆమెరికా వైమానిక దళాలు ఓ ఆస్పత్రిపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. తమ దళాలు పొరపాటుగా ఆస్పత్రిపై దాడి చేశాయని ఆఫ్ఘాన్‌లో అమెరికా దళాల కమాండర్ జాన్ క్యాంప్‌బెల్ వివరణ ఇచ్చారు. శనివారం కుండజ్లోని ఓ ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో 22 మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటనపై ఆఫ్ఘాన్ లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా వైద్య శిబిరాలను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని క్యాంప్‌బెల్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. కుండజ్లో తాలిబాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్‌లో భాగంగా ఆఫ్ఘాన్ దళాల విజ్ఞప్తి మేరకు తమ వైమానిక దళాలు మద్దతుగా దాడులు చేశాయని క్యాంప్‌బెల్ చెప్పారు. -
దిండుతో కొడితే ముక్కు పగిలింది!
అది యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ.. ఒక వేసవి సాయంత్రాన శిక్షణలో ఉన్న సైనికులు ఒక్కొక్కరుగా గ్రౌండ్లోకి వచ్చారు. అందరి చేతుల్లో తెల్లగా మెరిసిపోతున్న మెత్తటి తలదిండ్లు. విజిల్ మోగింది. పిల్లో ఫైటింగ్ మొదలైంది. ఒకర్ని ఒకరు.. మరొకరిని పది మంది కలిసి ఇరగ కుమ్మేసుకున్నారు. అంతలోనే ఏదో కలకలం దిండ్ల దెబ్బలకు కొందరి ముక్కులు పగిలాయి, ఇంకొందరు నోటి నుంచి రక్తం కక్కుకున్నారు. మరికొందరైతే ఏకంగా స్పృహ తప్పి పడిపోయారు. మ్యాటర్ సీరియస్ అవుతుందని గ్రహించిన ఉన్నతాధికారులు వెంటనే అంబులెన్స్ ను పిలిపించి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపారు. న్యూయార్క్ నగరంలోని వెస్ట్ పాయింట్ ప్రాంతంలో మిలటరీ అకాడమీలో చోటుచేసుకున్న బీభత్సమింది. అకాడమీలో కొత్తగా చేరిన క్యాడెట్లకు హోమ్ సిక్నెస్ దూరమయ్యేలా ఫ్రెషర్స్ పార్టీ తరహాలో ఏటా పిల్లో ఫైట్ కార్యక్రమాన్నినిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది వేడుకల్లో మాత్రం సంబరం కాస్తా శ్రుతి మించి రక్తపాతానికి దారితీసింది. కొందరు క్యాడెట్లు ఇనుప గుండ్ల వంటి గట్టి వస్తువులను తలదిండ్లలో దాచి దాడి చేయడం వల్లే రక్తపాతం జరిగిందని అకాడమీ బాధ్యులు చెప్పారు. ఆగస్టు 20న చోటుచుసుకున్న ఈ సంఘటనను ఇంతకాలం దాచిపెట్టిన అకాడమీ నిర్వాహకులు.. మీడియా ఒత్తిడి మేరకు చివరకు విషయాన్ని వెల్లడించారు. గాయాల నుంచి తేరుకున్న క్యాడెట్లు ప్రస్తుతం క్లాసులకు హాజరవుతున్నారని, వచ్చే ఏడాది పిల్లో ఫెస్టివల్లో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహిస్తామని చెబుతున్నారు. -
హెలికాప్టర్ అదృశ్యం: 8 మంది గల్లంతు
వాషింగ్టన్: నేపాల్ భూకంప ప్రాంతంలో అమెరికాకు చెందిన మెరైన్ హెలికాప్టర్ అదృశ్యమైందని పెంటగాన్ అధికార ప్రతినిధి ఆర్మీ కల్నల్ స్టీవ్ వార్నీ బుధవారం వెల్లడించారు. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మెరైన్ సిబ్బందితోపాటు ఇద్దరు నేపాలీ సైనికుల జాడ తెలియరాలేదని తెలిపారు. నేపాల్‌లోని భూకంప బాధితుల కోసం మంగళవారం ఆహార పదార్థాలను తరలిస్తున్న క్రమంలో అదృశ్యమైందని చెప్పారు. అయితే హెలికాప్టర్లో ఇంధనం చాలా తక్కువగా ఉందని యూఎస్ మిలటరీ అధికారులకు హెలికాప్టర్ పైలట్లు చెప్పారని ... ఆ కొన్ని నిమిషాలకే హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండా పోయిందని స్టీవ్ వార్నీ వెల్లడించారు. హెలికాప్టర్ అదృశ్యమైన వార్త తెలియగానే ... రంగంలోకి దిగిన మెరైన్ సిబ్బంది సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదని చెప్పారు. చీకటి కావడంలో గాలింపు చర్యలు నిలిపివేశారని చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి హెలికాప్టర్ ఆచూకీ కనుగొనేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
66 రోజులు ఒంటరిగా సముద్రంలో...
మియామి: సముద్ర జలాల్లో రెండు నెలల క్రితం తప్పిపోయిన లూయీ జోర్డాన్ అనే 37 ఏళ్ల సెయిలర్ 66 రోజుల అనంతరం సురక్షితంగా బయటపడి తిరిగి అమెరికాకు చేరుకున్నాడు. తాను వెళుతున్న సెయిలింగ్ బోటు తిరగబడి ఇన్ని రోజుల పాటు సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన జోర్డాన్, చేతులతో పట్టుకున్న చేపలు తిని, వర్షం నీటిని తాగుతూ ఇంతకాలం ప్రాణాలు నిలుపుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానన్న ఆశ అడుగంటుతున్న సమయంలో అటువైపు వచ్చిన ‘హూస్టన్ ఎక్స్‌ప్రెస్ ట్యాంకర్’ అనే జర్మన్ రవాణా నౌక ఆపదలోవున్న ఆ యువకుడిని గుర్తించి రక్షించింది.ఈ విషయాన్ని నార్త్ కరోలినా తీర గస్తీ దళానికి సమాచారమందించగా అది హెలికాప్టర్‌ను పంపించి జోర్డాన్‌ను సురక్షితంగా నార్త్ కరోలినాలోని అతని ఇంటికి చేర్చింది. జనవరి 29వ తేదీన సేయిలింగ్ బోటుపై సముద్ర జలాల్లోకి వెళ్లిన జోర్డాన్ బోటు తిరగబడడంతో చిక్కుకుపోయాడు. తిరడబడ్డ బోటు మీదనే కూర్చొని ఒడ్డుకు 322 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో అలల వెంట వెళ్లాడు. ప్రాణాలను నిలుపుకోవడానికి చేతులతోనే చేపలు పట్టుకొని, పచ్చివాటిని అలాగే తిన్నానని జార్డాన్ వివరించాడు. సెయిలింగ్‌లో అంతగా అనుభవంలేని తన కుమారుడు సురక్షితంగా ఇంటికి వస్తాడని తాను ఎంతమాత్రం ఊహించలేక పోయానని, పైగా ఇంతకాలం గల్లంతైన తర్వాత ప్రాణాలతో తిరిగి రావడం ఊహకందని విషయమేనని లూయీ జోర్డాన్ తండ్రి ఫ్రాంక్ జోర్డాన్ ఆనంద భాష్పాలతో అమెరికా సీఎన్ఎన్ ఛానల్‌కు వివరించారు. ఈ సందర్భంగా తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానంటూ ఆస్పత్రి నుంచి లూయీ జోర్డాన్ ఇచ్చిన ఆడియో సందేశాన్ని ఆయన వినిపించారు.నా అనేవారు ఎవరూలేని సముద్ర జలాల్లో ఒంటరిగా రక్షణ కోసం ఎదురు చూస్తున్న తనకు భయంకన్నా ఇంట్లో తల్లిదండ్రులు తన గురించి ఎంత ఆందోళన చెందుతున్నారనే బాధే తనను ఎక్కువ భయపెట్టిందని లూయీ చెప్పాడు. -
గాల్లోదిశను మార్చుకునే 'బుల్లెట్'!
వాషింగ్టన్: ఇంతవరకూ మనం లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకుని ప్రయోగించే బుల్లెట్లను మాత్రమే చూశాం. అయితే గాల్లో కూడా దిశను మార్చుకుని ఒక బుల్లెట్ ను తాజాగా యూఎస్ బలగాలు పరీక్షించాయి. స్మార్ట్ బుల్లెట్ గా నామకరణం చేసిన ఈ బుల్లెట్ ప్రత్యేకత ఏమిటంటే గాల్లో దిశను మార్చుకుని లక్ష్యాన్ని ఛేదించడమే. ఇది గాలి బలంగా వీచే క్రమంలో కూడా లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగపడుతుందని డీఏఆర్‌పీఏ (ద అడ్వాన్స్డడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు ఏజెన్సీ) స్పష్టం చేసింది. మిలటరీ బలగాలను దృష్టిలో పెట్టుకునే స్మార్ట్ బుల్లెట్ ను తయారు చేసినట్లు తెలిపింది. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా ఈ బుల్లెట్ మిలటరీ బలగాలకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని డీఏఆర్‌పీఏ పేర్కొంది. -
వేటకు వెళ్లి.. ప్రియురాలిని కాల్చేసిన ప్రియుడు
ఓ అమ్మడు తన ప్రియుడితో కలిసి వేటకు వెళ్లింది. అక్కడ ఆమె పొదలచాటుగా నక్కి వెళ్లేసరికి.. లేడిపిల్ల దొరికిందనకుంటూ ఆ ప్రియుడు తన తుపాకి గురిపెట్టి కాల్చాడు. అంతే, బుల్లెట్ కాస్తా అమ్మడి కాల్లోకి దిగిపోయింది!! ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ప్రియురాలు ఆడ్రే మేయో (24)ను తుపాకితో కాల్చినందుకు జార్జియాకు చెందిన మాథ్యూ టైలర్ వెబ్ (23)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లిద్దరూ కలిసి వెబ్ ఇంటి డాబా మీదకు వెళ్లారు. అక్కడకు సమీపంలో ఉన్న అడవిలో కొన్ని లేళ్లు వెళ్తున్నాయి. దాంతో వాటిని వేటాడాలని మాథ్యూ అనుకున్నాడు. ముందుగా ఆమె ఇంటివద్దే ఉండిపోదామనుకున్నా, తర్వాత తానూ వస్తానంది. ఇంతలో పొదలమాటున ఏదో సవ్వడి వినిపించడంతో మాథ్యూ తన తుపాకి తీసుకుని కాల్చాడు. కానీ లేడిపిల్ల అరుపులకు బదులు తన స్నేహితురాలి కేక వినిపించింది. వెంటనే అక్కడకు వెళ్లి తన జాకెట్ తీసి కాలి గాయం చుట్టూ కట్టాడు. మేయో అక్కడినుంచి ఆస్పత్రికి వెళ్లింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. అయితే, రోడ్డుకు 150 అడుగుల దూరంలో తుపాకితో కాల్పులు జరిపినందుకు గాను మాథ్యూపై కేసు నమోదుచేశారు. -
అమెరికా మెరైన్ల సైట్‌ను హ్యాక్ చేసిన సిరియన్లు
అమెరికా మెరైన్లంటే తెలుసు కదూ.. మెరికల్లాంటి సైనిక బలం వారిది. అలాంటి మెరైన్ కోర్ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. సిరియా అనుకూల వాదులు ఈ సైట్‌ను హ్యాక్ చేసి అందులో ఓ సందేశం పెట్టారు. సిరియా మీద దాడి చేయాలని వాషింగ్టన్ నుంచి ఆదేశాలు వస్తే, వాటిని తిరస్కరించాలని అమెరికన్ సైనికులను కోరుతూ ఆ సందేశం ఉంది. దీంతో చాలా గంటల పాటు మెరైన్స్.కామ్ అనే ఆ సైట్ చాలా గంటల పాటు స్తంభించిపోయింది. సిరియన్ ఎలక్ట్రికల్ ఆర్మీ - సీ అనే పేరుతో ఉన్న సందేశమే చాలాసేపటి వరకు అందులో కనిపించింది. గతంలో న్యూయార్క్ టైమ్స్ సైట్‌ను, సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌ను, ఇతర మీడియా సైట్లను కూడా ఇదే గ్రూపు హ్యాక్ చేసింది. 'సిరియాలో అల్ కాయిదా గురించి నేను పోరాడను' అంటూ చేత్తో రాసి ఉన్న సందేశాలను పట్టుకున్న కొందరు వ్యక్తుల ఫొటోలు ఆరింటిని కూడా ఈ సైట్లో పెట్టారు. సిరియన్ సైన్యం తమ మిత్ర పక్షమే గానీ శత్రుపక్షం కాదని అమెరికా దళాలకు 'సీ' తెలిపింది. తామిద్దరి ఉమ్మడి శత్రువు ఉగ్రవాదమేనని చెప్పింది. అయితే, ఈ హ్యాకింగ్ వల్ల తమ సమాచారానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అమెరికా మెరైన్ కోర్ ప్రతినిధి ఎరిక్ ఫ్లానగాన్ తెలిపారు. ఈ నియామక సైట్ వాణిజ్యపరమైన నెట్వర్కే గానీ పెంటగాన్ నెట్వర్క్ కాదని చెప్పారు.